పదబంధ పారిజాతము/అ
స్వరూపం
విషయాలు:- అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఎ ఏ ఒ ఓ అం అః క ఖ గ ఘ చ ఛ జ ఝ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష ఱ |
---|
అంశ________అక 19 అక_________అకా
అంశ పురుషుడు
- దశావంతుడు.
- "వాడు చాలా అంశ పురుషుడు. అడివిలోకి వెళ్ళినా వాడి కన్నీ అమరుతాయి." వా.
- చూ. అంశ మంచిది.
అంశ మంచిది
- దశావంతు డనుట.
- "వాడి అంశ చాలా మంచిది. చేసినా చేయక పోయినా దర్జాగా నడుస్తూ ఉంది."" వా.
అంశలో ...
- దశలో....
- జ్యోతిశ్శాస్త్రరీత్యా వచ్చిన పలుకుబడి. ఏ లగ్నంలోని యే అంశలో పుట్టాడు అన్న దానిపై ఫలితాలు చెప్పడం జ్యోతిశ్శాస్త్ర సంప్రదాయం.
- "వా డిప్పుడు మంచి అంశలో ఉన్నాడు. మనలాంటివాళ్లను పలకరిస్తాడాఆ?"
- "వాడు మంచి అంశలో పుట్టాడు. ఏం వచ్చినా వాణ్ణి ఏం చెయ్యదు." వా.
- చూ. అంశ మంచిది.
అకట(టా)వికటం అగు
- పరిహాసపాత్రమగు అస్తవ్యస్తమగు.
- "వాడు ఏది మాట్లాడినా అకటవికటమే."
- "ఆ పని అంతా అకటావికటం అయిపోయింది." వా.
అకటావికటపు మనిషి
- వక్రంగా మాట్లాడేవాడు.
అకటావికటపు రాజు అస్తవ్యస్తపు ప్రధాని అన్నట్లు
- ఎగుడుదిగుడుగా పాడుపాడుగా ఉన్న దనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- జానపద కథలలోనుండి వచ్చిన పలుకుబడి. ఆ పేరు గలరాజు, ప్రధాని ఒక ఊళ్లో ఉంటారు. వాళ్లు రాత్రి అంతా పని చేయా లని పగ లంతా నిద్ర పోవా లని శాసిస్తారు.
- "వాళ్లింటి వ్యవహారం అంతా అకటావికటపు రాజు అస్తవ్యస్తపుప్రధాని అన్నట్లుగా ఉంది." వా.
అకస్మాత్తుగా
- ఉన్నట్లుండి.
- "వాడు అకస్మాత్తుగా అక్కడికి వచ్చాడు." వా.
అకాండతాండవం
- అసందర్భప్రసంగం; అనవసర ఆవేశం.
- "వాడిది వట్టి అకాండతాండవం."
- "అనే దేదో వాడి యెదుట అనక యింట్లోకి వచ్చి అకాండతాండవం చేస్తా వేమిటి?" వా.
అకారతుగా
- అకారణంగా.
అకాలకూష్మాండం
- నిరర్థకజన్మ మనుట, నిష్ప్రయోజకు డనుట.
- "వాడు ఒట్టి అకాలకూష్మాండం." వా. అకా_________అక్క 20 అక్క_________అక్క
అకాలభోజనం
- వేళ మీఱినభోజనము.
- "ఎండలో రావడం, అకాలభోజనం, మహా ఆయాసంగా ఉంది. కాస్సేపు నడుం వాలిస్తే గాని కుదరదు." వా.
అక్కతోడు
- "అక్క తోడు సుమీ నాకు ముక్క రైన, జేసి తెప్పించు మని."
- నిరంకు. 2. 115.
అక్కడక్కడ
- కొన్నిచోట్ల.
- "అక్కడక్కడా అంటుండగా విన్నాను." వా.
- "అక్కడక్కడా మచ్చ లున్నట్టున్నాయి." వా.
అక్కడ భోంచేసి ఇక్కడ చేయి కడుగుకొనవలెను
- తక్షణమే రమ్మనుట.
- "అమ్మకు చాలా జబ్బుగా ఉంది కాబట్టి వెంటనే రావలెను. అతిజరూరు. అక్కడ భోంచేసి యిక్కడ చెయ్యి కడుగుకొనవలెను." వా.
- "వాడు దాన్ని పట్టాడు. ఎప్పుడూ అక్కడే, తనింట్లో తిని దానింట్లో వచ్చి చెయ్యి కడుక్కుంటాడు." వా.
అక్కడికి అక్కడికే సరిపోవు
- ముటీముటాలుగా సరిపోవు.
- "అంతపంట వచ్చినా అక్కడి కక్కడికే సరిపోవడమే కష్టంగా ఉంది. ఆ కాస్తా పోతే దేవుడే దిక్కు." వా.
అక్కన్న మాదన్నలు
- ఎప్పుడూ కలిసి తిరుగువారు.
