Jump to content

నాగర సర్వస్వం/స్త్రీ పురుష జాతిభేదములు

వికీసోర్స్ నుండి



స్త్రీ పురుష జాతిభేదములు


లోకంలో స్త్రీజాతి ఉన్నది. పురుషజాతి ఉన్నది. " స్తనకేశ సత్ స్త్రీస్యాత్ లోమశః పురుషః స్మృతః " అన్నారు. అనగా స్తనములు, కేశములు స్త్రీజాతిలక్షణాలు. రోమసంపద (గడ్డము, మీసము) పురుషలక్షణములు. యిలారెండుగావున్న యీజాతులయందు ప్రధానలక్షణాలు సమంగావున్న కొన్ని కొన్ని తేడాలు కనబడుతూ వుంటాయి. ఆతేడాలనుబట్టి యీ రెండుజాతులను తిరుగ మూడేసి తెగలుగా విభజించారు. ఈ విభాగానికి ప్రధానలక్షణాలు పురుషాంగము, స్త్రీయొక్క యోని అయిఉన్నాయి. పురుషులందరియొక్క పురుషాంగములు సమానమైన పరిమాణం (పొడవు) కలిగిఉండవు. అట్లే స్త్రీలయొక్క యోనులుకూడా అన్నీ ఒకేవిధంగా ఉండవు. వానియొక్క లోతులలో తేడాలు ఉంటాయి. కొందరు పురుషులకు పురుషాంగము ఆరుఅంగులముల పొడవుకలదిగావుంటే కొందరి పురుషాంగము తొమ్మిదిఅంగులముల పొడవు కలిగివుంటుంది. కొందరి పురుషాంగము సుధీర్ఘమై పండ్రెండు అంగుళముల పొడవు కలిగివుంటుంది. ఇందు ఆరుఅంగుళముల పొడవుగల పురుషాంగముకలవారు శశజాతి పురుషులు అనబడతారు. తొమ్మిది అంగుళముల పురుషాంగముకలవారు వృషభజాతి వారనబడతారు. పండ్రెండు అంగుళముల పురుషాంగముకలవారు అశ్వజాతి పురుషులుగా పేర్కొనబడతారు.

ఇట్లే ఆరుఅంగుళములు మాత్రమే లోతైన యోనికల స్త్రీలు హరిణీ జాతివారనియు, తొమ్మిది అంగుళముల లోతైన యోనికల స్త్రీలు బడబాజాతి స్త్రీలనియు, మిక్కిలి యెక్కువగా 12 అంగుళముల వరకు లోతైన యోనికలస్త్రీలు హస్తినీజాతి స్త్రీలనియు చెప్పబడతారు.

అయితే యీలక్షణాలు ఆ స్త్రీ పురుషులను చూచీచూడగానే తెలియబడేవి కావుకదా ! అందుచే ఆయా జాతులయొక్క ప్రధాన లక్షణాలు గుహ్యవయవ పరిమాణములే అయిఉన్నప్పటికి కొన్ని బాహ్య లక్షణాలుకూడా చెప్పబడుతున్నాయి.

శశజాతిపురుషులు:- ఈజాతిపురుషుల శరీరం కాంతిమంతమై ఉంటుంది. వీరుఎల్లప్పుడు సంతోషంగావుండే స్వభావంకలవారై చిరునవ్వు నవ్వుతూవుంటారు. వీరి పలువరుస చక్కగా ఎగుడు దిగుడులులేక సమంగా ఉంటుంది. మధురంగా మాటాడడం వీరిసొత్తు. వీరి ముఖం గుండ్రంగావుంటుంది. చేతివ్రేళ్ళు చాచినప్పుడు ఆవ్రేళ్లసందులు కనబడక మాంసలములై వుంటాయి. పలుచని పాదాలు, పలుచని నడుము, పలుచనైన చెవులు కలిగి వీరుమిక్కిలి సుకుమారంగా వుంటారు. వీరియొక్కవీర్యం సువాసనా భరితమై వుంటుంది.

