నాగర సర్వస్వం/నఖక్షతములు

వికీసోర్స్ నుండి

నఖక్షతములు :

నఖము అనగా గోరు. క్షతము అనగా గాయము. ప్రియురాలి యొక్క శరీరమున కాంతి మంతములై మాంసలములైన భాగములను భర్త కేవలము స్పృశించి, ముద్దు బెట్టుకొని తృప్తి చెందక ఆయా మాంసల భాగాలను గోళ్ళతో సన్నగా నొక్కి తృప్తి చెందే వాడై ఉంటాడు. అట్టివైన గోటి నొక్కులకే నఖక్షతములని పేరు. భర్త తన యొక్క శరీరమును జూచి ఆవేశముతో నఖక్షతము లాచరించినపుడు భార్యయందు రతికి సుముఖమైన ఆవేశము కలుగుతుంది. అయితే ఈవిధంగా భార్యా శరీరముపై నఖక్షతముల నాచరింపగోరు పురుషుడు తన గోళ్ళను మిక్కిలి శుభ్రంగా ఉంచుకొనాలి. వాని యందు పొరలు, మాలిన్యము లేకుండా చూచుకోవాలి. లేకున్నచో అతని గోటిలోని మాలిన్యము ప్రియురాలి నెత్తుటియందు ప్రవేశించి పుండుపడవచ్చును. ఈ నఖక్షతములు మొత్తము ఎనిమిది రకములుగా ఉన్నాయి.

1. ఉచ్ఛురితము :- భార్యయొక్క స్తనములయందు, బుగ్గలయందు లేదా చెంపల యందు ప్రియుడు తనచేతి గోళ్లు ఐదింటితోడను ఆమె శరీరము గగుర్పాటు చెందునట్లు, వీణవాయించినట్లు రేఖలు స్పష్టంగా గోచరింపనటులు గీరినచో అది ఉచ్చరితము అనబడుతుంది. గోళ్ళయొక్క యీవిధమైన అల్పస్పర్శవలన ఆమెయొక్క శరీరం పులకిస్తుంది. సాధారణంగా లోకంలో అందరకు వెన్నుపూసమీద పొడవుగా వ్రేలితో అల్పస్పర్శ కలిగించినపుడు చక్కిలి గింతవంటి స్థితి ఏర్పడి నాడీమండలమునందొక వింత కదలిక ఉదయిస్తుంది. అట్లేప్రియా శరీరమున గూడ ఉచ్ఛరిత నఖక్షతము అల్పస్పర్శతో ఆచరింపబడి ఆమె శరీరమును జలదరింప జేస్తుంది.

2. అర్ధచంద్రము :- అర్ధచంద్రము అనగా సగమైయున్న చంద్రునివలె వంకరగా నున్నది అని అర్ధము. ప్రియుడు ప్రియురాలి మెడమీద, స్తనములమీద అర్ధచంద్రాకృతి ఏర్పడునట్లు గోటితో నొక్కుట అర్ధచంద్రము అనబడుతుంది. సహజముగా ఏ గోటితోనొక్కినను అర్ధచంద్రాకృతి ఏర్పడుతుంది. అందుచే ఈనఖక్షత మాచరించుట సులభము. ఉచ్ఛరితము మాత్రమట్టిదికాదు. దాని నాచరించుటకు పురుషుని యందొకింత నేర్పు అవసరము. వీణవాయించునప్పుడువోలె పురుషుడు తనచేతి వ్రేళ్ళను వదులుగా ముడిచియుంచి బొటనవ్రేలిని, భార్యా శరీరమునందాన్చియుంచి వీణతీగను మీటినట్లు మిగిలిన నాలుగు వ్రేళ్ళను చటచట ధ్వనితో బొటనవ్రేలిమీదుగా భార్యా శరీరమును తాకునట్లు చేయుట "ఉచ్చరితము" అప్పుడు బొటనవ్రేలిగోటి రేఖ కొంత స్పష్టముగా నున్నను, మిగిలిన గోళ్ళయొక్క రేఖలు అల్పస్పర్శతో అభిరామముగ అస్పష్టముగ ఉదయిస్తాయి. అందుచే ఉచ్ఛరితము నాచరించుటకు కొంత ఊహతోడి నేర్పు అవసరము. అర్ధ చంద్రమునకు ఊహతో నేర్పుతో పని యుండదు.

3. మండలకము : మండలకము అనగా గుండ్రనిది. అర్ధ చంద్రములను రెండింటిని ఒకదాని కొకటి అభిముఖంగా రేఖలను కలుపుతూ ఆచరించినపుడు మండలకము ఏర్పడుతుంది. బొటనవ్రేలిగోటితో మరియొక వ్రేలి గోటిని దగ్గరగా చేర్చి నొక్కుట వలన మండలకము ఏర్పడుతుంది. భార్యయొక్క కంఠముస్తనములేకాక పిరుదులుకూడ ఈ మండలకమునకు తగిన స్థానములై ఉన్నాయి.

