నీతి రత్నాకరము/నాల్గవ వీచిక
గురువునానతి శిరసావహించువారు గాన వా రామాటలు వినినంతనే శ్రద్ధాళువులై యట్లే యొనరింతుమనిరి . ఆ నలువురిలో వేంకటేశ్వరుఁడు సాము చేసినవాడు, బలశాలి, ధీరుఁడు నగును. కాళీచరణదాసు బలశాలియగుటయే గాక యుపాయముల నెఱింగినవాఁడు. ప్రత్యుత్పన్నమతియనం జనును రామకిశోరశర్మ జన్మ ధార్ఢ్యము గలవాఁడు. కార్యము పట్ల ముందు వెనుక లాలోచించువాఁడు కాఁడు. అంతియ గాక ఖడ్గ చాలనమున రెండవ భీముఁడే యనవచ్చును. శ్యామ సుందరుఁడు పై వారి నొక్కొక విషయమున మించువాఁడే కాని సామాన్యుడు కాడు ఈనల్వు రిట్టివారు కాఁ బట్టియే గురువుగారు రహస్యముగ నీ కార్యము చక్కపెట్ట నియోగించెను. వారెల్లరు శుక్రవారము రాకకై వేచియుం డిరి. ఆనంతాచలశర్మ యుఁ దనయిష్ట దేవత నారాధించుచు రాధిక కించుకంతయుఁ గీడుకలుగకయుండునట్లు కరుణింపవలయు నని ప్రార్థించుచుండెను. తుహినకిరణ శేఖరుఁడు పొరపాటున నీమాట యేల జాఱవిడిచితినని విచారించుచు గురు వీమాట నాలకించినజాడ కానరాలేదే యని మరలఁ దృప్తినొందుచు నుండెను.
నాల్గవ వీచిక.
జాలంధరపురమున మహోత్సవము సాగుచుండెను. ఆది శక్తి కేటేట నాయుత్సవము సాగునాచారము కలదని పాఠకులు ముందే చదివియుందురు. లక్షలకొలఁది మానవు లరు దెంతురు. శ్రీవత్సాంకదాసు ప్రతివత్సర మా దేవ్యుత్సవ సమయమున నతిథులకు దీనాంధక బధిర కుబ్జులకు నన్నదానము చేయువాడు. ఆవత్సరము దైవవశమున మరల రామదాసు వచ్చెను. పరమానందమున నేదియో గొప్పశుభము కలుగఁ గలదన్న విశ్వాసమున నారామదాసును బూజించుచు వచ్చిన వారికి మృష్టాన్న మిడుచు మహాదాత యను ఖ్యాతికిఁ దగియుండెను. పద్మావతి భర్తతో దాసుగారు వచ్చియున్నారు కదా. కుమారునకు వివాహమెచ్చటఁ జేయుమనునో యడిగి తెలిసికొని పిదప నా ప్రయత్నము చేయఁగూడదా యని గట్టిగాఁ బ్రశ్నింపసాగెను. ఆ ప్రశ్నము యుక్తియుక్తముగా నున్నందున ధర్మపత్ని తో నీ చెప్పినట్లే చేయుదునని యొకనాఁ డే కాంతమున రామదాసుకడం జేరి మెల్లగాఁ బ్రశ్నించెను. దాసు నవ్వి వత్సా! దైవప్రయత్న మనుకూలించుచున్నది. ఆ ప్రయత్నముగా నావివాహము సాగును నీ వూరకుండుము. నేనందులకే వచ్చినాఁడను. తగినకన్యక దొరకును. ఈ యుత్సవ మునకు విలాసధామమునుండి శ్రీనివాసదాసు వచ్చియు న్నాడు. ఆతని నేదోయొక నెపమునం గాంచి మాటలాడుము. ఆతని కొక్కతుక యే పుత్రిక కలదు. ఆమె పేరు రాధిక. సుగుణవతి, విద్యావతి, రూపవతియు నగు నాకన్యక నీకొమరునకుం దగినది. ఆదాంపత్యము వర్ణ నాతీతమై సృష్టికర్తను వేనోళ్లఁ గొనియాడందగినదై యుండును. ఆతఁడును నా రాకకై వేచియున్న వాడు. ఒక్క కార్యము నామదికిం దోఁచి నందున నిచ్చటికి వచ్చితిని. దాని నిపుడు తెలుపనయితి కాదు. కార్యాంతమున నెఱుకపడఁ దగియుండును. సమయోచిత ముగ శ్రీనివాసదాసుతో మాటలాడుము. అని నచ్చఁజెప్ప శ్రీవత్సాంకదాసు తద్వాక్యమును శిరసావహించి యట్లే చేయ నిశ్చయించెను.
సాయంకాలమున శ్రీనివాసదా సుచితపరివారముం గూడి జాలంధరీదేవతాదర్శనార్థము పోయెను. జనులు క్రిక్కి ఱిసియుండిరి. మార్గమున నిసుక చల్లి నను రాలకుండెను. త్రోవ కిరు ప్రక్కల యాచకు లుండిరి. గోవిందా యనువారు కొందఱు, కన్నులు లేనివాఁడ ననువారు కొందఱు, కుంటివాఁడను బాబూయనువారు మఱికొందఱు నిట్లు పెక్కుచందముల యాచించుచుండిరి. కొందఱు చెట్ల కింద నిలుచుండి సుద్దులు చెప్పుచుండిరి, మణికొందఱు దేవిని బాడుచు భక్తిరసమున మునిఁగినట్లు నటించుచుండిరి. ఇంకను గొందఱు కాశి రామేశ్వరము లోనగు క్షేత్రముల నద్దములలోఁ జూపుచుండిరి. ఒక్క తావున నొక రాటము తిరుగుచుండఁగా దానికొనల యందు వ్రేలాడఁగట్టిన కఱ్ఱగుఱ్ఱములపైఁ గూరు చుండి యొకఁ డాచక్రమును ద్రిప్పఁగా గిరగిరఁ దిరుగుచుఁ బాటలు పాడుచుఁ దమరు రౌతులమనుచు నాగుఱ్ఱములఁ దోలుచున్న మార్గము నటించుచు నార్చుచుండిరి. మఱియొక్క తావునఁ జాలుగాఁ బరుండి కొందఱు పాషాణములఁ బయిని వైచు కొని ముక్కులు గనఁబడునట్లుండఁగా వారి ప్రక్కన నొక్క రొక్కరు కూరుచుండి మహానుభావుని నీతనిం జూచిపొండు. ధర్మ మేమైనఁ జేయుఁడని బతిమాలుచుండిరి. మఱికొన్ని తావుల జూదరులు కూరుచుండి తమలో దామే యుద్దులుగా నాడుచుఁ దగువులాడుచు ద్రవ్యమును సంపాదించినట్లు నటించుచు నితరులు వచ్చి యాడఁబూనిన మోసపుచ్చుచు ద్రవ్యము నాకర్షించుచుండిరి. ఇంకను గొన్ని తావుల నాడుచుఁ పాడుచు స్త్రీలంగూడి వినోదములు సలుపుచు యాచించు చుండిరి. మఱియు నొక్క తావునఁ జచ్చిన పాముతోలును బ్రతికింపఁ జేసి దాని నాడించుచుఁ దమశక్తి కందఱు విస్మయంపడ నాలుగుడబ్బులిండని బతిమాలుచుండిరి. వీరినెల్లరఁ జూచుచు వచ్చినవారిలో మూఁడువంతులు జనులు కాలమును బుచ్చుచుండిరి
భర్తచనిపోయిన యాఁడువాండ్రు, రాచిప్పలమ్ము నంగళ్ల కడ నిలుసఁబడి బేర మాడుచుండిరి. ముత్తైదువులు కుంకుమము, అద్దములు, చెవ్వాకులు నమ్ము'నంగళ్ల దగ్గఱ మూఁగి యుండిరి. ఇట్లు వచ్చినవారు దేవాలయము లోనికింబోవఁ. జోటీయక తమ రెందులకు వచ్చినదియైన నాలోచించక పొద్దు పుచ్చుచుండిరి. శ్రీనివాసదాసు కష్టముమీఁద వీరినందఱిని దాఁటి దేవాలయమును బ్రవేశించెను. లోపల జన బాహు ళ్యము లేక హాయిగా నుండెను. గోపురమువఱకు మనుష్యా రణ్యము గలదు కాని లోపల నేకష్టము లేక భగవతిని దర్శింప ననువుగా నుండెను. పామరుల కాల క్షేపమునకు దాసు వెఱగందెను. యాత్రావ్యాజమున నెందఱు క్షుద్ర కార్యము లొనరించుచున్న వారని చింతించెను. అభ్యంతరమును బ్రవేశించి యందు నిలుచుండి వచ్చుచున్న నవయువతులం జూచుచు భగవతిని సేవించుచున్న జాడ నభినయించు దుష్టమతులం గాంచి గర్హించెను. యాత్రలకై వనితలం బంప రాదన్న నీతి యెంతయు సమంచితమని నిశ్చయించెను. ద్రవ్యార్జనమే ప్రధానముగా గలయర్చకుల కపట భక్త్యభినయమును దూషించెను. ఇట్టులాచోటునఁగల దురాచారముల కేవ గించుచుం బోయి జగన్మాతను జాలంధరీనామధారిణిని దర్శించెను.
