నాగర సర్వస్వం/క్రీడాతాడనము
వనిత ఎట్టిదైనను రతికి అభిముఖి అవుతుంది. ఆమెయందు సంభోగము కొరకైన ఒక పరమమైన విహ్వలత ఏర్పడుతుంది. ఈ అంగుళ ప్రవేశమువలన ఆమెయందు రతికొరకైన విహ్వలత ఏర్పడుతుందేకాని తృప్తి ఏర్పడదు. స్త్రీకి తృప్తి పురుషాంగ సంయోగముచేతనే లభిస్తుంది. ఈవిషయం పురుషుడు గ్రహించాలి. కేవలం అంగుళీ రతంతో మాత్రమే ఆచరించేవాడు పురుషాధముడు. రతిక్రీడయందు మిక్కిలి ఉత్సుకతను కనబరచని స్త్రీలవిషయమునందు మాత్రమే ఆవశ్యకత నెరిగి పురుషుడీ అంగుళీ ప్రవేశ విధానమును ఆచరించాలి.
క్రీడా తాడనము
సంభోగసమయములో స్త్రీపురుషులు సంయుక్తయంత్రులై రమించుచున్నవేళ భార్యను ప్రేమతో పురుషుడు ప్రహరించుట (కొట్టుట) కూడ జరుగుతుందని వెనుక చెప్పబడ్డది. ప్రహరణ తాడన శబ్దములు సమానార్థకములు. సుందరములై స్త్రీయొక్క నాడీమండలమును స్పందింపజేయగలవైన తాడనభేదములు పదునొకండు ఇందు తెలుపబడుతున్నాయి. ఈ తాడనభేదములయందు మొదటిది శబ్దకర్తనము.
1. శబ్దకర్తనము :- శబ్దకర్తనము అనగా కత్తిరింపు శబ్దము. భార్యయొక్క శిరస్సు ఈ తాడనమునకు స్థానమై ఉన్నది. పురుషుడు భార్యను కలిసి సంభోగాసనాసీనుడైయుండి ఆమె శిరస్సు మీద క్రీడగా తాడనముచేయ నెంచినపు డీ శబ్దకర్తన విధానమును అవలంబించాలి. చేతివ్రేళ్ళు నాల్గింటిని గుప్పిడిగా ముడవకయే కొంచెము వదులుగావుంచి చిటికెనవ్రేలియొక్క పార్శ్వభాగము శిరస్సునకు తాకునట్లుకొట్టగా - మిగిలిన మూడువ్రేళ్లును వదలుగా ఉన్నందున ఒక దానిమీద ఒకటి పడినవై ఒక శబ్దమును జనింపజేస్తాయి. ఆ శబ్దము ' టాత్ - టాత్ ' అన్నధ్వనికి సమీపంగాఉంటుంది. దీనియందు వ్రేళ్ళయొక్క స్థితి కత్తెరయొక్క స్థితి సన్నిహితంగా ఉంటుంది. పుట్టేశబ్దముకూడ కత్తిరింపుశబ్దాన్ని పోలిఉంటుంది. అందుచే దీనికీ పేరువచ్చినది.
2. ముష్టితాడనము : భార్యతో కలిసి రమించుచు భర్త తనచేతివ్రేళ్ళను పూర్తిగా గుప్పిడిగా మడచి ఆమెను తాడించినచో ఆ తాడనము 'ముష్టితాడనము' అనబడుతుంది. భార్యయొక్క పిరుదులు పృష్టము ఈ తాడనమునకు అర్హస్థానములై ఉన్నాయి. ముష్టి అనగా పిడికిలి. పిడికిలిలో చేయబడే తాడనమైనందున దీనికీ పేరువచ్చినది.
