Jump to content

దివ్యదేశ వైభవ ప్రకాశికా/పెరుమాళ్ కోయిల్

వికీసోర్స్ నుండి

74. పెరుమాళ్ కోయిల్ (కాంఛీపురము)

శ్లో. శ్రీకాంచీ నగరేతు హస్తిగిరి రిత్యాఖ్యేహి సత్యవ్రత
   క్షేత్రం వేగవతి సరస్తటగతే వంతాబ్జినీ శోభితే |
   యుక్తే శేష, వరాహ, పద్మ, కుశక, బ్రహ్మాఖ్య తీర్దైస్సదా
   సంప్రాప్యాద్బుత పుణ్యకోటి విలయం పత్నీం పెరుందేవికామ్‌ ||

   భాతి శ్రీ వరదో విభుర్వరుణ దిక్ వక్త్రాబ్జ సంస్థానగ:
   శ్రీమన్నారద శేషరాట్ భృగుముని శ్శ్రీ నాగరాజేక్షిత:|

వివ: వరదరాజస్వామి (తేవప్పెరుమాళ్)-పెరుందేవి త్తాయార్-హస్తిగిరి-సత్యవ్రతక్షేత్రము-వేగవతీ నది-అనంత పుష్కరిణి-శేష, వరాహ, పద్మ, కుశక, బ్రహ్మతీర్థములు-పుణ్యకోటి విమానము-పశ్చిమ ముఖము-నిలచున్నసేవ-బ్రహ్మకు నారదునకు, ఆదిశేష, భృగు, గజేంద్రులకు ప్రత్యక్షము.

శ్లో. దేశే రాజితి తత్ర సుందర హరిస్వామీ హరిద్రా సతి
   స్త్వాసీనశ్శుక నామధేయ మతులం వైమన మైంద్రీ ముఖ:
   ప్రత్యక్షస్తు బృహస్పతే:కలిజిత శ్శ్రీభూత వామ్నో మునే:
   స్తోత్రాఖ్యా భరణాభి భూషిత వపు ర్బక్తేష్ట సంపూరక:||

వివ: అచటనే హస్తిగిరిపై అழగియసింగర్ వేంచేసియున్నారు. హరిద్రాదేవి త్తాయార్;శుక (గుహ) విమానము-తూర్పు ముఖము-కూర్చున్నసేవ-బృహస్పతికి ప్రత్యక్షము-పూదత్తాళ్వార్ తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: శ్లో. అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ హ్యవంతికా
       పురీ ద్వారపతీ చైవ సప్తైతే మోక్ష దాయికా:||అని

భారతదేశమున ముక్తివ్రద క్షేత్రములుగా కీర్తింపబడిన వానిలో కాంచీపురమొకటి. మిగిలినవి. 1 అయోధ్యా 2. మధుర 3. మాయా (హరిద్వార్) 4. కాశీ 5. అవంతికా (ఉజ్జయినీ) 6. ద్వారవతి (ద్వారక).

శ్రీవైష్ణవులకు అత్యంతము సేవింపదగిన కోయిల్ (శ్రీరంగము) తిరుమలై పెరుమాళ్ కోయిల్ (కాంచి) తిరునారాయణపురం (మేల్కోటై) అను నాలుగు దివ్యక్షేత్రములలో కాంచీపురము మూడవది.

ఈక్షేత్రము కృతయుగమున చతుర్ముఖ బ్రహ్మచేతను, త్రేతాయుగమున గజేంద్రుని చేతను, ద్వాపరయుగమున బృహస్పతిచేతను, కలియుగమున ఆదిశేషుని చేతను ఆరాధింపబడినది.

