నారదీయపురాణము/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

నారదీయపురాణము

షష్ఠాశ్వాసము

క.

శ్రీజైవాతృకవంశాం
భోజోత్కరమిత్ర! భువనపూర్ణచరిత్రా!
రాజీవనేత్ర! నిరుపమ
భోజేశసుతాకళత్ర! బుధజనమిత్రా!

1[1]


వ.

అవధరింపుము.

2


సీ.

... ... ... … ... ... ... ...
                       ... ... ... ... ... ... ... ......
... ... ... ... ... ... ... ...
                       ... ... ... ... ... ... ... .......
... ..ధావాహినీప్రవా .... ...
                       హతరంగములు పంక మణఁచి పూర్ణ
హరిభక్తి వోలె భవాతంకములు మాన్చె
                       నత్యంత మహిమ మాకందఱకును


[2]ఆ. వె.

సుధసుపర్వలోకసుపదమై క్లేశంబు
లడఁచుఁ దావకీనమైన వాక్య
రూపసుధ దినంబు రుచిగొన నస్మదా
ప్యాయనంబు చేసె ననఘచరిత!

3

ఆ. వె.

కథకు లెందఱైనఁ గల్గినఁ గల్గనీ
పూని తెల్పనిమ్ము పుణ్యకథలు
సర్వబోద్ధలైన [3]జను(ల) బోధించె నీ
దివ్యవాఙ్మయైకతేజ మనఘ.

4


తే. గీ.

తామసోక్తినిబంధన తామసులకు
రాజసోక్తినిబంధన రాజసులకు
సాత్వికోక్తినిబంధన సాత్వికులకుఁ
బరమబోధం బొనర్చు నేర్పరివి నీవు.

5


తే. గీ.

సాత్వికోక్తి విరుద్ధార్థసరణియైన
యట్లనే పల్కు పల్కుదు వదియు ననఘ!
తామసాధీనశాస్త్రబోధనముకొఱకుఁ
గాని స్వాభావికార్థంబు గాదు నీకు.

6


క.

అమరున్ జ్ఞానము సత్వగు
ణమునను లోభము రజోగుణమున మహామో
హమదములు తమోగుణమున
నమితస్థితి ననుచు శౌరి యానతి యిచ్చెన్.

7


తే. గీ.

తామసాదిపురాణజాతములనైన
నెద్ది సర్వోత్తమం బని యెంచఁబడియె
నఖిలనామాంతరంబుల నదియ విష్ణు
తత్వము తదంతరాత్మయై తగుటఁ జేసి.

8


క.

భగవన్మహిమాంభోనిధి
యగణితతద్బోధవీచియై మెఱయఁగ జ్ఞా
నగుణామృతరసబిందువు
లొగి నాప్యాయన మొనర్చుచున్నవి మాకున్.

9


తే. గీ.

ఔర భగవన్మహిమ వార్థి యతిగభీర
తర మపారంబు సద్గుణోద్యత్ప్రవాహ
మమృతరసము హిమాంశుండవైన నీక
తంబునన్ వెల్లివిరిసె నిద్ధరణిలోన.

10

తే. గీ.

చంద్రుఁడవు నీవు చంద్రిక సరససూక్తి
సంతతి చకోరముల మేము సారసాక్ష!
సత్కరుణ జ్యోత్స్న నీవంటి సాత్వికప్ర
వర్తనుఁడు గల్గ నేర్చునే వన్నె మెఱసి.

11


క.

అల భగవంతుఁడు మాపైఁ
గలఁడని తలఁచితిమి యట్ల కాకున్నతఱిన్
గులవిద్యాసంపదలం
దలకొనదే గర్వమెల్లఁ దత్వజ్ఞనిధీ!

12


తే. గీ.

కలితవిద్యాకులధనోత్థగర్వపటల
జాతసంఛన్నదృష్ఠుల మైతిమేని
నిన్ను వీక్షింపఁగల మెట్లు నిఖిలధర్మ
పదవిశేషోపదేష్టవై పరఁగియున్న.

13


వ.

అనిన సూతుం డిట్లనియె.

14

సూతుఁడు బ్రహ్మజ్ఞానతత్త్వమును బోధించుట

మ.

కుల మాచారము విష్ణు(పాద)[4]భజనాం[5]కూరైకసద్భక్తి ని
శ్చలమౌ న్యాసలవంబు లేని యతినిస్సారాత్ముఁడన్ హీనదు
ష్కులుఁడన్ నేఁడు మఖంబునందుఁ బరిషద్గోష్ఠిన్ విజృంభించుటల్
గలదే మద్గురుశక్తి నట్టి గురులోకస్వామిఁ గీర్తించెదన్.

15


సీ.

జగతిపై బ్రహ్మనిష్ఠావిధి జ్ఞాత లె
                       [6]వ్వనిఁ జూచినను నిజేక్షణము ద్రిప్పి
జల మార్జనము చేసి చను దురాహీనుని
                       సాత్వికోత్తముఁ జేసి సకలమునులు
బ్రహ్మపీఠమునందుఁ బట్టము గట్టి రే
                       యాశ్రమంబునకైన నర్హవృత్తి
చాలదు విప్రవంశజుఁడఁగా నెన్నిక
                       విద్వాంసుఁడను గాను విష్ణుపాద

తే. గీ.

పద్మభృంగత్వమా లేదు పరమనియతి
తత్వవిజ్ఞాపనైకకృత్యంబు నాకు
నిమ్మహాత్ముల కెఱఁగించు నిట్టి మహిమ
మద్గురుస్వామికృప నని మఱియు మ్రొక్కి.

16


వ.

ఇట్లనియె.

17


తే. గీ.

సర్వధర్మాదిహేతువౌ చక్రధరుఁడు
స్వామి విశ్వప్రపంచప్రశస్తజనులు
వాసు లీసభలోనఁ దద్దైవతత్వ
మెఱుఁగకుండిన నాపీఠ మెక్కఁగలనె.

18


క.

మానసమా వెఱవకు ముద
మానుము తద్బ్రహ్మపీఠి నాత్మేశేచ్ఛా
ధీనము లనన్యశేషము
లైన యవి సమస్తము లగు నావస్తుతతుల్.

19


ఆ. వె.

బ్రహ్మపీఠ మెక్కి ప్రాజ్ఞులముందఱ
గర్వరోగలిప్తగాత్రుఁ డగుచు
బ్రోడతనము చూపఁ [7]బూన నౌద్ధత్వమ
[8]యంద్రు తత్వవేదులైన మునులు.

20


వ.

అదిగాన తదౌద్ధత్యంబు భగవదనుగ్రహంబున మాకుం బ్రాపించదని
సన్మార్గరహస్యవేదియై యిట్లనియె.

21


సీ.

సత్క్రియావంతులు సకలాగమాంతపా
                       రగులు బ్రహ్మజ్ఞులు (న)గు మహాను
భావులు మీర లీప్రశ్నాంతరంబు మ
                       మ్మడుగుట విహితంబొ యవిహితంబొ

తెలియదు ధర్మసందేహ మిప్పుడు పుట్టి
                       న యది దానినడంచి నవ్యశక్తి
[9]తెలి పర్వనోదయాళులు గుణాఢ్యులు సర్వ
                       భూతసుహృత్పరాత్మాతినిశ్చ


తే. గీ.

లాంతరంగులు సర్వజ్ఞు లతులయశులు
రాజు నడచిన యట్లనె ప్రజలు నడుతు
రట్లు గావున ఘనులు మీ రల్పతరుఁడ
నైన వినిపింతుఁ దగు సత్ప్రియంబు సేయ.

22


తే. గీ.

అనుచు వైష్ణవదాసుండ నైన నాకుఁ
జిత్త మలరించి వాగ్రూపసేవ చేసి
పెద్దల నిరంతరంబు మెప్పింపఁగలిగె
భళిర నా కయ్యె జన్మసాఫల్య మిపుడు.

23


క.

భగవద్భక్తులకుఁ బ్రియం
బుగ సత్కర్మం బొనర్చు పురుషునిజన్మం
బగణితగుణసంపత్తిం
దగునండ్రు మదిం దలంచి తత్వజ్ఞుఁ డిలన్.

24


తే. గీ.

ఆత్మవేదులు కర్మ మర్హంబె సేయ
నంద్రు కొందఱు సూరు లయ్యాత్మవేదు
లైనవారికిఁ గర్మమర్హంబె సేయ
నంద్రు కొందఱు సూరు లత్యంతమహిమ.

25


క.

ఈయిరువురి వచనంబులు
నేయెడ నల్పులగు జనుల కెఱుఁగఁబడకయే
శ్రేయోమూలంబై య
త్యాయతమై ధర్మసంశయం బుదయించున్.

26

విష్ణుమహిమ

వ.

తత్సంశయవిషయద్రుమోన్మూలనమారుతంబగు నస్మదాచార్యో
పదిష్టనిశ్చయంబు విన్నవించెద. పరమాన పరజ్ఞాన పరానంద పర

శేషత్వంబులు జీవులకు స్వభావం బది యెఱింగి చేసిన కర్మంబు తన
యది గాదు. కావున విష్ణుప్రీతిగ సత్కర్మం బొనరింపవలయు.
దేహేంద్రియమనఃప్రాణాదులకన్న వేరై సుఖచిద్ఘనుండై యపహతా
శేషపాపచయుండై, విజరుండై, విమృత్యుండై, విశోకుండై, విజిషు
త్సుండై, వితృష్ణుండై సత్యకామత్వాదిగుణసంపన్నుండై సూక్ష్మత్వంబు
నొందియు నాతతచిత్ప్రభం జెంది సర్వాంతర్గతశక్తిత్వంబువలన,
నభేద్యుండు నదాహ్యుండు నక్లేద్యుండు నశోష్యుండునునై, నిత్యశుద్ధ
సుఖానందగుణబ్రహ్మామృతాబ్ది నోలలాడుచు సర్వానందయిత్వ
బ్రహ్మానందశేషత్వలక్షణుండై దేవనరపశుపాదపశరీరాకృతి
భేదంబులు [10]పొందు జీవునికిని వికర్మజనితంబులు [11]కర్మం బనాద్య
విద్యవలనం బుట్టె, నాయనాద్యవిద్య యనాద్యచిదన్వయంబువలన
నయ్యెడు నట్లు జీవుం డవిద్యాకర్మవాసనచే మహదాదిశరీరాంత
వికారకలితానాత్మత్రిగుణప్రథానావృతుండై తత్కృతవిభ్రముండై
యేను దేహుండ నను నహంకారంబు పూని, దేవత్వ నరత్వ గోత్వ
బ్రాహ్మణత్వేశ్వరత్వ భోగిత్వ సిద్ధిత్వ బలత్వ సుఖిత్వంబులు వహించు
కొని, యజనం బొనర్చెద, నిచ్చెదం బ్రమోదించెదనని విమోహంబు
వలనం బలుకుచుఁ బరమాత్మైకధర్మస్వాతంత్ర్యసద్గుణంబులు
తనయం దారోపించుకొని సర్వంబు తనకొఱకే యని చింతించు(చుండు)
కొందఱు సూరిచేతనులు సర్వవ్యాప్తామలానందస్వరూపంబైన పర
బ్రహ్మంబె సర్వానందదాయకంబనియు నితనియందు వర్తించు నఖిలం
బున బ్రకాశించునని(యు) వితర్కింపుచుఁ బరబ్రహ్మామృతాంబుధి
నోలలాడుచు లీలాభోగవిభూతస్థులై రమింపుదురు. త్రిగుణప్రకృతి
లీలావిభూతి, షడ్గుణప్రకృతి భోగవిభూతి. ఇవి రెండును పర
బ్రహ్మాశ్రితంబులు. గగనంబున నభ్రశశిమండలంబులువోలె నధ
రోత్తరభావంబున లీలావిభూతి భోగవిభూతులు మెఱయు. మహా
మాయ యవిద్య నియతి మోహినీప్రకృతి వాసన యన లీలావిభూతి
పరమవ్యోమ పరమధామాది సంజ్ఞలం గలయది భోగవిభూతి. ఈ
రెండువిభూతులు నాత్మలతోఁగూడ భగవచ్ఛేషరూపంబులగుం గానఁ
గర్మంబులు తనవిగా వీశ్వరునివి. చేతనాచేతనాత్మకంబగు విశ్వంబు
విష్ణుశరీరంబునుం గావున తత్ర్కియలు విష్ణ్వధీనంబు లగునని
మఱియు నిట్లనియె.

27

ఆత్మ - దేహాదులు

తే. గీ.

ఆత్మ దేహాదులకును వేఱనియు నిరత
సచ్చిదానందలక్షణస్థాయి యనియుఁ
బరమపుంశేషతైకస్వభావవృత్తి
యనియు నెఱిఁగిన యతఁడు సు మ్మాత్మవేది.

28


వ.

ఏతద్ద్రవ్యమె యాత్మకు విజ్ఞానసమాశ్రయమై యుండు నా ద్రవ్య
మాత్మకు దేహ మట్లనె విశ్వమంతయుఁ బరబ్రహ్మకు దేహంబై యుండు
నని ధ్యానం బొనర్చిన యతం డితరాపేక్ష లేక మోక్షంబు నొందు.
క్షరము ప్రధాన మమృత మక్షరము (జీవుం డా)క్షరాత్ములను హరి
యొక్కడె పరిపాలింపుచునుండు. భోక్త భోజ్యము ప్రేరకుండునని
యెఱింగి యందుచేత నమృతత్వంబు నొందు. "క్షరం ప్రధాన మమృతా
క్షరమ్మ"నియెడి యుపనిషద్వాక్యంబు గలదు. మఱియు నొకరుండె
సర్వప్రాణులందు వ్యాపించి యంతరాత్మయై కర్మాధ్యక్షుండై సర్వ
భూతాదివాసుండై సాక్షాద్ద్రష్టయై చిత్పూర్ణుండై కేవలుండై నిర్గుణుండై
యుండునను 'ఏకోదేవ సర్వభూతేషు' అనియెడి యుపనిషద్వా
క్యంబు గలదు. మఱియు నాకారరహితంబై యవ్రణమై యజరమై,
శుద్ధమైన తేజము వెలుంగు నాతేజము కవియు మనీషియు పరిభూ,
స్వయంభూ నామాన్వితంబునునై యనేకకాలంబు లాధాత తథ్యంబు
వలన నర్థంబు లొనర్చునను 'సపర్యగాచ్ఛుక్రమకాయ మవ్రణమ్మ'ను
ఉపనిషద్వాక్యంబు గలదు. మఱియుఁ బెక్కండ్రైన నిత్యులైన
జీవులకు నిత్యుండైన చేతనుండు భగవంతుఁ డొక్కరుండే కామంబు
లిచ్చుచుండు నతని ధీరుండైన బ్రాహ్మణుం డెఱింగి ప్రజ్ఞాశక్తి నిలుపు
కొనవలయు నని పలుకు “నిత్యో నిత్యానామ్” అనియెడి యుపనిష
ద్వాక్యంబు గలదు. మఱియుఁ దత్వత్రయజీవనంబులైన యుపనిష
ద్వాక్యంబులు గలవు.

29

పరబ్రహ్మతత్త్వము

సీ.

తత్వత్రయం బనాఁదగుఁ జిద చిత్పర
                       బ్రహ్మభేదంబునఁ బ్రధిత మగుచుఁ
జిదచిచ్ఛరీరత చెప్పంగఁ దగుఁ బర
                       బ్రహ్మంబె పూర్ణమౌ పరమతత్వ

మొక్కటి యని యాగమోక్తుల నొకవంకఁ
                       బరమవిజ్ఞానులు ప్రస్తుతింపఁ
జిదచిచ్ఛరీరమై సిరుల రాణించు త
                       ద్బ్రహ్మము రూపింపఁ దద్బ్రహ్మమునకు


తే. గీ.

నాకృతియ లేదనుటకు యతో౽న్యధార్త
మను మహోక్తి నిషేధకం బయ్యెఁ బీన
వక్షుఁ డంచు మఱియు విశాలాక్షుఁ డంచు
శ్రీరఘూత్తము నాత్మఁ గీర్తించుకతన.

30


సీ.

బద్ధులైన నికృష్టభావులు సంసార
                       భాజనంబులు జగద్భర్తయేని
బద్ధుఁడైయుండినఁ బ్రభు వనిపించునే
                       బహువిధంబుల నెంచ బంధనార్హ
చోరుల విడిపించు పౌరుషం బొనరిన
                       వాడు ప్రభుండన వన్నె కెక్కుఁ
గాన నిబద్ధుండు గాఁ డెందుఁ బ్రభువు [12]
                       న్నిష్ఠుఁడై యున్నవానికి హితోప


తే. గీ.

దేశ మొనరింతు రార్యులు తేజ మిచ్చి
యంబుజాసను నిర్మించి యాగమములు
తెలిపె నేదేవుఁ డాత్మబుద్ధి ప్రసక్తి
యట్టిదేవునిఁ గొల్తు నే ననియె శ్రుతియు.

31


క.

సర్వవశగతుని దేవుని
సర్వాధిపు సర్వభూతసామ్రాజ్యనిధిన్
సర్వాంతర్యామిని హరి
సర్వజ్ఞుని నెఱిఁగి ముక్తిసంపద గాంచున్.

32


వ.

ఇందునకు “యో బ్రహ్మణా విదధాతి పూర” మ్మను నుపనిషద్వా
క్యంబు గలదు.

33

క.

అరయఁగ బహిరాదరణముఁ
బొరయక యావరణ మగుచు భువనంబులలోఁ
బరఁగిన యధ్వరమూర్తిన్
హరి గొల్చిన మోక్షలక్ష్మి యబ్బకయున్నే.

34


వ.

బ్రహ్మ మొదలు మహాపురుషునిఁ గాను దమోతీతునింగాను ఆదిత్య
వర్ణునిగాను సర్వరూపములును సంగ్రహించి సర్వనామములుం గలిగి
యున్నవానిఁగాను [13]నుదాహరించెను. శుక్రుండు నాల్గుదిక్కుల నట్లన
చాటె నటువంటివాని నెఱుంగుటె మోక్షోపాయ మగును. అన్య
మార్గంబు లేదని [14]వేదపురుషు నే నెఱుంగుదునని పల్కెడు "వేదాహ
మేతం పురుషం మహంతమ్" అనియెడి శ్రుతి వాక్యంబు గలదు.

35


క.

భవపాశబంధకుండును
భవపాశవిమోచకుఁడును బ్రహ్మము కైవ
ల్యవిభవదాయకుఁడు వి
ష్ణువె యగు వేదాంతదివ్యసూక్తుల నెంచన్.

36


తే. గీ.

అర్కునివలన నారోగ్య మాయె నలుని
వలన సిరియును శంకరువలన బోధ
[15]మచ్యుతు వలన ముక్తియు నందవలయు
ననఁగ నుపనిషదుక్తి యుక్తార్థముగను.

37


వ.

అనిన వివి ఋషులు పరమహర్షసమేతులై సూతునకు మఱియు
నిట్లనిరి. ప్రహ్లాదుండు పూర్వజన్మంబున నారాయణనిష్ఠాపరుండై
యుండి మఱియును.

38

బ్రహ్మవిద్యారహస్యము

క.

ప్రాజ్ఞుఁడు ప్రహ్లాదుం డన
నజ్ఞులకును బ్రహ్మవిద్య యది పుట్టెను న
త్యజ్ఞుఁ డగు దైత్యునకు శా
స్త్రజ్ఞుం డాధీరుఁ డెట్లు జనియించెఁ దగన్.

39


క.

ఇలలోన బ్రహ్మవిద్యా
కలితులకుఁ బునర్భవములు గలుగవు. వరుఁడై
వెలయు హరి నెఱిఁగి మృత్యు
ప్రళయముఁ దాఁటునని శ్రుతి తిరంబుగఁ బలికెన్.

40

వ.

