నాగర సర్వస్వం/ఆలింగన భేదములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆలింగన భేదములు


ఆలింగనము అనగా కౌగిలింత. కౌగిలి రతిలో తొలిమెట్టు వంటిది. ఆలింగనము వలన స్తీ పురుషుల శరీరము ఉద్రిక్తము అవుతుంది. వారు రతికి వున్ముఖులవుతారు. ఈ ఆలింగనములు అవియేర్పడే స్థితి భేదమునుబట్టి పదిరకములుగా వున్నాయి.

1. స్పృష్టకము :- 'స్పృష్టకము' అనగా తాకుట. ఆలు మగలు ఒకరినొకరు కేవలము తాకుటతో యేర్పడే ఆలింగనమైనందున దీనికీ పేరువచ్చినది. నవవివాహితులైన వధూవరులు ఒకరినొకరు గాఢముగా కౌగలించుకొనుటకు పెద్దలయెదుట తగినంత అవకాశము లేని వారైనపుడు, మనస్సులోని కోరిక ప్రబలంగా ఉన్నప్పుడు, యేదో పనిమీద ఇటునటు సంచరించుచునే ఒకరినొకరు రాసుకొని వెళ్ళుట లేక వచ్చుట ఆచరిస్తారు. ఇట్టిదైన శరీర సన్నికర్ష క్షణికమే అయినప్పటికి నవదంపతులకది మిక్కిలి ఆనందాన్ని చేకూరుస్తుంది. వారిలో సంగమాశయాన్ని పెంపొందిస్తుంది. నవదంపతులయందేకాక కొంతకాలం వియోగాన్ని అనుభవించివున్న దంపతులయందుకూడ ఈ ఆలింగనం యేర్పడుతుంది. స్వేచ్ఛగా ఒకరినొకరు కలిసి అనుభవించుటకు అవకాశ ముండి పరిచయాధికతవలన లజ్జాదులు తొలగిన వారియం దీస్పృష్టకా లింగనము యేర్పడదు.

2. పీడితము :- పీడితము అనగా పీడింపబడినదని అర్ధము. భార్యాశరీరాన్ని భర్త తనశరీరముతో మిక్కిలిగా నొక్కి పీడించుట జరిగితే అది పీడితము అనే ఆలింగనము అనబడుతుంది. ఈ ఆలింగనముకూడ నవ వివాహితులయందే అధికముగా యేర్పడుతుంది. వారికి యౌవనోదయమైనప్పటికి పెద్దలు వారిసాంగత్యానికి ఇంకా యేర్పాటు చేయనపుడు ఏ తీర్థములయందో, ఏజనసమ్మర్ద ప్రదేశములయందో తోసిల్లినపుడు ఈ ఆలింగనం వారిమధ్య ఏర్పడే ఆవకాశంకలుగుతుంది.

అట్టి పరిస్థితులలో పురుషుడు భార్యమీది మక్కువతో ఆ సమ్మర్దములో భార్యవున్న చోటుకు ఎట్లోచేరుకొని-జనసమ్మర్దము కారణముగా అన్నట్లు ఆమెశరీరాన్ని ఏగోడకో ఆన్చి తనశరీరముతో మిక్కిలిగా పీడించుట జరిగితే-ఇట్లు ఒరసుకొని నిలచినవాడు భర్త అయినందున అతనిమీద తనకును ప్రేమ ఏర్పడి వున్నందున ఆ భార్య ఈ పీడితాలింగాన్ని ఏవో మధురభావనలు భావించుకొంటూ లజ్జతో అనుభవిస్తుంది.

స్వేచ్ఛగా ఒకరినొకరు పొందుటకు తగిన అవకాశమున్నవారు పీడితాలింగనమునకై యత్నింపరు.

