Jump to content

పదబంధ పారిజాతము/అఘ

వికీసోర్స్ నుండి

అగ్ని________అగ్ర 29 అగ్ర__________అగ్రా

  • అన్న వైదిక ప్రవచనంపై వచ్చిన పలుకుబడి

అగ్ని యిచ్చు

  • అగ్ని సంస్కార మొనర్చు.
  • "భూకాంతుల ననేక సహస్రసంఖ్యలం బ్రోవులు గా బెట్టించి సమగ్రదారు సముదయంబు లమర్చి యగ్ని యిచ్చిరి." భార. స్త్రీ. 2. 172.

అగ్ని శిఖ

  • కుంకుమపూవు.

అగ్ని హోత్ర మయి పోవు

  • మండిపడు.
  • "నే నామాట అనేసరికి వాడు అగ్ని హోత్రం అయిపోయాడు." వా.

అగ్రతాంబూలము

  • సభలో పెద్ద వారి కిచ్చు మొదటి తాంబూలము. పెండ్లిండ్లూ వాటిలో పెద్ద వారికే మొదటి తాంబూలం ఇస్తారు. అది గౌరవ సూచకం.
  • "...తుట్టతుదకు గట్టుకొన్న దానిని బిలుచుట యైన చేత కాని చచ్చు పెద్దమ్మలతో నగ్రతాంబూలమునకు సిద్ధ మయి నాడే!" సాక్షి. 189. పే.
  • "నీ కేం అగ్రతాంబూలం ఇస్తారా." వా.

అగ్రపుస్తకములు

  • వేదములు.
  • "అగ్ర పుస్తకంబు లర్చించి చూచుచు."

అగ్రహారపుచేయి

  • చాలా ఘటికుడు.
  • కన్యా. శు.

అగ్రహార భుక్తులు

  • అగ్ర హారీకులు.
  • పనీ పాటా లేక తిని కూర్చునే వారిపట్ల నిరసనగా ఉపయోగించేపలుకుబడి.

అగ్రహారము

  • బ్రాహ్మణు లుండేస్థలం. బ్రాహ్మణులుమాత్రమే ఉండే గ్రామం.

అగ్రహారములో తమ్మళి జోస్యము

  • కుదరనిది. చెల్ల నిది.
  • తాతకు దగ్గులు నేర్పుటవంటిది. అగ్రహారంలో ఉన్న వాళ్లలో చాలమంది గొప్ప జ్యోతిష్కులే ఉంటారు. తమ్మళివట్టి పూజారి అక్కడికి పోయి చెప్పేజోస్యం యే ముంటుంది?
  • "ఎమ్మెలు నాముందఱనా, యమ్మక్కరొ చెల్ల వగ్రహారములోనన్, దమ్మళి జోస్యము లన్నవిధ మ్మిది."
  • రుక్మాం. 5. 88.

అగ్రాసనం

  • ప్రధానస్థానము.
  • సభలలో వానిలో మొదటగా పెద్దలను కూర్చోబెట్టడం అలవాటు. అందుపై వచ్చిన పలుకుబడి.

అగ్రాసనాధిపతి

  • సభాధ్యక్షుడు - ప్రెసిడెంటు. అఘ________అఘో 30 అచ్చ_________అచ్చ
  • ఇటీవల ఏర్పడిన పలుకుబడి.
  • "ఈసభకు ఫలానావారిని అగ్రాసనాధి పతిగా ఉండవలసిం దని కోరుకున్నాను." వా.

అఘటనఘటనాపటిమ

  • చేయుటకు వీలు కానిపనులను కూడా చేయగలశక్తి.
  • "పతి మెచ్చ నఘటనఘటనాపటిమ నమ్మహామంత్రి రాజ్యభారమ్ము దీర్చు." హంస. 5. 261.
  • చూ. అఘటనఘటనాసమర్థుడు.

అఘోరించావు

  • ఏడిచావు.
  • నిరసనగా ఎదుటివాడిని అనుమాట.
  • కొత్త. 12.

