నాగర సర్వస్వం/రతిభేదములు

వికీసోర్స్ నుండి

టుంది. రతివేళ వీరియోనినుండి స్రవించే రజస్సు ఏనుగుమదముయొక్క వాసన కలిగివుంటుంది. ఇట్టిలక్షణాలుకల స్త్రీలను హస్తినీజాతి స్త్రీలుగా గుర్తించాలి.

యీ బాహ్యలక్షణాలు ఆధారంగా శశ-వృషభ-అశ్వజాతి పురుషులను, హరిణీ-బడబా-అశ్వజాతి స్త్రీలను సులభముగా గుర్తించి తెలిసికొనవచ్చును. కాని యీ లక్షణాలుకంటె గుహ్యావయవ పరిమాణాలే ప్రధానమైనవి.

ఒకపురుషుని బహిరాకారం అశ్వజాతి పురుషుని లక్షణాలు కలిగివున్నది. కాని రతివేళ పరిశీలింపగా అతని పురుషావయము స్థూలము, సుదీర్ఘముకాక కోమలంగా ఆరుఅంగుళముల పొడవుకలదిగా గోచరించింది. అప్పుడాతని బాహ్యలక్షణాలు ఎలావున్నా అతడు శశజాతి పురుషుడనియే నిర్ణయించాలి.

అట్లే బాహ్యలక్షణములన్నియు హస్తినీ జాతిస్త్రీకి తగువున్నప్పటికి చిన్నవైన కక్షభాగములు (చంకలు) చిన్నవైన పాదములు కలిగి పెద్దముఖము, పెద్ద స్తనములు ఆమెకు అమరివుంటే ఆమెను హస్తినిగాకాక, హరిణిజాతి స్త్రీగా గుర్తించాలి.

రతిభేదములు

వెనుక ప్రకరణంలో మూడేసిరకాలుగా చెప్పబడిన యీ స్త్రీ పురుష జాతులమధ్య యేర్పడే రతిభేదాలు ప్రధానంగా ఐదురకాలుగా ఉన్నాయి. ఈభేదములు వీరి గుహ్యావయవ ప్రమాణములు భిన్నంగా వుండుటవలన ఏర్పడతాయి. యీ రతిభేదములు 1 సమరతి 2 ఉచ్ఛరతి 3 నీచరతి 4 అత్యుచ్ఛరతి 5 అతినీచరతి అని పిలువబడతాయి.

1 సమరతి:- హరిణీజాతి స్త్రీతో శశజాతి పురుషుని సంయోగము సమరతి అనబడుతుంది. ఎందుచేతననగా హరిణీజాతి వనిత యోనియొక్క లోతు ఆరుఅగుళములుకాగా, శశజాతిపురుషుని పురుషాంగముకూడ ఆరు అంగుళములే ప్రమాణము కలదైవుంటుంది. అం దుచే వీరిరతి సమరతి అనబడుతుంది. ఇట్లే బడబాజాతి స్త్రీలకు, వృషభజాతి పురుషులకు మధ్యఏర్పడేరతి, హస్తినీజాతి స్త్రీలకు, అశ్వజాతి పురుషులకు మధ్య యేర్పడేరతి కూడ-సమరతులనియే అనబడతాయి. కారణము వారి గుహ్యాంగముల ప్రమాణము సమాణముగనుండుటయే, ఈవిధముగ యీసమరతి మూడురకాలుగా కానవస్తుంది.

2 ఉచ్చరతి :- హరిణీజాతిస్త్రీ తనతో సమానుడైన శశజాతి పురుషునితో గాక ఇంచుకమీదివాడైన వృషభజాతి పురుషునితో కలసినపుడు ఏర్పడేరతి ఉచ్చరతి అనబడుతుంది. ఎందువల్లననగా ఇచ్చట హరిణీజాతి స్త్రీయొక్క యోని ఆరు అంగుళములు మాత్రమే లోతుకలదికాగా అందు సంవిశితం చేయబడే వృషభజాతి పురుషుని పురుషాంగము తొమ్మిది అంగుళములు పొడవు కలదై వుంటుంది. యీ విధముగనే బడబాజాతి స్త్రీ తనకు సమానుడైన వృషభజాతి పురుషునితోగాక ఇంచుకమీదివాడైన అశ్వజాతి పురుషునితో కలిసి రమించినపుడు ఆ రమణముకూడ ఉచ్చరతి అనియే అనబడుతుంది. యోనికంటె పురుషాంగము పెద్దదగుటయే ఇచ్చటను కారణము. ఈ విధముగా ఉచ్చరతులు రెండురకాలుగా వున్నాయి.

