నారదీయపురాణము/సప్తమాశ్వాసము

వికీసోర్స్ నుండి

నారదీయపురాణము

సప్తమాశ్వాసము

క.

శ్రీమహితసత్యభామా
ప్రేమాస్పద! సదయహృదయ! భీకరదనుజ
స్తోమాబ్ధిబాడబానల!
నామస్మృతిసుప్రసన్న! నందోత్పన్నా!

1


వ.

అవధరింపుము సూతుండు శౌనకాదుల కిట్లనియె.

2


క.

జీవించిన జీవేశై
క్యాపన్నత నరుఁడు 'తత్త్వమస్యా'దివచో
రూపమున నెఱిఁగి తద్భే
దోపాధియు సత్య మనుచు నుండఁడు వాఁడున్.

3


తే. గీ.

ఏకగగనంబు భిన్నమై యెసఁగుచో ను
పాధి తద్భిన్నముం దదభ్యాసవిరహి
తంబునై కానుపించు తత్సాధుతతికి
ఘటపటాధిక మెట్ల నిక్కముగ నట్ల.

4


తే. గీ.

అరయ నేకాత్మ భేదంబునం దుపాధు
లమరు తద్భిన్నములు తదధ్యాసరహిత
ములు నయిన యవియె యుక్తములగుఁ దదప
రంబు లన్నియు యుక్తేతరంబు లగును.

5


వ.

సుధాకరద్విత్వధిహేతువై శాస్త్రనిశ్చితంబైన కాచాదినేత్రదోషము
శశియందు నారోపింపఁబడినయది యది కాదు; తద్విత్వధిహేతువైన
తత్కరంబు స్వసత్వముచేతనే కాని చంద్రోపితము గాదని కొంద ఱీప్రకా
రంబున నౌపాధికబ్రహ్మభేదంబుల నవలంబించి వేదాంతములను దద
భేదబోధకముల నిర్వహింతురు; బ్రహ్మమునందు బద్ధముక్తాదిభేదము

నౌపాధికమే యనియు, నాత్మమిధోభేదమును నాత్మేశ్వరభేదమును
నీప్రకారముననే యౌపాధికమని స్వీకరించి యయ్యైక్యము స్వాభా
వికమని చెప్పుదు; రుపాధులగు వైచిత్ర్యము గలుగఁగా నాత్మయందు
వైచిత్ర్యభేదము గలదు; శేషశేషిత్వాదిరూపము వేదోక్తివలన
సుపపన్న మగుచునుండు; ముక్తియందైనచో నొకానొకభేదమును
లేదని తలంచిరి కొందఱు. కొంద ఱుపాధివలన బ్రహ్మస్వరూపంబు
నందు భేదంబు లేదందుఱు; మఱియు,

6


మ.

జను లాబ్రహ్మము శ్రౌతమౌ, మఱి నిరంశంబౌ, నభేద్యంబు నౌ
నన, భిన్నంబుగఁ జేయ శక్యమగునే? సాంశంబులౌ భూరుహా
ద్యనికాయంబులు భేద్యతం దగుఁ గుఠారాద్యంబులన్; వ్యోమభే
దనిమిత్తంబు ఘటాదికం బెటులనౌఁ? దర్కింప నట్లన్ ధరన్.

7


సీ.

నభము సాంశంబొ యెన్నఁగ నిరంశంబొ సాం
                       శంబైన యది నిదర్శనము గాదు;
చర్చ సేయంగ నిరంశంభైన తద్విభే
                       దమునందు విస్రంభ మమరి యున్నె!
యభ్రంబరూపక మస్పర్శ మద్రవ్య
                       మరయ భిన్నోపాధ్యవార్యశక్తిఁ
దగి భిన్న మగుచు నేత్రత్వగింద్రియముల
                       చే గ్రహింపఁగరాదు; జిహ్వనాస


తే. గీ.

శ్రోత్రములను గ్రహింపంగ సూటి కాదు;
కేవల మనోభిగమ్యమై కీలుకొనదు
బహిరుపాధిమతంబు నభంబు దలఁపఁ
దద్విభేదంబుఁ జెప్పఁ జిత్రంబు గాదె!

8


తే. గీ.

ఎంచ ననుమానశక్తి గ్రహింతు రనిన,
వ్యాప్తహేతువు లేదు ఘటాద్యుపాధి
భిన్నమున భంగపడుటకు భేదకాగ
మంబు నైనను లేదు భూమండలమున.

9

సీ.

అటువంటి వచనంబు లరయ నొక్కొకచోట
                       సమయానుభాషణసరణిఁ గల్గు;
నాత్మైక్యనిశ్చయం బమరినవెనుక భే
                       దౌపాధికత్వవాక్యప్రసక్తి
యుక్త మాత్మాద్వైతయుక్తి యిప్పుడు సుని
                       శ్చితముగా దిట విమర్శించి చూడ;
నాయధిష్ఠాననమధ్యాసితోపాధి
                       యద్వైతరంజితం బయ్యె నిప్పు;


తే. గీ.

డట్లు కావున నేత్రకాచాదిదోష
కలితచంద్రద్వితీయస్వకల్పనంబు
బలెనె యాత్మద్వితీయతాప్రాప్తిదోష
మూల మనరాదు నిశ్చయమున నెఱింగి.

10


తే. గీ.

సర్వభూతైకకర్తయు సర్వగుండు
సర్వభూతాంతరాత్మయు సర్వకర్మ
సంచయాధ్యక్షుఁడును సర్వసాక్షిచేత
నిర్గుణుఁడు కేవలుఁడు సత్వనిధివిభుండు.

11


వ.

అనిన నీశ్రేష్ఠంబైన వాణి యాత్మనిష్ఠులకుఁ దత్వగోచరంబు;
మఱియు.

12


సీ.

సర్వభూతంబులు జనియింపకున్న దే
                       వుని కింతగూఢత దనరియున్నె?
సర్వభూతంబులు జనియింపకున్న స
                       ర్వవ్యాప్తతయును దత్స్వామి కగునె?
సర్వభూతంబులు జనియింపకున్నఁ ద
                       దంతరాత్మత్వభాగ్యంబు గలదె?
సర్వభూతంబులు జనియింపకున్న సృ
                       జ్యాదికర్మాధ్యక్షుఁ డగుట చనునె?


తే. గీ.

సర్వభూతాది....................
...................................................
...................................................
....................................................

13

వ.

..................................................................................
నని పరీక్షవాకు లాడకు; అట్లు గాకుండెనేని తత్పదంబు పిమ్మట
శుక్తియందుఁ బుట్టెనని పలుకంబడ దిట్లు దేహాద్యచిద్వస్తువుల
యందు నజ్ఞభ్రాంతిచేతం బలుకంబడిన యివి యుత్పన్నంబు, త్వం
పదంబు దానియందు ననిన శబ్దవేది యపగతంబు సేయండె; పదం
బెక్కడ వ్యుత్పన్నంబగు తద్వాచ్యం బదె యనుట; శ్రుతికి వ్యాకరణం
బంగంబు; దానికి స్మర్త పాణిని; ఇతండు యుష్మదస్మత్పదంబులచేత
నవాచులనియును 'శ్రోతామాంతా' యని వేదోక్తచేతనాన్యం బనందగు;
చేతనుండు వేదోక్తిచేతను భిన్నం బగుటచేత నావస్తువునందు వైదికులు
త్వమహమ్మని ముఖ్యవృత్తిచేతం బ్రయోగింపుదురు; ఉద్దాలకుండు
శ్వేతకేతుని నచిరశ్యునింగా నెఱింగి త'త్వం' పదంబులచేత నను
వాదంబు చేసె; వానికి నచిద్వాచిత్వం బెక్కడిది? యయినను
త్వం పదం బభిన్నముఖ్యవిజ్ఞాతుండైన జాతయందు వ్యుత్పన్నం
బనిన నందువలన నేమి యయ్యెడు ననిన: విను, మచిద్విశేషంబునకుఁ
దత్త్వహానివలన జ్ఞాతృత్వంబులేదు; అచిద్విశేషంబు లెవ్వి కాన్పించు
జ్ఞానశాలురై జ్ఞాతకుఁ ద్వంపదవాచ్యప్రమాణంబుచేత నామీఁద దాని
చేతానాత్మానులక్ష్యంబు చేసి, వానికి నిక్కడ నేకత్వబోధనంబునందు
స్థూలసూక్ష్మావస్థ సర్వప్రత్యద్భూతేశ్వరైకత్వం బగును; తావన్మాత్రం
బుననె జీవబ్రహ్మైక్యంబు సంభవింపదు; అన్యస్థలంబున జీవ
పరమాత్మలకు భేదంబు సిద్ధంబగు.


[1]శ్రుతిః.

"క్షరం ప్రధాన మమృతాక్షహరహః
క్షరాత్మనా విశతే దేవమేకం,
భోక్తా భోజ్యం ప్రేరితారం చమత్వా
జుష్టన్త స్మాదమృతత్వమేతి.”


యనిన శ్రుతివలన సిద్ధంబగు; జీవబ్రహ్మలు దేహదేహివత్వంబుల
చేతం బ్రసిద్ధిఁ గాంచిరి; అంతర్యామి బ్రాహ్మణాదులయందునది గావునఁ

జిదీశ్వరులకు భేదంబగు; నిట్లైనం గొందఱు సాధులకు స్వేశాభేద
వాక్యంబులు తదావేశతత్స్నేహవికారంబులవలన నక్షరంబులగు
నిశావేశంబులవలన విరించాదిముఖంబులయందు నీశత్వసద్వాక్యం
బులు గ్రహావిష్టముఖంబునందు 'సో౽హమితి' వాక్యంబులుంబలె
సమ్మతంబులైనయవి; అపాస్యస్నేహవికృతివలన స్వేశైక్య
వాక్యంబులు సత్పురుషుల కైక్యంబు దెల్పునని యీవేదాంతంబు
లొకానొకచోట భగవద్దేహారితరితతేహంభై 'త్వమస్మీ'త్యాదిభాష
ణంబులయందు నెఱింగించు నట్లు గాకుండిన శంభుత్వాభిప్రాయంబుచేత
నీళుని 'స ఇదం సర్వం సో౽హ' మ్మనియును విశ్రుత్వంబు చెప్పం
బడును; దీపతేజంబు గృహవ్యాప్తంబై యున్నచో దానివెలుంగు
గృహస్థితద్రవ్యంబును దద్గృహంబునఁ దేజోమయంబని చెప్పుదురు;
తేజంబు వోయినవెనుక మందిరం బంధకారావృతంబయిన నంధ
కారంబ యని యందురు; ఇత్తెఱంగున విశ్వైక్యోపనిషద్వాక్యంబులకు
గతి గలిగియుండుటంజేసి యైక్యవాక్యంబులకు శ్రుత్యేపికావగతమహ
దాద్యచేతనైక్యవాక్యంబులకు ముఖ్యార్థహీనత యెక్కడిది? సమస్త
చిదచిద్వస్తుశరీరకుండై సర్వనామంబులుంగల యీశ్వరునియందు
నహంత్వ మిత్యాదిపదంబులును ముఖ్యంబు అంతర్యామి బ్రాహ్మణాదు
లైనవార లశేషచిదచిద్వస్తుశరీరైకపరైకతభేదశ్రుత్యవిరుద్ధంబై
యంగీకరింపందగినయది యని రిట్లు గావున చిదచిదీశ్వరులకు
మిధోభేదం బుపనిషత్సిద్ధంబై వేదపారగులచేత స్వీకరింపఁదగినయది.

14


క.

స్వామీ! యిద్ధర నంతర
మీమాంసాసంప్రవృత్తి మెఱసిన విబుధుల్
తామసులై వాదింపఁగ
నామూర్ఖులు బాహ్యులట్ల నాడఁగఁ దగదే?

15


తే. గీ.

శ్రుతినిరూపితయుష్మత్స్వరూపరూప
గుణకలాపంబుల నెఱింగికొనుట కేరి
తరము భవదీయకరుణాసుధాతరంగ
మహిమ లేకున్న స్వామి! రమాకళత్ర!

16

సీ.

సకలవేదప్రవర్తకుఁ డైనయట్టి ప
                       ద్మజుఁ డంతవాఁడ తామనము రాజ
సమునైన యాత్మకల్పమునందుఁ దత్త్వవి
                       పర్యయం బంది ప్రాగ్భణితసాత్త్వి
కప్రకాశితనిజకల్పంబునందు నా
                       త్మోదీరితంబులై యున్న యాగ
మాంతతాత్పర్యభూమ్యంతయుష్మత్పార
                       గోక్తు లుల్లంఘించి యుక్తి తప్పి


తే. గీ.

సాత్త్వికేతరతత్కల్పసమయములను
హరునిఁదనునింద్రముఖ్యుల నాపరాత్మ
యనుచుఁ బలికెఁ బురాణాళి; పరమమూఢు
లైన యన్యులు పలుకుట యరిది యగునె?

17


తే. గీ.

అక్కటా! యేమి సేయుదు రహహ బద్ధు
లైన జీవులు త్రిగుణమాయం గలంగి
తలఁపుదురు పల్కుదురు చేష్టితము లొనర్తు
రప్పుడు గుణానురూపంబులై చెలంగ.

18


తే. గీ.

తతమహాజ్వరదోషసంతప్తులైన
నరులఁబోలె నచిద్బద్ధనరులఁ బరమ
కారుణికుఁడైన ఘనుఁ డనుకంపఁ బ్రోవ
వలయుఁ దనదయ మిక్కిలి వాసి కెక్క.

19


ఆ.

కరుణఁ దనకు నెంత గలిగిన బద్దుండు
బద్ధుఁడైనవాని బంధ ముడుగఁ
జేయలేదు చర్చ సేయు నశక్తుని
కరుణ నిష్ఫలంబు గాదె జగతి.

20


ఆ.

ఆప్తులై పరస్సహస్రుల ముక్తులు
నిత్యులెన్న నిత్యనిర్మలాత్ము
లిద్ధమతులు యతులు హేయప్రతిభటు లి
ట్లెంచ వారిచేత నేమి యగును?

21

వ.

అఖిలహేయప్రతిభటత్వంబు నీసొమ్ము 'తమేవ విధి' త్వాది 'మృత్యు
మేతీ' త్యాది వేదవాక్యంబ విద్యావిషయభూతుండ నిన్ను నేహేయ
ప్రతిభటునింగాఁ బలికె నవివేకగ్రస్తంబైన లోకత్రయంబు నిలు
పుము. యుష్మతత్త్వవిద్యాసుధచేత జీవులం బ్రోవవే దయాపయోధి!
యని శ్రుతి స్మృతులచేత నీ తత్త్వంబు సత్త్వ ప్రకల్పితులైన
యుత్తములు విశ్వసింపుదురు; రాజసులు తామసులు ప్రత్యక్షానుమా
నంబులచేఁ గాని విశ్వసింపరు; తత్ప్రత్యక్షానుమానంబు ప్రకారంబు
స్ఫుటంబుగా నీ వెఱుంగుదువు. ఆప్రకారంబునకు యత్నంబు చేసి
బద్ధుల రక్షింపవే పరవ్యోమనాయకా! మహాభుజా!

22


తే. గీ.

సాధు లెవ్వరు ధ్యానగోచరము గాఁగ
నిన్నుఁ బురుషోత్తమునిఁ జూడ నియతిఁ గోరి
మీఱుదురు వారు దృక్సమున్మీలనమున
నైన నినుఁ జూడఁగోరుదు రాదిపురుష!

23


వ.

ఎన్నఁడు నిన్నుఁ బ్రసన్నవదనుఁ గర్ణాయతలోచను, విశాలఫాలస్య
స్తోర్ధ్వతిలకుఁ, గేశవుఁ, గేశపాశకించిన్నటత్పారిజాతమాలికాలం
కారు, ననేకకోటిసూర్యప్రతీకాశకిరీటాశ్రితమస్తకు, సుభ్రూనాసా
విలాసుఁ, జారుశ్రుతిస్ఫురన్మకరకుండలు, శోభనోత్తరోష్ఠు, శుచిస్మితు,
సుకపోలు, నరుణాధరు, సుదంతు, సురుచిరచుబుకప్రదేశు, సుభ్రూ
భంగగమ్యాశ్రితోదయు, సుగ్రీవు, సూన్నతస్కంధు, జాన్వాయత
చతుర్భుజు, సుపాణి, స్వంగుళి, సునఖరు, సుప్రకోష్ఠు, సుభూషణు,
సువిశాలోన్నతోరస్కు, శుద్ధశ్రీవత్సలాంఛను, శ్రీభూనీళాంక
సంయోగు, సుపిశునస్వనులేపనస్ఫురన్మణిస్తను, రాజత్కౌస్తుభవన
మాలికాశోభితు, నాభిపద్మాయతస్ఫారనానాహారవిభూషణు, సురోమ
రాజీసువళీసుపల్లవతలోదరు, సుహేమాంబరసంఛన్నజఘనోరు
కటిస్థలు, సుజానుజంఘాగుల్భపాణిపాదాంగుళు, శ్రీమత్పద
జ్యోత్స్నాధ్వస్తాజ్ఞానతమస్సమాహు, నానందమయమంటపనాగభోగా
సనాసీను, సునందనందప్రముఖసురపారిషదసేవితు, దివ్యచామర
వాతేషధూతయజ్ఞోపవీతు, నుత్తరీయపరివేషచ్ఛన్నభూషామణి
దీధితిముక్తబ్రహ్మేంద్రరుద్రాద్యమరపరివృతుఁ, బ్రపన్నాత్మాను

రూపార్థప్రదస్మేరావలోకను మాకన్నులు దెరచి చూడంగలిగెడు నని
కోరిన మమ్ము ననుగ్రహింపవే యని సనకాదులు విన్నవించినఁ
బ్రసన్నాననుండై సాక్షాత్కృతవిగ్రహుండై భగవంతుం డిట్లనియె:

24

విష్ణువు సనకాదులకు సమాధానము చెప్పుట

సీ.

ప్రథితవేదాంతతాత్పర్యమహానిధి
                       సిద్ధాంజనములై ప్రసిద్ధిఁ గాంచి,
వరసాధుజనసత్వవాక్య మితిజ్ఞాత్వ
                       పిశునంబులై చాలఁ బెంపుఁ గాంచి,
యాత్మీయభక్తిరసార్ద్రంబులై మద
                       ర్థైకప్రయోజనోత్సేక మంది,
యంచితస్వాభావికానవధికనవి
                       శేషత్వకారులై సిరి వహించి,


తే. గీ.

తనరు భవదీయసూక్తిసుధారస
వాహములఁ దృప్తిఁ బొందితి వాంఛ దీర
నో మహాయోగివరులార! యుత్సవంబు
లయ్యె సంతోష మందితి నాత్మలోన.

25


వ.

అని మెచ్చి మఱియు నిట్లనియె:

26


సీ.

