నిర్వచనోత్తరరామాయణము/ప్రథమాశ్వాసము
శ్రీరస్తు
నిర్వచనోత్తర రామాయణము
ప్రథమాశ్వాసము
| 1 |
కృతిప్రశంస
చ. | హరిహరపద్మగర్భులను నాదికవీంద్రుల నూత్నసత్కవీ | 2 |
క. | ఏ నిన్ను మామ యనియెడు, దీనికిఁ దగ నిమ్ము భారతీకన్యక నా | 3 |
సీ. | సకలలోకప్రదీపకుఁ డగుపద్మినీమిత్రవంశమున జన్మించె ననియుఁ | |
తే. | వివిధవిద్యాపరిశ్రమవేది యనియు | 4 |
కృతికర్తృనియమము
ఉ. | భూరివివేకచిత్తులకుఁ బోలు ననం దలఁపన్ దళంబులన్ | |
| పారెడుపల్కులం బడయ నప్పలుకు ల్సరి గ్రుచ్చునట్లుగాఁ | 5 |
చ. | పలుకులపొందు లేక రసభంగము సేయుచుఁ బ్రాఁతవడ్డమా | 6 |
క. | తెలుఁగుకవిత్వము చెప్పం, దలఁచినకవి యర్థమునకుఁ దగియుండెడుమా | 7 |
క. | అలవడ సంస్కృతశబ్దము, తెలుఁగుబడి విశేషణంబు తేటపడంగాఁ | 8 |
తే. | ఎట్టికవికైనఁ దనకృతి యింపుఁ బెంపఁ, జాలుఁగావునఁ గావ్యంబు సరసులైన | 9 |
క. | అని సత్కవీంద్రమార్గము, మనమున నెలకొల్పి సరసమధురవచోగుం | 10 |
క. | ఎత్తఱి నైనను ధీరో, దాత్తనృపోత్తముఁడు రామధరణీపతి స | 11 |
తే. | సారకవితాభిరాము గుంటూరివిభుని, మంత్రిభాస్కరు మత్పితామహునిఁ దలఁచి | 12 |
మ. | అమలోదాత్తమనీష నే నుభయకావ్యప్రౌఢిఁ బాటించుశి | 13 |
ఉ. | జాత్యము గామి నొ ప్పయిన సంస్కృత మెయ్యెడఁ జొన్ప వాక్యసాం | 14 |
క. | వచనము లేకయు వర్ణన, రచియింపఁగఁ గొంత వచ్చుఁ బ్రౌఢులకుఁ గథా | 15 |
క. | లలితపదహృద్యపద్యం, బులన కథార్థంబు ఘటితపూర్వాపర మై | 16 |
కృతినాయకవంశావతారము
క. | ఈకృతికిఁ దొడవుగా నమ, రాకృతి యగుమనుమనరవరాగ్రేసరుస | 17 |
ఉ. | అంబుజనాభునాభి నుదయం బయి వేధ మరిచిఁ గాంచె లో | 18 |
క | ఆతనికి సకలలోక, ఖ్యాతుఁడు మను వుద్భవించి యనవద్యమతిం | 19 |
శా. | లోకాలోకతటీవిహారకలనాలోలద్యశస్సింహుఁ డ | 20 |
క. | ఆయిక్ష్వాకుకులంబున, సాయంతనసప్తజిహ్వసాదృశ్యశ్రీ | 21 |
మ. | మఘవిద్యాప్రియుఁ డై దివౌకసుల సమ్మానించుఁ బ్రత్యర్థిబా | 22 |
క. | ఆరఘువంశంబున వి, స్తారయశోధనుఁడు విమలచరితుఁడు బుధని | 23 |
మ. | మునిలోకంబు ప్రశంస సేయ జగముల్ మోదంబు నొందంగ దు | 24 |
క. | పిదపఁ గలికాలచోళుం, డుదయంబై జలధిపరిమితోర్వీవలయం | 25 |
శా. | చేసేఁతం బృథివీశు లందుకొనఁ గాశీసింధుతోయంబులం | 26 |