అట్లు ప్రహ్లాదుండు పూర్వజన్మార్జితబ్రహ్మవిద్య గలిగియుండియు
దైత్యువంశంబున నెట్లు జన్మించె నాహిరణ్యాక్షహిరణ్యకశిపులు
మున్ను వైకుంఠద్వారపాలకులని నీవలన వింటిమి. శ్రీవిష్ణు
ధామంబు పునరావృత్తిరహితం బని పార్థసారథి “యద్గత్వాన
నివర్తంతే తద్ధామ పరమం మమ" అని యానతిచ్చె “ఏష దేవోపమో
బ్రహ్మపథానేన పరంగతా ఇమం మానవ మావర్తంతే” యను శ్రుతి
యున్నయది గాన పునరావృత్తిరహితం బని పార్థస్పురద్ధాములగు
వారికిఁ బునరావృత్తి యెక్కడిది యని కొంద ఱాడుదురు. కొందఱు
పునర్జన్మహేతువైన యాలోకము తత్వత్రయజ్ఞానహీనులై విష్ణు
కర్మనిరతులై పుణ్యఫల మనుభవించువారికి భోగస్థానంబు గాని
యప్రాకృతదివ్యధామంబు గాదని చెప్పుదురు. జయవిజయులు
ద్వారపాలకులైన శ్రీవైకుంఠము స్వర్గ మనిపించుకొనిన భోగస్థానం
బు గాని యప్రాకృతదివ్యధామంబు గాదని కొందఱు చెప్పుదురు.
జ్ఞానలోకం బయ్యెనేని త్రిపాద్విభూతిపాంచభౌతికాత్ములైన సన
కాదులకుఁ బ్రాప్యంబుఁ గా దదియునుంగాక యర్చిరాదిమార్గంబున
నాత్మబలవిద్యావిశేషంబున, సప్తావరణంబు లతిక్రమించి విరజం
దోఁగి పూర్వదేహంబులు వదలి లింగవిగ్రహరహితులై వీతవసనులై
యమానవకరస్పర్శంబువలన నావిర్భూతస్వశక్తికులై పరమ
వ్యోమంబునఁ బరమానందంబునఁ బరమాత్మతో నిత్యానవధికానంద
భోగమాత్రసదృక్షత్వంబును, తద్దివ్యరూపానురూపానురూప
మాత్రస్వరూపత్యంబును బొంది స్వనిత్యదాన్యైకరసాత్మత్వాది
సద్గుణంబులుం బరానవధికస్వామ్యంబులు ననుభవింపుచుఁ దత్స్వ
భావానురూపైకప్రీతికారితంబైన భగవన్నిత్యకైంకర్యంబునందు
రమింపుచుం బ్రేమ గద్గదావలోకనంబుల నొండురులం జూచుచు నొక
రొకరి విరోధింపక యుండ్రు. తల్లోకస్థుండైన యొకానొకని కేనియు
ద్రోహం బాచరింపరు. సనకాదు లాధామంబున నుండి [16]ప్రత్య
ద్వారపాలకులతో నసూయ పడి శాపం బిచ్చి రది యప్రాకృతం బగునే?
ప్రాకృతలోకంబునుండి పునరావృత్తి గలుగుటం జేసి వారలకు విరు
ద్ధంబు గాదని కొంద ఱాడుదు రది మాకు సమ్మతంబైనను మాకు
నడుగం దగినయది గల దది యడిగెదము. ఇంకను,

41

తే. గీ.

భాగవతమందిరంబులఁ బరమశాంతి
గాని క్రౌర్యంబు లేదు లోకంబునందు
సాత్వికోత్తమమూర్తియౌ చక్రధరుని
పాదపద్మంబు లాత్మలోఁ బాయకున్న.

42


సీ.

జగతిపై ఋషుల యాశ్రమపదంబుల శాంతి
                       గాని క్రౌర్యము లేదు ధేనువత్స
హరిణవత్సంబుల నాఘ్రాణ మొనరించి
                       యాత్మవత్సల కోడ వ్యాఘ్రి కాదు
లూధ స్స్రవద్దుగ్ధ మొయ్యనొయ్యన నిచ్చు
                       బ్రహ్మపుత్రులు శాంతివరులు ఘనులు
సనకాదు లత్యంతసాధులు వైష్ణవ
                       ద్వారపాలకుల నుద్ధతి శపింపఁ


తే. గీ.

దగునె భగవన్నిరంతరదాస్యనిష్ఠు
లైన దౌవారికులు సనకాదిసాత్వి
కోత్తముల కవమతి సేయ యుక్త మగునె
సంశయంబెల్లఁ దీర్పవే సాధువర్య!

43


మ.

జలజాతాక్షుఁడు విశ్వమంతయు మనస్సంకల్పమాత్రంబునన్
గలిగించన్ వెలయించ నొంచ నతిలోకంబైన సామర్థ్య మ
గ్గలమై చొప్పడి మించినట్టి హరి లోకైకప్రభుం డెట్లు నా
త్మ లసద్దామమునందు నుండి హరి మర్త్యశ్రీ ధరన్ నిల్చెనో.

44


సీ.

పంచాననంబును బాంచజనమునైన
                       యాకార మేటికి హరి వహించె
నుక్కుకంబముననే యొప్పున నుదయించె
                       ద్విభుజుఁడై యున్న యాదితిజు గెల్వ
బహుబాహుఁడై యెట్లు పాటించె నివియు న
                       న్యంబులు నెఱిఁగించు మస్మదీయ
సందేహవిషమహీజముల నిశ్చయతనం
                       బున నోర్వ నీకంటె ఘనుఁడు గలఁడె

తే. గీ.

ధన్యుఁ బౌరాణికమణి మీతండ్రిఁ జూచి
హృషితరోమాంకురములతో నెసఁగి రోమ
హర్షణాఖ్య [17](నొ)సంగె నవ్యాసమౌని
యట్టి ఘనుని కుమారుండ వనఘచరిత!

45


క.

నీవును నటువలెనె య(మిత)
పావనుఁడవు తత్వబోధపరిశిష్టశుకాం
తేవాసివి సులభము నీ
కావిశ్వప్రశ్ననిశ్చయంబు [18]మహాత్మా!

46


తే. గీ.

చెలఁగి నారాయణోదయాచలముమీఁదఁ
బ్రబలు తత్తత్వనిశ్చియ పద్మమిత్రుఁ
డలరు భవదాదిధాతృపర్యంతవిబుధ
విష్ణుపదగతదీప్తిచే వెలయు దిశల.

47


స్రగ్ధర.

సూతా పుణ్యప్రసూతా! సుచరితభరితా!
          శుద్ధసత్వోపదేశో
ధ్భూతాభ్యాసక్రియావిస్ఫురితబుధమనోం
          భోజభావ్యంబు దుస్త
ర్కాతిస్ఫీతానువృత్యత్యవధివిపథదూ
          రాతిదూరంబునై వి
ఖ్యాతం బాతత్వబోధం బధితముగఁ జే
          యంగ నీకంటె నేరీ!

48


మ.

శ్రుతికల్లోలసముద్గమోద్భటరసస్ఫూర్తిన్ విజృంభించి య
న్వితవేదాంతవిచారసారమణియై విద్యానదీవిభ్రమాం
చిత (మా)సద్గురుసంప్రదాయజలధిన్ శ్రీవిష్ణుశాస్త్రాంబువుల్
రతిమైఁ గ్రో[19](లి) ఘనుండవైతివి చికిత్సాభావ మి ట్లార్పవే.

49

చ.

నిగమశిరోనిరూపణము నేర్పున ని ట్గొనరించి హేయతా
విగళితసద్గుణప్రథితవిష్ణుపదాంబుజభక్తియుక్తిమై
పొగడిక నొందు మౌనిగణపుంగవు లాడిన ప్రశ్నభాషణం
బొగి విని కశ్యపోక్తమగు నుత్తర మక్కథకుండు నిట్లనున్.

50


సీ.

అద్భుతం బౌర పూర్ణౌద్ధులు ముక్తసం
                       శయు లయ్యు మీరు సంశయము నందు
టంతయు లోకహితార్థమై విష్ణుపా
                       దాబ్జసేవకులైన యట్టి మీరు
దక్క స్వార్థైకతత్పరులైన యాజను
                       లడిగెదమని యెవ్వ రభిలషింతు
రవనిలోఁ బుండరీకాక్షపాదాబ్జష
                       ట్పదచిత్తులగు బుధుల్ పరమనియతి


తే. గీ.

బ్రహ్మవిద్యాప్రకారసంప్రశ్నమెల్ల
మీర లడిగిన కైవడిఁ దారు నడిగి
సంశ్రయింతురు తత్త్రయీసారనేవ
చేసిరో చేయకున్నారొ చిత్రమహిమ.

51


క.

ధర మీ రడిగినగతి మ
ద్గురుఁడు గురుండైన యాత్మగురుపారాశ
ర్యు రుచివిజితసూర్యు మహో
త్తరధుర్యు నుతించి యడిగెఁ దద్భ్రమ ముడుగన్.

52


తే. గీ.

షడ్గుణైశ్వర్యసంపన్న! సాధువర్య!
వేదవేదాంతవిద్యారవిందసూర్య!
ముక్త్యుపాయముఖద్వారమోహకాంధ
కార మెడలించి కరుణించఁగదవె తండ్రి!

53


వ.

భవాదృశబ్రహ్మవిత్పాదపద్మసేవాసుధ క్షామమానసహంసు
లైనవారికిఁ బ్రజ్ఞాజ్ఞప్తి పుష్టత యెక్కడిది. యజ్ఞాదిశ్రుతివలన
బ్రహ్మవిద్య కర్మాంగకంబె యని వినంబడియె. ఆబ్రహ్మవిద్యకు

నశ్వంబునకు గమనసాధనంబులుంబలె బ్రహ్మవిద్యకు సర్వాపేక్ష
యుం గలదని 'సర్వాపేక్షాచ యజ్ఞాది శ్రుతే రశ్వవత్త'ని సూత్రం
బొనర్చితివి. అయినను నొకసందేహంబు గల దడిగెద.

54


సీ.

యాజ్ఞవల్క్యాదికులైన బ్రహ్మర్షులు
                       జనకాదులైన రాజన్యఋషులు
ఘనతమై కర్మాంగకబ్రహ్మవిద్య ల
                       ధిష్ఠించి శౌరిఁ జెందిరి [20]క్రవ్యాద
వృత్రాదు లగు దైత్యపుంగవుల్ గోపకాం
                       తలు ముకుందుని మనస్థాయిఁ జేసి
కల్పితాకల్పాంగకబ్రహ్మవిద్య న
                       చ్యుతపదం బందిరి సొంపు మీఱి


ఆ. వె.

కఠినులగు హిరణ్యకశిపహిరణ్యాక్ష
ముఖ్యరాక్షసులు నమోఘనిత్య
భావనల నిషిద్ధపద్ధతిఁ బాసి శ్రీ
పతిపదంబుఁ గనిరి పరమనియతి.

55


సీ.

అల హిరణ్యకహిరణ్యాక్షులు వాసుదే
                       వద్వారపాలకు ల్వారు పరమ
ధామంబునం దుండి తలఁగి యధఃపాత
                       మందుట యేమి బ్రహ్మతనుజాతు
లగు సాత్వికులు సనకాదియోగీంద్రులు
                       ప్రాకృతు లట్లు నే భగవదాప్త
దౌవారికులమీఁద దర్పించ నేటికి
                       శాస్త్రవిజ్ఞానసంస్కారహీను


తే. గీ.

లలుగఁ దగుఁగాక హరిభక్తులైన ఘనుల
యెడల సుర ద్రావి మాంసంబు లిచ్చ మెసఁగి
మదవికారముచేత నున్మత్తులైన
చెనటు లె ట్లొనరించినఁ జెల్లుఁగాక.

56

క.

అతిసాత్వికు లల్పకు లవ
మతి చేసిన నదె సహించి మన్నింతు రప
స్మృతిమంతుఁ డెంత చేసిన
హితులగు వారలకు రోష మేగతిఁ గల్గున్.

57


క.

భగవల్లోకంబునఁ ద
ద్భగవంతుఁడు భగవదాప్తపరిచారకులున్
భగవద్భక్తులకే వా
సిగవత్సకు మొదవు చన్ను చేపినయట్లన్.

58


సీ.

ఇటువలెనె యుండ నిందిరానాయక
                       భక్తులై వెలసిన బ్రహ్మపుత్రు
లరుదేర వారికి నవమాన మొనరించి
                       నవమానమున నుండ నయమె యాత్మ
నఖిలకృత్యములు బ్రహ్మాధీనమని నమ్మి
                       యాశ్రమాంతరములయందు నున్న
యధిగతపరమార్థులైన వారలకు ను
                       ద్దీప్తమై మూర్తీభవించు శాంతి


తే. గీ.

హరిపదంబున నుండుట యద్భుతంబె
శుద్ధసత్వాబ్ధిఁజంద్రమస్ఫూర్తి నొందు
పరమవిభుని మదమున కోపంబు నుగ్ర
శాపమును గల్గ నేర్చునే శాంతులకును.

59


మ.

అతిసందేహదవాగ్నిఁ దొట్రువడి వేదాంతీభముల్ నేడు సం
తతసంతాపము నొందుచోట నితరుల్ తత్వజ్ఞలే తండ్రి యా
తతవేదాంతరహస్యనిశ్చయసుధోధన్వత్సుధాధామయ
ద్యతవిద్యాహ్వయచంద్రికారుచిని మత్తాపంబు వారింపవే.

60


క.

అని తనయుఁడు తను నడిగిన
ఘనుఁ డామునివరుఁడు సుప్రకాశార్థముగా
విని హర్షగద్గదస్వన
మునఁ బల్కెన్ బాష్పపులకముల్ [21]తిలకించన్.

61

వేదాంతరహస్యము

క.

పౌత్రుఁడవు పరాశరులకుఁ
బుత్రుండవు నాకవేదపుంజమవు దయా
పాత్రుఁడవు శక్తిసప్తవు
చిత్రితమే నీకుఁ బల్కఁ జెల్లదె యిచటన్.

62


మ.

అలఘుస్ఫూర్తి వశిష్ఠవంశనిధి వీ వాత్మానురూపంబుగాఁ
గళ లుప్పొంగఁగఁ బ్రశ్న చేసితివి సాక్ష్మాద్భహ్మవిద్యాసుధా
కలశాంభోనిధి వెల్లిగా సుతుఁడవై కైవల్యసీమావిశృం
ఖలసామ్రాజ్యవిభుండవై పలికిన[22]గావే మహాహృద్యముల్.

63


క.

నందనుఁ డెన్నఁడు నడుగఁడు
విందుండై నన్ను బ్రహ్మవిద్య యనుచు నే
సందేహింపఁగఁ బరమా .
నందం బొనరించితివి మనంబున కనఘా!

64


క.

భగవద్భక్తిపరాయణు
లగువారలు తండ్రికొడుకు లాత్మేశ్వరపా
ర్శ్వగులైన వారికంటెను
మిగులం బ్రియతములు గుణసమృద్ధి నుతించన్.

65


క.

శ్రుతు లన్నియును శిరస్స
మ్మితములుగాఁ జదివి ద్విజుఁడు మీమాంసాది
స్థితిచే శ్రీహరిఁ దెలిసిన
యతఁడు సుమీ తత్వవేది యనఁగ ధరిత్రిన్.

66


సీ.

సత్సర్వగసుఖవిజ్ఞానస్వరూపుని
                       సర్వసాక్షి నకల్మషప్రభావు
సతతచిదచిదాత్మసకలవస్తుశరీరు
                       నఖిలకర్మావబోధాధికారి
యోగ్యఫలప్రదు నుచితవాత్సల్య
                       జలధి శ్రీపతి సర్వశక్తి నతికృ
పాంబురాశిని మహోదారుని ననఘుని
                       సకలలోకారాధ్యచక్రహస్తు

తే. గీ.

సారసౌశీల్యగుణసుధాసాగరంబు
శాంతు భగవంతుఁ బన్నగశాయిఁ గాంచి
భక్తి నాత్మఁ దలంచి యాసక్తి నెంచి
యున్న విప్రుని విప్రత్వ ముత్తమంబు.

67


క.

సాంగోపనిషత్పూర్వక
ముంగా వేదములు చదివి మురజిత్సేవా
సంగంబు లేని విప్రుఁడు
వెంగలి తజ్జన్మమెల్ల విఫలం బెంచన్.

68


తే. గీ.

స్వప్రియునియందుబలె మహేశ్వరునియందుఁ
బ్రేమ గోపన మొనరించి యామహేంద్ర
ముఖ్యదివిజుల కుపచారములు ఘటించు
బాహ్యవృత్తిని [23]శ్రుతి నతిభావమునను.

69


క.

శ్రుతి నిరతము పరుఁడగు న
చ్యుతునందు నసాత్వికునకు నుల్లము నిలువన్
బ్రతినన్ సర్వామరసం
తతి కంతర్యామిఁగాఁ బ్రశంసించఁదగున్.

70


క.

ఎవ్వని కెయ్యది హితమై
నివ్వటిలుం దాని నెఱిఁగి నిరతహితుండై
యవ్విధమునఁ బలుకుచు మన
మువ్విళ్లూరంగ మెలఁగుచుండఁగవలయున్.

71


మ.

జ్వరపూర్ణుండు నిజప్రియార్థగుణసంఛన్నౌషధం బిచ్చు శ్రీ
కరసద్వైద్యుని యౌషధంబు లతియోగ్యశ్లాఘ్యముల్ ద్రావి వి
జ్వరుఁ డౌ నట్ల రజస్తమఃకలితసత్వస్వేష్టదేవస్తుతిం
గురురాట్సత్వహితోపదేశమహిమం గూడున్ మహాధామమున్.

72

సీ.

సత్వరజస్తమస్సంజ్ఞికంబగు గుణ
                       త్రయము దాను ద్రిపత్కృతమయి యున్నఁ
గుటిలరజస్తమోగుణముల గణసత్వ
                       సత్వగుణస్ఫూర్తి సంభవించు
నొకవేళ యది గాన నుత్కటసంసార
                       వర్తి యయ్యును మోక్షవాంఛ సేయు
నాసత్వగుణమున నంతయు మోక్షోద
                       యంబైన నూరిజనంబు మోక్ష


తే. గీ.

హేతు వడిగిన నుపదేశ మిత్తు రార్యు
లందునకు మాట వేదంబె యనుచు [24]నండ్రు
గాన వేదపథోపదేశానువృత్తిఁ
దిరుగువారికి మోక్షంబుసిరి లభించు.

73


సీ.

గురుతమోగుణరజోగుణసముద్రేకద
                       శ ల్ప్రాప్తమై యున్న సంత్యజించి
సత్వవేశమున నాశ్వాసింపుదురు శ్రుతి
                       స్వార్థమౌ ననుచు నాజనులు స్వాత్మ
సమశీలగురుముఖాబ్జంబులవలనఁ ద
                       చ్ఛుతిపరంపర బ్రహ్మరుద్రశుక్ర
వరుణాదిపరముగా వర్ణించఁ గని వార
                       లందఱుఁ గర్తవే యని తలంతు


తే. గీ.

[25]రంతరాత్మకు నెంచ నన్యామరత్వ
రూపములు వేఱుగా వని రూఢి మెఱయ
నాచరింతురు దేహాన్యమైన యాత్మ
దేహ మనిన తెఱంగునఁ దెలివి లేక.

74


చ.

ధరపయిఁ బౌండ్రకుం డనఁగఁ దామససాత్వికుఁడైన దైత్యశే
ఖరుఁడు ముముక్షుఁడై మహిమఁ గైకొని సత్వగుణోదయంబునన్
దిరుగుచు వాసుదేవపరదేవుఁడ వీ వవతార మంది భూ
భరణ మొనర్చినాఁడ వని బాలురు పల్కఁగ సమ్మతించినన్.

75

క.

చింతించి 'యచ్యుతో౽హ మ
నంతో౽హం హరి రహ మ్మురారి రహం శ్రీ
కాంతో౽హ'మ్మను నాతని
నంతం బందించె దానవాంతకుఁ డంతన్.

76


క.

రాజులు నిజరాజ్యరమా
తేజఃకాంక్షులను గని వధించుపగిది ల
క్ష్మీజానియుఁ బరు లాత్మ
శ్రీజయసంపదలు గోర శిక్షించు నిలన్.

77


క.

భువిలో నంతర్యామి
ప్రవిశుద్ధాంతస్స్వరూపభావము లక్ష్మీ
ధవు స్వస్వరూపవిభవం
బవినీతుఁడు తనకు ననిన <ref>యణగక యున్నే<ref>నణఁగకయున్నే.

78


క.

తనకుఁ దను నేలు స్వామికిఁ
బనుపడిన విలక్షణస్వభావత్వ మెఱిం
గి నిరత మత్యను[26]కూలై
క్యనియతిఁ బాటించెనేని యాత్మజ్ఞులకున్.

79


వ.

వేఱైన వస్తువులకు నైక్య మనఁగా మనముల నన్యానుకూలములై
యుండుటే, వస్తుద్వయ మొకటియై యుండుట గాదు. అది యెట్లంటేని.
భేదముల్ పలికి వేదవాక్యములు నిరోధించుం గనుక విభిన్నవస్తు
ద్వయ మేక మనుట విరుద్ధము. వస్తుద్వయము వేఱే యనుట విరుద్ధము
గాదు. జీవాత్మ పరమాత్మలకు నైక్యంబు చెప్పెడి వాక్యంబుల కున్న
భేదము చెప్పెడు వాక్యంబులకును నిటువలెనే యర్థంబు. అర్థ
ప్రకరణలింగౌచిత్యదేశకాలాదులచేతం గాని కేవలశబ్దంబువలన
నర్థంబు నిర్ణయము చేయరాదు. అది యెటువలె నన్న.

80

జీవాత్మ - పరమాత్మల యైక్యము

తే. గీ.

కానుపించిన దంపతి కలహబంధు
కలహభేదైక్యరూపవాక్యములువోలె
శ్రుతిసముదితైక్యభేదంబు లతిశయమున
స్వోచితార్థగతంబులై యుండు నెపుడు.

