దివ్యదేశ వైభవ ప్రకాశికా/శ్రీ రంగమ్
చోళదేశీయ దివ్యదేశములు
1. శ్రీ రంగమ్ - 1
శ్లో. కావేరి పరిపూత పార్శ్వ యుగళే పున్నాగ సాలాంచితే
చంద్రాఖ్యాయుత పుష్కరిణ్యనుగతే రంగాభిధానే పురే|
వైమానే ప్రణవాభిధే మణిమయే వేదాఖ్య శృంగోజ్జ్వలే
దేవం ధర్మదిశా ముఖం ఫణిశయం శ్రీ రజ్గనాధం భజే||
శ్లో. శ్రీ ధర్మ వర్మ రవివర్మ నిషేవితాజ్గ:
శ్రీరజ్గిణీ చటుల విభ్రమ లోల నేత్ర:|
నీళా సరస్యముఖ సూరి వరేణ్య గీతి
పాత్రం విరాజితి విభీషణ భాగధేయ:|
వివరణ:-శ్రీరజ్గనాధుడు(నంబెరుమాళ్), శ్రీ రజ్గనాయకి, ఉభయ కావేరులు; చంద్రపుష్కరణి, ప్రణవాకార విమానము; దక్షిణ ముఖము; భుజంగ శయనము; ధర్మవర్మకు; రవివర్మకు; విభీషుణనకు ప్రత్యక్షము. ఆళ్వార్లు అందరు కీర్తించిన తిరుపతి. అంతరంగిక కైంకర్య పరులు తిరుప్పాణి ఆళ్వార్.
ఉత్సవములు:-మకరం పునర్వసు; కుంభం శుద్ద ఏకాదశి; మీనం ఉత్తర; మేషం రేవతి అవసాన దినములుగా నాలుగు బ్రహ్మోత్సవములు జరుగును. ధనుశ్శుద్ద ఏకాదశికి ముందు వెనుకలుగా అధ్యయనోత్సవము పగల్‌పత్తు, రాపత్తు ఉత్సవములు, మిక్కిలి వైభవముగా జరుగును.
విశేషము:_ శ్రీ రంగము ఉభయ కావేరి నదుల మధ్యన గల ఒక ద్వీపము. సప్త ప్రాకారములతో పదునైదు గోపురములతో విలసిల్లు భూలోక వైకుంఠము.
శ్లో. కావేరి విరజా సేయం వైకుంఠం రంగమందిరమ్|
సవాసుదేవో రంగేశ: ప్రత్యక్షం పరమం పదమ్||
ఆళ్వార్లు కీర్తించిన నూట యెనిమిది దివ్య దేశములలో శ్రీ రంగము ప్రధానమైనది. శ్రీరామకృష్ణాది విభవావతారములకు క్షీరాబ్ది నాధుడు మూల కందమగునట్లు అర్చావతారములకు శ్రీరంగనాథుడే మూల కందము. కావుననే మన పెద్దలు ప్రతి దినం "శ్రీమన్ శ్రీరంగ శ్రియ మన పద్రవాం అనుదినం సంవర్దయ" అని అనుసంధానము చేతురు. పదిమంది ఆళ్వార్లు, ఆండాళ్, ఆచార్యులు అందరు సేవించి ఆనందించి తరించిన దివ్యదేశము. భోగ మండపము, త్యాగ మండపము; పుష్ప మండపము; జ్ఞాన మండపములుగా ప్రసిద్ధి చెందిన నాల్గు క్షేత్రములలో శ్రీ రంగము భోగ మండపము. 2. తిరుమలై- పుష్ప మండపము. 3.కాంచీపురము-త్యాగ మండపము.4. తిరనారాయణపురము - జ్ఞాన మండపము.ప్రణవాకార విమానములో శ్రీ రంగ నాధులు శయనతిరుక్కోలమున వేంచెసియున్న తీరు అత్యద్బుతము. మరియు సర్వేశ్వరుడు స్వయముగా నవతరించిన యెనిమిది క్షేత్రములలో ప్రధానమైనది శ్రీరజ్గము.
