నాగర సర్వస్వం/చంద్రకళ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

చంద్రకళ

మన్మధునకు స్త్రీయొక్క సర్వశరీరము నివాసస్థలమే అయి ఉన్నప్పటికి ఒక్కొక్కరోజున ఒక్కొక్క ప్రత్యేకావయవమునం దాతనియొక్క స్ఫూర్తి అధికంగా ఉంటుంది. కామభానముయొక్క దైనరూపమే మన్మధుడు. అందుచే స్త్రీశరీరంలో ఒక్కొకరోజున ఒక్కొక అవయవంలో అధికస్ఫూర్తికలదై ఉన్నకామాగ్ని అచ్చట భర్తయొక్క స్పర్శ కలిగినంతనే భగ్గున ప్రజ్వలించి ఆమెయొక్క సర్వశరీరమునందు విద్యుద్వలయాలను సృష్టిస్తుంది. దానితో ఆమె విహ్వలయై వివశయై భర్త చేతులలోనికి ఒరిగిపోతుంది. ఇలా దినదినము స్త్రీ శరీరావయవములందు మార్పుచెందే కామము ఆకాశముమీద మనము నిత్యము దర్శించే చంద్రకళయొక్క వృద్ధి క్షయముల ననుసరించి వృద్ధిచెంది క్షీణించేదై ఉన్నది. అందుచే ఈమార్పుచెందే కళను చంద్రకళ అన్నారు. నిజమునకిది కామకళ.

ఈకామకళకు, స్త్రీయొక్క శరీరములో వామభాగము మాత్రమే నివాసస్థానమైఉన్నది. చంద్రుడు శుక్లపాడ్యమి మొదలు పూర్ణిమవరకు వృద్ధిచెంది, తిరుగ కృష్ణపాడ్యమినుండి అమావాశ్య నాటికి క్షీణదశకు వస్తాడు. అట్లే ఈ కామకళకూడ శుక్లపాడ్యమిరోజున వనితయొక్క వామపాదాగ్రమునం దున్నదై పూర్ణిమ నాటికి శిరస్సును చేరుకొని, తిరుగ కృష్ణపాడ్యమినుండి క్రిందకు దిగుటకు ఉపక్రమించి, అమావాస్యనాటికి మరల యధాస్థానమునకు అనగా వామ పాదాగ్రమునకు చేరుకొంటుంది. అనగా తిధులనుబట్టి యీ కామకళా స్థానాలను గుర్తించాలి. పుట:NagaraSarwaswam.pdf/150 పుట:NagaraSarwaswam.pdf/151 3. సింధుదేశస్త్రీలు :- మన దేశమునందలి నేటి పంజాబు ప్రాంతమును పశ్చిమ పాకీస్తానమును పూర్వము సింధుదేశమని పిలుచుచుండువారు. ఈప్రాంతమున జన్మించిన స్త్రీలు వ్యానత కరణము (స్త్రీ తన పాదములను చేతులను నేలపైఆని నాలుగు కాళ్ళ జంతువువలె వంగియుండగా పురుషుడామెను వెనుకనుండి కూడ రమించు విధానము) నందు ఆసక్తి కలవారై ఉంటారు. గాఢాలింగన కేశాకర్షణములయందు వీరికి ప్రీతిఎక్కువ. వీరు నఖక్షత దంతక్షతములయందుకూడ అభిరుచి ప్రదర్శిస్తారు. ఆలింనాదికములైన బాహ్య రతివిధానము లన్నిటియందును ఆసక్తికలవారైన ఈస్త్రీలు అల్పమైన అభ్యంతర రతిచేతనే (సంభోగము) ఆనందించే వారై వుంటారు. అనగా వీరు దీర్ఘ కాలిక రతిని వాంఛింపరు.

4. కురు-మరు దేశస్త్రీలు :- మనదేశమునకు ఉత్తరమున హిమాలయము నంటియున్న దేశము కురుదేశము. ప్రస్తుత రాజస్థానము మరుదేశము. ఈ దేశములయందు జన్మించిన వనితలుకొండ్లలోకంటె కొండగుహలయందు, చిట్టడవులయందు కాంతునితో కలసి విహరించుటయం దాసక్తికలవారైవుంటారు.

5. సింహళదేశస్త్రీలు :- సింహళదేశము సుప్రసిద్దము. ఈ దేశమునందలి స్త్రీలు నానావిధ రతివిధానములందును ఆసక్తికలవారై నేర్పరులై వుంటారు.