ఆ దేవి భయంక రాకృతిం గానంబడును. కాని భక్తులకు మనోహరరూపిణిగనే కనఁబడును. ఒక్క కరమునఁ బాశాయుధము కలదు. దేవిని సేవించు వారికి యమపాశ భయము లేదను నర్థము నాచిహ్నమే తెలుపును. మఱి యొక్క హస్తమున నంకుశము కలదు. ఆయది దుర్మార్గముల విశృంఖల వృత్తిం జరించువారి నడంచునను భావమును వెల్లడించును. ఇంకొక బాహువునందుఁ బుష్పబాణము వెలయును. అయ్యది పరదేవి నాశ్రయించువారలకుఁ గష్టములు సులభముగాఁ గడచిపోవునను నభి ప్రాయమును దేటపఱచును. మఱియు నొక్క కేలఁ బుండ్రేక్షుచాపము దృగ్గోచరం బగును. అది భగవతి నెల్ల కాలము భజించువారలకుఁ గష్టములే కలుగక మనోహరముగాఁ గాలముసాగునను నుదంతమును దెల్లముగఁ జేయును. ఇట్టులున్న యా దేవీ విగ్రహమును జక్కఁగా దర్శించి పరమానందమునఁ జేతులుమోడ్చి నమస్కరించి నిలువంబడి సహస్ర నామములఁ బారాయణము చేసి ధ్యానించెను. అర్చకులు నామహాత్ముని గాంచినంతనే మనోవృత్తులు మార్పు నొంద భక్తిమై నర్చించి పాదోదకము నొసంగి ప్రసాదమిచ్చి తమకృత్యమును నెఱవేర్చిరి. దాసు వారి కుచితధన మొసంగి ప్రసాదమును శిరసావహించి యించుక కూరుచుండునాచార ముండుటం బట్టి యందే కూరుచుండి దేవీ మాహాత్యమును స్మరించు చుండెను.
శ్రీవత్సాంకదాసు భార్యాపుత్త్రు లు వెంట రాఁగా జాలంధరీదేవీ దర్శనార్థ మరిగెను. ఆదేవాలయమున నీదాసుగారికిఁ గొన్ని మర్యాదలు గలవు. గోపురము చేరఁగనే దేవి పూజ గావించిన పూలహారమును దెచ్చి యర్చకులు మెడలో వైచి పిలుచుకొని పోవునాచారముండెను. ఆవాడుక ప్రకారమర్చకులువచ్చి గారవించి పిలుచుకొని పోయిరి. ప్రదక్షిణత్రయ మొనరించి లోపలఁ బ్రవేశించి పరదేవిని దర్శించి యర్చకులచేఁ బూజ గావింపఁ జేసి పాద ప్రసూనములఁ గైకొని మరలివచ్చుచు శ్రీనివాసదాసు నెవ్వరో తెలుపఁగాఁ జిర కాలసందర్శనజనిత సౌహార్దమునఁ బరస్పరాలింగ నాది దేశాచారముల నడపి యందే యిరువురును గూరుచుండిరి. కుశలవార్తలఁ బ్రశ్నించిన 'వెనుకఁ దన కుమారుఁ డీతఁడని శ్రీవత్సాంకదాసు తెలిపెను. శ్రీనివాస దాసు ప్రమోదసంభరితమానసుఁడై యే వేవో విషయములఁ బ్రశ్నించి వివాహవిషయమును గూడఁ బ్రశ్నించెను. తనపుత్రునకుఁ దగినకన్యక దొరకినఁ ద్వరగా వివాహము చేయనున్నాఁడ నని కృష్ణదాసుతండ్రి, తెలిపెను. వారి చెంతనున్న పెద్దలు కొందఱు రాధికాగుణగణములను విద్యావైశద్యమును బేర్కొని యామే శ్రీకృష్ణ దాసునకుఁ దగినకన్యక యనియు నామెకు నీవరుఁడు తగినవాఁడనియుఁ దెలిపిరి. పెద్దలయాశయము ఫలింపకపోవునా యని శ్రీనివాసదా సనియెను. మాయాశయ మీ కన్యావరులకు దాంపత్యము శుభదాయక మని యా పెద్దలు 'తెల్పిరి. అందొక రీవిషయము రామదాసుగారి నడిగిన మేలనిరి. వారిదర్శనము నేయాశించుచున్నాఁడనని శ్రీనివాసదా సనియెను. మనయింటి కడనే వారిపుడు వేంచేసియున్న వారనియుఁ దప్పక మన యింటికి మీరు రావలయుననియు శ్రీవత్సాంకదాసు ప్రార్థించెను. మీరింతగా ప్రార్థింపవలయునా తప్పక వచ్చెదనని శ్రీనివాసదాసు బదులు చెప్పెను. "శుభమస్తు” అని పెద్ద లని. అప్పుడే తరలి యందఱు శ్రీవత్సాంకదాసుగారింటికిం బోయిరి.
వీరి రాక నెఱింగి యందులకే రామదాసు వేచియుండెను. గృహముసు బ్రవేశించునపుడు శుభశకునము లెన్ని యో కనఁబడెను. వియ్యంకు లిరువురును సంతసించుచుండిరి. అంగణమునం దే దాసుగారు కూరుచుండియుండిరి. కాన వారిని జూడఁగ నే శ్రీనివాసదా సుత్తరీయమును నడుమున బిగించి నమస్కరించెను. యోగి యాశీర్వదించి యందఱఁ గూరుచుండ నియోగించెను కుశల ప్రశ్న మొనరించి రాధిక యారోగ్యమును బలుమాఱు లడిగెను. పెద్దలందఱు దేవీసన్నిధిని సాగిన వార్తను దెల్పిరి. రామదాసు నవ్వుచు నీదాంపత్యము సృష్టి కర్తను బరీక్షింప నున్నది. ఈ యిరువురకే దాంపత్యము కుదురనిచో సృష్టికర్త యసమర్థుఁడే యగును అనెను. వృద్ధులందఱు కరతాళధ్వను లొనరించి తమసమ్మతమును దెల్పిరి. ఈ విషయము రామదాసుగారి యిష్టానుసారము జరగకమానదని శ్రీనివాసదాసనెను. నాకుఁ బరమసంతోషముగా నున్నది. తప్పక యీవివాహము సాగవలయును. వారి నాశీర్వదించినేనెచ్చటికో పోయెదను. అందులకే యిపుడు నిలిచితినని రామదా సనియె. శ్రీవత్సాంకదాసును సాధ్వియగు పద్మావతియు మహానందమున యోగీశ్వరులయాజ్ఞ యమోఘము కావును సమ్మతించితి మనిరి. తన సంపూర్ణ ప్రీతిని శ్రీనివాసదాసును వెలి పుచ్చెను. పెద్దల “తథాస్తు" అను శబ్దములు సాంద్రము లయ్యెను. సుముహూర్తము నిశ్చయింప రామదాసుగారే సమర్ధులని యందలివా రనిరి. ఆమీఁద నీవివాహమున కెన్నియో కారణములు గలవు సుముహూర్తము దైవికముగా నిర్ణయింపఁబడును. ఎవ్వరి ప్రయత్నమున వా రుండవలయునని రామదాసు పలికెను. యోగ దృష్టిగల దాసుమాటల కెల్లరు నాశ్చర్యంపడి యట్లే కావలయు ననిరి. ఆదినము శ్రీనివాసదాసు రామదాసుగారింగూడి శ్రీవత్సాంక దాసగృహమున నుండెను. రాత్రి భోజనానంతరము రామదాసు శ్రీనివాసదాసు నే కాంతమునఁ జీరి యిట్లు పలికెను.