3. లతావేష్టితము :- "లతావేష్టితము" అనగా లతవలె చుట్టబట్టుకొనుట. లోకంలో ఏమద్దిచెట్టు మొదటనో ఏదో ఒక లత బయలుదేరి ఆ చెట్టును చుట్టుకొంటూ క్రమంగా పైకి వ్యాపించి తన తీవలచే ఆ వృక్షముయొక్క కొనగొమ్మలను క్రిందికి వంచడం చూస్తూవుంటాము.

సరిగా అటులే భార్య తన సర్వశరీరముతోడను భర్తయొక్క శరీరాన్ని చుట్టుకొన్నదై ఉన్నతమైన ఆతని ముఖాన్ని చుంబించుటకు క్రిందికి వంచుట జరిగితే అది లతావేష్టితము అనబడుతుంది. వివాహితలై పరస్పరం బాగా పరిచయాన్ని పొందిఉన్న దంపతులయందీ ఆలింగనం ఏర్పడుతుంది. మనస్సులో కోరిక తీవ్రంగా ఉన్నపుడుమాత్రమే భార్య ఈవిధమైన లతావేష్టితాన్ని ఆచరిస్తుంది.

4. వృక్షాధిరూఢము :- వృక్షాధిరూఢము అనగా చెట్టు ఎక్కినటులు వర్తించుట. భర్త నిలువబడి యుండగా అతనియొక్క ఒకపాదమును భార్య తన ఒకపాదముతో త్రొక్కి-రెండవపాదము నాతని తొడపైనుంచి, అతని నడుము నొకచేతితోడను, మెడను వేరొకచేతితోడను పట్టుకొని, అతని ముఖాన్ని వంచి ముద్దుపెట్టుకొనుటకు యత్నిస్తే అది వృక్షాధిరూఢము అనబడుతుంది.

అలా తాను నిలువబడి యుండగా ఏ కొబ్బరిచెట్టుమీదకో ఎక్కుతూవున్నట్లు తనమీదకు ఎక్కి నిలచి, తన ముఖాన్ని ముద్దు పెట్టుకొనుటకు యత్నించే పలుచని శరీరంకల భార్యను చూచి నవ్వుతూ భర్త తన ముఖాన్ని సహజంగా ఆమెకు ముద్దు పెట్టుకొనుటకు చిక్కనీయకపోవడం కూడ జరుగుతూ వుంటుంది. అప్పుడామె అతని ముఖాన్ని అందుకొనడానికై యత్నించి, తన యత్నాన్ని విఫలంచేసె భర్తనుచూచి గారం గుడుస్తూ దైన్యాన్ని ప్రదర్శించడం ఆమె దైన్యాన్ని చూచి భర్త ఆమెను పొదవుకొనడం కూడ జరుగుతూ ఉంటుంది. ఇట్టి ఆలింగనమునకే "వృక్షాధిరూఢ" మని పేరు. భర్త సమున్నతమైన దేహము కలవాడైనపుడు, భార్యయొక్క మనస్సులో కోరిక తీవ్రముగా ఉదయించినపుడు ఇట్టి ఆలింగనము ఏర్పడుతుంది.

5. తిలతండులము :- తిలలు అనగా నువ్వులు. తండులములు అనగా బియ్యము. వీని రెంటిని కలబోసినపుడు ఒకదాని నుండి వేరొకదానిని విడదీయుట సుఖసాద్యము కాదు. అట్లే భార్యాభర్తలు శయ్యపై మిక్కిలి అనురాగముతో ఒకరిశరీరాన్ని ఒకరు పొదవుకొని గాఢాలింగనంలో ఏకీకృత శరీరులై ఉంటే ఆ స్థితి తిలతండులము అనబడుతుంది.

