నీతి రత్నాకరము/ఐదవ వీచిక

వికీసోర్స్ నుండి

దొకవృక్షమూలమున నించుక శయనించి మరలఁ బ్రయాణము చేసెను. యధాపూర్వముగా దుశ్శకునములు కాసాగెను. భగవన్నామము జపించుచు సర్వానర్ధపరిహర్త పరమేశ్వరుండని నిశ్చయించుచు మరల దుశ్శకునములకు జంకియు మరలధైర్యము తెచ్చుకొని వానిని లెక్కింపనట్లు ప్రయాణము జరపుచునే యుండెను. సూర్యోదయమై కొంత ప్రొద్దెక్కెను. వడినడిగా గుఱ్ఱములు నడచుచునే యుండెను. మధ్యా హ్నము కావచ్చెను. అపుడపుడు దుశ్శకునము లగుచునేయుండెను. ఎండకుబడలి యొక గ్రామమున సత్రమునకు ముందున్న తోటలో దిగి వంట చేయ నాజ్ఞాపించి తాను నాలోచించు చుండెను.


ఐదవ వీచిక.

విలాసధామమున రాత్రి నాలవజామునఁ బ్రయాణమయిన యాశ్వికులు చావుపర్వున వాని నడిపించుచు శ్రీనివాసదాసు భుజించి యిఁకఁ బ్రయాణము చేయుదమా యని యూహించు చుండ నచ్చటఁ జేరిరి గుఱ్ఱములు నీరు తాగినపిదప నించుక సేపు సేదదీర్చుకొని ప్రయాణము సాగింతమని వారు సత్రముకడఁ జెట్ల క్రింద నిలిచిరి. సేవకుఁడు బయటి కెందులలో వచ్చి వారిం గాంచెను. వారు నావార్త వానికిం దెల్పి వానింగూడి తోట లోనికిం బోయి దాసుగారికి: జెప్ప లేక యావార్తం దెల్పిరి. శ్రీనివాసదాసు నిశ్చేష్టుఁడై రాధికాయనుచుఁ బడిపోయెను. శీతలోపచారము లొనరించి యెట్లో స్మృతి వచ్చునట్లు చేసిరి. కన్నీరు మున్నీరుగానుండ మాటలాడఁజాలక పయనము సాగింతమా యనియెను. ఈగుఱ్ఱము లలసినవి. ఆయాయితావుల నశ్వముల నునిచి వచ్చితిమని వారలనిరి. వీరి నందే నిలిపి యలసిన గుఱ్ఱముల నించుక సేదదీర్చి రేపు పయనముసాగింపుఁడని 'వారల కాజ్ఞాసించి తాను బ్రయాణము చేసెను. కొంతదూరము రాఁగా నండు గుఱ్ఱములు సిద్ధముగా నుండెను. వాని నెక్కి పరి జనులు దానును దారింబట్టి పోయి యిట్లే గుఱ్ఱముల మార్చుచు సాయంకాలము కాకమునుపే విలాసధామమును జేరెను.

ఇపుడు భరతపురవృత్తాంతము తెలుపకయున్నఁ గథ విశదముగాఁ దెలియదు. భరతపురమునుండి శ్యామసుందరుఁ డొక యర్చకుని మఱికొందఱనుగూడి కాఁగడలం గొని విలాస ధామమునకుఁ బోయెను. చిటిపోటిచినుకులు వానికిందోడు మెఱపులు వానినిమించు గర్జితములు తమ్మడ్డుచుండఁగా నెట్లో మూఁడవ జాము వెళ్లునప్పటికి నగరమును జేరెను. అత్యంతము పొడవువెడలుపుగల యానగరమునఁ బోయిపోయి కాహళుఁడు జాలంధరపురమునకు నాశ్వికులంబంపిన యొక్క క్షణమునకు శ్రీనివాస దాసుగారియిల్లు చేరెను. శ్యామసుందరుఁ డందుఁ గలవారి కెల్లం గ్రొత్తవాఁడు. ఐనను రాధికాకుశలమును దెలుప వచ్చితిమని గట్టిగా, బలుక నందఱులికిపడి యెవరో కనుఁగొనుఁడని పలుకుచు రండి రండి యని పిలువఁగా నందఱు లోనఁ బ్రవేశించిరి. ఇందిరా దేవి శవప్రాయముగాఁ బడియుండియు రాధి కాకుశలమును దెలుప నెవ్వరోవచ్చిరనువార్త యమృతధారవలె శ్రుతివివరముల పోఁక నులికిపడి లేచెను. ఇంతలో శ్యామసుందరుఁడు తక్కిన వారితో నా మేకడకుం బోయి యిందిరా దేవీ ! మీకుమారిక రాధిక భరతపురమునఁ గాళికాసన్నిధిని గుశలముగా నున్నది. ఈవార్తఁ దెలుపవచ్చితిమని హిత వాక్కులు వినిపించిన నాలకించి మరలమరల నడిగి కాహళుం బిలిచి యీక్షణమ భరత పురమునకుం బోవలయును. శిబిక నాయత్తపఱుపుమనఁగా నందుఁ గల పెద్ద లందఱు తల్లీ ! నీవీ సమయమున నచటికిం బోవుట పాడి గాదు. మే మందఱము పోయి తెల్ల వాఱునంతదనుక నందుండి రాధికా రక్షణమునం దప్రమత్తులమై 'పాతాళుని జూచుచుం దుము శ్రీనివాసదాసుగారు రాఁగా వ్యవహార మెట్లు చేయఁ దగునో యట్లే జరపుదురు. మీ రిపుడు వెళ్లి రాధికం దీసికొని వచ్చిన వ్యవహారము తాఱుమాఱగును. తల్లీ! మామాటల నవధరింపుఁడు. త్వరపడకుఁడు. భగవంతుఁ డిబాలుర రూపమున నాకుమారిని గాపాడెను. కావున నిఁక నారాధికకు నించు కంతయు భయము కలుగకయుండ మేమెల్ల నిపుడే పోయి కాపాడెదమని తెలియఁ జెప్పిరి.

