నరసభూపాలీయము/ప్రథమాశ్వాసము
శ్రీరస్తు
నరసభూపాలీయము
కావ్యాలంకారసంగ్రహము
గ్రంథాదికృత్యములు
| 1 |
సీ. | ఏలేమ కడలిరాచూలి యౌ టెఱిఁగించుఁ, గలితవళీతరంగములరంగు | |
తే. | యట్టి శ్రీదేవి సుకవివాగమృతదంబు, నఖిలభువనోన్నతము నైనయౌబళేంద్ర | 2 |
చ. | పలుకులకొమ్మనెమ్మొగముఁ బార్వణచంద్రునిఁ గాఁ దలంచి యు | 3 |
సీ. | ఒకటి యక్షరవిలాసోల్లాసమున మించ, నొకటి తాళప్రౌఢి నుల్లసిల్ల | |
తే. | నసమసాహిత్యసంగీతరసము లనెడు, గుబ్బపాలిండ్లు దాల్చుపల్కులవెలంది | 4 |
శా. | గంగం దాల్చితి వుత్తమాంగముననన్ గైకోలు గావించి త | |
| శృంగారోన్నతిఁ జూడు మంచు గిరిజ న్శీర్షాపగాబింబిత | 5 |
చ. | అరుదుగ వామభాగలలనాకలనాచలనాత్ముఁడైన యా | 6 |
సీ. | తనయాస్యగహ్వరంబునకు ఖద్యోతజృం, భణము ఖద్యోతజృంభణము గాఁగ | |
తే. | నఱలు రామానుజన్మజీవప్రదాన, ధుర్యపర్యాయధాత మేదురవిరోధి | 7 |
సీ. | ఎవ్వాఁడు మొదలఁ దా నిలకు భారతి డించెఁ, దగ భగీరథుఁ డభ్రతటినిఁ బోలె | |
తే. | నట్టిమహిమాధికులఁ గొల్చి యఖిలమునివ | 8 |
సీ. | ఏమహాత్ములు గల్గ భూమీశసభలలోఁ, గవులకు నధికవిఖ్యాతి గల్గె | |
తే. | నేదయాళులు బుధవచోహేతిచకిత, విసరదపశబ్దభరణలాలసముఖాబ్జు | 9 |
వ. | ఇవ్విధంబునఁ బ్రారీప్సితగ్రంథనిర్విఘ్నపరిసమాప్తిసంప్రదాయావిచ్ఛేదలక్షణ | |
| క్షీరవివేచనోచితప్రశంసితహంసాయమానప్రతిమానబంధంబు నగు నొక్క | 10 |
సీ. | లలితాకలంకకలాకలాపంబున, నేరాజు రేరాజు నేవగించి | |
తే. | నతఁడు రిపురాడఖర్వగర్వాంధకార, గంధనిర్గంధనాంభోజబంధుబంధు | 11 |
వ. | వెండియు బ్రచండభుజాదండతాండవమండలాగ్రఖండితారాతిమండలుండును | |
| తులు హితులు పౌరాణికులు వైణికులు గాయకులు గణికులు నాదిగాఁ గల నిఖిల | 12 |
సీ. | శతలేఖినీపద్యసంధానధౌరేయు, ఘటికాశతగ్రంథకరణధుర్యు | |
తే. | నమితయమకాశుధీప్రబంధాంకసింగ, రాజసుతతిమ్మరాజపుత్త్రప్రసిద్ధ | 13 |
క. | కనుఁగొని దయామరందము, కనుఁదమ్ములఁ గ్రమ్మ నుచితగౌరవలీలా | 14 |
సీ. | బాణు వేగంబును, భవభూతి సుకుమార,తయు, మాఘు శైత్యంబు, దండి సమత, | |
గీ. | నీక కల దటుగాన ననేకవదన, సదనసంచారఖేదంబు సడలుపఱిచి | 15 |
ఉ. | కావున నీయుదగ్ర మతిగౌరవయోగ్యనిరూపణంబుగా | 16 |
వ. | అని సబహుమానంబుగాఁ గర్పూరతాంబూలజాంబూనదాంబరాభరణచ్ఛత్రచా | 17 |
సీ. | నిజరూపమునకు వన్నియ దెచ్చు వేఱొక్క, బెళుకొందు ధ్వని హీరకళిక లమర | |
