పంచతంత్రము (వచనం)/మిత్రభేదము

వికీసోర్స్ నుండి

మిత్రభేదతంత్రము

ఒకవనములో నొకసింహమున్నువృషభమున్ను చాలాస్నేహము గలిగియుండగా మిక్కిలితంత్రముగల ఒకనక్క కొండెములు చెప్పి ఆరెంటికి విరోధములు పుట్టించి సింహముచేత వృషభమును చంపించెను.

అని చెప్పగా రాచకొమాళ్లు విని మొదట సింహమునకున్ను వృషభమునకున్ను స్నేహ మెట్లా కలిగెను. తర్వాత ఆస్నేహము చెడి విరోధ మెట్లా వచ్చెను. యిది మాకు సవిస్తరముగా జెప్పవలయు ననిన విష్ణుశర్మ యిట్లనియె.

దక్షిణదేశమునందు బహుమందిధనికులుగల మహిళాపుర మనుపట్టణము గలదు. అందు బహుసంపత్తు గలిగిన వర్ధమానుండను పేరుగల ఒకవర్తకుడు గలడు.అతడు నిండా ధనము గలవాడైనా తనధనమును వృద్ధిబొందించవలెనని తలంపు గలిగి యిట్లని యోచించెను. ధనము లేకుంటే ఆర్జింపవలయును. ఆర్జి౦చినధనమును రక్షించవలయును. రక్షించినధనమును వృద్ధి బొందింపవలయును. వృద్ధి బొందించినధనమును సద్వినియోగము సేయివలయును. ఇట్లు సేయనేరనివానియింట ద్రవ్య మెట్లు నిలుచును. మూర్ఖులయినవారు ఈయర్థమును తెలియనేరరు. సంరక్షణ సేయని ద్రవ్యము అప్పుడే నశించును. వృద్ధి బొందించనిధనము కొంచెముగా వ్యయము చేసినా కాటుకవలె సమసిపోవును. అనుభవమునకు రానిసొమ్ము కలిగియు లేనిదానివలె సుఖకరము గాదు. ఒకరి కివ్వడము, తా ననుభవించడము ఎవరైనా యెత్తుకోనిపోవడము ఈమూడున్ను ధనము పొయ్యేటందుకు దోవలు. కాబట్టి యెవడు తనధనమును ఒకరి కివ్వక తానున్ను అనుభవించడో వానిధనమును యెవరైనా యెత్తుకొనిపోదురు. నిండినచెరువులకు అలుగులు తీశినట్లు సంపాదించినధనమును పాత్ర మెరిగి వ్యయము చేయుట రక్షించడమేను.

అని వర్ధమానుడు చాలాయోచన చేసి తనయింటనున్న కుంకుమపువ్వు గోరోజనము కస్తూరి ముత్యములు బవడములు రవలు కెంపులు పచ్చలు వైఢూర్యములు గోమేధికములు పుష్యరాగములు అపరంజి వెండి పట్టుచీరలు సరిగెదుప్పట్లు నానావిధములైనశాలువలు మొదలగు వెలపొడుగువస్తువుల నొకబండిమీద యెక్కించి ఆబండికి సంజీవకనందకము లనేపేరుగల రెండెద్దుల గట్టించి బండి సాగించుకొని కావలసిన పరివారముతో కూడా వర్తకము చేయుటకై పరదేశమునకు బైలువెళ్లెను. అప్పుడు బండినిండా బరువైనందున మార్గమధ్య న నొకయరణ్యములో ఒడ్డుమెరకనేలను మోకాళ్లు విరగబడిన సంజీవకుని జూచి వర్తకుడు కొంతసేపు చింతించి తర్వాత ఆబండిమీదిసరుకులన్నియు మనుష్యులచేత యెత్తించుకొని పడియున్న సంజీవకుని కాళ్లకు కట్లు గట్టించి, ఆయెద్దుమీది ప్రీతిచేత కొందరిని అక్కడ కావలియుంచి అవతల సాగిపోయెను.