ఇందిరా దేవి ధీమంతురాలు. పెద్దలవలన సకలధర్మములు నెఱింగినది. శీలవతులలో మేటియని పేరు గాంచినది కావున వారిమాటలు న్యాయసమ్మతములగుట నంగీకరించి వారిని బ్రార్ధించి భరతపురమునకుఁ బంపెను. కాహళుడు గృహ రక్షణమునకై సోదరు నియోగించి భరతపురమునకుం బెక్కండ్రను బెద్దలను బంపి తాను జాలంధర పురమార్గమునఁ గొంత దూర మరిగి దాసుగారి రాకకై యెదురుచూచుచుండెను. ఇందిరా దేవి ప్రభాతము కాగా లేచి స్నానము చేసి పరమేశ్వరిం బూజించి యిట్టియెడరు తప్పుట నీ యనుగ్రహముననే ________________

కదా యని ప్రార్థించి యాపాదతీర్థమును బుచ్చుకొని నిరశన వ్రతయై భర్తయా గమనమును బ్రతీక్షించుచుండెను నాలుగు గడియల కొక్క సారి భరతపురమునుండి సేవకులు గుఱ్ఱము లెక్కివచ్చుచు రాధిక కుశలమును దెలుపుచుండిరి. శనివార ముదయమున 'రాధికయు నాలయముననే స్నానము చేసి తల్లిగా రంపిన వస్త్రములం దాల్చి భగవతిం బూజించి ప్రాణరక్షకు లగు వేంక టేశ్వర ప్ర భృతు లొసంగిన యుపహారమునుం గొని జనకునిం జూడంగోరి కూరుచుండి తన ప్రియజనని కిట్లు లేఖ వ్రాసెను.

"ప్రియజననీ! రాత్రి, యేమచ్చుమండుశ క్తివలననో విస్తృతనై పడియుండి యీ కాళికాలయమున మేల్కొలుపం బడితిని. పాతాళుని కరవాలమునకు బలినౌదునని నిశ్చ యించుకొని మిమ్ములను గష్ట పెట్టుదాన నైతిఁ గదా యని దుఃఖించుచు నవకాశ మొసఁగఁబడదని యాదురాత్ముండు హెచ్చ రించినందున నాతనిం బెండ్లియాడుటకంటె దేవీసాన్ని ధ్యమున మరణించి మరల మీకుఁ బుత్రికనై పుట్టుటయే సముచితమని తలంచి ధ్యాననిష్ఠ. నుంటిని. తమ యాశీర్వచనమ హత్త్వ మెట్టిదో యీ శ్యామసుందరాదులు సలువురు శస్త్రపాణులై వచ్చి యా క్రూరుని బంధించి నన్ను గాపాడిరి. వీరియప్పును దీర్చుకొనుట కొక్క జన్మము చాలదు. నన్ను సోదరికంటే నెక్కుడు గారవించుచు నిద్ర లేక కాపాడుచున్న వారు. ఉషహార మిచ్చివి. ఈ రీలేఖయందఁగనే యనంతాచలశర్మను బిలువం బంపి సపర్యలం దన్పుఁడు. ఆమహాత్తునిశిష్యు లే యీ నలువు రట. వారు పంపఁగా వచ్చి కాచియుండినఁట. జనకులు రాఁగా నేను వచ్చి మీము దర్శించెద, దేవికి నైవేద్యము కాఁగా నాకు భోజనము పెట్టుదురు. మీ రించు కంతయుఁ జింతింపకుఁడు. నన్నుం జూడఁగలరు. నేనును మిమ్ము సేవింప నువ్విళ్లూరు చున్న దాన. ఇపుడింతకంటే విశేషించి తెలుపుదగు వార్తలు లేవు. భయముమాని యుండవలయును.

ఇట్లని విన్న వించు మీ ప్రియ పుత్రిక రాధిక. కృష్ణాష్టమి స్థిరవారము.”

ఈ లేఖను గైకొని యాశ్వికు లరిగి యిందిరా దేవి కిచ్చిరి. ప్రియకుమారికా హస్తాక్షరములం దిలకించిన యిందిరాదేవి సమ్మోదమునువర్ణింప నెవ్వకి కేఁ దరంబే! ఆమె మరలమరలఁ జదు వుచుఁ దమవారి కెల్ల వినిపించుచుఁ గొంత కాల మాయా మోద మునఁ బ్రోద్దెంతయెక్కి నదియు నెఱుంగకుండెను. మధ్యాహ్న మైనది. భుజింపవలయునని యెందఱో ప్రార్థించిరి, జలపానమే భోజనమని బదులు చెప్పి యిందిరా దేవి యూరకుండెను. రాధిక వ్రాసినపత్రికయే యామె కానాడు ప్రొద్దుపోవఁ జేయుచుండెను. నగరవాసులంద ఱానాఁడు శ్రీనివాసదాసగృహముననే యుం డిరి. వచ్చువారికిఁ బోవువారికి విరామము లేకయుం డెను. వారితో సంభాషించుటచే నిందిరా దేవి బ్రదుకఁజా లేనుగాని లేక యున్న నీలో కమును వీడి యే యుండును.