అస్మత్ప్రయోజనం బఖిలలోకాభిర
                       క్షణమొ; మీరలు నట్లె కాఁగఁ బల్కి
తిరి; యెవ్వరేని సద్వృత్తి స్వార్థారంభ
                       రహితులై మఱి పదారప్రయోజ
నాసక్తిఁ బొరలుదు రట్టిజనులను మ
                       దాప్తులఁ బోషింతు ననుదినంబు;
స్వార్థపరత్వ మన్యార్థైకవిరతియుఁ
                       బూనిన జడుల దుర్బుద్ధి జడుల


తే. గీ.

నరయ లోకహితార్థంబు నస్మదభిమ
తార్థమును గాఁగ నేఁడు మదగ్రసీమ
నిగ్రహానుగ్రహక్రమనిపుణులైన
ఘనులు మీ రిట్లు పలికితి రనఘులార!

27

మత్తకోకిల.

మీరు మీఱఁగఁ బల్కు వాఙ్మయ మేజగంబుల నెవ్వ రిం
పార సంధ్యల మత్సమీపమునందు నుండి పఠింతు రా
సారవేదుల నుద్ధరింతుఁ బ్రసన్నశక్తిని వారి సం
సారవేదులఁ జేయ నీనుతి సంస్కరించెదరేనియున్.

28


ఆ.

ఔర! భళి! మదీయతానుసంధానసు
ఖాబ్ధివిహరణోత్సుకాత్ములైన
మిమ్ముఁ బ్రోచు టెంత మీ రాత్మవేదితు
లస్మదర్థపూర్ణులైన ఘనులు.

29


వ.

బ్రహ్మాండంబులో నున్న జీవులకు నెన్ని యెన్ని మిథోవాదంబు లయ్యె?
పరతత్త్వంబైన నాయందు వారలకు నేమి తోఁచె? వేదాంతవాక్యంబు
లస్మత్ప్రకాశంబులై కలిగియుండ విరుద్ధవాదోదయం బేమివలన
నయ్యె? మద్భక్తులలో నొకటితక్కఁ దక్కినయది తత్త్వవిప్లవంబు
సేయ నెయ్యది సమర్థంబు దాని దండించెద నెఱింగింపుఁడు; మీకుఁ
బైశున్యదోషంబు ప్రాపింపదని భగవంతుం డానతి యిచ్చిన.

30


క.

తచ్ఛంకార్హబహుక్రియ
లచ్ఛిన్నబహుప్రకారులగు కాలాదుల్
తచ్ఛక్తులయుతకోట్య
ర్కచ్ఛవి యగు విభున కెరఁగి కరములు మోడ్చెన్.

31


వ.

మోడ్చి యిట్లని విన్నవించె: “దేవదేవా! యుపనిషదతర్క్యాసంఖ్యేయ
శక్తిక! యహేయానంతసుఖచిత్స్వరూప! యపారసద్గుణ!
యనాద్యంతసంశుద్ధపరమవ్యోమపదాలయ! చతుర్విధచతు
ర్వ్యూహ! శ్రీనిశేషవ్యజితాఖిల! యష్టదిగీశ్వరాకార! తల్లికావృత!
సర్వప్రద! శంఖచక్రగదాంభోజముసలాసిధనుశ్శ్రీగర్వితదివ్యరూప!
లోకావృతసమాశ్రయ! యనాదినిధనా! యనంతశక్తులును శుభ
విగ్రహులు నైన కుముదాదులచేతను ననాదిసురేశ్వరులైన యింద్రాదుల
చేతను, ననాద్యంతానంతపరబ్రహ్మలోకసుఖాబ్ధులైన నిత్యులచేతను
నిత్యమును సేవింపఁబడువాఁడవు; నిర్ద్వంద్వనిష్ఠనిర్వాణ! లోక
పాలక! సర్వజ్ఞ! సత్యసంకల్ప! సత్యైశ్వర్య! యఖిలేశ్వర!
నేనానాయకభుజలీలాధిగతోపితైశ్వర్యసాగర! యప్రయత్నశ్రుతా

నాదికాలప్రకృతిసత్క్రియదయాదత్తాగ్నిపురుష! కర్మస్వాతంత్ర్య!
పాహి నమస్తుభ్యం హృషీకేశ నమస్తుభ్యం జగత్పతే! చిదచిద్వస్తు
రూపాయ చక్రిణే నమస్తుభ్య"మ్మని కాలప్రకృత్యాత్మాదృష్టశక్త్యాద్యధి
దేవతలు విన్నపంబు సేయ భగవంతుండు ప్రసన్నుండై యిట్లనియె:

32


సీ.

నిత్యదేవతలార! నిక్కం బెఱింగింపుఁ
                       డీబద్ధదేహుల కెందువలనఁ
దత్త్వవిప్లవ మయ్యెఁ దగనికాలంబున
                       వేదాంతములు గల్గి వెలసియున్న
బ్రథితశక్తిని జతుష్పాద్ధర్మశాలియౌ
                       కృతయుగంబున నసంగతము కాదె
[2]తత్త్వవిప్లవము దత్కలికాలమున కది
                       యుచితంబు కలివేళ నుండు ధర్మ


తే. గీ.

వృషభ మదిరుగ్ణపాదమై వివిధదోష
సిద్ధమైన రజస్తమోవృద్ధిబుద్ధి
[3]యల్పమై యున్కి కాలోచితాచరణము
గాదె కలికాలమునకు దుష్కలుషమునకు.

33


వ.

అది యెట్లయ్యె వెఱవక చెప్పుండని సర్వవిద్యాధిపతియగు శ్రీపతి
సనకాదులకు స్వజ్ఞానదార్ఢ్యంబు గలుగ నానతియిచ్చిన మాయాప్రకృతి
దేవత యీశ్వరకలిత మని తెలిసి, కృతనతియై యిట్లని విన్నవించె.

34


సీ.

అవధారు దేవ! నన్నాకాలశక్తి ని
                       యోగింప బహువిధోద్యోగలీలఁ
బరిణమింపుచునుండుఁ బరిణమింపుచునుండఁ
                       గల కాలశక్తి యేగతిఁ దలంచు
నది భవదాజ్ఞఁగా నౌదలఁ దాల్చి నే
                       నియవస్థఁ జరింతు నీవిధమున
నగు నవస్థయుఁ ద్వదీయత్వంబునకు మేర
                       యై నేఁడు మత్స్వభావానురూప

తే. గీ.

మగుచు నను సుఖ మొందించు నాత్మగర్భ
మూఢచేతనులైన [4]దుర్మోహదుష్ట
కర్ములను స్వవిలానవికాసపరులఁ
జేరి యట్ల వినోదింపఁజేయుదాన
నఖిలజగతి నీ వెఱుంగనియదియుఁ గలదె?

35


వ.

పూర్ణకాముండవై శ్రీభూనీళామనోహరుండవగు నిన్ను నేను
వినోదింపఁజేసెద; లీలచేతం జూచితి నీవె స్వాభావానవధికాప్రభావుండ
వైన నీకు శేషతైకస్వభావము కలిగి భవల్లీలారసోచితనై దేహేంద్రియ
మనఃప్రాణాద్యవస్థారూపవిక్రియ నగు నన్నుం జూచినవారై స్వస్వ
రూపస్వభావజ్ఞానవర్జితులు కొంద ఱీప్రకృతి స్వార్ధవిలాస యగు
నచిత్తని తలంతురు; వారు తద్దురభిమానానురూపాదృష్టప్రచారులు
రాజలీలోచితయై రసావహయై రాజావనరము చూచి పోవుచున్న
తద్రాజకులజయై తన్నిరీక్షణైకవరయై విలాసైకావలోకనములు గల
రాజాస్థానకాంతను క్షుద్రవిటులుంబలెఁ జూచి కామార్తులై తముం
దముం గోరుచున్నదానింగా దానిం దలంచినవారై తద్రాజభృత్యుల
చేతం బలె దుర్వ్యాపారోచితడండంబులను దద్భృత్యులైన భూపాల
కాలాద్యులచేత నధోగతులం బొందుదురు; దేవమద్గర్భస్థాత్ములకు
స్వస్వభావావివేకిత యిది మొదలైనయది; ఆయవివేకిత యనాదిభ్రమ
కారణ; మీశ్వరా! ఇది గాన వీరికి నిందు విభ్రాంతి నాచేతఁ జేయం
బడదు; ఆత్మేశ్వరా! నీలీలారసోదయమునందు నే నేమి సేయుదాన
భవదర్థనైన యే ననేకప్రకారములను యత్నము సేయం దమము
రజము సత్త్వము ననియెడు మూఁడుగుణంబులు స్ఫురించును; తద్గు
ణోదయమాత్రముచేత మద్గర్భసాత్మబుద్ధులందుఁ గర్మఫలోదయంబు
లైన వివిధభావంబులు పుట్టుచున్నయవి.

36


ఆ.

ఏ ననాది నెంచ నీజీవులును నాదు
లన్వయమున నాది యరయ మద్గు
ణాతతప్రకల్పితైతత్తిరోధాన
మును ననాదివేదములు గణించు.

37


వ.

కావున.

38

తే. గీ.

చర్చ సేయ ననాదినిజస్వరూప
ఘనతిరోధాన మంది చేతనులు నేఁడు
విశ్రుతంబుగ స్వోచితవృత్తి దెలిసి
వెలయ కతిమూఢులై యుండు విక్రియతను.

39


సీ.

మద్గుణోద్రేకసమగ్రత కించిదు
                       న్మీలితమతులై యమేయవస్తు
విజ్ఞానమునకు సద్వృత్తి నుద్యోగించి
                       తత్తత్వనిశ్చయోదయమునం ద
శకులై కామదోషమునఁ దద్వస్తువు
                       లాత్మీయము లటంచు నాత్మఁ దలఁతు;
రతిబోధశక్తి ప్రభాప్తేయమై [5]పోరు
                       సత్త్వసిద్ధి భవత్ప్రసక్తిఁ జెంది


తే. గీ.

పూర్ణయాధృచ్ఛికాజ్ఞాతపుణ్యమూల
ఘనసదాగమములు సముత్కంఠఁ జదివి
నిజనిజేతరతత్త్వముల్ నిఖిలములు నె
ఱింగికొందురు చేతనుల్ సంగతముగ.

40


క.

అది కావున నోదేవా
త్వదీయులైనట్టి నిఖిలతనుభృత్తులకున్
మదుదీర్ణవృత్తిఁ దలఁచిన
యది యుపకారంబె కాక యపకారంబే?

41


సీ.

నేఁడు ముక్తునినేని నిత్యునినేని నే
                       నాత్మనా భావించి యాభవాంధ
కూపంబులోఁ బడఁ గుమ్మితినేని యా
                       యపరాధము వహింతు; నట్ల సేయ
దీపితావిర్భూతరూపాత్మసంభాద
                       నమునకు శక్తి లేశమును లేదు;
నాకు నభివ్యక్తమై కనుపట్టిన
                       యనలంబు గప్పునే యరణి గాన

తే. గీ.

యుష్మదాజ్ఞావిలంఘన వ్యుత్క్రమములు
కలిగెనా యవి దండించి కావు; శుద్ధిఁ
జెందెద నటంచుఁ దననిజశీలమెల్ల
విన్నవించుచు మఱియు నవ్విభున కనియె.

42


వ.

నీ వడిగిన ప్రశ్నం బిదియును నొకలీల గాని నీకు నజ్ఞత లేదు; సర్వ
జ్ఞుండు సర్వవేత్తయు నని యాగమాంతంబులు పలికినఁ బరవస్తువ
వగుస్వాభావికజ్ఞాననిధివైన నీకు నజ్ఞానం బెక్కడిది? కృతయుగం
బునఁ దత్త్వవిధిప్లవంబు యుక్తంబు గా దది స్థిరం బయ్యెనేని దాని
యందుఁ దద్దోషవృద్ధి తత్త్వబుద్ధిక్షయోచితంబు.

43


మ.

చనవే రోగము లొక్కయౌషధమునన్ సస్పక్షయప్రాప్తియో
జనపంకాంబుకళంకముల్ కతకబీజవ్యాప్తిచేఁ బాయవే
ఘనసత్యోదయమైనఁ దూలదె తమోగర్వంబు తద్వృద్ధి త
త్త్వనిబోధక్షయహేతువై మెఱయదే తత్తత్క్షయావస్థలన్.

44


మ.

పరమాత్మా! హరి! మీయనుగ్రహమునం బద్మాసనుం డందె న
త్యురుసత్త్వంబు తదీయశక్తి మిముఁ దా నుల్లంబులో నిల్పి త
త్పరుఁడై సత్వవివృద్ధియై తగె వివృద్ధంబైన సత్వంబునన్
స్థిరవిజ్ఞానులఁ గాంచె నంత సనకాదిశ్రేష్ఠులన్ జ్యేష్ఠులన్.

45


మహాస్రగ్ధర.

సనకాదుల్ శుద్ధసత్త్వుల్ శమకలితులు యుష్మత్పదధ్యాననిష్ఠుల్
మనసాజ్ఞాయిప్రబుద్ధుల్ మననఘనులు యుష్మత్పదాంభోజభక్త్యా
గ్రసమగ్రుల్ నిన్ను నీభక్తిజనుల గరిమం గాంచి సౌఖ్యంబు నొందం
గని యాసర్వాత్మలున్ దుఃఖమునఁ గనల భూఖండముం జూచి యంతన్.

46


వ.

వారలు నిట్లే యనుభవంబు నొందవలయు నని యీభూమిం జరింపుచు
నందఱికిని సాంఖ్యం బగుంగాక యని యజ్ఞానరోగోపశమనంబగు
త్వదీయజ్ఞానభేషజంబు భవరోగులకెల్ల నొసంగి రందుఁ గొంద ఱధి
కులై కలంగిరి మఱియును.

47


ఉ.

కాకముల ట్లసహ్యములు గాఁక కువాదము లాచరింప నీ
లోకము లాకులంబులయి లోలత నుండు మనోహరధ్వనిన్
గోకిలపాకముల్ పలుకు కోపునఁ బల్కుదు రాగమాంతు లా
పాక మెఱుంగలేకఁ బెడబాగులఁ జూచిరి బాహ్యు లందఱున్.

48

ధర్మాధర్మాభిమానదేవతలు, ఆత్మవృత్తిప్రకారముఁ దెల్పుట

వ.

నాకును వేదాంతసుచికిత్సకులవలన దోషరహితులు గాఁగలరు, ఒక
ముహూర్తంబు సహింపుండని కాలాభిమానదేవత పల్కిన సస్మితాన
నుండై ధర్మాధర్మాభిమానదేవతలం జూచిన వారలు ప్రణమిల్లి యాత్మ
వృత్తిప్రకారం బిట్లని విన్నవించి రప్పుడు మాకు సాక్షి యనంతశాఖ
వేదాభిమానము గల్గిన నిత్యదేవత. ఈనిత్యదేవత పల్కినపల్కు
శంకించరాదు; నిరామయ మైనది; మానడకల కిది సాక్షి యగుట స్వభావ
శిష్ట మీదేవత యాజన్మసిద్ధతత్త్వజ్ఞానాబ్ధిమానస యైనది; పరమార్ధయై
సమగ్రయై యవ్యభిచారియై యున్న భవత్పాదభక్తి గలుగుటచేత నిత్య
సుఖం బందియున్నయది; యటువంటిదేవతత్వత్పాదపద్మగాదోద్రిక్తభక్తి
సుధాంబుధియందు నుప్పొంగి భవత్సౌభాగ్యామృతసాగరము సొచ్చి
యప్రాకృతానంతకల్యాణచిత్సుఖ మనుభవింపుచు నిత్యులను ముక్తులం
జూచుచుఁ బ్రమోదించినయదియై బద్ధులను దేవత [6]కటాక్షింపని
చంచంబునఁ దానును నిరీక్షింపక యనాదిత్రిగుణానాత్మాచ్ఛాదితాజాన
చిద్బలమువలన దేవనరతిర్యక్స్థావరప్రభేదదేహంబులు వహించిన
వారలం జూచి కరుణ గలిగి వారికింగా నిట్లనియె: స్వామీ! ఈయాత్మ
లకు దేవతోద్దేశవిరహితమైన యీకర్మము హితము విశుద్ధోపదేశాది
దేశప్రాప్తోచితాంగక మై సత్కులోచితమైన యీకర్మంబు ప్రాకృతంబు
వైకృతంబునై రెండుతెఱంగు లయ్యె నది వర్ణాశ్రమవయోపస్థావేశాది
ప్రవిభావికమై తపోదానపూర్తంబులచేఁ జేయంబడెనేని శ్రేయస్సు నిచ్చు;
సుతానుక్షణధ్వంసియైన నే నీస్వస్థితీక్షణమునందె చోదితమై యుద్దేశ్య
దేవతను బ్రసన్నఁ గావించిన తత్ఫలము నధికారికి [7]నిప్పింపఁగలదు;
ఆదేవతవేరు మఱొకవస్తువ యెందుఁ బ్రయోగించెనేని తచ్ఛబ్దవాచ్య
యైన దేవత [8]యాయర్థ మయ్యెడిది సిద్ధము; తా నెఱుంగనియంతమాత్ర
ముననె యీదేవతకు నజ్ఞానంబు లేదు; హవిరావిగ్రహణదేవతా
వాచకంబులైన శబ్దములచేతఁ జెప్పఁబడిన దేవత జ్ఞానము గలదియై
తనుం బూజించెడివారికొఱకు తత్పూజభక్తిప్రసన్నయై శుభము నిచ్చు;
నజ్ఞులు తఱచుగాఁ బ్రయోగించినమాత్రంబున నది వానికి నర్ధంబు
గాదు; మఱి యేమి [9]యనఁ దత్త్వజ్ఞులైనవారు బోధించిన నెఱుంగంబడు;
నిటువలెం గాకుండెనేని యతిప్రసంగంబౌ; నది [10]యెట్లన: నజ్ఞులైనవారు
పెక్కుమాఱు లహంపదము దేహంబునందుఁ బ్రయోగించిన యంత

మాత్రమున దానికి నది యర్థంబు గాదు; మఱి యేమి [11]యన చేతనుం
డందే యర్థంబు నర్థతత్వాలోచనచేత నటువలె నహంపదవాచ్య
నిర్ణయ మటువలెనే తద్దేవతావాచిపదవాక్యనిర్ణయ [12]మగు
నిటువలెఁ గాఁగా నాత్మానాత్మాసమస్తవస్త్వంతరాత్మవైన నీకుఁ దత్త
చ్చతుర్థ్యంతపదోద్దేశ్యత్వంబు తెలివిపడును శ్రుత్యంతాలోచన చేతన
తెలిసి యీయగ్నీంద్రాదిపదోద్దేశ్యదేవతాకమఘాభిదముందఱ
క్రియలు పల్కెను; ఎవ్వం డెవ్వని నుద్దేశించి యేతద్ద్రవ్యంబు నిచ్చును
వాఁడు వానివలనఁ దద్ద్రవ్యత్యాగసదృశఫల మందు నన్యునివలన
లేదటన్న నుత్సర్గసయోవేదవాక్యంబు భూతిం బొందుపుచున్నయది
యని యీయజ్ఞంబునందు నాయికయైన యుద్దేశ్యదేవత యాగఫల
ప్రద యని లిఙ్మాదులు ధాత్వర్థకార్యంబుచేత దృఢాన్వయములై
లోకంబున వేదంబునఁ బరుని బోధించ క్షయములై ముఖ్యార్థసంకట
మైనప్పు డముఖ్యవృత్తిచేతన్యార్థవరంబు లగును; భావార్థపశ్య
కార్యత్వబోధనంబునందు సంకట మేమి కాలాంతరఫలప్రాప్తి
కొఱకై దేవత పూటయై కల్పింపఁబడియెను; తెలియంబడిన వహ్న్యాది
దేవతలు మాయచేత బంధంబు నొందె నాఫలప్రదానాస్వతంత్ర
లయ్యెనేని త్వదావేశంబున నాఫలంబు విను సమర్థు లౌచున్నయవి;
యంగవేదియైన పాణిని యజిధాతువును దేవపూజయందు విధించెను;
రాజపూజాఫలంబు రాజుంబలెను ప్రీతయైన దేవత యర్థికొఱకు
స్వపూజాఫల [13]మీయంగలదు; రాజపూజచేతఁ గాలాంతరఫలప్రదమైన
ధర్మంబు గలదా యని యన, లేదు; జనకాజ్ఞ స్వకీయులను రక్షింపఁ
గలయది యని స్మరించి యీప్రకారంబున నేకాలాంతరంబున
దేవుండు స్వసేవియైన యర్ధికొఱకు ఫలంబు నిచ్చును; కర్మమే
ఫలప్రదంబు గా; దట్లు కాకుండెనేని యరాజకదేశంబునందు స్వైరా
స్వైరవిహారులైనవారికి నాన్వైరాస్వైరవిహారంబులే దుఃఖకరంబు
లీవలయు నవి యిచ్చట భూమియందు లే దనియెడు నీయభిప్రా
యంబు గలదియై వేదాభిమానదేవత భవత్పూజారూపమైన కర్మ
మగ్రంబునం జెప్పెను; కర్మమే ఫలప్రదంబు గాదనియుం బలికెను;
దేవతయై కర్మఫలప్రద గాదనియును బలికెను; వైపరీత్యంబునఁ గర్మ
కాండమె దేవత నొకానొకదిక్కున నాదేవతయె ఫలప్రద యని
చెప్పును; తద్దేవతోక్తమైన వేదాభిమానదేవతాభిప్రాయంబు తండ్రి
వలన విని శుకుం డిట్లనియె.

