నాగర సర్వస్వం/మంగళాచరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మంగళాచరణము

ఎవ్వని అనుగ్రహమువలన మదవతియై మనోహరమైన రూపము కలదైన యువతి తనంతతానై పతిని కౌగలించుకొనడం - తానానందించి అతనిని ఆనందింపజేయడం జరుగుతూ వున్నదో - ఆ పూవిలుకానికి, సొగసులుచిందే శరీరంతో సుందరులకెల్ల సుందరుడై వెలయువానికి మన్మధునకు నమస్కారము.

ఈ శాస్త్రము యొక్క అవసరము - ప్రయోజనము :

లోకంలో ఎన్నో కామశాస్త్ర గ్రంథాలున్నాయి. కాని వానిలో కొన్ని అన్యభాషలలో ఉంటే, కొన్ని సులభంగా తెలియడానికి వీలులేని కఠిన శైలిలో వ్రాయబడ్డాయి. కొన్ని గంభీరమైన శాస్త్ర విషయాన్ని సమగ్రంగా చెప్పక కొంతవరకూ మాత్రమే చెప్పి ఊరకొన్నాయి. అందుకే పద్మశ్రీ అనే బౌద్ధుడు అందరకు తెలిసికొనడానికి వీలైన శైలిలో ప్రాచీన కామశాస్త్రాలలోని లోపాన్ని పూరిస్తూ ఈ నాగర సర్వస్వం రచించాడు. ఈగ్రంథం కేవలం కామాన్ని మాత్రమే సాధించి పెడుతుందని ఎవరైనా అనుకొంటే అదివారి అజ్ఞతను వెల్లడించుకొనడమే అవుతుంది. ఇది ధర్మాన్ని - అర్థాన్ని - కామాన్ని మొత్తం త్రివర్గలను సాధించిపెట్టే సద్గ్రంథం. ఈకారణంచే పండితులు దీనిని ఆదరంతో చూచెదరౌగాక ! అని విన్నవించు కొంటున్నాను.


కామం అన్నది సర్వప్రాణి సహజమైనది. అది నేర్చుకోకుండానే అందరకు అలవడుతుంది. అట్టి కామానికి కూడ ఒక గ్రంథం, ఒక శాస్త్రం అవసరమా ? అన్న ప్రశ్న కలగడం సహజం.

కాని తగినంత విజ్ఞత లేనివారికి మాత్రమే పై విధమైన ప్రశ్న ఉదయిస్తుంది. విజ్ఞత కలవాడెవ్వడూ అలాంటి ప్రశ్నకు తావీయడు. ఏమంటే - లోకంలో ఆవులమంద మధ్యలో ఆబోతు ప్రబల కామంతో విహరించడం చూస్తున్నాము కదా ! " నేను నాగరకుడము, ఏ విష పుట:NagaraSarwaswam.pdf/24 పుట:NagaraSarwaswam.pdf/25 పుట:NagaraSarwaswam.pdf/26