సూర్యాస్తమయమునకు ముందే శ్రీనివాసదాసు విలాస ధామమును జేరెను కొంతదూరముననే "కాహళుఁడు వేచి యుండెను గాన దర్శించి రాధికా కుశలవార్తను దెల్పెను. వానిం గూడి యావార్తలనే యాలకించుచు నగరమును జేరి యెడ నెడఁ బెద్దలూ ఱడింపఁగా నించుక చింతించుచు ధైర్యము తెచ్చుకొనుచు గృహముఁ జేరెను. లోపలికింజని యిందిరా దేవిం గనుఁగొనియె. కూరుచుండియున్న యిందిర లేవఁబోయి రాధికా యని యట్టే కూలఁబడియెను. ఆ మెంగాంచి శ్రీనివాస దాసును మూర్ఛిల్లెను. ఎన్ని యో యుపచారము లొనరింప నించుక తెలివిగల్లి కూరుచుండెను. ఇందిర నూఱడింపుఁడని యందఱు హెచ్చరించిరి. ఆ పెను లేవనెత్తి వీపు నిమురుచు నీశ్వరుఁ డను గ్రహించెను. దుఃఖంపకుము. రాధికం గొనివచ్చెద. ఊఱడిల్లుమని పలుమాఱులు హెచ్చరించెను. ఆమె మాట! లాడఁజాలక రాధి కాకరాక్ష రవిలసత్పత్రిక నొసం గెను. దానిం జదువుకోనుచు దీనాననుండగుచు నశ్రూదకముల నాపత్రి కను దడుపుచుఁ గొంత సేపుండి యించుక యూఱడిల్లి శ్యామసుంద రాదుల యుపకారమునకుఁ బారము లేదని కొనియాడుచు ననం తాచలశర్మ గారి పట్టుదలకుఁ బరమానందము నొందుచు నిఁక భరతపురమున కరుగు ప్రయత్న మొనర్పుమని కాహళునకుం దెల్పెను.

అంత రక్షకభటాధ్యక్షుఁడు భటులం గూడి వచ్చి, శ్రీనివాసదాసుం గనుంగొని తమయభియోగము విచారింప వచ్చితిమి. భగతపురమున నాకుమారియు నామె నెత్తుకొని పోయిన దుష్టుఁడు నున్న యట్లు కనుఁగొంటిమి. మేమిపుడే పోవుచున్న వారము. ప్రయాణోచిత ప్రయత్న ముం జేసి, మమ్ము సాగనంపుఁడు అన దాసు మీ రచ్చటి కేగి యేమి చేయ నూహించితిరో వినఁగో రెదనని ప్రార్థించెను. 'మే ముచ్చ టికింబోయి యాదుష్టుని బంధించి మీకుమారికను దీసికొని మా కార్యస్థానమునకుం బోయి విచారింతుము అని బదులు. ________________

నీతిరత్నాకరము వచ్చెను. మీకంటే ముందే దుష్టుఁడగుపాతాళుని బంధించి యుంచినారు. మీకాశ్రమముకూడ నక్కఱ లేదు. మేమే వానిని దెచ్చి మీ కార్యాలయమున నప్పగింతుము తమరు సుఖంబుండుఁ డని దాసు విన్నవించెను. ఆయధ్యక్షుఁడు మండిపడి వానిం గట్టివేయునధికార మితరులకు లేదు. మీవా రెట్లు బంధించిరో విచారింపవలయునని కఠినవాక్కులం బలికెను. దొంగ పాఱిపోవు చుండఁ జూచిన వాఁ డేమి చేయవలయునో యెఱుంగఁ గో రెదనని దాసు ప్రశ్నింప నపుడే వచ్చి మాకుం 'దెలుప వలయును.

దాసు..ఆమీఁద మీ రేమిచేయుదురు?

అధ్య-వాని వెంటఁగొని భటులు చోరుఁ బట్టఁబోయెదరు ?

దాసు-వాఁ డగవడు టెట్లు ?

అధ్య— వానిం జూపునట్టిపని యాతనిదే

దాసు-వాఁ డీలోపల నాద్రవ్యమును బాడు చేసిన నిది మాదని గుఱుతించుటెట్లు ?

అధ్య- వాని వెంటఁ గొందఱు పోవలయు. ఆవస్తువులను వాఁడేమీ చేయకయుండఁ గాపాడుచుండి మాకుం జూపవలయు.

దాసు- ఈదినము దొంగలు వత్తుగని తెలిసికొని మనుష్యులను సిద్ధముగా నుంచుకొని కొందఱిని వారి వెంటఁ బంపి కొందఱు మీతావునకు 'రావలయునా? అంతియ కాక తెలిసియున్న నూరకయుండి వారు కన్నము పెట్టి లోప లికివచ్చి వస్తువుల నపహరించి కొనిపోవఁ బ్రయత్నిం ________________

ఐదవ వీచిక. చిన దనుక నూరక యుండి యపుడుకదా తమదర్శనమునకు రావలయును ఇది మంచిన్యాయమార్గ మే.

అనుచుండునంత నగరాధిపతి దాసు రాక విని యచటి కరు చెంచెను, వారి రాక నెఱింగి రక్షకభటాధ్యక్షుఁడు కాలికి బుద్ధి చెప్పెను.

నగరాధిపతి దాసునూఱడించి యిట్టి యకార్యము మన నగరమున నీవఱకు సాగ లేదనియు, నిది యచ్చెరువును గల్గించు చున్న దనియు, నీశ్వరాసు గ్రహమునఁ దమపుత్తికకు నించుకయు నాపదగలుగకుండ నాపర మేశ్వరుఁడే కాపాడెననియుఁ దెలిపి మీయనుమతియైనచో నాదుష్టుని మాస్వాధీనము చేసికొని విచారింతుమనియు, మర్యాద నతిక్రమింపక మీ యింటికి వచ్చి ' రాధిక నడుగుదుమనియు, నిపుడు పాపమని వదలిన నిట్టివాం డ్రింక నెందఱకో మార్గమును జూపించువా రగుదురనియు, నది నగర మునకే యపకీర్తిని హానిని దెచ్చుననియు, మంచిమాటలఁ దెలిపెను. దాసు నేనిపుడు పోయి వానిం జూచి తమకుఁ దెలు పుదుననియె నగరాధిపతి దాసుగారూ! నాయీమాట నాల కింపుఁడు. మీరిపు డచ్చటికిం బోవుటుచితము కాదు. ఆదురా త్ముని జూడఁగ నే మీకుఁ బట్టశక్యముగాని యాగ్రహము పొడ సూపును. ఏమిసొగినను ముందు మీ ప్రఖ్యాతి కయ్యది మచ్చవంటిదగును. నామాటం బాటించి మీరు పోవుటుడిగి కుమారికను బిలువనంపుఁడు. అచ్చటి తక్కిన కృత్యములు మాయధీనములుగ నొనరింపుఁడని సమర్యాదగాఁ బలి కెను. దా సాపలుకులను మన్నించి తమ భావమునే యనుసరింతునని విన్న వించెను. ________________