తర్వాత అక్కడ కావలియుండినవారు మనము ఈభయంకరమైనఅరణ్యములో నుండి చావవలసిన దేమి పోదామని అతిత్వరితముగా బోయి ప్రభువును జూచి స్వామీ మేము ఆవనమునందు వృషభమునకు కావలియుండగా యెక్కడిదో వొకపులి వచ్చి సంజీవకుఁ జంపి యీడ్చుకొనిపోయెను. మేము తప్పించుకొని మీసన్నిధానమునకు వచ్చితిమి. మీతో యీమాట చెప్పుటకు సిగ్గవుచున్నది. అని మహాభయభక్తులతో జెప్పిరి.

అక్కడ ఆసంజీవకుండు ఆయస్సు కలిగియుండుటచేత విరిగినకాళ్లు నానాటికి చక్కటిగా వచ్చినందున మెల్లమెల్లగా లేచి తిరుగుతాడుచు లేతపచ్చిక మేయుచు తియ్యనినీళ్లు తాగుచు ఒళ్లెరుగనిసత్తువ బట్టి కొంచమైనా భయము లేక ఒకనాడు పెద్దరంకె వేసెను. ఆవనములో పింగళకుండను నొకసింహము పులులు అడవిపందులు యెలుగుగొడ్లు అడవిదున్నలు యేనుగులు ఖడ్గమృగములు దుప్పులు లేళ్లు మొదలైన సకలమృగములను శిక్షింపుచు రక్షి౦పుచు యెదురులేని భుజబలముచేత గర్వించి స్వేచ్ఛగా దిరుగుచు తనపరాక్రమముచేత సంపాదింపబడ్డ రాజ్య మనుభవింపుచుండెను. ఆసింహము నాడు దప్పిచేత డస్సి నీళ్లు దాగుటకై యమునానదిరేవులో దిగుచుండి మహాభయంకరమై ప్రళయకాలమేఘమువల్ల బుట్టినయురుముతో సమానమైనసంజీవకునిరంకె విని మిక్కిలి దిగులుపడి యిది యేమి యిక్కడ యెవ రున్నారు అని తనలో తాను ఆలోచన చేయుచు అవతల సాగిపోక నిలిచెను. అప్పుడు పింగళకునిమంత్రికుమారులైన కరటకదమనకు లనేపేరుగలనక్కలలో దమనకుడు తమప్రభువైన పింగళకుడనేసింహరాజు వృషభముయొక్కరంకె విని జడిశినతెరం గెరింగి కరటకునిం జూచి చూచితివా కరటకుడా ఇంతగొప్పవాడైన మనరాజు వింతయైనశబ్దము విని నదికి నీరు ద్రావబో వెరచెను. మనము అతనిమంత్రికుమారులమై యుండి యుపేక్షించుట యుచితము గాదు. అతనిదగ్గిరికి పోయి వెరచుటకు కారణ మేమని విచారించి అతనిజడుపు దీర్చుదమనిన కరటకుం డిట్లనియె.

ఓవెఱ్ఱివాడా దోవనుపొయ్యేవ్యాజ్యము కొనితెచ్చుకొన్నట్టు మనకి టువంటి పను లెందుకు. భగవంతు డిచ్చినమట్టుకు భక్షించి సుఖముగా నుండుదము. ఇటువంటిపనులకు పోతే మన కేమి మోసము వచ్చునో తెలియదు. అధికప్రసంగములకు బోయినవాడు మేకును పెరికినకోతివలె నిజముగా హాని బొందును. అదెట్లనిన