49

సీ.

మదిలోన వేదాభిమానదేవతకు ని
                       యాకూత మిట్లుండ నందు ద్విజులు
వైమనస్యమునంద వచ్చు నేరీతిని
                       వేదోక్తకర్మముల్ వివిధములయి
యమరవిశ్వైకవస్త్వంతరాత్మకుఁడైన
                       విష్ణువునకుఁ బ్రీతి వెలయఁజేయు;
నాతండె కర్మఫలాదు లీనేర్చువాఁ
                       డనిరి కొందఱు; కొంద ఱతనిఁ గొల్చి


తే. గీ.

యలఘుమతులకు నిట్లు కాదనిరి; కొంద
ఱాత్మపక్షానుగుణము లౌనట్టి నయము
లాడి ; రొక కొంద ఱిట్లు కార్యాన్వయంబె
యనిరి సిద్ధాన్వయంబు గాదనుచు బ్రమసి.

50


వ.

ఇట్లు లోకానుసారంబున వేదంబునందేని యర్థం బెవ్వ రెఱుంగుదురు?
వారికి నాగమంబు కేవల సిద్ధమైనదానిని బోధించు ననియెడు
వాక్యం బెక్కడిది? 'గామాన' యేత్యాది వాక్యేష్టగవానయనాదుల
చేత నన్వితార్ధంబులు బోధించు నీవాక్యంబు పదంబులు నీలోకంబునం
గల దిదిగాన వేదంబునందేనియుఁ గార్యాన్వయంబు బాసి కించిత్తేని
యన్యపదంబులకు స్వార్ధనిష్ఠత్వంబు లేదనుట నిశ్చయ మందు
మంత్రార్థవాదములకుం బలె నుపనిషత్తులకును గార్యాన్వితార్థ
నిష్ఠత్వంబు గాని సార్థ్వైక[14]నిష్ఠత్వంబు లేదు; మత్కార్యంబు
యాగాదికంబు గాని యుపాస్తి గాని యుచితంబగు నుపాస్తి బుద్ధులకు
యదార్థత్వనియమ మనియెడునదియును లేదు; యోషిదగ్నియాది
వాక్యవాక్యంబులకుంబలె నుపనిషత్తులకు యథాప్రతీతసిద్ధార్థ
[15]నిష్ఠత్వమును నియతంబు గాన వేదాంతమీమాంసారంభము[16]ను గాక
పోవు నిటుగాన బుధుఁడు తద్వాక్యంబుఁ బ్రమాణంబు చేసి యెవ్వని
బోధించు [17]నిట్లని యుండఁగా దేవత[18]యును ద్రవ్యముంబలెఁ గార్యశేష
త్వముం బొందునని కార్యమే కామజనంబులకు నిష్టమైన ఫలం బిచ్చు;
నందు క్షణధ్వంసియైన కార్యంబు కాలాద్యంతరభావియైన ఫలంబు

నీను సమర్థంబు గా దస్థిరంబు గాదు. స్థిరంబుగా విధిచేత నిశ్చయింపఁ
బడియె నిది మొదలుగాఁ గల దాని నెవ్వరు పల్కుదురు వారు జై మిని
మతానుగులు; మఱి [19]యేమే యనియును పలుకుదురు వారు జైమిని
మతస్థులు. ఆవేదప్రవర్తకుండైన యాజైమినిముని వేదాభిమాన
దేవతాకూతవిపరీతమైన యీమత మెట్లు చేసెను? వైదికశేఖరుండవై
నయోతంత్రీయపన్యాయతమోభాస్కరసునయోక్త్యసిధారచే
నీసంశయంబుఁ ద్రెవ్వం జేయుమని కుమారుఁడైన శుకుండు పల్కిన
[20]ప్రశ్నభాషణంబులఁ గన్నులు వికసించి వేదాభిమానదేవతాకూత
తత్త్వవేదియైన వ్యాసుం డిట్లనియె.


వత్సా! యీ దుర్వాదృగ్వాదిజన్మనిమిత్తంబు నీ వెఱింగి
యును దద్వాక్యంబులకు క్షుద్రనయార్థిత్వప్రసిద్ధికొఱకు నడిగితివి,
విను; మిటువలె వాదించు వాదులం బూర్వంబునందు నందికేశ్వరుని
చేత శపింపఁబడిన దేవద్వేషులు భూమియందుఁ బెక్కండ్రు నిర్భా
గ్యద్విజులై కుమేధస్సులై పుట్టి యయధాభిదైకదేశలేశులై తోఁచినట్లు
వేదార్థనిర్ణయమునందు నింత యనియెడు పరిమితి నివేదనంబునందు
నింతయన్న [21]పరిమితిని, కూపకూర్మసమానాభిమానులై వేదాంత
సాగరంబుల నసంఖ్యేయంబులఁగా నెఱుంగక దేవమాయామోహితులై
తలంచిరి; సమస్తవేదంబులును గార్యపరమే కావలయునని తన్న
యంబునఁ బలికి వేదంబునందును బదవాచ్యబుద్ధిలోకవ్యుత్పత్తి
మూలమైనదియె; కార్యానన్వితసిద్ధార్థవిషయమై లోకంబునందుఁ
బదసంగతి లేదు. మఱి యేమి [22]యన: కార్యాన్వితంబైన కార్యమునం
దేరి ఙాద్యన్యతమాభిధ యగు నటుగాన మంత్రార్థవాదంబులకును
గార్యాన్వితార్థత యనియెడు హేతువువలన సమస్తవేదంబులును
గార్యపరంబు; శ్రేయస్సును గార్యపరమే; శ్రుతితాత్పర్యగోచరమైన
శ్రేయస్సు దానికంటె మఱియొకటి కాదు; కామ్యార్థంబునందును
గార్యాన్నమైన స్వర్గాదిసంజ్ఞత ఫల మెద్ది గల దది యానుషంగికఫల;
మిష్టమైనదాని నిచ్చుచున్న ప్రభువైన రాజుంబలె మాకుఁ గార్యమే
ప్రధానంబు; ద్రవ్యంబుబలెఁ గార్యంబు గూర్చి దేవతలు ప్రధానం
బులు గారు; వారలకు భోక్తృత్వము[23]ను యాగప్రసన్నత్వము[24]ను యాగ
ఫలదాయకత్వము[25]ను వేదనివేదదూషకులు చెప్పుదు; రింతియె కాదు

చిదచిద్రూపవిశ్వనియామకుండైనవాఁడును లేదా తనయందు నను
పప్లుతంబైన ప్రత్యక్షంబు గాని యనుమానంబు గాని లేదు; శ్రుతికిఁ
గార్యానన్వితసిద్ధార్థంబునందుఁ బ్రామాణ్యంబు లే దిది గనుక సర్వే
శ్వరునియందు నేమియును బ్రమాణంబు గా దనిరి; వేదాద్యభాగ
తాత్పర్యన్యాయసూచకుండైన జైమినిముని యభిప్రాయంబు నెఱుం
గని దుర్బుద్ధులు నందికేశ్వరశాపానురూపకేవలకర్ము లైరి; వా రల్ప
బుద్ధులైన బ్రాహ్మణులును వారిని వైదికులంగాఁ దలంచి ప్రతిపదంబున
నంధలగ్నాంగులుంబలె నవలంబించి కర్మలగ్ను లగుదురు; పుత్రా!
వారి బుద్ధిమాంద్యంబుఁ దెలిసి దేవతలు యాతయామంబులగు
కర్మంబులు చేసి దుఃఖపడుచున్నవారి కిట్లని దుఃఖ మందుదు రగ్ర
జన్ములైన యీద్విజులకు బుద్ధిమాంద్య మయ్యె; నాశ్చర్యం బెవ్వరు
వేదకృత్స్నతాత్పర్యంబునందే తలంచిరి, కార్యమాత్రపరత్వ
మయ్యెనేని కృతికి నెట్లు సమ్మతమై సిద్ధించెడిని? ప్రయోజనపదార్థావ
బోధకత్వంబు శ్రుతికి సమ్మతంబు విచారించుచుండ సుఖమే లోక
ములయందుఁ బురుషార్థమై సమ్మత మగు దుఃఖహాని యయ్యెనేని
జనులచేతం దనయంతనె యంగీకరింపఁబడదు; దుఃఖానువృత్తి
యందు దుఃఖం బనుభవింప నిష్టంబు గానియది యని తనయంతనె
దుఃఖహాని పురుషార్థంబు గాదు. [26]సుఖమైన తనయంతనె పురుషార్థమై
తగు; నీప్రకారంబునను సుఖపురుషులచేతం బ్రార్థింపంబడునని
దానికిఁ బురుషార్థత్వంబు యుక్తంబు; ఇతరంబున[27]కైనచో లేదు.
దానికి బారంపర్యంబుచేత గాని సాక్షాత్తు గాని పురుషార్థిత్వ మాపే
క్షిత మని పురుషార్థ మగుటచేత మిత మని యుండఁగా నిటువలెఁ
బారంపర్యముచేతఁ గాని సాక్షాత్తు గాని పురుషార్థమై సమ్మతంబు గాని
యాకార్యంబు తనంతటనే పురుషార్థ మెట్లగు? ఎవ్వరికిఁ గేవల
కర్మమే శ్రేయం [28]బగును; సుఖంబును శ్రేయంబు గాదు; తద్ధేతువును
శ్రేయంబు గాదు; దుఃఖవిలయంబును శ్రేయంబు గాదు. వారు దుర్భగు
లెవ్వరికి సర్వకార్యంబులు నశ్రేయఃప్రతిపాదకత్వసుఖబ్రహ్మ
ప్రసక్తికొఱ కగును వారలె సుభగులు బుధులు; ఏమి చేయుదుము;
పరబ్రహ్మంబైన విష్ణు వెవ్వరికిం బ్రసన్నుం డగుచున్నవాఁ డాప్రాణి
విశేషంబులు దయచేతను బుద్ధు లెవ్వరు తన్నిర్హేతుకకారుణ్యవిష
యలు గాని వారికి బుద్ధులు స్ఫురింపవు; లోకములు న్నెఱుంగరు.

వేదార్థం[29]బయిన మిక్కిలియు న్నెఱుంగరు; సర్వశబ్దంబులకును
లోకంబులయందుఁ గార్యాన్వితార్ధత గల దాలిఙాదికంబునకు లౌకి
కంబునందుఁ గార్యాన్వితార్థత్వంబు లేదు గాని లౌకికమైన 'గామాన'
యేతి వాక్యంబునం దానయము కార్యంబు గా దాపద మేమిటిచేతఁ
గార్యాన్వితార్థ మయ్యెడి, నేకవాక్యంబునందుఁ గార్యద్వయంబు
లేదే – కార్యద్వయంబుచేత నాపదంబులకు నన్యోన్యాన్వయం
బయ్యెడి; తత్పదంబులకును గార్యాన్వితార్థత యయ్యెడిని; కార్య
పదంబునకంటె నన్యపదంబు సమస్థలంబులయందును గార్యాన్యి
తార్థత్వంబు విడువదనియును బ్రకారంబు గాక యుండం [30]జూచుటం
బట్టుండియును నియమంబు లేదు: లిఙోలోట్తవ్యావృతమయోగులైన
పదంబులకే వాక్యత్వ మనియును నియమంబు లే దన్యములైన
పదంబులకును వాక్యత్వము చూచినారము గనుక 'కింతేస్తే వేద
విద్యతి' యనియెడునది ప్రశ్నవాక్యంబు; తదుత్తరవాక్య మయ్యెనేని
'యస్త్యేవ మేవేతి' యనియెడునది యీప్రశ్నోత్తరవాక్యంబులకు
లిఙాద్యన్వయం బెక్కడిది? వక్తలయందు భూతవాక్యంబులయందు
సిద్ధివ్యుత్పత్తివిషయమై యుపాయంబులు గలుగుచునుండఁగాను,
బరులచేత నేమి యాకాంక్షాద్యనుబంధంబుగల తిఙ్సుబంతకదంబకము
వాక్యవ్యవహారంబునకు నంగమై యుండునది; లోకవేదంబులయందు
భూతవర్తమానభవిష్యత్ప్రత్యయనమభినైష్యద్విజయవ్యాహృతుల
యందునేని లిఙాద్యన్యతమముతోడం బదంబులకు నవ్యగన్వయంబు
లేదే! యన్వయముచేత నావాక్యంబులు కార్యార్థంబులు సాక్షాత్తున
నయ్యెడిది; భూతవాక్యంబులయందును లిఙాద్యన్వయ మెటుగాన
సర్వవాక్యంబులును భూతార్థంబులుగా నిశ్చయింపఁబడుచుండ
లోకంబులందును వేదంబులందును భూతవాక్యంబులకు సిద్ధి [31]నిష్ఠ
యగును; లిఙాద్యన్వితవాక్యంబులచేఁ గార్యార్థ[32]నిష్ఠత యగు నిట్లని
యోగ్యాన్వితంబులైన వాక్యంబులందు నాద్యంబైన సంగతిసంగ్రహం
బాసర్వవాక్యంబులందు గార్యత్వం బుద్దిష్టప్రవర్తిక యైనది గా
దిష్టసాధనతాబుద్ధికిం తత్ప్రవర్తనహేతుత్వంబు సమ్మతంబు; కృతి
యోగ్యోష్టహేతుత్వబుద్ధియె యుభయసమ్మతంబు; కార్యబుద్ధి[33]యై
నచోఁ ద్యాజ్య; ముభయసమ్మతము గా దిదిగాన సర్వవాక్యంబులును
గార్యార్థంబులే యనియెడునది యుక్తంబు గాదు; వ్యుత్పత్తియు నటు

వలెనే; ఆవ్యుత్పత్తి లోకవేదభేదంబులచేత ద్వివిధంబై యుండు
నారెంటిలోన మొదలిలౌకికవ్యుత్పత్తి ప్రత్యక్షభేదంబుచేత నిష్పన్న
మైనయది: యన్యంబైన యీవైదికవ్యుత్పత్తి యాగమంబుచేత
నైనయది; ఆమూకబాలకులు జన్మంబు మొదలుకొని నయనములు
దెఱచి ప్రతిదివసంబునందును దృశ్యములు చూచుచు నున్నవారలై
కార్యంబునందు స్వపరవైషమ్యంబు దెలిసి తలిదండ్రులం జూచి
దైవవశంబునం బ్రథమవాసన గలవారలై యంతదాత యనియు నంబి
యనియుఁ దన్నామంబులం బల్కుదురు. సత్సంజ్ఞాసంజ్ఞాసంబంధ
జ్ఞానజిజ్ఞాసులైన స్వకీయులచేత 'మీతండ్రి యేఁడి' యనియు 'మీ
తల్లి యేది' యనియు నడుగంబడిన నాబాలకు లాతండ్రినిం దల్లినిఁ
దర్జనిచేత నిరూపించి తాతాంబేత్యాదిశబ్దములకు నావాక్యంబునందుఁ
గార్యాన్వితార్థ గలదా? వారికిం బ్రథమశబ్ద మగుటం జేసి మున్ను
గార్యపదాన్వయము లేదు; ముందఱను దత్కాలంబునందును
దావన్మాత్రపదోక్తిం బట్టుండి లే దంతకంటే ముందఱికాలంబుల
యందును యాహియహి యనియెడి భాషణము పూర్వకాలికవాక్య
కార్యాన్వయావహమై వ్యాప్తమై యున్నయదియుం గాదు; సమస్త
ప్రవర్తనంబులయందును గార్యతావగతివలననే హేతుత్వ మని
పలుక మదిగాన వ్యాహారసంభ్రమ మనియును గార్యాన్వయ
మితంబునందును ద్యశబ్దార్థసంగమబుద్ధిప్రాగ్భవీయాత్మపుణ్యాను
రూపకాలసమిద్దశక్తి గల సంజ్ఞే సంజ్ఞాన్వయోల్లేఖి ప్రథమజ్ఞాన
హేతువైన నవికల్పకసంజ్ఞితమైన ప్రత్యక్షంబుచేతం జేయంబడినయది;
నిఘంటుప్రముఖంబులైన యుపాయంబులచేతను గార్యాన్వయంబు
విడిచి వీనికిని వినామంబు లగుచున్నయవి యని బోధించువారిచేత
వాక్కులకు సిద్ధబోధకత్వంబు ప్రపర్తించునని మనుష్యులకు [34]'బాధ
యంతీతి వాం సాహ్ని (?) ఛందాంసి' ఇత్యాదివైదికంబులైన నిర్వ
చనంబులచేత సిద్దమాత్రాన్వయబుద్ధి వాక్కులకు నయ్యెడునది గానఁ
బద మొకానొకయెడం గార్యానన్వితంబైన యర్థంబును జెప్పు నొకా
నొకయెడం గార్యయుక్తార్థంబునుం జెప్పుమని నిర్ణయంబు సేయుట
యుక్త మిది గాన మంత్రార్థవాదంబులకును గార్యాన్వయంబు విడిచి
యేస్థలంబునందుం దమలోఁ దమకు నన్వయంబు దృష్టమైనయది
యదియందుఁ గార్యంబునందును బ్రమాణత యంగీకరింపఁబడిన
యది. స్వర్గాదికంబునందుఁ బదార్థములకు సార్థ[35]నిష్ఠత మానాంతర

ప్రాప్తిబాధరహితమైన యది యర్థయుక్త మౌటచేత నేవిధులకు వారి
చేత శ్రుతమైన యర్థము గల వాక్యమునందును బ్రమాణతాశంక
పోగొట్ట దదియును నీప్రకారంబునను బ్రమాణోపనిషత్తులకును
వారలచేత నందుచేతనే ప్రమాణత్వశంక పోఁగొట్టంబడియె, నను
నయంబున మానమదిగా సనుపనిషన్మీమాంసారంభసంభ్రమంబును
న్యాయమైనయది యీప్రత్యక్షానుమానంబులు విశ్వచిదచిద్వస్తు
నాయకునియందుం బ్రమాణంబులు గా వానాయకునియందు సమీచీన
న్యాయోపబృంహితంబులైన వేదాంతంబులే ప్రమాణంబు లది గాన
యాశ్చర్యశక్తికుండైన యాస్వామి సర్వవేదాంతరాత్మాధిష్ఠితంబు
లైన మఖంబులచేతను బ్రీతుండై తత్ఫల మిచ్చుటకై సమర్థుండు;
జైమినియందు జైనవీరులయందు మొదలు సత్పురుషులకు విశ్వాసంబు
పుట్టింపుచున్నవాఁడై యతివాదంబుచేతం గర్మైకప్రాధాన్యాది
కంబును సూచించె నదిగానఁ దదతివాతోద్ధత శ్రద్ధాజడమతులై
తత్కార్యము తనయంతనె ప్రధాన మని తలంతురు; పుత్రా! వారలు
పూర్వదుశ్శాపతాపజ్వరవికారులై ప్రలాపించుచున్న వారలం జూచి
సత్పురుషులైన వారలు తద్వాక్యంబు లాచరింపరు; సాంగంబులై
న రహస్యంబులైన వేదంబులు చదివి వ్యుత్పత్తిలేశజనితతద్వేదార్థ
వివేకరేఖలు గలవారై తద్బోధశోధననయములను గురుముఖంబుల
వలనం దెలిసి యశేషమూర్తియైన స్వామిని సుగమార్థంబుగా
నెఱుంగంగలరు.

