Jump to content

నాగర సర్వస్వం/దంతక్షతములు

వికీసోర్స్ నుండి

పాదచిహ్నమువంటి గోటి గీరలు భార్యా శరీరమునందేర్పడుతాయి. భార్యయొక్క స్తనములయందైనచో ఈ మయూరపదరేఖలు చూచుకము (చను మొన) దగ్గర కలుస్తాయి.

ఇట్టివైన నఖక్షతములను ఎనిమిదింటిని నాగరజనులు ఔచిత్య మెరిగి ఆచరించే నేర్పు కలవారై ఉంటారు. వీని వలన భార్యామానసములో ఉల్లాసం కలుగుతుంది.


దంతక్షతములు

పరమసుందరములైన భార్యాశరీరభాగములను కేవలము తాకి, చుంబించి, గోటితో గిల్లి పురుషుడు తృప్తి పొందజాలనివాడై ఆయా సుకుమార భాగములయందు పంటితో గాటుపరచి ఆనందించే లక్షణం కలవాడై ఉంటాడు. ఇట్లు పండ్లతో గాటుపరచుట సహజమే కాని అసహజము కాదు. సౌందర్యాన్ని అనుభవించుటయందు దంతములతో క్షతం అనగా గాటు కలిగించుట పురుషునియందలి తీవ్రావేశాన్ని సూచిస్తుంది. అట్లు ఆవేశముతో పురుషుడు దంతక్షతం ఆచరించినంతనే స్త్రీయందుకూడ రతికి అభిముఖమైన స్పందనం ఏర్పడుతుంది.

ఈ దంతక్షతములు మొత్తం ఏడు రకాలుగా ఉన్నాయి. ఈ క్షతాలు ఆచరించుటకు పూర్వం పురుషుడు తన దంతములయొక్క శుభ్రతవిషయమున శ్రద్ధవంహించినవాడై ఉండాలి. మలినరహితములై తెల్లగా మెరసే దంతపంక్తి పురుషుని అందాన్ని ఇనుమడింపజేస్తుంది. మరియు అట్టి దంతాలు దంతక్షతాదరణానికి యోగ్యములై ఉంటాయి. దంతములయందిట్టి స్వచ్ఛత సంపాదించుటకు పండ్లు తోముకొనుట యందే కాక అజీర్ణాదిరోగములు సంభవించుటకు వీలులేని మితాహార నియమమునందుకూడ శ్రద్ధ అవసరము. దంతక్షతములయందు మొదటిది గూఢకము.

1. గూఢకము : గూఢ శబ్దమునకు రహస్యమైనదని అర్ధము. ప్రియురాలి కైందిపెదవియందు పురుషుడు తన పైపంటితో క్రింది పెదవితో కొంచెమెరుపుచిందునట్లు నొక్కుట జరిగితే అది గూఢకము అనబడుతుంది. అది కేవలము ఎఱ్ఱదనము అనగా కందియుండుటచే మాత్రమే గుర్తించదగిన స్థితిలో ఉండాలి. లోతుగా గాటుపడరాదు. ఇట్లు నిగూఢమైన స్థితికలిగిన దంతక్షతము 'గూఢకము' అనబడుతుంది.

2. ఉచ్ఛూనకము : ఉచ్ఛూనము అనగా ఉబ్బినది. ప్రియురాలు సమీపమునందుండగా పురుషుడు ఒక్కొక్కపుడు ఉన్మత్తమైన ఆవేశానికి లోనై ఆమెయొక్క రమ్యశరీరభాగములను లలితముగా కాక ఇంచుక ఉబ్బినట్లు గాఢంగా మునిపంటితో పీడించుటకూడ జరుగుతూఉంటుంది. భార్యయొక్క క్రిందిపెదవియందు, ఎడమ బుగ్గ యందు పైనచెప్పినరీతిగా ఉబ్బునట్లు పంటితోనొక్కుట ఉచ్ఛూనకము అనబడుతుంది. ఉబ్బుట దీని ప్రధానలక్షణము. అయినను భార్యయొక్క మిగిలిన శరీరభాగములను విడచి క్రిందిపెదవిని, ఎడమబుగ్గనుమాత్రమే దీనికి తగిన స్థానములుగా శాస్త్రకర్తలు నిశ్చయించారు.

