నాగర సర్వస్వం/ప్రయత్నసాధ్యలైన స్తీలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తాముకోరే పురుషునిగూర్చి వినడానికి వీరు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు.

ఈవనితలు పరపురుషుని ఎదుట ఆవులించి, ఒడలు విరచుకొని, చేతివ్రేళ్ళు మెటికలు విరుస్తారు. లేని శ్లేష్మం నోటిలోనికి తెచ్చుకొని గొంతు సవరించుకొని ఉమ్మి వేస్తారు. పనిలేనిదే చెవులలో వ్రేళ్ళు పెట్టుకొని త్రిప్పుకొంటూ పరపురుష సన్నిధియందు సంచరిస్తారు. చిరునవ్వులు చిందిస్తారు. తీయగా మాట్లాడుతారు. ప్రేమగాచూస్తారు. ఇవన్నీ సులభసాధ్యలైన స్త్రీల చేష్టలు.

ఇట్టి చేష్టలు పరపురుషుని ఎదుట ఆచరింపబడితే ఆపురుషుడా వనిత తనకు సులభసాధ్య అని గ్రహించాలి. కాని ఒక్క విషయం. కొందరు ఏమీ తెలియక అమాయకంగానే మనస్సులో ఏగూఢార్థము లేకయే ఈపనులు ఆచరింపవచ్చును. అట్టిచోట పురుషుడు ఆలోచన లేక ప్రవర్తిస్తే ప్రమాదం తప్పదు, అందుచే చాలా నిదానించికాని పురుషుడొక నిర్ణయానికి రాకూడదు.

2. ప్రయత్న సాధ్యలైన స్తీలు

ఈపైన చెప్పిన లక్షణాలు లేకపోయినా భర్తవలన తగినంత సౌఖ్యంలేని స్త్రీలు కొంత ప్రయత్నంతో పరపురుషునకు వశమవుతారు. అనగా నిరంతరవ్యాధి పీడితుని భార్య, అసూయపరుని భార్య, దుష్టుని భార్య ప్రయత్న సాధ్యలై ఉంటారు. ఎల్లప్పుడు ఏదో వ్యాధితో బాధపడేవాని భార్యకు భర్త వలన సుఖమేముంటుంది ! ఈక అసూయాపరుడైనవాడు శారీరకంగా దృఢంగాఉన్నా అసూయాలక్షణంచేత భార్యామనస్సుకు నొప్పికలిగిస్తూ ఉంటాడు. దుష్టుడైనవాడు కలిగించిన బాధ ఏమున్నది గనుక ! అందుచే ఈ మూడు పరిస్థితులయందు తమభర్తయొద్ద పొందజాలని సుఖాన్ని పొందడానికై యువతులైన వనితలు తమంతతాము కాకపోయినా ఎవరయినా భయంలేదంటూ చేయిపట్టుకొని నడిపిస్తే కొంతజంకుతూ కొంతఏదో తెలియని ఆనందాన్ని అనుభవిస్తూ పెడదారి త్రొక్కడానికి అంగీకరిస్తారు. వీరు మువ్వురేకాక మాటిమాటికీ తీర్థయాత్రలు, ప్రయా ణాలుచేసేవనితలు కూడ కొంతప్రయత్నంతో పరపురుషునకు వశమవుతారు.

3. అసాధ్యలైన వనితలు

మిక్కిలి సిగ్గుపడే వనితలు, భయపడే వనితలు, ఏదో పెద్ద దుఃఖంలో చిక్కిఉన్న వనితలు, దేనియందున ఆశలేని వనితలు పరపురుషునకు ఎన్నడు వశంకారు. బాగా సిగ్గుపడే వనిత పరపురుష ప్రసంగానికే సిగ్గుపడి వెనుకకు తగ్గుతుంది. భయపడే వనితలు లోకభీతిని వీడజాలనివారై వుంటారు. అందుచే అచ్చట పరపురుషుడు ఎన్నివలలు పరచినా ప్రయోజనం లేదు. ఏదో మహాదుఃఖంలో చిక్కివున్న వనిత ఆదుఃఖచ్ఛాయలు తొలగినమీదట అంగీకరిస్తుందేమోకాని, ఆదుఃఖం మనస్సుమీద పీటవేసుకొని కూర్చుండగా పరపురుష సాంగత్యానికి ప్రాణంపోయినా అంగీకరించదు. ఏదోఆశ - సుఖించవచ్చుననియో, కానుకలు, ధనము లభించుననియో - ఏదో కోరిక వున్నపుడుకదా వనిత పరపురుషునకు వశమవుతుంది. కాని ఏఆశ లేని స్త్రీ పరున కెందుక వశమవుతుంది. అందుకే లోభవర్భితలైన స్త్రీలు పరపురుషున కెన్నడును స్వాధీనలుకారు. ఈ అసాధ్యలైన స్త్రీల విషయంలో పరపురుషుని ప్రయత్నం సఫలం కాదు. సఫలమైనా నిరాపదంగా సఫలంకాదు.

సులభసాధ్యలైన స్త్రీల విషయంలో పురుషుడు తనంతతానే చొరవ దీసికొని వ్యవహరించవచ్చును. లేదా తనకు కొంత జంకు కలిగితే యేస్నేహితునో కార్యసాధనకు వినియోగించవచ్చును. ఇలా అల్ప యత్నంలోనే వారు ఆతనికి స్వాధీనలవుతారు. కొంత ప్రయత్నం చేసిన మీదటగాని సాధ్యలుకాని స్త్రీల విషయంలో పురుషుడు తనంతతానుగా వ్యవహరించకూడదు. స్నేహితునికూడ వినియోగించకూడదు. అట్టి చోటలందాతడు దూతికను వినియోగించాలి.

దూతికలు :

ఇంటి చాకలి స్త్రీ ఇంటిలో నిత్యము పనిచేసే దాసి, పూవులమ్మునది, యోగాభ్యాసముచేయు ఆడుది, పొరుగింటి