తే. | నిల నలంకారనికరంబు లిరవుకొలిపి, కమలభవగేహినీపరిష్కరణకరణ | 18 |
క. | వారిప్రసాదమున నలం, కారము ధ్వని లక్షణాధికారరసాలం | 19 |
తే. | అసదృశరసప్రధానశబ్దార్థములును, రీతులును వృత్తులును నలంకృతులు గుణము | 20 |
క. | ఈకావ్యలక్షణంబు ల, నేకులు దొల్లింటిపెద్ద లేర్పఱిచిన సు | 21 |
వ. | ఏతత్ప్రబంధబధురావ్యాజకావ్యాలాపలక్షణకృతక్షణప్రసంగసంగ్రహణ | 22 |
క. | బంధురతరప్రబంధుల, బంధముల కనంతకీర్తిభాగ్యప్రదధౌ | 23 |
సీ. | రామాయణాదికగ్రంథంబు లనవద్య, నేతృవర్ణనల వన్నియకు నెక్కె | |
తే. | ననినఁ గావ్యం బమేయనాయకవికస్వ,రస్వరూపనిరూపణభ్రాజి యగుట | 24 |
శా. | వేదంబుల్ నృపశాసనంబులు సుహృద్విజ్ఞాపనంబు ల్పురా | 25 |
మ. | పరమజ్ఞానలతాలవాలము జగత్ప్రఖ్యాతవిఖ్యాతసా | 26 |
క. | కావున నేవంవిధసుగు, ణావాసం బైన కావ్య మలరును నవర | 27 |
మ. | అని యూహించి మదీయసంఘటిత కావ్యాలంకారసంగ్రహం | 28 |
నాయకవంశవర్ణనము
సీ. | శ్రీమించు పద్మినీభామామణి కినుండు, నిరతసంసారవార్నిధికిఁ దరణి | |
తే. | హరిహరవిరించిముఖదేవతానుభావ, ఘనతస్వర్ణకారు లొక్కటియ కాఁగఁ | 29 |
క. | అతనికి వైవస్వతమను, వతనికి నిక్ష్వాకునృపతి యతనికిఁ గుక్షి | 30 |
సీ. | అనరణ్యుఁ డతని కాయ నఘుఁడు పృథుఁ గాంచెఁ, బృథుఁడు త్రిశంకుధాత్రీంద్రు గనియె | |
తే. | డతఁడు గాంచె భగీరథు నాత్మవంశ, పావనుని నాతనికిఁ గకుత్స్థావనీశుఁ | 31 |
చ. | అతనికి నంబరీషుఁ డయుతాయువు తత్సుతుఁ డవ్వసుంధరా | 32 |
క. | ఘనుఁ డతఁ డైలబిలేంద్రుని, గనియెం బృథుధర్మవిభునిఁ గనియె నతఁ డతం | 33 |
సీ. | భవ్యుఁ డాతఁడు దీర్ఘబాహునిఁ గనియె నా, తఁడు గాంచె రఘువు నాతనికిఁ గలిగెఁ | |
తే. | డతనికి యయాతి నాబాగుఁ డతని కతని, కజుండు దశరథుఁ డతనికి నతని కొదవె | 34 |
సీ. | ఏరాజు వివిధపుష్పారాధనమున గం, గాధరునితలమీఁది కౌచు మానె | |
| నేరాజురత్నోపహారానుభవభూతి, రుద్రునెమ్ములదండరోఁతి మానె | 35 |
చ. | అతఁడు మహాదిగంతవిజయం బొనరించి సురాద్రియౌల ను | 36 |
తే. | శ్రీలఁ జెలువొందు నాకలికాలచోళ, కుంభినినాథుకులమున సంభవించె | 37 |
సీ. | తనకీర్తికబరవాహిని యీడుగామికి, నమ్మహానదితోడియమున సాక్షి | |
తే. | గాఁగ విలసిల్లు ననుపమక్షాత్త్రధర్మ, పరత నృపపఙ్క్తి కితఁ డోజబంతి యనఁగ | 38 |
క. | ఆపోచిరాజువంశసు, ధాపారావారమునకుఁ దారాపతియై | 39 |
సీ. | రక్షించినాఁడు హిరణ్యధారావృష్టిఁ, జతురార్థిసంఘాతచాతకముల | |