దమనకునకు కరటకుడు చెప్పెడు కోతికథ

ఒకపట్టణమునకు సమీపముగా నొకగొప్పదేవాలయము జీర్ణమై సగము నేలంబడియుండగా దేవభక్తిగల వొకవైశ్యుడు దాని మునుపటివలెనే చక్కసేయుండని శిల్పకారులకు కొంతధన మిచ్చెను. వారు ఆధనము తీసుకొని ఆగుడి కట్టుచుండేసమయములో నొకచేవదూలము పలకలుగా గోయుచు అది చీలుటకై అక్కడక్కడ మేకులు దిగగొట్టి యింతలో ప్రొద్దుగూకినందున తమయిండ్లకు పోయిరి. అప్పుడు సమీపవృక్షముల నాశ్రయించి దిరుగుచున్న కోతులు దేవాలయముదగ్గిర దిరికివచ్చి యెక్కి చెట్లపైకి కుప్పించి దూకుచు చెట్లపైనుండి దాటుచు గొప్పకొమ్మల నూగులాడుచు ప్రాకారములు పాకి పరుగులెత్తుచు గోపురంబులమీద కూర్చుండుచు గోళ్లతో పక్కలు వీపులు గోకుకొనుచునిక్కుచు కనుబొమలెత్తి వెక్కి రించుచు పండ్లిగిలించుచు ఒకదానితో నొకటి జగడమాడ ఓడిపోవుచు పండ్లు భక్షింపుచు తేనెలు దావుచు స్వాభావికమైన చపలత్వముచేత తిరుగుచుండెను. అందులో నొకముసలికోతి దైవవశముచేత మేకులు గొట్టియున్న చేవదూలము దగ్గరికి వచ్చి వృషణంబులు నెరియలో వ్రేలాడవేసుకొని దానిమేకు రెండుచేతుల బట్టి బలవంతముగా నూడబెరికెను. అంతట వృషణంబులు నెరియలో నిరుకుకొని నలిగినందున మొరలు పెట్టుచు నావేదనచేత మృతిబొందెను. కాబట్టి యీప్రకారముగా తనకు నిమిత్తము లేనిపనికి జొచ్చినవారి కిప్పుడే చెప్పినకోతివలె అవును. మనకు అది విచారించవలసిన పని యేమి. మనదొర భక్షింపగా మిగిలినమాంసము భక్షింతము రమ్మనిన దమనకుం డిట్లనియె.

మిత్రులకు నుపకారంబును శత్రులకు నపకారంబును జేయుటకై లోకములోవారు రాజులను గొల్తురు గాని తమకడుపు పోషించుకొనుటకు గాదు. అందుకై గొల్చుటకంటెను చచ్చుట మేలు. అటువంటివాడు చచ్చినా భూమికి వెలితి యవునా. ఒకనివల్ల ననేకులు జీవించడము లేకుంటేలవానిజన్మ మెందుకు. ము క్కున బొడుచుకతినేకొంగ తనకడుపు నిండించుకోలేదా. అదియునుం గాక కొంచముమెదడు గలకఠినమైన యెముక దొరికినా కుక్క సంతోషపడుచున్నది. అందువల్ల దానియాకలిగూడా తీరదు. సింహమైతే అల్పమృగము సమీపమునకు వచ్చినా దాని విడిచి మదించిన యేనుగను చంపి దానికుంభస్థలమందలి మెదడు భక్షింపగోరును. హీనులు నధికులు నైనసకలమానవులు తమతమబలానుసారము గార్యములు చేయగోరుదురు. అటువలె నీవున్ను నీబలానికి తగినట్లు చేయదలంచితివి. మఱియును కుక్క తనకు ఆహారమిచ్చేవానిదగ్గిర తోక నులుచుకొనును. నేల కాళ్ల నదుమును. భూమిమీద పడి కడుపు నోరు చూపించును. యీప్రకారము యెన్నిపాట్లు పడినా కుక్క కొక్కముద్ద యన్నమే కాని కడుపునిండ పెట్టరు. యేనుగ బహుధైర్యముతో చూచుచుండును. మంచిమాటలతో చెప్పితేనేకాని అహారము తీసుకొనదు. దానికి కావలసినంత ఆహారమిత్తురు. హీనుడైనవాడు ఎంతదీనుడై యడిగినా వానికి యెవరున్ను యివ్వరు. ఒకవేళ యిచ్చినా కొంచమే యిత్తురు. అధికునకైతే వా డడుగకున్నా రాజులు వానికాంక్ష దీర నిత్తురు. ఘనమైనవిద్యచేతను పరాక్రమముచేతను ఉపాయముచేతను రాజులు చూచి మెచ్చ బ్రతికినదే బ్రతుకు గాని నీచపుబ్రతు కెందుకు. కుక్క యల్లప్పుడున్ను తోక యాడించుచు కమికెడుకూడు తిననేతినుచున్నది. పౌరుషముచేత జ్ఞానముచేతను కీర్తిచేతను ప్రసిద్ధి కెక్కినవాని సంపద ఒక్కపూట నిలిచినా చాలును. తనకడుపుమాత్రమే నిండించుకొనేకాకి బహుకాలము బ్రతికియుండినా ఫల మేమి. కొంచంనీళ్లచేత మొరపనేల వాగు పొర్లిపారినట్లు స్వల్పఫలముచేతనే అల్పుడు మిక్కిలిసంతోషమును బొందును. ఇది హితము ఇది హితము కాదు అనేవివేకము లేక అనేకములైన వేదోక్తాచారములును విడిచి తనకడుపుమాత్రమే నిండించుకొనుటయందు యిచ్ఛగలనరుడు పశువుతో సమానుడు. భారముగలబండి నీడ్చుచు గడ్డి మేయుచు మిట్టపల్లములుగా నుండేస్థలములయందు దున్నుదు. నీప్రకారముగా లోకమునకు ఉపకారము చేయుచు పవిత్రమైనపుట్టుక గలవృషభము నరపశువుకంటే అధికము. అనిన విని ఓయీ మనము ప్రధానులము కాము కాబట్టి యేపనులకున్ను అర్హులము గాము. మన కిన్నినీతులతో పని యేమి అని కరటకుడు పలికిన వెండియు దమనకు డిట్లనియె.