80 నీతిరత్నాకరము ఆ యుత్తరక్షణమున నగరాధిపతి భరతపురము సకుఁ బరిజనులతో బయలు వెడలెను కాహళుఁ డు త్తమశిబికం గోనిపోయెను కొలఁదిమూరుతముల కాదేవాలయముకడం జేరిరి. నగ రాధిపతి యచ్చటికిం బోయి కన్నియ నాశ్వాసించి యాహా రాదుల నిచ్చితిరా యని యడిగి వేంక టేశ్వర ప్రభృ తుల మెచ్చుకొనుచు వారజ్మాలాచారమును నడపి పాతా ళుని మంచిమాటలతో నిజము పల్కుము లేనున్న నిహపన ములకుం జెడుదువని హెచ్చరించెను. తనదుష్ప్రయత్నము దైవవశమునం దాఱుమాఱగుటకుం జింతిల్లి నిజము చెప్ప కున్న మఱింత యాగ్రహ మాయధి కారికిం గల్గునని యూ హించి బుద్ధి లేక యిట్లు చేసితినని తన ప్రయత్న మెల్ల నెఱింగిం చెను కుంతలుఁడు తనయవివేకము నొప్పుకొనియెను. బంధింపఁ బడిన యా యిరువురు వ్యాధులును దమపనియంతయుఁ దెలిసి శరణువేఁడిరి తక్కినయేడుగురను బట్టుకొన భటుల కాజ్ఞాపించిన వారు బద్దులగు నిరువురను దోడుకొనిపోయిరి, ఉత్తమ శిబిక రాఁగా 'రాధిక నం దెక్కంబంచి పరివారమును దనభటు లను గూడనిచ్చి వేంక టేశ్వరాదులను నగరమునకుఁ బోవ సెల విచ్చి యర్చకులవలన వాజూ లరూపసారాశమును దీసికొని వారిని నగరమునకు రమ్మని ముందు తెలుపుదుమని చెప్పి తనపనియంతయుఁ దీర్చుకొని భరతపురాధికారి 'కాదేవాలయమున రాత్రి యందుఁ బరీక్షించు నధికార మొసంగి విలాస ధామము నకుఁ బయన మయ్యెను.

రాధిక సిగ్గుచేఁ దల వంచుకొని దై వచేష్టితములను విచా రించుచు మానవ ప్రయత్న మల్పతరమని యూహించుచు ________________

ఐదవ వీచిక. నీగండముతప్పుట కాభగవతియను గృహమే కారణమని నమ్ముచుఁ దలిదండ్రులఁ జూడ నాతురంపడుచుఁ బోయెను. శిబిక నతిజవ మునఁ గొనిపోయిరి. తోలి జాము దాఁటకుండ నగరమును జేరిరి. మందిర ద్వారముననే శ్రీనివాసదాసు సభార్యుఁడై కాచియుండెను. శిబిక దింపఁగా నమ్మా యని పిల్చుచు నాదంపతు లట్లే మూర్చిల్లిరి. రాధిక యేమో పలుకఁబోయి మాటరాక యట్టె లేచి వారలపై ఁ బడి విస్తృతిఁ గాంచెను. పెద్ద లెల్ల వారికి నుపచారములుచేసి యెట్లో తెప్పిఱిల్లఁ జేసిరి. అతికష్టముమీఁద నింటిలోనికి నెల్లరఁ జేర్పఁగలిగిరి. ఆదంపతుల విలాపము రాధిక వ్యాకులపాటు పాషాణ హృదయుల కైన జాలిని బుట్టింపక మానదు. రెండవజాము దాఁటకుండ నందఱు పెద్దలు వారి నూఱడించి యిందిర యుపవాసమును దెలిపి యెట్లో భుజింపఁ జేసిరి రక్షకు లెల్ల గృహము నప్రమత్తులై కాచుచుండ వారు శయనించిరి రాధికను వదలక యిందిర శయనించి ప్రాణముల నిలుపుకొనఁగ ల్లెను.

మఱుదిన మనంతాచలశర్త గారిని బిలువంబంచి శ్రీనివాసదాసు శ్రద్ధాభక్తులు వెలయ బహుమానించెను. పుత్రి కాభిక్షము పెట్టిన మహత్తులు తమ రే యని కొనియాడెను. మీఋణ మెన్ని జన్మ ములకైనఁ దీఱదని విన్న వించెను. తమరీ సాయము చేయఁగల్గు టెట్లో తెలుపుఁడని ప్రార్థించెను. నగ రాధిపతియు నం దుండెను. శర్మయుఁ బూస గ్రుచ్చినట్లు మొదటి నుండి కొసవఱకుఁ దెలిపెను. ఎల్లరు నాశ్చర్యంపడిరి. సహజ వాత్సల్యము గల యాపండితుని గొనియాడిరి. నగరాధిపతి పాతాళుని యకృత్యమునకు వెఱఁగంది యనంతాచలశర్మ ________________

92 నీతిరత్నాకరము నుండి వాజూలపుఁ బద్దతి నిర్వహించెను. మరలఁ బిలుపింతు మనియు నాఁటికి రాజకీయ న్యాయస్థానమునకు రావలయు ననియు. దెలిపెను. రాధికయు నిందిరా దేవియుఁ దమయిడు మలఁ దలంచుకొనుచు నీగండము తప్పించిన “భగవతి యను విశ్వాసమున నూఱడిల్లిరి. ఈవార్త క్రమక్రమముగా జాలం ధరముదనుకఁ బ్రాఁకెను.