స్వయం వ్యక్త క్షేత్రములు
1. | శ్రీరంగము | శ్రీరంగనాదులు |
2. | శ్రీముష్ణము | భూవరహ పెరుమాళ్ |
3. | తిరుమలై | తిరువేంగడముడై యాన్ |
4. | తిరునీర్మలై | శ్రీరంగనాధన్(నీర్వణ్ణన్) |
5. | నైమిశారణ్యం | దేవరాజన్(వనరూపి) |
6. | పుష్కరమ్ | పరమపురుషన్(తీర్దరూపి) |
7. | బదరికాశ్రమం | తిరునారణన్ |
8. | సాలగ్రామం | శ్రీమూర్తి |
వై వస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆయన బ్రహ్మను గూర్చి తపము గావించెను. బ్రహ్మ ప్రీతుడై తన ఆరాదనయగు శ్రీరంగనాథుని ఇక్ష్వాకు మహారాజునకు ప్రసాదించెను. ఆ తిరువారాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుల వరకు వచ్చెను.
శ్రీ రామ పట్టాభిషేకానంతరము విభీషణులు శ్రీరామ వియోగమును భరింపజాలక లంకకు మరల లేకుండిరి. ఆ సమయమున శ్రీరామచంద్రులు తమకు మారుగ తమ తిరువారాదనయగు శ్రీరంగనాథుని విభీషణాళ్వాన్లకు ప్రసాదించిరి. విభీషణులు సంతుష్టాంతరంగులై లంకకు పయనమైరి.
ఈ విధముగా లంకకు పయనమైన శ్రీరంగనాథులు ఉభయ కావేరి మధ్య భాగమును చేరిరి. విభీషణులు స్వామిని అక్కడ వేంచేపు చేసి సంధ్యావందనము చేసి తిరిగి వచ్చిరి. ఇంతలో శ్రీరంగనాథులు ప్రణవాకార విమానమున అక్కడనే వేంచేసి యుండుట చూచి విభీషణాళ్వార్ మిక్కిలి ఖేద పడిరి. అంత శ్రీరంగనాథులు వారిని ఊరడించి రాత్రి భాగమున శ్రీవిభీషణాళ్వార్లచే తిరువారాధన పొందునట్లు వరమనుగ్రహించిరి. ఇచ్చట గర్భాలయములో శయనించియున్న మూర్తికి "పెరియ పెరుమాళ్" అని పేరు. ఉత్సవ మూర్తికి 'నంబెరుమాళ్' అనిపేరు. ఒకానొక సమయమున తురుష్కుల వలన ఉపద్రవ మేర్పడగా శ్రీరంగనాధుల ఉత్సవ మూర్తిని చంద్రగిరి ప్రాంతమునకు వేంచేపు చేసికొని పోయిరి. ఆ సమయములో మరియొక అర్చామూర్తిని ఉత్సవమూర్తిగా వేంచేపు చేసిరి. ఆ విధముగా కలాపకాలమున వేంచేసి ఉత్సవాదులు స్వీకరించిన మూర్తిని 'తిరువరంగ మాళిగైయార్' అని యందురు.
పిళ్లైలోకాచార్యుల వారు తమ "ముముక్షుప్పడి" గ్రంథములో సర్వేశ్వరుని కళ్యాణగుణములను విశదీకరించి "ఇవై యెల్లామ్ నమక్కు నంబెరుమాళ్ పక్కలిలే కాణలామ్" (ఈ తిరుకల్యాణ గుణము లన్నియు మనకు నంబెరుమాళ్ విషయములో కనుపించును) అని ప్రస్తుతించుటచే ఉత్సవమూర్తికి "నంబెరుమాళ్" అని పేరు వచ్చినది. వారు శ్రీరంగనాథుని సౌందర్యమును ఇట్లు అభివర్ణించిరి. తిరుక్కైయిలే పిడిత్త-దివ్యాయుధజ్గళుమ్; వైత్తు అ-లెన్నకైయుమ్; కవిత్త ముడియుమ్; ముగముమ్;మురువలుమ్; ఆసన పద్మత్తిలే అళుత్తిన తిరువడిగళుమాయ్ నిఱ్కిర నిలయే నమక్కు త్తన్జమ్".