51


మ.

హరిపాదాబ్జయుగంబు గొల్చి సరహస్యాశేషవేదస్ఫుర
త్పురుషోత్తంసనిజాశయం బెఱిఁగి యుద్బోధామృతాస్వాదులై
పరమోత్కృష్టులఁ జేసి తత్పదరజఃపట్టాభిషేకంబుతో
దురసంతామరు లెన్న డుండెదరొ సాధు ల్మెచ్చ వీతార్థులై.

52


మ.

అని యీరీతి దయాళుదివ్యనివహాత్యంతైకశోచ్యక్రియా
ఘనదుర్బోధవివిష్ణచిత్తుల వృధాగర్వాంధులన్ వేదవి
త్తనిరోధార్థకరాత్ములం గని వినీతత్వంబునన్ మ్రొక్క మ
న్నన నీక్షించి ప్రియంబు వల్కఁదగ దెన్నన్ సజ్జనుం డెన్నఁడున్.

53


సీ.

షడ్గుణైశ్వర్యాదిసంపన్నవేదవే
                       దాంతతాత్పర్యవిద్యాపయోధి
ప్రబలకుదృష్టిదుర్వాక్యసంజాతమౌ
                       మద్భ్రాంతి యణఁగె సేమంబు గంటె

వెలయ ధర్మాధర్మవిద్యాభిమానదే
                       వతలవిజ్ఞాపనం బతులశక్తి
సనకాదులు వినంగ శౌరి యాలించి యే
                       మనియె నాసనకాదియతుల మఱియు


తే. గీ.

నాకృపానిధి సౌందర్య మపుడు గనిన
వారి నేమని మన్నించి వాసి కెక్కఁ
దత్త్వవిజ్ఞానలీలానిధానమూర్తి
యన్నియును మాకు నెఱిఁగింపు మాదరమున.

54


క.

అని సుతుఁడు పల్క నాతని
ఘనబుద్ధి పరాత్మతత్త్వకలితజ్ఞానా
భినవసుధాద్యభిముఖయై
కని మనియె నటంచు మౌని కరఁగుచు ననియెన్.

55


సీ.

పుత్రక! నేఁడు నీబుద్ది యేమనిన ను
                       తింపుదు నీవే సాత్వికుఁడ వాకు
దృష్టివాక్యోద్ధూతతీవ్రవిఘ్నంబు ల
                       న్నియు నొంచి సత్కథానియతి గనియె
నెవ్వరియందుఁ బరేశు కృపాసింధు
                       వమలయై ప్రవహించు నట్టి ఘనులు
సకలాంతరాయముల్ శక్తి మీఱి తరించి
                       తత్కథాసుధఁ గ్రోలఁ దలఁతు రాత్మ


తే. గీ.

నచ్యుతునకుఁ బ్రియంబైన యట్టి కర్మ
మచ్యుతాప్రియమైన యట్టి కర్మ
మమరు ధర్మంబు నాయధర్మము నటంచు
మేర దెల్పుచుఁ దచ్ఛృతిస్మృతులు పల్కె.

56


సీ.

శస్తంబులే నప్రశస్తంబు లేని ధ
                       ర్మాధర్మములు సేయునంతలో శ్రు
తిస్మృత్యుభయసముద్దీపితస్వర్గదు
                       ర్గతి మర్త్యరూపలోకములు గాంచి

తదధీశ్వరాజ్ఞాపితస్థితి సుఖదుఃఖ
                       ములు రెండు చెందుదు రలఘుశక్తి
[36]ప్రబలి ధర్మాధర్మబహుళదానాధికా
                       రుల ప్రభువులఁ జాలఁ బ్రోది సేసి


తే. గీ.

యాత్మసంకల్పమున నీయదార్థములు ఘ
టించ నెల్లప్పుడును నియమించు ధర్మ
దేవతయు నాయధర్మాధిదేవతయును
భగవదిచ్ఛానువృత్తి సంపత్తి కతన.

57


వ.

ధర్మాధర్మాభిమానదేవతలు శ్రుతిపారగులచేత నిట్లని పలుకంబడి
యెను; వేదపురుషాభిప్రాయసందర్శన మగు తద్విజ్ఞాపనంబు తెలియ
నవధరించి నవ్వుచు ద్విజులఁ జూచి భగవంతుం డిట్లనియె.

58

శౌరి సనకాదులకు కర్మకాండాదివిషయంబు లెఱింగించుట

క.

జిజ్ఞాసువులై మీరలు
ప్రాజ్ఞులు న న్నడుగఁజూచు పద్ధతి దోఁచెన్
జిజ్ఞాస వొడమఁజేయును
సుజ్ఞానమె మత్ప్రసాదశోభనలీలన్.

59


క.

బ్రహ్మవిదుత్తంసులు స
ద్బ్రాహ్మణసత్తములు పూర్ణభగవద్భక్తుల్
బ్రహ్మం బిట్లాడిన విని
జిహ్మేతకులై యడిగిరి చేతోగతులన్.

60


క.

సర్వోత్తమ హరి స్వాఖిల
సర్వాత్మానాత్మవస్తుసంధాయక! నిన్
సర్వము నడిగెద మిపు డో
సర్వేశ్వర! నీదుకరుణ సాధ్వస ముడుగన్.

61


క.

సేయుఁ డిది సేయకుం డిది
పాయక మును గర్మకాండ పరిచితవిధు ల
త్యాయతిఁ బల్కఁగ సేయం.
జేయకయుండన్ సమర్థశీలురె మనుజుల్.

62

వ.

అనీశ్వరాత్ములై కర్మములందు స్వతంత్రులు గానివారికిఁ గర్తృత్వ
మెక్కడిది? పాణిని "స్వతంత్రః కర్తా” యనఁడు గాన.

63


ఆ. వె.

ఫలము కర్తృగామి పరికింప ననుచు మీ
మాంసకులు వచింతు రఖిలకర్మ
ఫలమ కర్త లగుచుఁ బరఁగిన నరులకు
నవ్వయించునే నిరంతరంబు.

64


క.

వెలయఁగ సఫలాన్వయులకుఁ
గలుగునె కర్మాధికారకల్పన కర్మం
బుల నైశ్వర్యముఁ గాంచుట
పొలుపుగ నధికార మనిరి బుధవరు లెల్లన్.

65


సీ.

అందఱు ననమర్థు లగుదురు నరులు రో
                       గాదిపీడితు లసమర్థు లందు
విధి చెప్పఁబడదు భావింప వారికి నధి
                       కారంబు లేదు లోకమునఁ గొంద
ఱతిసింహబలులు కామామయార్థితు లతి
                       కామార్థితులు విధిక్షములు వారు
సతతరజఃక్రోధజవికారవశమున
                       నిరపత్రపాత్ములు నిర్దయులును


తే. గీ.

నీచవృత్తులు నగుచు వినిశ్చితంబు
[37]గా నిషిద్ధక్రియల్ సేయఁబూనువారి
[38]త్రిగుణకాననావచ్ఛిన్నధీబలాతి
కామరోగుల నియమించఁగాఁ దరంబె?

66


వ.

దేవా! స్మృతిసహితవేదమత్వదాజ్ఞ యని వింటిమి భ్రాంతుల
నాజ్ఞాపించు స్వామి యట్టి వివేకవంతుండుగు.

67


మ.

'అతిచిత్రార్ధము లౌ శృతిస్మృతులు మాయాజ్ఞల్ తదుల్లంఘన
స్థిత మద్ద్రోహ' మటంచు నాడితిరి లక్ష్మీనాథ! తద్ద్రోహదు
ర్మతులం దెల్పుచు మీఱినం దెగుచు సమ్యగ్భక్తియై నిల్చు సు
వ్రతుఁడౌ స్వామియు నెన్నిచందములు విభ్రాంతుండు గాకుండునే?

68

తే. గీ.

అబుధు లసమర్థులు ననర్ధులైనవారు
నిందు నధికారయోగ్యత నందఁగలరె?
యనుచు మామానసములు మోహంబురాశి
[39]మగ్నము లగుచునున్నవి మఱియు మఱియు.

69


క.

హరి సత్వసత్వవేదివి
పరమదయానిధివి మోహబంధాంతరసం
హరణైకకారణం బగు
వరవిజ్ఞానంబు దెలుపు వాత్సల్యమునన్.

70


వ.

ఈయనుయోగాపరాధంబు సహింపవే యని విన్నవించిన సనకా
దుల తత్త్వశుద్ధికి మెచ్చి యిట్లని యానతి యిచ్చె నప్పుడు.

71


సీ.

వెరవకుఁడీ యోగివిభులార! [40]మీర లు
                       త్తములు మీ కెఱిఁగింతు దయ దలిర్ప
స్వాధీనమగు విశ్వమంతయు నదిగాన
                       నరుల బోధించెదఁ బరమనియతి
దీపించు నాదుశ్రుతిస్మృతి శక్తి గొం
                       దఱు ప్రవర్తింపఁ గొందఱు నివృత్తి
యంద తత్ప్రాగ్భవీయానేకకర్మాను
                       [41]రూపపురాణాదు లేపు చూప


తే. గీ.

ధరణి మద్దత్తమైన స్వాతంత్ర్యశక్తి
తత్కృతార్ధఫలావహత్వము వహించు
సత్యసంకల్పత సదా ప్రశస్త మగుచు
...............................................

72


క.

అరణిగతానలశక్తి
స్ఫురణంబును బోలె బద్ధపురుషులశక్తి
స్ఫురణము ప్రకాశ మందదు
పరిపూర్ణజ్ఞానమహిమబద్ధం బగుటన్.

73

తే. గీ.

సత్త్వగుణము రజోగుణస్థగితమైనఁ
బెరసి లోభాదిసంజ్ఞితస్పృహ జనించు
సత్త్వగుణము తమోగుణస్థగితమైనఁ
బృథివి మోహాజ్ఞతాధికస్పృహ జనించు.

74


తే. గీ.

రజతశుక్తి నయార్థవిభ్రాంతి మోహ
మనిరి యఖిలార్థవేదులౌనట్టి నూరు
లది యెఱుఁగకున్కి నజ్ఞాన మనిరి కొంద
రాగమాంతవిశారదులైన ఘనులు.

75


వ.

సమస్తాత్మలకును జ్ఞానశక్తిచేతనే వివిధక్రియలు నగు నజ్ఞులకుఁ
గాలకర్మమాయాశక్తిసాపేక్షయైన నిజశక్తిచేత సుఖాదిప్రాప్తిహేతు
సర్వక్రియలు నగును; మఱియు నాకును నాదాసులైన నిత్యముక్తులకును
కేవలధీశక్తులచేతఁ గాలకర్మమాయాశక్త్యనపేక్షాక్రియలగును.

76


తే. గీ.

జగతి సర్వాత్మలకు జ్ఞానశక్తి తత్స్వ
భావసిద్ధంబు దానిచేఁ బ్రబలియుండ్రు
కర్త [42]లెల్లరు సత్యసంకల్పు లనఁగ
నియతి దర్కింప నిది శాస్త్రనిర్ణయంబు.

77


తే. గీ.

విశ్వసృష్టిస్థితిలయాది వివిధకర్మ
ములకు స్వాతంత్ర్య మగు నెట్ల మొదల శేషి
నైన నా కిట్ల శేషవృత్త్యంతరముల
నాత్మలకు నైన స్వాతంత్ర్య మమరియుండు.

78


సీ.

అవి గాన మఱి నియమ్యత నున్నయట్టి యా
                       త్మల నన్నిటిని సదామ్నాయశక్తి
బోధింతు ననయంబు పొందదు తత్తదా
                       త్మహితప్రధానసమర్థనిత్య
నైమిత్తికాదులు నడి పెడిచో నిత్య
                       కర్మంబు నిజశక్తి గలుగు కొలఁది
జేయఁగాఁ దగు శాస్త్రశిష్టాచరణములు
                       గల వశక్త్యాత్ముఁడై కర్మ లెల్లఁ

తే. గీ.

దత్సమర్ధుండువలెఁ బూనఁదగదు కర్మ
నిష్కృతికినై సమర్ధత నిర్ణయించి
రార్యు లాకామ్యకర్మంబు లట్ల శక్తి
[43]గాదు ధర్మోదయము తన కడ్డపడును.

79


వ.

కామ్యకర్మ సుకరంబుగా వేదంబు లుపాయంబు కామప్రేరితచేత
స్కుల కెఱిఁగించునది; ఆత్మ ప్రామాణ్యజ్ఞాపనార్థంబుకొఱకె
యట్లు గాకున్నఁ గాముకుండు వేదప్రామాణ్యంబు విశ్వసింపండు;
భ్రాంతాజ్ఞాపనమునందు నియంతకు నవివేకత్వంబు లేదు; భ్రాంతుండై
కూపంబునం బడియెడువానిం బడవలదని నియోగింతురు బుధులు
వారి భర్జింతురు; దయలేని వారలా వారు? విన నెఱుంగ కించి త్తెవ్వరు
సమర్ధులు? భ్రాంతులైనం గానివారి నుద్దేశించి శుభాశుభంబులయందు
విధినిషేధంబులు బోధింపందగు; చేయుఁడు సేయవలదను మాటలు
విని యుక్తవృత్తు లగుదు రెవ్వ రతిభ్రాంతమతులై కామరోగులై
యుంద్రు; వారు క్రూరభైషజ్యంబులచేతనుంబలె దండనంబులచేత
విభ్రాంతిం బొందకయుం డ్రెవ్వరు సన్నిహితవిషాఝాచ్యాద్యతి
వృద్ధులయందు శిరఃపాదారవిదాహంబు సేయుదురు వారు భ్రాంతు
లాయనయు లాయది గాన యనాద్యచిదాచ్ఛన్నబుద్ధులై భ్రమంబు
నొందువారలకు న్నాజ్ఞాపనాదులు సేయు ప్రభుండనైన నాకు నీతి
యెక్కడిది? మఱియు నెవ్వరు స్వస్వతంత్రతను మచ్ఛక్త్యాపేక్షయైన
దాని ననపేక్షంబుగాఁ దలంతురు వారు స్వస్వకర్మబద్ధులై యుండి
రెవ్వరా స్వతంత్రత మత్స్యక్త్యవేక్షంగాఁ దలంతురు వారు స్వకర్మామ
లాత్ములై భవబంధంబులం బాయుదురు.

80


సీ.

త్వరతో ననాద్యచిద్బంధంబు విడిపించి
                       జనుల నిల్పఁగ నాకు శక్తి గలిగి
యుండినయేని తదూర్జితస్పృహ యాద
                       రింపుదు వాత్సల్య మింపు మెఱయఁ
దత్తదాత్మవిషయోద్యన్మహేచ్చానుసా
                       రమున మెల్లనె భవారంభ మణఁచి
మత్పదంబున వారి మన్నించి వెలయింతు
                       నతిమహోదారుండ నైన యేను

తే. గీ.

కామితార్థ[44]ప్రదానదీక్షావ్రతమున
నర్థులకుఁ బరిణామహితార్థ మిచ్చు
నట్ల యొసఁగఁ దలంచనేన పరిణామ
హితము యోగీంద్రులార మీ రెఱిఁగికొంద్రు.

81


క.

పరిణామహిత మనంగా
నరయఁగ భవనాశహేతు వగు నెన్నికఁగాఁ
బరిణామాహిత మనఁగాఁ
బరగున్ భవబంధకృత్యవదకారణమై.

82


వ.

ఇట్లు నాకు స్వాధీనవిశ్వత్వ ముపనిషత్తులు పలికె నట్లనే నాకుఁ
గర్మకాండంబును సావకాశం బయ్యె నిందునకు సందేహంబు [45]లేశం
బును లేదు; నన్ను నెవ్వి యడుగవలయు రహస్యం బడిగెద రది
యెఱింగింతు వినుండు.

83


మ.

హరి వేదూక్తి ననాద్యజావృతనిజాత్యంతప్రబోధప్రభా
పరమాజ్ఞాజ్ఞజనాంతరాత్మయయి సంభ్రాంతాత్ములన్ సద్విష
గ్వరుఁ డాయుశ్రుతి శక్తి రుగ్మిఁబలెఁ బ్రాక్కర్మోచితప్రక్రియా
గరిమం దా నియమించుటం గొలువఁగాఁ గాంక్షింతు రయ్యుత్తముల్.