శ్రీనివాసదాసు పయనము సాగించినదినమే రామదాసు శ్రీవత్సాంకదాసుతో మాటలాడుచు రాధిక కొక్క కష్టము వచ్చుననియు, నది విచిత్ర రీతిగాఁ దప్పుననియు నాయాపదచే నా మేవిఖ్యాతి లోకమున వ్యాపించుననియు నామె కోడలు గాఁగలభాగ్యము నీయదృష్టమునఁ గలుగఁగలదనియుఁ ద్వరగా విలాస ధామమున కరుగవలసియుండుననియు నీవిషయ మితరులకుఁ దెలుపవలదనియుఁ దెల్పెను. "రామదాసు యోగ దృష్టిగల మహాత్ముఁడని శ్రీవత్సాంకదాసు నమ్మి యున్న వాఁడు గనుక నావాక్యములు తప్పక ఫలించుననియు నేవిధమగు కష్టము గల్గునోయనియు విచారించుచుండెను. ఆమూఁడవ దినమే యీవార్త యించుక మార్పుతోఁ దెలియవచ్చెను. పిడుగుపాటువంటి యావార్త విని భార్యయుఁ గుమారుఁడును విచారింపసాగిరి శ్రీవత్సాంకదాసు మాత్రము వారి నూఱడిల్లఁ జేసి తాను బ్రయాణమై రామదాసుంగూడి విలాసధామము నకుఁ బోయెను. పయనముచేయునపుడు భార్యతో వివాహ ప్రయత్నములు క్రమముగా సాగించుచుండుమనియు నీవార్త నాకింతకుముందే తెలియుననియుఁ దప్పక 'రాధిక మనకుఁ గోడలగుననియు ద్విగుణితోత్సాహమునఁ బనులు సాగింపు ________________

ఐదవ వీచిక. మనియుఁ దెల్పి పోయెను. రెండవదినమే శ్రీనివాసదాసుం జూచెను. అతఁ డించుక లజ్జించి యట్టె మోమువంచెను. రామదా సాతని నాణ్యాసించెను. అతఁ డంతట లేచి యెల్లవారును విను చుండ రామదాసుగారు తనతో నా రాత్రి తెల్పిన గూఢార్థము గలమాటలం దెల్పి వారిమహత్త్వమును గొనియాడెను. ఎల్లరు నచ్చెరు వుపడిరి. శ్రీవత్సాంకదాసును దనకా మఱుదినము తెల్పినవార్తలం దెల్పెను. ఎల్ల వారు విని కష్టములు గట్టెక్కినవి. కావున నిఁక శుభప్రయత్నము సాగింపవచ్చుననిరి. “శుభస్య శీఘ్హ్ర"మ్మను న్యాయము ననుసరించుటయే మేలని రామదాసు చెప్పెను. పెద్దలందఱు “తథా స్త”నిరి.

ఆదినము మఱుదినము రామదాసుంగూడి శ్రీవత్సాం కదా సందే యుండి రాధికకుఁ గల విద్యాపాండిత్యము కలా కౌశలముఁ బరికించి తనదే భాగ్యమని పరమానందభరితుఁ డయ్యెను. ఆ మెశీలము నెల్లరుం బొగడుట వినఁబడినపు డాతని యానందపారవశ్యమునకుఁ బారము లేక యుండెను. ఇట్లు రాధి కాశీలవిద్యా వైశద్యములు వారి యింటి మర్యాదలు కాంచి తగినసంబంధమును బరమేశ్వరుఁడు రామదాసరూపమున నను గ్రహిం చెనని తలంచుచుఁ బ్రయాణముచేయ ననుమతి వేఁడ శ్రీనివాసదాసు మహాత్ముల రాక మాభాగ్యమున మీమూలమునఁ గల్గినది. కావున నిక సుముహూర్తము నిశ్చయము చేసికొని పొమ్మని యభ్యర్థింప నాదినము నిలి చెను, అభియోగవిచారణ మెప్పుడో తెలియనందున నద్దాని కాయది యడ్డుగానుండ రాదని యెల్లరభావమైనందున జాలంధర పురము నుండియే రామదాసుగారివలన నిశ్చయింపఁబడిన ముహూర్తము ________________ నీతిరత్నాకరము తెలుపుఁడనియు దానిని మే మంగీకరింతుమనియు నీయభి యోగము తీర్మానిఁపబడిన వెంటనే తమకుం దెలుపుదుమనియుఁ బార్ధించి శ్రీవత్సాంకదాసును గురువర్యులగు రామదాసు గారిని బ్రయాణముచేయ సమ్మతించెను. వారును జాలంధర పురమున కరిగిరి.

నగరాధ్యక్షుఁడు విచారించుదిన మిదియని నిర్ణయించి తెలిపెను. ఆనాడు శిబికను మోసికొనిపోయిన యేడుగురు వ్యాధులును జిక్కరి వారిని జెఱసాలయం దుంచిరి. భరత పురమునుండి యర్చకులకు మణికొందఱకు నాహ్వానపత్రిక లంపఁబడియెను. ఎల్లరు రాజకీయ మందిరమునఁ గూడిరి. రాధి కయు నిందిరా దేవియు దాసికలును బోవవలసివచ్చెను. ఇందిరా రాధికలు శిబిక నెక్కి వెళ్లిరి వారికొకగది నిర్ణయింపబడియుండెను. వారి యనుచరీబృంచము కూడ నందే యుండ నాజ్ఞ యయ్యెను. నగరాధిపతి తనపీఠము నధిష్టించెను. నగర మునఁ గల పెద్దలు వెక్కండ్రందుఁ జేరిరి. రక్షకభటాద్యక్షుఁడు తనయుద్యోగులతోడ భయంకరాకారమున నరు దెం చెను. విమర్శకు లుచితపీఠముల గూరుచుండిరి. దోషులు పాతాళుఁడు కుంతలుఁడు తొమ్మండుగురు వ్యాధులు నిగళ బద్దులై నిలుపఁబడిరి. వారి యిరుపార్శ్వములయందుఁ దళతళ లాడు నసీపు త్రికలంబూనిన రక్షకభటులు నిలిచియుండిరి. పాతాళ కుంతలులు తలలెత్తక వంచియుండిరి.

న్యాయ విమర్శము.

