నాగర సర్వస్వం/విరుత భేదములు

వికీసోర్స్ నుండి

ధ్వనులతో తన బాధను వ్యక్తంచేస్తుంది. ఈ ధ్వనులకు విరుతములని పేరు. అవి ఈదిగువ ప్రకరణములో వివరింపబడుతున్నాయి.

విరుత భేదములు

విరుతము అనగా విశేషధ్వని. సంభోగవేళ భార్యను తాను హేలగా తాడించగా ఆమె 'అమ్మా-ఇస్‌' మొదలగు విరుతాలను ఆచరిస్తే వానిని వినుటచే భర్తయొక్క హృదయములో ఏదో తెలియని ఆనందరేఖ నర్తిస్తుంది. అట్టి ఆనందమును కలిగించున దగుట చేతనే విరుతము ఆలింగన మాదిగాగల రతిభేదములయం దేడవ రతి భేదముగా చెప్పబడినది. ఈ విరుతభేదములు మొత్తము ఏడు. వానిలో మొదటిది స్తనితము.

1. స్తనితము :- స్తనితము అనగా మేఘధ్వని. అనగా ఉరుము. సంభోగసమయమున భర్త భార్యకు కొంచెము నొప్పి తోచునట్లు వర్తించినపుడు కృతకమైన కోపముతో ఆమె "ఊ, ఊ" అని పలికితే ఆధ్వని విశేషము స్తనితము అనబడుతుంది. అలా కోపసూచనకై ఉచ్చరించే ఊకారము జఠరదేశమునుండి ఊర్ధ్వశ్వాసతో వ్యక్తం అవుతుంది. ఈధ్వని మేఘధ్వనిని పోలినదగుటచే దీనికి 'స్తనితము' అను పేరేర్పడినది.

2. కూజితము :- పక్షులు ఆచరించే ధ్వని విశేషములు కూజితము అనబడుతాయి. కూత అను శబ్దము కూజిత శబ్దము నుండియే జన్మించినది. రతివేళ భార్య తృప్తిచెందినపుడామె కంఠమునుండి ఆమెకు తెలియకయే - మిక్కిలి ఉత్సాహముగానున్న పావురముయొక్క "కువకువ" ధ్వనిని పోలినధ్వని జనిస్తుంది. ఈధ్వని విశేషము ఆమెయొక్క పరితృప్తిని సూచించునదగుటచే భర్తయొక్క ఆనందాన్ని తరంగితం చేస్తుంది. తమకు రతియందు తృప్తికలిగినపుడు స్త్రీలు గొంతు సవరించుకొంటారు. ఆ సవరించుకొనుటలో ఇట్టిధ్వని ఏర్పడుతుంది.

3. శ్వసితము : - శబ్దము వినబడునట్లు నిట్టూర్చుటయే శ్వసితము. రతివేళ (ఏ పురుషాయితమునో ఆచరించి) అలసినదై భార్య సశబ్దముగ నిట్టూర్చుట జరిగితే అది 'శ్వసితము' అనబడుతుంది.

4. సీత్కారము :- బాధను అలసటను సూచిస్తూ 'ఇస్‌' అని కొంచెం దీర్ఘంగా పలుకబడే ధ్వని విశేషమునకే సీత్కారమని పేరు. రతివేళ అలసిన భార్య ఒక్కొక్కప్పుడు తన అలసటను సూచించుటకును, భర్త తన శరీరముమీద తీసుకొనే దోరనను నిషేధించుటకును ఈవిధమైన ధ్వనిని ఆచరిస్తుంది.

5. పూత్కారము :- మండని పొయ్యిని మండించుటకు 'ఉఫ్ ఉఫ్‌' అని ఊది మండించుట లోకవిదితమే. మానవుడు బాగా అలసినపుడుకూడా సరిగా ఇట్లే దగ్గరగాజేర్చిన పెదవుల మధ్యనుండి గాలిని విసర్జిస్తాడు. రతిసమయంలో బాగా అలసిన భార్య దగ్గరగాజేర్చిన తన పెదవుల మధ్యనుండి గాలిని విసర్జిస్తూ 'ఉఫ్‌' అన్నధ్వనిని ఆచరించుట 'పూత్కారము' అనబడుతుంది. పూత్కారమన్న పేరులోనే దాని లక్షణం ఇమిడిఉన్నది. రతిరహస్యమునందు పూత్కార లక్షణము భిన్నముగా చెప్పబడినది. చూ. రతిరహస్యం.

6. హింకృతము :- "హిక్" అను అక్షరములను ఉచ్చరించునపుడు జనించు ధ్వనివంటి ధ్వనియగుటచే దీనికి 'హింకృతము' అనిపేరు వచ్చినది.

రతివేళ భార్యలో ఒక తీవ్రాదేశము జనించి, ఆమె తన భర్తను ముద్దిడుకొనే వేగంలో ఈ హింకృతం పుడుతుంది. అనగా భర్తయొక్క ముఖము భార్యాముఖానికి కొంతదూరంలో ఉన్నది. ఆమెలో భర్త ముఖాన్ని చుంబించాలన్న కోరిక జనించింది. ఆమె తన ముఖమును భర్తయొక్క ముఖమునకు దగ్గరగా కొని వెళ్ళుటకు పూర్వమే నోరుతెరచి గాలిని లోపలికి పీల్చుచు - వేగముగా తన పెదవుల నాతని ముఖముపై చేర్చి చుంబించినది. అట్టి స్థితియందీ 'సింహకృతము' జన్మిస్తుంది. ఎట్లనగా ఆమె గాలి పీల్చువేళ జన్మించిన "హకార" ధ్వనివంటి ధ్వని. పెదవులు ఒక్కసారిగా భర్తయొక్క ముఖముమీద ఆన్చినంతనే "క్" అన్న ధ్వనితో సమాప్తం అవుతుంది. అందువలననే దీనికి 'హింకృతము' అన్న పేరేర్పడినది. రతిరహస్యకారుని హింకృతధ్వని లక్షణము దీనికంటె భిన్నమైనది. చూ - రతిరహస్యం.

6. దూత్కృతము :- మంచిముత్యము చేయిజారి మట్టినేలపై పడినపుడు "దత్" అన్న శబ్దం పుడుతుంది. సరిగా అట్లే రతివేళ భార్య భర్తను కృతకంగా "ధత్, దత్" అన్న శబ్దాలను పలుకుతుంది. అయితే అది రతిసమయముకనుక, ఎవరైనా వింటారన్న సంకోచముతో ఆమె ఆ శబ్దాలను చాలా అల్పధ్వనితో ఉచ్చరిస్తుంది. అపుడా శబ్దము "ఊత్, ఊత్" అనే శబ్దాలవలె వినిపిస్తుంది. ఇదుగో! భార్యాకంఠ నిర్గతమైన ఇట్టి ధ్వని విశేషము 'దూత్కారము' అనబడుతుంది.

రతిరహస్యమునందు "కూజతము" చెప్పబడలేదు. దానికి బదులుగా "రుదితము" (భర్తయొక్క చేతవలన నొప్పితోచి భార్య ఏడ్చుట) చెప్పబడినది.

ఈధ్వని విశేషములన్నియు సతీపతుల రతిక్రీడయందు ఆనంద వర్ధకాలై ఉన్నాయి.