84


ఆ. వె.

ఘనత నిట్లు కర్మకాండాగమాంతవా
గ్రూపవేదహృదయరూప మెఱుఁగు
భవ్యులకును గర్మఫలము లొసంగు నా
యందుఁ బుట్టు భవము లడఁచుఁ దలఁపు.

85


చ.

హరి గరుణించి యిట్లు తమ కానతి యిచ్చిన వీతమోహులై
పరువడి మ్రొక్కి మ్రొక్కి బహుభావములం గొనియాడి యాడి హృ
త్సరిగతసంశయం బుడిగి ప్రాంజలులై యతిలోకశేఖరో
త్తరు లతిశోకశీలుఁ డగు తత్పరమేశ్వరుఁ గాంచి రంతటన్.

86


వ.

ఇట్లని వినుతించిరి.

87

ఆ. వె.

దేవదేవ! స్వామి! దివ్యవిజ్ఞానప్ర
దానదక్ష! యాత్మదానధుర్యు
నీదుధామ మెట్లు నే మెట్లు బ్రహ్మాది
దుర్లభంబు మాకు దొఱకు టెట్లు?

88


క.

స్వామి! యకించనులము మీ
శ్రీమత్పాదాంబుజములు సేవించి మహో
ద్దామజ్ఞానసుధాబ్ధిన్
సేమంబున నీదుకరుణఁ జెందితి మెట్లున్.

89


వ.

మనోవ్యథ తీఱెను; దుర్జ్వరంబువలె నున్నయది యొకటి బ్రహ్మాండో
దరవర్తులైన ధీరులు యుష్మద్విరోధులైన యసురులచే బాధ నొంది
వర్తించిరి; తత్సాధుద్రోహంబువలన వారికి నప్పుడే ఘోరయాతన
లెటువంటివి గాఁగలవో వారి నెవ్వఁడు రక్షించు భవద్దర్శనానంద
సాగరంబున మునింగి యింతకాలంబు మఱచితిమి; ముం దరమర
మే మోభవపయోధి మునింగి తెప్పలేక యున్న మమ్ముం గావు; ప్రసన్న
పారిజాత! నీవు దక్క నెవ్వరని విన్నవించినఁ బ్రసన్నాస్యుండై
సనకాదులతో భగవంతుం డిట్లనియె.

90

శౌరి సనకాదులకు మోక్షప్రాప్తివిధానం బెఱింగించుట

సీ.

యోగీంద్రులార! మీ రుత్తముల్ వినుఁడు మ
                       దాత్మగతంబైన యాదురాభి
మామకులైన మీమానసంబులఁ బ్రతి
                       బింబించి కాన్పించెఁ బెద్ద యగుచు
నల మామకజనంబు లంతయు నేనును .
                       బ్రాప్తకాలమ్ము స్వభావముననె
యైన లోకానుగ్రహార్థత నన్యుఁ డా
                       దుఃఖంబుచే నతిదుఃఖ మంది


తే. గీ.

యుండుటలు పూర్ణకాముల కుచితవృత్తి
యార్తులగు వారిఁ జూచి తారార్తులైత
[46]దార్తి మాన్పఁదలంచెద రట్లు గాన
[47]మోహతాపంబులకు నింక మోడ్పు గలదె!

91

తే. గీ.

దుర్జనాజ్ఞానతమముఖోద్భూతశక్తి
యైన సుజ్ఞానభానునిచే నడంచి
నిల్చెద మహాత్ములార సునిశ్చితాత్ము
[48]లై మనోవ్యథ నొందకుఁ డనఘులార.

92


క.

ఏమూఢులు నిగమైక
ప్రామాణ్యము విశ్వసించి [49]పాటింపరు నే
నామూఢులఁ దెల్పెద న
న్నామైఁ బ్రత్యక్షమునఁ దదనుమానమునన్.

93


తే. గీ.

[50]అఖిలవేదాంతవేద్యవిశ్వాత్మశీల
మైన మత్సత్వవిజ్ఞాన మసురులకు జ
నింపఁజేసెద మన్మనోన్నిద్రశక్తి
ఘనతరంబైన సంసృతి క్రమమునందు.

94


క.

ఏసంకల్పంబుల నేఁ
జేసినను ఫలానుమేయసిద్ధంబులు ప
ద్మాననముఖ్యుల కనుపమ
ధీసంపన్నులకు నైనఁ దెలియఁగ వశమే!

95


సీ.

ఇట్టి నాసంకల్ప మెఱుఁగకయున్న సా
                       ర్వజ్ఞభంగము గాదు వనజసంభ
వాదుల కెఱుఁగంగ నలవికానిది యెఱుం
                       గకయున్న నజ్ఞత గా దెఱుంగ
వచ్చినయది బుద్ధివలన నెఱుంగక
                       యున్నచో నజ్ఞత యొగి నశక్య
మయిన కార్యము సేయఁగను శక్తుఁడు గాని
                       యతఁడు దక్షుఁడు గాఁడె యరసి చూడ

తే. గీ.

[51]మునుపు గలుగు ఘటఘునట్ల వెనుకఁ గలుగు
నది యకార్యంబ కార్యంబు ననఁగఁ బ్రాగ
భావకాపతి యోగియై పరఁగి యుండు
నర్థశాస్త్రపరిజాత లరసిచూడ.

96


సీ.

ఏఁదక్క నితరుల కెఱుఁగంగరాకుండఁ
                       జేసితి నేనె విచిత్రమైన
మామకసంకల్పమహిమ తద్భక్తిమై
                       మత్తత్వధీసుధామధురరసము
లసురులఁ గ్రోలింతు నతిరోగశిశువులఁ
                       జక్కెర యనుచు నౌషధముఁ దల్లి
ద్రావించు నట్లు తత్త్వజ్ఞాన [52]ముదయింప
                       బోధించునట్టి దుర్బోధమతుల


తే. గీ.

నబ్జజాండాంతరావాస మపనయించి
యిచ్చటనె యుండుఁ డిమేరలె నని జగము
వెలయఁజేసిన దనిక తద్విధము మీకు
నాదరంబున నెఱిఁగింతు ననఘులార!

97


మ.

అల సుజ్ఞానులు నాకు నిష్టతము లత్యంతంబు మీ రట్టివా
రలలో మిక్కిలి నాప్తు లౌట మిము సారస్ఫూర్తి పంచింపఁబో
ధలవోదగ్రతచేత నీభవనయంత్రం బంతయుం బూనెదం
గలదే మా యిక నాటకంబు గడపంగా దుష్కరం బెద్దియున్.

98


క.

[53]నామాయామయమోహిని
పామరదానవుల భ్రాంతి పఱచుట యఱుదే!
నామాయఁ దెలియఁ జిత్రము;
సామాన్యుల కెల్ల నెఱుఁగ శక్యం బగునే!

99


సీ.

మన్నింత్రు కింకరుల్ మాననీయులు మన్ని
                       యోగంబు కతన ననూనయశులు
సత్యసంకల్పు లాసురవంశమునఁ బుట్టి
                       తత్సమాకారేంగితప్రకార

శక్తిగుణోదయసంపద తద్దైత్య
                       జాతికి నెల్ల విశ్వాస మొదవ
దీపించి బాహ్యకు దృష్టిసమ్మతమైన
                       మతమునఁ బ్రియతమస్థితి వహించి


తే. గీ.

నిస్త్రయులు నిర్దయులు నతినీచతరులు
నగుచు ఘోరతరక్రియ లాచరించి
వైష్ణవద్రోహబుద్ధిమై వార్త కెక్కి
సాధుదూషణపరిచితాచారు లగుచు.

100


వ.

అవైష్ణవులంబోలె నాయందు ద్వేషంబు గావింపుచుఁ గపటంబునం
దిరుగుచు, జితత్రిలోకాధిపతులై జగత్రయంబున ఖ్యాతి నొందుచుఁ
దామసులు తనవారన తామసోపాస్యచరణులై వారలకుం బ్రత్య
యంబుగా బ్రహ్మరుద్రాద్యుపాస్తి గావించి వారలవలన బహువరంబులు
గావించి యత్యాద్యైశ్వర్యపరాక్రమపయోనిధులై విరోధులుం
బలె నటించి మత్పదాంభోజంబు లందెరరు. బాహ్యంబున నసురతా
ఖ్యాతికై సురల బాధించెద రందు నొక్కరునకు.

101


ఉ.

ఔరసపుత్రుఁడై శ్రుతిశిఖార్థము లాడుచు మామకుం డొకం
డీరస మొప్పఁ దండ్రిఁ గవయించఁగ మీఁడనె తేర్చు వాదులన్
సూరుల గెల్చి శౌరి నిదె చూపెద నెందు నటంచు నాడినం
జేరి మహోగ్రవీరనరసింహనిజాకృతిఁ గాంచి నిల్చెదన్.

102


ఉ.

అంతట నన్నుఁ గాంచి పరమాత్మ సమస్తచరాచరంబు లి
ట్లెంతయు దానయౌ ననుచు నాసురవీరులు నిర్ణయించ బా
దాంతికసీమ వారి విగతాసులఁ జేసెద నట్టివేళ న
న్నెంతయుఁ జూచుచుం దనువు లీవి భజింతురు బ్రహ్మభావమున్.

103


క.

పాటిల్లెడు నీమాయా
నాటకసూత్రంబునందు నాప్రతిహారుల్
మేటులు జయవిజయులు ని
త్యాటోపులు మత్ప్రయోజనాయత్తు లిలన్.

104

తే. గీ.

మత్ప్రియైకప్రయోజనుల్ మన్నియోగ
గరిమఁ గృతయుగమున దితికశ్యపులకు
నల హిరణ్యకశిపు హిరణ్యాక్షు లనఁగఁ
గలిగెదరు ఘోరవీరరక్షఃప్రవరులు.

105


తే. గీ.

అందు నగ్రజుఁడు హిరణ్యకశిపుఁ డతని
యపరజుండు హిరణ్యాక్షుఁ డతిరజస్త
మఃప్రకృతు లుగ్రశౌర్యులు మత్తులప్ర
మత్తు లసురలు భజియింతు రట్టి ఘనులు.

106

ప్రహ్లాదుని చరిత్రము

సీ.

ప్రహ్లాదుఁ డనఁగ సద్భాగవతోత్తముం
                       డాదైత్యునకు సుతుఁడై జనించు
ధర్మవత్సలుఁ డనాఁ దనరిన బ్రాహ్మణుం
                       డతఁడు పూర్వభవంబునందు నీశ
తత్త్వధీమూలమై తనరు నకామ్యక
                       ర్మములు బాహ్యంగమై యమర శమద
మాదిసద్గుణరాజి యంతరంగం బగు
                       భక్తి నాయందుఁ గన్పట్టె నిలిచి


తే. గీ.

భూమి ప్రారబ్ధకర్మముల్ భోగ మక్ష
యింపఁజేయుచు మత్ప్రేరితేద్ధబుద్ధి
నుండి బ్రాహ్మణసభయందు నొక్కనాఁడు
తనదు విద్యావిలాస మంతయును నెఱపి.

107


చ.

అనఘునిఁ గర్మకాండరతుఁడై తగు నుత్తము ధర్మబంధుసం
జ్ఞుని మునివాది నొక్కని యశోనిధి డగ్గఱి యాగమాంతశో
భనమతమార్గధుర్యత సభాస్థలి గెల్చిన నాతఁ డాగ్రహం
బున శపియించె దైత్యకులముఖ్యుఁడ వయ్యెద వంచు నుగ్రతన్.

108


క.

శాపం బొసంగి పశ్చా
త్తాపంబు వహించి మౌని ధర్మవివేకో
ద్దీపితుని బ్రహ్మవిద్యా
రూపుని నె ట్లాడితిని సరోషాత్ముఁడనై.

109

వ.

అని కలంగి యిట్లనియె.

110


మ.

అపరాధంబు సహింపు సాధుజను లత్యంతక్షమాసార[54]
ర్మపరుల్ దత్కృపఁ జూతు రెవ్వరిఁ దలంపన్ నన్ను మన్నించు మ
స్రవయోనిం జనియించినం గలుగు పూర్ణబ్రహ్మవిద్యావివే
కపరత్వం బని శాంతి నొందఁ బలుకంగా నమ్రుఁడై యంతటన్.

111


వ.

ప్రతీకారంబు వర్జించి విప్రుం డిట్లనియె.

112


క.

శంకించి కలఁగ భగవ
త్సంకల్పానుగుణమైన జననంబున కా
తంకం బౌ నని మునిపతి
నంకించి నుతించి యేగె నాద్విజుఁ డంతన్.

113


వ.

తద్విప్రుండు హిరణ్యకశిపునకుం దనయుండై జనియించి రాక్షసులలో
ధర్మస్థితితో నడచుఁ గృతయుగంబునఁ; ద్రేతాయుగంబున రావణ
కుంభకర్ణులై వారలు జనియించిన విభీషణుండై నయోక్తులఁ దత్త్వంబు
బోధించు; ద్వాపరమ్మున వారు శిశుపాలదంతవక్త్రులై యుదయించిన
క్రతుసభాస్థలి సహదేవుండై తత్త్వభోధనిరూపణంబు సేయంగలండు;
తత్త్వజ్ఞులైన బుధులు నాసురయోనులైన వారల జయించెదరు; కలి
యుగంబున మఱియు.

114


క.

కలియుగచతుర్థపాదా
కలితశ్రీ నసురయోనిగతులౌ దుర్మూ
ఢుల శిక్షించెద దండన
ములచేఁ దగఁ గల్కినై విభుత్వము మెఱయన్.

115


తే. గీ.

ప్రబలబలమున నరసింహ రామ కృష్ణ
కల్కి సంజ్ఞల నాల్గుయుగంబులందు
వెలయ దుర్జనశిక్ష గావింతుఁ బూర్ణ
వైభవంబున నిర్జరవరులు పొగడ.

116

క.

ప్రకటం బగు మాయానా
టకసూత్రము నడప నతిదృఢస్థితి గలనే
నొకసూత్రధారుఁడను హృ
ద్వికలత యిఁక నేల విడువుఁడు మీరల్.

117


మ.

బలవత్తేజులు మీర లొక్కరతిఁ దద్బ్రహ్మాండమధ్యంబులోఁ
గలలోకంబులు చూచి సాత్త్వికుల ముఖ్యజ్ఞానులం గాంచి ని
స్తులబోధంబున నూరడించి ఘనముక్తుల్ మెచ్చ నేతెంచి మా
కెలమిన్ నాఁ డెఱిఁగించినప్పుడె మనోభీష్టంబుఁ గావించెదన్.

118


వ.

అని సర్వేశ్వరుం డానతి యిచ్చినఁ దన్నియోగంబునం బరిభ్రమించి
ప్రణమిల్లి స్తుతించి పరమవ్యోమంబునందుండి డిగ్గి యేతద్గుణ
ప్రశంస చేయుచు, బ్రహ్మాండంతస్థలోకంబులు చూచి సాత్వికుల
దుఃఖస్థితియు నసురలసుఖస్థితియుం గనుంగొని మరలి హరిపదం
బున కేఁగి యప్పుడు పరమవ్యూహవ్యోమలోకంబులు గడచి ప్రతీ
చ్యద్వారంబుకడ జయవిజయులు నిజప్రాప్తినివారకులై యుగ్రగదా
ధరులై పరమపురుషాజ్ఞోల్లంఘనంబు సేయుచు నున్నవారలుంబోలె
నున్న వారల నందాత్తసలోకాభిప్రవేశవిహితోద్యములైన వారల
నందోదరసజ్జనార్తిక్షయతత్పరులై యిట్లనిరి: ద్వారపాలకులారా!
ఉచితములైన మామాటలు వినుండా మీరు పరమానందయిత్రైశశేష
త్వమును మీయందు ననుసంధించి యథోచితముగా ద్వారమునందు
నున్నవారు; శేషేచ్చ ననువర్తించి యశేషచేతను లుండందగును;
మీరు స్వోదరావశ్యకార్యార్థస్థితి యిచ్చయించి నట్ల యున్నారు;
శేషియైన భగవంతుని తత్తాదృగిచ్ఛ యుల్లంఘించి యిక్కడ నేటికి
నున్నవారు? విశుద్ధసత్త్వప్రకృతిమాత్రేశాస్త్రైకసంశ్రయమై
రజస్తమోగంధశూన్యమై, ప్రాకృతాగమ్యతేజంబై యున్న యీదివ్య
ధామంబునందు మీకరంబుల నున్న యీగదలకుం బ్రయోజనం
బేమి? శ్రీశదివ్యాయుధాదులకు నాశ్రితావనము నిచ్చట కృత్యము;
సర్వార్తిబీజనాశకమైన యీధామంబున నార్తులైన వారలు లేరు;
క్షేమాభయామృతపదయైన యీధామంబున నజరామరమహాసాల

దౌవారకాదికము కేవలము పరిచ్ఛదము నభయంబులైన ప్రాకృత
లోకంబుల సాలదౌవారికాదికయుభయత్రాణంబును బరిచ్ఛదం
బును మున్నగు వాహనాయుధపరివారదౌవారికసహితుండై హరి
స్వాశ్రితాశ్రితార్తివినివారణకారణం బగు చక్రి యత్యుత్కటార్త
లోకాభిరక్షణేచ్ఛ నుండుట యెఱింగి మీ రిక్కడ నుండక నేటికి నాసుర
జన్మంబు లొందుండని సనకాదులు శపియించుట విని దయాబ్ధియు
భక్తవత్సలుండును నగు నీశ్వరుండు.

119


సీ.

సర్వహస్తోద్ధృతస్ఫారపీతాంబరాం
                       చలుఁడయి తత్తదాసమయమునకు
ననుగుణంబుగ సిరిహస్తావలంబ మీ
                       యఁగ ధరానీళ లొయ్యారమునను
జంద్రప్రభాంచితచామరంబులు వీవ
                       నాలోనఁ జికురాననాబ్జుఁ డగుచు
మందహాసమున నమందాతపత్రద
                       నంతఫణామణికాంతు లెసఁగ


తే. గీ.

మణికిరీటద్యుతులు దిశామండలంబు
దండి [55]మెఱయింప గగనాంతతార లనగఁ
మౌళిఁ గీల్కొని మందారమాలికలు పు
టంబుఁ గొనఁ బుండరీకనేత్రంబు లలర.

120


సీ.

బొమసన్నచేత నుత్తముల ననుగ్రహిం
                       పుచు మహిమాబ్ధియై పొంగి యూర్ధ్వ
పుండ్రంబుతో నవ్యపులకాంకురములతోఁ
                       గమలాముఖాంబుజాఘ్రాణలోల ·
నాసలోచారుకర్ణవిలంబిమకరకుం
                       డలములతో సముజ్జ్వలితహార
కేయూరకౌస్తుభాంకితమూర్తితో ఘన
                       శ్రీవత్సలలితోరుచిత్రవైజ

తే. గీ.