వృషభజాతి పురుషులు:- ఈ జాతి పురుషుల శరీరముకూడ కాంతిమంతముగానే ఉంటుంది. కాని వీరు శశజాతి పురుషులవలె సుకుమారంగా కాక తగినంత పుష్టికలవారై ఉంటారు. వీరి మెడ స్థూలంగా ఉంటుంది. వీరి చేతులు పాదాలు కూడ ఎఱుపులు చిమ్ముతూ ఉంటాయి. వీరి నేత్రాలలో చాంచల్యం ఉండదు. కన్నులలో స్థిరత్వమే ఎక్కువ కనబడుతుంది. కంటి రెప్పలకు దట్టముగ రోమాలు ఉంటాయి. వీరి కడుపు తాబేటి కడుపును పోలిఉంటుంది. మాటలు మృదువుగా ఉంటాయి. మొత్తానికి శరీరంలొని అన్ని భాగములయందు క్రొవ్వునిండి ఉండి వీరు చాల పుష్టిగా కానవస్తారు.

అశ్వజాతిపురుషులు:- పై శశజాతి వృషభజాతి పురుషుల కంటె వీరు భిన్నంగా ఉంటారు. వీరి శరీరం కాంతిమంతమై ఉండదు. శరీరములో తగినంత పుష్టికూడ ఉండదు. వీరిశరీరావయవాలు మిక్కిలి పొడవుగా ఉండి తగినంత మాంసములేనివై కృశించినట్లు ఉంటాయి. ముఖ్యంగా ముఖము, చెవులు, శిరస్సు, పెదవులు వీనియందు ఈ దీర్ఘత్వము కృశత్వము గోచరిస్తాయి. వీరి తలమీద జుట్టు దట్టంగా వుంటుంది. అవయవాలన్నీ కూడ కొంతకు కొంత వంకరగా వుంటాయే కాని చక్కగా తీర్చి దిద్దినటులుండవు. కాలి పిక్కలయందు, పాదముల ఈ వక్రత అధికంగా కానవస్తూంది. వీరివ్రేళ్ళు పొడవుగా వుంటాయి. కంఠధ్వని మేఘధ్వనిని (ఉరుము) పోలి వుంటుంది. నేత్రాలు చంచలంగా వుంటాయి. తొడలు బలిసివుంటాయి వీరు వేగంగా నడచేవారై వుంటారు. ఈ లక్షణాలుకలవారిని అశ్వజాతి పురుషులుగా గుర్తించాలి.

హరిణీజాతి స్త్రీలు:- ఈ జాతి స్త్రీలు లలితమైన శరీరము కలిగివుంటారు. వీరిశరీరము సన్నగా ఉంటుంది. శరీరచ్ఛాయ సాధార ణంగా చామనచాయ అయివుంటుంది. చంద్రదర్శనంవలె వీరిదర్శనం కన్నులకు మనస్సుకు చల్లదనం చేకూర్చేదై వుంటుంది. వీరి దంతాలు మాత్రం పెద్దవిగా వుంటాయి. కంఠధ్వనిపెద్దదిగా ఉండదు, శిరస్సుపై జుట్టు దట్టంగా వుంటుంది. శరీరం శ్లేష్మతత్త్వ ప్రధానమై వుంటుంది. ఈ జాతి స్త్రీలు ఆహారం స్వల్పంగా స్వీకరించేవారై వుంటారు. వీరికపాల భాగము గూఢంగా వుంటుంది. ముఖము నున్నగా వుంటుంది. రతివేళ వీరియోనినుండి స్రవించేరజస్సు సునాసనలు చిమ్ముతుంది. ఇట్టిలక్షణాలుకల స్త్రీలను హరిణీజాతి స్త్రీలుగా గుర్తించాలి.

బడబాజాతి స్త్రీలు:- ఈజాతి స్త్రీల శరీరం పచ్చగా వుంటుంది. వీరి శరీరము పిత్త (పైత్య) తత్త్వప్రధానమైనది. బలిసి కఠినంగా వుండే స్తనద్వంద్యం కలిగి వుండడం యీ జాతిస్త్రీల సహజలక్షణం. వీరి చేతి యెముకలు, కాలి ఎముకలు, మడతకీళ్ళు, మడములు కొంచెం వంకర తిరిగి వుంటాయి. చేతులు మృదువుగా మాంసలములై పుష్టిగా వుంటాయి. వీరికి చెమట యెక్కువ. సన్నని నడుము సమానములైన అవయవములు కలిగి యీజాతి స్త్రీలు మెరుపు దీవలవలె మన్మధుని చికిలిచేసిన శస్త్రాలవలె మెఱుస్తూ ఉంటారు. రతివేళ వీరియోనినుండి స్రవించేరజస్సు మాంసముయొక్క వాసనవంటి వాసనకలదిగా ఉంటుంది.