3 నీచరతి :- శశజాతి పురుషుడు తనకు సమానమైన హరిణీజాతి స్త్రీతోకాక ఇంచుక మీదిదైన బడబాజాతి స్త్రీతో కలిసి రమించినపుడు ఆ రతి నీచరతి అనబడుతుంది. ఇచ్చట పురుషాంగము ఆరుఅంగుళముల ప్రమాణముకలదికాగా యోని తొమ్మిది అంగుళముల లోతుకలదై ఇంచుక పెద్దదైయున్నందున యీరతి నీచరతి అనబడినది. ఇట్లే వృషభజాతి పురుషుడు హస్తినీజాతి స్త్రీతో సంగమించగా ఏర్పడే రతికూడ నీచరతి అనియే అనబడుతుంది ఇచ్చటకూడ పురుషాంగముకంటె స్త్రీయొక్కయోని ఇంచుక ఎక్కువ లోతుకలదిగా నుండుటయే కారణము. యీవిధముగా నీచరతికూడ రెండురకములై ఉన్నది. 4 అత్యుచ్ఛరతి :- అశ్వజాతి పురుషుని పురుషాంగము పండ్రెండు అంగుళముల ప్రమాణముకలదైఉంటుదని వెనుక చెప్పబడినది. ఆ పురుషుడు యోనియొక్కలోతు కొంచెము తక్కువకాక బాగా తక్కువ, ఆరుఅంగుళములు మాత్రమే లోతుకల హరణీజాతి స్త్రీతో సంగమించినపుడు ఆరతి అత్యుచ్చరతి అనబడుతుంది. యోనికంటె పురుషాంగము రెట్టింపు ప్రమాణముకలదై ఉండుట దీనికి హేతువు. యీ అత్యుచ్చరతి యీ ఒక్కచోట మాత్రమే ఏర్పడుతుంది.

5 అతినీచరతి :- శశజాతిపురుషుని పురుషాంగము ఆరు అంగుళముల ప్రమాణముకలదై ఉంటుందని వెనుక చెప్పబడినది. అట్టి పురుషుడు తన పురుషాంగముకంటె రెట్టింపులోతు (పండ్రెండు అంగుళములు) యోనికలదైన హస్తినీజాతి స్త్రీతో కలిసి రమించినపుడు ఆ రతి అతినీచరతి అనబడుతుంది. ఇచ్చట యోనికంటె పురుషాంగము ప్రమాణములో మిక్కిలి చిన్నదికదా! అందుచేతనే ఇది అతినీచరతి అనబడినది. ఈరతిభేదము యీ ఒక్కచోట మాత్రమే ఏర్పడుతుంది.

ఇట్లున్న యీరతిభేదాలు మొత్తము తొమ్మిది రకాలుగా ఉన్నాయి.

సమరతి ఉచ్చరతి నీచరతి అత్యుచ్చరతి అతినీచరతి
హరిణీ-శశ 6-6 హరిణీ-వృషభ 6-9 బడబా-శశ 9-6 హరిణీ-అశ్వ 6-12 హస్తినీ-శశ
బడబా-వృషభ 9-9 బడబా-అశ్వ 9-12 హస్తినీ-వృషభ 12-9
హస్తినీ-అశ్వ 12-12

అయితే యీ రతులన్నిటియందు స్త్రీపురుషులకు ఉభయులకు సర్వధా సుఖాన్ని అందించే రతిఏది? అన్నప్రశ్న కలుగడం సహజం. దీనియొక్క సమాధానము తెలియుటకు ముందు స్త్రీయొక్క యోనిని గూర్చి కొంత తెలియాలి. స్త్రీల యోనియందు వారి నెత్తుటినుండియే పుట్టినవైన సూక్ష్మక్రిములు ఉంటాయి. అవి యోనియందొక రకమైన దురదను కలిగిస్తాయి. ఆ దురద పురుషాంగముయొక్క ఘట్టనవల్ల తొలగేదై వుంటుంది. ఈ దురద తత్కాలంలో పూర్తిగా తొలగినపుడు స్త్రీ యోని నుండి రజస్సు స్రవిస్తుంది. యీ రజస్సు స్రవించినంతనే స్త్రీలు తృప్తిచెందుతారు. తత్కాలములో రతిని కోరుకొనరు. అయితే యోని యందు జన్మించే సూక్ష్మక్రిములు దురదను కల్పించే శక్తిలోకూడ తేడా వుంటుంది. కొన్ని క్రిములు సాధారణమైన దురదనుమాత్రమే కలిగిస్తాయి, కొన్నిటియొక్క శక్తి అంత తక్కువగాకాక మధ్యమంగా వుంటుంది. కొన్ని తీవ్రమైన శక్తికలవై యోనియందు ఎక్కువ దురదను జనింప జేస్తాయి.

ఇలా యీ క్రిములు మూడురకాలుగా ఉన్నాయి. వీనిలో అల్పమైన దురదను జనింపజేసే క్రిములుకలిగిన యోనికల-స్త్రీ రతివేళ తొందరగా తృప్తిచెందే లక్షణం కలదైవుంటుంది. అనగా తొందరగా రజస్సును స్రవిస్తుంది. మధ్యమమైన దురదను కలిగించే క్రిములు కలిగిన యోనికల స్త్రీలు అంత తొందరగా తృప్తిచెందరు; కాని మరీ సుదీర్ఘమైన రతినికూడ వాంఛింపరు. మధ్యమంగా తృప్తిచెందుతారు.

ఇక తీవ్రమైన దురదను జనింపజేసే క్రిమిజాతముతో నిండిన యోనికల స్త్రీలు దీర్ఘకాలిక రతికిగాని తృప్తి చెందజాలనివారై ఉంటారు.