శ్రీ పరాశర భట్టారకులును తమ శ్రీరంగరాజ స్తవమున
శ్లో. అబ్జన్యస్త సదాజ్జ మంచితకటీ సంవాది కౌశేయకం
కించిత్ తాండవ గంధి సంహసనకం నిర్వ్యాజ మందస్మితమ్|
చూడాచుమ్బి ముఖాంబుజం నిజభుజా విశ్రాంత దివ్యాయుధం
శ్రీరంగే శరదశ్శతం తత ఇత:పశ్యేమ లక్ష్మీ సఖిమ్||
గర్బాలయములో శ్రీరంగనాథుని ఎదుటగల బంగారు స్తంభములకు "తిరుమణై త్తూణ్" అని పేరు. నంబెరుమాళ్ల సౌందర్య సముద్రములో పడి కొట్టుకొని పోవు వారిని నిలువరించు స్తంభములుగా వీనిని పేర్కొందురు. స్వామి ప్రసాదములారగించు ప్రదేశమునకు "గాయత్రీమంటపము" అనిపేరు. గర్బాలయమునకు ముందుగల ప్రదేశము "చందన మంటపము". గర్బాలయ ప్రదక్షిణకు "తిరువణ్ణాళి" ప్రదక్షిణమని పేరు.
మొదటి ప్రాకారమునగల ముఖ్య విశేషములు:- ద్వారపాలకులు, యాగశాల; విరజబావి; సేనమొదలియార్ సన్నిధి; పగల్‌పత్తు మండపం; చిలకల మండపం; కణ్ణన్, సన్నిధి. ఇక్కడ గల చిలుకల మండపము నుండియే విమానముపై గల పరవాసు దేవులను సేవింప వలయును.
రెండవ-ప్రాకారము:- ఈ గోపుర ద్వారమునకు "ఆర్యభట్టాళ్‌వాశల్" అని పేరు. ఈ ప్రాకారములోనే పవిత్రోత్సవ మండపం గలదు. ఈ మండపములో హయగ్రీవులకు సరస్వతీదేవికి సన్నిధులు కలవు. రెండవది ఉళ్‌కోడై మంటపము. దీనికి దొరమండపమనియు పేరుగలదు. విరజా మండపము. దీని క్రింది విరజానది ప్రవహించుచున్నదని పెద్దలందురు. నాల్గవది వేద విణ్ణప్పం జరుగు మండపం. పరమపద వాశల్; తిరుమడప్పళ్లి; ఊంజల్ మండపం; ధ్వజారోహణ మండపం గలవు. ఇచట స్తంభముపై గల వినీత ఆంజనేయస్వామి వరప్రసాది.
మూడవ ప్రాకారము:- ఈ ప్రాకారమునకు "ఆలినాడన్ తిరువీథి" అనిపేరు. ఈ తిరువీథిలో గరుడన్ సన్నిధి గలదు. దీనికి వెలుపల వాలిసుగ్రీవుల సన్నిధులు గలవు. నమ్మాళ్వార్ల సన్నిధి ఈ ప్రాకారములోనే కలదు. ప్రాకారమునకు ఎడమ భాగమున ధాన్యం కొలచు మండపము గలదు. దీని ప్రక్కనే నంజీయర్ సన్నిధి గలదు. ఉగ్రాణము; మేల్ పట్టాభిరామన్ సన్నిధి; ముదలాళ్వార్ల సన్నిధి, చంద్రపుష్కరిణి, పొన్నవృక్షము, దీని వెనుక వేదవ్యాసర్ సన్నిధి, వరాహ పెరుమాళ్ కోయిల్, వరదరాజస్వామి సన్నిధి, కిళ్ పట్టాభిరామన్ సన్నిధి, వైకుంఠనాదన్ సన్నిధి, తిరుమణల్ వెళి (ఇసుకబయలు) తిరుమళికై ఆళ్వార్ల సన్నిధి, శ్రీ భండారము, సూర్య పుష్కరిణి, తిరుక్కచ్చినంబి సన్నిధి గలవు.
నాల్గవ ప్రాకారము:- ఈ ప్రాకారమునకు "అకళంకనాట్టాళ్వాన్" తిరుచ్చి అనిపేరు. ఈ ప్రాకారము లోపల కుడిప్రక్క కూరత్తాళ్వాన్ సన్నిధి గలదు. శ్రీ పరాశర భట్టర్ సన్నిధిలో వారి శ్రీపాదములందు నంజీయర్ వేంచేసి యున్నారు. లక్ష్మీనారాయణులు, అమృతకలశహస్తులైన గరుడాళ్వార్‌సన్నిధి కలదు. ఎడమచేతి ప్రక్క బజారు దాటిన పిమ్మట శ్రీమన్నాదమునుల సన్నిధి గలదు. దీనికి బయట కంబనాట్టాళ్వాన్ మండపము కలదు.