81

క.

ప్రకటవిభేదాభేదఘ
టకరూపశ్రుతులు సూత్కటంబుల మిథ్యా
రకములు తెలియందగు నె
న్నికనని బోధాయనుండు నియతిం బలికెన్.

82


క.

క్షితిలో నెంచ నభేద
శ్రుతి యన్నిట నాత్మభేదరూపనిషేధ
స్థితి నున్న భేదవాక్యము
లతిబాధ్యతరంబు లగుచు నడఁగక యున్నే.

83


వ.

భేదాభేదఘటకభేదంబునఁ ద్రివిధంబులై యుండు వాక్యంబు లటుగాన
సమస్తావస్థచిదచిద్విశిష్టతత్పరంబులైన యవి యభేదప్రధానంబులు.
విశేషణాదిభేదోపజీవితంబులైన యవి భేదప్రధానంబు లిట్లని యెఱుం
గందగిన యభిప్రాయంబు గలిగిన యవి ఘటకరూపంబులగు శ్రుతులు.
హరికి సమస్తచిదచిద్వస్తుశరీరత్వాదికంబును బలుకు కల్యాణగుణ
తత్పరంబులైన యవి సగుణవాక్యంబులు. హరికి హేయగుణ
రాహిత్యంబు పలుకునవి నిర్గుణవాక్యంబులు. అట్లు గాకున్న
నన్యోన్యకలహంబున నన్యోన్యతరబాధ్యత్వంబునఁ దద్వాక్యంబుల
కగు నట్లౌటఁ దద్వాక్యంబులకు బోధనీయభేదవివేచనంబు సార్ధం
బుగా నెఱుంగవలయు. ఈమార్గంబున వేదాంతతాత్పర్యవిషయం
బని హరిని నమ్మియున్నవార లాత్మసంతోషకులు. సర్వభూతం
బులును హరి శరీరంబులును దద్భూతహితైకరతులైనవారు విశ్వ
మూర్తికిఁ బరమప్రియులైనవారు తన్మనస్కులై తదాలాపులై
తదీయప్రియసత్కర్ములై తదిష్టితములైన వారలు పరమధామం
బున రమింపుదురు.

84


తే. గీ.

శుకభవల్లీల వేదాంతసుఖనిరూప్య
రమ్యతత్వత్రయేశ పరత్వశుద్ధ
శేముషీయుక్తులై దయాశీలురైన
నాత్మ విద్యామృతాస్వాదు లగుచు నుండ్రు.

85


శా.

సంసారోగ్రతరజ్వరామయభవస్ఫారైకతాపత్రయో
ధ్వంసోన్మూర్ఛితబుద్ధులౌ నరులకున్ స్వస్వోచితార్ధగ్ర మీ
మాంసాకల్పితతత్పరార్థధిషణామ్నాతంబుగా నుత్తముల్
సంసేవించి హితోపదేశ మొనరింపఁజూతు రశ్రాంతమున్.

86

వ.

అని మఱియు వ్యాసభగవంతుం డిట్లనియె.

87


తే. గీ.

ఎన్నికఁ దమోగుణంబుతో నున్న సత్వ
గుణముచేఁ ద్రోవఁబడిన తద్గుణనిజస్వ
భావమున సంచరింప నపారమహిమఁ
దేజరిల్లునె విగతసందేహబుద్ధి.

88


క.

ధర నీ వతిశుద్ధాంతః
కరణుండవు సుప్రబోధకలితుఁడవు దయా
పరుఁడవు విద్యాసుధసు
స్థిరహృదయుఁడ వగుచుఁ గ్రోలు చెప్పెద నింకన్.

89

మోక్షోపాయతహితము

క.

ఇతిహాసపురాణవిబృం
హితసర్వోపనిషదుక్తి నిష్టార్థపరి
ష్కృతమై మోక్షోపాయత
హితమై మను బ్రహ్మవిద్య యిరుతెఱఁగు లగున్.

90


వ.

అది యెట్లంటేని.

91


సీ.

న్యాసం బనంగ నుపాసనం బనఁగ నా
                       రెండును దనరు నారెంటిలోన
న్యాసం బనంగ యాగాదిసంజ్ఞిక ముపా
                       సన మనఁగ (నది) ప్రజ్ఞాదికంబు
వేదోక్తములు న్యాసవిద్యయే దేహంబు
                       నందుఁ బ్రాపించుఁ దదంతమైన
ఫల మిచ్చుచుండు నుపాసనంబునను బ్రా
                       రబ్ధకర్మములు సర్వములు జనక


తే. గీ.

ఫల మొసంగ దుపాసనాబంధకంబు
లెంచఁ బ్రారబ్ధకర్మంబు లిట్లు న్యాస
విద్యఁ బ్రారబ్ధకర్మముల్ చోద్య మంద
నడ్డకట్టువు ఫల మిచ్చు నప్పు డవియు.

92

క.

జర యగ్నిహోత్రమై తగు
మరణం బవబృథము న్యాసమతి నిష్ఠునకున్
బరికింప న్యాసవిద్యా
పరిచితి వర్తింప క్షిప్రఫలము లభించున్.

93


మ.

అల ఖట్వాంగుఁడు విష్ణురాతుఁడును నిత్యన్యాసవిద్యాధిరూ
ఢులు వీ రంచు నుతించి మౌనిసభ నార్యు ల్మెచ్చఁగాఁ దత్వవే
దులలో ముఖ్యుఁడ వీవె పల్కితి కృతార్థుల్‌గారె వా రెన్నికన్
కులశీలాద్యభిమానసంపదల లోకు ల్గాంచిరే మోక్షముల్.

94


వ.

ఖట్వాంగుఁడను రాజర్షి ముహూర్తాయుఃప్రమాణం బెఱింగి సర్వంబు
విసర్జించి హరిం జెందె. పరీక్షితుండు సప్తాహంబు జీవితావధిగాఁ దెలిసి
నిఖిలంబుం బరిత్యజించి యపవర్గంబు గాంచె నట్లగుట న్యాసవిద్య
సర్వఫలప్రద. మఱియు.

95


క.

ఆరయ భీష్మాదులు శ్రీ
నారాయణదేవుఁ గృష్ణు నానాబుధలో
కారాధ్యు భక్తిఁ గొల్చి యు
దారంబగు పరమధామ మందిరి వేడ్కన్.

96


వ.

అనిన శుకుం డిట్లనియె.

97


సీ.

భగవంతుఁడవు పరబ్రహ్మణ్యుఁడవు సం
                       పూజనీయచరణాంభోజుఁడవు స
మిద్ధబుద్ధి నను గ్రహింపుము నన్ను లో
                       కంబులో నెఱిఁగియుఁ గాముకుండుఁ
దలపఁ డజ్ఞానకుతర్కప్రతారితుం
                       డై [27]దోషముం దెలియని జనంబు
లాడెడుచోట నే నడిగెద నీప్రశ్న
                       మీయపరాధంబు లిటు సహింపు


తే. గీ.

మిది రహస్యార్థ మనుచు నే మొదలఁ దలఁచి
యిదియ యడుగఁగఁ దలఁచితి నింతకంటె
నెద్ది ప్రశ్నాంతరంబు సమీప్సితప్ర
దాయకము నిత్యముక్తిప్రదాయకంబు.

98

శా.

పారాశర్యమహాముని ప్రవరరూపబ్రహ్మవిద్యాసుధా
పారావారమునందుఁ బుట్టి యతివిభ్రాంతాత్మమోహాంధుఁ బా
తారంభంబునఁ జిక్కి యీశుకకళాధ్యక్షుండు శ్రీవిష్ణుఁడై
యారూఢాధికసంశయుం డనఁగ నర్హం బౌనె వర్తించఁగన్.

99


వ.

అది గావున సంశయ మీరీతి నణఁగు నారీతిగా నాన తిమ్మని మఱియు
నిట్లనియె.

100


సీ.

దేవుఁ డెవ్వరుఁడు తద్దేవునకు రహస్య
                       మెయ్యది యది .... .....
విననయ్యె నెఱింగించి ఘనమోహ మేరీతి
                       నణగు నారీతిఁ జోద్యముగఁ దెలుపు
గురుఁడవు నేఁడు నాకురుశక్తితోఁ బల్కు
                       మశ్రద్ధధానుండు నజ్ఞుఁడును వి
మూఢుండు సంశయాత్ముండు నష్టుఁ డటంచు
                       భక్తాబ్ధిశశిరమాభర్త యనియెఁ


తే. గీ.

గాన నాత్మవినాశైకకారణంబు
మన్మనోదైన్య మణగించు మదిఁ దలంచఁ
దద్రహస్యోపదేశార్ధదాన మొసఁగి
శిష్యుఁడఁ దనూభవుఁడఁ బదసేవకుండ.

101


క.

అని వినుతింపుచు నప్పుడు
తనయుఁడు పలుకంగఁ బలికె ద్వైపాయనస
న్మునివరుఁడు తద్రహస్యా
ర్థనిమిత్తమహోపదేశతాత్పర్యంబుల్.

102

పరబ్రహ్మరహస్యార్థము

మ.

విను మో పుత్రక! యేకచిత్తమున నీవిద్యారహస్యంబు శి
ష్యునకున్ నమ్మిక గల్గు వానికి గురుం డోవున్ బ్రసాదింపఁ బా
వన మస్మత్కులవిత్త మీఘన[28]రహస్యం బీమహావిత్త మో
యనఘా! నీకు లభించుఁ బ్రాప్య మనుభోగ్యంబున్ ఘనంబున్ దగన్.

103

క.

అని తనయుని నుల్లార్పుచు
ముని భగవద్దీసుధాబ్ధి ముఖ్యతరప్ర
శ్న నిశాకరరుచిఁ బొంగఁగ
మునికొని హర్షంబు పూర్ణముగ నిట్లనియెన్.

104


సీ.

ప్రథితేతిహాసపురాణోపబృంహితో
                       పనిషన్మతము పరబ్రహ్మ పరమ
ధామాక్షరాదిపదవిశిష్టసంజ్ఞక
                       మాగమేతరదూర మనఘ తరము
పారాతిగ గుణాబ్ది యారూఢదుస్తార్కి
                       కోలూకతర్కనేత్రోష్ణదీప్తి
యన ననాదిత్రిగుణావ్యక్తనువ్యక్త
                       కాలవిలక్షణకలితమై ప్ర


తే. గీ.

పత్తికారణమై యలభ్యమును నైన
పరమపదవైభవామృతోత్కరకశాయు
తాయుతాశాంశదేశ మత్యద్భుతప్ర
కారమున నెఱిఁగింతు విఖ్యాతి వినుము.

105


మ.

అగణేయప్రళయార్కచంద్రదహనోద్యత్తేజముల్ చూడఁ ద
ద్భగవద్ధామనిరీక్ష సేయునెడ నల్పద్యోతఖద్యోతముల్
తగఁ బూర్ణైతదనంతలోకమహిమోత్కర్షంబు వర్ణింపుచో
గగనప్రాకృతదివ్యలోకమహిమల్ కారాగృహప్రాయముల్.

106


తే. గీ.

సాధు లప్రాకృతాకాశచరపరాగ
జేయజీవగుణమ్ముల నెమ్మిఁ జూచి
ప్రాకృతాకాశచరజీవలోక మేక
గృహనివాసం బటంచుఁ దర్కించుకొంద్రు.

107


క.

పరమవ్యోమము చూచినఁ
పరమజ్ఞానులకుఁ దోఁచుఁ బ్రాకృతలోకాం
తర మెల్ల సూక్ష్మసూచ్యాం
తరరంధ్రమువలె విచిత్రతరమై యంతన్.

108


సీ.

తర్కించి చూడ విద్యాలోకపట్టణ
                       గ్రామపుంస్త్రీసౌధగజతురంగ
పశుమృగఖగవనపాధోథికాసార
                       కూపవాపీతటాకోపవనవి

హారపర్వతములు నన్యవస్తువులు బ్ర
                       హ్మానందమయము లత్యద్భుతములు
స్వస్వోచితాశేషసద్గుణసామగ్రి
                       శాశ్వతంబై యుండు సంస్తుతింపఁ


తే. గీ.

బ్రాకృతాప్రాకృతార్థసౌభాగ్యమునకు
నంతరంగం బెంచికొన నెంతయైనఁ గలదు
తెలివి మెఱసిన సత్యావిదీప్సితార్థ
మాన మింతింత యనుట క్రమంబు గాదు.

109


ఆ. వె.

తత్పదస్థవిషయతతులెల్లఁ బ్రాకృతా
ర్థములయట్లు [29]మోహితములు గావు
పూతహృదయు లెంచ నేతత్స్వభావవి
ద్యోతకంబు లగుచునుండుఁ గాని.

110


సీ.

స్వాభావికాద్భుతాంచ దపారసౌందర్య
                       వరసుధాసింధుభావమునఁ దనరి
శ్రీశానుకూలైక్యశీలభోగంబులఁ
                       దత్పదద్రవ్యసంపద లొసఁగుట
చిత్రంబు గాదు విచిత్రము ల్వస్తుశ
                       క్తులు సర్వభావశక్తులు నచింత్య
సంతతజ్ఞానగోచరములు గొన్ని వ
                       స్తువులలోఁ గొన్ని వస్తువులు కొంద


తే. గీ.

ఱకు మనఃప్రియములు గొందఱకును విరతి
పుట్టఁగాఁ జేయు జడములై భువనములును
పరమపదలోకనిత్యాత్మభాగ్యమహిమ
యజహరాదులకైన శక్యంబె పొగడ.

111


వ.

"అత్రాయం పురుషః పరంజ్యోతి రూపం సంపద్య స్వేనరూపేణాభి
నిష్పద్యతే" "[30]అవహతపాప్మా విజరోప మృత్యుర్విశోకో విజిఘత్సో
విపిపాసస నత్యకామ నత్ [31]సంకల్ప" యనునవి యప్రాకృతలోకముం
బొందిన ముక్తజీవునికి నష్టగుణంబులు సంపన్నంబులై యుండును.
మఱియు ప్రకృతి శరీరతిరోధానపూర్వకం బగు నది జ్యోతిరన్వయము.

అదియె ముక్తి. [32]అంతర్యామి స్వరూపమాత్రంబు ముక్తిగా దెన్నఁ
దదన్వయంబు గలుగుటం జేసి యది యెట్లన్న భూస్థితంబులైన పక్షులు
తమకు నపూర్వప్రాప్తములైన యద్రిశృంగంబులు నిజోపాయంబున
నెక్కుగతి నప్రాప్తోర్థ్వగమనంబునకు న్యాసోపాసనంబులు సాధించి
యవిద్యాజనితదేహసంబంధముం బాసి యపూర్వపదంబు నొందుట
యాపరంజ్యోతిసంబంధము.

112


తే. గీ.

తెలివగఁ ద్రిపాద్విభూతి నతిక్రమించి
యేపురుషుఁ డుండు శుద్ధసమిద్ధమహిమ
నాతఁ డాద్యుండు పరమాత్మ యవ్యయుండు
ఘనతరుండు పరంజ్యోతి యనియె శ్రుతియు.

113


తే. గీ.

ఘనతరాత్యుక్త మూర్థ్వలోకముల నెంచ
విశ్వతః పృష్ఠమై మహావిమలమై ప్ర
సన్నమై మించు వైకుంఠసంజ్ఞ విష్ణు
దేహ మనఁగఁ బరంజ్యోతి తెలిసి చూడ.

114


వ.

అవధీరితకందర్పకోటిలావణ్యంబు నగణ్యంబును స్వాభావికానవధి
కాసంఖ్యేయస్వగుణోల్లసితంబును భావపంకిలనద్రత్నవిమలౌ
కరణౌషధంబును జేతస్తేనిశేశిత్వావిర్భావాద్భుతభేషజంబును శ్రీశ
స్వాభావికాశేషశేషత్వానుభావావహంబును శేషశేషిస్వభావానుభవ
ప్రీతివర్థనంబును దత్ప్రతికారితాశేషతత్కైంకర్యకసాధనంబును,
శేషస్వభావాసురూవవృత్తిప్రీతేశదర్శనంబును దద్దర్శనమహాహ్లాదా
మృతసంప్లవనావహంబును శ్రీసశేషత్వాధిగతజననిత్యానంద
దాయకంబును నగు పరతత్వం బెఱింగి దర్శనప్రవేశనంబు లొనర్ప
నెవ్వ రుత్సహింతురు వారు శూరులు. ఆశూరులు తద్విద్యాప్రభా
వంబున నర్చిరాదిమార్గంబునఁ బరంజ్యోతిఁ గాంచి తత్ప్రసక్తిచే
నిత్యనిర్వృతులై యావిర్భూతస్వరూపస్వభావులును స్వాత్మేశదర్శ
నులును దద్దర్శనసముద్దేశకైంకర్యేచ్ఛాత్తవిగ్రహులును దదను
రూపాభిమతదివ్యాలంకారసింధువులును హేయనిష్యందరహితులును
హేయాహ్లాదవివర్జితులును దద్బ్రహ్మలోకవిషయాభోగోద్రిక్తేశ
భక్తియుక్తులును ననాదినిధనానందమయనిత్యాత్మసహచరులును
దత్ప్రతికారితాశేషతత్కైంకర్యరసార్ణవంబులును; బరబ్రహ్మాత్మ

భూతతద్వ్యోమోజ్జ్వలతల్లోకనివృత్పురవరాదిస్వాత్మారామాను
[33]మో(దను)లై యుండుట వేదాంతసిద్ధాంతోత్థితవైభవంబు వరవ్యోమ
లోకంబు నుతింప నెవ్వఁడు సమర్థుండు?

115


మ.

వరవిజ్ఞానరహస్యవాసనల భావ్యంబై మహద్దామవి
స్ఫురదానందదలోకమం దల ఘనౌజోరాశియై ఫుల్లనీ
రరుహాభంబగు నంతరాళమున సారంబైన వైకుంఠస
త్పుర మొప్పున్ నవకర్ణికాకృతిఁ దదాప్తు ల్చూచి వర్ణింపఁగన్.

116


తే. గీ.

అమితజనపదవరవైభవాన్వితంబు
నతివిపులమండలము నైన యప్పురంబు
కమలకర్ణికయును బోలి కానుపించెఁ
బురము లెన్నేని దళములై పొలుపు మెఱయ.

117


తే. గీ.

గురువరవ్యోమధామవైకుంఠలోక
మునకు నావరణము లేను ఘనత మెఱయ
నిత్యశుద్ధసుఖాత్ములై నివ్వటిల్ల
బ్రహ్మలోకంబు లెన్నేనిఁ బ్రబలు నందు.

118


వ.

అని వ్యాసభగవంతుఁ డానతిచ్చినఁ శుకుం డిట్లనియె.

119


క.

ఏయేయావరణంబుల
నేయేలోకంబు [34]లుండు నెఱిఁగింపుము నా
కాయుపనిషదుక్తుల విని
యాయజముఖ్యులు నిజాలయస్పృహ విడువన్.

120

పంచావరణాగణ్యనియతలోకములు

క.

అనిన విని యక్కుమారున
కనఘాత్ముండగు పరాశరాత్మజుఁడు సనా
తనపంచావరణాగ
ణ్యనియతలోకములఁ గొన్ని నయమునఁ బలికెన్.

121


సీ.

ప్రథమావరణమునఁ బ్రాచిమై వైకుంఠ
                       వైభవంబున మించు వాసుదేవ
లోకంబు రవిగణాలోకమై భృతసాధు
                       వారమై విమలనానారసాబ్ధి

పరిఘమై నానావిభాసితనవరత్న
                       శైలమై నానాప్రసన్నశిల్ప
పాదపంబై యతిభవ్యనానాజన
                       పదమునై నానావిధాసమాన


గ.

నగరనానాచతుర్దంతనాగవాయు
వేగనానాహయానేకవిపులహైమ
శృంగనానార్ధధేనువై సిరి వహించి
[35]

122


దండకము.

