Jump to content

దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుమాలిరుం శోలై మలై

వికీసోర్స్ నుండి

41. తిరుమాలిరుం శోలై మలై 1 (మధుర 20 కి.మీ)

(అழగర్ కోయిల్)

శ్లో|| శ్రీమద్వనాద్రి పథ నూపుర నిమ్నగాంతే
    దేశేస్థితో వృషభ పర్వత చందనాఢ్యే |
    ధర్మేక్షితస్తు మలయధ్వజ పాండ్య దృష్టః
    ప్రాగాసనో లసతి సుందరబాహు నాథః ||

శ్లో|| సోమసుందర విమాన మథ్యగః సుందరోప పద వల్లికాయుతః |
    విష్ణుచిత్త కలిజిత్ పరాంకుశైః గోదయా మణి మహర్షిణాస్తుతః ||

వివ: సుందర బాహు పెరుమాళ్ - అழగర్ (మాలాలంకారర్) - సుందరవల్లి తాయార్, కళ్యాణవల్లి తాయార్, నూపురగంగ (శిలమ్బాఱు) - సోమసుందర విమానము - వృషభగిరి - చందన వృక్షము - తూర్పు ముఖము - నిలుచున్న సేవ - ధర్మదేవతకు మలయధ్వజ పాండ్యరాజునకు ప్రత్యక్షము - పూదత్తాళ్వార్, పేయాళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆణ్డాళ్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

ఈ క్షేత్రమునము దక్షిణ తిరుపతి యనియు, వనగిరి యనియు పేరు. ఇచట మూలవర్, ఉత్సవర్ కూడ పంచాయుధములతో వేంచేసి యుందురు. మూలవర్‌కు వైకుంఠ నాథన్, పరమ స్వామియను తిరునామములు కలవు. స్వామి ప్రయోగ చక్రహస్తులై వేంచేసియున్నారు.

ఈక్షేత్రస్వామి విషయమై ఆణ్డాల్ "నాఱు నఱుమ్బొழிల్‌" అను పాశురమున స్వామికి నూరు గంగాళముల అక్కారవడిశల్(పాయసాన్నము), నూరు గిన్నెలతో వెన్న ఆరగింపుచేతునని మాట యిచ్చినారు.

పిమ్మట భగవద్రామానుజులు అవతరించి ఆణ్డాల్ శ్రీసూక్తి సఫలమగునట్లుగా నూరు గంగాళముల అక్కారపడిశల్ , వెన్న ఆరగింపుచేసి పిమ్మట ఈ విషయమును ఆండాళ్ సన్నిధిలో విజ్ఞాపన చేసిరి. అంతవారు సంతుష్టాంత రంగులై ఉడయవరులను జూచి "ఎన్ కోయిల్ అణ్ణనే" అని పిలిచి ఆదరించి గౌరవించిరట. అది మొదలు ఉడయవర్లకు "గోదాగ్రజ:" అనియు "కోయిల్ అణ్ణన్" అనియు తిరునామములు ఏర్పడినవి. ఇచట ఆణ్డాళ్ "వీత్తిరున్ద తిరుక్కోలముతో(కూర్చున్న భంగిమ) వేంచేసియున్నారు.

ఈక్షేత్రమునకు "మయల్ మిగు పొழிల్"(తిరువాయ్ మొழி 2-10-3)(దట్టమై తోటలుగల దివ్యదేశము) అను విశిష్టమైన తిరునామము కలదు. తిరుమంగై ఆళ్వార్ ఈక్షేత్రస్వామిని "తెన్నానై" (తెఱ్కే ఆనై) దక్షిణ దిగ్గజముగా అభివర్ణించినారు. ఈక్షేత్రస్వామికి కళ్ళழగర్ అను తిరునామము కలదు. నమ్మళ్వార్లు "శొ-ఱ్కవిగాళ్" అని తిరువాయి మొழிలో "నె-ముయిరుముళ్ కలన్దు" (మనస్సు నందును ప్రాణము నందును కలసిపోయి) అని సర్వేశ్వరుని "ఆశ్రిత వ్యామోహమనెడి గుణమును అభివర్ణించిరి. నమ్మాళ్వార్ల భక్తికి పరవశుడైన సర్వేశ్వరుడు ఆళ్వార్లను వీడలేక వారి తిరుమేని యందు మిక్కిలి ప్రీతిని చూపగా ఆళ్వార్లు "అయ్యో! సర్వేశ్వరుడు నన్ను ఈ దేహముతోనే పరమపదమునకు తీసికొని పోవునేమో! అట్లైన ఈ సంసారము నిత్యమగునే!" యని తలచి సర్వేశ్వరుని ప్రార్థించి ఈ దేహముపై మోహమును విడువమని ప్రార్థింపగా స్వామి యట్లేయని యంగీకరించెను. అపుడు ఆళ్వార్లు "ఆహా! ఏమి సర్వేశ్వరుని శీలగుణము, ఆశ్రిత వ్యామోహము" అని ఆశ్చర్యపడి ఆ ఆశ్రిత వ్యామోహమును "శొ-ల్‌కవిగాళ్" అను దశకమున ప్రకటించుచున్నారు.

ఈ సన్నిధి చాలా పెద్దది. దీనికి అழగర్ కోట యని పేరు. సన్నిధికి ఉత్తరముగా కొండపై నూపుర గంగ కలదు. సన్నిధి గోపురద్వారమున 18వ పడి గట్టులో "కరుప్పణన్" అను వారు సన్నిధికి కావలిగా నుందురు. సన్నిధి తాళము వేసిన పిమ్మట ఆ తాళములను వీరి సన్నిధిలో ఉంచుదురట.