ఆళ్వార్లు ఈ క్షేత్రమును "అత్తియూర్" అని సంబోధించినారు. "ఉలకేత్తుమ్

                                                91 ఆழிయాన్ అత్తియూరాన్ "వరమ్‌ తరుమ్‌ మామణివణ్ణన్" (లోకమందలి జనులచే కీర్తింపబడువాడును చక్రహస్తుడును వరప్రదుడును కాంచీ పురవాసుడగు నీలవర్ణుడు) అని ఆళ్వారులచే కీర్తింపబడిన వరదరాజస్వామి.

శ్లో. వేగపత్త్యుత్తరే తీరే పుణ్యకోట్యాం హరి స్స్వయమ్‌|
   వరద స్పర్వభూతానా మద్యాపి పరిదృశ్యతే||

(వేగవతీ నదీ తీర ఉత్తర భాగమున పుణ్యకోటి విమాన మధ్యమున సర్వప్రాణులకు వరప్రదుడైన శ్రీహరి స్వయముగా వేంచేసియున్నాడు) అనునట్లు వేంచేసియున్నాడు.

శ్లో. వపా పరిమళోల్లాస వాసితాధర పల్లవమ్‌|
   ముఖం వరదరాజస్య ముగ్దస్మిత మూపాస్మహే||

అని మన పెద్దలు త్రికాలములందు ఈ స్వామిని కీర్తించుచున్నారు.

భగవద్రామానుజులు తమ బాల్యమునంతయు కాంచీపురమందే గడిపిరి. అంతియేకాక ఇచట వేంచేసియున్న వరదరాజస్వామికి నిత్యము తీర్థకైంకర్యమును నిర్వహించిరి. ఈ వరదరాజస్వామియే భగవద్రామానుజులను దర్శన ప్రవర్తకులగునట్లు అనుగ్రహించిరి.

శ్రీరంగనాథులకు తిరుప్పాణి ఆళ్వార్లు, తిరుమలై శ్రీనివాసునకు కురుంబరుత్తనంబిగార్లవలె వరదరాజస్వామికి తిరుక్కచ్చినంబిగారు ఆంతరంగిక కైంకర్యపరులు. వీరు చామర కైంకర్యమును నిర్వహించెడివారు.

భగవద్రామానుజుల వారి కోరికపై వీరు వరదరాజస్వామిని ప్రార్థించి వారి వలన తాము వినిన ఆరు వార్తలను ఎంబెరుమానార్లకు తెలియజేసిరి. వీనినే షడ్వార్తలందురు. అవి.

1. నేనే(శ్రీమన్నారాయణుడే) పరతత్త్వము. 2. జీవేశ్వరభేదమే దర్శనము. 3.ప్రపత్తియే ఉపాయము(భగవంతుని పొందుటకు సాధనము) 4. అంతిమస్మృతి అవసరములేదు. 5. శరీరావసానమందే మోక్షము. 6. పెరియనంబిగారిని (మహాపూర్ణులను) ఆశ్రయింపుడు.

ఆచార్యులందరు అభిమానించిన క్షేత్రము కాంచీపురము. ఆళవందారులు (శ్రీయామునమునులు)ఈక్షేత్రమునకు వేంచేసి భగవద్రామానుజులను "ఆముదల్వన్ ఇవన్" అని కటాక్షించిరి. ఈప్రదేశమునకు యుమువైత్తుఱవర్ తిరుముత్తమ్‌ అనిపేరు. ఆళవందారులు వేంచేసిన ప్రదేశమునకు కరుమాణిక్కత్త సోపానము అనిపేరు.

ఆళవందారుల ఆదేశానుసారము "తిరువరంగ ప్పెరుమాళ్ అరయర్" అనువారు తిరుక్కచ్చినంబిగారి పురుషాకారముతో వరదరాజస్వామిని ప్రార్థించి భగవద్రామానుజులను శ్రీరంగమునకు తోడ్కొని పోయిరి. ఈవిధముగా తమకు

                                           92 కైంకర్యము చేయుచున్న భగవద్రామానుజులను త్యాగము చేయుటచే ఈక్షేత్రమునకు త్యాగమండపమని పేరు. ఈ సంఘటన జరిగిన ప్రదేశమునకు "కచ్చిక్కువాయ్‌త్తాన్ మండపం" అనిపేరు.