వత్సా! రాధిక సామాన్యకన్యకగా భావింపఁదగదు, పరమేశ్వరి తేజస్సాకన్యకయందుఁ గలదు. శ్రీ కృష్ణ దాసు కూడ భగవదంశము గలవాఁడు. వీరిరువురవివాహమున మీ రెండువంశములు జగద్విఖ్యాతిం గాంచఁగలవు. కాని కొన్ని యంతరాయములు పొడసూపును. దేవాంశ సంభూతుల విషయముననే యవి పెలుచన సాగుచుండును. రాక్షసాంశ సంభూతులు పెక్కడ్రుందురు. వారు దేవతాంశము గల వారలం గాంచి యోర్వఁజాలరు. వారు చేయుదుండగములు తొలుదొలుత ఫలించినట్లు గానిపించి తుదకు నిష్ఫలము లగును. ఈవిషయమున నింతకంటెఁ జెప్పఁదగదు. ఈ వాక్యములు సూత్రప్రాయములుగా భావించి కార్యనిర్వహణము నకుం బూనవలయును. ఈవాక్కులయర్దమెల్ల ముందు మీకే యనుభవమును బట్టి స్పష్టముగా గోచరించును. మీరు త్వరగా నగరమున కరిగి నాయీ వాక్కులను స్మరించుచు నిశ్చింతముగా ధైర్యము విడనాడక ప్రయత్నము సాగింపుఁడు.
అని రామదాసుపలుకఁగా శ్రీనివాసదాసు వినివిని యంత "రార్థమును జక్కంగా గ్రహింపఁజాలక యేవో కొన్ని విఘ్నములు గలిగినను వివాహము నెఱవేఱునన్న సారమును మాత్రము గ్రహించి యా రేయి సుఖనిద్ర చేసి మఱుదినము దాసుగారియనుమతిచే నందే గడపి సాయంకాలమున నగరము నకుఁ బయనము సాగించెను. శ్రీవత్సాంకదాసు వివాహవిషయమై మాటలాడి ముహూర్తము నిశ్చయించి దాసుగా రెపుడు చెప్పుదురో యావార్త మీకుం దెలుపుదుననియు సర్వ ప్రయత్నములు చేయవలయుననియుఁ జెప్పి సాగనంపెను. ఇరువురు విడిపోవలసివచ్చెను గదా యనుచింతఁ బూనఁదగిన వారైరి ఎంతో కష్టమునఁ బరస్పరము విడిపోయిరి. ఔరా! స్నేహమెంత బలవత్తరము ! ఆవఱకు వా రిరువు రొక్కసారి యేని చూడని వారైన నొక్కదినము కలిసియుండినందున నిర్మల చిత్తులు గాన మరల విడిపోవవలసివచ్చేనే యనువిచారము నొందవలసినవా రైరి. స్నేహమువంటి పదార్థ మీలోకమున నేదియు లేదని పెద్దలు పలుకుమాట నిశ్చయ మని యీకథ సిద్దాంతము చేయుచున్నది.
పాతాళుఁడు విలాసథామసగరమున నేమి చేసెనో యించుక విచారింతము. సప్తమీశుక్రవారము వచ్చెను. కృష్ణపక్షము గాన రాత్రి పదునాల్గుగడియల కించుమించుగాఁ జంద్రోదయ మగును. నాఁటియుదయమే తన ప్రయత్న మం తయు సంసిద్ధముగ నుండుటెఱింగెను. కుంతలుఁడు వివాహోచితపదార్దములం దీసికొనిపోవ సిద్దముగ నుండెను. తక్కినపరివారము యథాసంకేతముగ నుండిరి తొలిదినమే భరతపురమునకుం బోయి కుంతలుఁడు ప్రయత్న మంతయు సిద్ధమయ్యెనని యర్చకులకుం జెప్పి సాయంకాలమే పూజాదులు ముగించి మీరిండ్లకుం బోవలయునని చెప్పివచ్చెను. నాలుగుడబ్బుల కాశించి వా రట్లు చేయఁబూని యుండిరి. శిబిక సంసిద్ధమయ్యెను. సంకేతస్థలములన్నియు నాయాయిసేవకులకుఁ జూపఁబడియెను. వారంద ఱాసమయమునకు వచ్చి సిద్ధముగనుందుమని పల్కిరి. తనకు వలయువస్తువులు మూలికలు సంసిద్ధముగనుండఁ బాతాళుఁడు కార్యభారవ్యగ్రమనస్కుఁడై యుండెను. ఎపుడు సాయంకాలమగునా యని వేచియుండెను.
ఆనాడు రాధిక శుక్రవారమగుట సభ్యంగస్నాన మొనరించి పూజాదు లొనర్చి యిష్టదైవముల నారాధించి ముత్తైదువులకు వాడుక చొప్పున నిచ్చుదానముల నిచ్చి సాయంకాలమునకు ముందే మరల సువాసిసులు రాఁగా వారిం గూడి దేవీభజనము చేసి వీణా నాదమున నంబను సువాసినీ బృందమును సంతోషింపఁ జేసెను. ఆనాడు విశేషించి శ్రమపడియెను. తల్లి 'రాధికా! ఏల యింత పాటుపడియెదవు ? నేఁ డేమి విశేషమని ప్రశ్నించెను. రాధిక తల్లీ! నాతండ్రి గారు జలంధరీదేవ్యుత్సవమునకుం బోయిరికదా, నేఁ డందు మహోత్సవము సాగును. శుక్రవారమౌట మఱింతవిశేషముగ నర్చనలు సాగును. కావున వారందు భక్తిపరవశులై యంబ నారాధింతురు. నేను నిందుండియే యాదేవి నారాధింపఁ దలంచితిని. భక్తపరాధీనమానసగదా లోకజనని. ఈ వారమునఁ గల విశేష, మద్దియే అనఁగా నామెయు నామాటలు మదికి సరిపడి యుండుటంబట్టి మంచిదమ్మా యని కూఁతుచర్యలకు మహానంద మున మునుంగుచు లోలోన నీకన్యక భగవత్యంశ సంభూతు రాలే యని నిశ్చయించుకొనియెను. ఆనాఁడు దైవవశమునఁ గాఁబోలు రాధిక యుదయాదిగా సాయంకాలముదనుక క్షణమైన నూరకుండక యేదోయొక కార్యపరత దేహమును శ్రమపెట్టెను. సాయంకాలము కాఁగాఁ దనపనులన్నియుఁ దీర్చుకొని భగవతి విగ్రహమున కెదుటనే భూమిఁ బరుండెను. చెలికత్తెలు దా సికలు నించుకదూరముగా శయనించిరి. ఆగదితలుపు తెఱచియే యుంచిరి. కాన రాధిక వారికిఁ గనఁబడుచునే యుండెను. దీపము వెలుఁగుచునే యుండెను. ఆ పక్క గదిలో నిందిరా దేవి శయనించెను. నాడు పెందలకడ శయనించిరి. కారణము పగటి వేళ విశేషించి రాధిక పాటుపడుటయే కాని "వేఱోండు కాదు. శయనించిన వెంటనే యందఱకు గాఢనిద్ర పట్టెను.
ఆగృహ మత్యున్నతము. విశాలభాగము నాక్రమించి నదియు నగు. దానికిం బశ్చిమభాగమునఁ బూలతోఁట గలదు. అది యింటినంటియే యుండును. దాని ప్రక్కన నెత్తైన ప్రాకారము గలదు. ఆ ప్రాకారమునకుఁ జెంత మఱ్ఱి చెట్టు గలదు. దానికొమ్మలు కొన్ని యాపూలతోటలోనికి సాగినవి కలవు. ఊడలు దిగ నది యొక మొదలుగాఁ దోఁచునట్లు నాలుగైదు కొమ్మలుండెను. ఆతోఁటకు నంబానిగ్రహము గలగదికి దూర మెంతయో లేదు. ఆపూలతావు లాగదిలో వ్యాపింపవలయు ననియే మొదటనచ్చట నది గట్టఁబడియె. ఆగదికిఁ దూర్పుభాగ మున మఱియొక గది కలదు. అదియే భోజనశాల యనంబడు. దేవికి నైవేద్యము పెట్టి భుజించుట వారియింటఁ గలవాడుక. ఆభోజనశాలకు నానుకొని యుత్తరభాగమున వంటచేయు భాగము. దేవీగృహమునకు దక్షిణ భాగముననే యిందిరా దేవి శయనించియున్న గది కలదు. భగవతియుండు గదికి నుత్తరభాగమునఁ బాకగృహమునకుఁ బడమరగను గది యొకటి కలదు. అందుఁ బారాయణపుస్తకములు పూజాద్రవ్యము లుండును. అందే శ్రీనివాసదాసు దేవీగ్రంథములం జదువుకొనఁ గూరుచుం డును. ఆనాఁడు శుక్రవారము గావునను దండ్రి,జాలంధరీదేవీ పూజాతత్పరుఁడై యుండుననియు రాధిక దేవీసన్నిథానముననే పరుండెను.