మఱియు మఱియుఁ దివ్యలోకంబు వర్ణింప శక్యంబె? క్రీడామృగం
బుల్ ఖగంబుల్ శ్రుతుల్ విశ్రుతుల్ గాఁ బఠింపంగ బుంస్త్రీమణీచిత్ర
సౌధోరుకేళీగృహారామహైమాంతరాళప్రభల్ మించఁ దద్భహ్మవిద్యా
నవద్యామృతానందనందత్సుధావాహినీసత్ప్రవాహాంతరంబుల్ చెలం
గంగ [36]రాజత్తనూకాంచిసౌందర్యముం జూచి లక్ష్మీశ సద్భక్తులుం జిత్త
మెట్లుండునో యంచు భీతిల్లి రంజిల్లు తద్విద్యుదాకారరేఖావిలాసాప్సరో
బృందముల్ సంతతానందకందంబులై మించఁ దద్విభ్రమాలోకనో
ద్భుద్ధలక్ష్మీశసద్భక్తిపుంవర్గముల్ మీరఁ దద్దివ్యపుంవర్గలక్ష్మీశ
కైంకర్యసౌభాగ్యముల్ చూచి యుద్బుద్ధమై నిత్యసూరిప్రసన్న
స్ఫురద్భక్తిసంపత్సుధాధార లుప్పొంగఁ దల్లీలలన్ నిశ్చలానంద
సంభూతసాకారసామగ్రగీతామృతంబుల్ ప్రవాహంబుగా నిండఁ
దత్సామగీతస్వకర్ణనోద్వుృత్తభక్తిస్ఫురత్కీరశారీపికోద్యద్వచః
కూజితాలాపముల్ పిక్కటిల్లన్ సదాచార్యుఁడుం బోలె శ్రీశాంఘ్రిభక్తి
ప్రకాశంబు గావింపుచుం బ్రహ్మవిద్యాప్రసన్నేశపూర్ణప్రసాదంబునుం
బోలె మోహంబు భేదింపుచున్ మోహవిధ్వంసముంబోలె నారూఢ
సంసారతాపౌఘశీతాంశువై సొంపు గావింపుచుం దద్భవాపాయముం
బోలె లక్ష్మీశసేవాసుధోజ్జృంభ మేపార నేవంవిధాజన్మసిద్ధాగణేయాతి
రాజద్గుణాంభోధివై యాజన్మసిద్ధోత్కటాత్మానుభూతిం బ్రవర్తించి
తా నాత్మబోధార్కుఁడుంబోలెఁ తద్వాస్తవాకారసందర్శకత్వంబు
సంధించి యాత్మేశశేషత్వశేషిత్వసంబంధవద్వాస్తవాకారధీగోచరం
బైన సాక్షాద్కృతిస్ఫూర్తియుంబోలె లక్ష్మీశసేవాసుధోజ్జృంభ

మేపార సేవంవిధాజన్మసిద్ధాగణేయాతిరాజద్గుణాంభోధివైవాసిత
ద్వాసుదేవాగ్రలోకంబు రాణించు సాక్షాత్సుఖోపాదకశ్రీలఁ దన్మధ్య
దేశంబునన్ నొప్పు మధురనగరీరత్న మారాధ సంఖ్యేయస్ఫురద్రత్న
సారావళీమూర్తులం బ్రోల్లలత్తోరణోద్యత్కవాటంబులన్ శుభ్రలీలా
భ్రవర్ణంబులై నిత్యముక్తేందుబింబంబులుంబోలెఁ బాటిల్లు తత్స్ఫాటిక
స్ఫూర్తులుం గల్గు తద్గోపురంబుల్ మణీహాటకశ్రీలఁ జూపట్టు రత్నావళీ
హర్మ్యజాలంబు నిండార దీపించుఁ బ్రాకారచక్రాంతరాశాన్వితానల్ప
కల్పద్రుమారామసామగ్రియున్ సాంద్రచంద్రోపలానేకకేళీగృహా
నేకశైలాలియుం జారుతీరస్ఫురద్రత్నరంభావిజృంభంబులై నవ్య
చామీకరాంభోజజాలంబులై, విభ్రమభృంగసంగీతరాజన్మణేహల్ల
కౌఘంబులై తన్మహాలీల నీలోత్పలాకర్ణపూరంబులై తత్సుధాధామ
శుభ్రప్రవాహంబులై సంతతస్వచ్ఛమత్స్యప్రకాండంబులై భవ్య
దీవ్యత్పరబ్రహ్మవిద్యావధూసేవ్యలక్ష్మీమహేశానమూర్తుల్వలెన్
వింతలై యుండి యాత్మశ్రుతికశ్రుత్యధిష్ఠానమాత్రాభిభూతైకమందాకినీ
కీర్తిసౌరభ్యసంపూర్తి గాన్పించి శ్రీవాసుదేవానుకూలైక్యరుచ్యర్థ
యాదోగణాపూర్ణభాగంబులై యుండి కూజిల్ల సచ్ఛక్రచక్రాంగ
ముఖ్యంబు నీదోద్భవాకీర్ణతీరంబులై భాసురస్వర్ణమాణిక్యసోపాన
లక్ష్మి న్విజృంభించు కాసారముల్ తోరమై మించఁగా నిత్య[37]ముక్త్య
ప్సరస్సిద్ధసంబంధమై తేజరిల్లంగఁ దత్పట్టణాలంక్రియారూపమై
మధ్యభాగంబునంగల [38](యా)రామ ముద్య[39](ద్రు)చి న్మించి సౌందర్య
మున్ విశ్వరూపప్రభావంబునుం గల్గి విష్ణుండు తేజంబుతో నుండు
శుభ్రాంశు కోటిస్ఫురత్సౌధవారంబు లారాజధానీరమాకాంత కాత్మీయ
సౌభాగ్య మర్పించు నేతత్పురశ్రీసముద్భూతనానామణిజ్యోతి
రుల్లాస మభ్రంబుపై నిండి యూర్థ్వస్ఫురన్నూత్నతేజోజగచ్ఛంక
గావించు నేఁ డొక్కచో నింద్రచాపంబు లెన్నేనియుం గూడి నందత్పురీ
నూత్నరత్నావళీవ్యోమయానంబులం బోలఁగాఁ జాల నవ్వీటిలోనన్
మృగంబుల్ ఖగంబుల్ సదాపుం వధూసంచయం బాదరింపన్ దద
గ్రంబునన్ విష్ణుచేష్టానుకారం బపారంబుగాఁ జేయనో మాధురా
మాధురోల్లాస ఈశానుభూతిక్రియాశర్మదాయావదాత్మ్యంబు మాకుం
బ్రసాదింపవే యంచుఁ దన్మంగళాశాసనం బింపుతోఁ జేయువా రెవ్వ
రాయుత్తముల్ హేయనిష్యందదూరాత్ములై హేయభోజ్యంబులుం
బాని బ్రహ్మామృతానందరూపేంద్రియార్థానుభూతిన్ విజృంభించి
శ్రీశాసనాంభోరుహశ్రీవికాసైకసేవాఫలప్రాప్తిమై నున్న తత్ప్రీతిరూపా

మృతానందముం జెంది తత్సపర్యంతరాలంక్రియాపూర్ణహస్తాబ్జలై సేవ
గావింప నూహించి తచ్చేషతైకస్వభావానురూపాత్మవృత్తిన్ సదా వాసు
దేవాంతరంగానుకూలస్వరూపంబులన్ నిల్చి ప్రాసాదసౌధావరోధ
స్థలీవీథులందున్ విశేషంబునన్ రత్నవల్లీశలాకోపకౢప్తోరుసన్మార్జనీ
హస్తులై కొంద ఱచ్చోటు దారూడ్చుచుం దద్రజోరంజితాకారులై
కొంద ఱింపొందఁగా నుంద్రు తీడ్రించి శుంభన్మణీశాతకుంభస్ఫురద్గంధ
గంధోద్బటాంభోలవంబుల్ సమంతాద్విజ్జృంభంబుగాఁ జల్లుచున్
గొంద ఱుత్సాహముం బొంద ముక్తామణీచూర్ణముల్ తెచ్చి చూర్ణంబుగా
స్వస్తికాదుల్ ప్రశస్తంబుగాఁ బెట్టి తద్రంగవల్లీకలాపంబుఁ గావింపుచుం
గొంద ఱుర్దీప్తులై యుండ్రు మాణిక్యమాల్యాంకురార్ద్రాక్షరశ్రీలు తత్ప్ర
దేశంబులం జల్లుచుం గొంద ఱానందులై యుంద్రు రత్నప్రదీపంబులున్
బుష్పముల్ సత్ఫలంబుల్ సమగ్రంబుగాఁ జందనాంభస్సమాపూర్ణ
కళ్యాణకుంభంబు లేవంకలన్ నిల్పుచున్ గొంద ఱుప్పొంగ నానామణీ
రూపరంభాదిపుణ్యద్రుమంబుల్ బహిర్ద్వారసీమన్ నియోగింపుచుం
గొంద ఱానందముం జెంద శ్రీవత్సవక్షస్ఫురద్వైజయంతీకలాపం
బుతో నవ్యముక్తామణీధామకాలంకృతాఙ్జోరుకంఠంబుతోఁ జారు
శోణాధరాపాటలప్రస్ఫురద్దంతరోచిప్రభిన్నస్మితాపాంగవీక్షావిలా
సంబుతో మాంసలాంసాను[40]రూపాయితప్రస్ఫురత్కర్షపాళీవిభూషా
వరామృష్ట[41]గండస్థలశ్రీలతో నూత్నకర్పూరగంధాన్వితోచ్ఛ్వాస
[42]పూర్ణోత్తరోష్ఠోచితోత్తుంగనాసావిలాసంబుతో మందహాసంబుతో
సద్విశాలాయతాపాంగవీక్షామృతోల్లోలజాలంబుతోఁ దత్కళాపూర్ణ
సౌందర్యనిర్యన్మరందప్రసక్తద్విరేఫోపమానాలకశ్రీసమాజుష్ట
భవ్యాననచ్చాయతో నవ్యకుసుమధమ్మిల్లభారంబుతోఁ గాంతిపుంజీ
భవద్రత్నరాజత్కిరీటంబుతోఁ జిత్రవైడూర్యరాజన్మహాకుండల
శ్రేణితో నూర్థ్వపుండ్రంబుతోఁ గంఠభాగోల్లసత్కౌస్తుభస్ఫూర్తితో
దివ్యనానాయుధోదారబాహాచతుష్కంబుతో భవ్యయజ్ఞోపవీతోరు
హారాళితో హైమభూషాకదంబంబుతోఁ దప్తచామీకరాభాంశుక
స్ఫూర్తితో రమ్యపీతాంబరానద్ధసద్రత్నకాంచీవిశేషంబుతో మంజు
మంజీరపాదాబ్జతేజంబుతో నద్భుతాగారశృంగారపూరంబుతో సూరి
వర్యాగ్రశ్రీదృక్చకోరామృతద్యోతకాంతీప్రవాహంబుతో మించు
కల్యాణమూర్తిన్ విలోకించు పాలించు నవ్వాసుదేవున్ నిరీక్షించి
శ్రీమద్వికుంఠాధినాథుండు తా నిత్యముక్తాళితోఁ జాల మోదించు దద్వా
సుదేవైకలోకంబు చక్రాంకితుల్ చేరి సేవింతు రెల్లప్పుడున్.

123

వైష్ణవులవైశిష్ట్యము

క.

తనువునఁ జక్రాంకము సే
యని మనుజాధములు గలుగు నావేశము లెం
చ నవైష్ణవములు దద్దే
శనివాసులు వైష్ణవులు నసాత్వికు లెంచన్.

124


సీ.

ఉరుశుద్ధసత్వమయుండు విదుఁడు విష్ణు
                       భక్తులు సాత్వికప్రవరు లార
జస్తమోమయదేవసముపాసన మొనర్చు
                       వారల సాత్వికుల్ వారియిండ్ల
నాపద వచ్చిన నన్నపానాదులు
                       వలువదు భుజియింపవలనెనేని
యతఁ డధఃపాతంబునందు నూర్ధ్వపదాను
                       [43]గతుఁడు విష్ణుండు లోకములు నట్లె


తే. గీ.

యుచ్చతరము లధఃపాత మొనరఁజేయు
సకలదుఃఖౌగములు నవైష్ణవజనాన్వ
యంబు నట్ల నధఃపాత మన నవైష్ణ
వాన్వయంబు జగంబుల నరసి చూడ.

125


క.

నందీశ్వరశాపంబున
నిందింతురు భాగవతుల నీచాత్మకులై
కొందఱు విప్రులు వారికి
సందిగ్ధ మెదంబెడంద సద్దండనముల్.

126


తే. గీ.

వరగుణాధికులైన యావైష్ణవులకుఁ
బ్రాతికూల్య మొనర్చిన ఫల మగమ్య
మైన దారిద్య్ర్య మిది చాల ననుభవించి
మఱియు నట్ల యొనర్తు రున్మత్తు లగుచు.

127


క.

తగునే విని సహియించుట
భగవద్భాగవతనింద పాపిష్ఠులు త
ద్భగవద్ద్రోహులు వారలె
యగుదురు మఱి వారికన్న నన్యులు గలరే?

128

క.

హరినింద సేయు పాతక
వరు లుండినచోట నరకపద మాక్షిత్ప్రాం
తరమునను శుద్ధవైష్ణవ
వరులు నిమేషాంతరంబు వలవదు నిలుపన్.

129


తే. గీ.

ధర నసాత్వికదేవప్రధానమైన
యది యసాత్వికతీర్థమౌ నందు నుండఁ
దగదు సాత్వికులకు విష్ణుధామ మెద్ది
యదియె సర్వప్రదము తగు నందు నుండ.

130


సీ.

తదధీనవృత్తిమై దనువు గల్గిన యన్ని
                       నాళ్లు శ్రీహరిసేవనం బొనర్చి
సౌఖ్యంబు నొంది యసాత్వికదేవతా
                       భజనంబు చేసినఁ బాయు సత్వ
గుణ మెల్ల నాసత్వగుణము పోయిన నధః
                       పాతంబునందు దుష్పాతకముల
వైష్ణవవర్యుఁడ వైష్ణవసంవాస
                       సంభాషణముల దోషంబుఁ గాంచు


తే. గీ.

శ్రౌతకర్మంబు స్మార్తకర్మంబు నడుపు
నయ్యసూచానుఁ డగు విప్రునైన వైష్ణ
వాన్వయునిఁ గానివానిఁ గల్యమునఁ జూచి
చన దసాత్వికునకు నమస్కార మెసఁగ.

131


క.

వైష్ణవుఁ దెగడిన నెదుట న
వైష్ణవుఁ గని మ్రొక్కినన్ భవధ్వంసకుఁడౌ
విష్ణుని నిందించిన యన
హిష్ణుఁడు వాఁ డెంచఁ బతితుఁ డే మనవచ్చున్.

132


చ.

హరిభజనంబు సేయక దురాత్ముఁ డసాత్వికతత్వదేవతాం
తరభజనంబుఁ జేసి వసుధాస్థలి నంత్యజుఁడై వసించు దు
శ్చరితుని వానిఁ జూచినను సమ్మతి నంటిన మాట లాడినన్
నరు లొకవైష్ణవుం గని ఘనస్థితి మ్రొక్కి స్పృశింపఁగాఁ దగున్.

133

తే. గీ.

యముఁడు సర్వస్మృతేతిహాసార్థతత్వ
వేది యగు వైష్ణవాగ్రణి విష్ణులాంఛ
నాన్వితుఁడు నా కుపాస్యుఁడౌ ననుచుఁ బలికె
సంభ్రమంబున నిజభటజనులతోడ.

134


చ.

శమనుఁడు బాహుమూలములఁ జారు సుదర్శనపాంచజన్యచి
హ్నములు ముకుందనామములు నాలుక రమ్యతరోజ్వలోర్ధ్వపుం
డ్రము నుదుటం గళంబున స్ఫురద్విచలన్నలినాక్షమాలికాం
కము గల వైష్ణవుం గని ప్రగల్భమతిన్ నుతి సేయు సుస్థితిన్.

135


వ.

ఇది మొదలుగా నేతద్వాక్యోపబృంహితమహోపనిషదాద్యుపని
షత్తులయందును హరిలాంఛనంబు వహింపఁగా వలయునని వినం
బడియె మరియు.

136

హరిలాంఛనవివరణము

శ్లో.

దక్షిణేతు భుజే విప్రోభిభృవద్వై సుదర్శనమ్
సవ్యేతు శంఖం బిభృయాదితి బ్రహ్మవిదో విదుః

137


శ్లో.

ధృతోర్ధ్వపుండ్రం కృత చక్రధారీ
విష్ణుం పరంధ్యాయతి యో మహాత్మా
స్మరేణ మంత్రేణ సదాహృది స్థితమ్
పరాత్పరం యన్మహతో మహాత్మమ్?

138


సీ.

క్షితి సురోత్తముఁడు దక్షిణభుజమున సుద
                       ర్శనము నా వామభుజంబునందు
శంఖంబుఁ దాల్చుట చనునని బ్రహ్మవే
                       దులు పల్కుదురు భక్తితోడ నూర్ధ్వ
పుండ్రంబుఁ జక్రంబు పూని సద్గుణమహీ
                       యస్త్వంబు నొంది సమగ్రశక్తిఁ
బరఁగు విష్ణుని [44]పరాత్పరుని హృదంతర
                       స్థాయిఁ గావించి సంతతము మంత్ర

తే. గీ.

మున స్వరమ్మున ధ్యానించి వనజగర్భ
శంకరేంద్రాదులకు [45]లేని సకలపూర్ణ
పరమధామంబుఁ గాంతురు పరమధామ
భూమ మానిత్యశూరులు పొగడికొనఁగ.

139


వ.

మఱియుఁ బురాణోత్తరంబులం బలుకంబడియె.

140


తే. గీ.

వహ్నిసంతప్తచక్రంబు వైష్ణవాగ్ర
వరుని శోధించి తద్భుజద్వయమునందు
మూలముల చిహ్న మొనరింప మూల మఖిల
వర్ణముల కచ్యుతావాసవాసములకు.

141


వ.

మఱియు భగవంతుఁ డానతి యిచ్చిన యూర్ధ్వపుండ్రధారణ
క్రమంబు వినుము.

142


తే. గీ.

అమలమును బార్శ్వమూలాగ్ర మధికఋజువు
లైన పుండ్రంబు మత్ప్రియం బగుటఁ జేసి
యట్టి విమలోర్ధ్వపుండ్రముల్ సాంతరములు
గా నొనర్చిన నాకు [46]నాగాము లగును.

143


క.

అచ్ఛిద్రకోర్వపుండ్రం
బిచ్ఛావిధితో వహించు నెవ్వఁ డతం డా
పచ్ఛటలం బొంది సదా
విచ్ఛిన్నాఘనిరయైకవింశతి మునుఁగున్.

144


శా.

దండాకారము నూర్ధ్వపుండ్రము సముద్దండంబుగా భూసురేం
ద్రుం డత్యుత్తమశీలవైష్ణవకులాగ్ర్యుండైన సచ్ఛిద్రమై
యుండన్ బూరమతిన్ నమోంతములుగా యోజించి లక్ష్మీకళ
త్రుండౌ మేలనఁ గేశవాదుల కుభారూఢిన్ వహింపన్ దగున్.

145


తే. గీ.

భూమి నచ్ఛిద్రముగ నూర్ధ్వపుండ్రమే ద్వి
జాధములు దాల్తు రచ్చోట హరియు సిరియు
నధివసింపంగ మీరు వా రతివిమూఢు
లైహికాముష్మికసుఖంబు లందలేరు.

147

ఆ. వె.

అంతరాళయుక్త మగు నూర్ధ్వపుండ్రంబు
నడుము శ్రీనికేతనంబు కమల
హస్తఁ దలఁచి యచట హారిద్రచూర్ణోర్ధ్వ
రేఖ నిలుపఁదగు హరిప్రియుండు.

147


క.

ఏవం విధ భగవచ్చి
హ్నావిర్భావమున వచ్చు హరికైంకర్య
ప్రావీణ్యగణ్యవైదికు
శ్రీవైష్ణవుఁ గాంచి వినుతి సేయఁగ వలయున్.

148


క.

చిదచిద్వస్తుశరీరిన్
హృదయస్థు రమేశు నీశు నెఱిఁగి హితార్థ
ప్రదుఁడైన వైష్ణవోత్తము
పదములు సేవింప ముక్తిపథము లభించున్.

149

వైష్ణవప్రతికూలానుభయభేదములు

సీ.

గురుభక్తిమైఁ ప్రతికూలానుకూలాను
                       భయభేదముల నేరుపడిన చేత
నుల నెఱింగి సుధీజనుండు నిజాధిక
                       రోచితంబుగఁ దగు నాచరింప
నుపనిషన్మతవాక్యయోజన నూహించి
                       హరిసమాధికరహితాత్ముఁ డనిన
మునుకొని దుర్మానమున సహింపనివారు
                       ప్రతికూలు రత్యంతభవ్యవృత్తి


తే. గీ.

నది సహించిన ననుకూలు రాత్మవేదు
లవియు రెండు నెఱుంగక హరి తదన్య
దేవతాతుల్యు లనుచు బుద్ధిం దలంచు
నట్టి నీచాత్ముల నుభయు లవనియందు.

150


చ.

గొనకొని మున్ను మున్నె ప్రతికూలురఁ జూచిన భీషణాహులం
గనిన తెఱంగునం దొలఁగఁ గాఁదగు నయ్యనుకూలురం బ్రశో
భనకుసుమాళి గన్గొనిన బాగున రంజిలఁగాఁ దగుం ఘనుం
డ నుభయులం గనుంగొని తృణాగ్రములంచుఁ దలంపఁగాఁ దగున్.

151

తరల.

క్షుధితుఁడైనను రాజపుత్రుఁడు ఘోరవైరిగృహాశనం
బధిగమింపని యట్ల వైష్ణవుఁ డార్తుఁడై ప్రతికూలురన్
మధువిరోధివిరోధులన్ మదమత్తులన్ భజియించి తా
నధికసంపద నందఁగాఁ దగదండ్రు తత్త్వవిదుత్తముల్.