పూర్వజన్మమునందు చేసినపుణ్యముచేత బుద్ధిగలవా డగును. బుద్ధిబలము చేత రాజులచేత పూజ్యుడగును. రాజులు మన్నించుటచేత బుద్ధికి ప్రకాశము గలుగును. అందువల్ల రాజ్యతంత్రము నడుపుటకు ప్రధానుఁడగును. ప్రధానత్వము వచ్చిన సమస్తము గలుగును. అప్రధానుడు ప్రధానుడు కావడానకు యెంతసేపు పట్టును. మరియును నడవడిక మంచిదిగా నుండెనా జనులు వాని గొప్పగా జూతురు. ఆనడవడి చక్కగానిది గాకపోయెనా వానిచుట్టములైనను వాని చుల్కగా జూతురు. గొప్పతనంబును చిన్నతనంబును నడవడికచేత వచ్చును. ఒకపెద్దరాయి మహాప్రయత్నముచేత కొండమీదికి తీసుకొనిపోవుట ప్రయాసము. ఆరాయి అక్కడినుంచి కిందికి తోయుట సులభము. అటువలెనే మంచిగుణములు గలవాడఃని పొగతొండుట కష్టము. దుర్జనుండని పేరు దెచ్చుకొనుట సులభము.

అని చెప్పగా కరటకుండు విని ఓయీ మంచినీతివాక్యములు వివరించితివి. నామనస్సులో సంశయము తీరెను. ఇపుడు నీ వేమి చేయదలంచితివో అది చెప్పుమనిన దమనకుం డిట్లనియె.

బలంబును పరాక్రమంబును ధైర్యంబును గలమనరాజు నీళు దాగుటకై నదికి పోయి రేవులో దిగక వెరచియున్నాడు. అది నీ వె ట్లెరింగితివంటివా వినుము. ఏకార్య మైనా భావజ్ఝులైనవారికి విశదమై యుండును. పశువులు ఒకరు చెప్పినమాటలు విని వారు చెప్పిన ప్రకారము ప్రవర్తించును. గుఱ్ఱములు, ఏనుగలు శిక్షలచేత నొకరివశంబై వారిని తమమీద నెక్కించుకొని తిరుచుండును. పండితుడైనవాడు ఒకరు చెప్పనితాత్పర్యమును ఊహింపుచు పరులయింగితమును దెలుసుకోవడమే బుద్ధి గలుగుటకు ఫలము. బుద్ధి లేనివారు దైవమునే చింతించి తమప్రయత్న మేమిన్ని జరిగించకయుందురు. అటువంటివారు భూమియందు బుట్టి యేమి ప్రయోజనము. ఈలోకములో పరులయింగితము తెలుసుకోలేనివానిజన్మ మెందుకు. కాబట్టి యిప్పుడు నేను రాజుదగ్గిరికి పోయి నామీద అతనిమనస్సు వచ్చునట్లుగా కొలిచి అతనిచేత మన్ననలం బొందెదను,