పాతాళుఁడు తనవూన్కి నెఱవేర్పఁబూని పెందలకడ భుజించి కుంతలు నింటికింబోయి సంకేతస్థలమునకు రమ్మని హెచ్చరించెను. ఆసంజవేళనే యిరువురు మనుష్యులు సురాభాండముల నెత్తుకొని తనయింటి వెనుక ప్రక్కన నిలుచుండి పిలిచిరనియుఁ దలుపుదీసి సందులోనుండుఁడని చెప్పితిననియు మఱి కొలఁదిక్షణములకే తొమ్మండ్రు, వ్యాధులు వచ్చిరనియు, వారా సురను దృప్తిగాఁ గ్రోలిరనియు వారన్నము తిని వచ్చితిమని చెప్పి రనియుఁ దాంబూలము మాత్ర మిచ్చితిననియు వారందే యున్న వారనియు నింకను జాము రాత్రి, కాలేదనియుఁ గాఁగానే పిలుచుకొని వత్తుననియుఁ గుంతలుఁడు దెలిపెను. ఏవో కొన్ని మాటలు రహస్యముగాఁ దెలిపి పాతాళుఁడు కొన్ని వస్తువులు గలసంచి నొకదానిం దీసికొని వెడలి పోయెను.
పాతాళున కాయింట నొకదాసిక రహస్యములు తెలుపుచుండునది కలదు. అది యొక్కతుకయే యాయింటికిం గలమర్యాద నడంచునది. అది నీచమతి. పాతాళునియింటికిం జెంత నాదాసికగృహము గలదు. మంచిమాటలాడుచు దానినేట్లో వశపఱచుకొనియెను. రాధిక శయనింపఁగనే యాజాడ నాదాసీ యెట్లో పాతాళున కెఱిఁగించెను. అది వారియింటఁ బరుండునది కాదు. తనపనులన్నియు ముగించి యది వెడలిపోయెను. జామురాత్రి, కాఁగానే పాతాళుఁ డామఱ్ఱివృక్షము నెక్కి తోటలో దిగియెను. దాసి యేఱిం గించిన ప్రకారమే తలుపు చక్కఁగా వేయఁబడక యుండెను. కాన దానిం దీసికొనివచ్చెను. దీపములు వెలుఁగుచుండెను. అతఁ డాదీపములం దొకపసరు పిండెను. వాని కాంతి ప్రసరించిన చోటుల శయనించియున్న వారెల్లఁ జూచుచున్నను మాట లాడఁ జాలరు. ఆపసరునం దట్టిశక్తి కలదఁట. ఆవెంట నిందిరాదేవి శయనించియున్న గదిని దాఁటి దానిముందు శయ నించియున్న పరిచారికలం గాంచుచు దేవియుండు గదిలో నికిం బోయెను. రాధిక మెత్తనిచర్మముపై శయనించియుండెను. దేవికి నమస్కరించి యారాధిక నుదుట నొక్క తిలకము పెట్టెను. దాన నామెకు సృతితప్పునని యాతఁ డెఱుంగును. నాసికారంధ్రముల నొక్క మూలిక వాసనఁ జూపెను. దానిచే నామెకు వాగ్బంధ మగును. ఈ రెండింటిలో నొక్కటియే యాతనిపనికిఁ జాలినను మఱింత దిట్టముగాఁ బనిచేయుకొఱ కట్టు లొనరించెను. అంతకుముందే గాఢనిద్రలో నున్న రాధికకు నీ రెండు మందులు తోడ్పడి మఱింత గాఢనిద్రఁ బట్టఁ జేసెను. అంత నాతఁ డామెను బొరలించెను. శవముచందమున నామె యుండెను. తనశక్తి పనిచేసెఁగదా యని యానందించెను. తలుపు తీసెను, దేవికి నమస్కరించెను. బలశాలిగాన నవలీల రాధిక నెత్తుకొని యాపూలతోటనుండి పడమరకుం బోయేను. ఒకయీల వేసెను. వెంటనే కుంతలుని గూడి శిబిక ఁ గొనివచ్చిన తొమండ్రు నవ్వల నున్నందున నందు నలువురు మఱ్ఱి కొమ్మనుండి యీవలికి దిగిరి, నలుగురు పై నుండిరి. ఒక తొట్ల దింపఁబడియె. అందారాధికను బరుండఁ బెట్టి పై వారికి సంజ్ఞ చేయ వా రాతొట్ల నీడ్చుకొనిరి. మెల్ల మెల్ల గాఁ గొమ్మవెంటఁ బదిలముగాఁ గొనిపోయి నలువురు దిగఁగా మరల నా తొట్లను దిగవిడిచిరి. క్రిందనున్న వా రందుకొనిరి. శిబికలోఁ బరుండఁ బెట్టిరి. కుంతలున కొక్క సేవకుని తోడిచ్చి ముందు పంపి యెనమండ్రు, వ్యాధులు తాను బయనము సాగించిరి. నిశ్శబ్దముగా వారు నడచిరి. ఆనాఁ డానగరమున వింత నాటకమొకటి యాడఁబడుచుండెను. పెక్కం డందులకుఁ బోయి యుండిరి. సందుగొందులంబడి యెట్లో నగరమును దాఁటిరి. ఆనగరమునుండి ధనవంతులు శిబికల నధిరోహించి ప్రయా ణముసాగించు టాచారమైనందున నిదేవ్వరిదో యని యెవరైనం జూచినను బ్రశ్నించుటగాని యనుమానపడి నిలుపుటగాని చేయరైరి
విలాసథామమును దాఁటి పల్లకి యవ్వల బయనము సాగించెను. చంద్రోదయమునకు నించుకముందే యాశిబిక దేవాలయముకడకుఁ జేరఁగల్లెను. నాలుగుగడియల రాత్రికి ముందే యర్చకులు పూజచేసి యిండ్లకుం బోయి శయనించి నట్లుండి రెండవజామున నిర్వురు వచ్చి యాలయముకడ వేచి యుండిరి. ఆలయము చుట్టుపట్టుల నత్యున్నతవృక్షములు గలవు. కాన గాఢాంధ కారముగనే వెన్నెలరాత్రులయందు నుండును. ఇక నానాఁడు చెప్పవలసిన దేమి ? దైవవశమున నాకసమున మబ్బు క్రమ్మియు నుండెను. అర్చకులు తొలుత గుంతలుంగాంచి వార్తల నేఱింగి సంతోషమున వారి రాకకై వేచియుండిరి. శిబిక యాలయమునకు నించుక దవ్వున నునిచి పాతాళుడు నిర్వురు వ్యాధులు నరు దెంచిరి. అర్చకులం గలిసి కొనిరి. ఆ వ్యాధులయం దొక్కనికా తొలిదిన మాశౌచము వచ్చెను. వానికిం దక్కినవారిలోఁ బెక్కండ్రు జ్ఞాతులు. ఇర్వురు మాత్రము బంధువులు. ఆశౌచముగలవా రాయాలయము లోనికిం బోయిన మరణము సంభవించునని ప్రవాదము కలదు. ఆయనుమాన మావ్యాధులకు మెండు. కావున వారు లోపలికి రాఁజాలమనిరి. కుంతలుఁడు, అర్చకులిరువురు వ్యాధు లిర్వురు పాతాళుఁడును గలిసి యాఱుగు రాశిబికఁగొని దేవా లయములోఁ బ్రవేశించిరి.