హస్తినీజాతి స్త్రీలు:- యీజాతి స్త్రీలు మిక్కిలిపొడవుగా వుండరు, కొంతకుకొంత పొట్టివారనియే నిర్ణయం. లావుగా మాత్రం వుంటారు. వీరితలమీద వెండ్రుకలు నల్లగా వుంటాయి. అంతేకాదు ప్రతి వెండ్రుక మిక్కిలి లావుగా వుంటుంది. వీరి శరీరచ్ఛాయ ఎఱుపు. శరీరతత్త్వం వాత ప్రధానంగా వుంటుంది. బలిసినచేతులు, పాదాలు కలవారై ఒకప్పుడు చల్లగా, వేరొకప్పుడు వెచ్చగా వుండే శరీరము కలవారై, యెక్కువగా మాట్లాడే స్వభావము కలవారై యీజాతి స్త్రీలు చంచలంగా వుంటారు. వీరిశరీరంలో క్రొవ్వుచాల ఎక్కువగావుంటుంది. వీరియోని అధికమైన రోమపంక్తితో నిండివుం టుంది. రతివేళ వీరియోనినుండి స్రవించే రజస్సు ఏనుగుమదముయొక్క వాసన కలిగివుంటుంది. ఇట్టిలక్షణాలుకల స్త్రీలను హస్తినీజాతి స్త్రీలుగా గుర్తించాలి.

యీ బాహ్యలక్షణాలు ఆధారంగా శశ-వృషభ-అశ్వజాతి పురుషులను, హరిణీ-బడబా-అశ్వజాతి స్త్రీలను సులభముగా గుర్తించి తెలిసికొనవచ్చును. కాని యీ లక్షణాలుకంటె గుహ్యావయవ పరిమాణాలే ప్రధానమైనవి.

ఒకపురుషుని బహిరాకారం అశ్వజాతి పురుషుని లక్షణాలు కలిగివున్నది. కాని రతివేళ పరిశీలింపగా అతని పురుషావయము స్థూలము, సుదీర్ఘముకాక కోమలంగా ఆరుఅంగుళముల పొడవుకలదిగా గోచరించింది. అప్పుడాతని బాహ్యలక్షణాలు ఎలావున్నా అతడు శశజాతి పురుషుడనియే నిర్ణయించాలి.

అట్లే బాహ్యలక్షణములన్నియు హస్తినీ జాతిస్త్రీకి తగువున్నప్పటికి చిన్నవైన కక్షభాగములు (చంకలు) చిన్నవైన పాదములు కలిగి పెద్దముఖము, పెద్ద స్తనములు ఆమెకు అమరివుంటే ఆమెను హస్తినిగాకాక, హరిణిజాతి స్త్రీగా గుర్తించాలి.

రతిభేదములు

వెనుక ప్రకరణంలో మూడేసిరకాలుగా చెప్పబడిన యీ స్త్రీ పురుష జాతులమధ్య యేర్పడే రతిభేదాలు ప్రధానంగా ఐదురకాలుగా ఉన్నాయి. ఈభేదములు వీరి గుహ్యావయవ ప్రమాణములు భిన్నంగా వుండుటవలన ఏర్పడతాయి. యీ రతిభేదములు 1 సమరతి 2 ఉచ్ఛరతి 3 నీచరతి 4 అత్యుచ్ఛరతి 5 అతినీచరతి అని పిలువబడతాయి.

1 సమరతి:- హరిణీజాతి స్త్రీతో శశజాతి పురుషుని సంయోగము సమరతి అనబడుతుంది. ఎందుచేతననగా హరిణీజాతి వనిత యోనియొక్క లోతు ఆరుఅగుళములుకాగా, శశజాతిపురుషుని పురుషాంగముకూడ ఆరు అంగుళములే ప్రమాణము కలదైవుంటుంది. అం