అనిన విని ఓచెలికాడా నీవు మున్ను రాజుల సేవించినవాడవు కావు. వారిచిత్తవృత్తి తెలిసి యెట్లు మెలగనేర్తు వని కరటకుం డడిగిన దమనకుడు మరల నిట్లనియె.

మిక్కిలిసమర్థులైనవారికి అసాధ్య మొకటి కలదా. ఉద్యోగము సేయ నేర్చినవానికి దూరభూమి గలదా. విద్యలు నేర్చినవారికి పరదేశ మొకటి గలదా. ప్రియవాదు లైనవారికి శత్రువులు గలరా. కాబట్టి మనరాజు మన్నించును సేవకులతోకూడా పోయి న న్నెరిగించుకొని అతనిసమీపము విడువక అనుసరించియుండెదను. రాజులున్ను స్త్రీలున్ను తీగెలున్ను యెల్లప్పుడు తమసమీపము విడువనిఆశ్రితులను గ్రహింతురు గాని వీనికి విద్య రాదనిన్ని వీనిది మంచికులము కాదనిన్ని అనాదరణ చేయరు. తమ్ము సేవింపుచుండినంజాలునని యెంచుదురు.యేభృత్యుడు రాజుయొక్క కోపప్రసాదములచిహ్న లెరింగి చరియించునో వాడు రాజుదయచేతను ప్రసిద్ధి నొందును.

అనిన కరకటకుండు - ఓయీ రాజుదగ్గిర పోయి నీవు యేమి మాట్లాడుచున్నా వని యడిగెను. అందుకు దమనకుడు చెప్పుచున్నాడు. మంచివర్షము కురిసితే విత్తనమువల్ల మరియొకనిత్తనము యెట్లా పుట్టుచున్నచో - అటువలెనే బాగాఉత్తరము చెప్పినట్టయితే దానివల్ల మరియొకఉ త్తరము పుట్టుచున్నది. నీతిమార్గమునందు ప్రవర్తించిన బుద్ధిమంతులు ఉపాయమును జూపించుటవల్ల వచ్చే కార్యసిద్ధినిన్ని అపాయమును చూపించుటవల్ల వచ్చే పనిచెరుపునున్ను యెదట అగుపడుచున్నట్టు తెలియజేయుచున్నారు. నేను సమయమును విచారించకుండా చెప్పను. బృహస్పతి అయినప్పటికిన్ని సమయము విచారించక మాట్లాడెనా అవమానము పొందును. ఏగుణముచేత జీవనము కలుగునో ఏగుణమువల్ల లోకములో సత్పురుషులచేత స్తోత్రము చేయబడునో అదే మంచిగుణము. ఆగుణముచేతనే నరుడు గుణవంతు డనిపించుకొనును. కాబట్టి ఆగుణమునుకాపాడుకొని వృద్ధిపొందించుకొనవలసినది.

అనిన కరటకుడు నీకు కార్యంబు సిద్ధించును పొమ్మని దమనకునితో చెప్పెను. అంతట దమనకుడు పింగళకువికిదగ్గిరికి పోయి వినయభయభక్తులతో దండము పెట్టిన పింగళకుడు అతని మిక్కిలిఆదరణతో కూర్చుండ నియమించి బహుదినములకు నిన్ను చూచితినని పలికిన దమనకుం డిట్లనియె.

