పదబంధ పారిజాతము/అండ
స్వరూపం
అంటూ_______అంట్లు 11 అంట్లు________అండ
అంటూసొంటూ
- సంబంధ మున్నవారు, మిగిలిన మెతుకులు ఇత్యాదులు. జం.
- "వాడికి అంటూ సొంటూ లేదు. బోలెడు ఆస్తి."
- "కుండలో అంటూ సొంటూ ఊడ్చి వాడికే పెట్టేశాను. మరీ పొయ్యి ముట్టిస్తే తప్ప గత్యంతరం లేదు." వా.
అంటేనుకొను - (అంట వేసుకొను)
- ముట్టుకొను. పిల్లల ఆటల ద్వారా వచ్చినపలుకుబడి.
- " నేను పరిగెత్తితే న న్నంటేసుకొనే వాడు ఈ భూప్రపంచకంలో లేడు." వా.
అంట్లబోకి
- ఒక తిట్టు.
- వంటయింటి ద్వారా వచ్చిన పలుకుబడి. బోకి - పాత్ర.
- అంటయినపాత్రను మనవాళ్లు మైలగా చూస్తారు. మైల వెధవ అని అర్థం.
- "వాడు ఒట్టి అంట్లబోకి." వా.
అంట్ల వెధవ
- ఒక తిట్టు.
- చూ. అంట్లబోకి.
అంట్లు తోమేవాడు.
- ఆడంగులవాడు. ఒక తిట్టు.
అంట్లు నాకేవాడు
- ఒక తిట్టు.
- లక్షణయా ఎంగిలిమెతుకులు తినేవాడు అన్న అర్థంలో వచ్చినపలుకుబడి.
- "వా డేమి పెద్దమనిషి. ఒట్టి అంట్లు నాకేవాడు." వా.
అంట్లు పొడుచు
- తల కంటుకొని ఉన్న పేలను క్రుక్కు
- "అంట్ల బొడిచి."
- పాండు. 3. 30.
అంట్లొత్తు
- అంట్లు త్రొక్కు.
- "అం ట్లొత్తుపదనున నం ట్లొత్తు..."
- కళా. 4.79.
అండగొట్టు
- వెనుదీయు.
- "అమ్మహాత్ముమీది చాయం జన వెఱచి యండగొట్టుచు నిలుచుటయు."
- పరమ. 1. 175.
అండగొను
- ఆశ్రయించు.
- "నీ వండగొనియెదు నిలిచి యిచ్చోట."
- మార్క. 1. 182.
- "ఈతని...అండగొని తప్పుదు చావున కంచు నున్న వాడు."
- భార. ఉద్యో. 4. 208.
అండదండ
- సహాయము.
- ఒండె వాదింపు మొండె నే నోడితి నను మొండె, యను సద్గురుండె మా కండదండ."
- శంకరవిజయ కథా. 4. 10. అండ________అంత 12 అంత________అంత
అండజశయ్య
- హంసతూలికాతల్పము.
- భార. సభా.
అండబ్రతుకు
- ఎవరిపైనో ఆధారపడిన బ్రతుకు.
- "వానిది ఒట్టి అండబ్రతుకు. సొంతంగా జీవించ లేడు." వా.
అండబాయు
- ఎడబాయు.
- "ఆరామయండ బాయక... యారాజవరుండు నిజపురాంత:పురముం జేరి..." శుక. 1. అ. 489 ప.
అండా ఆపూ
- సహాయము.
- "వాడికి అండా ఆపూ లేదు." వా.
అంతకంతకు
- 1. క్రమక్రమంగా.
- "అంతకంతకూ వాడి దౌర్జన్యం ఎక్కువై పోతూ ఉంది." వా.
- చూ. అంతంతకు.
- 2. రోజురోజుకూ
- "అంతకంతకూ వాడు మితిమీఱి పోతున్నాడు." వా.
అంత కింతయింది ఇంత కెంతో?
- ఇంకా యెన్ని కష్టాలు రా నున్నవో? ఇం కేమేమీ కా నున్నదో అనే భావచ్ఛాయలలో ఉపయోగించే పలుకుబడి.
అంతకూ ఇంతకూ
- ప్రతి చిన్నదానికీ.
- "అంతకూ యింతకూ వాడు నొచ్చుకుంటూ ఉంటాడు."