6. కాశ్మీరదేశస్త్రీలు :- కాశ్మీరదేశము సుప్రసిద్ధము. ఈ దేశమునందలి స్త్రీలు చక్కని పనితనముకల సుందర వస్త్రాలను నిపుణముగా ధరిస్తారు. వీరు మిక్కిలి శుచి శుభ్రతకలవారై గుణవతులై ఉంటారు.

7. జలంధరదేశస్త్రీలు :- పంజాబుదేశమునందే ఉత్తరప్రాంతమున జలంధరనగరము ఉన్నది. ఆనగర పరిసరములయందు జన్మించిన వనితలు సహజంగా ఆచారహీనలై ఉంటారు. వీరు రతివేళ పతి తమ్ము అధికంగా తాడించుటద్వారా ఆనందిస్తారు.

8. స్త్రీరాజ్య-కోసలదేశస్త్రీలు : - ప్రస్తుతము 'భూటాన్‌' అని పిలువబడు ప్రాంతమునే పూర్వము స్త్రీరాజ్యమను పేరుతో పేర్కొనేవారు. అయోధ్య అనే నగరాన్ని నేటి మనదేశ పటమునందు గుర్తింపవచ్చును. ఈనగరము మనదేశములో ఉత్తర ప్రాంతమునందున్నది. ఈనగరప్రాంత దేశము పూర్వము కోసలదేశమని పిలువబడేది.

ఈరెండు ప్రాంతములయందలి స్త్రీలు వివిధాలింగన చుంబనములందును ఉత్థిత (నిలువబడి రమించుట వ్యానతకరణము (పశువువలె వంగియుండగా రమించుట) ల యందును అనురక్తికలవారై ఉంటారు. వీరు దీర్ఘ కాలికమైన రతినికోరే చండవేగలైఉంటారు. అందుచే పురుషుడు వారిని తృప్తిపరచుటకు కృత్రిమ పురుషాంగమును (పురుషాంగమువలె తయారుచేయబడిన కఱ్ఱ లేక వేరొక ధాతువు) ఉపయోగించుట పూర్వము ఆచరణలో ఉండేది.

9. కర్ణాటదేశస్త్రీలు : - కర్ణాటదేశ మనగా కన్నడదేశము కన్నడదేశములోని స్త్రీలు స్త్రీరాజ్య కోసలదేశ స్త్రీలవలె అధిక కామం కలవారై దీర్ఘ కాలిక రతియందాసక్తి కలవారై ఉంటారు. అందుచే ఈదేశ స్త్రీల విషయమునందును పూర్వము కృత్రిమ పురుషాంగము నుపయోగించుట ఆచరణలో ఉండేది. అధికకామం కలవారైనందున ఈస్త్రీలు మదవతీ లక్షణాన్ని సార్ధకపరచే శరీరాలు కలవారై ఉంటారు. వీరు రతివేళ పతిచేసే తాడానాలను ఆనందంతో స్వీకరిస్తారు. వీరికి 'అంగుళీప్రవేశము' నందును ఆసక్తి ఎక్కువ.

10. మహారాష్ట్రస్త్రీలు :- మహారాష్ట్రదేశము సుప్రసిద్ధము. ఆ దేశములోని వనితలు సకలకళా నిపుణులై ఉంటారు. (కళలు మొత్తం 64. వీనిని సగము వాత్స్యాయనుని కామసూత్రము లందు చూడదగును) వీరియందును కామముయొక్కపాలు ఎక్కువగానే ఉంటుంది. అయినా వీరు కృత్రిమ పురుషాంగమును వాంఛింపరు. ఆలింగన చుంబనములయందును, అంగుళీ ప్రవేశము అందును అభిలాష కలవారై ఉంటారు.

11. ద్రవిడదేశస్త్రీలు :- ద్రవిడదేశమనగా తమిళదేశము. ఈ దేశస్త్రీలు అలంకారప్రియులై ఉంటారు. వీరికి ఆలింగన చుంబనములయందు అభిలాష ఎక్కువ. అందున జిహ్వాప్రవేశ చుంబనముపై వీరికి మక్కువఎక్కువ. రతివేళ పతి తమ్ముతాడించి తమశరీరము నందు మాంసరములైన భాగములను బాగుగమర్దించి, తమజుట్టును లాగి చికాకుపరచుటద్వారా వీరు ఆనందించేవారై ఉంటారు.