ఈ ప్రాకారమలో సేవింప దగినది శ్రీరంగ విలాస మండపం. దీనిపై తిరుమంత్రము, ద్వయము, చరమశ్లోకములు, (శ్రీకృష్ణ, శ్రీవరాహ, శ్రీరామ)అవతరించిన విధము చిత్రించబడినది.
విజయ స్తంభము, ఉళ్ ఆండాళ్ సన్నిధి, వాహన మండపం, చక్రత్తాళ్వాన్ సన్నిధి, తిరువరంగత్తముదనార్ సన్నిధి, వసంత మండపం, ఈ ప్రాకారములోనే కలవు. శ్రీరంగనాచ్చియార్ సన్నిధియు ఈ ప్రాకారములోనే యున్నది. ఈ సన్నిధి ముఖ మండప స్తంభముపై తిరువెళ్లరై పుండరీకాక్షులు వేంచేసియున్నారు. మీనమాస పంగుని ఉత్తరా నక్షత్రమున శ్రీరంగనాచ్చియార్‌తో శ్రీరంగనాథులు వేంచేసియున్న సమయమున ఉడయరులు శరణాగతి గద్యను విన్నవించిన స్థలము శరణాగతి మండపము. అది ఈ ప్రాకారములోనే కలదు. మేట్టళగియ సింగర్ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, ఐన్దుకుడి మూన్ఱు వాశల్ (అయిదు గుంటలు, మూడు ద్వారములు) శ్రీనివాస పెరుమాళ్, పెరియవాచ్చాంబిళ్లై సన్నిధి. ఈ ప్రాకారములోనే కలవు.
ప్రతి సంవత్సరము రాపత్తు పది దినములు శ్రీ రంగనాధులు కొలువు తీరు వేయి కాళ్ల మండప మీప్రాకారములో కలదు. దీనికి "ఆయిరం కాల్ మండపమని" పేరు. (సహస్రస్థూణా మండపం) ఈ మండపములో స్వామి వేంచేయుండు స్థలమునకు తిరుమామణి మండపమని పేరు.
ఇచట గల శేషరాయన్-మండపములో ఒక ప్రక్క దశావతారములు, మరియొక ప్రక్క కోదండరామన్ సన్నిధి కలవు. దాని ప్రక్కన పిళ్ల లోకాచార్యుల వారి సన్నిధి, వారి సోదరులు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ సన్నిధి, పార్థసారది సన్నిధి కలవు.
ఈ ప్రాకారములో ప్రధానమైన మరియొక సన్నిధి ఉడయవర్ (భగవద్రామానుజులు) సన్నిధి. ఇచట ఉడయవర్ "తానానా" తిరుమేనిగా వేంచేసియున్నారు (తానేయైన తిరుమేని) ఇది పూర్వము వసంత మండపము. ఇచట వేంచేసి యున్న ఉడయ వరులు సేవించువారి హృదయమున వేంచేసి యుందురని మణవాళ మామునులు అభివర్ణించి యున్నారు. ఈ సన్నిధిలో ఆళవందార్ పెరియనంబి వేంచేసి యున్నారు. స్వామి తిరువారాదన యగు తేవ ప్పెరుమాళ్ (వరదరాజస్వామి) సన్నిధి ప్రక్కన వేంచేసి యున్నారు. ప్రతి దినం ఉదయం 9 గంటల ప్రాంతమున స్వామి సన్నిధిలో సేవ శాత్తుముఱై జరుగును.
ఇంకను ఈ ప్రాకారములో వీరాంజనేయ స్వామి సన్నిధి, విఠల్ కృష్ణన్ సన్నిధి, తొండరడిప్పొడియాళ్వార్ సన్నిధి కలవు.
ఐదవ ప్రాకారము:- ఈ ప్రాకారమునకు ఉత్తర వీధి యనిపేరు. మకర (తై) మీన (పంగుని) మాసములో జరుగు బ్రహ్మోత్సవములలో శ్రీరంగనాధులు ఈ వీధులలో వేంచేయుదురు. మకరమాస పుష్యమీ నక్షత్రమున నంబెరుమాళ్లు ఉభయనాచ్చిమార్లతో తిరిత్తేరుపై వేంచేయుదురు.
