Jump to content

పదబంధ పారిజాతము/అంద

వికీసోర్స్ నుండి

అంత_______అంత 14 అంతు________అంతూ

  • ఔను, నీ వంతవాడవే నాయనా." వా.

అంతశయ్య

  • మరణశయ్య.
  • "వాడు మంచం పట్టాడు. అది యింక అంతశయ్యే."
  • "వాడు అంతశయ్యమీద ఉండి చెప్పిన మాటలను మనం అంతలోనే మరిచిపోవడం న్యాయం కాదు." వా.

అంతశ్శీతం

  • మనస్పర్ధ; అఱకొఱలు.
  • వైద్య శాస్త్రరీత్యా వచ్చిన పలుకుబడి. లోపల శీతం చేరుకుని తిన్నగా అది శరీరాన్ని లొంగదీసే జబ్బుగా మారుతుంది.
  • "వాళ్లల్లో ఈమధ్య అంతశ్శీతం బయలు దేరింది." వా.

అంతసేపు

  • చాలసేపు.
  • "అక్కడికి వెళ్లి అంతసేపు కూర్చుంటే ఇక్కడిపని అంతా ఎవరు చేస్తా రను కొన్నావు."
  • "ఎక్కడికి వెళ్లినా అంతసేపు చేస్తూ ఉంటే నీకు పని చెప్పడానికే భయంగా ఉంది." వా.

అంత సేయు

  • అనుకొనుటకు వీలు కానంత పని చేయు.
  • "మొన్న మేరుగిరిపాటి నిశాచరి నంత సేసె, నే డేపున గట్టు బండి నిదె యిందఱు జూడగ నింత సేసె>"
  • వి. పు. 7. 83.
  • "అంతపని చేశాడా వాడు? వాడు అంత పని చేస్తా డని నే ననుకోలేదు." వా.

అంతు కనుక్కొను

  • తుది మొదలు చూచు, గుట్టూ మట్టూ తెలిసికొను.
  • "ఈ వ్యవహారంలో అంతు కనుక్కు నే దాకా నేను వదల దలచుకో లేదు."
  • " వా డింతకు వచ్చాడూ? వాడి అంతు ఏదో కనుక్కొంటాను." వా.

అంతచిక్కు

  • చూ. అంతుపట్టు.

అంతుదొరకు

  • చూ. అంతుపట్టు.

అంతుపట్టు

  • లోతుపాతులు తెలియు.
  • నా. మా. 106.

అంతు పంతు

  • మొదలు కొన. జం.
  • "వీడి దుర్మార్గానికి అంతూ పంతూ లేకుండా పోయింది." వా.

అంతు పొంతు లేదు

  • అనంతము.
  • "అంతును బొంతునుం గలదె యమ్మరొ." నానా. 207.

అంతు పంతు లేక

  • అడ్డీ ఆగీ లేక.
  • "అంత కంత కది యంతును పంతును లేక వర్ధి లెన్." పాణి. 1. 104.

అంతూ యింతూ

  • మొత్తంమీద.
  • "అంతూ యింతూ వాడు రా డనేగా నీ వనేది?" వా. అంతొ________అంద 15 అంద________అంద

అంతొ యింతొ

  • ఏ కొంచెమో అనుట.
  • "అన్నియును జూచుచుండెద నంతొ యింతొ." నిరంకు. 2. 55.
  • "వారికి అంతో యింతో ఆస్తి ఉంది."
  • "వాడు అంతో యింతో చదువు కున్నాడు." వా.

అంతో యింతో

  • ఏ కొంతో.
  • "అంతో యింతయొ పండుభూమి గలదో?" గీర. 41.
  • "వాడు అంతో యింతో చదువుకొన్న వాడు. ఆస్తిపరుడు. ఈ సంబంధానికి ఏమి లోటు వచ్చింది?" వా.

అంతై యింతై

  • పెద్ద దవుతూ, పెరుగుతూ.
  • "తా నంత యై యింత యై యోలి నొయ్యన బాల్య కేళి వదలె." కళా. 6. 204.

