నేటి కాలపు కవిత్వం/ఉద్దేశాధికరణం
స్వరూపం
శ్రీగణేశాయనమః.
వాఙ్మయపరిశిష్టభాష్యం.
ఉద్దేశాధికరణం.
ఆక్షేపం
అవునయ్యా ఇవి ప్రాకృతులకోసం ఉద్దేశించినవి అని అంటారా?
సమాధానం
చెప్పుతున్నాను; అప్పుడు మీమాంసేలేదు. ఉత్తమకవిత్వం మంటే కాదని క్షుద్రమని చెపుతున్నాను. అప్పుడు సయితంప్రాకృతులను ఆదశలొనే వుంచే యిట్లాటి పాటలకంటె వారు ఉత్తమదశను పొందడానికి అనుకూలించేరీతి కృతులు వారికెక్కువ ఉపయోగపడతవని వారి కివి ఉపకారంకంటె అపకారమే యెక్కువ చేస్తవని చెప్పుతున్నాను.
అని శ్రీ.. ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర
పరిశిష్టంలో ఉద్దేశాధికరణం సమాప్తం.