6. క్షిరనీరము :- క్షీరము అనగా పాలు. నీరము అనగా నీరు. పాలలో నీరు కలిపినపుడు ఇవిపాలు, ఇదినీరము అని విడదీయుట సాధ్యముకాదు. అట్లే భార్యా భర్తను, అతని శరీరములో లీనమగుచున్నదేమో అనునటులం గాఢంగా ఆలింగనం చేసికొని, అతని శరీరంతో కలిసిపోయి ఒకటిగావున్న తన శరీరమును ఆ ఆలింగనస్థితియందే ఇంచుక కదల్చుట జరిగితే ఆది "క్షీరనీరము" అనబడుతుంది. భార్యా భర్తలు గాఢాలింగిత శరీరులై నిశ్చలంగా ఉండుట జరిగితే తిలతండులము. గాఢాలింగన స్థితియందు నిశ్చలంగా కాక ఇంచుక కదలేవారైతే క్షీరనీరము అని గ్రహించాలి. ఏమనగా క్షీరనీరములు ద్రవములగుటచే ఒకదానితో నొకటి కలిసినపుడు వానియందు తరంగమువంటి చలనము యేర్పడుతుంది. తిలతండులములయందది ఉండదు.

7. జఘనోప గూహనము :- జఘనము అనగా మొల. భార్యా తన భర్తయొక్క జఘనభాగమునకు తన జఘనభాగము నాన్చి అతనిని బలముతో ఆక్రమించుకొని జారుచున్న పైటకలదై గతంలో భర్త తన శరీరముపై ఆచరించిన నఖక్షతాలను (గోటి నొక్కులను) వెల్లడించే శరీరముతో ఆలింగనము చేసికొనుట జరిగితే అది "జఘనోప గూహనము" అనబడుతుంది. 8. కుచోపగూఢము :- కుచములు అనగా చనులు. భార్య తన బలిసిన స్తనములతో భర్తయొక్క విశాలమైన వక్ష స్థాలాలిన్ని క్రుమ్ముచు వానిని మిక్కిలిగా అదిమి ఆలింగనం చేసికొంటే అది కుచోప గూఢము లేక కుచోపగూహసము అనబడుతుంది.

9. ఊరూపగూఢము :- ఊరుపు అనగా తొడ, భార్యయొక్క లలితములు, సుందరములు అయిఉన్న తొడలను భర్త తన తొడలతో మిక్కిలిగా నొక్కుచు ఆలింగనం చేసుకొంటే ఆ ఆలింగనము ఊరూపగూఢము అనబడుతుంది.

10. లాలాటికము :- లాలాలాట మనగా నుదురు. భర్త భార్యయొక్క కన్నులలోనికి లాలసతో చూచుచున్నవాడై ఆమె నుదుటిని తన నుదుటితో ఢీకొనుట జరిగితే అది లాలాటికము అనబడుతుంది. భార్యా భర్తలయొక్క మిగిలిన శరీరము ఒకదానితో ఒకటి ఒరసుకొనుట జరిగినను జరగకున్నను ఆ లాలాసతోడి చూపు, లాలాటముతో ఢీకొనుట వారి హృదయాలలో కామభావాన్ని దీప్తంచేస్తాయి.

ఇట్టివైన ఈ ఆలింగనములు భార్యా భర్తలను రతిక్రీడకు ఉన్ముఖులను చేస్తాయి. భార్య లేక భర్త తామొదటి కోరికకల వాడైనను ఆభర్తయందు లేక భార్యయందు కోర్కెను రగిలించక రతికి ఉపక్రమింపరాదని వెనుక ప్రకరణములో చెప్పుట జరిగినది.

నాగరులు ఈ ఆలింగనభేదములు తెలిసినవారై తమప్రియులను రతికి ఉన్ముఖులను గావించి పిమ్మట రతిక్రీడాపరులై సుఖించాలి.

చుంబన భేదములు

స్త్రీ పురుషుల శరీరములోని నాడీమండలమునందు రతికి అభిముఖమైన ఒక ఆవేశము లేక ప్రేరణ ముందు ఏర్పడాలి. అనంతరం రతిక్రీడ ఏర్పడాలి. రతిక్రీడకు పూర్వాంగముగా జరిగితే ఆలింగన