152


తే. గీ.

ఒనర నీశానుకూలురై యున్న సాధు
జనులఁ దచ్చిత్తవిక్షేపశంకఁ జేసి
రూపణీయస్వభావానురూపభోగ్య
భోగములకు నిరోధింపఁ బూనఁదగదు.

153


క.

నిపుణుండను భయసంపద
నుపజీవించు[47]కొను యునికి యొప్పదు విష్ణుం
డపరిమితవిభవుఁ డాశ్రితుఁ
గృపతో రక్షింపఁడే యకించనుఁ డగుటన్.

154


క.

దాసానుదాసరక్షా
భ్యాసముగల హరియుపేక్షయందునె చిత్తో
ల్లాసమున నమ్మియుండుట
దాసులకుం దగుఁ బ్రపత్తితాత్పర్యములన్.

155


క.

భగవత్సంకల్పంబున
భగవత్ప్రతికూలజనులు భవదుఃఖములన్
దగులుదు రామీఁద మఱియుఁ
దగులంగల రఖిలమోహతప్తాత్మకులై.

156


వ.

అర్జునసారథియగు కృష్ణుండు మద్ద్వేషుల నరాధముల సంసారం
బునం ద్రోచెద నాసురయోనులం జనియింపంజేసెద నని యానతి
యిచ్చె నట్లు గావున భగద్ద్వేషిపదార్థోపజీవనంబు వైష్ణవున కనర్ధ
కంబు. విష్ణుద్రోహకారణం బగుటం జేసి దద్ద్రవ్యంబు విడువందగును.

157


సీ.

ఎవ్వనివలన ము న్నెవ్వఁ డర్థముఁ గాంచు
                       నల్పమేనియు మఱి యధికమేని
యొకనాఁడు తనకు నీకున్న నాతని నిష్ఠు
                       రోక్తు లాడిన బాధ నొందఁజేయు

నటుగాన లక్ష్మీశ్వరానుకూలోపజీ
                       వనుఁ డర్థకామము ల్పెనగొనంగ
నిజధర్మమున నైన నిష్ఠురోక్తులు పల్కఁ
                       జెల్లదు తాపంబు జెందుఁగాన


తే. గీ.

నిష్ఠురోక్తులచేత నన్వీతభక్తి
నిత్యవాత్సల్యజలరాశి నిరతిశయద
యారసోద్యత్కటాక్షు మురారి సర్వ
దర్శిఁ గలుగంగఁ జేయుట తథ్య మరయ.

158


వ.

ఇందున కిందిరావిభుం డిట్లనియె.

159


క.

హెచ్చిన మత్సరగుణమున
మచ్చక్రాంకితుని ద్వేషమదకటు[48]పురుషా
త్యుచ్చారణములఁ గలచన
సచ్చరితుఁడు మద్విరోధి సందేహంబే?

160


వ.

ఇది గావున స్వశరీరోద్ధులైన హరిప్రియుల నిరోధించిన నీశ్వర
నిరోధంబు నట్ల యని శ్రుతియు నానతి యిచ్చె యమభయుల స్వశరీర
పోషణార్థ మాశ్రయించెనేని వైష్ణవుండు భగవంతుండు గలుగుట
మఱచితినని వర్ణించవలయు. విశ్వంబునకు భగవంతుండు రక్షకుం
డగుట శ్రుతిసిద్ధంబు. నిర్భరుండై ప్రతినిత్యసంతుష్టుండై శ్రీశ
ప్రియవిధులు సేయవలయు ననన్యులై నన్నుఁ జింతింపుచునే జను
లుపాస్తి గావింపుదురు. వారియోగక్షేమంబు నేను వహింతునని
కృష్ణుం డానతి యిచ్చెం గావున వైష్ణవులు నిత్యపూర్ణులు వినుము.

161

వైష్ణవనియమములు

సీ.

జగదీశ్వరునకును స్వాతిక సర్వశ
                       క్తిత్వ స్వజనరక్షకత్వ సత్కృ
పాబ్ధిత్వ సంతతోదారత్వ సత్వస
                       ర్వజ్ఞత్వములు సమగ్రములు గాఁగఁ
దెలియఁజేయు శ్రుతిస్మృతిపురాణవేదశి
                       ఖేతిహాసంబుల నెఱిఁగి దాన
నిశ్చితాత్మకుఁడయి నిరపేక్షుఁడయి నిరం
                       జనుఁడయి హరిసమాశ్రయణ భోగ

తే. గీ.

నిరతుఁడయి నిర్భరుండయి నిత్యహర్ష
శీలుఁడై శుచియై నిరాశీర్విశేషుఁ
డయి స్వవర్ణాశ్రమవయోదశాంతరోరు
కర్మములు విష్ణుసంతుష్టిగా నొ[49]నర్ప.

162


వ.

శుద్ధదేహేంద్రియమనఃప్రాణాదివృత్తియై యన్వహంబును నిజ
పూర్వజన్మానుగతకర్మానురూపప్రాప్తార్థసంచయుఁడై శ్రీశవిషయక
సంప్రీతిపూర్వకంబుఁగాఁ దద్దేహోచితసేవలు గావింపుచుఁ గృత
కృత్యుండై యవిద్యావివర్జితుండై భగవజ్జన్మకర్మంబులు వినుచుఁ
బర్వంబుల నుత్సుకుండై గీతతాండవాదిత్రంబులు భగవత్పురో
భాగంబునఁ గావింపుచు ప్రేమగర్భంబులగు మహోత్సవంబులు
సేయుచు మహోత్సవంబుల భగవత్సేవాసమాగతుల నెదుర్కొని యతి
ప్రీతిం బ్రణమిల్లి కౌగిటఁ జేర్చి యుపాయనంబు లర్పింపవలయు,
సమర్పించి తత్సమాశ్లేషహృష్టుండై తత్పుత్రుఁడుంబలెఁ బులకాంకు
రంబులతోఁ బ్రఫుల్లవదనాబ్జముతో నుత్సవాలంకృతంబైన నిజ
గృహంబునకుఁ దోడ్కొని పోయి స్వపుత్రదారాభృత్యులతోఁ బ్రణ
మిల్లి సుఖాసనార్ఘ్యపాద్యాద్యుపచారంబు లొనర్చి భగవద్భక్తశేషాన్న
పానతృప్తులం జేసి హస్తప్రక్షాళనానంతరంబున గంధమాల్యతాంబూ
లంబులు సమర్పించి సుఖాసీనులగు వారలం జూచుచుఁ దద్భుక్త
శిష్టాన్నంబు తోయసంస్కృతం బగునది భుజించి హస్తపాదప్రక్షా
ళనంబు గావించుకొని ద్విరాచమనం బొనర్చి శుచియై నారాయణదేవ
ధ్యానానందనిర్భరుండై యెన్నఁడు హరిసాక్షాత్కారం బగునని
కన్నులు మూసుకొని యంతఁ గన్నులు దెఱచి శుద్ధసత్వరూపంబగు
హరిరూపంబు గానక తత్ప్రసంగార్థియై యత్యంతాతురుండై తజ్జనాం
తకం బాశ్రయించవలయు. మఱియు.

163


క.

శ్రీమన్నారాయణచరి
తామృతరసధారఁ గ్రోల నర్హము భక్త
స్తోమములఁ గూడి జ్ఞాన
శ్రీమహిమం ద్రికరణముగ శిష్టజనంబుల్.

164

తే. గీ.

వాఙ్మనఃకాయకర్మప్రవర్తనముల
వాసి కెక్కఁగ శ్రీవైష్ణవప్రియంబు
సేయఁగాఁ దగు నదియ నారాయణప్రి
యంబు చేసిన యట్లు సత్యంబు దలఁప.

165


మ.

తగు నధ్యాత్మయదోపదిష్టభగవద్ధర్మంబు లత్యంతమున్
భగవత్ర్పీతివివర్ధనంబులు సులభ్యంబుల్ విరుద్ధాన్యధ
ర్మగుణధ్వంసకముల్ తదీయపదచర్చాసీమసంక్షేప మిం
వగునే చక్కెర చేత నుండియుఁ బ్రకోష్ఠాలేహనంబుంబలెన్.

166


మ.

విమలజ్ఞానధురీణుఁడౌ శుకున కావేదాంతవాక్యార్థత
త్వము బోధించిన శంకితాత్ముఁ డయి భీతత్వంబులో నుండ వ
శ్యముగా నచ్యుతలోకసద్గుణకథల్ సంక్షిప్తవాక్యప్రసం
గములం దెల్లము గాఁగఁ బల్కె మునిలోకస్వామి హర్షంబునన్.

167


సీ.

వత్స! ధన్యుండవు శ్రీవత్సవత్యాధిక
                       వత్సలత్వము గలవాఁడ వగుట
నవనిపై వస్తుయాథార్థ్యగోచరము నీ
                       బుద్ధి గాకున్న సమిద్దమహిమ
సంక్షేపమున రమేశ్వరవర్ణనము విన
                       నె ట్టిచ్చగించితి విట్లు నుండి
యజ్ఞసంజాతదీర్ఘాయువు కోటివ
                       క్త్రంబులు గలుగు నుత్తములకైనఁ


తే. గీ.

బ్రాప్తమై యుండు నేపరబ్రహ్మలోక
వర్ణనము సేయఁ దత్పారవశ్యజాత
హర్షరసమునఁ దద్వర్షనామృతాబ్ధి
మునిఁగి లోకంబు లెఱుఁగనే ననఘచరిత.

168


క.

ఆవిష్ణుపదము యావ
జ్జీవము వర్ణించు పూర్ణశీలు రగణ్య
ప్రావీణ్యంబున పాఠం
బావంతయుఁ దెలియఁజాల రన్యులవశమే.

169


ఆ. వె.

అరయ నీకు నాకు నంతరం బెంతేనిఁ
గలదు స్వసుఖమాత్రకలితవృత్తి
నేను సర్వలోకహితవృత్తి నీవు నీ
కిట్లు తగదె సంగ్రహేచ్ఛ నేఁడు.

170

వైకుంఠలోకము – ఆవరణపంచకము

వ.

ఈపరబ్రహ్మలోకవర్ణనంబు సేయ నేరికి శక్యంబు గాదు. కావున
సంగ్రహంబున నెఱింగింపు మని యడిగితివి. ఏనును సంక్షేపంబునం
బల్కితి. ఇది వినువారికి బుద్ధియు నోజస్సుఖవివృద్ధియు కార్య
సిద్ధియు నగు. విశేషంబున మరియు వైకుంఠలోకంబు వర్ణించెద
వినుము. ప్రాగవాచిని శ్రీలోకంబును బశ్చిమంబున శ్రీవైకుంఠంబు
నకు దక్షిణంబున నిత్యానందంబునిధియు సద్భక్తవరదుండు నగు
సంకర్షణవిభుం డుండు. ఆసంకర్షణలోకంబునకు పశ్చిమంబున
నిర్మలానందనీరధినిత్యంబు నగు సరస్వతి లోకంబులఁ దగు ప్రత్యగ
వాచి[50]ని సరస్వతిలోకంబున కుత్తరంబునఁ బ్రద్యుమ్నలోకంబు
చెలంగు. ప్రతీచీనయుతార్కేందుప్రభ దీపించి నిర్మలశర్మదంబై
ప్రద్యుమ్నపదంబుదగ్గర రవిదిక్కున నిత్యాప్సరో౽లంకృతంబై
రతిలోకంబు విరాజిల్లు. తత్ప్రాచీన అనిరుద్ధలోకంబు రాణించు నుదీచిం
బ్రకాశించి యానందవారిధి యగు నాయనిరుద్దలోకంబునకుఁ బ్రాచి
యగు విదిక్కున సద్గుణసాగరం బగు శాంతిలోకంబు విజృంభించు.
ఇవి చతుర్వ్యూహంబులు నాలుగు శ్రీకళలు. నాలుగును బ్రదక్షిణ
క్రమంబునఁ బ్రాచ్యాద్యష్టదిక్కులం బ్రకాశించు నీవ్యూహాష్టకంబు
ప్రథమావరణంబున నుండు. 'మధ్యే మధ్యేత్వ సంఖ్యే యా స్తత్త
ద్వ్యూహ' [51]మ్మనిన శ్రుతివలన ననేకవ్యూహంబులు గలవు. ద్వితీయా
వరణంబునం బ్రాచ్యాదిదిక్కుల వరాహజామదగ్న్యశ్రీనరసింహ
రఘువల్లభశ్రీధరవామనహయగ్రీవవాసుదేవలోకంబులు గలవు.
తదధిపతులు విభవేశ్వరులు నిత్యులు. వీరు వ్యూహాష్టవిశిష్ట
శ్రీవైకుంఠేశ్వరప్రీతిసాధనంబైన బ్రహ్మవిద్య నర్వాచీనప్రాకృత
భూముల నవతరించి ప్రకాశింపఁజేయుదు రీమూర్తులం గొల్చిన
నపవర్గంబు లభించు. తృతీయావరణంబున నెనిమిదిదిక్కుల పాంచ
జన్యముసలచక్రఖడ్గగదాశార్ఙ్గాదివైజయంతంబులు నిలుచు. నిత్యాన
వధికనిరతిశయానందం బగు భగవత్సేవ గావించు. చతుర్ధావర
ణంబునఁ గుముదకుముదాక్షపుండరీకవామనశంఖకర్ణసర్ప

నేత్రసుముఖసుప్రతిష్ఠితులు నిత్యులు. నిత్యముక్తులతో నీశ్వరు
నారాధింపుదురు. పంచమావరణంబున నింద్రానలదండధరనిరృతి
యాదసాంపతిగంధవాహధనేశానులు నిత్యనిర్జరు లుండుదురు.
ఇది యావరణపంచకంబు.

171


సీ.

చండప్రచండు లుద్దండవైభవులు ప్రా
                       గ్ద్వారపాలురు బ్రహ్మతత్వనిధులు
భద్రసురద్రులు భద్రమూర్తులు దక్షి
                       ణద్వారపాలు రానందనిధులు
జయవిజయులు సత్వసంపద్ఘనులు ప్రతీ
                       చ్యద్వారపాలురు శౌర్యనిధులు
ధాతృవిధాతృ లుత్కటతేజు లుత్తర
                       ద్వారపాలురు మహాధన్యనిధులు


తే. గీ.

వీర లెనమండ్రు సంతతోదారయశు ల
నాదినిధనులు పూర్ణవిద్యాభిరాము
లఖిలసంపత్సమృద్ధంబులైన స్వస్వ
లోకముల నుండుదురు మహోత్సేకములను.

172


సీ.

ఆతతకోటిసూర్యప్రకాశులును గో
                       టీందుకళానందహేతితనులు
సర్వజ్ఞు లుత్తముల్ సత్యసంకల్పులు
                       సర్వాపగుణరూపసారతరులు
హేయనిష్యందరహితులు హేయహార
                       వర్జితుల్ బ్రహ్మవిద్యార్జితామృ
తానందరసవిషయానుభవోత్సవుల్
                       తాదృగ్విషయవిబోధప్రబుద్ధ


తే. గీ.

పరమపురుషాంఘ్రిభక్తిసంపన్నగుణులు
సిద్ధతద్భక్తికారితాశేషతత్ప్ర
సాదకృత్కర్మరతులు ప్రసన్నపరమ
పదపతిముఖాబ్జతేజో౽నుభావసుఖులు.

173

శా.

దివ్యోదారవిచిత్రగాత్రులు ఘనుల్ దివ్యోరుగంధాన్వితుల్
దివ్యాచ్ఛాదనదివ్యభూషణయుతుల్ దివ్యస్రగభ్యంచితుల్
దివ్యోద్దండతరాయుధాంకితకరుల్ దివ్యావతంసుల్ విభుల్
దివ్యోపాస్యు శుచిస్మితాస్యు హరి నెంతేఁ గొల్తు రశ్రాంతమున్.

174


మ.

విమలంబై తగు నింద్రలోకనికటోర్విన్ బన్నగారాతిలో
కము తల్లోకమునందు వేదము లుదాత్తాదిస్ఫురస్స్ఫూర్తిగాఁ
గ్రమకుండై పఠియించి పక్షిపతి నిర్యత్సామగానస్వర
క్రమనవ్యామృతధారలం దనుపుఁ దద్బ్రహ్మంబు నశ్రాంతమున్.

175


వ.

తృతీయావరణబహిర్దేశంబున విష్వక్సేనులోకంబు గలదు,
వినుము.

176


సీ.

తనలోకమున నుండి తత్పరమాత్మ ప్రి
                       యప్రభావముఁ గాంచి యతులశక్తి
యుక్తుఁడై యాత్మభుజోపరిన్యస్తేశ
                       సామ్రాజ్య[52]భరితుఁడై ప్రసన్నమహిమ
వైకుంఠపతియొద్ద వాసుదేవాద్యతి
                       శాంతవిఖ్యాతసర్వావరణని
వాసోక్తదేవతావరుల సంసేవింపఁ
                       జేయించు మెఱసి నారాయణాంఘ్రి


తే. గీ.

నిత్యసేవానుకూలతానిరతిశయర
సానుబంధైకహృదయుఁడై యఖిలతత్వ
బోధకుండైన సేనాని పూనియుండు
నరిభయంకరతరవేత్రహస్తుఁ డగుచు.

177


సీ.

పంచావరణలీల భాసిల్లు వైకుంఠ
                       నగరంబునడుమను నతివిచిత్ర
రత్నమంటపమున రమణీయమాణిక్య
                       సింహాసనమును లక్ష్మీవసుంధ
[53]రానీళలు భజింప జ్ఞానబలైశ్వర్య
                       వీర్యతేజచ్చక్తి విమలమహిమ
నిస్సమాభ్యధికుఁడై నిత్యముక్తానంద
                       వారాశిశీతాంశువైభవమున

తే. గీ.

నప్రమేయత స్వాభావికానవధిక
నిరుపమాతిశయైకత నివ్వటిల్లి
తత్వవిత్సూరిపరిషత్సదానిషేవ్య
మానుఁడై యున్న పరమాత్మ మది దలంచె.

178


సీ.

సతతకాలత్రయచక్రచంచద్గుణ
                       త్రయవేష్టి కాదిమప్రకృతి నంటి
[54]తన దవిద్యాకామకర్మాదివా[55]సనా
                       రేణుమండితులై పరిభ్రమించి
రుచిరబోధానందరూఢి గనియు ననా
                       త్మికభ్రమాకూలులై చలించి
సత్యకామత్వాదిసద్గుణాన్వితు లయ్యు
                       నంతరంగమున దైన్యము వహించి


తే. గీ.

నీరు గప్పిన నిప్పులై నిష్ప్రభత్వ
పూర్తి పరధామలోకోపభోగభోగ్యు
లయ్యు నామాయఁ జెంది కర్మాదిభేద
ములఁ బ్రవర్తిల్లు సంతతమును దలంకి.

179


సీ.

హేయమౌ నిది యుపాధేయమౌ నిది యని
                       స్వాంతంబులో వివేచనము లేక
హేయముల్ గొని యుపాధేయముల్ విడుచుచ
                       క్షుత్పిపాసామోహశోకరోష
గతజరామరణనిష్కాతీతు లగుచు శ్రు
                       తిస్మృతులై యస్మదీయనిరుప
మాజ్జ చెల్లఁగనీక యంత నుల్లంఘించి
                       యపరాధశతము లత్యంతశక్తి


తే. గీ.

చే నొనర్చుచు నిరయముల్ చేరి మఱియుఁ
బథ్యములు చేసి వేదనల్ బడలియున్న
రోగు లట్లనె సంసారరుగ్మభగ్న
హృదయులై యున్నవారల నెఱిఁగి చూచి.

180

వ.

కరుణాసింధుండగు వైకుంఠాధిపతి పరమదయాళుండై విషాదంబు
నొంది రమతో నిట్లనియె.

181


సీ.

పద్మలోచన పరబ్రహ్మ లోకాధివా
                       సు లచేతనుల నెల్లఁ జూడు నిత్య
నిర్మలకర్మాబ్ధి నిరవధికవిలో
                       లత నున్నవా రకలంకమహిమ
బద్ధులఁ జూడు తాపత్రయావిద్ధుల
                       నెలఁత నీతోడ వినిత్యముక్త
నరులతో సిరి గల్గు నామస్వరూపరూ
                       పోభయగుణభూతులు భయవిధమ


తే. గీ.

దాత్మవర్గోపభోగభోగ్యామృతాంబు
రాశియై యుండఁ జూడ ధర్మంబె నాకుఁ
బ్రాకృతాప్రాకృతజనులు పరమహితులు
సముఁడ నే నందఱకును వాత్సల్యశక్తి.

182


వ.