చంద్రోదయ మయ్యెను. కాని తన్నిర్మల కాంతులు సర్వత్ర వ్యాపింపనీయక మేఘము లావరించి యుండెను. వృక్షచ్చాయలు మఱింతగ నంధకారమును బెంపొందించెను. వ్యాధు లేడుగురు వెలుపల నుండిరి. పెండ్లి కొడుకు పురోహితుఁడు గాక నలువురు లోన నుండిరి. రాధిక విస్తృతిమై నుండెను. ముఖ కాంతి యొక్కంత వాడియుండెను, వేసిన చేయి వేసినట్లే యుండెను. కుంతలుఁ డభ్యంగస్నానము చేయింపవలదా యని ప్రశ్నింప దొంగపెండ్లికి మంత్ర స్నానమే చాలునని యర్చకమహాశయులు బదులిడిరి. కుంతలు డంగీకరించెను. భవాని కెదుట శిబికఁ జేర్చిరి. "దేవికడనున్న పీఁటలం దెచ్చి యచ్చో నర్చకు లమరించిరి. అగ్ని హోత్రుని సిద్ధము చేయుచుండిరి. కుంతలుఁ డింకఁ బెండ్లి సాగింతును. రాధికను మేలుకొలుపుమని పాతాళునకుం దెల్పెను. నీవన్నియు సిద్ధము చేసికొని యగ్ని నిటనుంచిన యుత్తరక్షణమున మేలుకొనునట్లు చేసేదనని పాతాళుఁ డనేను. అర్చకులు పాతాళా ! వివాహ మగును. తర్వాత నెందుఁ బోవయత్న మని యడిగిరి. వివాహానంతర మీయూర నుండ వలనుపడదు గాన నీ చెంతనున్న కొండ దరిఁ కొలఁదిదినము లుందును. అందొక పల్లియ గలదు. అందు శబరులు పెక్కండ్రు, 'నా శిష్యులు గలరు. వారి చెంతనున్న నన్నుఁ దేరిచూడ నిర్జరులకే శక్యంబు గాదు. ఎట్లో పదాఱుదినములు గడ పెదను. ఆనల నీ యూరికి వచ్చి దంపతులము దేవీపరిసరమున నుండుము. ఇంతలో నీ రాధిక నాకు లోఁబడును. ఆవల వివాహమును ద్రోసివేయఁ దరముగాదు. పుత్త్రికాప్రేమమున నన్నేమియు ననఁజాలక యల్లునిగ మామ గారవించును, అప్పుడే నాదెబ్బ, మిమ్మెల్ల గారవింతునని యింక నేమో మాటలాడుచుండెను వారు నీదంతయు యథార్థముగా సాగుననియే తలంచిరి. ఎంతటి మంత్ర వేత్త గాక యున్న నిట్లు 'రాధికను సృతి లేక యుండఁ జేసి యెవ్వరికిం దెలియ రాకయుండ బహిరంగముగా శిబిక 'నెక్కించి తేగలఁడా యని వా రూహించి యాతని ప్రతివాక్యము వేదవాక్కుగనే తలంచిరి. ఇంతలోఁ గుంతలుఁ డన్ని యు సిద్ధములయ్యెననఁ బోయి వ్యర్ధములయ్యెనని పలికెను. మహోత్సాహమున నున్న పాతాళున " కామాట వినఁబడ దయ్యెను. ఇదిగో రాధిక ను లేపెదనని యేమో మంత్రించి ముక్కురంధ్రముల నేది యో మూలికను వాసనచూపి మోమున నున్న తిలకమును దుడిచి వేదొకతిలకమును బెట్టి మూఁడు సారులు చిటికెలు వేసెను. నిద్ర నుండి మేలుకొనినట్లు రాధిక లేచి కూరుచుండెను.
ఇపుడు రాధిక యుండుచోటు కడుంగడుం గ్రొత్తది. భగవతి మాత్రము ముందుఁ గనఁబడును. ఆమెయు భీకర రూపమున నుండునదియే కాని రాధిక పూజించునంబ కాదు. రాధిక కూరుచుండి నలు దెసలఁ బరికించెను. పాతాళుఁ డగ పడెను. దేవాలయమునఁ దానున్నట్లు ఆఱుగురు తన్నేమో చేయ నున్న యట్లు తోచెను. ఇదేమి వింతయని యామె విచారింపసాగెను తుద కిది పాతాళునిమోసమని తెలిసికొనెను. పాతాళునిదుశ్చర్యల నామెయు వినియే యుండెను. ఇఁక నీలోకమునకుఁ దనకు ఋణము తీఱునని యామె తలుచెను. జననీజనకులం దలంచుకొని కన్నీరు కార్చెను. భగవతీ ! నిన్ను నమ్మినదాని నిట్లు చేయఁబూనితివి. ఇది నీకు న్యాయమా యని నిష్ఠురము లాడెను. తండ్రీ! నన్నే నమ్మియుంటివి. నీకు నావలని సాయము కల్గునన్న యాశ నశించెను. ఇంక నాదుఃఖమే నిన్నుఁ గుందించును. నన్నుఁ గన్న మీకిరువురకు నావలనఁ గలిగెడిలాభ మిదియే యని తలంచెదను. ఇక నేఁ జేయఁదగిన పనియేమని, యూహించెను. ధర్మ మాపదలనుండి రక్షించునన్న నుడి వ్యర్థ. మయ్యెఁగదా యని పరితపించెను. నిన్ను నమ్మినవారికిఁ జేటు కలుగదనిన పెద్దలమాటలు పొల్లులే కదా భగవతీ యని దూఱెను. ఇఁక నీలోకమునకు నాకును దూరమగునని సిద్దాంతము చేసికొనియెను. భగవతినే ధ్యానించుచుఁ జేతులు ముకుళించి యూరకుండెను.
పాతాళుడు రాధికం గని కన్యకామణీ! యిది కాళికా దేవాలయము. కాని మీతండ్రియిల్లు గాదు. ఈ మాటలాడు వాఁడు పాతాళుఁడు. మీతల్లి యిందిరా దేవి నాకుఁదోఁబుట్టువు. కావున నీవు నాకు భార్య వగుదువు. ఈ రాత్రి మంచి ముహూ ర్తము. భగవతి నాయిలువేలుపు. ఆమె సన్నిధిని సాగు కార్యములు సఫలము లగును. వేఱుమాటలాడి లాభము లేదు. ఇఁక నీయాటలు సాగవు. నన్ను వరించి వివాహము సాగనిచ్చుటో లేక మఱియొక భావముఁ గనఁ బఱచితివేని యీ కరవాలమున కాహుతివగుటయో నిశ్చయించుకొమ్ము. ఈ పాతాళుఁడు సామాన్యుఁడు కాఁడు నిన్ను నిద్రించుచుండ మంత్ర బలమున నిటకుం దెచ్చినవాఁ డెవఁడు? ఈ పాతాళుఁడే. ఆలోచించుకొమ్ము. నన్నుఁ జేపట్టిననే నీవు బ్రదుకుదువు. లేకున్న నీకంఠర క్తమునఁ గాళికాదేవికిఁ దర్పణము చేయుదును. ఇంక నాలస్యము లేదు. ముహూర్తము సమీపించుచున్నది. పురోహితులు త్వర పెట్టు చున్నారు. ఏమూలికా ప్రభావమున నీవు స్మృతితప్పి యంతదనుక 'నుంటివో యామూలికయే యిది. బలవంతముగ నైనం బెండ్లి యాడుదును. కాని యది నాకిష్టము లేదు. వివాహమాడి యైహిక సుఖములనుభవించుటొండె. నీకంఠమును దునిమి 'దేవికి బలి యిచ్చి యాదేవీకరుణకుం బాత్రుడనై యాముష్మి కసుఖము లొందుటొండె. ఈ రెండు పనులలో నొక్కటి కావలయును. ఏమనియెదవు ! నీయిష్టానుసారము 'మెలంగువాఁడను గాను, ఇదిగో మంగళసూత్రము. ఇదిగో నిశిత ధారాకరాళమగు కరవాలము. ఈ రెండింటిలో దేనిం గోరుదువు? త్వరగాఁ దెలుపుమని యదలించెను. కుంతలాదు లాకరవాల ధారం గాంచి గడగడ వడంకిరి.
రాధిక నయనములు తెఱచి భగవతికి నమస్కరించి ధర్మమును నమ్మి భయముం బాఱఁద్రోలి యిఁక జీవితాశంగొని లాభము లేదని నిశ్చయించుకొని గంభీరో క్తుల నిట్లు పలికెను. పాతాళా ! ఈ మానవజన్మము పెక్కు పుణ్యములకుఁ బ్రతి ఫలము. దీనిని మరలఁ 'బాపభూయిష్ట ముగఁ జేయరాదు. మానన హృదయము పవిత్ర మైనది. దీని నపవిత్రముగాఁ జేయరాదు. అది మానవస్వభావమునకు విరుద్దము. ఈతనువు గూడ స్థిరముగా నిలుచునది కాదు. నరహింసాదులు పౌరుషములు గావు. అవి నీచతమములు. ఈయోషధులు నీమంత్రములు నిన్నుద్ధరింపఁ జాలవు సరికదా, నీచాతి నీచగతికిం దీసికొనిపోవఁ గలవు. ఇది సత్యము. ఈ కాళికాదేవి నా యిలువేలుపంటివి. ఈయొక్క మాటయే నీయజ్ఞానమును వెల్లడించుచున్నది. సకలలోకజనని కదా యీ పరదేవి. నీయిలువేల్పు మాత్ర మెట్లగును? జగజ్జన నికి నన్నా హారమిచ్చిన నా దేవి యీపుత్త్రికను బరి గ్రహించునా? ఈ కార్యమున సంతోషించునా? నీచుఁడా! ఏలయందని మ్రాఁకుల కఱ్ఱుచాపెదవు? ఈకన్యక నీకు లభించునది కాదు. కరవాలమున కాహుతియే చేయుము. భగవతిసాన్నిధ్యముననే యుండెద. ఇఁక నన్ను మాటలాడింపకుము. నీయిచ్చవచ్చిన చొప్పునం జేయుము. అని ధ్యానము నాశ్రయించి నిమీలితనేత్రయై, పరదేవీపాదారవిందములం దలంచుచుండెను.