అఘోరించు

  • 1. బాధపడు.
  • "వీడి కొంపలోపడి పదేండ్లుగా అఘోరిస్తున్నాను." వా.
  • 2. నిరసనగా అనునప్పుడు ఉపయోగించే పలుకుబడి.
  • "ఏదో ఒకటి అఘోరించు."
  • "అఘోరించావు ఊరుకో."
  • "అఘోరించాడు వెధవ." వా.

అఘోరింపు

  • ఏడ్పు. నిరసనగా అనుమాట.
  • "ఏమిట్రా! నీ అఘోరింపు. ఏమిటో చెప్పి యేడవరాదూ!' వా.

అఘోరేభ్యో చేస్తున్నాడు.

  • ఏడుస్తున్నాడు.
  • వైదిక పరిభాష.
  • "వా డేదో మూల కూర్చుని అఘోరేభ్యో చేస్తున్నాడే? ఏమిటి సంగతి?" వా.

అచ్చం

  • సరిగ్గా.
  • "అతడు అచ్చం వాళ్ళ తండ్రిపోలిక." వా.

అచ్చంగా

  • సరిగ్గా.
  • "అచ్చంగా యితను మా బావమరిది పోలికే." వా.

అచ్చగు

  • ముద్రిత మగు.
  • "ఈ పుస్తకం అయిదు సంవత్సరాల కింద అచ్చయింది."
  • "ఇది యింకా అచ్చు కాలేదు." వా.

అచ్చగుండ్ల పేరు

  • బంగారుగుండ్లతో చేసినదండ.

అచ్చటముచ్చట.

  • ముద్దు ముచ్చట. జం.
  • "కాపరానికి వచ్చి సంవత్సరం అయింది. కానీ ఒక అచ్చటా ముచ్చటా ఎరుగునా పాపం ! ఆ పిల్ల." వా.

అచ్చ తెలుగు

  • తత్సమేతర మైనఆంధ్రభాష.
  • "య యాతి చరిత్ర అచ్చ తెలుగు కావ్యము." వా.

అచ్చన గండ్లు

  • అచ్చనగాయ లను ఆటలో ఉపయోగించురాళ్లు.

అచ్చనగాయలు

  • ఆడపిల్లలు ఆటలో ఉపయోగించేరాళ్లు, చింతగింజలు. అచ్చనపుచ్చు
  • అచ్చనగాయవలె వేఱుగా తీసివేయు.
  • "భాగుకన్నొక డచ్చనపుచ్చి." కు. 2. 19.

అచ్చనలాడు

  • అర్చించు.
  • "చెచ్చెర సుతుప్రాణ మిచ్చిన నేడ, యచ్చనలాడెద నభవుడా మీకు."
  • పండితా. పురా. 471 పు.

అచ్చాకు బుచ్చాకులు పలుకు

  • చూ. అచ్చికబుచ్చిక లాడు.

అచ్చాళు

  • ఒంటరి.
  • ఏబాధ్యతా, భారమూ, జంజాటమూ లేనివాడు.
  • దక్షిణాంధ్రంలో ఈ పలుకుబడిని వాడుతారు.
  • "అచ్చాళి గాగ అనికి సన్నద్ధుల మై యుందము." పతివ్రతా. 35.
  • "వాడు అచ్చాళీగా తిరుగుతున్నాడు. దండించే దిక్కు లేదు కనుక." వా.

అచ్చిక బుచ్చిక మాటలు

  • కల్ల బొల్లి కబురులు, ముచ్చటలు.

అచ్చిక బుచ్చికలు

  • ముచ్చటలు.
  • "అక్కఱ జూడ వేటి కల యచ్చిక బుచ్చిక సేయునంచలన్." విజ. 3. 30.
  • "వాడు అక్కడికి వెళ్ళి అచ్చికబుచ్చిక లాడుతూ కూర్చున్నాడు. వా.
  • "అచ్చిక బుచ్చిక లడర గొంతకాలంబు గడపి." హరి. 2. 69.