నిత్యముక్తోపభోగ్యస్వరూపగుణాధికము ప్రాకృతచేతనులకుం
బ్రకాశంబు గావింపకున్నఁ బ్రబుద్ధులగు పుత్రుల నాదరించి బాలకుల
నుపేక్షించిన తండ్రిచందం బగు. పరబ్రహ్మలోకస్వామిత్వంబును
నాకు యాతన గావున నీవైభవంబు సంకోచంబు నొందించి
ప్రాకృతలోకంబుల నధివసించెద నని రమతోడం గూడి ప్రాకృత
లోకంబుల స్వలోకంబులు గల్పించుకొని యుండెడి. నాలోకంబులు
సనకాదులకు సుగమంబులు. ఇతరులకు మహాపుణ్యంబు లొనర్చినను
దుర్గమంబులు. ప్రాకృతదేహులైన సనకాదులకు స్వసంకల్పాను
రూపంబున నిజరూపంబుఁ జూపెనని పల్కిన మఱియు శుకుం
డిట్లనియె.

183


సీ.

హరి పరవ్యోమంబునందు దీపించె నే
                       రూపంబుచేత నారూపముననె
ప్రాకృతపదమునఁ బ్రాపించె నెట్ల న
                       తివ్యవహితము తాదేశపథము

లేకలహంబు ననేకదేశంబున
                       నుండి యొక్కరుఁడె భుజోరుశక్తి
దున్నుట తగునె యద్భుతముగఁ బ్రాకృతా
                       ప్రాకృతపదములం బరమపురుషుఁ


తే. గీ.

డొక్కతఱి దివ్యతరమైన యొక్కరూప
ముననె యుండినయట్లుగా ననుట దోఁచె
నదియ యుక్తంబువలెఁ గాననయ్యె మూర్త
మనుట నుభయపదప్రాప్తి మనుట యెట్లు?

184


వ.

హరికి నేరూపంబు చూడనయ్యె నారూపంబు భయస్థలస్థితంబు గాదు.
శక్తివిశేషముచే నారూప మక్కడను మఱియు నొకదిక్కుననుం
బ్రకాశించుం గాక యని యంటి మారెండుస్థలములయందుఁ దాఁచిన
యొకవస్తువు దా నొక్క స్థలముననే యుండుట నిజం బిట్లుండి రెండవ
దిక్కున నున్నయవి యని తోఁచుట భ్రాంతి ఖగం బొక్కపరి
భూనభఃప్రదేశంబులఁ గానుపించునె యుభయపదస్థితి యీశ్వరునకు
మూర్తత్వక్షతి యగుం గావున దుస్తర్కప్రభవం బగు నస్మన్మనో
దోషంబుఁ దీర్పవే కృపాబ్ది భగవత్తత్వవిద్యచే నని శుకుం డడిగిన నగు
మొగంబున విష్ణుశక్తివిజ్ఞానధుర్యుం డగు పారాశర్యుం డిట్లనియె.

185

విష్ణుమహిమ – ఉభయపదప్రాప్తి

తే. గీ.

తథ్య మెంచ మహాద్భుతాతర్క్యబోధ
శక్తి యీశ్వరునకుఁ గల్గ జగతిమీఁద
ఘటము పటముగఁ గావించు ఘనుఁడు తత్ప్ర
శస్తమహిమకుఁ దర్కావసరము గలదె?

186


క.

సంకల్పమాత్రమునఁ గా
ర్యాంకురములు వొడుమఁజేయునట్టి సమర్థుం
డోంకారమూర్తి శ్రుతిపద
సంకేతుం డితరు లతనినములే యెంచన్.

187


తే. గీ.

లోకసామాన్యలక్షణాలోచనమునఁ
దెలిసి దృష్టాంతహేతువుల్ దెచ్చి యిప్ప
రేశ్వరుని నిశ్చయించువా రెవ్వ రట్టి
జనులు మూఢులు శాస్త్రముల్ చదివిరేని.

188

వ.

కులాలుండు ఘటకార్యకర్తయై ప్రత్యక్షప్రమాణంబున దుఃఖంబు
నొందినట్లు విశ్వకర్తయగు నీశ్వరునకుఁ గర్తృత్వంబువలన దుఃఖి
త్వానుమానంబు లేదు. మూర్తంబునకు నంశత్వంబు ప్రత్యక్షంబున
నెవ్వం డనుమానంబు గావించు మానాంతరవిరోధం బైన నొక్కయెడ
సామాన్యానుమానంబు లే దట్లన నీశ్వరునియందు సామాన్యానుమా
నంబు లభించనందునకు శ్రుతియు విష్ణునకు "అపాణిపాదోజ వనో
గ్రహితాపశ్యంత్మ చక్షుః సశ్రుణోనకం సః నవేత్య వేద్యం నచనశ్య
వేత్తా తమాహు రగ్ర్యం పురుషం మహాంతమ్ నకస్య కార్యం కరణం
చ విద్యతే సతత్స మశ్చాభ్యథికశ్చ దృశ్యతే పరాస్యశక్తేర్వివిధైవ
శ్రూయతే స్వాభావికీజ్ఞాన బలక్రియాచ" యనిన నది హస్తంబులు లేక
పట్టును. పాదంబులు లేక పఱువెత్తును. చక్షువులు లేక చూచును.
కర్ణంబులు లేక వినును. అవేద్యంబైన యది యెఱుంగును. తన్నొకం
డెఱుంగలేఁడు. అతండు మహాపురుషుండని యెంతురు. అతనికిఁ
గార్యకరణంబులు లేవు. అతనికి ముందు నధికుండు లేఁడు. అతని
శక్తి వివిధంబైన యదియై స్వాభావికంబులు జ్ఞానబలక్రియలు.
అతని వినుతింప నలవి యగునె. భగవంతుని శక్తు లవాఙ్మానస
గోచరంబులని పురాణంబులం జెప్పంబడియె. ఉత్పత్తిస్థితిలయం
బులయందు సర్వశక్తులు భగవంతునికే కలవు. శ్రుతిస్మృతులే
తదర్థనిర్వాహకంబులై యుండు.

189


తే. గీ.

సత్యసంకల్పవిభవుఁడౌ స్వామియందుఁ
గలుగ డీలోకసామాన్యకల్పనంబు
గాన భగవత్స్వరూప మెక్కడను బొడమ
దెందుఁ గాన్పించఁ డెందుండఁ డెంచి చూడ.

190


మ.

కనునా విష్ణుఁడు కర్ణరంధ్రములచే ఘంటాదిశబ్దంబు లా
ఘనుఁ డేచూడ్కులచే వినున్ సకలవాక్యశ్రేణు లేతత్పురా
తననిర్విశ్వసనీయులై భవముచేతం బ్రాకృతాంగంబు లా
గున భావింపక యప్రమేయమని లోకుల్ చర్చ సేయందగున్.

191


మ.

ఇది వేదాంతరహస్యసారము హరి స్వేచ్ఛానురూపంబు స
మ్మద మొప్పన్ మది నమ్మి పూర్వభవసమ్యక్పుణ్యపాపప్రస
న్నదృఢాభ్యంతరుఁడై విపద్దశలలోనం బాసి సద్భోగసం
పద లింపొంద భజింపుచుండ్రు పరమబ్రహ్మంబు నేకాగ్రతన్.

192

వ.

ఇ ట్లేకరూపంబున నీశ్వరుం డన్నియెడల నుండుట చోద్యంబె. అప్ర
తర్క్యాద్భుతశక్తియగు విభుండని విశ్వసించి హతదురితులై వామ
దేవాదులు కొందఱు వాసుదేవపరాయణలై యుండ్రు. మఱికొందఱు
మును లఖిలహేయప్రత్యనీకకల్యాణేకతానశ్వేతరసమస్తవస్తు
విలక్షణానంతజ్ఞానానందైకస్వరూపనిత్యనిరతిశయౌజ్జ్వల్య
సౌందర్యసౌగంధ్యసౌకుమార్యలావణ్యయౌవనాద్యనంతగుణనిధి
యగు భగవంతుండు నాత్తవిగ్రహంబులై శుద్ధసత్వాత్మపరంబులై
శుద్ధకళ్యాణగుణసాగరంబులై నిత్యముక్త సేవితంబులైన పర
వ్యోమనిలయసకలవిభూతులను వీక్షించి తత్సదృశానేకరూపం
బులు గావలయునని యిచ్ఛామాత్రంబువలనం గలిగిన శుద్ధసత్త్వ
రూపదివ్యవిభూతులతోడం గూడం బ్రకృతిసృష్టియవస్థయందున
పంచీకృతాత్మకములైన మహాభూతములయందుఁ బరబ్రహ్మలోక
వ్యూహవిభూతులతోఁ దా నవతరించి యక్కడను స్వస్వరూపాత్మ
జ్ఞానసంపన్నులగు దివ్యయోగీంద్రులకుం దక్కఁ దక్కినవారలకు
సేవింప నలవి కాదని విలోకించి పంచీకృతమహాభూతారబ్ధభూముల
యందుం బ్రవేశించి స్వప్రియవ్రతచారులై కేవలు లైనవారిచేత సేవిం
పంబడుచున్నవాఁడై కృతార్థుండ నైతినని తలంచి మహౌదార్యసుశీ
లత్వవాత్సల్యాదినిజసద్గుణంబులతోఁ గూడినవాఁడై సర్వదేవవేద
హృదయాహ్లాదముచే సిద్ధచతుర్దశమహాలోకంబులందు శ్రీవైకుంఠ
శ్వేతద్వీపక్షీరాబ్ధులయందును సవితృమండలమధ్యమమునందు
నృసింహరామకృష్ణాదివిభవావతారంబులు శ్రీరంగశ్రీపురు
షోత్తమశ్రీవేంకటాచలకాఖ్యాహోబిలబదరికాశ్రమాదులయందును
దత్తద్గ్రామగృహార్చవిగ్రహసాలగ్రామాదిమూర్తులయందును జేతనా
చేతనాంతర్బహిఃపూర్ణుండై సేవకజనుల నభీష్టాకృతులు ధరించిన
వాఁడై సకలేప్సితంబు లొసంగుచు శుభైకదానస్వలీలాబ్ధియందు
విహరింపుచున్నవాఁ డని యందురు. ఈఋషులమతంబునం దున్న
శుద్ధసత్వాత్మకత్వాదిస్వగుణాంబుధి దివ్యదేహములచేత సర్వస్థల
ములయందును భగవంతునికి సన్నిధానము గల దనియెడి నిశ్చయం
బున నిట్లుండి యేస్వామి నిత్యముక్యైకభోగ్యుం డగు నాస్వామియె
స్వకీయదివ్యమంగళవిగ్రహవిభూతులచేత సనకాదులయిన
స్వప్రియులకుఁ బ్రసన్నుం డయ్యె ననుట యుక్తంబు.

193

మ.

అని యి ట్లాత్మగురుండు పల్క నట సాష్టాంగంబుగా మ్రొక్కి య
త్యనఘుం డాపరమార్థవేది బహుళార్థాకారుఁడై తాఁ బునః
పునరుద్బుద్ధశిరఃప్రకంపనయనాంభోరోహరరోమాంచలాం
ఛనుఁడై భవ్యపరాశరాత్మజ విశిష్టస్తోత్రదృష్టిం దగన్.

194


వ.

ఈయజుర్వేదంబు సత్వదవాఙ్మానసవిత్తముండవై న న్నెఱుంగక యట్లు
"సహోవాచ వ్యాసః పారాశర్య" యని నిస్వోదీరితార్థంబునందు
నీవచనము ప్రమాణంబుగాఁ బలికె నింతకంటె నిన్ను నెట్లు నుతింప
వచ్చు నీవే లోకోత్తరుండ వగుట.

195


సీ.

శ్రీ మించు తత్పరవ్యోమంబునందుండి
                       యవతరించి నిమీలితాత్మకంబు
లగు మహాభూతంబులందు వరప్యూహ
                       ములతోఁ బ్రకాశించి యలఘుకరుణ
సనకాదులకు నిట్లు కననయ్యె ననుచు మీ
                       రానతి యిచ్చితి రదియె విస్త
రముచే నెఱింగింపు సముఁదీశ్వరుఁడు సర్వ
                       భూతములకు నట్టి పురుషమౌళి


తే. గీ.

యూర్థ్వలోకాధివాసులై యున్న యజహ
రాదుల నుపేక్ష గావించి యగ్రముననె
యట్టి సనకాదులకును బ్రత్యక్షమయ్యె
బుధులు వైషమ్య మన రెట్లు బుద్ధిఁ దలఁచి.

196


తే. గీ.

సర్వభూతంబులను నేలు స్వామి ఘనుఁడు
సర్వభూతసంహృత్తు తజ్జనులలోన
నెట్లు గావించెఁ గొంద ఱీయెడల సంత
తాధిగతమైన సౌహార్ధ మాత్మలోన.

197


క.

అని యనితరసౌమ్యంబుగఁ
దనయుఁడ ప్రశ్నంబు సేయఁదగునని హర్షం
బొనరం బారాశర్యుం
డనియెన్ వస్తుస్థితి ప్రమార్హము గాఁగన్.

198

సర్వేశ్వరుని సర్వజనేచ్ఛానువృత్తి

క.

సర్వసమత్వగుణంబును
సర్వసుహృత్త్వంబు గలుగ సర్వేశ్వరుఁడే
సర్వజ్ఞుం డగుఁ గావున
సర్వజనేచ్ఛానువృత్తిఁ జాల నటించున్.

199


వ.

ఆయిచ్ఛ రెండువిధంబు లగు బద్ధముముక్షుమతి మతిభేదంబున నందు.

200


క.

కనుఁగొని దేహాద్యన్యం
బును జ్ఞానానందలక్ష్మీపూరము నగు నా
త్మను దదనాత్మ తగ నచే
తనుఁడు సుమీ బద్ధుఁ డనఁగ ధారుణిలోనన్.

201


సీ.

ఆబద్ధజనుఁడు క్రమానురూపార్థస్పృ
                       హావలంబనమున నంటియుండు
ననిశంబు నాత్మదేహాదివివేకసం
                       పత్తిదేహాదులు బంధకంబు
లని ముముక్షుండు నిత్యము తద్వివేకాను
                       రూపార్థములమీఁద రుచి వహించు
మూఢుండు దుఃఖైకమూలంబు భవ మని
                       యూహించఁ డాత్మలో మోహశక్తి


తే. గీ.

నల ముముక్షువు భవనిరాసార్థహేతు
పుల నిరీక్షించు నిత్యంబు దెలిసి భావ
మందు నుండిన యునికి కారాంతరముల
యందు నుండిన యునికని యన్వయించు.

202


ఉ.

శ్రీవిభవుఁ డాత్మలో నుభయుచేతననూతనచిత్తవృత్తి స
ద్భావములో నెఱింగియును భ్రాంతమనోరథ మీఁడు రోగదు
ర్భావన తల్లి పుత్రకుఁ డపథ్యముఁ గోరిన నీనియట్లు త
త్కేవలమోక్షకాంక్షుల కుదీర్ణత నీఁడల యోగసిద్ధులన్.

203


సీ.

స్వామి నిర్హేతువాత్సల్యసింధువు బద్ధు
                       లైన చేతనుల నిజాత్మఁ దలఁచి
స్వాపరవృత్తిసంప్రాపకార్థంబులై
                       ప్రబలు స్వర్గంబు స్వారాజ్యపదము

కైవల్యము ననంగఁ గలిగిన యవియెల్ల
                       నొసఁగుచునుండియు నొక్కచోట
నవి నశ్వరములు హేయంబులు తుచ్ఛంబు
                       లల్పతరములను నరుచి పుట్టఁ


తే. గీ.

జేయునవి రెండు మది విమర్శించి ముక్తి
పదముఁ గోరంగవలయు సద్భావశక్తి
నిట్లు కోరిన పరమాత్మ కెంచి చూడఁ
గలదె వైషమ్యబుద్ధి లోకంబులోన.

204


సీ.

త్రివిధజీవ నిజేచ్ఛ తెలివి కర్తుమకర్తు
                       మన్యథాకర్తుం సమర్థశక్తిఁ
దనర నీశ్వరుఁడు తద్వత్సలత్వమునఁ ద
                       దిచ్ఛానువృత్తిమై నెసఁగియుండుఁ
బరమయోగీంద్రులు భవ్యులు సనకాదుఁ
                       లారమాజాని పాదాంబుజాత
భక్తినిష్ఠాశక్తి ప్రబలినకైవడి
                       బ్రహ్మాదినిర్జరప్రవరులకు ల


ఆ. వె.

భించ దట్లుగానఁ బ్రీతి యందఱియందుఁ
గలుగ నెపుడు వార్దికన్యకాక
ళత్రునకును నిది విచిత్రంబు గా దెంచఁ
దత్స్వభావగుణమె తలఁచ నెపుడు.

205


తే. గీ.

అఖిలచేతనసముఁడు పరాత్మవిషముఁ
డౌనె తదభీష్టసిద్ధిదుఁ డయ్యెనేని
తనయులకు నెల్ల సముఁడైన తండ్రి తత్త
దిష్ట మొకలేశ మేనియు నిచ్చినట్లు.

206


వ.

అనిన శుకుం డిట్లనియె.

207


మ.

సనకాదు ల్ఘనయోగు లబ్జజసుతుల్ స్వధ్యానమప్రియా
యనఘుల్ విష్ణునిఁ జూడఁగోరుట నిజంబౌ నట్లు కాకున్నఁ బ్రా
క్తన వాణీశమహేశ్వరాదుల కశక్యంబైన తద్దేవద
ర్శన మెట్లౌఁ దగు విష్ణువత్సలతయున్ సంసేవకైశ్వర్యమున్.

208

క.

ఈరీతిన్ సులభత్వో
దారత్వమహత్వసత్వధన్యత్వగుణో
దారుండగు నాశ్రితమం
దారము హరిఁ గొలువలేక తడఁబడుదు మయో.

209


సీ.

అనుపమబ్రహ్మవిద్యాప్రసన్నేశప్ర
                       సాదగుణోద్భుద్ధశక్తు లగుచుఁ
బద్మసంజాతాండబహిరంతరంబులఁ
                       దిరుగుచుందురె పూర్ణధీప్రశస్తి
వాసి కెక్కఁగ భగవత్థ్సూలరూపాను
                       భవరాగమున యోగు లవరతంబుఁ
జిత్రంబు గాన పంచీకృతభూతాంత
                       రంబులందు ననర్గళంబు గాఁగ


తే. గీ.

వర్తిలుచుఁ గోటిసూర్యవిస్ఫురితకోటి
చంద్రసాంద్రకళానందసౌరభమున
నామయము నైన తత్పరవ్యోమలోక
ధామమున కేఁగి హరి నెట్లు ప్రేమఁ గనిరి.

210


క.

అటువంటి యోగివర్యుల
నెటువలెఁ గరుణించె వార లీవిష్ణువుతో
నెటువంటి గోష్ఠి చేసిరి
పటువిజ్ఞానమునఁ దెలియఁ బలుకుము నాకున్.

211


వ.

తజ్జనప్రియమైనదియు నే తదన్యంబున నానతి యిమ్మని యడిగి
యతివినయంబునఁ గృతాంజలియై నిల్చిన తనయునిఁ గౌగిటం జేర్చి
వ్యాసుం డిట్లనియె.

212

సనకాదులను విష్ణువు కరుణించినవిధము

తే. గీ.

వత్స! యవధానమునను శ్రీవత్సలాంఛ
నాదిశుభకథ శ్రుతిసుఖంబై తనర్ప
బ్రహ్మవిచ్ఛిత్తశంకావిభంజనముగ
నీకు నెఱిఁగింతు వినుము తదేకబుద్ధి.

213

సీ.

ఘనతరమయి యసంఖ్యమయి బ్రహ్మలోక
                       మౌనట్టి పరవ్యోమ మరయ నెద్ది
యదియ విశుద్ధతత్త్వాఖ్యతత్వంబు సు
                       షిరమున నామించి చెలఁగె నది త్రి
పాద్భూతితదురుత్రిపాద్భూత్యధోభాగ
                       మధ్యదేశైకసమాశ్రయమునఁ
దగు నతర్క్యాద్భుతతరశక్తికంబుగ
                       వ్యయముననైన కాలాఖ్యతత్వ


తే. గీ.

మది యధోముఖచక్రమై యంటి తిరుగుఁ
బరగుఁ దదవస్థ లీమధ్యభాగనాభి
మిళితమై త్రిగుణాత్మయై మెలఁగ [56]నాయ
జాదులకునైన నెఱుఁగ శక్యంబె దాని.

214


మ.

ప్రమదావృత్తకులాలచక్రగతమృద్భావంబునన్ యోగిస
త్తము లోహో యని యెంచి చూడఁగఁ దదుద్యత్కాలచక్రభ్రమ
క్రమభేదంబులఁ గాంచు విక్రియ లనేకంబుల్ తరంబే యజా
సముదారత్వము మెచ్చ నీశ్వరనిజేచ్ఛాధీనమై యుండఁగన్.

215


తే. గీ.

