Jump to content

పండితారాధ్యచరిత్ర/ఉపోద్ఘాతము/సోమనాధుని వైదుష్యము

వికీసోర్స్ నుండి

४ సోమనాథుని వైదుష్యము సోమనాథుడు కేవల కవి కాదు. అతడు కవిత్వము మూల ముగా వీరశైవమతివ్యాప్తికి కంకణము కట్టుకొన్న అసమాన మేధా కాలి. లోకములో వ్యాపించి ఉన్న బౌద్ధ, జైన, వైష్ణవాది మత ములను, శంకరాచార్యుని ఆద్వైత వేదాంతము మొదలైన సిద్ధాంతి ములను ప్రతిఘటించి, వాటిని త్రోసిరాజు చేసి వాటి ఆటను కట్ట డానికి కావలసిన పాండిత్యము సంతటిని సంపాదించుకొన్నవాడు. ఆపాండిత్యమును చతుర్వేదసారము, సోమనా: భావ్యము మొద లయిన గ్రంధములలో వినియోగించినాడు. కాని, వాటివల్ల శాస్త్రీ యము గా వీర పై వర్ల్డ్ ద్ధాంతము స్థాపితమవుతుందే కాని, అది జనసామా న్యములో వ్యాపించవలె నంటే, కేవల విద్వాంసుడున్ను, పండిను డున్ను పనికిరాడు, దాని ననుషించి, ఆచరణలో పెట్టి, లోకము నకు లక్ష్యుప్రాయుడై ఉండేవాడు కావలెను. తనవలె ఇతరులున్ను అస్వస్థింపవలె నవే బుద్ధిని కలుగజేయవలెను. వారి కుత్సాహమే ఆవేశమున్ను పుట్టవ తాను, ఆవేశము పట్టించడానికి నేనున్ను ఆవేశపరుడు కావలెను. జనులలో ఆవేకము పుట్టించి డానికి దేశభాషలో, దేశీయచ్ఛందస్సులో దేశీయ తిని కవిత్వము చెప్పడముకంటే మరొక మార్గము లేదనే రహస్యమును తెలుసుకొని ఉండవలెను. ఈ గుణము లన్నీ సోమనాథునిలో నిండుకొని ఉన్నవి. ఆతని పాండిత్యము నిరుపమాన మైనది. పండితారాధ్య చరిత్రము చదివినవారి కా పాండిత్య విస్తారమేకాక, దాని లోతుకూడా బోధ పడుతుంది. తము 02 అత డుదాహరించిన గ్రంధముల పేర్ల నుబట్టి చూస్తేనే మన కాశ్చర్యము కలుగుతుంది. పండితారాధ్యచరిత్రములో అతడు పేరు పెట్టి చెప్పిన గ్రంధములను చూడండి :- ఋగ్యజుస్సామాశర్వవేదసంహితలు, బ్రాహ్మణములు, రుద్ర సూక్తములు, శీతీరుద్రీయము, పురుషసూక్తము, చరణవ్యూహము, వేదభావ్యములు, వ్యాసభావ్యము, మహాస్తోత్రము, పవమాన, కైవల్య, 'కేన, ఈశ, జాబాల, కాలాగ్నిరుద్ర, మానవ, జైశివ, మారుత, నారా యణ, బ్రాహ్మణ, శివసంకల్ప, రుద్రసయ, అధర్వశిరప్, అధర్వశిఖ, బృహదారణ్య, గర్భ, హంస, శ్వేతాశ్వతర, రుద్రోపనిషత్తులు. A కాత్యాయనగృహ్యసూ త్రము, జాబాలీస్మృతి, రౌద్రబోధా యనస్మ ృతి, శాతాతిపస్మృతి, విజ్ఞానేశ్వరము, వృద్ధశాతాతపము, లౌగాక్షికస్తృతి, యజుర్వేదసూత్రము, పారాశరస్మృతి, యమ స్మృతి, రుద్రాక్ష,కల్పము, వ్యాసస్మృతి, బోధాయన స్మృతి, వసిష్ఠ స్మృతి, వాల్మీకిస్తృతి, వాధూలము, గౌతమస్మృతి, ఈశాన సంహిత, జాబాల స్మృతి, కైవల్యస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి 0. శైవ, స్కాంద, కూర్మ, లింగ, వాయు, వామన, బ్రహ్మ దైవక్త, పద్మ, నాగద, బ్రహ్మాండ, వారాహ, గారుడ, మత్స్య, మార్కండేయ, భాగవత, భవిష్యత్, బ్రహ్మ, వైష్ణవ, ఆగ్నేయ, మానవ, వానీన రామాయణ, వాశీష లైంగ, సూతసంహిత, భారత, హరివంశ, సావర్ణి సంహిత, శివ, బృహత్కాలోత్తరము, పురాణో పపురా ణేతిహాసములు. శివధర్మ శాస్త్ర, ఈశాన సంహిత, వ్యాస జై మినిసంవాదము మొదలయిన వీరశైవధర్మశాస్త్రము, భీమాగమము, సర్వాగమోత్తరము, కారణాగమము, పాణిస్థితిలము, దివ్యాగమము, ఈశ్వరాగమము