యంతితో మణికాంచితో నమలహేమ
సారయజ్ఞోపవీతంబుతో రహించి
దీప్తమంజీరకావస్థఁ దిత్తిరీయ
నిగమనాదంబుతో వచ్చి నిలిచి నిలిచి[56].

121


తే. గీ.

అపుడు సనకాదులకుఁ బ్రత్యక్ష మగుచుఁ
దన్మహాయోగి మస్తకోదారభృంగ
సంగతపదాంబుజాతుఁడై చక్రహస్తుఁ
డభ్రగంభీరభాషల ననియె నంత.

122


వ.

మద్వారపాలురు మత్పూర్వసంకల్పవైభవమాయానాటకంబున
నధోలోకచక్రంబుఁ బ్రవేశించి యీశాపంబున నట్ల యవతరించి
తరించెదరు. మీరు వగ వొందకుండని యూరడించి తద్ద్వారపాలుర
నట్లనె నియోగించి సత్యసంకల్పవిభవుండై స్వస్థత నుండి యేత
దీశ్వరసంకల్పంబు సాధుల కెల్ల నెఱింగింప సనకాదులు బ్రహ్మాండస్థ
లోకంబులకుం జని రంత సత్యసంకల్పంబులచేత భగవత్పదంబున
నుండి వచ్చి కశ్యపుని యందు స్వాంశలేశంబులఁ బ్రవేశించి.

123


శా.

ఆదౌవారికులున్ యదృచ్ఛఁ జని సాయంవేళ భర్తం గనం
గాదిక్రీడల నుల్లసిల్లు దితియం దాత్యంతికస్వేచ్ఛమై
నాదిత్యుల్ వడఁకన్ హిరణ్యకహిరణ్యాక్షాఖ్యలఁ బుట్టి స్వ
ర్గాదుల్ తేజముఁ గాంచి యేలిరి ప్రతాపాహంక్రియాసంపదన్.

124


వ.

వారు బాహ్యంబున నుపనిషత్పదంబు తిరస్కరించినయట్ల వర్తించి
రందు.

125


క.

ఆజిష్ణుఁడు విష్ణుఁడు ఘో
రాజి హిరణ్యాక్షు నోర్చె యజ్ఞవరాహం
బై జనియించి సముద్భట
తేజంబున వాఁడు పొందె దివ్యపథంబున్.

126

క.

తనయనుజుని నోర్చిన యా
ఘను నోర్చెద ననుచుఁ దజ్జగద్వలయమునన్
దనుజేంద్రుఁడు ద్రిమ్మరి య
య్యనఘునిఁ గనలేక విస్మయాన్వితుఁ డగుచున్.

127


తే. గీ.

తిరిగి యాత్మీయ మగు రత్నపురికిఁ జేరి
సార్వభౌముం డనంగ రాజ్యం బకంట
కంబుగా నేలె దైతేయకల్పశాఖి
యమరనాయకహృద్భల్లమైన మహిమ.

128


శా.

ఆదైత్యుం డొకనాఁడు పుత్రుఁడగు ప్రహ్లాదున్ నిరీక్షించి శౌ
ర్యోదారుం డగు విశ్వతోవదను నాద్యున్ విష్ణు నత్యుగ్రతే
జున్ దావానలు శ్రీనృసింహు ఘనరక్షోభంబునుం గాలమృ
త్యోదగ్రగ్రహభేదిఁ జూపఁ గని వాఁ డొందెన్ బరబ్రహ్మమున్.

129


వ.

అన శుకుండు తండ్రిం జూచి హిరణ్యకశిపుండు హిరణ్యాక్షవిరోధి
వెదుకుచుఁ దద్విరోధి యగు హరి నిరీక్షించె నంటివి. అది సవిస్త
రంబుగా నెఱింగింపవే యని యడిగిన నిజభజనోపాయనుండగు
ద్వైపాయనుం డిట్లనియె.

130


తే. గీ.

ఎంత మధురంబొ యింతయు నెఱుఁగరాదు
హరిమహిమ బహువారంబు లనుభవించి
యును రసజ్ఞులు మఱి క్రొత్త యనుచు మఱియు
ననుభవింపఁ దలంపుదు రాదరమున.

131


వ.

రమ్యవస్తువులరమ్యత్వము మఱియు మఱియు ననుభవింప బుద్ధి
వొడమించు నది రమ్యత్వము. భగవన్మహిమేతరమైన రమ్యత
భ్రాంతి నైన రమ్యత్వము. భగవన్మహిమరమ్యత ప్రామాణ్యముచేత
నైన రమ్యత్వ మగును.

132


తే. గీ.

ఇ ట్లగు టాభగవన్మహిమేతరమగు
మహిమ యాబద్దులకు నభిమతము నిశ్చ
లాత్మవిదులకు నీశమాహాత్మ్యమే య
భీష్టతమ మగు జగతిలో నెంచి చూడ.

133

వ.

పెక్కుమారులు వలుకఁబడియె; నీచేత వినంబడియె; నైనను
మఱియుఁ దద్వివపక్షాసుధ యిచ్చట నాకుఁ జవికొల్పుచున్నయది;
ఈశావిష్కృతగురుసత్కృపచే నైన యేవివక్షచేత నీప్రకారమున
హరికథ మాకు రుచించు నయ్యావివక్షకొఱకు మఱియు మఱియు
నమస్కారంబులు.

134


మ.

తగఁ బ్రహ్లాదహృదీశదేవమహిమోదంచత్సుధాపూర్ణవా
ర్ధి గురుజ్ఞానతఱి న్నివిష్టు లగుచున్ గ్రీడింతు రార్యు లృతూ
క్తగతిన్ బాహ్యకుదృష్టిదర్శనమనోగ్రవ్యాధులౌ వారికిన్
స్వగదంకారమహౌషధంబులు నృసింహస్వామి చారిత్రముల్.

135


క.

తనర నహోబలనరసిం
హుని మహిమార్ణవము పొంగి యుండుం బ్రహ్లా
దనిబిడవాదవిధుసుధా
శనఘనచంద్రికల నెల్లకాలము గలుగన్.

136


వ.

తాపనీయాద్యుపనిషద్ధితానుష్టుపు పరిస్ఫుటంబు లయి హేమప్రతి
భటంబులగు గుణంబు లెవ్వరి కివి యతండు దక్క నెవ్వండు సాధుల
రక్షించు నజ్ఞానతమస్తోమదివాకరుండగు నహోబలనరసింహునకుం
బ్రణమిల్లి హిరణ్యకశిపుప్రహ్లాదసంవాదం బెఱింగించెద వినుము.

137


సీ.

ఎన్నిక వేదమహీధరప్రాగవా
                       చీభాగమున నతిశ్రేయ మగుచు
నతలాఖ్యలోకపర్యంతాదివిపులాంత
                       రంబైన తగు నహోబలంబు పరమ
పదకల్పమై ధరాభాగమణిచ్ఛటా
                       కల్పమై నిర్ణీతకల్పమై ప్ర
కాశితానందసంకల్పమై శుభలీల
                       నాద్యమై తనరారు నందులోన


ఆ.

ఘనతఁ దగు హిరణ్యకశిపున కొకరాజ
ధాని దానిపేరు దనరు రత్న
పురి యనంగ రత్నపూరితసాలమై,
యతలరత్నమాళి యని నుతింప.

138

క.

ఆపురిఁ జొప్పడు నున్నత
గోపురములచేత నవ్యగోపుర మనఁగా
గోపురములలో లక్ష్మీ
నూపురమై వెలసె బుధజను ల్కొనియాడన్.

139


వ.

మఱియు నప్పురంబు మేరుకోశసమానయై మేరూత్తుంగశృంగయై సభా
విజితమేరువై రత్నశృంగహేమప్రాకారకోష్ఠకక్షేపణాదులచే మాయా
బలదురాసదంబై వెలయు మఱియు.

140


తే. గీ.

దానవు జయించి నందనావాసతరులు
బాహ్యతలముల నిల్పి తద్భయమువలన
నవి యరణ్యాసులై చుట్టు నాక్రమింప
మించి దీవించెఁ దన్నగరాంచలముల.

141


తే. గీ.

వాసి కెక్కి త్రివిక్రమవాసచరణ
నఖవినిస్స్రుత యగు మహానది తదీయ
పరిఘయై యుండె నరిభయంకరము గాఁగ
నప్పురమహత్వ మెంచఁగ నలవి యగునె?

142


క.

మధురామలోదకములై
సుధ లొల్కు సరోవరములు సొంపగు నచటన్
బుధు లెన్నఁగ బహిరంత
ర్నిధులై మానససరస్తణీకారరుచిన్.

143


క.

అనిమిషఋషిదామంబులు
ఘనుఁ డాతం డాక్రమించి కైకొన నాగో
ధనములు కామగవీకులు
జనితంబు లభీష్ట మగుచు సతతము నందున్.

144


క.

హెచ్చుగ సురజయకలితా
త్యుచ్చైరుచ్చైశ్రవోముఖోత్తమహయముల్
మెచ్చఁగ నైరావతము
ఖ్యోచ్చండోద్దండహస్తియూధము లచటన్.

145

సీ.

ప్రవిజితదిక్పాలపట్టణానీతసు
                       మంగళవస్తుసామగ్రి మెఱసి
యప్సరస్సిద్ధవిద్యాధరకిన్నర
                       కింపురుషాదిసంకీర్ణ మగుచు
నమరావతియుఁ బోలి యబ్జభవోపమ
                       బ్రాహ్మణుల్ మనునిభరాజవరులు
వైశ్రవణాదికవైశ్యులు కాలాంత
                       కనిభనాయకులు ప్రకాశ మందఁ


తే. గీ.

జిత్రగుప్తోపమానసచివులు గలిగి
యఖిలలోకంబులు నుతింప నతిశయిల్లె
నతలలోకనిధానగర్భాంతరాళ
సమధిపూరితశౌర్యవిత్త మయి మించి.

146


తే. గీ.

శతదళోచ్ఛ్రాయవిస్తారసారరత్న
మంటపస్తంభ యగు దాని మహిమ లెంచ
నజహరాదుల కేనియు నలవి కాదు
ఘనతఁ గొనియాడ నింతపట్టణము గలదె?

147


ఉ.

ఆవరరాజధాని నసురాగ్రణి శ్రీనరసింహదేవతా
భావిశుభావతారముప్రభావము [57]మున్న యెఱింగి నిల్చి ధా
త్రీవలయంబు బెగ్గడిల దిగ్విజయం బొనరించెఁ బెక్కు మా
ర్లావిభునాజ్ఞ యింద్రవరుణాదిసుర ల్తలఁ దాల్చి కొల్వఁగన్.

148


వ.

మాయసురవీరుం డగువాఁడు లోకప్రత్యయార్థంబుగా దుష్కర
తపంబు చేసి పద్మసంభవుఁ బ్రసన్నుం జేసికొని యిష్టవరంబు
లి ట్లని వేఁడుకొనియె.

149

హిరణ్యకశిపుండు బ్రహ్మవలన వరంబులు పడయుట

సీ.

ఓ దేవ కరుణాపయోధి నాకప్రతి
                       పత్త్రతాదయి కాధిపత్య మొసఁగు
మమరగంధర్వయక్షాసురోరగసిద్ధ
                       గరుడవిద్యాధరఖచరసాధ్య

కిన్నరదానవకింపురుషాదులు
                       దివ్యాయుధముల నెదిర్చి మాయ
పని పూని మఱియును పంచమహాభూత
                       ములు ఖానిలోర్వరాంబుశిఖినామ


తే. గీ.

ములు విరోధించి చీకొని మొనసెనేని
గ్రామ్యపశువనపశునగరఖగమృగము
గాని స్త్రీపున్నపుంసకగణ మెదిరిన
భయము లేకుండవలయు నో పరమపురుష.

150


వ.

నిలయాంతర్బహిరంతస్స్థలముల నక్లేద్యునింగా నదాహ్యునింగా
నశోష్యునింగాఁ జేసి భూమియందు నాకాశమునందు సమస్తమైన
వారిచేత నిర్భీతునిం గావించవే స్వామీ భవత్కటాక్షంబున.

151


తే. గీ.

ఘనుఁడ నయ్యెద సత్యనంకల్పనిత్య
తనుఁడ నయ్యెద మఱినిరాతంకకీర్తి
ధనుఁడ నయ్యెద నోదేవతావరేణ్య!
యినుఁడ నయ్యెద లోకంబు లెల్ల నెఱుఁగ.

152


సీ.

అఖిలేశ సర్వలోకాధిపారాధ్యుఁడ
                       నయ్యెదఁ ద్వదనుగ్రహంబువలన;
నిఁక సభార్యుండ నయ్యెద; నపుత్రుండ న
                       య్యెద; నభృత్యుండ నయ్యెద; నకీర్తి
నయ్యెద; నిఁకను దేవాసురమానుషం
                       బగులోకతతి మదాయత్త మనఁగ
నత్యంతధన్యుఁడ నయ్యెద; మత్పితా
                       మహుఁడవు నీవు సమ్మతి నొసంగు


తే. గీ.

మన్యభయమునఁ గాదు మహాప్రతాప
శాలినైనట్టి నాదివ్యశక్తి నీకుఁ
దెలివివడ నేఁడు త్రిభువనస్థితిలయములు
తలఁచినప్పుడె కావింతు దైత్యమహిమ.

153


ఉ.

ఆతేజం బటులుండనిమ్ము భవదీయాశీర్వచఃప్రాప్తిమై
ఖ్యాతిం జెందెద సద్గురుల్ నిజశిశూత్కర్షానుకూలైకసం
ప్రీతిం దీవన లిచ్చుచోఁ దగునె సుస్ఫీతాయురారోగ్యముల్
సాపత్యంబునఁ గల్గఁగోరుటలు మత్స్వామీ దయాంభోనిధీ!

154

క.

ఈలోకములన్నియు నే
నేల సమర్థుండ నైన నెన్నిక సుదయా
శీలుండవు గురుఁ డన్వయ
శాలివి యిఁక ని మ్మనుజ్ఞ సత్కృప మెఱయన్.

155


వ.

నాకు నిట్లు కోరినయట్లనే వరంబు లొసంగు నీయాజ్ఞం జరించెద నని
తత్తపోబలంబున నదేయంబగు వరంబు వేఁడిన నప్పద్మజుం
డిట్లనియె.

156


మ.

క్షితిలో దైత్యకులాధినాయక! స్వతస్సిద్ధంబు నీవిక్రమో
గ్రత; వీరారిదురాసదంబు; తపముం గావించి తామీఁద; సు
స్థితి నీ కే నిట నేమి దుర్లభము చర్చించం గులాచార సు
వ్రతముల్ దప్పకు నాపితామహితసారంబై విజృంభింపఁగన్.

157


వ.

నన్ను మన్నించి సేవించితివి; నేను బ్రసన్నుండ నైతి; సకలార్థ
వాసంబగు నీకు మఱియు నాశీర్వాదంబులు గావించితి. నీవు కోరిన
కోరిక లెల్ల మున్నే నీయందు నున్నయవి; పునఃప్రార్థనంబు సేయుట
సిద్ధసాధనంబు; మహావీరా! శూరపరంతప! వరంబులు గైకొనుము;
ని న్నెవ్వరు వారింప శక్తుం డని మనంబునం గలంగియుఁ గృత్రిమ
వికాసంబు మొగంబునం బొదమ బలాత్కారవరం బొసంగి
యంతర్థానంబు నొందె; వాఁడును బ్రహ్మవరోద్భుద్ధాగాధవీర్యపరా
క్రముండై యంతర్హితుండైన విరించికి దండప్రణామంబు లాచరించి
నిజపురంబునకుం జనియె.

158


సీ.

అంత హిరణ్యకుం డత్యంతదృఢతపో
                       బృంహితవిభవుఁడై పెచ్చుపెరిగి
తనపట్టణమువోలె ధన్యత మూఁడులో
                       కములు నేలె నుదారకర్మశక్తి
మును వైదికప్రభఁ దనరి సామాత్యపు
                       రోహితుండై తత్త్వరూఢి మెఱయు
వైదికుల్ బోధింప వేదనిర్దిష్టమా
                       ర్గంబునఁ బ్రజ నేలి ఘనత వెలయు

తే. గీ.

తనమహిమ సర్వసత్యసంతతి చెలంగ
ధరణిఁ బాలించె నురుధనధాన్యవృద్ధి
మన్నుఁ గనకంబుగా నాజ్ఞ మధువిరోధి
చక్రమును బోలి జితదిశాచక్రమునను.

159


ఆ.

అంతరంగమునను హరిభక్తియును బహి
రంగమునను నవజ్ఞయత్నములను
గా నటించి దైత్యగణముల నందఱ
మోసపోవఁజేసె నాసురారి.

160


తే. గీ.

సంశయాన్వితవస్తుల శాస్త్రమే ప్ర
మాణ మగుఁగాన పరశాస్త్ర మహితమతులు
బాహ్యవృత్తి కువృత్తియై పరఁగియున్నఁ
దలఁచి రాతని సద్గుణోత్తరునిగాను.

161


మ.

భువనోత్కృష్టున కాసురారిమణికిన్ బుత్రీమణిన్ దేవతా
యువతీమోహిని నిచ్చె నంత నపు డయ్యుత్తానపాదావనీం
ద్రవతంసంబు వివేకసద్గుణలసత్కల్యాణఁగల్యాణి వై
ష్ణవి నత్యుత్తమపుణ్యలగ్నమున హస్తం బందె దైత్యుం డిలన్.

162


తే. గీ.

మణిమయోజ్జ్వల దాస్థానమండపమున
నుత్సవాగతశాస్త్రవాదోత్కనత్క
దంబములతోడ నప్పు డాడైత్యమౌళి
యఖిలదర్శనసిద్ధాంత మరయఁ జూచి.

163


సీ.

చామరగ్రాహిణిసంధూతచామరా
                       నిలము హల్లోలకుంతలముఖాంబు
జంబు కుండలమణిచాకచక్యమున న
                       లంకరింపుచు నలకంబు మహిమ
కల్యాణసమయయోగ్యంబగు కామరూ
                       పముఁ దాల్చి లలితశోభావిలాస
రూపలావణ్యకలాపయౌ కల్యాణి
                       యాకారగర్వంబు నపనయించి

తే. గీ.

యట విజృంభించి సకలసిద్ధాంతసార
విధుల మోహంబు నొందించు విధము దోఁప
సర్వసమ్మతమైన దర్శనము మాకు
నెద్ది యెఱిఁగింపు డింక మీ రెఱిఁగినట్లు.

164


మ.

అని యాదైత్యవరేణ్యుఁ డి ట్లడుగుచో నంతన్ మతాహంక్రియా
జనితాత్యాగ్రహులై సదుత్తరము నీశక్యంబు గాకున్న నీ
ర్ష్యనవారోద్ధతులై తలాతలిని కేశాకేశి బోరాడి య
న్ననపార్థంబులు పల్క వాదుల సభానాథుం డతం డిట్లనున్.

165


వ.

