దివ్యదేశ వైభవ ప్రకాశికా/ఉఱైయూర్
2. ఉఱైయూర్ - 2
శ్లోకము:
లక్ష్మీ చరణ ళాక్షాంక సాక్షి శ్రీవత్స వక్షసే
క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళమ్ |
శ్లోకము:
శుభే కల్యాణ్యాఖ్యాప్రథిత వర తీర్థేషు నిచుళా
పురే పారే రమ్యే శుభ కుడమురుట్ట్యాఖ్య సరితః
విమానే కల్యాణే ధనపతి దిశావక్త్ర రుచిరః
స్థితో భాతి శ్రీమాన్ వరవర సమాఖ్యో మధురపుః
శ్లోకము:
త్రయస్త్రింశత్కోటిదేవ రవిధర్మాది గోచరః
కలిధ్వంసి ముని స్తుత్యో వాసలక్ష్మీ సమంవితః
వివరణ: అళగియ మణవాళన్ - వాసలక్ష్మి (ఉరైయూర్‌వల్లి నాచ్చియార్) - కల్యాణ పుష్కరిణి - కుడమురుట్టి నది - కల్యాణ విమానము - ఉత్తర ముఖము - నిలచున్న సేవ - ముప్పది మూడు కోట్ల దేవతలకు ధర్మవర్మకు, రవివర్మకు ప్రత్యక్షము - తిరుమంగై యాళ్వార్ కీర్తించినది.
విశే: ధర్మవర్మ పుత్రికగా లక్ష్మీదేవి అవతరించిన వాసలక్ష్మి అను పేరుతో శ్రీరంగనాధుని పరిణయమాడిన స్థలము. మీన మాసములో శ్రీరంగములో జరుగు ఆది బ్రహ్మోత్సవమున మూడవనాడు శ్రీరంగనాథులు ఉరైయూరు వేంచేసి వాసలక్ష్మితో ఏకాసనాసీనులై భక్తకోటికి అనుగ్రహింతురు. వీరు మేష మాసమున ఉత్తరా నక్షత్రమున అవతరించిరి. ఇచట స్వామి ప్రయాగ చక్రముతో వేంచేసి యుందురు. తిరుప్పాణి ఆళ్వార్లు ఈ క్షేత్రముననే అవతరించిరి. ఈ క్షేత్రమునకు "కోళి" యని "నాచ్చియార్ కోయిల్" అని తిరునామములు గలవు. ఇది తిరుచ్చిలో ఒక భాగము. తిరుచ్చి నుండి 2 కి.మీ. టౌన్ బస్ కలదు.
పాశురము :
కోழிయమ్ కూడలుమ్ కోయిల్ కొణ్డ కోవలరే యొప్పర్; కున్ఱమన్న
పాழிయమ్ తోళుమోర్ నాన్గుడైయర్ పణ్డివర్‌తమ్మైయుం కణ్డఱియోమ్;
వాழிయరో వివర్‌వణ్ణ మెణ్ణిల్ మా కాడల్ పోన్ఱుళర్; కైయిల్ వెయ్య
ఆழிయొన్ఱేన్దియోర్ శజ్గు పత్తియచ్చో వొరువంழగియవా.
తిరుమంగై ఆళ్వార్ - పెరియతిరుమొழி 9-2-5.