Jump to content

నాగర సర్వస్వం/చుంబన భేదములు

వికీసోర్స్ నుండి

8. కుచోపగూఢము :- కుచములు అనగా చనులు. భార్య తన బలిసిన స్తనములతో భర్తయొక్క విశాలమైన వక్ష స్థాలాలిన్ని క్రుమ్ముచు వానిని మిక్కిలిగా అదిమి ఆలింగనం చేసికొంటే అది కుచోప గూఢము లేక కుచోపగూహసము అనబడుతుంది.

9. ఊరూపగూఢము :- ఊరుపు అనగా తొడ, భార్యయొక్క లలితములు, సుందరములు అయిఉన్న తొడలను భర్త తన తొడలతో మిక్కిలిగా నొక్కుచు ఆలింగనం చేసుకొంటే ఆ ఆలింగనము ఊరూపగూఢము అనబడుతుంది.

10. లాలాటికము :- లాలాలాట మనగా నుదురు. భర్త భార్యయొక్క కన్నులలోనికి లాలసతో చూచుచున్నవాడై ఆమె నుదుటిని తన నుదుటితో ఢీకొనుట జరిగితే అది లాలాటికము అనబడుతుంది. భార్యా భర్తలయొక్క మిగిలిన శరీరము ఒకదానితో ఒకటి ఒరసుకొనుట జరిగినను జరగకున్నను ఆ లాలాసతోడి చూపు, లాలాటముతో ఢీకొనుట వారి హృదయాలలో కామభావాన్ని దీప్తంచేస్తాయి.

ఇట్టివైన ఈ ఆలింగనములు భార్యా భర్తలను రతిక్రీడకు ఉన్ముఖులను చేస్తాయి. భార్య లేక భర్త తామొదటి కోరికకల వాడైనను ఆభర్తయందు లేక భార్యయందు కోర్కెను రగిలించక రతికి ఉపక్రమింపరాదని వెనుక ప్రకరణములో చెప్పుట జరిగినది.

నాగరులు ఈ ఆలింగనభేదములు తెలిసినవారై తమప్రియులను రతికి ఉన్ముఖులను గావించి పిమ్మట రతిక్రీడాపరులై సుఖించాలి.

చుంబన భేదములు

స్త్రీ పురుషుల శరీరములోని నాడీమండలమునందు రతికి అభిముఖమైన ఒక ఆవేశము లేక ప్రేరణ ముందు ఏర్పడాలి. అనంతరం రతిక్రీడ ఏర్పడాలి. రతిక్రీడకు పూర్వాంగముగా జరిగితే ఆలింగన చుంబన-నఖక్షత-దంతక్షతాదులు బాహ్యరతి అనబడతాయి. చుంబనం అనగా ముద్దు, అత్యధికమైన ఆకర్షణకలచోట యీచుంబనం తనంతతానుగా ప్రవర్తిల్లుతుంది. భార్యాసౌందర్యముచే ఆకృష్టుడై భర్త ఆమెను చుంబించినపుడు-అంతవరకు ఏవిధమైన ఆవేశమును పొందనిదైనప్పటికి ఈ చుంబనముతో ఆభార్యయొక్క నాడీమండలములోకూడ రతికి అభిముఖమైన స్పందనము, ఆవేశము ఏర్పడతాయి.

కాముకుడైన పురుషునకు భార్యయొక్క సర్వశరీరము చుంబించదగినదిగానే తోస్తుంది. అయినా శరీరంలో స్పర్శగుణం ఎక్కడెక్కడ అధికంగా ఉంటుందో అక్కడక్కడ చేయబడిన చుంబనములే యోగ్యమైన ఫలితాన్ని యిస్తాయి. ఆవిధంగా స్థానభేదమును బట్టి నిశ్శబ్దము, సశబ్ద అయిన క్రియనుబట్టి చుంబనభేదాలు ఏర్పడతాయి. ముద్దుపెట్టుకొనుటయందు పెదవులయొక్క స్పర్శయేకాని ధ్వని ఉండని చుంబనములు నిశ్శబ్ద చుంబనములనియు, ధ్వనితో కూడిన చుంబనములు సశబ్ద చుంబనములనియు చెప్పబడతాయి.

ఆలుమగలలో కామభావము పరమ తీవ్రముగా ఉన్నప్పుడు వారి చుంబనములు నిశ్శబ్దముగానే సాగుతాయి, అనగా ఒకరి ముఖముపై నొకరి ముఖమును పెదవులను ఉంచుకొని నిశ్శబ్దముగానే నిట్టూరుస్తూ పారవశ్యాన్ని పొందేవారు అవుతారు. ఒకవేళ వీనియందు ధ్వనియేర్పడినను అది మిక్కిలి అల్పమై గణనకు రానిదై ఉంటుంది. అట్టిచుంబనములు నిశ్శబ్దచుంబనములు అనబడతాయి. ఇక ధ్వని ప్రధానముగా సాగే చుంబనములు సశబ్ద చుంబనములు అనబడతాయి. వానిలో మొదట సశబ్ద చుంబనములు వివరింప బడుతూ ఉన్నాయి. ఇవి మొత్తం ఏడురకాలుగా ఉన్నాయి. నిశ్శబ్ద చుంబనములు :-

★ ★ ★