తే. | నతఁడు రాజన్యమాత్రుఁడు యపరశిఖరి, చరమగహ్వరబంహిష్టజరఠతిమిర | 40 |
క. | ఈరాజశిఖామణికిన్, ధీరాత్ములు తనయు లైరి తిప్పువిభుఁడు గం | 41 |
వ. | అందగ్రజుండు. | 42 |
సీ. | తనజయధ్వజమారుతములు వైరికిరీట, ఖచితసన్మణిదీపకళల మలుపఁ | |
తే. | నాజి మాంధాత యనఁ బొల్చు రసికలోక, సతతసంరక్షణాస్తోకజాగరూక | 43 |
తే. | ఆతడు రామప్రభుని బానెమాంబయందు, నౌబళేంద్రుని లక్కాంబయందుఁ గనియె | 44 |
క. | వారలలోన ధురంధరుఁ, డై రానునృపాలుఁ డమరు నమరపురంధ్రీ | 45 |
చ. | హరిభజనప్రవీణుఁ డగునాధరణీంద్రుఁడు బైచమాంబికం | 46 |
చ. | అరయఁగ నమ్మహీవరుల కగ్రజుఁ డైతగు తిమ్మరాజు ని | 47 |
క. | ధర నతఁడు రామనృపసో, దరి యగు కొండాంబయందుఁ దనయుని గాంచెన్ | 48 |
సీ. | మిత్త్రగేహముల నమిత్త్రగేహములఁ, గనకసంఘాత మేవిభుఁడు నిల్పె | |
తే. | జగతి నే రాజు కువలయోత్సవ మొనర్చు, రాజు గావున నటు స్వీయరక్షచేతఁ | 49 |
తే. | అతఁడు తిమ్మాంబయందుఁ దిమ్మావనీశుఁ, జిన్నతిమ్మప్రభునిఁ గాంచె సీతయందు | 50 |
క. | ఈ సంతతిఁ దగు తిమ్మ, క్షాసుత్రామునకుఁ గూర్మి సహజన్ముఁ డనన్ | 51 |
చ. | సరసనఖప్రసూనభుజశాఖలఁ జెంది వచోమరందమా | 52 |
ఉ. | భూనుతశౌర్యుఁ డోబనృపపుంగవుఁ డుగ్రరణోర్విభీమబా | 53 |
క. | అతఁ డోబళాంబయం ద, ప్రతిముని నోభనృపాలు రామమహీశున్ | 54 |
క. | తదనుజుఁడు వరదభూపతి, సుదతీమకరాంకుఁ డమరు సురపురవనితా | 55 |
వ. | తత్క్రమంబున. | 56 |
సీ. | అవనినభోంతరం బాస్యరంధ్రము గాఁగ, ఘనపంక్తిమోము పైకప్పు గాఁగ | |
తే. | గరిమఁ జెన్నొందు బసవశంకరమహాంక, మాజి నేరాజశేఖరుం డావహించె | 57 |
సీ. | బలధూతధూళిచేఁ బందిళ్లు సమకట్టి, యహితరక్తము కలయంపి చల్లి | |
తే. | మెఱయు నేరాజు విజయలక్ష్మీవివాహ, విదితసన్నాహుఁడై యతఁ డదురుగుండె | 58 |
చ. | అతని సహోదరుండు చతురంబుధివేష్టితభూధురంధరుం | 59 |
క. | ఈవంశకర్త యగుతి, ప్పాననిపాలునకుఁ గూరియనుజన్ముఁడు దా | 60 |
సీ. | కమలాప్త కమలాప్త కమలాప్తసన్నిభుం, డేవిభుండు రుచి ప్రభావ దయల | |
తే. | నతఁడు సువిచారుఁ డవికారుఁ డనఘుఁ డలఘుఁ, డప్రమేయుఁ డజయ్యుఁ డతి ప్రతాపుఁ | 61 |
ఉ. | వల్లభరాజశౌర్యగుణవైభవ మెన్న విచిత్ర మమ్మహీ | 62 |
క. | అతులప్రతాపుఁ డాభూ, పతి ప్రోల్దేవేరియందుఁ బ్రబలునిఁ దిమ్మ | 63 |
సీ. | భోగి మట్టినవానిఁ భోగి జుట్టినవాని, భోగిఁ బట్టినవానిఁ బోలనేర్చుఁ | |