దేవరవారికి నావల్ల యేమి ప్రయోజనమున్నది. అయినా సమయము వచ్చినప్పుడు లెస్సగా ఆలోచన చెప్పవలయునని వచ్చినాను. మంత్రి యైనవాడు తనరాజుకు సమయము వచ్చినప్పుడు కార్యాకార్యంబులు తెలియజేయుటకై తన్ను పిలువకున్నా రాజుదగ్గరికి రావలయును. నేనే కాదు యెటువంటిమానవ్యుడైనా రాజులకు ఒకానొకవేళ బనికివచ్చును. అచేతనములైనగడ్డిపుల్లలు మొదలైనవికూడా చెవిదురద పోగొట్టుకోవడము పల్లు కుట్టుకోవడము మొ దలైనవాటికి పనికివచ్చుచుండగానోరు చేతులు మొదలైన అవయవములుగల మానవుండు పనికిరాకపోవునా ధైర్యవంతునికి ఒకవేళ ఆపద వచ్చినా అతడు మునపటిధైర్యమును వదలడు. దివిటీలు తలకిందుగా బట్టుకొన్నా దానిజ్వాలలు ఊర్ధ్యముఖములే అవును గాని యెన్నటికిన్ని అధోముఖములు గావు. మరియు విశేషజ్ఞుడైన రాజునకు సమస్తమున్ను ముందుగానే అగుపడును. పైరు పెట్టేవాడు సకలమైనవిత్తనములున్ను యుక్తమయిన సమయములో మొలక మొలవగానే జూచి ఈపైరు యింతమాత్రము పండునని తెలుసుకొన్నట్లు బుద్ధిమంతుడైనవాడు మనుష్యులఆకారము చూచి వారిమనోవృత్తిని నిశ్చయించును. రాజైనవాడు తనభృత్యులయోగ్యాయోగ్యతలు తెలియక వారికి ఉద్యోగములు యిస్తే తలను ధరించేమాణిక్యమును కాళ్లయందున్ను కాళ్లను ధరించేఅందె తలయందున్ను ధరించినట్లు అపహాస్యానకు ఆస్పదమగును. కుందనముతో పొదుగుటకు తగిన శ్రేష్ఠరత్నమును ఇత్తడితో పొదిగితే రత్నమునకు యేమి కొదువ వచ్చును. తనబంటుకు తగినపని పెట్టకుంటె ఆతప్పు రాజుది గాని బంటుది కాదు. ఇతడు బుద్ధిమంతుడు ఇతడు తనయందు ప్రీతిగలవాడు ఇతడు మందుడు అని రాజు తెలుసుకొని వారివారిని తగినపనులయం దుంచితే వారు అతని విడువక బహుకాలము కొలుచుచుందురు. గుఱ్ఱమునకున్ను ఆయుధమునకున్ను శాస్త్రమునకున్ను వీణెకున్ను వాక్కుకున్ను స్త్రీకిన్ని నేర్పరియైనపురుషునికిన్ని ఒకానొకపురుషుని పొందుటచేత యోగ్యత గలుగు. ఒకానొకపురుషుని పొందుటచేత అయోగ్యత గలుగును. ఓమహానుభావా నన్ను జంబుకమాత్రముగా నీమనస్సులో నెంచగూడదు. విష్ణువు వరాహరూపముచేతనున్ను శివుడు మృగరూపముచేతనున్ను కుమారస్వామి ఛాగరూపముచేతనున్ను ఇంద్రాగ్నులు పక్షిరూపముచేతనున్ను దేవత చేత పూజింపబడినవారు కారా. సేవకుడు భక్తిగలవాడయి అసమర్థుడైతె ప్రయోజన మేమి. సమర్థుడయి భక్తిలేనివాడైతే ప్రయోజన మేమి. సమర్ధుఁడనై భక్తిగలిగిననన్ను మీరు చిన్నచూపు చూడవద్దు. రాజు అవమానించుటవలన పరిజనులు బుద్ధిహీను లవుదురు. వారు బుద్ధిహీనులు కాగానే పెద్దలు రాజును విడుతురు. పెద్దలు రాజును విడువగానే న్యాయము నశించి అన్యాయము వృద్ధిబొందును. న్యాయము నశించగానే సకలలోకములున్ను చెడిపోవును. కాబట్టి రాజు వివేకముగలవాడై యుండెను.