మహాత్ములారా! మీరు సర్వసమ్మతంబైన మతంబు నాకు నెఱిఁగింప
శక్తులు గారు; మీలో నెవ్వండే నొక్కఁడు నెఱింగించునందాఁక
నామతంబు వినుఁ డెఱింగించెద.

166


క.

ఏ నఖిలలోకనాథుఁడ
నే నాత్మజ్ఞుండ ఘనుఁడ నే నరకల్ప
శ్రీనిత్యపూర్ణవిభవుఁడఁ
బూని ననుం గొల్వుఁ డింక భూసురులారా!

167


క.

సర్వామ్నాయాభీష్టత
సర్వామరవరుఁడఁ గాన సర్వార్థరస
న్నిర్వేశ మంద నేత
త్సర్వఫలంబులు నొసంగ శక్యము నాకున్.

168


వ.

అఖిలమును నేనె; నాకంటె నన్యం బెద్దియును లే దన్యంబు గల
దనుట వేదోక్తంబు గాదు; ద్విజులమైన మనకు వేద మప్రమాణ
మనరాదు; వేదప్రామాణ్యవిసంవాదము బహువాదులకుం గలదని
వినంబడియె; లోకాయతసౌగతకాణాదులు ప్రత్యక్షానుమానంబులే
ప్రమాణంబు లగుంగాని మఱి లేదందురు; జనులు సృష్ట మనంగ
ప్రమాణద్వయమే కాని యన్యప్రమాణంబు లేదందు; రానలుగురు
నాడు మాట లన్నియు నేకంబులై యుండవు; గౌతమాదులును
వేదము పృథక్ప్రమాణ మందురా? గౌతమాదులు వేదములు పౌరుష
వాక్యము లందురు; మఱికొంద ఱపౌరుషవాక్యంబు లందురు;
పుంవాక్యపక్షమందు వేదంబులకు గుణాన్వితత్వంబును; దోషాన్వి

తత్వంబునుం గలవు. గుణాన్వితత్వంబు వలన మానతయు దోషాన్వి
తత్వంబువలన నమానతయు నగు; నిశ్చితంబైన మానత లేదు;
పుంవాక్యత్వపక్షంబునందు బోధకంబులకుఁ బ్రామాణ్యంబు గలదు:
అప్రబోధంబులగు తద్వాక్యంబుల కమానత్వంబు స్వతస్సిద్ధం బతి
ప్రయాసంబు; నబోధకత్వంబునందుఁ దత్తాత్పర్యనిశ్చయంబు లే దే
కనిశ్చితతాత్పర్యంబునకు నన్యదూషితత్వంబు గానంబడియె; కాన
యాగమవాక్యంబులు స్వతఃప్రమాణం; బధిష్ఠించిన బుధులచేత
నుపనిషత్తులకు సిద్ధవస్తువిషయంబైన ప్రామాణ్యం బంగీకరింపం
బడదు; సిద్ధమునందుఁ బ్రామాణ్యంబు నిశ్చయింపుచు నున్న
వేదాంతతాత్పర్యవిసంవాదులగు వేదాంతులలో నెవ్వరిచేతఁ
దదర్థంబు నిరూపింపంబడియె నెంత పర్యంతము వేదాంతవాక్యము
లకు నిది యర్ధం బని స్ఫుటం బగు; స్ఫుటంబుగ నా కెవ్వం డుపదేశించు
నంతపర్యంతంబు సర్వేశ్వరుం డన నేది నుండు.

169


సీ.

మద్భయంబున నేడు మారుతంబులు విసరు
                       దినరాజు మిక్కిలి [58]తేజ మందుఁ
బావకుండు వెలుంగు బలభేది పాలించు
                       మృత్యువు ధరణిపై మించి తిరుగుఁ
దత్పద్మజాత పౌత్రత నున్న మచ్ఛక్తి
                       తత్పద్మజున కన్న ధరణి మెఱయు
ధాతృపుత్రుం డయ్యుఁ దనరందె రుద్రుండు
                       తద్ధాతకంటె నుదగ్రమహిమ


తే. గీ.

సర్వమునకును నియతి నీశ్వరుఁ డనంగ
వేఱె యొక్కరుఁ డున్నాఁడె వెఱచియుండ
నఃప్రతీపప్రతాపసమగ్రుఁ డెవ్వఁ
డతఁడె యేలిక జగముల కన్నిటికిని.

170


ఆ.

నాకు లేని శక్తి లేక పితామహుఁ
డిచ్చినాఁడె తపము మెచ్చినాఁడ
నాదిసిద్ధమైన యాదర్శకాంతి వి
స్ఫుటము సేయు చికిలి యటులు కాక.

171

తే. గీ.

కాన నేనును స్వప్రసిద్ధకలితసర్వ
శక్తియుక్తుండ నైన యీశ్వరుఁడ నస్మ
దాజ్ఞచే లోకములకు సర్వాగమములు
నీశత వహించె నిఁక నిన్ని యెంచనేల?

172


క.

ప్రత్యక్షేశ్వరుఁడును నే
నత్యాజ్యం బగు మదాజ్ఞ నష్టభ్రములై
నిత్యవిసంవాదోద్బూ
తాత్యంతాగ్రహము మానుఁ డాత్మలయందున్.

173


వ.

అని వారలకు నుచితసత్కారంబులు చేసి పనిచి వివాహోత్సవాహూత
దైత్యసురాసురవరులం బూజించి యిట్లనియె:

174


సీ.

ప్రాణమిత్రులు మీరు బాంధవు ల్వినుఁడు జ
                       న్మస్థితిలయము లెన్నటికిఁ జేయ
విశ్వంబునకు నేన విభుఁడ నార్తులఁ గావఁ
                       బ్రాఁపు శక్తుండ నీశ్వరుఁడ నాదు
శాసనంబున నుండి స్వస్వరాజ్యాధికా
                       రంబుల వెలయుఁ డారవియు శశియు
నైన నభోవీథి నరుగంగ వెఱతురే
                       నంగీకరింపక యన్యు లెంత


తే. గీ.

యనుచు, దితికశ్యపులను భవ్యత భజించి
యజుఁడు భారతియును బోలె హరుఁడు నుమయుఁ
బోలెఁ గల్యాణియును దాను బూర్జభోగ
విభవముల నుండె దైతేయవీరవరుఁడు.

175


వ.

ఇటు వివిధభోగంబు లనుభవించుచు భోక్త హరి యని లోనం దలం
పుచు స్వేశశేషత్వదృష్టిజనితప్రీతిం జనింపంబడుచు బాహ్యుండు
నుంబోలె బాహ్యంబున మాయానాటకసూత్రంబున నడపుచుఁ జార్వా
కుండునుంబోలె దేహాత్మాభేదసూచకక్రియలు గావింపుచుఁ గైశికివృత్తి
కామినులం గూర్చి కబ్బంబు లొనర్పుచు, "కాముకేషు సుఖాలాభ”
యనుచు నొకానొకచోటం బల్కుచు జగంబు శూన్యశేషం బని మాధ్య
మికుండునుంబోలె నుచ్చరింపుచు, బహిర్దేశంబున స్వేష్టవస్తువులు
చూడని యట్లుండి హృదయంబున భావించు యోగియునుంబోలె

సర్వంబు నంతరంగంబుననే చూచుచు, బాహ్యంబున లేదని
యాడుచు స్మృతిభావార్థమాత్రముచేతం దదిష్టోపభోగంబులు
లేకుండుట యెఱింగినవాఁడునుం బోలె శ్రోత్రత్వగాదికం బెద్ది యది
నన్నుం గూర్చినయది యని యొకానొకచో నెరపుచు, విషయంబు
లస్థిరంబులని వర్ణింపుచు, సర్వంబును క్షణికంబని సౌగతసంతోష
కారిణియై యుదాహరింపుచు, మోక్షమాత్రంబునందు బలోదితంబులైన
సామాన్యతోదృష్టవాదంబులచేతఁ గాణాదుండునుం బోలె నొక్కచోఁ
దఱచు వేదవిరుద్ధంబులు ప్రసంగింపుచు, నాక్షపాదుండునుం బోలె
వేదసంజ్ఞితాగమావృత్తిచేఁ దత్తాత్పర్యబహిర్భూతంబగు దానిం
దర్కంబున నొకానొకచో వాదింపుచు, భోజనకర్మంబులకు స్థావరాత్మ
హింస యంగీకరించియు, నాజ్ఞాసిద్ధశ్రౌతహింస జైనుండుబోలె
దూషింపుచు నేత్రంబులు మూసుకొని హరిం దలంచి బాహ్యార్ధ
విముఖుండగు నొక్కచోఁ దన యనన్యాధీనభావం బతివాదంబున
నుతింపుచు నాకు నీశుండు లేఁడని సాంఖ్యవాది యగు కపిలుండునుం
బోలె భాషింపుచు వేదాచారవిరుద్ధంబు లేని యనుష్ఠేయంబులని
సామసాచారంబున శైవుండునుం బోలె నొకానొకచోట వంచింపుచుఁ
గర్మంబులకుఁ బురుషాకారంబు శ్లాఘ్యంబని దేవతలకుఁ బ్రాధాన్యంబని
జైమినియుంబోలె నుపన్యసింపుచు నిట్లు వర్తింపఁ దత్తన్మతస్థులు
స్వస్వమతస్థుండని తలంచిరి; బాహ్యంబున దైత్యుఁ డంతరంగంబునం
బరమవైష్ణవుండై వర్తించు నమ్మాయావివలన.

176

ప్రహ్లాదుని జననము

సీ.

ఆతనిదేవేరి యాత్మజు నొక్కనిఁ
                       గనియె నాతండు ప్రాక్క్రతుముఖముల
శమదమాదుల మించి జనియించి ఘనమైన
                       హరిభక్తి యితరజన్మాంతరమున
నతిరోహితంబుగా నాత్మపూర్వోత్తరా
                       మౌఘం బణంగించి యప్రధృష్య
లబ్ధతేజమునఁ బ్రారబ్ధకర్మము ల
                       త్యద్భుతవిద్యచే ననుభవించి

తే. గీ.

వాది దుస్తర్కవిషభూజవనదవాగ్ని
యైన దృష్టితమ స్సహస్రాంశుఁడై సు
దృష్టిమతవార్ధిచంద్రుఁడై దిక్కులం బ్ర
కర్షమున హర్ష మొనరించి ఘనత మెఱయ.

177


తే. గీ.

ఆత్మలో నెంచి తండ్రి ప్రహ్లాదనామ
మతని కొనరించె దితియుఁ గశ్యపుఁడు వచ్చి
పౌత్రునకు జాతకర్మాదిభావుకములు
సమ్మతంబునఁ గావించి చనినయంత.

178


క.

మోదమున రత్నపురిఁ బ్ర
హ్లాదోదయమాత్రకృతమహావిభవమునన్
శ్రీదయితున కపరాజిత
యై దీపించెన్ జగంబు లద్భుత మందన్.

179


మ.

పరిపూర్ణాద్భుతవిశ్వరూపవిమలబ్రహ్మైకతత్త్వార్థత
త్పరసత్ప్రాభవపూర్ణభోగమున నాప్రహ్లాదుఁ డుత్పన్నుఁడై
హరిభక్తాగ్రణియై బుధు ల్పొగడ భూర్యధ్యాత్మవిద్యాధురం
ధరుఁడై యుండియుఁ బ్రాకృతాత్ముఁడువలెం దా నుండు గంభీరతన్.

180


ఆ. వె.

పుట్టుమొదలఁ బలుకఁ బూని శ్రీహరిదివ్య
నామముల సనాతనప్రసిద్ధ
ముత్తమోత్తమ మగు నోంకార మని జిహ్వఁ
బలుకఁదొడఁగె దైత్యపతిసుతుండు.

181


వ.

ఓం తత్సత్పదము లను మూఁడునిర్దేశంబులు పరబ్రహ్మంబునకుం గల
వవి సర్వజనమంగళప్రదంబు లగు వానిలో నాద్యంబగు నోంకారం
బాయోంకారంబు త్రిపదవాక్యంబు; న్యాసవిద్యాప్రకాశంబు,
నందు నకారణంబు చతుర్థ్యంతం బగు, ప్రథమపదంబు రక్షకాయ
యను పదంబునకుఁ బర్యాయంబు, వానికి నుకారం బవధారంబు,
మకారంబు జీవవాచకంబైన ప్రథమాంతపదంబు అవరక్షసే యను
ధాతువున డప్రత్యయనిమిత్త కటి లోపంబైన సుజత్పత్తియైన
చతుర్థ్యంతం బా యను పదంబు నిచ్చె; సుబ్లోవమైన సమాసమందు
గుణంబైన ఓ యని యుండి హల్మాత్రమకారములో సంహితయైన

బిందువుగా నో మనువాక్యము శ్రుతిదృష్టి కనీనిక యగు మకారార్థంబు
పంచవింశమ నీశ్వరాత్మైకధీబలం బకారార్థంబున ననేకొని యన్యంబు
నకు లేదని యుకారార్థంబు శ్రుతిసమ్మతంబు బ్రహ్మంబునకె యను
నుపనిషత్ప్రవణంబునకు నేతదర్థం బనుట నిశ్చయించి న్యాసంబు
వలన వినియోగంబు చేసి స్వరక్షకపరబ్రహ్మనామ మో మ్మని
స్మరింపుచు నొకానొకప్పుడు హంస హంస యని సంభోధింపుచు హంస
రూపమును స్వహృత్పద్మచందంబుల ననుచరింపుచు నర్థవేదిగావున
నాదినుకారంబును మధ్యంబున మకారంబు నాకారం బంతంబునం జేయక
పలికె; నకతంబులగు చతుర్వింశతితత్త్వంబులకు విలక్షణుండై
పంచవింశకుండు సోహం సోహం బగు నంతర మనువు నుచ్ఛ్వాస
నిశ్శ్వాసభవంబైనదాని హంసంబై శ్రీశపాదాబ్జైక్యభోగ్యుండైన
తనకు వాచకంబుగ నెఱింగి జీవించి హంసప్రణవమంత్రంబులచేత
నంతర్బహిర్దేశంబుల నహర్నిశంబును సర్వేశ్వరరూపంబులు స్వభా
వంబున భావింపుచు నొకానొకప్పుడు బ్రహ్మానుభవామృతవర్షంబున
నవ్వుచు నొకానొకప్పుడు బద్ధులఁ జూచి యార్ద్రచిత్తుఁడై దుఃఖింపుచు
నట్లు ప్రారబ్ధపుణ్యపాపరాసులు క్షయింపం జేయుచు సుఖదుఃఖాను
భవంబులఁ గాలక్షేపంబు గావింపుచు నిరంతరస్వాంతనసరోహంసం
బగు హరి భజింపుచు నొక్కనాఁడు.

182


క.

తనయునకు ముద్దు గుల్కెడు
తనయునికి శుభంబు గాఁగఁ దలిదండ్రులు హృ
ద్వనజముల నుల్లసిల్లుచు
దినదినమును వింత వింత దీపించుతఱిన్.

183


క.

బాలకతతితోడను జం
బాలకలానీలవేలిపరితస్ఫుటలం
బాలక కేళిక మై నా
బాలకమణి విష్ణుభక్తిపరుఁడై నిల్చెన్.

184


క.

దాదు లిడు వస్తువు సనం
దాదులు మెచ్చంగ నతఁ డుదారోదంచ
న్మోదమున స్వస్వతనుఁడై
యాదేవున కర్పితముగ నాత్మ నొనర్చెన్.

185

తే. గీ.

జనులు స్వోద్దేశవిహితోపచారములు ప్రి
యంబుతోఁ జేయ స్వమూర్తి యగుచు స్వాంత
రాత్మ నిలిచిన హరికి సమర్పితముగ
నర్భకుం డాతఁడు దలంచె నతినియతిని.

186


తే. గీ.

అప్పు డుఛ్ఛ్వాసముఖ్యకర్మాంతరంబు
లన్నియు నిజాంతరాత్మ సేయింప నేఁడు
సేయుచున్నాఁడ నని జ్ఞానసిద్ధి చేసి
కలికసత్కర్మతాశక్తిఁ గాంచి మించె.

187


సీ.

వాసిగా మృద్బలీవర్ధంబుల నొనర్చి
                       కృత్రిమతంత్రినాకీర్ణదామ
ములఁ దిప్పు హరి విశ్వమును ద్రిప్పు నీక్రియ
                       నని తలంచుచు గృహస్థాశ్రమస్థు
కర్మముల్ పూని తత్కల్పితాన్నాదికం
                       బుల కల్పితేశ్వరపూజఁ జేసి
యర్పితంబులు సేయు నతఁడు కల్పంబులు
                       తెలిసి తేజము గల్గు దివ్యభవన


తే. గీ.

ములు ప్రకల్పించి కల్పితబుధుల నెదురు
కొని ప్రణామంబు లిడి మదిఁ గోర్కు లొసఁగు
నంతఁ దద్భుక్తశేషంబు లారగించు
భగవదనుకూలసద్భక్తిఁ బరిఢవించు.

188


వ.

మఱియు గృత్రిమమఘంబులు గావించి భగవదర్పితంబులు
సేయుచు నుత్సవంబున.

189

ప్రహ్లాదుని విద్యాభ్యాసము

చ.

అనుపమలీల నిట్లు తిరుగాడెడు నాఘనయోగిమౌళికిన్
జని యసమాచతుష్కము నిశాచరుఁడై దవయేఁడు చొచ్చినన్
దనయునిఁ జూచి సత్క్రియలసంఖ్యములై తగఁజేసి సంతసం
బొనరఁగ నక్షరాభ్యసనయోగ్యత గాంచి సభాంతరంబునన్.

190

శా.

చండామార్కుల శుక్రపుత్రుని మహాశాస్త్రజ్ఞులం బ్రాజ్ఞులన్
పాండిత్యప్రతిభావిజృంభితుల సంప్రార్థించి విద్యావహో
ద్దండశ్రీ విలసిల్ల నాతనయుఁ బంతం బొప్ప శిక్షించుఁ డీ
తం డుత్కృష్టుఁడు శిష్యుఁడైనఁ దగు నుద్యత్కీర్తి మీ కెప్పుడున్.

191


వ.

అని యొప్పగించిన గురుగృహంబున కేగి కతిపయదినంబులకు
సకలవిద్యలు నభ్యసించి మీకు గురుదక్షిణ యిప్పించెద నని
తోడ్కొని తండ్రిచే ననేకగురువస్తువు లిప్పించి గురులుం దాను
జనకుని యాజ్ఞను నుచితాసనంబులఁ గూర్చున్నయెడ సత్కర్మంబు
లలో నెయ్యది యోగ్యంబు? ఏవిద్య గ్రాహ్యంబు? ఎఱింగింపు
మనిన నంజలి చేసి ప్రహ్లాదుండు.

192


ఉ.

శ్రీ నిరతంబుగా నవధరింపుము దేవ! మహాత్మ! నీమహా
స్థానమునందు వాదు లురుసారవచోగుణదోషవేదులు
న్నూనత నున్నవారు మహిమోన్నతి స్వస్వమతంబె కాని య
ట్లైన గ్రహింపఁజాలరు తదన్యమతంబులు గర్వితాత్ములై.