ఇచట వేంచేసియున్న తాయార్లకు పెరుందేవిత్తాయార్ అని పేరు. వీరిని గూర్చి మన పెద్దలు ప్రతినిత్యము.

    ఆకారత్రయ సంపన్నా మరవింద నివాసనీమ్‌|
    ఆశేష జగదీశిత్రీం వందే వరద వల్లభామ్‌||

(అనన్యార్హ శేషత్వ, అనన్య శరణ్యత, అనన్య భోగ్యత్వములనే ఆకారత్రయ సంపన్నురాలై, పద్మవాసినియై, సమస్తలోకములకు స్వామినియైన వరదరాజస్వామి దేవేరియగు పెరుందేవి తాయార్లను సేవించు చున్నాను.) అని అనుసంథానము చేతురు.

ఇచట జరుగు బ్రహ్మోత్సవ వైభవము వర్ణనాతీతము. అందు మూడవనాడు ఉష:కాలమున (వేకువన) జరుగు గరుడసేవ సేవింపవలసినదేకాని చెప్పనలవికాదు. లోకములో కంచి గరుడసేవ యని ప్రసిద్ది. ప్రసిద్ద వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజస్వామి "వినతాసుత వాహనుడై వెడలె కాంచీవరదుడు" అని కంచి గరుడ సేవను కీర్తనగా రచించి ధన్యుడైనాడు. ఈగరుడసేవను సేవించుటకు దేశము నలుమూలల నుండి భక్తులు తండోప తండములుగా విచ్చేతురు. ఈ గరుడసేవను గూర్చిన శ్లోకము. <poem> శ్లో. కేచిత్ తత్త్వ విశోధనే పశుపతౌ సారమ్యమహం:పరే

  వ్యాజిహ్రం: కమలాసనే సయవిధా మన్యే హరిం సాదరమ్‌ |
  ఇత్యేవం చలచేతసాం కరధృతం పాదారవిందం హరే:
  తత్త్వం దర్శయతీవ సంప్రతిసృణాం తార్క్ష్య శ్శ్రుతీనాం విధి:||
  
  మణవాళమామునుల సన్నిధి సేవాక్రమము.

శ్లో. శ్రీమద్వారపరం మహద్ది బలిపీఠాగ్ర్యం ఫణీన్ద్ర హ్రదం

  గోపీనాం రమణం వరాహ వపుషం శ్రీభట్ట నాథం తథా
  శ్రీమస్తం శఠవైరిణిం కలిరిపుం శ్రీభక్తి సారం మునిం
  పూర్ణం లక్ష్మణ యోగినం మునివరా వాద్యావథ ద్వారపా||
  శ్రీమస్మజ్జన మణ్డపం సరసిజాం హేతీశభోగీశ్వరౌ
  రామం నీలమణిం మహానసవరం తార్స్యం నృసింహం ప్రభుమ్‌|
  సేనాన్యం కరిభూధరం తదుపరి శ్రీపుణ్య కోటిం తథా
  తస్మధ్యే వరదం రమాసహచరం వన్దే తదీయైర్వృతమ్‌||

శోభాయుక్తమైన పెద్ద గోపురద్వారమును; బలిపీఠమునకు ముందున్న

                                               93 తిరువనంత పుష్కరిణిని; గోపికారమణుడైన శ్రీకృష్ణుని సన్నిధిని, వరాహ పెరుమాళ్లను, పెరియాళ్వార్లను, నమ్మాళ్వార్లను, తిరుమజ్గై యాళ్వార్లను, తిరుమழிశై ఆళ్వార్లను, పెరియనంబి(మహాపూర్ణులు) గారి సన్నిధిని, ఉడయవరులను, ముదలాళ్వార్లను, తిరువనన్దాళ్వార్లను, శ్రీరామచంద్రులను, కరుమాణిక్కవరదులను, తిరుమడపళ్ళిని, గరుడాళ్వార్లను, నృసింహస్వామిని; సేనముదలియాళ్వార్లను, హస్తగిరిని, దానిపై పుణ్యకోటి విమానమును, ఆవిమాన మధ్యమున శ్రీదేవి భూదేవులతో కలసి వేంచేసియున్న శ్రియ: పతియగు వరదరాజస్వామిని సేవించుచున్నాను.)