నగరాధిపతి యొక యుద్యోగిని బిల్చి దోషుల చెంత నిలుచుండి 'నాపల్కుమాటల వారికిం జెప్పుమని పంప నాతఁడు ________________

ఐదవ వీచిక. వాలికడ నిలుచుండెను. దోషులారా! మీరు సప్తమీశుక్ర వారమున రాధికను గుటిలమార్గమున నెత్తుకొనిపోయినట్లు, భరతపుర కాళికాలయమున నామెను బలవంతపఱచి పాతా ళుఁడు పెండ్లి చేసికోనఁబూనఁగాఁ గుంతలుఁడు పురోహితత్వము నడుప సిద్ధముగా నుండ నీశ్వరాను గ్రహమున వేంక టేశ్వ రాదులు నల్వురు వచ్చినట్లు, పాతాళుడు వివాహమున కంగీక రింపని రాధికను వధింపఁబూనినట్లు, వేంక టేశ్వరాదులు వారించి మిమ్ములఁ గట్టివై చినట్లుగా నభియోగము చేయఁబడినది. వా రభియోగమునఁ జెప్పియున్న యట్లు మీరెల్ల నందుఁ గట్టి వేయఁబడియే యుంటిరి. ఖడ్గము కొన్ని మూలికలు కొన్ని కాటుకలు నీసంచియందుఁ గలవని స్పష్టపడుచున్న యవి. ఈ "కారణములవలన మీరు దుష్కృత్యము చేసితిరని నమ్మవలసి యున్న యది. దీని కెల్ల మీ ప్రతివాదము తెలుపవలయును. ప్రతివాదము సత్య సమ్మత మైన యెడల మీకు నిర్దోషు లనఁ బడుదురు. లేనిచో సదోషు లనఁబడుదురు. అభియోగము సత్యసమ్మతమని మీ వాదమునుబట్టియు దృఢపడు నేని మీరు శిక్షా పాత్రులగుదురు. కావున మీరు యథార్థమగు ప్రతివాద మును దెల్పుఁడని యెఱింగించెను.

పాతాళుఁడు తనవాదము ని ట్లెఱింగించెను. న్యాయ మూర్తీ! అనంతాచలశాస్త్రి గారికి నాకు సహజవిరోధము. అపుడపుడు మంచినీళ్ల బావికి మాతల్లి యుండిన కాలమున నీళ్లకుఁ బోవుచుండెడిది. వారిభార్యయు నచ్చటికి వచ్చునంట. ఏదో యొక హేతువునుబట్టి కలహించుకొనిరఁట. నన్నేట్టు లైనఁ గారాగృహమునకు, బంపునుపాయము చేయుదునని ________________

నీతిరత్నాకరము యా మెమగఁడు పంతము పట్టెను. అపుడపుడు నన్నా మాట చే దూలనాడువాఁడు. ఇది యేగాక మఱియొకవిరోధము కలదు. ఆతనికడకుం బోయి భూతచికిత్స చేయించుకొనువారలు కోందఱట నుపయోగము లేమి నాకడకు వచ్చిరి. వారి కీవలసిన ద్రవ్యము లాభము లేదని యీయకుండుట కల దని వింటిని. 'నాకడ వారికి మేలు గలుగును తన ద్రవ్యము నేను బోఁగొట్టితినని నా పై నాయనకసూయ. శిష్యుల మూలమున నీపని చేయించేను. నేను భరతపుర దేవాలయమునకు బలుసారులు పోవుచుందును. ఆకాళికాదేవి మా యిలువేల్పు. ఆర్చకులు నన్నెఱుఁగుదురు. ఆనాడు నేను శుక్ర వారపూజకోఱకుఁ బోయియుండఁగా నన్ను గట్టివై చిరి. రాధికను బిలుచుకొనివచ్చినది వారే. అనంతాచలశర్మకు శ్రీని వాసదాసునకు మిక్కిలి సావాసము వారేమి మాటలాడి కొని యీ కార్యము చేసిరో భగవంతునకే యెఱుక, ఈఖడ్గము గాని యీమూలికాదులుగాని నావి కావు. ఇంతకంటే నే నేమియు నెఱుంగను. న్యాయమును బరిశీలించి నావాదమునఁ గలసత్యమును జిత్తగించి తమ చిత్రానుసారము చేయుఁడు. కడుంగడు బీదవాఁడను. మానవులసాయము నాకేమాత్రము లేదు. సత్యమునే నమ్మియున్నా ఁడనని తనవాదమును ముగిం చెను.

కుంతలుఁడు తన ప్రతివాదము నిట్లు సాగించెను. భరత పురమునఁ గొన్ని వివాహములు చేయింపఁ బోయియుంటిని. శుక్రవారము కదాయని నృసింహస్వామి దర్శనమునకుఁ బోయితిని. వివాహములు చేయించి దేవాలయమునకు వధూవరులం. ________________

ఐదవ వీచిక. బిలుచుకొని పోవునప్పటికే పొద్దుపోయెను. అర్చకులు తలుపులు వేసిపోయిరని యెవరో తెల్పినందునఁ బెండ్లి వారు మరలి పోయిరి. కొంతదూరము వచ్చితిని గదా ప్రదక్షిణము చేసియైనఁ బోవుదమని పోవఁగా ద్వారములు మూయఁబడక యుండెను. సంతసించి లోపలికింబోయి ప్రదక్షిణము చేసి నర సింహమూర్తి దర్శనము చేయఁ బోవఁగనే నన్ను నీ వేంక టేశ్వరాదులు కట్టివై చిరి. వివాహార్దమై దర్భలు తీసికొనిపోవుట పురోహితులయల వాటు. దర్భలు లేకయున్న శుభకార్యములు సాగవు. నన్ను గట్టి వేయునపు డిదియేమన్యాయమయ్యా యని యడిగితిని. వేంక టేశ్వరులు మనకుఁ దగినవాఁడు దొర కేనని కట్టివేయుఁ డనెను. ఇదియే నావాదము. సత్యమును 'బాలింపఁ బార్ధించెదనని కుంతలుఁ దూరకయుం డెను. తక్కిన 'వారు తొమ్మండ్రు తోఁచిన ట్ల సంగతముగా మాటలాడిరి.