అందచందములు

  • రూప రేఖలు. జం.
  • "వర్ధిష్ణు డై శైశవంపు ముద్దులు గల్కు తనయుని యంద చందములు చూచి."
  • అనిరు. 5. 91.

అందదుకులైన

  • చాలీచాలని.
  • లక్షణయా అందీ అందనట్టు అని కూడా మారి 'ఈ వ్యవహారం ఎన్నాళ్లైనా అందదు కులుగానే ఉంది. ఏది తేలదు' అని వాడుకలో వినబడు తుంది.

అందని పొందని

  • అతకని.
  • "వాడి వన్నీ అందని పొందని మాటలు." వా.

అందనిమ్రానిపండు

  • అలభ్యవస్తువు.
  • "అతని బింబాధరం బందనిమ్రాని పం, డని విచారించె మాదాలసాఖ్య." కవిరా. 3. అ.
  • "ఆపిల్లనే పెళ్లి చేసుకోవా లని ఊ రేగు తున్నావు. ఆవిడ అందనిమానిపండు అని తెలుసుకో." వా.

అందని మ్రాని పండ్ల కఱ్ఱులు చాచు

  • దొరకనివానికై ఆశించు.
  • "కందిన యన్య కాంతయెడ గామము దక్కు ము నన్ను జేరరా, దందనిమ్రాని పండునకు నఱ్ఱులు సాతుర్..." భాస్క. సుంద. 192.
  • "అకట! యందనిపంటికి నఱ్~తు సాచె జిత్త మిటమీద నే నేమి సేయుదాన?" విక్ర. 1. 129.

అందని మ్రాని పండ్ల కాస వహించు

  • "అందనిమ్రానిపండులకు నాస వహించినరీతి దివ్యసం, క్రందనపట్టణద్విరద గామినిపొం దెద గోరి వేడ్కమై, నిందుల కేగుదెంచుట కొకించుక నెయ్య మెలర్ప..."
  • రసిక. 3. 14.
  • చూ. అందనిమ్రానిపండ్ల కఱ్ఱులు సాచు. అంద________అంద 16 అంది_________అంది

అందంబు గూడుకొను

  • ఇష్ట మున్నా లేకపోయినా ఇష్ట మున్నట్టు నటించు.
  • "మీద గార్యంబులు గలమాకు దీనిగా దనం బనిలే దని యందంబు గూడు కొని ఛందోనువర్తనపరుం డై."
  • ఆము. 6. 36.
  • శ. ర. లో 'కలిసికొను' అను అర్థ మిచ్చారు. అది కుదురుట లేదు.

అందముల దీవి

  • అందాల రాణి.
  • ఇక్కడ దీవి అంటే స్థానము.
  • " తావి తేనీయబావి యందముల దీవి."
  • హంస. 2. 20.

అందలమం దుంచినకుక్క

  • యోగ్య స్థాన మందున్న నీచుడు.
  • గువ్వల చెన్న. 90.

అందలంబులు

  • బాల్యక్రీడావిశేషము.
  • "అందలంబులు మఱి కుందికాళ్లు."
  • వి.పు. 7. 202.
  • వాడి భుజంమీద వీడి రెండు చేతులూ, వీడి భుజంమీద వాడి రెండుచేతులూ పెట్టి నడుమ ఒకపిల్ల వాణ్ణి ఎక్కించు కొని ;దేవుడమ్మ దేవుడూ' అని ఊరేగిస్తూ ఆడేఆట.

అంద ఱొకటి యగు

  • ఏక మగు.
  • "అనురక్తి మీ రంద ఱొక టై యాదరించరాదా? హేమా. పు. 34.

అంది పొందని

  • అతకని.
  • రుద్రమ. 56 పు.

అందిక పొందిక

  • ఈడుజోడు వంటిది. జం.
  • "దానికీ దీనికీ అందికా పొందికా లేదు." వా.

అందిన చేనిపంట

  • అందుబాటులోనిది.
  • "ఎందు చూచిన శ్రీ వెంకటేశు డున్నా డనియెడి అందినచేనిపంట లనుభవించు." తాళ్ల. సం. 9. 70.