3. ప్రవాళమణి : ప్రవాళమనగా పగడము. పగడము ఎఱ్ఱగా ఉంటుంది. ఉచ్ఛూనకమే మిక్కిలి నేర్పుతో భార్యయొక్క యెడమబుగ్గయం దాచరింపఁబడినప్పుడు ప్రవాళమణి అనబడుతుంది. నేరుపులేకుండ ఈ దంతక్షతము ఆచరింపరాదు.

4. బిందువు : భార్యయొక్క క్రిందిపెదవిని పురుషుడు తన ముందుపండ్లతో (క్రిందిపండ్లతోడను, మీదిపండ్లతోడను ) రెంటితో మాత్రము గాటుపరచినచో అచ్చట ఒక చుక్క ఏర్పడుతుంది. అట్టి క్షతమునకు బిందుక్షతమని పేరు. ఈ నాగరసర్వస్వమునందు బిందుక్షతము మాత్రమేచెప్పబడినది. కాని రతిరహస్యమునందిట్టి బిందువులను వరుసగా ఏర్పాటుచేయుట "బిందుమాల" అనబడుతుందని వేరొక దంతక్షతముకూడ వివరింపబడినది. చూ. రతిరహస్యం.

5. మణిమాల : భార్యయొక్క కంఠము, బుగ్గలు, గుండెలు ఈక్షతమునకు తగినవి. ఈస్థలములయందు పురుషుడు తనయొక్క క్రింది పండ్లను మీదిపండ్లను అన్నిటిని వినియోగించి కొంచెము గాఢముగ క్షతమొనర్చినచో ఆపంటిగాట్లు వరుసగా యేర్పడతాయి. అవి ఎఱ్ఱగా మణులమాలవలె మెరుస్తాయి. అట్టి దంతక్షతమునకు మణిమాల అని పేరు.

6. గండకము : దీనికే ఖండకము లేక ఖండాభ్రకము అని పేరు. ఖండకము అనగా ముక్క. అభ్రము అనగా మేఘము. ఖండాభ్రకమునకు మేఘఖండమని అర్థము. ఆకాశమునందప్పుడప్పుడు దొంతులు దొంతులుగా ఒకేదానిమీద ఒకటి పేర్చినట్లు మేఘఖండాలు కనిపిస్తాయి. సరిగా అట్టి రూపము యేర్పడునట్లు పురుషుడు భార్య యొక్క బలిసిన చనుగవ చుట్టూ వృత్తాకారములో పంటిగాటులను యేర్పరిస్తే అది 'గండకము' అనబడుతుంది.

7. వరాహచర్వితము : వరాహమనగా పంది. చరిత్వమనగా తినబడినది. పందులు యేతుంగముస్తెలనో తినుటకై భూమిని ముట్టెతో పెల్లగించుట చూస్తూ ఉంటాము అట్లే పురుషుడు భార్యయొక్క బలిసి ఉన్న చనుగవ మీదను, పిరుదులమీదను దీర్ఘ రేఖలు యేర్పడునట్లు పండ్లతో గాటు పరచినచో అది 'కోలచరిత్వము' అనబడుతుంది.

లోకమునందు భార్యాభర్తలు కామభావ ప్రేరితులైనపుడు ఆలింగన-చుంబన-నఖక్షత-దంతక్షతాదులు వాని అంతట అవే యేర్పడుతూ ఉంటాయి. కాని శాస్త్రము లలితములు, సుందరములు అయిన విధానాలను ప్రస్తావిస్తుంది. నాగరకజనం సర్వవిషయాలను లలితంగా సుందరంగా ఉపాసిస్తారేకాని ఎందునా మోటుదనం కనబరచరు.

పైన చెప్పబడిన దంతక్షతాదుల వలన స్త్రీ పురుషులలోని కామాగ్ని ప్రజ్వరిల్లి వారిలో ఆభ్యంతరరతికి తగిన ఉద్వేగంజనిస్తుంది. ఆలింగన-చుంబన-నఖక్షత-దంతక్షతములనే యీ నాలుగింటికి బాహ్యరతి అని పేరు. సహజంగా పురుషునియందు కంటె స్త్రీయందు కామము ఎక్కువ. అందుచే పురుషుడు బాహ్యరతి పూర్వకంగానే నర్తించాలి కాని ఆరంభమందే అభ్యంతరరతికి ఉపక్రమిస్తే ఆమెలో సంతృప్తి యేర్పడదు. పురుషాంగము యొక్క యోనియందు సంనివిష్టము చేయబడే అభ్యంతరరతిని గూర్చి తెలిసికొనుటకు ముందు స్త్రీయొక్క యోనిస్వరూపమును గూర్చి తెలియుట అవసరము.