- "వా ళ్లిద్దరూ అక్కన్నమాదన్నలు." వా.
అక్కరగాడు
- తనపని తీర్చుకొనువాడు.
- "అక్కఱకాడ నై అందంద ప్రేరేచి." క్షేత్రయ్య.
అక్కఱ గాచు
- సమయమున కాదుకొను
- "మునిమాపు బలు గంబమున బుట్టి బంటున, క్కఱ గాచినట్టి సింగంబ నీవు." పారి. 1. 49.
అక్కరపడు
- అవసర మేర్పడు.
- "అక్కరపడి నీదగ్గరకు వచ్చాను. తప్పక సహాయం చేయాలి."
- "పదిరూపాయలు అక్కరపడింది." వా.
అక్కఱకు రాని
- పనికి రాని, పనికి మాలిన.
- రాయలసీమలో ఇది చాలా ప్రచురంగావినబడే పలుకుబడి.
- "ఈ అక్కఱకురాని మాటలతో ఏం పని." వా.
- "అక్కఱకు రాని చుట్టము." సుమ.
- "వాడు వట్టి అక్కఱకురాని ముండా కొడుకు." వా.
అక్కఱగండడు
- అక్కఱ గడుపుకొనువాడు, స్వార్థపరు డనుట.
- ఇతరుల అక్కఱను స్వార్థమునకై ఉపయోగించుకొనువాడు.
- "అక్కఱగండ డై యప్పటప్పటికి వెక్కసంబున నూర్లు వేలు నప్పిచ్చి ముట్ట జిక్కినవేళ ముట్టి చేపట్టి రట్టడై తిరిగి పత్రంబులు గొనుచు."
- గౌ. హరి. ద్వి. 477-480.
~ అక్క________అక్క 21 అక్క__________అక్కు
- శ.ర. లో శ్రద్ధ గలవాడు అనీ, సూ. ని. వావిళ్లలలో ఆవశ్యకతను కనిపెట్టువాడు అనీ ఇచ్చిన అర్థాలు సరికావు.
అక్కఱచీటి
- జాబు.
- "కొనగోర మొగలిరేకున గమ్మకస్తూరి వలపు నక్కఱచీటి వ్రాయవమ్మ."
- రాజగో. 2. 44.
అక్కఱ తీరేవఱకే
- స్వార్థం తీరేవఱకే.
- "వాడిస్నేహమంతా అక్కఱతీరేవరకే. ఆతరవాత మొహం సూపిస్తే ఒట్టు." వా.
అక్కఱ దీర్చు
- సమయమునకు పనికి వచ్చు.
- "ఆపద కైనబంధుజన మక్కఱ దీర్చు ధనంబు." నిరంకు. 4. 99.
- "నా యక్కఱ దీర్పవచ్చిన లతాంత కృపాణివి నీవె నీకు నే దక్కితి నంచు బ్రేమ నిగుడన్..."
- శుక. 3 అ. 532 ప.
అక్కఱపడి
- పనిపడి.
- "అక్కఱపడి నీవు వేడు టిది కర్జమె."
- భార. అర. 7. అ.
- "పదిరూపాయలు అక్కఱపడి నీ దగ్గరకు వచ్చాను." వా.
అక్కఱ లేదు
- చాలు, వద్దు, కాబట్టదు.
- "అన్నం అక్కఱ లేదు. కాస్త మజ్జిగ పోయండి చాలు." వా.
- "నాకు కాఫీ అక్కఱ లేదండి. కాసిని మంచినీళ్లు ఇవ్వండి." వా.
- "వాడికి పనీపాటా అక్కఱ లేదు. ఏదో నవల చిక్కితే చాలు. చదువుతూ కూర్చుంటాడు." వా.
అక్కలవాడ
- పూటకూళ్లమ్మ లుండుచోటు.
- చూ. అక్క వాడ.
అక్కవాడ
- పూటకూళ్లమ్మలు నివసించే చోటు.
- చూ. అక్కలవాడ.
- "అక్క వాడల నరకూళ్లు మెక్కి." ఆము. 6. 67.
అక్కసు పట్ట లేక
- కోపము, కసి తీరక.
- రుద్రమ. 15 పు.
అక్కా ఆలీ అను
- బూతులు తిట్టు.
- "వాడి దగ్గిరికి ఈవిషయ మై పోతివా వాడు అక్కా ఆలీ అని మొదలు పెడతాడు." వా.
అక్కిలజేయు
- ముంచించు.
- "ఱొ మ్మక్కిలజేసి చేసి." క్రీడా. పు. 15.
అక్కిలివఱచు
- చెడు, కలతవడు.
- పండితా. ప్రథ. దీక్షా. పుట. 178.
అక్కుగొఱ్ఱు
- బాధ కలిగించునది, పక్కలోని బల్లెము.
- "అవనీశులకు నెల్ల నక్కు గొఱ్ఱగుచు." బసవ.