అచ్చికా మచ్చికా లేదు.

  • ,ఉద్దూ ముచ్చటా లేదు అనుట. జం.
  • "ఆ ఆలుమగళ్ళకు అచ్చికా మచ్చికా లేదు." వా.

అచ్చిక బుచ్చికలాడు

  • కల్లబొల్లి కబుర్లు చెప్పు.

అచ్చి వచ్చు

  • శుభప్రద మగు.
  • కొన్ని తావులు కొందరికే అచ్చి వస్తాయనీ, అక్క డున్నప్పుడు ఎప్పుడూ మంచే కలుగుతుందనీ, కానప్పుడు కీడు వెన్నాడుతుం దనీ ఒక నమ్మకం. అందుపై వచ్చినపలుకుబడి.
  • "ఆ యిల్లు మాకు అచ్చి వచ్చ్ంది. అంచేతే యెన్ని యిబ్బందు లున్నా అక్కడే ఉంటున్నాము." వా.
  • "ఆ ఊరు మాకు అచ్చి రాలేదు. అందుకని తిరిగి వచ్చి వేశాము." వా/

అచ్చకట్టు

  • ఏర్పఱచు - కట్టు.
  • "నడవ యచ్చు కట్టిన మునిరాట్పట్టాభిషిక్తు." పాండు. 1. 11.

అచ్చుకట్టు పొలము

  • అచ్చుకట్టు వేసినపొలము.
  • చూ. అచ్చుకట్టు.

అచ్చుకట్టు వేయు

  • నీళ్లు కట్టేముందు మడిని వేరు వేరు కయ్యలుగా చేయు.
  • "మా పొలం అచ్చుకట్టు వేశాము." వా.

అచ్చు కావలిగాడు

  • దొంగలు దోచుకొన్న సొమ్మును దండుగ పెట్టుకొనే కావలివాడు. బ్రౌను.

అచ్చుకుప్ప

  • ధనవంతుడు.
  • ఆంధ్ర. భా. 3 అ.
  • ఇది నేడు వాడుకలో లేదు.

అచ్చు కొట్టినట్టు

  • అచ్చంగా అలాగే.
  • చూ. అచ్చు దించినట్లు.

అచ్చుకొను

  • ఒకరు ఇవ్వవలసినదానికి తాను బాధ్యుడగు.
  • "వాడు మా యింట్లో వుండి చుత్తూ అప్పులు చేసి వెళ్ళిపోయాడు. అవన్నీ నేను అచ్చుకోవలసి వచ్చింది." వా.

అచ్చుకొట్టు

  • అచ్చువేయు.
  • చూ. అచ్చువేయు.

అచ్చుగా

  • అచ్చంగా.
  • చూ. అచ్చంగా.

అచ్చు గుద్దినట్లు

  • సరిగ్గా అలాగే.
  • "వీడు వాళ్ల నాన్నను అచ్చుగుద్దినట్లు ఉంటాడు." వా.

అచ్చు టెద్దు

  • అచ్చు పోసినఆంబోతు.
  • చూ. అచ్చు పోసినఆంబోతు.

అచ్చుదల యగు

  • అంగీకార మగు.
  • "విశ్వపతీ! విరసోపలంబు లెట్లచ్చుద లయ్యె నీకు." కా. మా. 2. 121.

అచ్చు దించినట్లు

  • "వీడు వీళ్ళ మేనమామను అచ్చు దించినట్లుగా ఉంటాడు." వా.

అచ్చు నిలుపు

  • దృష్టాంతము నిలుపు.
  • "దీని కచ్చు నిలిపితిని నీవ!"
  • కుమా. 7. అ. 35 ప.