ఈ ప్రాకారములో ఉత్తమనంబి, తిరుమాళిగ, శ్రీరంగనారాయణ జీయర్ మఠం, ఆచార్యపురుషుల తిరుమాళిగలు మణవాళమామునుల సన్నిధి కలవు.
ఆరవ ప్రాకారము:- ఈ ప్రాకారమునకు "చిత్రవీధి" యనిపేరు. మేషమాస (చిత్రి) బ్ర్హహ్మోత్సవమున నంబెరుమాళ్లు ఈ వీధులలో వేంచేయుటచే ఈ వీధికి "చిత్రవీధి" యని పేరు వచ్చెను. ఆళ్వారాదులు తిరునక్షత్రముల యందు ఈ తిరువీధులలో వేంచేయుదురు.
ఉత్తర మాడ వీధిలో వేధాంత దేశికర్ సన్నిధి, దీనికి ప్రక్క జగన్నాధన్ సన్నిధి, తూర్పు చిత్ర మాడ వీధిలో తిరుత్తేరు, పెరియనంబి, కూరత్తాళ్వాన్, మొదలి యాండాన్ తిరుమాళిగలు, వానమామలై జీయర్ మఠం గలవు.
దక్షిణ ప్రాకార వీధి మధ్యలో పాతాళకృష్ణన్ సన్నిధి కలదు. ఇది ఐదు అడుగుల లోతులోనున్నది.
ఏడవ ప్రాకారము:- ఈ ప్రాకారమునకు "అడయవళంజాన్" వీధియనిపేరు. ఈ ప్రాకారములో తిరుక్కురళప్పన్ (వామనుని) సన్నిధి కలదు. వెళియాండాళ్ సన్నిధి కూడా కలదు. పడమటి ద్వారము గుండ తెప్పగుంటకు ఫొవచ్చును. కుంభమాస(మాసి) బ్రహ్మోత్సవములో రథోత్సవమునకు బదులు తెప్ప ఉత్సవము ఈ తెప్పగుంటలోనే జరుగును. ఉత్తర ద్వారమునుండి కొల్లడమునకు పోవు దారి కలదు. ఈ కొల్లడం దక్షిణ తీరమున తిరుమంగై యాళ్వార్లకు ప్రత్యక్షమైన దశావతారముల సన్నిధి కలదు. ఇచట తిరుమంగై ఆళ్వార్ వేంచేసి యున్నారు. ఈ కొల్లడ మందు తిరుమంగై ఆళ్వార్ పడిత్తురై, ఆళవందార్ పడిత్తురై కలవు. పడమటి ద్వార సమీపములో కాట్టళిగియ శింగర్ సన్నిధి కలదు. ఇది శ్రీ వచన భూషణ మవతరించిన స్థలము. దక్షిణ గోపురము ద్వారా కావేరి నదికి పోవచ్చును. దీనికే రాయగోపురమని పేరు.
ఉత్సవ విశేషములు: మకరం, కుంభం, మీనం, మేష మాసములందు వరుసగా నాల్గు బ్రహ్మోత్సవములు జరుగును. మకరమాసమున "పునర్వసు" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. ఇది చక్రవర్తి తిరుమగన్ (శ్రీరామచంద్రులచే) ఏర్పాటు చేయబడినది. కావున దీనికి భూపతి తిరునాళ్లు అని పేరు వచ్చినది. కుంభమాసమున "శుద్దఏకాదశి" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము. ఇది స్వామి యెంబెరుమనార్లచే ఏర్పాటు చేయబడినది. మీన మాసమున "ఉత్తరా నక్షత్రము" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము. ఇది చతుర్ముఖ బ్రహ్మచే జరిపింప బడినది. దీనికి ఆది బ్రహ్మోత్సవమని పేరు. మేష మాసమున "రేవతి" అవసాన దినముగా బ్రహ్మోత్సవము. దీనికి విరుప్పన్ తిరునాళ్లు అనిపేరు.
ఇవిగాక అధ్యనోత్సవము (పగల్‌పత్తు రాపత్తు) తప్పక సేవింప దగినది. ధనుర్మాసము, ధనుశ్శుద్ధ ఏకాదశి నాటి వైకుంఠ ద్వార దర్శనము సేవింపదగినది. ఇంకను ఉగాది, విజయ దశమి మున్నగు ఉత్సవములు జరుగును. ఇచట ప్రతి నిత్యము ఉత్సవ సంరంభమే.