రాధికను బిలిచి మర్యాద ననుసరించి కూరుచుండం బనిచి యభియోగమును వినిపించి యింక నేమైనఁ జెప్పవలసినది కలదా యని ప్రశ్నింప లేదనియె. ఆపత్రము నీచే వ్రాయబడి నదా యనియడుగ నౌననిపలికెను. ఈకన్నియనేమైనఁ బ్రశ్నింప వలయునేని యా ప్రశ్నముల మాకుం దెల్పిన మే మడుగుదు మని న్యాయమూర్తి పలుకఁ బాతాళు నిబంధు ఏకపండితుఁడు వచ్చి యసందర్భముగా నేమేమో ప్రశ్నింపఁగా నవి ప్రకృతోప యుక్తములు కావని తిరస్కరింపఁబడియెను. - అర్చకు లిరువురును డగ్గుత్తికలఁ దమ రాచరించినపని యంతయు నున్న దున్నట్లు చెప్పిరిగాని రాధికనుగుణించి ________________

88 నీతీరత్నాకరము పాతాళుఁడు చెప్పినది దాఁచిరి. పెండ్లి యన్న మేమా యాలయమున నుంటిమనియు, జననీజనకు లేల రాలేదని ప్రశ్నించితి మనియు, నింతలో వేంక టేశాదులు వచ్చిరనియుఁ దెల్సిరి. అనంతాచలశర్త తనకుఁ దెలిసిన విషయము తెలుపుచు సుంత యు దాఁపక సవిస్తరముగాఁ దెల్పెను. వేంకటేశ్వరాదులు గురునానతియుఁ దమరచట దాఁగియుండుటయు సమయమున నాలసింపక పై ఁబడి వానిని గుంతలుని బట్టుకొనుటయును దెలిపి వెంటనే భరతపురమునకుం బోయి పెద్దలకుఁ దెలుపు టయు వారు సాయపడుటయు లోనగు తమకృత్వములఁ దెలిపిరి. విచారింపఁదగిన వారెల్ల విచారింపఁబడిరి. రెండుదిన ములు నిరంతరముగా విమర్శించి యామఱు దినము తీర్పు చెప్పుదుమని న్యాయమూర్తు లనిరి. ఎల్లవారు నిండ్లకుం బోయిరి.

మఱుదినము న్యాయస్థానము మనుజులచేఁ గ్రిక్కిఱిసి యుండెను. ఎపుడు న్యాయమూర్తు లను దెంతురో ఏమి తీర్పు చెప్పుదురో యరయుదమని 'వేచియుండిరి, వీరి తొందఱపా టుచే మఱింత యాలస్యము న్యాయమూర్తి చేయుచున్నయట్లు తోఁచెను. యథావిధిగా న్యాయాధిపతి యరు దెంచెను. సింహపీఠిక నలంకరించెను. శ్రీనివాసదాసు 'రాధికయుఁ బోయిరి. రాధిక యథాపూర్వస్థలమున సపరిచారికయై యుండెను. పండితు లెల్ల న్యాయాధిపతి కెదుటనే కూరుచుండిరి. అంతట నుత్తమాధికారి తీర్పు నిట్లు చదివెను.

“ ఈయభియోగమున న్యాయపరిశీలస మంత దుర్బే ద్యము కాదు, ఇట్టి వ్యవహార మెన్నఁడు వినలేదు. పాతా ________________

ఐదవ వీచిక. ళుఁడు దోషి యే యని యాతని వాజూలమునుబట్టి కూడ నూహింపనచ్చును. ఆనంతాచలశర్మ గారిసాక్ష్య మిందుఁ బ్రథానము. వేంక టేశ్వరాదులు ప్రత్యక్షముగాఁ బాతాళుని దుండగములఁ బరిశీలించినవారు. వీరిసాక్ష్యము నమ్మక పోవుటకు హేతు వగపడదు. ఇంతకంటే సాక్ష్యముత్తమము లోకముననే యుండదు. భరతపురమునఁ గొందఱు పెద్దమను ష్యుల విచారించితిని. ఈష త్తేని భేదము లేక సాగినది సాగి నట్లే చెప్పిరి. 'కావున నభియోగపక్ష మునఁ దృప్తీకరముగా విషయము నిర్ధారణము చేయఁబడినది. ఇఁకఁ బ్రత్యభియోగ పక్షమునుగుఱించి తర్కించెదను. పాతాళుఁ డనంతాచలశర్మ గారితోఁ దనకు విరోధము గలిగెననియు, వారిశిష్యులగువేంక టేశ్వరాదు లీపన్నా గమును బన్ని రనియుఁ దెల్పిన కారణము లే యాతని నింద్యునిగఁ జేయుచున్నవి ఏలనఁ గారణములన్నియు దుర్బలములు. కేవలకల్పితములు దుష్ట కార్య జనకములు. పాతాళునికడ నున్న కాటుకలు మూలికలు పరీ క్షింపఁగాఁ బరాపకార మొనరింపఁదగియున్నవి. కుంతలుని కడ మంగళసూ త్రాది వివాహోచితపదార్దములు కలవు. ఆ నాఁడు భరతపురమున వివాహము లే సాగ లేదని యెల్ల వారుఁ దెల్పిరి. కావున వీరిరువురు నాలో చించుకొనియే యీదురంత కృత్యమును జేసిరని నమ్మవలసియే యున్నది.

ఈకార్యములు సామాన్యములు కావు. ఒక్క కన్యను నిగ్బంధ పెట్టి యామెయావజ్జీవము దుఃఖపడునట్లు చేయుటయు, నంగీకరింపక యున్న వధింపఁ బూనుటయు సనునవి దుష్కార్యము లనఁదగియున్నవి. ఈ రెండుపను లీయదనున సాగెను. రాత్రి ________________

నీతిరత్నాకరము కాలమునఁ బరునియింటఁ జొచ్చి కృత్రి మోపాయముల నొక స్త్రీని గొనిపోవుటయుఁ బై వానికి సమానమగు దుష్కార్యము. ఈమూఁ డపరాధముల నొనరించి పాతాళుడు పశమనింద్యుఁ డయ్యెను.