అంది పుచ్చుకొను

  • గ్రహించు, దొరకి పుచ్చుకొను, సరిగ్గా అతికినట్టు.
  • "వాడు కాళ్లు అంది పుచ్చుకొన్నాడు."
  • "సిగ అంది పుచ్చుకొన్నాడు."
  • "వాడు అన్నదాని కల్లా వీడు అంది పుచ్చుకొన్నట్టుగా సమాధాన మిస్తూ వచ్చాడు." వా.

అంది పొందినట్టివారు

  • చుట్టాలు.
  • "ఈ ఊళ్లో అందిపొందినవారు ఎవరూ లేరు. అందుకని యేకార్య మయినా పొరుగూరుకు పోవలసి వస్తుంది." వా.

అందిన సిగ అందకున్న కాళ్లు

  • సమయానుకూలంగా ప్రవర్తించేవా డనుట.
  • "...ఏ మనవచ్చు నీగుణం, బవు నవు నందినన్ సిగయు నందక యున్నను గాళ్లు పట్టుకొం, దువు హరిణాంక..."
  • విజ. 3. 51. అందు_______అంప 17 అంప________అంప

అందుకొను

  • పరిగ్రహించు.
  • "ఆ పాయసంబు దా నందుకొనియె."
  • రంగ. రా. బాల. పు. 19. పంక్తి 21.

అందుకొన్నట్టు

  • దగ్గరగా.
  • "గుంతకల్లునుంచి నున్మాడుమీద పోతే కాశీ అందుకొన్నట్టు ఉంటుంది." వా.

అందుబడి యగు

  • అందుబాటులోనికి వచ్చు.
  • ఇది నేడు అందుబాటు అనే రూపంలోనే కానవస్తుంది.
  • "సమస్తజీవులకు నందుబడి యైనదేవ భూజ మయ్యె." భోజ. 1. 79.

అందుల కేమి ?

  • దాని కేమి ?
  • పరవా లే దనుట.
  • "నా విని యందుల కేమి స్వభావగతిం బాడు మనిన భామిని గానప్రావీణ్యము జూపెను గడు." కళా. 7. 199.

అందె వేసినచేయి

  • సమర్థుడు.
  • ఏదైనా పనిలో - విద్యలో సమర్థు డైనవానిచేతికి అందె వేసేవారు. అందుపై యేర్పడినది.

అంపకము గాంచు

  • సెలవు తీసికొను.
  • "అంపకము గాంచె దీర్థయాత్రాభి రతిని." విజయ. 2. 41.

అంపకము చేయు

  • పంపించు.
  • "పూర్వమున బ్రహ్మసభకు నే బోయి కొంత, కాల మందుండి యజు డంప కంబు సేమ.
  • హంస. 4. అ. 7 వ.
  • చూ. అంపకాలు పెట్టు.

అంపకాలు

  • అత్తవారింటికి కొత్తకోడలిని పంపునప్పుడు అప్పగించుటలు. లక్షణయా అప్పు డిచ్చు కానుకలు.
  • అలాగే పెండ్లికి వచ్చినచుట్టాలను సాగనంపునప్పుడు చేసే మర్యాదలకు కూడా వాచక మయింది.
  • "అంపకాలవేళ అలా యేడవకూడదు తల్లీ!" వా.
  • "పెళ్లి అంతా అయిపోయినది, ఇంక అంపకాలే తరువాయి." వా.

అంపకోల

  • అమ్ము.
  • "అర్కనందను సెలకట్టె యంపకోల."
  • క్రీడా. పు. 71.

అంపతప్పు

  • దెబ్బ తప్పించుకొను నేర్పు.
  • "కానకు నంపతప్పెఱుగుగబ్బి మెకంబులు." కకు. 4. 57.

అంపబంపు

  • అంపించు, పంపించు, పంపు.
  • "అజ్జముప్రోలి కతని నంపబంపినవాడ నంపించినాడ."
  • పండితా. ద్వితీ. మహి. పుట.17.