పాతాళుఁ డాపలుకులకు నాగ్రహించెను. నాచేతం జిక్కి యుఁ 'గాఱులాడెదవా యని యదలించెను. నీకంఠముంద్రెంచి రక్తధారల నంబాపాదారవిందములఁ బ్రక్షాళన మొనరింతును. రవంత సేపు తాళుమని భయపెట్టెను. ఏమో జపించినట్లు నటించెను. కాళికాసమీపమునకుం బోయి సాష్టాంగ నమస్కారముల నాచరించెను. లేచి కరములముకుళించి భగవతిని వినుతించెను. ఖడ్గము నా మెపదనఖరములకుం దగిలించి యందు కొని జళిపించెను. జననీ! కన్యకారత్న కంఠ లుంఠన మొసరించి వేఁడి నెత్తురు సోనల నీకర్పించి కృతకృత్యుండ నయ్యెద. నాకర వాలముచివరన నిలిచియుండుమా యని యభ్యర్థించెను. ఒక్క దాఁటున వచ్చి రాధికా కాంత మ్రోల నిలువంబడియెను, విశేషించి యామెను బలుకరింపక యేమోగొణుగుకొనుచుండెను. అర్చకుల కిరువురకుఁ బాదములు మొదలుకొని యుత్తమాంగముపఱకు వడఁకసాగెను, ఏమో యుపద్రవము రానున్నది. మన మేల యీ పెంటలో దిగితిమిరా స్వామియని చింతింపసాగిరి. కరవాలమున కాహుతి కానీయక మన మాపవలయునని యూహించిరి. కాని యాతని భీషణాకారమును గాంచి మనకే యాపని యగునేమో యని యనుమానింపసాగిరి. కుంతలుఁడు వడఁకుచు నేనేల యీక్రూరుని మాటలవింటినని పలుభంగుల విచారించ సాగాను. ఏది యేమైనను గన్యకప్రాణముల దక్కింపవలయునని నిశ్చ యించెను. 'వ్యాధులిద్దఱు బదులాడక దూరముగాఁ గూరుచుండి యుండిరి. కొంత సేపిట్లు గొణిగి గొణిగి రాధికా ! ఇది కడ సారిమాట. ఏమందువు ! అని యదలిం చెను. ఖడ్గమును జళిపించెను. ఔడుగఱచి కత్తినాడించెను. అది కుక్కనాలుకవలె నల్లల నాడుచుండెను. ఒక్క వేటున కెందఱికంఠములనైన దునుమఁగల ధార దానికిం గలదనుట నిక్కము. రాధిక పలుకలేదు. తల్లిదండ్రులం దలంచుకొని యిఁ కేటి జనకులని వదలి భగవతి ధ్యానించి యెట్టికష్టములనైనఁ దొలఁగింతువని నమ్మితిని. నీదయ అని వినుతించుచుండెను. అంతఁ బాతాళుఁడు కరవాలాగమును రాధికాకంఠమునకుఁ దగులఁ జేసి యిదె మఱియొకసారి హెచ్చరించుచున్నవాఁడ. ఏమందువు? సన్ను వరింతువా. ఖడ్గ ధారకు బలియగుదువా యని 'బెదరించెను. బదులు లేదు. మూఁడుసారులు కత్తిని దనచుట్టును ది ప్పెను. కాళికా ! ఇవె కన్యాకంఠరక్తధారలు. తనివిదీఱఁ గ్రోలుమా యని కత్తి మరల జళిపించెను. వానిమోము చూడఁ దరము గాక యుండెను. అర్చకు లిరువు రుత్తరీయముల నడుములకు బిగించి నిలువఁబడిరి కుంతలుఁడు దర్భగ్రంధి యవలఁ బాఱవైచి చేతికఱ్ఱనూని నిలుచుండెను. కత్తియె త్తగనే యడ్డుపడవలయు నని యాతనియూహ, పాతాళుఁ డంబకు నమస్కరించి సెలవా జననీ ! యని యడిగెను.
ఇంక సెలవే లెమ్ము పాతాళా క్రూరమానసా! సెలవే. అను కరాళాట్టహాసయుత వాక్కు లెందుండియో వినఁబడియెను. అర్చకులు కుంతలుఁడు నులికిపడి నలుదిక్కులకు దృష్టులఁ బ్రసరింపసాగిరి. అంతలో వేంకటేశ్వరుఁడు దేవి పృష్ఠ ఇంక నన్ను మాటలాడింపకుము. నీయిచ్చవచ్చిన చొప్పునం జేయుము. అని ధ్యానము నాశ్రయించి నిమీలిత నేత్రయై పరదేవీ పాదారవిందములం దలంచుచుండెను.
పాతాళుఁ డాపలుకులకు నా గ్రహించెను. నాచేతఁ జిక్కియుఁ గాఱులాడెదవా యని యదలించెను. నీకంఠముంద్రెంచి రక్తధారల నంబాపాదారవిందములఁ బ్రక్షాళన మొనరింతును. రవంతసేపు తాళుమని భయ పెట్టెను. ఏమో జపించి నట్లు నటించెను, కాళికాసమీపమునకుం బోయి సాష్టాంగ నమస్కారముల నాచరించెను. లేచి కరములముకుళించి భగవతిని వినుతించెను. ఖడ్గము నా మెపదనఖరములకుం దగిలించి యందు కొని జళిపించెను. జననీ! కన్య కారత్న కంఠలుంఠన మొనరించి వేఁడి నెత్తురు సోనల నీకర్పించి కృతకృత్యుండ నయ్యెద. నాకర వాలముచివరన నిలిచియుండుమా యని యభ్యర్థించెను. ఒక్క దాఁటున వచ్చి రాధికా కాంత మ్రోల నిలువంబడియెను విశేషించి యామెను బలుకరింపక యేమోగొణుగుకొనుచుండెను. అర్చకుల కిరువురకుఁ బాదములు మొదలుకొని యుత్తమాంగమువఱకు వడఁకసాగెను. ఏమో యుపద్రవము "రానున్నది. మన మేల యీ పెంటలో దిగితిమిరా స్వామియని చింతింపసాగిరి. కరవాలమున కాహుతి కానీయక మన మాపవలయునని యూహించిరి. కాని యాతని భీషణాకారమును గాంచి మనకే యాపని యగునేమో యని యనుమానింపసాగిరి. కుంతలుఁడు పడకుచు నేనేల యీ క్రూరుని మాటలవింటినని పలుభంగుల విచారించసాగాను. ఏది 'యే మైనను గన్యక ప్రాణముల దక్కింపవలయునని నిశ్చ ________________
నాల్గవ వీచీక. యించెను. వ్యాధులిద్దఱు బదులాడక దూరముగాఁ గూరు చుండి యుండిరి. కొంత సేపిట్లు గొణిగి గొణిగి రాధికా ! ఇది కడ సారిమాట. ఏమందువు? అని యదలించెను. ఖడ్గమును జళి పించెను. ఔడుగఱచి కత్తినాడించిను. అది కుక్కనాలుకవలె నల్లల నాడుచుండెను. ఒక్క వేటున కెందఱికంఠములనైన దునుమఁగల ధార దానికిం గలదనుట నిక్కము. రాధిక పలుకలేదు. తల్లిదండ్రులం దలంచుకొని యిఁ కేటి జనకులని వదలి భగవతి ధ్యానించి యెట్టి కష్టములనైనఁ దొలఁగింతువని నమ్మి తిని. నీదయ అని వినుతించుచుండెను. అంతఁ బాతాళుడు కరవాలాగ్రమును రాధికా కంఠమునకుఁ దగులఁ జేసి యిదె మఱియొకసారి హెచ్చరించుచున్న వాఁడ. ఏమందువు? నన్ను వరింతువా. ఖడ్గ ధారకు బలియగుదువా యని బెదరించెను, బదులు లేదు. మూడుసారులు కత్తిని దనచుట్టును ద్రి ప్పెను, కాళికా! ఇవె కన్యాకంఠ రక్తధారలు. తనివిదీఱఁ గ్రోలుమా యని కత్తి మరల జళిపించెను. వానిమోము చూడఁ దరము గాక యుండెను. అర్చకు లీరువు రుత్తరీయముల నడుములకు బిగించి నిలువఁబడిరి కుంతలుఁడు దర్శగ్రంధి యవలఁ బాఱవైచి చేతికఱ్ఱనూని నిలుచుండెను. కత్తియెత్తగనే నే యడ్డుపడవలయు నని యాతనియూహ. పాతాళుఁ డంబకు నమస్కరించి సెలవా జననీ ! యని యడిగెను.