అచ్చుపడు

  • 1. ముద్రిత మగు.
  • "ఆ పుస్తకం అచ్చుపడి అప్పుడే యాభైయేళ్లు అయింది."
  • "ఆపుస్తకం యింకా అచ్చుపడ లేదు." వా.
  • 2. స్పష్టపడు.
  • "సొ మ్మచ్చుపడంగ జేయుటకు." బ్రౌను. A 4. 187.
  • "అచ్చుపడంగ బల్కుమీ." మను.
  • "అనువు మెఱయజొచ్చి మాయ యచ్చు పడంగన్." పారి. 1. 107.

అచ్చుపడినట్లు

  • సరిగ్గా అలాగే, రూపు గొన్నట్లు.
  • "నెచ్చెలులు దన్ను గొలువగ, బచ్చ విలుతు కలిమి యెల్ల బద్మానమ యై, యచ్చుపడినట్లు మెఱయుచు, నచ్చట కేతెంచె భూబరాత్మజ నెమ్మిన్."
  • భార. అర. అ. 7. అచ్చు_______అచ్చు 33 అచ్చు_______అచ్చు

అచ్చు పొడిచిన

  • అచ్చు పోసిన, స్వేచ్ఛాచారి అయిన.
  • "అచ్చు పొడిచిన యాబోతులరీతిని." ఆం. వా.
  • చూ. అచ్చువేసిన...

అచ్చు పొడుచు

  • చూ. అచ్చు వేయు.

అచ్చు పోసిన యాబోతు

  • చూ. అచ్చు పొడిచిన.

అచ్చుపోసి వదలు

  • విచ్చలవిడిగా వదలు.
  • "వాణ్ణి అచ్చు పోసి వదిలినారు. ఎప్పడూ ఊరు తిరుగుతుంటాడు." వా.

అచ్చు ముచ్చు

  • మంచి, చెడు.
  • బియ్యం మొదలయినవాట్లో మెరికలను ము చ్చని, మిగతవానిని అచ్చు అనేదృష్టితో అచ్చుముచ్చు ఏర్పరచి పెట్ట మనుట అలవాటు. అందుపై యేర్పడిన పలుకుబడి.
  • "చూడ వచ్చిన నచ్చుముచ్చో యెఱుంగ కాడరా దేల యా పాప మనెడువారు."
  • శుక. 4. 46. ప.
  • "బియ్యం తీసి అచ్చూ ముచ్చూ ఏరి పెట్టు తల్లీ." వా.

అచ్చు ముచ్చు ఎఱుగు

  • మంచిదో చెడ్డదో తెలుసుకొను.
  • బియ్యంలో అచ్చు లనగా మంచి బియ్యం మనీ ముచ్చు లనగా మెరికె లనీ అర్ధం.
  • అచ్చూ ముచ్చూ చేసి - అనగా బియ్యము వేఱుపఱచి. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "అచ్చూ ముచ్చూ ఎఱగనివాడు పాపం." వా.
  • చూ. అచ్చు ముచ్చు.

అచ్చులు వెట్టించు

  • ముద్రవేయు.
  • "అమరారి దనపేరి యచ్చులు వెట్టించి సురధేనుసమితి గీలరము సే సె." కుమా. 4. 11.

అచ్చులొత్తు

  • అచ్చులు పెట్టించు.
  • "అందఱి మొగములయం దచ్చు లొత్తి యారిచి పెడబొబ్బ లందంద యిచ్చు."
  • బసవ. 192. పు.

అచ్చులో లేదు

  • ముద్రిత రూపంలో లేదు. అచ్చు అయిన వన్నీ అయిపోయిన వనుట.
  • "ఆ పుస్తకం యిప్పుడు అచ్చులో లేదు." వా.

అచ్చువడు

  • అంకిత మగు.
  • "భావజుకేళి నచ్చువడి పైబడి తద్విటు నిచ్చ గూడి." కుమా. 8. 158.

అచ్చు వేయు

  • ముద్రించు.
  • "ఈ పుస్తకమును అచ్చువేసి చాలకాల మయినది."
  • "దీనిని అచ్చువేసి పెట్ట మని చాల నాళ్లుగా అతడు అడుగుతున్నాడు. వా.