అజవికారంబు నొందిన యది యసృష్టి
యజనికాసంబుతో నుండునదియ యునికి
యజకు సంకోచ మన నెద్ది యదియె వేల
యఖిలలోకార్హమైన బ్రహ్మాండమునకు.

216


మ.

చిరకాలంబుగ నాదిసిద్ధకలితాచిద్రూపమో నాయజన్
బరితోవ్యాప్తి ననాదిచేతనులు తద్బద్ధస్వశక్త్యాత్ములై
తిరమై యుందురు తథ్య మీవిహితశ క్తిజ్వాలకీల్యంశవి
స్ఫురణం దంత మనోచితార్థకరణంబుల్ మాని యెల్లప్పుడున్.

217


వ.

మఱియు ననేకరూపప్రకృతిరూపస్వభావోదితవిభ్రాంతులై స్వాతి
రిక్తంబులైన భగవచ్చేషతైకాకృతులె ప్రాగ్భవీయకర్మానురూప
దుఃఖాతిహేతువు లగు దేహేంద్రియమనఃప్రాణాదులయందు నాత్మా

త్మీయత్వసమ్మోహంబు నొంది దేహాదిప్రతికూలానుకూల రాగ
ద్వేషాదివిక్రియలు మఱియు మఱియుం జెందుచు నష్టస్వచేతనోన్న
త్యంబున లక్ష్మీశాజ్ఞోలంఘనాపరాధరూపపాపానురూపంబులైన
దండంబులు గాంచి దుఃఖార్తులై యసుఖంబులయందు సుఖభ్రాంతి
వహించి మరుమరీచికలు గని మృగంబులు పయఃపానేచ్ఛం దిరిగినట్లు
తిరుగుచు దుఃఖైకఫలక్రియలు సేయుచు సుఖంబుం గోరు జంతువులం
గాంచి దుఃఖైకహేతువగు ప్రపంచంబు లయంబు నొందింపఁ జూచి
జలంబున జలబుద్బుదంబునుంబోలె భౌతికంబులు భూతంబుల
యందును భూతంబులు తన్మాత్రలయందును దన్మాత్రలను దామ
సాహంకారమందు నింద్రియంబులను దైజసోర్జితసాత్వికాహంకారము
నందు నహంకారము మహత్తునందు మహత్తు నవ్యక్తంబునందు
నవ్యక్తంబు నక్షరంబునందు నక్షరంబు నజశబ్దవాచ్యంబగు తమ
సంబునందు స్వజ్ఞానశక్తిసూక్ష్మాంగలేశంబు చేతనంబుగాఁ జేసి
బద్ధాసంఖ్యేయచిద్గర్భంబగు తమంబు చూచి పరమవిస్మయంబు
నొంది హరి పరమదయాళుండై సన్నిధి సేవించు నిందిరం జూచి
యిట్లనియె.

218


క.

వలఁ దగిలిన మీనంబులు
వలె జీవగణంబు లాజవంజవజాలం
బులఁ బడి తిరుగం జూచినఁ
గలఁగదె హృదయ మిపు డెట్టి కట్టిడికైనన్.

219


సీ.

తెలివితో వీర లాత్మీయస్వభావ మిం
                       తయుఁ దా రెఱుంగరు తత్వబుద్ధి
దేహేంద్రియప్రాణధీమనోన్వీతులై
                       యున్మత్తు లున్నయ ట్లుండి స్వాను
రూపవృత్తియునైన రూపించఁగా నేర
                       రల ప్రసుప్తులయట్ల విలయ మంది
మణులు దుష్పంకనిమగ్నంబులై నిజ
                       ప్రభఁ బాయునట్లు సౌభాగ్య మెడలి

తే. గీ.

యుందు రటుగాన స్వస్వభావోచితసుఖ
మనవధికముగఁ బొందు సమర్థు లెందు
గారు హతులైరి కటకటా ఘనతమోవి
లీనులై నష్టులై యుండనౌ [57]నెట్లు చూడ.

220


క.

అనిశతమోలీనతఁ జే
తను లతిదుఃఖము వహింపఁ దత్పరమవ్యో
మనివాసంబున నుండఁగ
మనసగునే నాకు నెన్ని మార్గములందున్.

221


మ.

అనిశంబున్ బ్రజ దుఃఖశోకభయమోహభ్రాంతులై పాఱ శో
భనభాగ్యోదయసంపద ల్గనియె నాతద్భర్త పూర్ణుండు యా
తనలం గొందఱు కొంద ఱుత్కటసుఖౌదార్యంబులన్ మించ నే
పునఁ దర్భత్తయు నర్ధపూర్ణుఁడగు సంపూర్ణుండు గాఁ డెంచినన్.

222


ఉ.

ఎంచఁగ నెవ్వ రెవ్వరికి నెయ్యది యిష్టతమంబు దాని స
భ్యంచితశక్తి నిత్తు హృదయంబు గరంగఁగఁ జూడ నీవు ని
ర్వంచన సత్కృపామహిమ వారికి దేహములున్ స్వశక్తులున్
మించ నొసంగి కోరిక లమేయముగా నొనరింతు నిత్తఱిన్.

223


తే. గీ.

స్వగుణసౌభాగ్య మి ట్లాత్మసతికిఁ దెల్పి
సృష్టిసంకల్ప మాత్మలోఁ జేయునంత
జగము లపు డుద్భవించె నాశ్చర్య మంద
నఖిలమును బూర్వమున నున్నయట్ల చేసె.

224


సీ.

అఖిలలోకంబులు నద్భుతం బొప్ప సృ
                       జించి యాసత్కృపాశీలుఁ డాత్మ
నాభిగర్భోద్భూతుఁడై భూతి మెఱయు చ
                       తుర్ముఖబ్రహ్మ చతుర్దశోత్త
మబ్రహ్మవిద్యాసమన్వితస్థానంబు
                       నం దధికారిగా నన్వయించి
వేదదృష్టంబైన విమలమార్గంబున
                       నిర్మించు నీ వని నియతకరుణ

తే. గీ.

నానతి యొసంగె శుద్ధసత్వాత్మకమును
నిత్యనిరవధికానందనిర్మలంబు
నైన నిజపద మతనికి నపుడు చూపి
సమ్మదం బొనరించె నాచక్రధరుఁడు.

225


తే. గీ.

రుచిరనిరవద్యమగు స్వస్వరూపరూప
తద్గుణాధికములు చూపి తత్సమగ్ర
భక్తి బ్రహ్మాండలోకాధిపత్య మొసఁగి
యంతఁ దచ్ఛక్తిఁ గన నదృశ్యత వహించె.

226


మ.

తనకుం జేయఁగ నిచ్చగింపఁబడ సత్కర్మంబు లెన్నేని న
య్యనఘుం డబ్జభవుండు శ్రీరమణసేవార్థంబుగాఁ జేసి త
ద్ఘనుఁ బూజించి యహంకృతుల్ వదలి నుద్భావంబుతో నుండఁగా
సనకాదు ల్జనియించి రావిభునకున్ సర్వాధికుల్ సాత్వికుల్.

227


వ.

అని చెప్పి వేదవ్యాసుండు శుకునిం జూచి మఱియు నిట్లనియె.

228


సీ.

ఆచతుర్ముఖుఁడు బ్రహ్మజ్ఞానులగు సన
                       కాదుల న్వర్థనీప్రాంతచరుల
నలువురి సంసారనావమాత్రవిసృష్టి
                       రహితుల నద్భుతార్కప్రభాంక
కనుల నాత్మానాత్మతత్వవివేకుల
                       హరిభజనశ్రవణార్చనాది
పరులఁ బ్రాగ్భవసముత్పన్నపరబ్రహ్మ
                       విద్యాసుధారసవిమలు రయ్యుఁ


తే. గీ.

బ్రస్ఫుటారబ్ధకర్మానుభవముకొఱకు
జననమున మించు కమలసంజాతఁ బాసి
నీమనోహరభక్తుల నిఖిలసద్గు
ణాభిరాములఁ జూచి యయ్యబ్జభవుఁడు.

229


వ.

తదాకారంబులు తత్తేజంబులు తద్విజ్ఞానంబులు నిరీక్షించి యేవంవిధి
సృష్టిఁ గావింపుఁ డనఁ బ్రణమిల్లి వా రిట్లనిరి.

230

మ.

తరమే మా కిది నీకు మాయెడలఁ బుత్రస్నేహ మీవేళ సు
స్థిరమై యున్నదొ లేదొ లేనియెడ నీదేహంబు లింకేల న
శ్వరముల్ గల్గిరయేని సౌఖ్య మిడు సాక్షాత్సౌఖ్య మీసృష్టియో
హరిసద్భావనయో మహాత్మ యిది నేఁ డత్యాదృతిం దెల్పవే.

231


శా.

దేహాత్మైకమతిభ్రమాబ్ధిపతితుల్ దీనాత్మకుల్ పుత్ర
రోహాసువ్రతదుష్టకర్మనిరతుల్ యుక్తేతరానేకరూ
పేహాసక్తులు దుష్టమానసులు మీ రెట్లన్నఁ బాటింతు రా
శ్రీహర్యర్చన లాత్మవేదులకుఁ జర్చింపంగ సత్కర్మముల్.

232


వ.

మఱియు వినుము కర్మంబులకు వైషమ్యంబు గలదే. విద్వాంసునికి
నుత్తరోత్తరకర్మంబు లభించదు. వానికి నాథోధఃకర్మనిష్ఠ యుక్తం
బగు నుత్తరకర్మనిష్ఠ యుక్తంబు గాదు. పాయసాన్నభోజనక్రియా
దక్షుఁడు మాతృస్తన్యం బిచ్చసేయని యట్లు సర్వక్రియాఫలబ్రహ్మ
భావనసుఖవేదియైన భక్తుండు పితృమతంబైనంగాని సృష్టిక్రియ
యిచ్చయింపఁడు కావున.

233


సీ.

నిత్యకర్మములఁ బూని కనాద్య మొనరప
                       క తదుత్తరంబగు కర్మమెల్ల
నాచరింపఁగఁ దగదనును శాస్త్రంబులు
                       కామ్యక్రియల కిట్లు గాదు మేరు
విలను సంధ్యాకర్మహీనుఁ డనర్హుండు
                       సకలకర్మముల కెంచఁగ నశుచిత
ప్రాపించునే మా కనర్హత సృష్టి గా
                       వింపనినాఁ డటు విమలచరిత


గీ.

యనిన శ్రీశప్రసాదాపహాతి భక్తి
శేముషియుఁ గల్గు నంచు నాశీర్వదించి
జలజసంభవుఁ డంత నాసనకముఖ్య
పరమభాగవతుల నాత్మఁ బ్రస్తుతించి.

234


వ.

మంగళాశాసనంబు చేసి యనిచిన వారలు ప్రణమిల్లి కృతాంజలులై
యానందబాష్పంబులు దొరుగం దండ్రిఁ జూచి మృత్యువక్త్రంబు
వెడలితి మని తలంచికొని వాయువేగమనోవేగంబులం జని నిర్మల

స్వాంతులై తమతండ్రి యనుగ్రహంబున నాఁడు మొదలుకొని హేయ
రూపసాంఖ్యేయకల్యాణగుణసాగరంబై సర్వానందస్వస్వరూపాను
ప్రతిభరూపైకస్వరూపంబై సద్బ్రహ్మకళాత్మశంభుశివాదినామ
గంబై యసాధారణనారాయణవాసుదేవాది కాహ్వయంబై జగద్బీ
జంబై మోక్షప్రదంబై ప్రసిద్ధంబై నిత్యానవధికానందస్వరూపంబై
నిఖిలాశ్రయంబై సర్వానందకారియైన బ్రహ్మంబు భావించి.

235


సీ.

వెలయుచుఁ దన్మనస్కులు తదాలాపులు
                       తత్సపర్యులు తత్పదప్రవణులు
తద్గుణరక్తులు తద్భక్తినిష్ఠులు
                       నగుసనకాదు లత్యంతఘనులు
పంచషడ్వత్సరప్రాయబాలకమూర్తు
                       లవికారులు జితేంద్రియత్వఘనులు
త్రిభువనంబుల దేవదేవాంఘ్రిభక్తగో
                       ష్ఠిప్రపూజలు గాంచి శ్రీకళత్ర


తే. గీ.

సత్కథామృతంబు వినుచుఁ జవులు గొనుచుఁ
జక్రధరభక్తివిముఖాత్మసభలనైన
నధిపసింపరు విష్ణుతత్వావబోధ
పూర్తి యొనరించుకొనుచు నపూర్వశక్తి.

236


తే. గీ.

వాదజల్పవితండోపపాదిశక్తి
వార లొక్కొక్కచోటన వైదికుల జ
యించి కావించినపుడు లక్ష్మీశహృదయ
రంజనంబైన తన్మతభంజనంబు.

237


క.

హరునిసభ నజునిసభ సుర
వరుసభ వరుస భగవదతివైభవములు వి
స్ఫురితన్యాయంబులు సు
స్థిరములుఁగాఁ జేసి మహిమ దీపించి రిలన్.

238


వ.

చెలఁగి వేదాంతదర్శనస్థితులచేత వారు దేవప్రకృతులతోఁ గూడఁ
దద్వేదాంతదర్శనంబు మహాన్యాయంబులచే సంస్థాపించిరి. అసుర
ప్రకృతు లెఱుంగరైరి. మఱియును.

239

చ.

అలఘులు వీతరాగులు శుభాన్వితదేహులు ఖ్యాతిలాభ లా
జలు గొన రామయావిగతశాంతికినై యతిసాధులైన వై
ద్యులువలె భూమిఁ ద్రిమ్మరుచుఁ బూర్ణదయాగుణవారిరాసులై
కలఁగిన జీవకోటి కుపచార మొనర్చుచు బోధసంపదన్.

240


తే. గీ.

మహిమచేఁ బదవాక్యప్రమాణవేదు
లగు మహాత్ము లవజ్ఞ సేయంగ నాసు
రప్రకృతి వార లాత్మసారంబు లేక
వ్రీడమై హరి సద్గోష్ఠి విడిచి యుంద్రు.

241


క.

వామనదితిజాసురర
క్షోముఖ్యసభాంతరములకుం జని వారిం
బ్రేమం గని తెల్పిరి త
త్తామసులకు శ్రుతివిరుద్ధధర్మమతంబుల్.

242


సీ.

ఆకళావిద్యల నసురుల వశ్యుల
                       గాఁ జేసికొని మహాఖలసమాశ్ర
యమునఁ దదిష్టగోష్ఠ్యంతరంబున వారి
                       వలన సత్క్రియ లంది వార లుండి
తావదుత్పన్నదుర్ధరగర్వపర్వత
                       శిఖరసమారోహచిత్రతరమ
హోన్నతులై యిట్లు యుక్తేతరంబులు
                       వల్కుచు మూఢస్వభావు లగుచు


తే. గీ.

నాదిమౌనులు వైదికుల్ వేదనిగది
తారవిశ్వాసదుర్జ్వరాహతమహౌజు
లగుచు ఘనసన్నిపాతంబు లందినట్లు
వింతకల్పన లెల్లఁ గల్పింతు రిలను.

243


వ.

వేదాంతమతమునకంటె నన్యమగు మతము మంచిది గాదని తెలియక
యీవేదాంతమతము నాదరించక యీప్రకారమునను స్వగోష్ఠీనిష్ఠు
లైన ఛాందుసులైనవారి మనస్సులను నల్పులైనవారల నతి
కల్పనులైన మోహంబు నొందించి రప్పుడు.

244

సీ.

మహిని సురాచార్యమతము లోకాయత
                       మతమును సౌగతమతము భార
తీశమతంబు మహేశమతంబును
                       జైమినిమతమును జైనమతము
కాణాదమతమును గౌతమమతమును
                       గపిలమతంబును ఘనత కెక్క
నంతకంటెను బ్రశస్తంబె వేదాంతమ
                       తంబు సభాసమ్మతంబె తెలియ


తే. గీ.

నభ్రపుష్పోపమంబు వేదాంతమతము
తన్మహాసౌరభాఘ్రాణతత్పరాభి
మానమాయామిళిందాయమానమాన
మానవులు గొంద రుంద్రు దుర్మత్సరమున.

245


తే. గీ.

అద్దురాత్ములు పలికిన ట్లపుడె నమ్మి
యందుఁ బడి యాసురాత్ములై యఖిలజనులు
వైదికాచారవిముఖులై వైష్ణవులును
విష్ణుదేవుని నిందించి విమతులైరి.

246


వ.

బాహ్యులతోఁ గుదృష్టులతోఁ గూడి వేదవిప్లవంబు సేయుచు నపన్యా
యంబుల దురాగమంబుల వేడ విత్పక్షంబు లపనయింపుచు వేదాంతాభి
మతన్యాయకులిశభగ్నమానసులయ్యుఁ దత్క్రోధమోహాంధులై
నిర్దయులైనట్టు వైభవం బొనర్తురు. కొందఱు మహాభుజాబలులై మంద
మతులై సైన్యంబులచే భూమి చలింపంజేయు దురాత్ములచే భంగంబు
నొంది యలబ్ధశరణులై సత్పురుషు లట్టి దురాత్ములనే శరణంబుగా
వేడుకొనుచుఁ దన్మతప్రశంసఁ జేయుచుఁ దదిచ్ఛాసుగుణవృత్తులై
'యాపత్కాలే నాస్తి మర్యాద' యను నీతి నంగీకరించి మధ్యములు
బ్రదుకుదు రుత్తములైన మహానుభావులు నిగమాంతనిషేధకులైన
వారి నాశ్రయించి బ్రతుకుటకంటెఁ దనుత్యాగంబు సేయుట మేలని
బాహ్యదృష్టులు లేని దేశంబునకుం జని నైమిశాదిపుణ్యక్షేత్రంబుల
విజ్వరులై పరబ్రహ్మోపనిషద్భావనం గొందఱు ప్రవర్తిల్లుదురు.
ప్రవృద్ధములై సంసారబంధకంబులై నిస్స్రేయనవిరోధులైన
బాహ్యకుదృష్టిమతంబులచేత నీహారపటలంబులచేఁ గప్పఁబడిన

భానుమండలంబులుంబోలె నేతద్దుర్మతహితంబైన తత్వవిజ్ఞానా
మృతధీధితిమండలంబు వైకుంఠనాథునిచే సాక్షాత్కారంబున
శ్రుత్యంతక్షీరసాగరమువలన సముద్భూతసారంబై విధాతకు నుప
దేశం బయ్యె నది యెఱింగి హేయప్రతిభటాసంఖ్యేయసుగుణపరి
చిత్సత్స్వరూపవమాధికరహిత గుణంబులను వేదాంతంబులు తాము
ప్రశంసించి విశ్వపావనంబు లయ్యె మఱియు.

247


సీ.

రూప మీదృశము స్వరూప మీదృశము గు
                       ణౌఘ మీదృశము విఖ్యాతవిభవ
సౌభాగ్యభర మీదృశం బంతరాత్మత్వ
                       సామర్థ్యగుణ మీదృశంబు సకల
ఫలదాయకోత్తమబ్రహ్మవిద్యాతత్వ
                       మహిమ యీదృశము సమగ్రవేద
వేదాంతశాస్త్రపురాణాది సమ్మతం
                       బై జగంబులను విఖ్యాతి నొంది


తే. గీ.

సతతబుధసమ్మతంబైన మతము లోక
విస్ఫుటవిగాసశంకాతివిధుర మయ్యు
నిప్పు డీకృతయుగమున నెంచఁ జొప్పు
దప్పె బాహ్యోదదుర్వాదతర్కములను.

248


వ.

మఱియు నుపనిషత్పక్షంబున కాక్షేపంబు పుట్టించి ప్రాణసంహార
పర్యంతంబు ననుదినంబును భయంబు నొందించి ఖలులు సత్పరుషుల
చేతఁ దత్పక్షంబు విడిపించిరి. కొందఱు బాహ్యమతవిషాబ్ధి మునింగిరి.
కొందరు సూరుసూరులు వహ్నిపరీతంబులైన భవనంబులు విడిచిన
యట్లు నిజదేశంబులు విడిచి చనిరి. బాహ్యాగమ్యదేశంబుఁ బ్రవేశించి
సూరులు మఱికొందఱు దీనులై కానంబడక విష్ణువును భజించిరి.
సంసారవిషవారాశియందు నమృతంబైన వేదాంతదర్శనంబు
తద్ద్వేషోదధినిమగ్నంబై యుండిన విషయకాంక్షులగు సురలకు
వేదాంతవిచారంబులు వలువదు. సాత్వికు లాసురభయంబున
వేదాంతంబు నుడవ వెఱతు రది గావున వైష్ణవుల కిచ్చట నిలువం
జనదని సనకాదులు హరిమాయాప్రభావంబు ప్రశంసింపుచు బ్రహ్మాం
డంబు వెడలి మహాభూతావరణంబునకుం జని.

249

సీ.