3. విద్ధకము : ఒకదెసగా ప్రయాణం చేస్తూవున్న వస్తువు (ఏకాంతికిరణమో) మరియొకదెసగా ప్రయాణంచేసే వేరొక వస్తువును (ఏకాంతికిరణమునో) ఢీకొనుట జరిగితే దానికి వేధ అనిపేరు. అట్టిదైన వేధాలక్షణముతో కొట్టుటకే విద్ధకమని పేరు. భర్త తనయొక్క కాలిబొటనవ్రేలితో భార్యయొక్క బుగ్గను వేధించుట విద్ధకము అనగా దీనికి భార్యయొక్క చెక్కిలిస్థానమనియు, పురుషుడు తనకాలి బొటనవ్రేలితో ఈతాడనం ఆచరించాలని గ్రహించాలి. కొన్ని సంభోగాసనములయందు భార్యయొక్క తొడలు పైకెత్తబడియుండగా పురుషుడామెను కూడువిధానములు చెప్పబడినవి. అట్టిస్థితియందు భార్య కొంత నిరుత్సాహముగాగాని, మరేకారణముచేతగాని తనముఖమును ఒకవంకకు వ్రాల్చియుంచుట సంభవించినచో - పురుషుడు సంభోగాసనమును వీడకయే ప్రయత్నపూర్వకముగా తనపాదము నామె ముఖము వద్దకు గొనిపోయి కాలి బొటనవ్రేలితో ఆమెముఖమును తనకు అభిముఖమగునట్లు మీటుట ' విద్ధకము ' అనబడుతుంది.
4. ఆదీపితము : ఆదీపితము అనగా అంతటను ప్రజ్వలింపసేయబడినది. పురుషుడు తన పిడికిలితో భార్యయొక్క సర్వశరీర మునందు కామాగ్ని జ్వలించునట్లు ఇచ్చట, అచ్చట అనక అంతట మర్దించుట, కొట్టుట జరిగినచో ఆతాడనము 'ఆదీపితము' అనబడుతుంది. కామము సర్వత్ర దీప్తమగుటకై చేయబడు తాడనమగుటచే దీనికీ పేరు వచ్చినది.
5. స్పృష్టకము : భార్యయొక్క శరీరమునందు భర్త కేవలము తన అరచేతితో అల్పముగా తాడించినచో అది 'స్పృష్టకము' అనబడుతుంది. స్పృష్టశబ్దమునకు స్పృశింపబడినదని అర్థము. ఈ తాడనము స్పర్శాప్రధానముగా ఆచరింపబడుతుంది. అందుచేదీనికి 'స్పృష్టకము' అనుపేరువచ్చినది.
6. కంపితకము : కంపనమనగా వడకుట. భార్యాభర్తలు కలిసి రమించుచుండగా భర్త ఒకానొక ఉత్కటావేశమునకు లోనై - ఆ అధికావేశము కారణముగా వడకుచున్న చేయికలవాడై - అట్లు వడకుచున్న చేతితో భార్యాశరీరమునం దచ్చట తాడించుట జరిగినను - ఆ తాడనము 'కంపితకము' అనబడుతుంది. భార్య తన సౌందర్యం ద్వారా భర్తయందు జనించిన అధికావేశాన్ని ఈ తాడనం ద్వారా గ్రహించినదై తానుకూడ దీస్తదీపంలా మెరుస్తుంది.
7. సమాక్రమము : పురుషుడు భార్యను కూడియుండి ఆమెయొక్క శరీరమునందు మాంసలములైన భాగాలను కేవలము చేతితో అల్పముగా నొక్కుట జరిగితే అది 'సమాక్రమము' అనబడుతుంది. పురుషుడు చేతితో భార్యాశరీరమును తాడించుటకాక ఆక్రమించుటమాత్రమే ఇందు జరుగుతుంది. అందుచే దీనికీపేరువచ్చినది.
8. బద్ధముష్టి : సమాక్రమమే మరికొంత గట్టిగా భార్యా శరీరము బాగుగనొచ్చునట్లు ఆచరింపబడితే అది 'బద్ధముష్టి' అనబడుతుంది. భార్యాశరీరమును చేతితో గ్రహించి గట్టిగా పిడికిలి బిగించుటకో అన్నట్లు వ్రేళ్లు నొక్క బడుటవలన దీనికీపేరువచ్చినది. భార్య దేహమునం దెచ్చటనైనను ఈ బద్ధముష్టి నాచరింపవచ్చును. 9. వేష్టితకము :- వేష్టనము అనగా చుట్టుట. తుమ్మెదలవలె నల్లగాఉండి, సువాసనలు విరజిమ్ము పూవులతో అలంకరింపబడిన భార్యయొక్క జడను చేతికి చుట్టుకొని లాగుట లేదా జుట్టులోని ఒక పాయను మాత్రము తనవ్రేలికి చుట్టి లాగుట- 'వేష్టితకము' అనబడుతుంది.