ఇంక సెలవే లెమ్ము. పాతాళా క్రూరనూనసా ! సెలవే. అను కరాళాట్టహాసయుత వాక్కు లెందుండి యో వినఁబడియెను. అర్చకులు కుంతలుఁడు నులికిపడి నలుదిక్కులకు దృష్టులఁ బ్రసరింపసాగిరి. అంతలో వేంక టేశ్వరుఁడు దేవి వ్రష్ఠ భాగమునుండి యొక్కయెత్తున దుమి కెను. తళతళలాడు కర వాలములు వాని రెండు చేతుల మెఱయుచుండెను. అతని వెంటఁ గాళీ చరణదాసుఁడు బలిష్ఠమగుదేహము కనంబడ ఖడ్గపాణియై వచ్చెను. రామకిశోరశర్మయు శ్యామసుందరుఁడు నుద్దండ ధ్వనుల నంబకమును బగులఁ జేయుచుఁ ద్రాళ్ళు పట్టుకొని యాయుధపాణులై దక్షిణోత్తరభాగములనుండి చివాలున నట వ్రాలిరి. ఎత్తినకత్తి నట్లే తునుక లై పడఁ గాళీచరణదాసు తన ఖడ్గమునఁ గొట్టెను. వేంకటేశ్వరుఁ డొక్కెతునఁ బయింబడి సిగపట్టుకొని వంచి జానుఘాతముల మర్దించెను. రామకిశోర శర్మ వాని నా తాళ్లచే బంధించెను. పాప మాపాతాళుఁడు దిగ్బ్రమము చెంది యూరకయుండెను. అర్చకులిరువురు ప్రాణములపై నాశమాని యట్లే కూలబడిరి. కుంతలుఁడు స్మృతిదప్పి ముందే పడిపోయెను. వ్యాధులిర్వురు వారిం గాంచి యేమో యనఁబోవునంతలో రామకిశోరశర్మయు శ్యామసుందరుఁడును జక్కగా మర్ధించి కట్టివై చిరి. నోటి నుండి మాటవెడలినఁ దల లేగిరిపోవు ననిరి వారేనాఁడో చచ్చినట్లూరకుండిరి.
వేంకటేశ్వరుఁడు సోదరీ! రాధికా ! భయంపడకుము. వీఁడె పాతాళుఁడు బంధింపఁబడియె. మే మనం తాచలశర్మ శిష్యులము. నీదురవస్థ ముందే తెలిసికొని నచ్చితిమి. భయం పడక లెమ్మనిరి. పాపమా రాధిక ప్రాణము లెందుండెనో యప్పుడు మరల దేహమునఁ బ్రవేశించెను. కన్నులు స్వాధీనము లయ్యెను. చూడఁగాఁ దమయింటి కపుడపుడు వచ్చుచున్న వారే యని స్మృతికిం దగిలిరి. ఆనలువురం గాంచినంతనే యామె దుఃఖ మాపుకొనలేక బోరున నేడువసాగెను. ఇంతలోఁ గాళీచరణదాసు గోపురద్వారముల మూసివచ్చెను. ఇంక నెవ్వరును రాఁజాలరు. వారెంతయో రాధిక నోదార్చిరి. పాతాళునిం జూపిరి కుంతలు నల్లే బంధించిరి, అర్చకులిరువురు పాదాక్రాంతు లైరి. వారిని గట్టివేయక కదలకయుండుఁడని హెచ్చరించిరి. వారు శవములవలె నుండిరి. ఈనల్వురేపుడువచ్చి యందుండిరో యేఱుంగుట కష్టము. ఆవిషయము తెలిసికొనవలసినదే.
ఆనాఁడు సాయంకాలమున నల్వురును వేషాంతరముల దేవాలయముకడనుండు వృక్షములకడ నుండిరి దాని ప్రక్కనే యొకమార్గము కలదు అదియే విలాస ధామమునకుం బోవు పెద్ద బాట ఎందఱో పోవుచు వచ్చుచుందురు. అర్చకు లిరువురు సాయంకాలమే మహాద్వారము తెఱచి లోనఁ బ్రవేశించిరి. వారందే వంట చేయవలసిన ట్లాచారము కలదు. వంటచేయుచు నడుమనడుమ దేవతల కలంకారముఁగూర్చుచు మరల మహానస గృహమునకు బోవుచు వచ్చుచుండుట యలవాటు. ఆరీతిగా నాఁడును సాగుచుండఁగా నిరువురు కాళికాదేవి వెనుక భాగమునఁ జేరిరి. తక్కినయిర్వురు మండపములు ప్రక్కలనున్నందున వానీ చెంతనుండు వృక్షముల నెక్కి యాకుజొంపములఁ గూరుచుండి యుండిరి. ఆనాఁడు గాఢాంధకారము మేఘ మావరించుటం జేసి కలిగెను. వారుకని పెట్టియుండి పాతాళుఁడు కత్తిఁ ద్రిప్పుచువచ్చి కంఠము తెగ వ్రేయునని యూహించి యొక్క సారి వచ్చిరి. రాధికను గాపాడిరి. వీరిని బంధించిరి. వేంకటేశ్వరుఁ డిఁ'కేమి చేయవలయునో తెల్పుఁడని తక్కిన వారి నడిగెను. గురువు నానతి మైఁ జేయవలయునని తక్కినవారు తెలిపిరి. అర్చకులంగాంచి మీరు ప్రాణముల దక్కించుకొన దలంచినచో నెన్వ రెవ్వరు వచ్చినది. తెలుపుఁడని యడిగిన వేంకటేశ్వరుం గాంచి వడంకుచు గోపురమునకు వెలుపల నేడుగురు వ్యాధు లున్న వారనియు వా రాశౌచభయమున లోనికి రారై రనియుఁ దెల్పిరి. మీ రిపుడు మేము చెప్పునట్లు చేయకయున్న నంబకు బలియిత్తునని యాతఁడు మరలఁ బలికెను. మీ రాజ్ఞ యిచ్చినట్లే చేయుదుమని వారు ప్రమాణము చేసిరి తక్కిన వారితో నాలోచించి వేంకటేశ్వరుఁ డిట్లు పలికెను. మాశ్యామ సుందరుఁడు మీతోడ వచ్చును. గ్రామమున కొక్కఁడే పోవలయును, ఒక్కఁ డిక్కడనే యుండవలయును. ఇరువురు మనుష్యు లను బిలుచుకొని త్వరగా నగరమునకుం బోయి రాధి కాకుశల వార్తఁ దల్లిలోనగువారికిం దెలిపి రావలయు. వా రరుదెంతురు గాన మీరు రేపు రావచ్చును. మాశ్యామసుందరుఁడు నగరము నకు మీతోడనే వచ్చును. మీ రట్లు చేసిన మాకృపకుఁ బాత్రు లగుదురు. లేనిచో నీనిస్త్రింశమునకు బలియగుదురు. అనఁగా వారట్టులే యొనరింతుమని బాసచేసిరి. నృసింహస్వామ్యర్చకుఁడు శ్యామసుందరుంగూడి భరతపురమునకుం బోయి పెద్దలతో రహస్యముగా నా తెఱఁ గెఱింగించి వారియనుమతిచే వచ్చిన మనుష్యులంగూడి కాఁగడలం గొని విలాస థామమునకు బయనము చేసెను. ఇంక విలాస ధామమున శ్రీనివాసదాసుగృహమున జరిగిన వార్త లరయుదము. 'రాధికం దీసికొని పాతాళుఁడు పోయిన పిమ్మట గృహమును రక్షింప నియుక్తుఁ డై యున్న కాహళుఁడు రెండవయామము రాఁగా నరుదెంచి గంభీరస్వరంబున భటులం బిలి చెను. వార లప్రమత్తులై యుండిరి. ఇంచుక లోపలికిఁ బోయెను ఆడువారందఱు శవములభంగిఁ బడియుండిరి. కాహళుఁడు మరలఁ బిలిచెను. పలుకలేదు. అచ్చెరువంది. మరలఁ బిలిచెను. ప్రతిధ్వని రాలేదు. ఏమిది యని మఱికొంతలోపలికిం బోయెను. భోజనశాలలో నెల్లరు శయనించి గాఢనిద్రలో నున్న యట్లు కనఁబడఁగా మరల నందుండియే పిలిచెను. కదలకమెదలక వా రుండిరి. సేవకులంగూడి 'చెంతకుం బోయెను. ఒక్కరును మెలకువగలిగియున్న యట్లు తోమిఁ జింతించి యిదియే మన్యాయమని తలంచెను. పరికించి చూడఁగాఁ బూజామందిరము తలుపు తెఱచియున్న ట్లగపడెను. ఏదో కృత్రిమము సాగినదని చింతించి సేవకులంబంపి తనమిత్రుని భార్యతోడ రప్పించెను