మొద లయిన వీరశైవధర్మ ప్ర పాద కాగమాది గ్రంథములు, పండితారాధ్య చరిత్ర వ్యాకరణ, చ్ఛందోలంకార, మాటర్క, వైశేషిక, హక యోగ, నేత్ర వైద్య, వివవైద్య, రసవాద, జ్యోతిష, కొక్కోక, భరత, సంగీతాదిశాస్త్రములు. ఆంధ్ర, కర్ణాట, తమిళ, మహారాష్ట్ర, సంస్కృత భాషా పాండిత్యము. ఇన్ని విషయములనుగురించిన్ని సోమనాథునికి సంపూర్ణముగా తెలియడమే కాకుండా, నానాదేశాచారములు, నానామతి సిద్ధాంత ములు, నానావిధాహార, విహార, వేష సంప్రదాయములున్ను తెలు సును. అతడు ఉూర్తి వేదజడుడు కాడు. గొప్ప నాకికుడు. ఉద్ధతుడు. ఒకరిని లక్ష్య పెట్టేవాడు కాడు. పాండిత్యవిషయములో శ్రీనాధుని కంటే నూరు రెట్లెక్కువ అని చెప్పవచ్చును. శ్రీనాథుడు గౌడ డిండిమభట్టు కంచుఢక్క నొక్క దానిని పగులకొట్ట గలుగునే, ఇత డెన్ని ధక్కలను ఎట్టిఢక్కలకైనా పగులకొట్టుగల అపార పాండితీ ప్రజ్ఞాధురంధరుడు, నోటిబూకరము కలవాడు కూడాను. పరమతఖండనమున కీత డవలంబించిన పద్ధతిలో ఒక విశిష్టత ఉన్నది. ఆత డొకొక్క వాదమును తీసుకొని, దాని స్వరూపమును ముందుగా తెలిపి, తరువాత వేదవాక్యముల సుదాహరించి, ఆ వాక్య ముల కావాన మెట్లు విరుద్ధముగా ఉన్నదో స్పష్టము చేసి, తరువాత పురాణేతిహాసములనుండి ఐతిహ్యముల ననుసంధించి, తుక్కు తుక్కుగా ధూళి కెగురగొట్టుతాడు. ఆ వాదపద్ధతి సంపూ ర్ణముగా నైయాయిక పద్ధతి నమసరించి ఉంటుంది. సిద్ధాంతమే సరియైన సిద్ధాంత మని సంపూర్ణమైన విశ్వాస ముండడము చేత అతని కెక్కడము లేని వాగౌద్ధత్యము కలిగినది. కొకరి లక్ష్యము లేదు. దోమవలెనో కనబడతాడు. ఎదిరి పక్షమునా డతని కొక చీమువలెనో, వాద ప్రకరణములో ఒకొక్క వాదము రుజువుచేయడానికి, తము مر నెత్తుకొని దానిని చీల్చి, చెండాడి, దుమ్మున కత్తిపోసి, తుట్టతుదకు శివపరమోత్తమత్వమును సిద్ధాంతించి, అదే సరియైన సిద్ధాంతమని "గౌరీ సమీఁద శైవంబులేఁడని తలయిచ్చి పడయుదును, మంటఁబట్టుదుఁ, దొడరిన గెలుతుఁబనుగొన వాడ వితండ జల్పములను" అని ప్రతిజ్ఞ చేసి, “శివుమీఁద నొకఁడు గలఁ డన్న నాయఱకాలెత్తి వాని నడుఁదలఁ దన్నుదు" అని గర్జించినాడు. ఎంతటి ఔద్ధత్యము ! ఎంతటి సాహసము ! ఎంత పొగరు ! సోమనాధుని పై దుష్యముమ, లోక జ్ఞానమును బసవపురాణ పండితారాధ్యచరి శ్రీమాలలో అనేకవిధములుగా ప్రస్ఫుటితమైనది. హఠయోగము. బ॥ , (వి) 3డకంలో ; రసవాదము (ఐ) ర౭- శాం; నేత్ర వైద్యము (9) గం; సర్పవైద్యము (౧) 332

  • ౧3; ద్యూతవిద్య (౧) 3టూ, ర౧3, శకునశాస్త్రము బ. వికవి,

౨నగ ; (౨) XF-L0, ౧౯౭; వేశ్యావర్ణనము (౧) 383-38; కామశాస్త్రము (~) 331-38; చొరవిద్య జ. ౧౩ ; మృగయ బ F౭, ౧౬౯; గర్భచిహ్నాలు బ. ౧ర; పిల్ల లను పెంచేవిధము బ. ఓర్ ; పిల్లలను లాలించే విధము (౧) 8xe, బ. 80 ; పిల్లల ఆటలు (౧) రటం; శరీరావయవకర్మలు (౧) రూ; వస్త్ర భేదములు; బ X౬ (పండ్రెండేండ్లు నేసిన పసిండిపటవలి పుట్టమును గురించి సోమనాథుడు చెప్పినాడు బ. 18 ; కోటలనిర్మాణము ఒక; ఈరీతిగా ఎన్నో విషయములను గురించి సోమనాథుడు విస్త రించి చెప్పినాడు.