చ. | అతనికులంబునం దవనతారి యుగాంతకృతాంతమూర్తి య | 27 |
చ. | పరుషపరాక్రముం డగుచుఁ బల్లవువీట నుదగ్రు లైనప | 28 |
క. | తద్వంశంబునఁ బోషిత, విద్వజ్జనుఁ డహితభుజగవిహగేంద్రుఁడు ధ | 29 |
సీ. | భూరిప్రతాపంబు వైరిమదాంధకారమున కఖండదీపముగఁ జేసి | |
ఆ. | సుందరీజనంబు డెందంబునకుఁ దన, నిరుపమాన మైన నేర్పుకలిమి | 30 |
క. | ఆమన్మసిద్ధిసుతుఁ డా, శామండలశాసనుండు సదయాకృతి సం | 31 |
ఉ. | కేశవసన్నిభుండు పరిగీతయశోనిధి చోళతిక్కధా | 32 |
సీ. | లకుమయ గురుములూరికి నెత్తి వచ్చినఁ గొనఁడె యాహవమున ఘోటకముల | |
తే. | రాయగండగోపాలు నరాతిభయద, రాయపెండారబిరుదాభిరాము నుభయ | 33 |
మ. | కమలాప్తప్రతిమానమూర్తి యగునాకర్ణాటసోమేశు దు | 34 |
సీ. | భృత్యానురాగంబు పెంపుఁ జెప్పఁగ నేల పరివారసన్నాహబిరుదు గలుగ | |
తే. | నుభయబలవీరుఁ డను పేరు త్రిభువనములఁ | |
| బ్రచురముగ ఘోరబహుసంగరముల విజయ | 35 |
క. | అతనికి నుదయించెను గ, ల్పతరువునకుఁ బుట్టు రుచిరఫల మన మనుమ | 36 |
ఉ. | అర్థిజనంబు లోభినృపు లాసలు చూపినఁ బడ్డజాలి ప్ర | 37 |
సీ. | అడవులఁ గొండలఁ బడి యాలుబిడ్డప ట్టెఱుఁగనివైరిధాత్రీశులందుఁ | |
తే. | గానఁగావచ్చు వేఱ పొగడ్త లాస, పడక తనయంత జగములఁ బరఁగుచుండు | 38 |
మ. | ద్రవిడోర్వీపతిగర్వముం దునిమి శౌర్యం బొప్పఁ గర్ణాటద | 39 |
సీ. | దండప్రణామంబు దగ నభ్యసించిరో నెఱి బోరగిలఁబడ నేర్చునాఁడ | |
తే. | బాలశిక్షలు గా కొండుభంగి నింత, యచ్చుపడియుండునే వీరి కనఁగ నిన్ని | 40 |
ఉ. | రంగదుదారకీర్తి యగురక్కెసగంగనఁ బెంజలంబుమై | 41 |
సీ. | కొండలు నఱకునాఖండలుకైవడి యెనయు నేనుంగులఁ దునుమునపుడు | |
తే. | కసిమసంగినమృత్యువుకరణి యంత, కాలరుద్రునికైవడి కాలదండ | 42 |
శా. | శృంగారంబు నలంగ దేమియును బ్రస్వేదాంకురశ్రేణి లే | 43 |
సీ. | అనుపనుబహురత్నహయవారణముల విద్విషులు గప్పములు పుత్తెంచుచోట | |
ఆ. | నొక్కరూప కాని యెక్కుడు డిగ్గును, గానరాదు ముఖవికాసమునకు | 44 |
అయోధ్యావర్ణనము
క. | అమ్మనుమనృపతి కభ్యుద, యమ్ముగ నేఁ జెప్పఁ బూని నట్టి కథకు నా | 45 |
సీ. | అఖిలభోగములకు నాస్పదం బగుట భోగీంద్రుపట్టణమున కీడ యనియు | |
ఆ. | వినుతి సేయఁ జాలి వివిధోత్సవంబుల, నతిశయిల్లి సజ్జనాభిరామ | 46 |