ఈ క్షేత్ర స్వామి విషయమై ఆళ్వార్ల అనుభవములు: నమ్మాళ్వర్ల తిరువాయి మొళి సప్తమ శతకము రెండవ దశకములో (7-2) భగవద్విశ్లేషమును సహింపలేక శ్రీరంగనాథుల శ్రీపాదములలో ప్రపత్తి చేసి అదియు పలింపక పోవుటచే దు:ఖనిమగ్నులై నాయికావస్థను బొంది యుండగా అప్పుడామె తల్లిగారు తమ కుమార్తె విషయమై "నీవేమి తలచియున్నావనీ" శ్రీ రంగనాథుని ప్రశ్నించుచున్నారు. "ఇవళ్ తిరత్తు ఎన్ శిన్దిత్తాయ్" ఈమె విషయమై ఏమి తలంచితివి?
"అమాయకురాలగు ఈశఠగోపనాయికను పరితపింప చేయుచు నేమియు తెలియని వానివలె కావేరి జలపరిపూర్ణమైన శ్రీ రంగముననాగపర్యంకముపై పవళించి యుంటివా! ఈమెనేమి చేయ దలచితివి ? యని శ్రీ రంగనాథుని సౌహార్దమను గుణమును ప్రకాశింప చేయు చున్నారు.
పెరియాళ్వార్‌ఈదివ్యదేశమును "తిరువాళన్ తిరుప్పది" యని అభివర్ణించి యున్నారు.
తిరుమంగై ఆళ్వార్లు ఈ స్వామిని "కుడపాలానై" పశ్చిమ దిగ్గజమని వర్ణించియున్నారు.
తెన్నానై-సుందర బాహువు(తిరుమాలిరుంశోలై) దక్షిణది గ్గజమని
వడవానై-తిరువేంగడముడైయాన్-ఉత్తర దిశా దిగ్గజము
కుణపాలమదయానై-శౌరిరాజ పెరుమాళ్-ప్రాక్‌దిశా దిగ్గజము (తిరుక్కణ్ణాపురం) నమ్మాళ్వారు తమ తిరువాయిమొழி ప్రబంధమును శ్రీరంగనాథులకు అంకితము జేసిరి. నమ్మాళ్వార్లు "ముగిల్వణ్ణనడిమేల్ శొన్నశొల్‌మాలై ఆయిరత్తి పత్తుమ్" మొయిలు వంటి కాంతిగల శ్రీరంగనాథుల శ్రీ పాదముల విషయమై సర్వేశ్వరుడు అర్చావతారమున తన నిత్య కృత్యములను ఈ విధముగా నిర్వహించునని పెద్దలు సాదింతురు.
నిద్రమేల్కొనుట | తిరునారాయణపురమున | |
సుప్రభాతసేవ | తిరుమలై | |
స్నానము | ప్రయాగ | |
జపము | బదరికాశ్రమము | |
ఆరగింపు | పూరీ జగన్నాధము | |
రాచకార్యము | అయోధ్య | |
విహారము | బృందావనము | |
శయనము | శ్రీరంగము |
ఈ స్వామి విషయమై వెలసిన స్తోత్రము పెక్కులు. అందుకొన్ని
1. | స్తోత్ర రత్నము | ఆళవన్దార్(యామునా చార్యుల వారు) |
2. | కాన్తా చతుశ్లోకి | (ఆళవన్దార్) |
శ్రీరంగం-పెరియ పెరుమాళ్ స్వామివారి బొమ్మ.
