Jump to content

నాగర సర్వస్వం/సులభసాధ్యలైన స్త్రీలు

వికీసోర్స్ నుండి

అనికూడ అంటారు. ఎంత ప్రయత్నించినా లొంగని వనితలు అసాధ్యలు అనబడతారు. ఈ అసాధ్యల విషయంలో తనక్షేమం కోరుకునే వాడెవడూ యెట్టి ప్రయత్నము చేయకూడదు. ఇక తప్పనిసరి అయిన వేళ ఎవరైనా ప్రయత్నిస్తే ' చావుతప్పి కన్నులొట్టవోయి నదన్న ' సామెతగా వారు చేజిక్కుతారేమోకాని ఆపద్రహితంగా అరచేతిలోనికి వచ్చి వ్రాలడం అన్నది జరుగదు.

ఈ విధంగా పరవనితలు మూడు రకాలుగా ఉన్నందున పురుషుడు తానుకోరే స్త్రీ వీరిలో ఏరకానికి చెందినదో తెలిసికొనడం అవసరం. అందుచే మూడురకాలుగా ఉన్న ఈవనితల లక్షణాలు చెప్పబడుతున్నాయి.

సులభసాధ్యలైన స్త్రీలు

ఏ ప్రయత్నము చేయనక్కర లేకయే పరపురుషునకు లొంగే స్త్రీలు ఆ పరపురుషుని ఎదుట శంకలేకుండా వర్తిస్తారు. 'చూస్తే చూడనియ్యి ' అన్నట్లు తమ స్తనాలను, చంకలను, ఉదరభాగాన్ని (కడుపు) పరపురుషుల ఎదుట మాటిమాటికీ వెల్లడిస్తారు. పరపురుషుని వంకకు సాభిప్రాయంగా చూస్తూ తమపిల్లలను కౌగలించుకొని ముద్దుపెట్టుకొనడం కూడ వీరి లక్షణాలలో ఒకటి.

వీరు పరపురుషుని ఎదుట తమ రెండుచేతులను పైకెత్తి జడ ముడివిప్పి తిరుగముడి వేసుకొనడానికి సిగ్గుపడరు, సరికదా ప్రత్యేకంగా అతని ఎదుటకువచ్చి జుట్టు ముడి సరిగావున్న ఒకసారివిప్పి తిరుగముడి వేసుకొంటారు. జుట్టుముడి విప్పాలన్నప్పుడు రెండుచేతులు పైకిలేవాలి. అలా లేచినపుడు స్త్రీయొక్క స్తనాలు, చంకలు స్ఫుటంగా వెల్లడి అవుతాయి. పరపురుషుల ఎదుట కులస్త్రీలు ఎన్నడూ ఈవిధంగా తమ అవయవాలను వెల్లడించరు. సులభసాధ్యలైన స్తీలు మాత్రమే ఈవిధంగా ఆచరిస్తారు. వీరు పరపురుషుని యెదుట అతడు చూస్తూ ఉండగా తమ స్తనాదులవంకకు మాటిమాటికి చూచుకొంటారు. తమ కంటిరెప్పలపై వ్రేలుంచి మాటిమాటికి తుడుచుకొనుటకూడ వీరి చేష్టలలో ఒకటి. తాముకోరే పురుషునిగూర్చి వినడానికి వీరు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు.

ఈవనితలు పరపురుషుని ఎదుట ఆవులించి, ఒడలు విరచుకొని, చేతివ్రేళ్ళు మెటికలు విరుస్తారు. లేని శ్లేష్మం నోటిలోనికి తెచ్చుకొని గొంతు సవరించుకొని ఉమ్మి వేస్తారు. పనిలేనిదే చెవులలో వ్రేళ్ళు పెట్టుకొని త్రిప్పుకొంటూ పరపురుష సన్నిధియందు సంచరిస్తారు. చిరునవ్వులు చిందిస్తారు. తీయగా మాట్లాడుతారు. ప్రేమగాచూస్తారు. ఇవన్నీ సులభసాధ్యలైన స్త్రీల చేష్టలు.

ఇట్టి చేష్టలు పరపురుషుని ఎదుట ఆచరింపబడితే ఆపురుషుడా వనిత తనకు సులభసాధ్య అని గ్రహించాలి. కాని ఒక్క విషయం. కొందరు ఏమీ తెలియక అమాయకంగానే మనస్సులో ఏగూఢార్థము లేకయే ఈపనులు ఆచరింపవచ్చును. అట్టిచోట పురుషుడు ఆలోచన లేక ప్రవర్తిస్తే ప్రమాదం తప్పదు, అందుచే చాలా నిదానించికాని పురుషుడొక నిర్ణయానికి రాకూడదు.

2. ప్రయత్న సాధ్యలైన స్తీలు

ఈపైన చెప్పిన లక్షణాలు లేకపోయినా భర్తవలన తగినంత సౌఖ్యంలేని స్త్రీలు కొంత ప్రయత్నంతో పరపురుషునకు వశమవుతారు. అనగా నిరంతరవ్యాధి పీడితుని భార్య, అసూయపరుని భార్య, దుష్టుని భార్య ప్రయత్న సాధ్యలై ఉంటారు. ఎల్లప్పుడు ఏదో వ్యాధితో బాధపడేవాని భార్యకు భర్త వలన సుఖమేముంటుంది ! ఈక అసూయాపరుడైనవాడు శారీరకంగా దృఢంగాఉన్నా అసూయాలక్షణంచేత భార్యామనస్సుకు నొప్పికలిగిస్తూ ఉంటాడు. దుష్టుడైనవాడు కలిగించిన బాధ ఏమున్నది గనుక ! అందుచే ఈ మూడు పరిస్థితులయందు తమభర్తయొద్ద పొందజాలని సుఖాన్ని పొందడానికై యువతులైన వనితలు తమంతతాము కాకపోయినా ఎవరయినా భయంలేదంటూ చేయిపట్టుకొని నడిపిస్తే కొంతజంకుతూ కొంతఏదో తెలియని ఆనందాన్ని అనుభవిస్తూ పెడదారి త్రొక్కడానికి అంగీకరిస్తారు. వీరు మువ్వురేకాక మాటిమాటికీ తీర్థయాత్రలు, ప్రయా