తే. | భరణభూతిజవప్రభాబాహుశక్తి, మతికళాశౌర్యసత్యశుంభత్ప్రభావ | 64 |
తే. | అతఁడు గంగాంబయం దౌబళావనీంద్రు,మూర్తిఘను సింగనిభుఁ గాంచెఁ గీర్తినిధుల | 65 |
ఉ. | వారలలో గభీరగుణవారిధి వారిధిపంక్తిలో సుధా | 66 |
సీ. | అప్పుపా లైనశుభ్రాబ్జంబు రుచి యెంత, మాటమోచినయంచతేట యెంత | |
తే. | యనుచుఁ దనగీర్తి ధవళాబ్జహంసమదన, మధనవరభోగివిధుశరామర్త్యవిటపి | 67 |
సీ. | ఇతనివైరులు వనప్రతతిలోఁ గాఁ పుండ, నన్వర్థ యై ధాత్రి యవని యయ్యె | |
తే. | నితనికరుణాంబురాశిసంభృతతరంగ, సంగతం బైనమనమున సంచరించి | 68 |
వ. | తత్క్రమంబున. | 69 |
సీ. | చతురాననాధికశ్రుతిహితశీలుఁడై, విబుధాన్నదానప్రవీణుఁ డగుచు | |
తే. | శౌరి బహురూపవిహరణశ్రమముఁ జెంద, లేక యన్నిగుణంబులు నేకమూర్తి | 70 |
చ. | చిరతరకీర్తి మూ ర్తినృపశేఖరుఁ డాహవదుర్మదారిభూ | 71 |
సీ. | గురువనీపకుల కాదర మొప్పఁ గొం డని, యొసఁగియుఁ గొండని యొసఁగకుండు | |
తే. | ఫణిపతికి నైన భారతీపతికి నైనఁ, బశుపతికి నైన నలబృహస్పతికి నైన | 72 |
చ. | చకచకమించు సింగనృపచంద్రునిశాక తకృపాణవల్లిలోఁ | 73 |
తే. | ఇట్లు సుగుణాభిరాములై యెనయుమూర్తి,ఘనుఁడు సింగక్షితీంద్రుఁడుఁ దను భజింప | 74 |
సీ. | ఘనభుజాశౌర్యరాఘవుఁడు రాఘవదేవ, ధరణీశుఁ డేరాజు తాతతాత | |
తే. | యట్టి సోమాన్వయాబ్ధిశీతాంశుఁ డనఁగ, నమరు శ్రీరంగవిభుపుత్త్రియై చెలంగు | 75 |
క. | కోనక్షితిపతితిమ్మమ, హీనాథుఁడు రామనృపతి యెఱతిమ్మధరా | 76 |
వ. | అం దగ్రజుండు. | 77 |
సీ. | లాటీకుచాభోగపాటీరపంకంబు, బోటిముఖాబ్జకర్పూరకలన | |
తే. | కుంతలీకర్ణమౌక్తికకుండలప్ర, కాశ మెవ్వానియభినవాకాశదేశ | 78 |
వ. | తదనుజుండు. | 79 |
శా. | శ్రీరంగప్రభుతిమ్మశౌరిభుజఖౌక్షేయంబుచే నాజుల | 80 |
వ. | తత్క్రమంబున. | 81 |
సీ. | ఖలు నతిద్రోహి సల్కయతిమ్మని హరించి, సకలకర్నాటదేశంబు నిలిపె | |
తే. | నవని యంతయు రామరాజ్యంబు సేసె, దనగుణంబులు కవికల్పితములు గాఁగ | 82 |
సీ. | ఖరదూషణాఖర్వగర్వనిర్వాపణం, బాజి నెవ్వానిసాయకనికాయ | |
తే. | యతఁడు కలియుగనవ్యరామావతార, చారుతాసార్థనామప్రదానుఁ డగుచు | 83 |
సీ. | తనభుజాదండకోదండ మఖండమై, యనువేలశరసృష్టి నాచరింపఁ | |
తే. | రాజదేవేంద్రుఁ డితఁ డనఁ దేజరిల్లు, ననఘచాళుక్యనారాయణాంకవివిధ | 84 |
సీ. | అసురారిరాణి నే నధివసించుట యెట్లు, బహువిధాసురవంశభవులయందు | |