- "అంతకూ యింతకూ ఆవిడ మాయింటికి పరుగెత్తుకొంటూ వస్తుంది."
అంతకు కడ కనుచు
- చంపు.
- "మహాస్త్రప్రకరం, బంతకుకడ కనిచెబరి, శ్రాంతం బగు మద్రనాథు రథిక చయంబున్."
- భార. శల్య. 1. 300.
అంత చేసి ఇంత తెచ్చుకొను
- అంత చేసి యింత ఫలితం తెచ్చుకొన్నావు - అనుపట్ల ఉపయోగించేపలుకుబడి.
- "ఇంత దెచ్చికొంటి వంత సేసి."
- భార. భీష్మ. 1. 67.
అంతంత
- దూరదూరములోనే, క్రమముగా.
- "నెచ్చెలిపిండు నంతంత నిలువ బలిచి."
- భార. విరా. 1. 246.
- "ఇంతయును నంత నంతంత పెఱిగి పొదరు, నిబ్బరపు గబ్బి గుబ్బల యుబ్బు కతన."
- వసు. 2. 85.
అంతంతకు
- క్రమంగా.
- "అంతంతకూ ఈ వ్యవహారం ముదిరి పోతూ ఉంది." వా.
అంత పైపై పడి ఉన్నదా?
- అంత సులభమా? కా దనుట.
- "మహాకవితావివేచనా, భ్యాస మనంగ నంత బయిపై బడి యున్న దె?"
- నానా. 25. అంత________అంత 13 అంత_________అంత
అంతమనిషి
- అంత యోగ్యత కలవాడు. అంతపని చేయగలవాడు.
- "అంతమనిషి యిలా చేస్తా డని నే ననుకోలేదు."
- "వా డంతమని షయితే యింకేమమ్మా! నేను హాయిగా ఉందును."
- "వాడు అంతమనిషి ఎప్పు డయ్యాడు? నాకే ఎసరు పెట్టాడూ?"
- "వా డంతమనిషని నే ననుకో లేదు." వా.
అంత మాట
- అనరాని మాట.
- "వాడు అంతమాట అన్నాడా? అంత మా టన్నాడూ వాడు?" వా.
అంతరపల్లటీ
- పైన గిరికీలు కొట్టేపావురము దానిద్వారా గిరికీలు కొట్టుటకు కూడా వాచక మయినది.
- "వాడు అంతరపల్లటీ కొడుతున్నాడు." వా.
అంతర మెఱుగనివాడు
- తారతమ్యజ్ఞానం లేనివాడు.
- "వానికి పెద్దాసిన్నా అంతరం తెలియదు."
- "అంతర మెరుగనివాడు వానిజోలికి ఎవరు పోతారు?" వా.
అంతరువు
- యోగ్యత, అంతరము.
- "నీ అంతరు వేమి? నా అంతరు వేమి? నీతో నాకు వాద మేమిటి?" వా.
అంతర్ధానంబు సేయు
- అదృశ్య మగు.
- కాశీ. 6. 138.
అంతర్మదాలు
- అయిదు అంతర్మదాలు. సం యాదులు.
- "సమ్యాది పంచ విధాంతర్మదంబులు."
- కుమా. 11. 137.
అంతల పొంతలవారు
- చుట్టాలు.
- "అంతలపొంతలవా రున్న ఊళ్లో అంతో యింతో ఉంటే గాని మర్యాదగా ఉండదు."" వా.
అంత వట్టు
- యావత్తు.
- ఒట్టు మొత్త మని, లెక్కలలో వెరసి అనే అర్థంలో ఉపయోగిస్తారు.
అంత వట్టువారు
- అంతంత గొప్పవారు.
- "అంతవట్టువారును...గూలిరి."
- భార. శల్య. 2. 135.
అంతవాడు
- అంత యోగ్యత కలవాడు.
- "అంతవాణ్ణి బజారులో నిలదీసి అది అడిగిన మాటలు అబ్బ! వినలేము." వా.
అంతవాడవే
- ఔను, నీవు ఆపని చేయగల వాడవే. ఎవ డైనా తన్ను గూర్చి చెప్పుకొంటున్నప్పుడు ఔ నంటూ ఎదుటివాడు ఆడు మాటలు.
- "అనుటయు నంతవాడ వె కదా యని మిక్కిలి గారవించి." పారి. 2. 76.