శ్లో. కమల నివేశితాంఘ్రి కమలం కమలారమణం
   ఘనమణి భూషణద్యుతి కడారిత గాత్రరుచిమ్‌|
   అభయగదా సుదర్శన సరోరుహచారుకరం
   కరిగిరి శేఖరం కమపి చేతసి మేవిదధే"||

ఆననముగానున్న కమలము నందు శ్రీపాదములుంచినవాడును, శ్రియ:పతియు, గొప్పవైన మణిభూషణముల చేత ప్రకాశించిన తిరుమేని గలవాడును, అభయ హస్తము, గదా, సుదర్శనము ధరించినవాడును, హస్తిగిరి శిరోభూషణమునైన వరదరాజస్వామిని మనస్సునందు ధ్యానించుచున్నాను.

ఈక్షేత్రస్వామి విషయమైన కొన్నిస్తోత్రములు.
శ్రీదేవరాజాష్టకము-తిరుక్కచ్చినంబి
శ్రీవరదరాజస్తవమ్-కూరత్తాళ్వాన్
శ్రీవరదరాజ పంచాకత్-శ్రీమద్వేదాంతదేశికర్
శ్రీహస్తగిరి మాహాత్మమ్‌-శ్రీమద్వేదాంత దేశికర్
శ్రీదేవరాజ మంగళా శాసనము-శ్రీమన్మణవాళమామునులు. వరదాభ్యుదయం, హస్తిగిరిచంపువు-శ్రీవేంకటాధ్వరి; వరదరాజస్తవమ్-అప్పయ్యదీక్షితులు.
<poem>
శ్రీకాంచీనగరమున వేంచేసియున్న పెరుమాళ్ల విషయమైన స్తోత్రము.
దీపప్రకాశ సరకేసరి విద్రుమాభ వైకుంఠవామన యథోక్తకరాష్టబాహూన్|
అన్యాన్ సుధాభ ఫణి పాణ్డవదూత హేమ వర్ణాదిమాన్ పరగురు:క్రమశస్సిషేనే||

తిరుత్తణ్‌గా దీప ప్రకాశకర్, వేళుక్కై నృసింహస్వామి, పవళవణ్ణమ్‌ పవళవణ్ణస్వామి, వైకుంఠనాథ పెరుమాళ్, తిరువెஃకా యథోక్తకారి; అష్టభుజం ఆదికేశవన్, నిలాత్తిజ్గళ్ తుండత్తాన్, ఊరగమ్‌ ఉలగళన్ద పెరుమాళ్, పాడగమ్‌ పాండవ దూతర్‌, పచ్చవణ్ణర్ మొదలగు సన్నిధులను పరవరమునులు క్రమముగా సేవించిరి.

మార్గము: మద్రాసు నుండి, తిరుపతి నుండి బస్ రైలు వసతి కలదు. ప్రసిద్ధ నగరము. సకల సౌకర్యములు కలవు.

94

75. ఆదికేశవన్-అష్టభుజం (కాంచీ)

Adikesavan - Astabhujam (Kanchi)

76. దీపప్రకాశర్-తిరిత్తణ్‌గా(కాంచీ)

Deepaprakasar - Tiruttanga (Kanchi)

77. అళగసింగర్-వేళుక్కై(కాంచీ)

Alagasingar - Velukkai (Kanchi)

78. పాండవదూత-పాడగమ్(కాంచీ)

Pandavaduta - Padagam (Kanchi)