ఆ దంపతులను మూలికాపద్దతులు క్షుద్ర విద్యావి శేషములు తెలియును. కావున నితరుల దుష్టకృ త్యములు వారిని బాధింపజాలవు. ఆవిషయ మెఱింగియే కాహళుడు వారిని బిలిపించెను. దీపమునఁ బిండినపసరు దీప కాంతి వ్యాపించి నంతదూరము తనశక్తిఁ జూపఁజాలక కుడ్యముదనుకఁ జూపఁ గలదని యొక నియమమఁట. ఆవిషయము లెల్ల నాదంపతు లెఱుంగుదురు. కావుననే కాహళుని చెంతకు వచ్చిన యతని మిత్రుడు భార్యను లోపలికిం బోయి కనుఁగొనుమని యాజ్ఞా పించెను. ఆమె లోపలికింబోయి వారిని బొరలించి లేపినను బలుకరైరి. అదిగని కాహళుఁడు మిత్రమా యేమిది యని యడుగ నాతఁడును క్షుద్ర విద్యా నిపుణుండు కాన దీపము లార్ప వలయునన నట్లే చేసి కొత్తదీపముల వెలిగించెను. ఆదీపచ్ఛాయ వ్యాపింపఁగ నే యందఱులికిపడి లేచిరి. కాహళుని గని భయం పడిరి. ఇందిరా దేవి. యింకను మేల్కొనలేదే యని యాదీపము నార్పునట్లు చేయఁగా నా మేయు మేలుకొనియె. ఎల్లరు రాధికామందిరమునకుం బోవ రాధిక యగపడదయ్యెను. తలుపు తెఱచియుండుటం గాంచిరి. ఇంతలోఁ 'బెక్కంద్రు, పెద్దమనుష్యులు గూడిరి. నలు దెసలఁ బరికించిరి. పాదచిహ్నములు కనఁబడఁగా నిందు మనుష్యుల యడుగులగుఱుతు లున్న వనిరి. ప్రాకారమున కవ్వల మఱికొందఱు యడుగులజాడ లగపడఁగా విచారింపసాగిరి. ఇంతలో నెవ్వరో యీత్రోవనే యొక శిబిక నెత్తుకొని కొందఱు వారి వెంటఁ గొందఱు పోయిరని తెల్పిరి. అప్పటి కొకజాము దాఁటినదని తెలియవచ్చెను రెండవజాము దాఁటినగుఱుతుగా ఘంటానాదము వినంబడియెను. రాధిక నాత్రోవనే శిబికలోనునిచి యెత్తుకొనిపోయి రని నిర్ణయించిరి. ఎల్లరు నింతటి యన్యాయము సాగునా యని చేతులు పిసికికొన సాగిరి. ఇంద ఱుండియు నిట్లు జరగుటకు హేతువుండవలయునని మరల నింటికిం బోయి పరీక్షింపఁగా దీపతైలము వివర్ణముగా నుండెను. కృత్రిముఁ డెవ్వఁడో వసరు పిండి యెల్లరను మూర్ఛిల్లఁ జేసెననియు, రాధిక నిల్లుదాఁటించి కొనిపోయెననియు నిశ్చయించిరి. ఇంతటి ఘోర కృత్యము చేయు నంతపగవారు కలరా యని విచారింపఁగాఁ బాతా ళుఁడే రాధికం గోరియున్న వాఁ డనియు వాఁడు క్షుద్ర విద్యా పారంగతుండనియు నెవ్వరో చెప్పిరి. ఇందిరయు నగునని యంగీకరించెను. ఎల్లరును జింతాసాగరమున మునింగిరి.
రక్షకభటు లరుదెంచిరి. రాధిక నెత్తికొనిపోయిన వాఁ డెవ్వడో చూపినఁ బట్టుకొందుమని వారభయహస్తమిచ్చిరి. వాని పేరు, వాఁ డుండుతావును జూప నెవరినైనఁ బంపుఁడని వారు త్వర పెట్టసాగిరి. ఏత్రోవనుండి యింటిలోనికిం దిగెనో చూచినవారు కొందఱుండవలయు ననిరి. వారు సాక్ష్యము చెప్పిన మీద వాని దండితుని జేయుదుమని ప్రల్లదంబు లాడిరి. ఇన్ని గుఱుతులు చిక్కిన మేమే పట్టుకొనఁజాలమా యని కాహళుండనియెను. ఈసందడిలో మూఁడవజాము వెళ్లిన గుఱుతుగా గంట మ్రోఁగెను. నగరమునఁ గలవా రెల్ల రాశ్చర్య పడసాగిరి. ఎందుఁజూచిన నీవార్తయే చెప్పుకొనసాగిరి. పాతాళునికృత్యమే కాని వేఱోకరిపని యిది రాదని యెల్లరు నిర్ణయించిరి. అప్పుడే జాలంధరపురమున కంచెగుఱ్ఱముల నెక్కి సేవకు లరిగిరి.
ఆశుక్రవారము రాత్రి యే భోజనానంతరము రామదాసుతో మాటలాడి తెల్ల వాఱుజామునఁ దదనుజ్ఞాతుఁడై విలాస ధామమునకు శ్రీనివాసదాసు ప్రయాణమయ్యెనని యింతకుముందే పాఠకమహాశయులు చదివియుందురు. జాలంధరపురసీమ దాఁటినప్పటి నుండి యనేకదుశ్శకునములు కనఁబడ సాగెను. ఒకదానికంటే వేఱోకటి యమంగళ దాయకముగా నాతనికిం దోచుచుండెను. ఒక్కచోఁ గూరుచుండి కొంత దూరము వెనుకకుం బోయి పాద ప్రక్షాళనము చేసికొని యం దొకవృక్షమూలమున నించుక శయనించి మరలఁ బ్రయాణము చేసెను. యధాపూర్వముగా దుశ్శకునములు కాసాగెను. భగవన్నామము జపించుచు సర్వానర్ధపరిహర్త పరమేశ్వరుండని నిశ్చయించుచు మరల దుశ్శకునములకు జంకియు మరలధైర్యము తెచ్చుకొని వానిని లెక్కింపనట్లు ప్రయాణము జరపుచునే యుండెను. సూర్యోదయమై కొంత ప్రొద్దెక్కెను. వడినడిగా గుఱ్ఱములు నడచుచునే యుండెను. మధ్యా హ్నము కావచ్చెను. అపుడపుడు దుశ్శకునము లగుచునేయుండెను. ఎండకుబడలి యొక గ్రామమున సత్రమునకు ముందున్న తోటలో దిగి వంట చేయ నాజ్ఞాపించి తాను నాలోచించు చుండెను.
ఐదవ వీచిక.
విలాసధామమున రాత్రి నాలవజామునఁ బ్రయాణమయిన యాశ్వికులు చావుపర్వున వాని నడిపించుచు శ్రీనివాసదాసు భుజించి యిఁకఁ బ్రయాణము చేయుదమా యని యూహించు చుండ నచ్చటఁ జేరిరి గుఱ్ఱములు నీరు తాగినపిదప నించుక సేపు సేదదీర్చుకొని ప్రయాణము సాగింతమని వారు సత్రముకడఁ జెట్ల క్రింద నిలిచిరి. సేవకుఁడు బయటి కెందులలో వచ్చి వారిం గాంచెను. వారు నావార్త వానికిం దెల్పి వానింగూడి తోట లోనికిం బోయి దాసుగారికి: జెప్ప లేక యావార్తం దెల్పిరి. శ్రీనివాసదాసు నిశ్చేష్టుఁడై రాధికాయనుచుఁ బడిపోయెను. శీతలోపచారము లొనరించి యెట్లో స్మృతి వచ్చునట్లు చేసిరి.