10. కృతగ్రంథ^ :- గ్రంథి అనగా ముడి. భర్త భార్యయొక్క చేతివ్రేళ్ళ సందులనుండి తన చేతివ్రేళ్ళను పోవనిచ్చి ఆమెచేతివ్రేళ్ళతో తన చేతివ్రేళ్ళను ముడివైచినట్లుంచి నొక్కుటజరిగినచో - ఆస్థితి 'కృతగ్రంథి' అనబడుతుంది. ఆలుమగల చేతివ్రేళ్ళు ముడివేయబడినట్లుండుటచే దీనికీపేరు వచ్చినది.
11. సమాకృష్టి :- ఆకర్షణ మనగా లాగుట. భార్యను గూడి రమించుచున్న భర్త ఆమెయొక్క చనుమొనను లేదా మెడమీది పలుచని చర్మమును తన చూపుడువ్రేలితోడను, బొటనవ్రేలితోడను (రెండువ్రేళ్ళతో మాత్రమే గ్రహించి లాగుట జరిగినచో అది 'సమాకృష్టి' అనబడుతుంది.
ఇట్లున్న ఈ తాడనభేదములయందు ఏడవదైన సమాక్రమము మొదలు పదునొకండవదైన సమాకృష్టివరకు చెప్పబడిన తాడనము లైదును నిజమునకు తాడనములు (కొట్టుటలు)కావు. అయినను వీనిచే భార్యయొక్క శరీరము తాడనమునందువలెనే నొచ్చుట జరుగును. అందుచే ఇవి ఇందు చేర్చబడ్డాయి. ఈ తాడనములన్నియు ఉచితవేళ ఉచితరీతిని ఆచరింపబడినప్పుడు భార్యాభర్తల సంభోగసౌఖ్యాన్ని పెంపొందిస్తాయి.
వీనివలన భార్యకు కొంచెంభాధకలిగినా తన శరీరావయవాలతో ఈవిధంగా భర్త తాడనపూర్వకంగా ఆడుకొనడం ఆమెకు ఆనందాన్నే కలిగిస్తుంది. అయినా ఆమె తన ఆనందాన్ని వ్యక్తపరచడానికి బదులు నొప్పినే అభినయిస్తూ 'ఇస్-అమ్మ-అబ్బ' మొదలగు ధ్వనులతో తన బాధను వ్యక్తంచేస్తుంది. ఈ ధ్వనులకు విరుతములని పేరు. అవి ఈదిగువ ప్రకరణములో వివరింపబడుతున్నాయి.
విరుత భేదములు
విరుతము అనగా విశేషధ్వని. సంభోగవేళ భార్యను తాను హేలగా తాడించగా ఆమె 'అమ్మా-ఇస్' మొదలగు విరుతాలను ఆచరిస్తే వానిని వినుటచే భర్తయొక్క హృదయములో ఏదో తెలియని ఆనందరేఖ నర్తిస్తుంది. అట్టి ఆనందమును కలిగించున దగుట చేతనే విరుతము ఆలింగన మాదిగాగల రతిభేదములయం దేడవ రతి భేదముగా చెప్పబడినది. ఈ విరుతభేదములు మొత్తము ఏడు. వానిలో మొదటిది స్తనితము.
1. స్తనితము :- స్తనితము అనగా మేఘధ్వని. అనగా ఉరుము. సంభోగసమయమున భర్త భార్యకు కొంచెము నొప్పి తోచునట్లు వర్తించినపుడు కృతకమైన కోపముతో ఆమె "ఊ, ఊ" అని పలికితే ఆధ్వని విశేషము స్తనితము అనబడుతుంది. అలా కోపసూచనకై ఉచ్చరించే ఊకారము జఠరదేశమునుండి ఊర్ధ్వశ్వాసతో వ్యక్తం అవుతుంది. ఈధ్వని మేఘధ్వనిని పోలినదగుటచే దీనికి 'స్తనితము' అను పేరేర్పడినది.
2. కూజితము :- పక్షులు ఆచరించే ధ్వని విశేషములు కూజితము అనబడుతాయి. కూత అను శబ్దము కూజిత శబ్దము నుండియే జన్మించినది. రతివేళ భార్య తృప్తిచెందినపుడామె కంఠమునుండి ఆమెకు తెలియకయే - మిక్కిలి ఉత్సాహముగానున్న పావురముయొక్క "కువకువ" ధ్వనిని పోలినధ్వని జనిస్తుంది. ఈధ్వని విశేషము ఆమెయొక్క పరితృప్తిని సూచించునదగుటచే భర్తయొక్క