క. | చనిచని యచ్చోటను జి, క్కెనొకో తారకము లనఁ బ్రకీర్ణరుచులఁ ద | 47 |
తే. | ఇంతపొడ వని వాక్రువ్వ నేరి కైన, రా దనుట కోటవర్ణన గాదు నిజమ | 48 |
క. | మహనీయవప్రగోపుర, బహురత్నోత్కీర్ణసాలభంజిక లొప్పున్ | 49 |
సీ. | అవగాహనమునకు నరిగినగజములమదములు కూడిన నదులు గాఁగ | |
ఆ. | గరము పొలుపు మిగులుఁ బరిఖ విశాలగం, భీర మగుచుఁ బఱపుఁ బేర్మిఁ జేసి | 50 |
చ. | తరుణులవీఁగుఁజన్నుఁగవ తాఁకున నున్మదచక్రవాకబం | 51 |
సీ. | ఉజ్జ్వలలక్ష్మికి నుద్భవస్థాన మై భువనసుందర మగు పొలుపు దాల్చి | |
తే. | యక్కజం బగుపెంపున నతుల మగుచుఁ | 52 |
ఉ. | చారుబలాకమాలికల చాడ్పున దంతము లొప్ప గర్జిత | 53 |
తే. | మనముశిల్పియె తనదువిన్ననువు మెఱసి | 54 |
సీ. | మవ్వంపుమేనుల జవ్వనంబుల కింపు మిగిలిన చెయ్వుల మెఱుఁగు పెట్ట | |
తే. | వెరవు గల్గి మనోభవు వీరరసము, నిరతముగ నేర్పు వాటించి కరువు గట్టి | 55 |
చ. | విలుచునెడన్ మనంబులకు వెక్కస మంద ధనంబు లమ్ముచో | 56 |
సీ. | అనవద్యవేదవిద్యాలతావితతికి నాలవాలములు జిహ్వాంచలములు | |
| సాదరకారుణ్యమేదుర జ్యోత్స్నకు మధురాకృతులు శశిమండలములు | |
తే. | గా సమస్తమహాధ్వరకర్తృతావి, భూతిఁ దనరి యఖిలలోకపూజ్యు లగుచు | 57 |
చ. | అమరనగంబు నెచ్చెలులొ హైమవతీశుననుఁగుఁగొండవి | 58 |
సీ. | పడఁతులనెఱివీఁగుఁబాలిండ్లు వెడదోఁప లీలఁ బయ్యెదలు దూలించుటకును | |
తే. | విటకుమారులు తనరాక వేచి వేడ, నెదురుకొని యింపుసొంపు వహించుచుండ | 59 |
చ. | శుకపికసంకులత్వమున సుందరసాంద్రలతాంతపల్లవ | 60 |
సీ. | మన్మథునాస్థానమండపంబులు మీనకేతునేపథ్యనికేతనములు | |
ఆ. | రామణీయకంబు రమియించునిక్కలు, సొంపుగనులు చైత్రసంపదలకు | 61 |
చ. | వివిధగతిప్రకారముల వీథులఁ బాఱుసమీరణంబుచే | 62 |
సీ. | పద్మినీకల్లోలపంక్తులపైఁ గ్రాలు రాజితరాజమరాళలీల | |
తే. | నేను గలుగంగ మదనుని కేల యొండు, పరికరము లని యన్నింటిపనులుఁ దాన | 63 |
పూర్వరామాయణకథ
క. | ఆపురి కధిపతి రఘుకుల, దీపకుఁ డమరేంద్రవిభుఁడు తేజోనిధి వి | 64 |
సీ. | అష్టదిగ్దళశోభితావనీచక్రంబు దమ్మి యై తనలక్ష్మి కిమ్ము గాఁగ | |
తే. | దనకృపాణంబు రిపుల సద్గతికిఁ బుచ్చు, పుణ్యతీర్థంబు గాఁ దనభూరిదాన | 65 |