193


వ.

ఇట్లన్న నేమి? వీరల నుల్లంఘించి వైదికకర్మంబును సద్విద్యయు
విన్నవించెద.

194


ఆ.

ఏది బంధకంబు గా దిది సత్కర్మ
మరయ మోక్షమునకు నయ్యె నెద్ది
యది సువిద్య దుఃఖ మన్యకర్మము శిల్ప
మన్యవిద్య నిశ్చయముగ వినుము.

195


వ.

అనినఁ దండ్రి యిట్లనియె.

196


మ.

తనరన్ బంధ మనంగ నెద్ది యగుఁ దద్బంధంబుఁ గల్పింప సా
ధన మేకర్మ మసాధనం బనఁగ వార్త న్మించు నేకర్మ మిం
పున మోక్షంబున నెద్ది విద్య యనఁగా నౌ నెద్ది యీరెంటికిన్
ఘనమై మించిన సాధ్యసాధనత నాఁ గా నెద్ది చర్చింపఁగన్.

197


వ.

అని దైతేయుఁ డడిగినఁ బ్రహ్లాదుం డిట్లనియె నాత్మ యనంగ
స్వాభావికానందచిచ్ఛక్తి యగునది యేజ (?) యనఁ ద్రిగుణాంచితయై

యనాద్యయై దుర్వికార యైన యది జీవబుద్ధివిక్రియాహేతువైన
త్రిగుణానాద్మనాత్మయొక్క సంబంధ మెద్డి యది రజస్తమోగుణో
ద్రిక్తసాధనయైన కర్మబంధనము వేదవిహితంబులు సేయక
యుండుట, వేదనిషిద్ధంబులు సేయుట ఈశ్వరాజ్ఞోల్లంఘనంబు.
తదాత్మకంబైన కర్మంబు తమోగుణరజోగుణప్రసవకారణము;
శ్రుతిస్మృతిచోదితమై సదనుష్ఠితమై ఫలసంగత్యాగపూర్వకమైన కర్మ
మబంధక మది యేమి యన నచ్యుతాంఘ్రిసద్భక్తికిఁ జేరువనే
యుపకారమై ప్రయాజాదిక మాగ్నేయాదికంబునకుం బలె మలప్రక్షాళ
నంబు వలన మణికి జ్యోత్న్స యేప్రకారంబునం జేయంబడదు
కలిగియున్న యదియె యభివ్యక్త మౌట యెటువలె నినాయావిర్భా
వము లేనియది పుట్టదు. హేయగుణధ్వంసంబువలన నవబోధాది
గుణములు ప్రకాశించుఁ గాని నడుమన్ జనింపదని యాత్మకు
నిత్యత్వంబుల జీవేశ్వరతత్వాధిమూలంబునై శ్రుతిచోదితంబు లగు
కర్మంబులచేతనుం గూడిన యీశానస్మృతి విద్య యని వినంబడిన
యది; ఈవిద్య బుధులకు విష్ణుం డుపాస్యుండని చెప్పుచున్నయదియై
సేవింపందగిన యీశ్వరుని వ్యత ప్రియకాంతయుం బోలెఁ బ్రకాశిం
పంజేయు భక్తిరూప యగు నీవిద్యచేతఁ జూపంబడి హరి తన
దాసునికి బంధంబు మాన్పి సంతోషం బందించు నాయీశ్వరుండు
హేయవ్రత్యానికాసంఖ్యేయకల్యాణగుణసాగరంబును, శ్రీభూనీళా
దీయపతియుఁ జిదచిద్విశ్వనాయకుండును నగు నీశ్వరునికి నే తచ్చి
ద్రూపంబగు ప్రపంచంబు స్వశరీరం బని యుపనిషన్మతము నని
యతంబైన నతండు సర్వచిదచిద్వస్తువ్యాప్తత్వముచేతఁ బ్రపంచంబు
దానయై యుండునని వేదాంతంబు లాయనవైభవంబు బోధించు
చున్నయవి; ఇందుఁ గొందఱు గ్రహావిష్టులుంబలె నిశానిష్టచేతను
లెంతపర్యంతంబు తదాదేశము లంతపర్యంతంబె; ఈశు లన్య
ప్రకారంబున నీశులు గారని తా నడిగిన ప్రశ్నంబులకు నుత్తరంబులు
సెప్పిన నాత్మజసూక్తిభానుప్రభాస్ఫుటాలోకితతత్వమార్గుండై
యంతరంగంబున హర్షించి తద్దంభదైత్యుండు బహిరంగంబున
నసురసంగ్రహంబున కాగ్రహించె నప్పుడు.

198


శా.

కోపాటోపవిజృంభమానకుటిలోద్గూర్ణస్ఫుటభ్రూకుటీ
క్షేపోగ్రప్రళయానలాద్భుతశిఖాకీర్ణంబులై నేత్రముల్
దీపింపన్ దశనాంచలోత్కటకిటోదీర్ఘారవోద్భిన్నసా
టోపారాతిమనస్కుఁడై దితికులాఢ్యుం డంతలో నిట్లనున్.

199

క.

గురుసుతు లని మిము నమ్మితి
పరుసంబులు పల్క నేర్పి బాలుని మీరల్
వరవిద్యానిధిఁ జేసితి
రురుమతి మాకాప్తు లౌదు రోహో యనినన్.

200


సీ.

అప్పు డాగురుసుతు లసురేంద్రుఁ డల్గ న
                       ర్హాసనంబులు డిగ్గి యధిప తెలిసి
పలుకుము ప్రభుఁడవు ప్రభుఁ డెట్లు నాడిన
                       నంద మౌనని యిటు లంటి వేమొ
నీతనూభవునకు నేఁడు వైదికమతి
                       శిక్షింప మాజన్మసిద్ధ మేగ్ర
హావేశబంధమో యనఘాత్మ! యెటువంటి
                       గ్రహము సోకిన జీవగణము లటుల


తే. గీ.

నాడుచుండ నవైదికులందు వైది
కగ్రహంబు ప్రవేశించి కాదె యిట్ల
నెదుటఁ బలికింపుచున్నది యిట్ల నీస
భాసదులతో విమర్శింపుమా సురారి!

201


తే. గీ.

ఒనర విశ్వాసపాత్రమై యున్నభార్గ
వాన్వయంబునఁ బుట్టి నీ కభిమతంబు
గాని మత ముపదేశింపఁగలమె యంత
రంగబహిరంగముల దానవాధినాథ!

202


వ.

అని.

203


తే. గీ.

సమ్మతింపుము గురుహితసత్యశౌచ
నియమము నిరర్థమౌ నింక నేఁటినుండి
కాన మది నమ్మి సుతుని వికారమూల
మరసికొను మింకనేని దైత్యాధినాథ!

204


వ.

అని పల్కు గురుపుత్రుల వచనంబులు విని నమ్మి వారికిం బ్రణమిల్లి
సురారి సుతునిం జూచి యిట్లనియె.

205

క.

గురు లానతి యియ్యని యీ
వరవైదికవిద్యయట్ల ప్రాపించెను వ
త్స! రహి వహింపుచు బుధజను
లరయఁగ నిట్లాడ నెట్టు లభిమత మయ్యెన్.

206


తే. గీ.

బాహ్యవాదాభిమానులై బహుసుధీరు
లాగమాంత మంతం బన్న నద్భుతముగ
నింద సేయుదు రది యెట్లు నీకు భోగ్య
మయ్యె వారలకంటె జ్ఞానాధికుఁడవె?

207


క.

కడను బృహస్పతిముఖ్యులు
జడులే వేదాంత మనిన సహియింపరు చొ
ప్పడఁ దద్దోషము లెఱిఁగిరి
విడిచిరి నీ వామతంబు వెలయించెదవే?

208


వ.

అనినఁ బ్రహ్లాదుం డిట్లనియె.

209


సీ.

దైత్యేంద్ర నమ్ము మద్వచనంబు ప్రాగ్భవ
                       గురుదత్తమై నిరంకుశత మెఱయ
నీమతి గురుపుత్రు లెఱుఁగ రంతయు శ్రుతి
                       ప్రామాణ్యవిశ్వాసపరత వైది
కాచారరుచియు వేదాంతవేద్యుండైన
                       హరియందు భక్తి యనల్పతపము
నందుఁ గల్గక తా ననాదినిథసంత
                       తానందశాఖియై జ్ఞానపుష్ప


తే. గీ.

మై యమృతరసమై భవ్యమైన వేద
కల్పకము సులభమె దుష్టకల్మషాసు
రప్రకృతులకు నెల్లసారంబు చెలువ
నాత్మ చర్చింపుమా దానవాగ్రగణ్య!

210


క.

శ్రుతి హితకర మని మఱి యా
దృతిఁ బల్కిరి సభలయందు దేవప్రకృతుల్
శ్రుతి యహితం బని పల్కిరి
యతినీచులు లోకవిశ్రుతు లసురప్రకృతుల్.

211

క.

సత్త్వప్రధానమతులు సు
ధీత్వంబున నెంచిచూడ దేవప్రకృతుల్
సాత్వికు లసురప్రకృతు ల
సాత్వికులు రజస్తమోవిసంకీర్ణమతుల్.

212


తే. గీ.

జ్యోత్స్నయందుఁ జకోరముల్ సొంపు గాంచుఁ
గలుగు నాత్మ నులూక మాగమము లట్ల
వీని దేవప్రకృతికిని వేడ్కతోడఁ
మకిలుకొను క్రోధ మాసురప్రకృతికెల్ల.

213


క.

ఖలుల కిటులైన దిక్కున
వెలసినకృతికల్పలతిక విడువఁదగునె సా
ధులు మఱి యాత్మప్రకృతిని
ఫలము గొనుట కాశ్రయించి బ్రతుకం దగదే?

214


క.

తెలివిగల యాగురుప్రభ్రు
తులు జడులే సద్విరోధిదుర్మతభంగం
బులకై మోసము సేయం
దలఁచినపక్షంబు లవియ తత్పరములగున్.

215


సీ.

ఆదివేదోక్తధర్మాచరణైకసం
                       ప్రాప్తతేజస్కులే యంతనుండి
దేవాదిబాధ లుద్దేశించి యత్నంబు
                       గావింతు రెవ్వరు గర్వశక్తి
నటువంటి సౌదర్శనాధిపతి త్రిపు
                       రేశాదిదుర్మతుల్ హెచ్చియున్న
తత్తేజ మడఁగింప ధరణిపై మోహనా
                       గమములు కల్పింపఁగడఁగి రప్పు


తే. గీ.

డమరగురుబుద్ధకణభుగర్హజ్జినేంద్ర
గౌతమాదులు సాధులోకద్విషద్భ్ర
మంబు గావింప బాహ్యశాస్త్రంబు లెల్ల
మేరమీఱఁగఁ గొన్ని నిర్మించి రంత.

216

క.

పరమనియతిఁ బ్రాగ్భవములు
గురులవలన వింటిఁ గథలు గుఱిగా విద్వ
త్పురుషులు శ్రేయోర్థు లగుచుఁ
దిరిగిరి తన్మోహశాస్త్రధిక్కారములన్.

217


క.

నారాయణుఁ డుండఁగ మఱి
వేఱొకని వరుం డటంచు వివరించు దురా
చారులు పాషండులు ని
స్సారులు దద్గోష్ఠి విడువఁ జను ధన్యులకున్.

218


తే. గీ.

ధర శ్రుతిస్మృతివైరుధ్యతరము చైత్య
సేవనాధికకర్మముల్ సేయుచుంద్రు
చాల నెవ్వరు తన్మూఢజనులు పాప
రతులు చర్చింపఁగా వికర్మస్థు లనఁగ.

219


శా.

ప్రోడ ల్చూడకయుండ లోన విషయంబు ల్చాల భోగించి దు
ర్వ్రాడం బాహ్యమునన్ విరక్తులవలెన్ ద్వేషింపుచుం డ్రెప్పుడున్
బైడాలప్రతికుల్ బికాలము పయఃపానాభిలాషంబులో
నాడన్ క్షీరఘటంబు డగ్గఱియు నైరాశ్యంబు గొన్నట్లుఁగన్.

220


క.

పరులఁ దపింపంజేయం
బరధనవిద్యాకులాదిభాసురతేజ
స్ఫురణంబు లెన్నుకొనువాఁ
డరయన్ శఠుఁ డనఁగ మించె నతినీచమతిన్.


క.

వేదానుకూలనన్యా
యాదిప్రతికూలదుర్ణయంబులచేఁ బా
పోదితదుశ్శాస్త్రము ల
త్యాదరమున విను విమతుల హైతుకు లరయన్.

222


క.

ఘనదైవపౌరుషాగత
ధన మంతయు నాశ్రితజనతతి వీడ్కొని తా
ననుభవమునకుం గొను పా
వనికృష్టుఁడు జగతిలోన బకవృత్తి యగున్.

223

సీ.

ఇటులనె ఘనులకు నిష్టతమంబు లౌ
                       బాహ్యమతంబులు బహువిధములఁ
దెలియ నవన్యాయములకు మూలంబులు
                       గా నా కెఱుంగయోగ్యములు గావు;
పాంథు లంధులు గూడి బహుసహస్రములైన
                       తెరువు గానకయున్న దృష్టి గలుగు
నతనిచేఁ గడతేరునట్లుగా నాచేతఁ
                       గడతేరుదురు మూఢకలుషమతులు


తే. గీ.

బాహ్యపక్షంబు లెల్ల సత్సక్షములని
నీకు భ్రమ మయ్యెనేని యానీచమతుల
తోడ సంవాద మొనరించుఁ జూఁడు నేఁడు
నాదుమహిమయె శ్రీజగన్నాథుమహిమ.

224


క.

తత్తన్మతాభినో
ద్వృత్తులగు నవైదికు లవిధేయులఁ గా నే
హత్తింతు న్నన్యాయో
దాత్తోక్తులచేత సమ్మతార్థము గాఁగన్.

225


ఆ. వె.

అని ప్రతిజ్ఞ చేసి యావైదికాగ్రణి
తండ్రియెదుట నిలిచె ధన్యపీఠి
నభయదానపంజరాకృతి యగు శౌరి
నాత్మయందు నిల్పునతిశయమున.

226


సీ.

అంత నద్దైతేయుఁ డాత్మజుప్రతి నస
                       త్యము సేయఁదలంచి యుదగ్రబుద్ధి
గురుసుగతకాణాదగిరిశార్హదక్షపా
                       దవిరించికపిలశాస్త్రజ్ఞవాది
పరుల నందఱఁ బిల్చి వాదింపుఁ డితనితో
                       భవదీయపరశాస్త్రపర్వతంబు
లితఁ డాత్మ సునయేంద్రహేతిచేఁ జూర్ణంబు
                       గావింపఁదలచె మీఘనత మెఱసి

తే. గీ.

తర్కకర్కశవాక్కళోదర్కమహిమఁ
బూని గెలిచితిరేని ననూనశక్తి
మిమ్ము మన్నింతు వెలయింతు మేదినీత
లమున మీమతముననె హృద్యముగ నడుతు.

227

ఆశ్వాసాంతము

శా.

బర్హాపీడవిరాజమాన! కమలాప్రాణేశ! నిత్యస్తువ
ద్బర్హీవక్త్రకిరీటజుష్టవిలసత్పత్ఫీతభక్తావళీ
గర్హాభంజన! లోకరంజన! శుభాకారోత్తమాచారపూ
జార్హస్తోత్రపవిత్రరాజదనుకంపాపాత్ర! చిన్మాత్రకా!

228


క.

శరణాగతభరణాదర
హరితాంబరశంబరాంతకాయుతతేజా!
మురసూదన! పురభేదన
వరసాధనవర్ణరూపధారణచతురా!

229


మాలిని.

విదితదురవలేషా! వీతదోషాదిరూపా!
విదితసదనులాపా! విశ్వధర్మానురూపా!
కధఘనశుభరూపా! కల్పితానేకరూపా!
కధఘనరదురాపా! కల్యచూడాకలాపా!

230

గద్యము
ఇది శ్రీమత్కంజర్ల కొండమాచార్య
పాదారవిందమిళిందాయమాన చెన్నయామాత్యపుత్ర
కశ్యపగోత్రపవిత్ర శ్రీమదల్లాడు నరసింహప్రణీతంబైన
నారదీయపురాణంబునందు సప్తమాశ్వాసము
సంపూర్ణము

  1. శ్రుతిః: "క్షరం ప్రధాన మమృతోక్ష౽రహః
              క్షరాత్మ నావిశతే దేవ ఏకం
              భోక్తా భోజ్యం ప్రేరితారం చమత్వా
              జుష్టస్త స్మాదమృతత్వ మేతి." (మూ)

  2. తత్త్వవిప్లవమున దత్కలికాలమున కది
  3. యల్పమై యునికి కాలోచితాచరణము
  4. దుర్మతుల దుష్ట
  5. సోరుచు
  6. కటాక్షించని
  7. నిప్పించ
  8. యార్థ
  9. యంటె
  10. యెట్లంటే
  11. యంటే
  12. మవు
  13. మియ్యంగలదు
  14. నిష్టత్వంబు
  15. నిష్టత్వమున్ను నియతంబు
  16. న్ను
  17. నిట్ల నుండంగా
  18. న్ను
  19. యేమే యనియున్ను
  20. ప్రశ్నభాషణంబులు
  21. పరిమితినిన్ని
  22. యంటేను
  23. న్ను
  24. న్ను
  25. న్ను
  26. సుఖమైతే
  27. కు
  28. బౌను
  29. బయితే
  30. జూచుటం బట్టుండిన్ని
  31. నిష్ట
  32. నిష్టత
  33. యైతే
  34. ‘బాధయంతీతి సాహ్నిఛందా' నిత్యాది
  35. నిష్టత
  36. ప్రబలి ధర్మాధర్మదానాధికారుల
  37. గా నిషిద్ధక్రియలే సేయఁబూనుఁ
  38. స్వాత్రిగుణకానాద్యచఛన్నధిబలాతి
  39. మగ్నము లగుచున్నయవి
  40. మీరు ఋషిస
  41. రూపతత్వపురాణాదు లేపు చూప
  42. లెల్లను.
  43. గాదు ధర్మోదయము తన కడ్డపడఁదగును
  44. ప్రథాన
  45. వేదంబును
  46. దార్తి మాన్పదలంతు రట్లుగాన
  47. మోహాతాపముల కింతమేర కలదె
  48. లె మనోవ్యధ
  49. పాటించరు
  50. అఖిలవేదాంతవేద్యవిశ్వాత్మైకశీల
  51. మునుపు గలుగు ఘటమట్ల వెనుకఁ గలుగు
  52. ముదయించ
  53. నామాయాయొగి మోహిని
  54. ధ | ర్మములం
  55. మెఱయించ
  56. ఈపాదము తరువాత 'నేనిశముఖ్యులు ముందఱ బరాబరులు సేయ' అని కలదు. గ్రంథపాతము కానోపును.
  57. ము న్నెఱింగి
  58. తేజు నందు