Periya Perumal Sri Rangam 3. గద్యత్రయమ్_______________భగవద్రామనుజులు
శరణాగతిగద్య_______________భగవద్రామనుజులు
శ్రీరంగగద్య_________________భగవద్రామనుజులు
శ్రీవైకుంఠగద్య_______________భగవద్రామనుజులు
4. శ్రీ స్తవం__________________కూరత్తాళ్వాన్
5. శ్రీరంగరాజస్తవమ్____________(పరాశర భట్టర్)
6. శ్రీరంగనాథస్తోత్రమ్____________(పరాశర భట్టర్)
7. శ్రీగుణరత్నకోశమ్____________(పరాశర భట్టర్)
8. క్షమాషోడశీ________________(వేదాంతాచార్య)
9. శ్రీస్తుతి:___________________శ్రీమద్వేదాంత దేశికులు
10.భగవద్ద్యాన సోపానమ్_________శ్రీమద్వేదాంత దేశికులు
11.అభీతిస్తవ:________________శ్రీమద్వేదాంత దేశికులు
12.న్యాసతిలకమ్______________శ్రీమద్వేదాంత దేశికులు
13.శ్రీరంగనాధాష్టకమ్____________(ఆది శంకరాచార్యులు)
ఆళ్వారుల మంగళా శాసన పాశురములు
1. ఒన్ఱు మఱన్దఱియే నోదనీర్ వణ్ణనై నాన్
ఇన్ఱు మరప్పవో వేழனకాళ్-అన్ఱు
కరువరజ్గత్తుట్కిడన్దు కైతొழுదేన్ కణ్ణేన్
తిరువరబ్గ మేయాన్ తిశై.
పొయిగై ఆళ్వార్-ముదల్ తిరువన్దాది.6
2. మనత్తుళ్ళాన్ వేజ్గడత్తాన్ మాకడలాన్ మట్రుమ్
నినైప్పరియ వీళరజ్గత్తుళ్ళాన్-ఎనైప్పలరుమ్
దేవాది దేవనెనప్పడువాన్; మున్నొరునాళ్
మావాయ్ పిళంద మగన్.
పూదత్తాళ్వార్-ఇరండాంతిరువన్దాది.28
3. విణ్ణ గరం వెకా విరితిరై నీర్ వేజ్గడమ్
మణ్ణకరమ్ మామాడ వేళుక్కై;-మణ్ణగత్త
తెన్ కుడన్దై తేవార్‌తిరువరజ్గమ్ తెంకోట్టి;
తన్ కుడజ్గై నీరేறாన్ తాழవు.
పేయాళ్వార్-మూన్ఱాం తిరువన్దాది.62
4. కొణ్డై కొణ్డ కోదై మీదు తేనులావు కూనికూన్
ఉణ్ణై కొణ్ణ రజ్గవోట్టి యుళ్ మగిழన్ద నాదనూర్
నణ్డై యుణ్డు నారై పేర వాళపాయ ;నీలమే
అణ్డై కొణ్డు కెణ్డై మేయు మన్దణీరరజ్గమే.
తిరుమழிశై ఆళ్వార్ తిరుచ్చన్ద విరుత్తమ్.49
5. కజ్గులు మ్పగలు జ్కణ్డుయి లఱియాళ్ కణ్ణనీర్ కై గళాలిఱైక్కుమ్;
శబ్గు శక్కరజ్గళెన్ఱు కైకూప్పుమ్ తామరైక్కణ్ణెన్ఱే తళరుమ్,
ఎజ్గనే తరిక్కేనున్నై విట్టెన్ను మిరునిలజ్కై తழாవిరుక్కుమ్
శెజ్గయల్ పాయ్‌నీర్ త్తిరువరజ్గత్తా యివళ్ తిఱతైన్ శెయ్‌గిన్ఱాయే||
నమ్మాళ్వార్-తిరువాయిమొழி 7-2-1
ఇరుళిరియ చ్చుడర్ మణిక ళిమైక్కుమ్ నెట్రి
యినత్తుత్తియణి పణమాయిరజ్గళార్‌న్ద
అరవరశ ప్పెరుమ్‌జోది యనన్దనెన్ను
మణివిళబ్గు మయర్ వైళ్ళె యణై యై మేవి;
త్తిరువరజ్గ ప్పెరునగరుళ్ తెణ్ణీర్పొన్ని
తిరైక్కైయా లడివరుడ ప్పళ్ళికొళ్ళుం
కరుమణియై క్కోమళత్తై క్కణ్డుకొణ్డు
ఎన్ కణ్ణిణైగ ళెన్ఱుకొలో కళిక్కునాళే.
కులశేఖరఆళ్వార్-పెరుమాళ్‌తిరుమొழி 1-1-1
మాదవత్తోన్ పుత్తిరన్ పోయ్ మఱి కడల్వాయ్ మాణ్డానై
ఓదువిత్త తక్కణైయా వురువురువే కొడుత్తానూర్
తోదవత్తి త్తూయ్‌మఱై యోర్ తుఱై పడియ త్తుళుమ్బియెజ్గుమ్
పోదిల్‌వైత్త తేన్ శొరియుం పునలరజ్గ మెన్బదువే.