ఉ. | అత్తఱి లోకభీకరదురాచరణుం డగుపంక్తికంఠును | 66 |
క. | తనయులఁ బడయుకుతూహల, మున నిట నమ్మనుజపతియు మునికులవంద్యుం | 67 |
సీ. | ఆసుకృతంబు మహానుభావంబున, నమ్మహీరమణుభార్యాత్రయమున | |
తే. | వెలసి వేదతదంగాదివిద్య లెల్ల, నభ్యసించి ధనుర్వేద మధిగమించి | 68 |
చ. | జనకునియజ్ఞవేదికఁ బ్రశస్తముగా జనియించి యంగనా | 69 |
తే. | మును సురాసురసంగ్రామమున రథంబు, గడపి విభుచేత వరములు గన్న కైక | 70 |
శా. | రాముం దాపసవృత్తి కంపఁ దను సామ్రాజ్యంబుపై నిల్ప జే | 71 |
చ. | వనితయు లక్ష్మణుండు సహవాసము సేయఁగఁ బర్ణశాలలన్ | |
| బున రఘురాముఁ డున్నయెడఁ బొల్తుక యొక్కతె యేగుదెంచి యా | 72 |
తే. | అతఁడు నగి త్రిప్పిపుచ్చిన ననుజుకడకు, నరిగి యాతండు ద్రోచినఁ బెరిఁగి వికృత | 73 |
క. | భంగపడి రాముకడ క, య్యంగన చనుదెంచి యిట్టు లనియెఁ ద్రిలోకో | 74 |
తే. | శూర్పణఖ యనుదాన మీదర్ప మడఁప, నసుర లిప్పుడ వచ్చెద రనుచుఁ గోప | 75 |
క. | దూషణునిఁ ద్రిశిరుఁ గూడి స, రోషంబుగ నెత్తి వచ్చి రోగంబులు ది | 76 |
చ. | పొలిసినఁ జూచి శూర్పణఖ పోయి దశాననుఁ గాంచి బన్నముం | 77 |
క. | చని కౌటిల్యమున మహీ, తనయం గొని లంక కరిగె దానవుఁ డపుఁ డా | 78 |
సీ. | ఎడసొచ్చి దైత్యుచేఁ బడినజటాయువువలన నంగన చన్నవల నెఱింగి | |
తే. | కుంభకర్ణునిఁ గుంభనికుంభనాము, లైనతనయులతో నంతకాలయమున | 79 |
తే. | అఖిలదేవతాసన్నిధి నగ్నిదత్త, యైన జానకి నానంద మతిశయిల్లఁ | 80 |
క. | ఇంద్రజి ననిలోఁ జంపి మ, హేంద్రాదిత్రిదశనుతుల కెక్కినయనుజున్ | 81 |
ఆ. | అతని నపుడ దివ్యయానరత్నం బగు, పుష్పకంబుఁ దేరఁ బుచ్చి దాని | 82 |
చ. | శర ణని వచ్చి చొచ్చి యనిశంబును గొల్చుచు నున్న రావణా | 83 |
ఉ. | వారలు వారిభూపరివారముతోన విమాన మెక్కి రాఁ | 84 |
క. | వినయము గైకొనఁగాఁ జే, యను దగువా రెల్లఁ దన్ను నయ్యయిసంభా | 85 |
ఆశ్వాసాంతము
మ. | కమలాధారుఁడు భీతిదూరుఁ డసమాకారుండు గంభీరుఁ డ | 86 |
క. | వికచకమలాయతాక్షుం, డకుటిలచిత్తప్రచారహరిమిత్రుం డ | 87 |
మాలిని. | నమదరినృపచూడానవ్యరత్నాంశువీచీ | 88 |
గద్యము. | ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిధేయ | |
————