నేటి కాలపు కవిత్వం/స్థిత్యధికరణం
స్వరూపం
శ్రీగణేశాయనమః.
వాఙ్మయపరిశిష్టబాష్యం.
స్థిత్యధికరణం
పూర్వపక్షం
అవునయ్యా, ఇట్లాటి పాటలు మొదలైనవి వెనుకటినుంచి వున్నవని మీరే అన్నారు. ఇట్లాటివి వుండకుండా యెక్కడికి పోతవి. వీటిస్థితిని యెవ రడ్డగించగలరు? ఇవి వుండనేగూడదని మీ అభిప్రాయమా అంటే?
సమాధానం
చెప్పుతున్నాను; ఇట్లాటివి ఉండగూడదని యెవరు చెప్పగలరు? లోకంలో అన్నీవున్నవి ముండ్లు, మలం, విషం, పూలు, గంధం, అమృతం, భక్ష్యం, అభక్ష్యం అన్నీ లోకంలో వుండేవే అయివున్నవి. అట్లానే అన్నిరకాలకృతులు లోకంలో వుంటుంటవి. యెవరాపగలరు? అయితే వీటితత్వ మిది? ఇది మంచి, ఇదిచెడ్డ అని నిర్ణయించి వివేకం చేయడం సాహిత్యంయొక్క పని.
అని శ్రీ.. ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర
పరిశిష్టంలో స్థిత్యధికరణం సమాప్తం.