అచ్చట నచ్చట నతిదయాంభోరాశి
                       వైకుంఠనాథనివాసమహిమ
కని కని చని యొకకల్యాణదివ్యధా
                       మముచెంత నున్న సమగ్రమతుల
పంచషడ్వత్సరార్భకుల లక్ష్మీశభ
                       క్తిరససమాస్పదనిరతజనిత
శునగరోమాంచకసుకుల రమాధీశ
                       లోకసౌభాగ్యవిలోకనోత్సు


తే. గీ.

కేక్షణులఁ దత్పదస్థజనేక్షణప్ర
ణయకృతాంజలిపుటల వినమ్రమతుల
బ్రహ్మపుత్రులఁ జూచి యభ్యర్చనంబు
చేసి జయవిజయులు నుతి చేసి యపుడు.

250


సీ.

ఆదిభూతంబైన యావరుణునకు నా
                       నలువురఁ బరమవైష్ణవుల నొప్ప
గింప నాతఁడు భక్తిఁ గీర్తించి పూజించి
                       శంకుకర్ణునకు నాక్షణమె చూపె
నాతఁ డభ్యర్చించి యట గదాదేవి స
                       మ్ముఖము గావింప నమ్మునులఁ జాల
వలగొని యుపచారము లొనర్చి శ్రీధర
                       స్వామిసన్నిధి చేర్ప సమ్మదమున


తే. గీ.

నమ్మహాత్ముల కుపలాలనాదికంబు
మొదలు గావించెఁ బ్రద్యుమ్నమూర్తి కడకుఁ
దెచ్చి యావేల్పు ఘనదివ్యతేజులైన
వారి వైకుంఠపతియొద్ద వరుస నిలిపె.

251


వ.

నిల్పిన సేవించి యుపాసీనులై పరబ్రహ్మానందసింధువులగు జయాది
కులవెంట నిక్షురసవీచికాసంగతి నిక్షురసాంబోధినింబోలె నీశ్వర
సాక్షాత్కారంబు గలిగి నిరంతరానందంబు వహించి యున్నప్పు డొక
యనిర్వాచ్యానందంబు గాంచి సాంద్రచంద్రాతపాతంత్రచకోరంబు
లుంబోలె విజ్వరత్వంబు నొంది యీశవిగ్రహవిన్యస్తదృష్టులై
యనిమిషత్వంబు వహించి రప్పుడు.

252

సీ.

తనముఖశ్రీ చూచి తనియనివారి న
                       నన్యభోగాసక్తు లైనవారి
భ్రాంతిఁ బొందనివారి నెంతయు స్వస్వరూ
                       పాదియధ్యాత్మబోధాత్ము లైన
వారిఁ గర్మజ్ఞానవైరాగ్యజనితని
                       జాంఘ్రిభక్తిశ్రీల నలరువారిఁ
దద్ధ్రువత్వవిశదత్వప్రియత్వావస్థ
                       గలవారిని సుబుద్ధి నలరువారి


తే. గీ.

సజ్జనులఁ జాల రక్షించి స్వభజనాతి
దూరగాసురసంవాసదుఃఖసహన
యత్నముల వాసి యాగమాంతానుగుణన
యంబులను వారివర్గంబు లణఁచువారి.

253


క.

మాన్యఘనులైనవారి న
వన్యాయాధిగధురీణపరవాదిదిగు
క్తిన్యక్యారణచణచా
ధ్వన్యత వర్తించి యుత్సవము నగువారిన్.

254


తే. గీ.

త్యక్తబాహ్యాదిసల్లాపు లగుచుఁ దృప్తి
నెరసి యాఖ్యాత మెఱిఁగించి యిచ్చఁదలఁచి
హర్షగద్గదరవపులకాశ్రుపూర్ణు
లగుచు సాష్టాంగనతి నిచ్చ నలరువారి.

255


చ.

అనఘుఁడు నాల్గుహస్తముల నక్కునఁ జేర్చి శిరంబు లెత్తి మూ
ర్కొని పదసంశ్రితాంచదుపగూఢరసాంబుధి నోలలాడి హృ
ద్వనజము లుల్లసిల్ల ననివారితయోగపదాధిరాజ్యల
క్ష్మి నిబిడమై చెలంగ నభిషేకము చేసె ముదశ్రుధారలన్.

256


తే. గీ.

తద్రమయు నాసునందనందప్రబల ము
ఖులు మహాత్ములు నిత్యశూరులును బరమ
పారిషదులును బొగడి యపారమహిమఁ
జాల మన్నించి మన్నించి సంభ్రమించి.

257

వ.

దివ్యాప్సరోజనంబుల నియోగించిన వా రలంకించిన దివ్యోపచారం
బుల నుప్పొంగి వారలతోఁగూడ నాదరించి వాత్సల్యసౌలభ్యగుణాబ్ది
యైన నారాయణదేవుఁడు ప్రోషితాగతాపత్యాదిసాధారణప్రీతి నుపలా
లించిన దయాళువులై యాత్మేశదివ్యవిగ్రహకళాసుధాబ్ధి మునింగి
యాత్మేశదిదృక్షావీచివేగంబునం దేలి క్రియాంతరంబులు మఱచి
కృతకృత్యులై యూరకయుండి సముద్వద్భగవత్ప్రీతికర్షప్రేరితాం
తరంగులై హర్షపూర్వస్వమనస్తటాకానందహరిపరివాహంబులగు
తద్గుణస్తవంబు గావింప నుపక్రమించి రంత.

258


గద్యము.

పరమపురుష! జితంతే శ్రీనిధే! విశ్వచిదచిద్వస్తుధారక! సర్వ
వస్తుశరీర! స్వోచిత సర్వాభిధానతత్సర్వతత్వోత్కర్షార్థశ్రుతతాత్ప
ర్యార్థగోచరసద్బ్రహ్మాకాశాత్మశివనారాయణపదాన్విత! సతాత్పర్య
వేదాంతప్రతిపాదితమోక్షప్రదత్వవిఖ్యాతచరిత్ర! ఆత్మదాయక
యహేయతత్సంవిముఖాత్మకస్వప్రభా౽వ్యయ, అవ్యయజ్ఞాన
జ్ఞానశక్తిబలైశ్వర్యవీర్యతేజోభిరామపూర్ణవాత్సల్యసౌలభ్యసౌశీ
ల్యాదిగుణోన్నతయుక్తోపాయస్వరూప! ఏతద్గుణమాంగల్యప్రద!
అనాద్యనంతసంశుద్ధసర్వమంగళవిగ్రహ, శరత్ఫుల్లారవిందాంత
చ్ఛదోపమపదాంభోజశుభ్రద్యుతినఖజ్యోత్స్నాక్రాంతాంఘ్రిజిత
పంకజశోణాంఘ్రిద్యుతిసంఛిన్నసాంధేందునిభసన్నఖశోణశుభ్ర
శ్యామలాంఘ్రినఖతద్గుల్ఫదీప్తిమిశ్రపూర్వభాగోద్యదింద్రాయుధ
ఖనోపమసురాగశుక్లకృష్ణాంఘ్రినఖతద్గుల్ఫసంఛిన్నదీప్తికలిత
పాదానతశోణగంగాయమునావిభ్రమ శ్రీపాణిపల్లవాభిఖ్యాద్విగు
ణీకృతపదద్యుతే బద్ధపీతాంబరాంచలచుంబితాంఘ్రినఖద్యుతే
చారుపీతాంబరబహిస్ఫురజ్జంఘోరుప్రకాశహేమాంశుకోపరిస్ఫాయ
త్కటిసూత్రప్రభాంచితనాభికాసారసోపానవళీవదుత్పల్లవోదర
శ్రీభూభోగ్యాంగమధ్యస్థసీమరోమావళిరాజితసుశాణఖచితా
నర్ఘ్యమణియుగ్మోపమస్తనవిశాలోరస్థలస్ఫాయత్కౌస్తుభాభరణ
ప్రభాస్వదానాభిలంబిస్థూలముక్తాభరణచ్ఛవే శ్రీభూసంభోగ
పిశునాజానుబాహార్గళమహాభుజనిత్యావధీరితారక్తాబ్జదళపాణితల
ప్రభాజితరక్తోత్పలదళస్ఫురత్కరనఖావళీరత్నాంగుళీయకానర్ఘ్య

కటకాంగదభూషితకంబుగ్రీవార్పితమహాధనరత్నవిభూషణమాంస
లాంసస్ఫాయత్కరపాశస్ఫురన్మకరకుండలస్మిధిగ్ధింద్రనీల
వీజకప్రస్ఫురద్విద్రుమాధరవిరాజితోత్తరోష్ఠానురూపోత్తర
సునాసికశిరఃపరివేష్టనోత్సవోద్యుం, జానాంబుజేక్షణశ్రోతవారిత
పాశ్చాత్యసాంగోపాంగామవేక్షణసితాంభోజదళన్యస్తహరినీలాభ
తారకబహిస్ఫురత్తారకోస్రరాజపద్మవిరాజితప్రోద్యద్దీప్తిధునీ
నీలకేతుభూవిభ్రమభ్రమవిశాలపాలవిలసనచ్ఛుభ్రోర్వతిలక
ద్యుతే వికచద్వదనాంభోజభ్రమదానీలకుంతలమహేంద్రనీల
నీలోద్భాసికేశపాశమందారమాలికాంచితకోటిసూర్యప్రతీకాశ
మకుటోచ్ఛ్రితమస్తక శుభ్రస్మేరాస్య సుశిర సుకేశ సుశిఖాలక సుఫాల
సుభ్రూయుగళ సుకర్ల సులోచన సునాస సుకపోల సువిమలోష్ఠ
సుచుబుక సుకంఠ సువిశాలోరస్క సుఖోన్నతభుజప్రభో! స్వాజాను
బాహో సుకరతరసుపాణే, సునభాంగుళే, సుమధ్యమసురోమాళే
సునాభిజఘనస్థలశోభనాపరభాగాతిసుందరోరుకటిస్థలసుజాను
జంఘాగుల్ఫాతిసుందరాంఘ్రియుగాంబుజసుపాదనఖరజ్యోత్స్న
సుశ్రీశోభనవిగ్రహసధ్యాత్వభ్రమరస్తోమప్రభాకరశుభాకృతే
విజయీభవ.

259


సీ.

ఆపూర్ణశక్తిస్వరూపరూపగుణంబు
                       లిటువంటివి యని తా నెఱుఁగలేక
యాగమాంతము లెల్ల నప్రాకృతము లంచుఁ
                       దెలిసిన నాత్మలోఁ దెలివిలేక
కొందఱు మూఢులు గురుతత్వధీహిత
                       భావతావన్మాత్రదేవతోప
నిషదాగమములు కొన్ని యెఱింగికొని స్వమ
                       నీషానుసారైకనియతమహిమ


తే. గీ.

సమయములు చేసి రత్యంతసాహసమున
నఖిలవేదాంతతత్వరహస్యసార
మది వివేకింపలేక దురాత్ము లగుచు
నిట్లు కావింపుచున్నావా రేమి చెప్ప.

260

విష్ణువునకు సనకాదులు విన్నవించుట

వ.

మఱియు సనకాదు లిట్లు విన్నవించి రనంతకోటిసూర్యదివ్యప్రకాశ
స్వరూపలీలానిత్యవిభూతిస్థాయివై నారాయణ వాసుదేవ విష్ణు శివ
శంభు నామంబులఁ బూర్ణబ్రహ్మంబవు. జ్ఞానశక్తిబలైశ్వర్యవీర్య
తేజష్షడ్గుణైశ్వర్యసంపన్నుండవు. దేశకాలవస్తుపరిచ్ఛేదరహితుండవు.
స్వాధీనత్రివిధచేతనాచేతనుండవు. అనాదిదివ్యమంగళవిగ్రహుండ
వనంతకోటిమన్మథదివ్యలావణ్యుండవు. శ్రీభూనీలాసేవ్యుండవు.
నిత్యముక్తదర్శనీయుండవు. దివ్యర్షిహృత్పుండరీకవిహారివి.
అనంతకల్యాణగుణసాగరుండవు. దేశకాలవస్తుపరిచ్చేదరహి
తుండవు నైన నిన్నుఁ గొందఱు నిర్విశేషస్వభావంబైన చిన్మా
త్రునింగాఁ జెప్పుదురు. వస్తుస్థితిస్వాత్మాభిన్నస్వరూపునింగాఁ
దలంతురు. నీకు నుపనిషద్వేద్యంబైన హేమదివ్యమంగళవిగ్రహం
బుపాస్త్యర్థంబుగా నారోపింతురు. కొందఱు చిన్మాత్ర బ్రహ్మంబు
నకు విశేషంబులు కలుగంజెప్పుట యజ్ఞానం బ య్యజ్ఞానంబు బ్రహ్మ
స్వరూపం బయ్యెనేని భ్రాంతి నిత్యం బగును. అయ్యజ్ఞానకల్పం
బైన వస్తువు బ్రహ్మంబునకంటె నన్యం బయ్యెనని యద్వైతంబు
గూడదు. బహ్మంబునకంటె వేరై మఱియుఁ గల్పింపఁబడిన యజ్ఞా
నంబు కల్పకంబై చిన్మాత్రాశ్రయం బౌట న్నిట్లుండి యన్యం బయ్యె
నేని దానికి నాకారనామంబులు ప్రకాశింపకుండుటం జేసి యంగీక
రింపరు. ప్రత్యక్షాదులచేతను గలదనియెడు బుద్ధి గలగెనా సత్యంబు
గావున కల్పింపఁదగిన యదియనుట యుక్తంబుగాదు. ప్రత్యక్షాదుల
చేతనే లే దనియెడి బుద్ధి గలిగెనేని యది లేకుండుట సిద్ధం బయ్యె.
ప్రత్యక్షాదిప్రమాణగుణంబు దానిం దెలియించునదియుం గాదు. తెలి
యించనియదియునుం గాదని యంటిమేని యదియుం బ్రమాణంబె కాదు.
జ్ఞాత యైనవాఁడు తెలియందగిన వస్తువు నొక్కవిధంబునం దెలిసి
తెలియనివాని బోధింపఁబూను నజ్ఞానకల్పకబుద్ధి ప్రకాశకం బని
యెడు నదియుంగూడ దిప్పు డద్వైతమతంబునందు భ్రాంత్యుపాదాన
కారణంబు నిర్వచించి చెప్పరాదు గాన నజ్ఞాన కల్పకభ్రాంతి యజ్ఞా
నంబ యనంగలిగెనేని యంటివేని వ్యుత్పత్తియందు నన్యోన్యాశ్రయ
చక్రాశ్రయదోషంబులు వచ్చునని యుక్తదోషశాంతికినై యజ్ఞానంబు

స్వపరనిర్వాహకం బంటిమేని యద్వైతమతంబునందు నజ్ఞానంబు
తానును బరంబు గలదనునది సంభవింపదు. ఆజ్ఞానంబు గలిగెనా
యద్వైతంబుఁ జెఱచు నిందుకు సందేహంబు లేదు. సత్యంబైన
తనకుఁ సత్యంబైన పరంబునకు నిర్వాహత్యంబు చెప్పవచ్చు నద్వైత
మతంబునందు నజ్ఞానంబు తాన సత్యంబు గనుక పరంబున సత్యం
బగుటం జేసి స్వపరనిర్వాహం బొనఁగూడదు. సన్మాత్రబ్రహ్మంబు
నందు నారోహింపఁబడిన యజ్ఞానంబు బ్రహ్మాధిష్ఠానసత్వంబుచేత
సత్యమై ప్రకాశింపుచున్నయది గావున నారోపితసత్వంబుచేత ద్వైత
భంగంబు లేదని యంటివా యన్వయించిన సుతదారోపహేతువివేకంబు
లేకయుండుటం జేసి యీప్రకారంబు గాదా యజ్ఞానంబు బ్రహ్మంబు
నందు నారోపింపఁబడియెనని యది భేదప్రమోపాధి గాదు. ముఖం
బునకంటె వేరై కాన్పించు దర్పణంబు ముఖభేదభ్రమంబునందు
సాధియైనట్ల జ్ఞానంబు బ్రహ్మంబునకంటె వేరై భేదంబు దోఁచిన యది
గాదు. కావున నుపాధియుఁ గాదు. శుక్తియందు నారోపింపఁబడిన
రజతం బాశుక్తికంటె వేరై తోఁచనియట్ల బ్రహ్మంబునందు నారోపిం
పంబడిన యజ్ఞానంబు బ్రహ్మంబునకంటె ముకురంబువలె స్వైకతా
నత్వభంగంబునం జేసి యజ్ఞానం బుపాధి యగునని బ్రహ్మంబున
కంటె వేఱైన సత్తయును వేఱైన జ్ఞానంబును లేనిదానికి నుపాధింపం
దగదు, సన్మాత్రబ్రహ్మ మాయాజ్ఞానంబుఁ గల్పించునదియును
జ్ఞానంబుఁ గల్పించునదియును నంటిమేని సన్మాత్రబ్రహ్మంబు
తా నటువంటిదికాదు కావునఁ గూడదు. ఇటులంగాక బ్రహ్మంబె
యజ్ఞాననత్తాజ్ఞప్తులు పుట్టించెనేని ముక్తి సంభవింపకపోవు నద్వితీ
యంబైన సన్మాత్రంబునకుఁ బరంబువలన నిటువంటి బుద్ధి పుట్టించు
టయునుం గూడదు కావున పరంబునకు స్వతస్సత్వంబు గలిగెనేని
యద్వైతంబు సత్తని పల్కరా దది కావున.

261


శా.

కుబ్జానిర్భరరామణీయకకళాకూలంకషోల్లాస గో
గుబ్జావప్రదసత్కృపాంబునిధి రక్షోమానదానోగ్రచ
క్రాబ్జార్యస్త్రవిరాజమాన భుజసద్యస్కాలసంసేవకా
స్యాబ్జాంభోరుహమిత్ర దృష్టికులరక్షాయత్తచిత్తాంబుజా!

262

క.

భోజ్యాధమమన్మథసా
మ్రాజ్యాధికభోగభాగ్యమతిసజ్జనసం
పూజ్యాతులవైభవ దితి
జాజ్యాగ్రహనిత్యజాగ్రదరి రాజేంద్రా.

263


మాలిని.

సమసమదవిదారీ! సద్గుణోల్లాసదారీ!
సమధికగుణభావా! సారవిద్యాప్రభావా!
కుముదహితకులేశా! కుంఠితాఘౌఘలేశా!
సమధికజయహారీ! సౌరభూజాపహారీ!

264

గద్యము
ఇది శ్రీమత్కంజర్ల కొండమాచార్య
పాదారవిందమిళిందాయమాన చెన్నయామాత్యపుత్ర
కశ్యపగోత్రపవిత్ర శ్రీమదల్లాడు నరసింహప్రణీతంబైన
నారదీయపురాణంబునందు షష్ఠాశ్వాసము
సంపూర్ణము.

  1. వచనము తరువాత “ఇట నొకపత్రము కానరాదు" అని యొకపత్రము మూలమునందే లుప్తమైయున్నట్లు ప్రతి వ్రాసినవారు పేర్కొనిరి.
  2. ఆటవెలది గీతముగా పేర్కొనఁబడినది.
  3. జనులు
  4. అక్షరలోపము పూరింపఁబడినది.
  5. కూలైక. (మూ)
  6. ఎవ్వనిఁ జూచి నిజేక్షణములఁ ద్రిప్పి.... (మూ) ఇందు సీసపాదము పూర్తి
    కాలేదు. అంతేకాక ఆఱవగణము జగణమైనది.
  7. బూను
  8. మంద్రు
  9. తెలివిపర్వనోదయాళులు గుణాఢ్యులు సర్వ (యతి, గణ భంగములు)
  10. అర్థాన్వయముకొఱకు "పొందు" ఉండవలయును.
  11. కర్మం బన నాద్యవిద్యవలన
  12. కన్నిష్టు
  13. ఉదహరించెను
  14. వేదపురుషుం డే నెఱుంగుదు
  15. మచ్యుతనివలన - గణభంగము
  16. ప్రత్యద్వారపాలకులు
  17. నెసంగె (రోమహర్షణుఁ డనుపేరు వ్యాసునకు లేదు కావున నొసంగెగా మార్పు గావింపబడినది.)
  18. మో
  19. లె
  20. కవ్యాధు
  21. తిలకించున్
  22. గాదే
  23. శృతి
  24. నంద్రు
  25. అంత
  26. కులై
  27. దోష మింతెని
  28. రహస్తం బీ
  29. మోహతములు
  30. యవహతపాప్మా
  31. సకల్ప
  32. యంతర్యామి
  33. మోనై
  34. లొండు
  35. నాల్గవపాదము లేదు.
  36. రాజిత
  37. ముక్తేస్శర స్శింధ
  38. .......,
  39. దృచి
  40. రూయత
  41. గంధస్థల
  42. పూర్ణోతరోష్టాచితోత్తుంగ
  43. గతులు
  44. పరాపరుని
  45. కొని
  46. పురుషోత్యు
  47. నర్చ
  48. చే
  49. యనిన
  50. భరతుఁడై
  51. ళా
  52. సి
  53. నజరాదులకైన
  54. నౌనె