కర్తా కారయితా చైవ ప్రేరకశ్చాను మోదకః,
సుకృతే దుష్కృతే చైవ చత్వారస్సమభాగినః.

అను ప్రమాణము ననుసరించి కుంతలుఁడు పాతాళు నకు సమానుఁడే యనవలసియున్నది. కాని కుంతలుఁడు పాతాళునిచే నీ కార్యము చేయించినట్లు, చేయఁ బురికొలిపి నట్లు మాత్రము తేల లేదు. కానఁ బాతాళుని కార్యము. నామోదించినట్లు, విశేషించి తోడ్పడినట్లు, నిశ్చయింప వలయు. నే నట్టియభిప్రాయమునకే వచ్చియున్నా ఁడను. ఈవిచారణమును దైవము నెదుట నునుచుకొని పక్షపాతమూనకయే సాగించితిని. ఏవిషయమునను బాతాళుని గుంతలుని క్షమించుటకు లేశ మైన నవ కాశము దొరకదయ్యెను. ప్రథమాప రాధమని కరుణ జూపను గూడ నవకాశము లేదు. ఇది యిత గులకు మార్గదర్శకము కూడ నగును. కావున నామనోనిశ్చి తార్థమును న్యాయసాహాయ్యమునఁ దెలుపుచున్నాఁడను. పాతాళుఁ డామరణము కారాగారముననుండి పాటుపడుచుండ వలసినట్లు, కుంతలుఁడు పడిసంవత్సరములు కారాగృహమున నుండి సామాన్య కార్యములయం దాయధి కారుల యుత్త రువు చొప్పునఁ బ్రవర్తించుచుండవలసినట్లు తీర్మానించుచున్న వాఁడను అర్చకులిరువురు దుష్కార్యమును జూచుచున్న యట్లు మాత్రము తేలెను. కావున వారికి ముందే పాతాళుని ________________

ఐదవ వీచిక. దుష్కార్యము తెలిసియుండక తప్పదు. ఆయపరాధమునకై వారొక్క సంవత్సరము సాధారణ కారాగారమున నుండవల యును. తొమ్మండ్రు, వ్యాధులు ద్ర వ్యాశ చే నీదుష్కార్యమునకుఁ దమతోడ్పాడును జూపిరి కావున వారు నాలుగు సంవత్సర ములు చెఱసాలయందుండి కష్టములకు లోనగుచుండవలయును. వెంకటేశ్వర ప్రముఖులు నలువురు నసాధారణసాహసము నెఱపి కన్య కా ప్రాణమును గాపాడి ప్రభుత్వమునకు సాయపడి కీర్తిని దెచ్చిరి. కావున రాజసన్మానార్హు లగుదురు. కావున వారలుసువర్నకంకణములను ప్రభువులనుండి పొందఁగల వారు. అనంతా చలశర్మ గారీ విషయమును దమకుఁ దెలిసినపుడే దొరతనమున కెఱిగింపవలసి యుండెను ఆట్లేల చేయరైరని తొలుత నూహించితిని. అద్దానికంటె నిపుడు సాగించిన మహా కార్యమే సమంజసమని యెన్నఁదగియున్నది. కావున వారు రాజసన్మా నార్హులు. వారికిఁ బ్ర భుత్వమునుండి “యార్త రక్షక " బిరుద మొసఁగఁబడు. ఇట్లు న్యాయాధికారి.. అని వ్రాసిన తన తీర్పును జదివెను.

రక్షకభటులు యమకింకరులం బోలు వారు వారినెల్లఁ గారాగారాదిపతి చెంతకుం బిలుచుకొనిపోవుచుండఁ గుంతలుఁడు కంఠమెత్తి " ప్రారబ్ధకర్మణాం భో గా దేవ క్షయః”అన్న న్యాయము నా కనుభవమున సిద్ధమైనది. వేనుకఁ జింతించుట పెఱ్ఱి తనమని పలు కుచుఁ గూడఁ బోయెను. ఆతీర్పును విని యెల్ల వారు న్యాయాధి కారిబుద్ధాచమత్కృతికి న్యాయపరిశీలనమునకుఁ గడు మెచ్చు కొనిరి. ఇఁక నిట్టిదుష్కార్యములు సాగవని తలంచిరి. పిదపఁ దమ తమయిరవులకుం బోయిరి.


ఆఱవ వీచిక.

“ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచుక్ ధృత్యున్నతో శ్సాహులై ప్రారబ్దార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్' గావున!".”

అని ప్రాచీనోక్తి కలదు. ఆనూ క్తి యే కాలమున నైనను మార్పునొందదనుట నిక్కునము. ఈ ర్యాళువులు సాధువుల మేలున కే కీడు గల్గింపఁ బూనుదురు. ఇది లోకముస సాధారణ ముగా సాగునాచావము. ఈ యాచారమునకు లోబడక యుండువారు లేదన రాదు విరళముగా గలరసవలయు. -ఈయాచారమును బాటించియే "కాఁబోలు పాళు నిబంధు వులు వాని కారాగార ప్ర వేశము మొదలుకొని లేఖల వాసి రారామదాసని కృష్ణదాసని లోనగు పేరులతో శ్రీవత్సాంకదాసు నకుఁ బంపసాగిరి. రాధిక ప్రవర్తనము మంచిక "కాదనియుఁ, బెక్కం డ్రామెకు నే స్తగాండ్రు, కలరనియు, మీవంటిమం"్యద గల కుటుంబముల వా కట్టికన్యకలను గోడండ్రగా గ్రహింప రాదనియు, సౌందర్యమునుబట్టి మీరు మోసపోయినను స్వల్ప కాలమునకే మీమర్యాద యూడిపోవుననియుఁ, దర్వాత విచారించిన లాభము లేదనియుఁ గొంత యాలో చించి ప్రయ త్నించిన మేలనియు, నందు వాయఁబడుచుండెను. రామ దాసు శ్రీనివాసదాసునకు మిత్రుడనియు, మీసంబంధమును