అని దమనకుడు పలికిన పింగళకుం డిట్లనియె. ఓయీ నీవు మాప్రధానమంత్రిపుత్రుండవు గనక చెప్పవలసిన మాటలు చెప్పవచ్చును దానివల్ల తప్పేమి అని ష పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/13 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/14 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/15 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/16 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/17 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/18 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/19 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/20 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/21 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/22 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/23 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/24 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/25 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/26 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/27 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/28 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/29 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/30 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/31 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/32 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/33 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/34 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/35 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/36 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/37 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/38 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/39 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/40 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/41 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/42 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/43 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/44 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/45 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/46 పుట:పంచతంత్రము (నేలటూరు రాఘవయ్య).pdf/47 లాలకించి సంతోషభరితులైరి.

మిత్రభేదమను మొదటితంత్రము సంపూర్ణము

సుహృల్లాభమను రెండవతంత్రము

అంత నారాజపుత్రులు సకలనీతిశాస్త్రపారంగతు డగువిష్ణుశర్మకు నతిభక్తితో నమస్కరించి అయ్యా తమఅనుగ్రహంబువలన మాకు మిత్రభేదమనేతంత్రము సాంగముగా దెలిసెను. ఇందువల్ల శత్రుమిత్రవర్గములందు ఆయాకాలానుసారముగా మెలగియుండుటకున్ను సజ్జనమైత్రివల్ల గలిగేసుఖమున్ను దుర్జనసహవాసమువల్ల గలిగేదుఃఖమున్ను యివి మొదలైన అనేకకార్యములను దెలుసుకొనుటకు మేము సమర్ధుల మైతిమి. గాన ఇకమీద దెలియజేయవలసిన నీతిశాస్త్ర్రాంశములను ఈతీరున లౌకికదృష్టాంతపురస్సరముగా దెలియజెప్పి యనుగ్రహింపవలెనని మిక్కిలివినీతులై ప్రార్థించిన నాతం డారాజకొమరులం జూచి ఓయీ బుద్ధిమంతులైనవారు సాధనములున్ను ధనమున్ను లేక ఒకరి నొకరు స్నేహము సేసి తమకు కావలసినకార్యములను కాకకూర్మమృగమూషకమువలెను జక్కగా నెరవేర్చుకొందురు అని విష్ణుశర్మ చెప్పగా వారలు విని కాకకూర్మమృగమూషకములకు ఎట్లా స్నేహము గలిగెను అవి యేకార్యముల నెరవేర్చుకొనెను. మాకు విశదముగా జెప్పవలయుననిన విష్ణుశర్మ యిట్లనియె.

మిహిళాపురమను పట్టణమునకు సమీపముగానుండు పెద్దఅడవిలో ఒకబూరుగుచెట్టు గలదు. ఆచెట్టుపైని లఘుపతనకుడను పేరుగలవాయసము నివాసము సేయుచుండును. ఆచెట్టుకిందికి ఒకబోయవాడు వచ్చన వానిఁ జూచి ఆకాకి భయపడి వీ డిక్కడి కేమినిమిత్తము వచ్చెను. దుర్జనుడున్నచోట నిలువరాదు. అదియునుం గాక ఇప్పుడు నే నాకలిగొనియున్నాను. శానా ప్రొద్దెక్కెను. శీఘ్రముగా పోవలెనని యత్నబడుచుండగా బోయవాడు చెట్టుచుట్టు వల వేసి ధాన్యము చల్లి తా నగుపడకుండా అవతలిపొదలో దాగి రెప్ప వెయ్యక చూచుచుండెను. తర్వాత చిత్రగ్రీవుడను కపోతరాజు వచ్చి ఆధాన్యము తినుటకై ఆశపడి తనపరివారముతోకూడా వానివలలో జిక్కుబడెను. అది చూచి బోయవాడు సంతోషించి వలదగ్గరికి వచ్చుచున్నసమయమునందు చిత్రగ్రీవుడు తనపరివారమునుం జూచి యిట్లనియె ఆకటిబాధచేతను ఒళ్లెరుంగక మన మత