తే. | ననుచు యవనులఁ దెగడి త న్నాశ్రయించు, వారిసామ్రాజ్యలక్ష్మి నెవ్వాఁడు గొనియె | 85 |
మ. | ప్రతికూలాదనిభృద్విభేదనకళాపారీణ మై సంగర | 86 |
మ. | బలధుర్యుం డగువేంకటేంద్రునిమహాబాహాబలాటోపవి | 87 |
మ. | స్థిరసంగ్రామజయాభిరాముఁ డగునాశ్రీవేంకటక్ష్మావరుం | 88 |
క. | ఈ రాజమణులసోదరి, యై రాజిలు లక్కమాంబ యమృతాశనధా | 89 |
సీ. | ప్రతి వచ్చు నన్నపూర్ణాదేవి భైక్షాన్న, మిడక సంయమి నలయింపకున్నఁ | |
| సరి వచ్చు భూకాంత సకల ప్రజాభార, పూర్ణాసహత్వంబుఁ బూనకున్న | |
తే. | నిమ్మహాసాధ్వి కని జను లెల్లఁ బొగడ, నలరు నోబక్షితీశు నర్ధాంగలక్ష్మి | 90 |
తే. | పొలోమికి నింద్రునకు మ, హాలలితాకృతి జయంతుఁ డాత్మజుఁ డైన | 91 |
సీ. | కాశ్యపి తా నౌటఁ గశ్యపోద్భవుఁ డైన, కాకోదరస్వామిఁ గలయు టెట్టు | |
తే. | తగవు గా దంచు ఫణికూర్మధరణిధరన, రాదిభూదారముల మాని యవనికాంత | 92 |
క. | అతఁ డిల రామయతిమ్మ, క్షితిపతిసత్పుత్త్రుఁ డగుచుఁ జెలు వొందుగుణా | 93 |
సీ. | పొలు పగు నేసాధ్విభుజవల్లి రుక్మిణీ, సత్య యేగరితవాచావిశుద్ధి | |
తే. | యట్టిగుణధన్యయై తనయాత్మయెల్ల, నఖిలపతిదేవతాసంగ్రహం బనంగ | 94 |
తే. | ఆమగువయందు నరసంహభూమివిభుఁడు, రసికసారంగరాజు శ్రీరంగరాజుఁ | 95 |
క. | అతఁ డుభయవంశపావనుఁ, డితఁ డన బాలార్కవిజయహేనాకవిభా | 96 |
సీ. | ఘనతఁ బెసాఁపనేర్చిన నాఁటనుండియు, శత్రులమీఁదఁ జేఁ జాప నేర్చె | |
తే. | నిలువ నేర్చిననాటనుండియు విరోధి, నృపతిసేనాపతుల గెల్చి నిలువ నేర్చె | 97 |
| ఈకుమారనారాయణుం గాంచిన రాజన్యపుంగవునకు. | 98 |
క. | ఏతాదృశగుణమణికి ధ, రాతల పరిపూర్ణకీర్తిరమణికి జలధి | 99 |
క. | ధన్యునకుఁ దరణికులమూ, ర్ధన్యునకు నిజప్రధానిరస్తవదాన్యం | 100 |
క. | అజరగజరజతరజనికృ, దజతనుజద్యుకుజపురజిదభుజగగజభు | 101 |
క. | గండరగండని కభినవ, మండలికాఖండమన్నెమార్తాండునకున్ | 102 |
క. | లక్కాంబానందనునకు, దిక్కాంతాచికురనికురదీపితకుసుమ | 103 |
క. | గాధేయగోత్రసవనధు, రాధేయున కఖిలసుకవిరాజికళాధా | 104 |
క. | గర్వితబరీదసేనా, సర్వస్వహరానివార్యశౌర్యునకు సమి | 105 |
క. | పీననమల్కాస్థాపన, మానితకరుణాప్రసంగమాంగళ్యునకున్ | 106 |
క. | తొరగంటి దుర్గరాజ్య, స్థిరసింహాసననివాసదీక్షానిధికిన్ | 107 |
క. | ప్రతిదినకనకవసంతా, ర్జితకృతికాంతునకుఁ దురగరేవంతునకున్ | 108 |