4. వ్యాఘ్రపదము : వ్యాఘ్రమనగా పెద్దపులి. అది ఒక చోట నుండి మరియొక చోటునకు పొడవుగా లంఘించు (దాటు) స్వభావము కలదై ఉంటుంది. అట్లే భార్యయొక్క తొడలపై, పిరుదులపై పురుషుడు కొలది పొడవైన గోటిగీరల నేర్పాటుచేసినచో అది వ్యాఘ్రపదము అనబడుతుంది. పెద్దపులి యొక్క పాదముల గుర్తులవోలె దీర్ఘములైన గుర్తులు దీనియందేర్పడుతాయి. అందుచే దీనికి వ్యాఘ్రపదమని పేరు వచ్చినది. 5. రేఖాక్షతి : భార్యయొక్క తొడలపై పిరుదులపై వెనుక చెప్పిన వ్యాఘ్రపదము కంటె పొడవైన రేఖల నేర్పరచినచో అది రేఖాక్షతి అనబడుతుంది. ఈ క్షతి కొంచెము లోతుగా చేయబడుతుంది. భర్తయేదైన గ్రామాంతర మేగునపుడు పూర్వరాత్రమున భార్యయొక్క శరీరమునందిట్టి రేఖల నేర్పరచినచో ఆతడు వచ్చువరకు ఆ రేఖలు ఆమె కంటబడినపుడెల్ల ఆమెయందొక మధురానుభూతి కలుగుతుంది.

6. శశప్లుతము : భార్యయొక్క పిరుదులమీద, స్తనములమీద, మోకాలి వెనుక భాగమున పురుషుడు తన చేతి గోళ్ళనైదింటిని కలిపి ఒకేసారి గ్రుచ్చినచో అది శశప్లుతము అనబడుతుంది. శశ మనగా కుందేలు. కుందేలు గెంతినపుడు దాని పాద చిహ్నములు నేలమీద ఏర్పడతాయి. సరిగా అట్టిదైన ఆకృతి ఐదుగోళ్ళనుకలిసి గ్రుచ్చుటవలన ఏర్పడుతుంది. అందుచే దీనికి శశప్లుత మని పేరు వచ్చినది.

7. ఉత్పలపత్రము : ఉత్పలము అనగా కలువపూవు. పత్రం అనగా రేక. కలువ రేకలు మిక్కిలి దూరముకాక మిక్కిలి దగ్గరకాక దొంతులు దొంతులుగా ఉంటాయి. భార్యయొక్క స్తనములయొక్క అడుగుభాగమునందు పురుషుడు గోళ్లతో దగ్గర దగ్గరగా గ్రుచ్చి అట్టి రేఖలను ఏర్పరచినచో అది ఉత్పల పత్రము అనబడుతుంది.

8. మయూరపదము : మయూర పదము అనగా నెమలి కాలు. భార్యయొక్క స్తనములయందు లేక బుగ్గలయందు పురుషుడు,తన చిటికెనవ్రేలిని విడచిపెట్టి మిగిలిన నాలుగు వ్రేళ్ళతోడను పరస్పరము కలియునట్లు రేఖల నేర్పరచినచో అది మాయూరపదము అనబడుతుంది. అనగా బొటనవ్రేలిని భార్యా శరీరభాగమునందాల్చి యుంచి, మిగిలిన మూడు వ్రేళ్లను దూరముగాచాచి వానియొక్క గోళ్ళను కూడ శరీరభాగమునందాల్చి ఆమూడు వ్రేళ్లను, ఈబొటనవ్రేలిని కూడ పరస్పరము దగ్గరగా లాగవలెను అప్పుడు మయూరముయొక్క పాదచిహ్నమువంటి గోటి గీరలు భార్యా శరీరమునందేర్పడుతాయి. భార్యయొక్క స్తనములయందైనచో ఈ మయూరపదరేఖలు చూచుకము (చను మొన) దగ్గర కలుస్తాయి.

ఇట్టివైన నఖక్షతములను ఎనిమిదింటిని నాగరజనులు ఔచిత్య మెరిగి ఆచరించే నేర్పు కలవారై ఉంటారు. వీని వలన భార్యామానసములో ఉల్లాసం కలుగుతుంది.


దంతక్షతములు

పరమసుందరములైన భార్యాశరీరభాగములను కేవలము తాకి, చుంబించి, గోటితో గిల్లి పురుషుడు తృప్తి పొందజాలనివాడై ఆయా సుకుమార భాగములయందు పంటితో గాటుపరచి ఆనందించే లక్షణం కలవాడై ఉంటాడు. ఇట్లు పండ్లతో గాటుపరచుట సహజమే కాని అసహజము కాదు. సౌందర్యాన్ని అనుభవించుటయందు దంతములతో క్షతం అనగా గాటు కలిగించుట పురుషునియందలి తీవ్రావేశాన్ని సూచిస్తుంది. అట్లు ఆవేశముతో పురుషుడు దంతక్షతం ఆచరించినంతనే స్త్రీయందుకూడ రతికి అభిముఖమైన స్పందనం ఏర్పడుతుంది.

ఈ దంతక్షతములు మొత్తం ఏడు రకాలుగా ఉన్నాయి. ఈ క్షతాలు ఆచరించుటకు పూర్వం పురుషుడు తన దంతములయొక్క శుభ్రతవిషయమున శ్రద్ధవంహించినవాడై ఉండాలి. మలినరహితములై తెల్లగా మెరసే దంతపంక్తి పురుషుని అందాన్ని ఇనుమడింపజేస్తుంది. మరియు అట్టి దంతాలు దంతక్షతాదరణానికి యోగ్యములై ఉంటాయి. దంతములయందిట్టి స్వచ్ఛత సంపాదించుటకు పండ్లు తోముకొనుట యందే కాక అజీర్ణాదిరోగములు సంభవించుటకు వీలులేని మితాహార నియమమునందుకూడ శ్రద్ధ అవసరము. దంతక్షతములయందు మొదటిది గూఢకము.

1. గూఢకము : గూఢ శబ్దమునకు రహస్యమైనదని అర్ధము. ప్రియురాలి కైందిపెదవియందు పురుషుడు తన పైపంటితో క్రింది