సమరతులయందు స్త్రీయొక్క యోనికి తగిన పరిమాణములో పురుషాంగము ఏర్పడిఉంటుంది. అందుచే స్త్రీయొక్క యోని యందలి దురద సుఖంగా తొలగుతుంది. పురుషునకు కూడ ఆరతి మిక్కిలి సుఖకరంగా వుంటుంది. యీ కారణముచే సమరతి ఉత్తమమైనది; స్త్రీపురుషుల కిద్దరకు సమాన సుఖకరము అయివున్నది. ఉచ్చరతియందు స్త్రీయొక్క యోనికంటె పురుషాంగము పెద్దదై వున్నందున యోనియందలి దురద తొలగుటలో కొంత సుఖము ఏర్పడి వున్నప్పటికి స్త్రీ కొంత భాదనుకూడ అనుభవించేదై వుంటుంది. పురుషునకు కూడ సమరతివలె యీ వుచ్చరతి చాలినంత తృప్తిని కలిగించదు. అందుచే యీ వుచ్చరతి సమరతి తరువాత పేర్కొనదగినదై వుంటుంది.

ఇక నీచరతియందు పురుషాంగముయొక్క ప్రమాణము మిక్కిలి తక్కువై వుండుటచే స్త్రీయొక్క యోనియందు తగినవిధంగా ఘట్టనం ఏర్పడే అవకాశమేలేదు. అందుచే అచ్చట పురుషుడు ఎంతశ్రమించినా స్త్రీయొక్క యోనియందలి దురద తీరదు. ఆమె తృప్తిచెందుటకు అవకాశము వుండదు.

అత్యుచ్చరతియందు స్త్రీకి కేవలము బాధమిగులుతుంది. అతినీచరతియందు ఆమెకు తృప్తికలిగే అవకాశము అసలేలేదు.

అందుచే సమరతి ఉత్తమమైనదని, వుచ్చరతి ద్వితీయ పక్షమని మిగిలిన రతులు వుభయ సుఖకరములు కావని గుర్తించాలి. పురుషుడు కామశాస్త్రములు చదివినవాడై తానేజాతికి చెందినవాడో గుర్తించి, తనకు తగిన జాతిస్త్రీని పరిణయమాడినపుడు మాత్రమే నిజమైన దాంపత్య సుఖము అనుభవింప గలుగుతాడు.

రతియందు తనకు తృప్తికలిగించే పురుషునియందు స్త్రీ మిక్కిలి మక్కువకలదై వుంటుంది; నగలు, సొమ్ములు మొదలగునవి ఎన్ని ఇచ్చినప్పటికి రతియందు తనను తృప్తి పరుపజాలని భర్తయందు స్త్రీలకు అనురాగం వుండదు. ఎవని సాంగత్యములో స్త్రీ పరవశయై రజస్సును స్రవిస్తుందో ఆ పురుషునియం దామె యొక్క ప్రేమ అనంతమై వుంటుంది. అట్టివాడైన భర్తయొక్క వియోగాన్ని క్షణకాలముకూడ సహించలేదు. ఒకవేళ విధివశమున వారికి వియోగమే ఏర్పడితే ఆ స్త్రీ జీవింపదు. వెంటనేకాకపోయినా కొలది కాలానికే మరణిస్తుంది.

ఇక ఆమెకు భర్తవలన రతియందు తృప్తి లేనప్పుడు ఆమె భర్తను ప్రేమించదు. సరికదా అతని హితాన్ని కూడ కోరదు, మీదు మిక్కిలి అతని వినాశాన్ని కోరుకొంటుంది. కొన్ని కొన్ని చోట్ల అట్టి స్త్రీలు భర్తను చంపినట్లు కూడ ప్రాచీన కామశాస్త్రాలు తెలుపుతున్నాయి.

అందుచే పురుషుడు రతియందు కేవలము తన తృప్తిని మాత్రమేకాక భార్యయొక్క తృప్తినికూడ గమనించి వర్తించాలి. తాను మృదువై, పొట్టిదైన పురుషాంగము కలవాడైనపుడు, తొందరగా వీర్యస్రావం చేసేవాడైనపుడు-తన పురుషాంగము దృఢముగా వుండుటకు, తనవీర్యము తొందరగా స్ఖలితముకాకుండ కాపాడుకొనుటకు తగిన వైద్యునితో సంప్రదించుట అవసరం. ఈ విషయమై యీ శాస్త్రములో కొన్ని ఔషధ ప్రక్రియలు చెప్పబడ్డాయి. కాని అవి అందుబాటులో వుండేవికావు. పైగా వానియొక్క ఉపయోగములో ఇంచుక తేడావస్తే ప్రమాదించే పరిస్థితులున్నాయి. అందుచే వానిని యీ అనువాదములో చెప్పుటలేదు.

కాగా పురుషుడు రతియందు భార్యను తృప్తిపరుపజాలని వాడైనపుడు సంకోచింపక తగినవైద్యునియొక్క సహాయం అర్థించడం అవసరం.