పెరియాళ్వార్-పెరియాళ్వార్ తిరుమొழி 4-8-1
పొజ్దోదం శూழన్ద పువనియుం విణ్ణులగమ్
అజ్గాదుమ్ శోరామే యాళ్ గిన్ఱ వెమ్బెరుమాన్
శెజ్గోలుడైయ తిరువరజ్గచ్చెల్వనార్
ఎజ్గోల్ వళైయా లిడర్ తీర్వ రాగాదే.
ఆండాళ్ నాచ్చియార్ తిరుమొழி 11-3
పచ్చై మామలై పోల్ మేని పవళవాయ్ కమల చ్చెజ్గణ్
అచ్చుదా అమరరేఱే ఆయర్ తమ్ కొలిన్దే యెన్ఱుమ్
ఇచ్చువై తవిర యాన్‌పోయ్ ఇన్దిరలోకమాళుమ్
అచ్చువై పెఱినుం వేణ్డేన్ అరజ్గమానగరుళానే.
తొణ్డరడిప్పొడియాళ్వార్-తిరుమాలై 2
ఉరైయూర్-అళగియ మనవాళన్ స్వామివారి బొమ్మ- ఉరయూర్
Alageeya Manavaalan, Urayur
తంజమామణిక్కోయిల్-నీలమేఘ పెరుమాళ్ స్వామివారి బొమ్మ- తంజమామణిక్కోయల్
Neelamegha Perumal Tanjur అమల నాదిపిరాన్ అడియార్కు ఎన్నై ఆట్పడుత్త
విమలన్;విణ్ణవర్ కోన్ విరై యార్ పొழிల్ వేజ్గడవన్;
నిమలన్ నిన్మలన్ నీదివానవన్ నీళ్ మదిళరజ్గత్తమ్మాన్-
తిరుక్కమల పాదం వన్దు ఎన్ కణ్ణి నుళ్ళన వొక్కిన్ఱదే.
తిరుప్పాణి ఆళ్వార్ అమలనాదిపిరాన్-1
తుళజ్గునీణ్ముడి యరశర్ దమ్‌కురిశిల్ తొణ్డైమన్నవన్ తిణ్డఱలొరువఱ్కు;
ఉళజ్గొళన్చి నోడిన్నరుళ్ శురన్ద జ్గొడునాழிగై యేழுడనిరుప్ప;
వళజ్గొళ్ మన్దిరం మట్రవ ర్కరుళిచ్చెయ్‌దవా ఱడియే నఱిన్దు; ఉలగ
మళన్ద పొన్నడియే యడైన్దుయ్‌న్దే నణిపొழிల్ తిరువరజ్గత్తామ్మామే||
తిరుమంగై ఆళ్వార్ పెరియ-తి.మొ. 5-8-9
కుంభం - రోహిణి
తిరునక్షత్ర తనియన్
తపస్యేమాస రోహిణ్యాం తటే సహ్య భువి స్థితమ్|
శ్రీ రజ్గ శాయినం వన్దే సేవితం సర్వదేశికై: ||
నిత్య తనయన్
శ్రీ స్తవాభరణం తేజ శ్శ్రీరంగేశయ మాశ్రయే |
చింతామణి వివోద్భాస్తం ఉత్సజ్గేసప్తభోగిన: ||
వాழிతిరునామమ్
తిరుమగళుమ్ మణ్ముగళుమ్ శిఱక్కవన్దోన్ వాழிయే
శెయ్యవిడై త్తాయ్ మగళావ్ శేవిప్పోన్ వాழிయే
ఇరువిశుమ్చిల్ వీత్తిరుక్కు మిమైయవర్‌కోన్ వాழிయే
ఇడర్ కడియ ప్పాఱ్కడలై యెయ్‌దినాన్ వాழிయే
అరియ తయరదన్ మగనా యవదిరిత్తాన్ వాழிయే
అన్దరియామిత్తువము మాయినాన్ వాழிయే
పెరుగి వరుం పొన్ని నడుప్పిన్ తుయిన్దాన్ వాழிయే
పెరియ పెరుమాళెజ్గళ్ పిరానడిగళ్ వాழிయే.