బ్రహ్మోత్సవ సమయంలో చక్రత్తాళ్వార్ మాత్రమే గోపుర ద్వారము నుండి వేంచేయుదురు. పెరుమాళ్లు ప్రక్కనున్న ద్వారము నుండి వేంచేతురు.

మేషం పౌర్ణమినాడు ఏటి ఉత్సవమునకు పెరుమాళ్లు వేంచేయగా తాయార్లకు కోపము వచ్చినదట. ఆకారణమున నాడు మొదలు బ్రహ్మోత్సవము వరకు సన్నిధి ప్రాకారములో గల ఒక మండపములో వేంచేసి తిరువారాదన స్వీకరింతురు.

ఉత్సవములు:- మేషమాసములో పౌర్ణమినాడు మధురలో గల వైగైనదిలో ఏటి ఉత్సవము జరుగును. ఈక్షేత్రస్వామి విషయమై శ్రీకూరత్తాళ్వాన్ సుందరబాహుస్తవముననుగ్రహించిరి.

కర్కాటక మాసములో బ్రహ్మోత్సవము జరుగును. పలు సత్రములు సన్నిధి సమీపములో కలవు. సన్నిధిలో ప్రసాదము లభించును. అన్ని వసతులు గల క్షేత్రము.

మార్గము:- మధురకు 15 కి.మీ దూరము.

పా. కిళరొళి యిళమై కెడువదన్ మున్నమ్‌,
    వళరొళి మయోన్ మరువియ కోయిల్,
    వళరిళమ్‌ పొழிల్ శూழ் మాలిరు-లై
    తళర్విలరాగిల్ శార్వదు శదిరే.
             నమ్మాళ్వారు-తిరువాయి మొழி 2-10-1

52

41. అళగర్-తిరుమాలిరుంశోలై.

Sundarabahu - Tirumalirunsolai

42. సౌమ్యనారాయణన్-తిరుక్కోట్టియూర్.

Soumyanarayan - Tirukottiyar

43. సత్యగిరినాథన్-తిరుమెయ్యమ్‌.

Satyagirinandhan - Tirumeyyan

పా. అలమ్బా వెరుట్టా క్కొన్ఱు తిరియు మరక్కరై
    క్కులమ్బాழ் పడుత్తు క్కులవిళక్కాయ్ నిన్ఱకోన్ మలై,
    శిలమ్బార్‌క వన్దు తెయ్‌వ మకళిర్‌కళాడుమ్‌.శీర్
    చ్చిలమ్‌పాఱు పాయుమ్‌ తెన్ మాలిరుమ్‌ శోలైయే.
          పెరియాళ్వారు-పెరియాళ్వారు తిరుమొழி 4-2-1

పా. నాఱు నఱుమ్బొழிల్ మాలిరుం శోలై నమ్బిక్కు, నాని
    నూఱు తడావిల్ వెణ్ణెయ్ వాయ్ నేర్‌న్దు పరావివైత్తేన్,
    నుఱు తడానిరైన్ద అక్కారవడిశల్ శొన్నేన్,
    ఏఱు తిరుపుడైయా నిన్ఱు వన్దివై కొళు జ్గొలో.
         ఆణ్డాళ్-నాచ్చియార్ తిరుమొழி 9-6

పా. మున్దుఱవురై క్కేన్ వరై క్కుழల్‌మడవార్ కలవియై విడుతడుమారల్
    అన్దరమేழு మలై కడలేழு మాయ వెమ్మడిగళ్ తమ్‌ కోయిల్
    శన్దొడు మణియు మణిమయిల్ తழைయున్దழுవి వన్దరువిగళ్ నిరన్దు
    వన్దిழி శారల్ మాలిరు-లై వణబ్గుదుమ్‌ వామడనె--.
          తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 9-8-1

పా. నేశమిలాదవర్‌క్కుమ్‌ నినై యాదవర్‌క్కు మరియాన్
    వాశమలర్ పొழிల్ శూழ் వడమా మదుఱైప్పిఱన్దాన్
    దేశమెల్లామ్‌ వణజ్గు న్దిరుమాలిరుమ్‌ --లైనిన్ఱ
    కేశవనమ్బిదన్నై క్కెణ్డై యొణ్ కణ్ణి కాణుజ్గొలో.
    
పా. వలమ్బురి యాழிయనై వరైయార్ తిరడోళన్ఱన్నై
    పులమ్‌పురి నూలవనై ప్పొழிల్ వేజ్గడ వేదియనై
    శిలమ్బియలాఱుడైయ తిరుమాలి--లైనిన్ఱ
    నలన్దిగழ் నారణైనై నణుగుజ్గో లెన్నన్నుదలే.
                            9-9-1,6,9.

శ్లో. పీతామ్బరం వరద శీతల దృష్టిపాతం
   ఆజానులమ్బి భుజ మాయత కర్ణపాశమ్‌
   శ్రీమన్మహా వనగిరీన్ద్ర నివాస దీక్షం
   లక్ష్మీధరం కిమపి వస్తు మమావిరస్తు
          శ్రీకూరత్తాళ్వాన్-సుందరబాహుస్తవమ్‌ 14 శ్లో.

                                           53