Jump to content

పంచతంత్రము (వచనం)/సుహృల్లాభము

వికీసోర్స్ నుండి

లాలకించి సంతోషభరితులైరి.

మిత్రభేదమను మొదటితంత్రము సంపూర్ణము

సుహృల్లాభమను రెండవతంత్రము

అంత నారాజపుత్రులు సకలనీతిశాస్త్రపారంగతు డగువిష్ణుశర్మకు నతిభక్తితో నమస్కరించి అయ్యా తమఅనుగ్రహంబువలన మాకు మిత్రభేదమనేతంత్రము సాంగముగా దెలిసెను. ఇందువల్ల శత్రుమిత్రవర్గములందు ఆయాకాలానుసారముగా మెలగియుండుటకున్ను సజ్జనమైత్రివల్ల గలిగేసుఖమున్ను దుర్జనసహవాసమువల్ల గలిగేదుఃఖమున్ను యివి మొదలైన అనేకకార్యములను దెలుసుకొనుటకు మేము సమర్ధుల మైతిమి. గాన ఇకమీద దెలియజేయవలసిన నీతిశాస్త్ర్రాంశములను ఈతీరున లౌకికదృష్టాంతపురస్సరముగా దెలియజెప్పి యనుగ్రహింపవలెనని మిక్కిలివినీతులై ప్రార్థించిన నాతం డారాజకొమరులం జూచి ఓయీ బుద్ధిమంతులైనవారు సాధనములున్ను ధనమున్ను లేక ఒకరి నొకరు స్నేహము సేసి తమకు కావలసినకార్యములను కాకకూర్మమృగమూషకమువలెను జక్కగా నెరవేర్చుకొందురు అని విష్ణుశర్మ చెప్పగా వారలు విని కాకకూర్మమృగమూషకములకు ఎట్లా స్నేహము గలిగెను అవి యేకార్యముల నెరవేర్చుకొనెను. మాకు విశదముగా జెప్పవలయుననిన విష్ణుశర్మ యిట్లనియె.

మిహిళాపురమను పట్టణమునకు సమీపముగానుండు పెద్దఅడవిలో ఒకబూరుగుచెట్టు గలదు. ఆచెట్టుపైని లఘుపతనకుడను పేరుగలవాయసము నివాసము సేయుచుండును. ఆచెట్టుకిందికి ఒకబోయవాడు వచ్చన వానిఁ జూచి ఆకాకి భయపడి వీ డిక్కడి కేమినిమిత్తము వచ్చెను. దుర్జనుడున్నచోట నిలువరాదు. అదియునుం గాక ఇప్పుడు నే నాకలిగొనియున్నాను. శానా ప్రొద్దెక్కెను. శీఘ్రముగా పోవలెనని యత్నబడుచుండగా బోయవాడు చెట్టుచుట్టు వల వేసి ధాన్యము చల్లి తా నగుపడకుండా అవతలిపొదలో దాగి రెప్ప వెయ్యక చూచుచుండెను. తర్వాత చిత్రగ్రీవుడను కపోతరాజు వచ్చి ఆధాన్యము తినుటకై ఆశపడి తనపరివారముతోకూడా వానివలలో జిక్కుబడెను. అది చూచి బోయవాడు సంతోషించి వలదగ్గరికి వచ్చుచున్నసమయమునందు చిత్రగ్రీవుడు తనపరివారమునుం జూచి యిట్లనియె ఆకటిబాధచేతను ఒళ్లెరుంగక మన మత పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/49 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/50 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/51 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/52 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/53 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/54 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/55 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/56 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/57 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/58 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/59 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/60 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/61 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/62 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/63 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/64