క. | అరుణారుణకరుణారస, పరిణామసమగ్రనయనపద్మాభునకున్ | 109 |
వ. | అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పం బూనిన యిమ్మహాలంకారప్రబంధం | 110 |
నాయకగుణములు
క. | కులము మహాభాగ్యము ను, జ్జ్వలత యుదారత మహోవిశాలత ధర్మా | 111 |
క. | వీనికి లక్ష్యములెల్లను, శ్రీనరసింహేంద్రుపేరఁ జెప్పెద నెలమి | 112 |
కులీనత ౼
సీ. | ఏవంశమునఁ బుట్టెఁ బావనశ్రుతిధర్మ, మర్మకర్మకుఁ డైన మనునృపాలుఁ | |
తే. | యట్టి యిందుగ్రహారిసేనాధిపత్య | 113 |
మహాభాగ్యము ౼
మ. | ప్రకటాభీలవిరోధిసైన్యముల ద్రుంపంజాలు నొక్కొక్కసే | 114 |
ఔజ్జ్వల్యము ౼
మ. | స్థిరసోమాన్వయదుగ్ధవార్ధి జనియించె న్వేంకటాద్రీంద్రభూ | 115 |
ఔదార్యము ౼
సీ. | అలబలీంద్రునిచేత నడుగు వెట్టగ నేర్చి, ధారాధరముచేత నీరు వోసి | |
తే. | ధరణిఁ బ్రోది వహించినదానకన్య, సకలయాచకబాంధవు ల్సన్నుతింప | 116 |
తేజస్విత —
సీ. | బహుతరాశాభ్రాంతి బయిలు వ్రాఁకక యున్నఁ, గువలయద్వేషంబు గోర కున్న | |
తే. | సాటి యగునిశ్వవినుతశశ్వత్ప్రతాప, వైభవిధ్యస్తదుర్వారవైరివీరుఁ | 117 |
ధార్మికత్వము —
చ. | పలుకుట సత్యవాసన కపారవిరోధి జయోత్సవంబు దా | 118 |
వైదగ్ధ్యము —
సీ. | వనజారి కళలచేఁ దనివి నొందించిన, నిల ఖేచరుఁడు ప్రాణ మిత్తు ననిన | |
తే. | వారి నెవ్వారిగా దని వసుధ నౌర, నిక్కముగఁ గీర్తకామిని నీకుఁ దక్కె | 119 |
క. | అనయము నాయకసుగుణము, లనేకములు గలవు వాని నతివిస్తరభీ | 120 |
నాయకస్వరూపము
క. | కీర్తిప్రతాపసుభగుం, డార్తావనుఁ డఖిలగుణగణాఢ్యుఁడు బాహా | 121 |
కీర్తిప్రతాపసుభగత్వము —
మ. | అరినిర్భేదనధుర్య యోబయనృసింహా సింహసత్వాఢ్య నీ | 122 |
అర్తావనత్వము —
మ. | ఒక ప్రహ్లాదుని నార్తుఁ గాచితి మదయోత్సేక మేకానన | |
| త్సుకత న్శ్రీనరసింహుఁ డుర్వి నరసక్షోణీశుఁ డై పుట్టెఁ గా | 123 |
గుణాఢ్యత్వము —
చ. | అరయఁ బయోధపాత్రమును నంజనశైలము కజ్జలంబుఁ ద | 124 |
భూభరణము —
చ. | విపులఫణాసహస్రమున వీఁక ధరింపఁగ నేని మేదిని | 125 |
కావ్యగీతప్రియత్వము —
మ. | నరసింహుం డతిధీరవీరరససన్నాహంబు వాటించియుం | 126 |
మ. | అమరక్ష్మాధరధీర ధీరచితకార్యారంభ రంభాసమ | 127 |
క. | కుటిలారిభయదధాటీ, పటుపటహఢమన్నినాదపరిపాటితది | 128 |
మాలిని. | అలఘునయవిహారా హారనీహారతారా | 129 |
గద్యము. | ఇది శ్రీ హనుమత్ప్రసాదలబ్ధకవితాసారసారస్వతాలంకారనిరంకుశప్రతిభా | |