12. వంగ - గౌడదేశస్త్రీలు :- వంగ దేశమనగా నేటి భెంగాల్. నేటిబిహారుకును అంటియున్న ప్రాంతము (ఒరిస్సా) పూర్వము గౌడదేశమని పిలువబడెడిది. ఈ రెండుదేశములలోని వనితలు లావణ్యముతో నిండిన శరీరాలుకలవారై ఉంటారు. ఆలింగన చుంబనముల యందు, అందున అధరోష్ట (క్రిందిపెదవి) పానమునందు వీరికి అభిలాష ఎక్కువ. అభ్యంతర రతియందు వీరు కనబరచే ఆసక్తి మనోహరంగా ఉంటుంది. వీరు మదురంగా మాట్లాడుతారు. తీర్థయాత్రలయందు వీరికి మక్కువ ఎక్కువ.

13. నేపాళ - కామరూప - చీనాదేశస్త్రీలి :- నేపాళము ప్రసిద్ధము. కామరూపమనగా నేటి అస్సాము ప్రాంతము. ఈ రెండు దేశములలోని వనితలును, చీనాదేశవనితలును సమానమైన స్వభావాభిరుచులు కలవారై యుంటారు. వీరు అలంకారప్రియులై కళా పాండితికలవారై, మధురభాషిణులై ఉంటారు. వీరుమందవేగలు అనగా అల్పకామంగలవారు. అల్పకాలిక రతిక్రీడచే తృప్తిచెందుతారు అయినావీరు సుందరయువకుడు కంటబడినంతనే కామాసక్తిని కండ్లలో వ్యక్తపరుస్తారు. రతివేళ వీరు ఆలింగన చుంబనములయందు ఆసక్తిని ప్రదర్శిస్తారు. నఖక్షత దంతక్షతములయందును, అంగుళీప్రవేశ, క్రీడా తాడన, శరీరమర్ధనములయందును వీరు ఆసక్తిని చూపరు.

ఈవిధముగా దేశభేదమునుబట్టి స్త్రీలయొక్క అభిరుచులు, స్వభావములు భిన్నంగా ఉన్నాయి. వారివారి సకృతులకు అనుకూలముగా వర్తించినపుడు మాత్రమే భర్తవలన వారికి వారివలన భర్తకు ఆనందము కలుగుతుంది. అట్లుకాక వారిప్రకృతికి విరుద్ధంగా భర్త వర్తించిననాడు ఉభయులకును సుఖముకలిగే అవకాశములేదు. చలి గడగడ వడకిస్తూఉన్నపుడు వింజామరగాలి ఎవరికిని సుఖాన్నికలిగించదు కాని ఆ వింజామరమే ఉష్ణకాలమునందు, ఉష్ణదేశమునందు సుఖదాయకం అవుతుంది. అట్లే భిన్న దేశములోని స్త్రీలు భిన్నాభిరుచులు కలవారై ఉండుటచే పురుషుడు ఆ యా దేశప్రకృతులకు అనుకూలములైన రతివిధానముల నవలంబించాలి.

ఈ ప్రకరణంలో పద్మశ్రీ ఆంధ్రదేశ గూర్జరదేశ (గుజరాత్) స్త్రీల స్వభావములనుగూర్చి చెప్పలేదు. ఆ దేశ స్త్రీల స్వభావములు రతిరహస్యమునం దీవిధముగా చెప్పబడ్డాయి. ఆంధ్రదేశస్త్రీలు :- వీరు సుకుమారంగా ఉంటారు. రతియందు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. వీరు రతివేళ భర్తకు తనకు తృప్తికలిగి భావనానాన దశకు వచ్చియున్నపుడు కూడ తమ మర్మావయవముతో అల్పవీర్యమైన పురుషావయవమును బిగియబట్టి భర్తను ప్రోత్సహించి ఆనందించే స్వభావము కలవారై ఉంటారు. ఘూర్జరదేశస్త్రీలు ఘూర్జరమనగా నేటిగుజరాత్. ఈదేశపుస్త్రీలు వరలుకొప్పులతో, బిగువుచన్నులతో సుందరనేత్రములతో మధురభాషేణులై బాహ్య - అభ్యంతర రతుల యందు రెండింటియందును ఆసక్తి కలవారై ఉంటారు.

★ ★ ★