దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుపార్తన్ పళ్లి
40. తిరుపార్తన్ పళ్లి 40
శ్లో|| పార్తన్‌పళ్లి పురేతు శంఖ సరసీ యుక్తే తు నారాయణం
వైమానం సమధిశ్శ్రిత స్థ్సితిలసన్ ప్రాచేతసాశీముఖః |
దేవస్తామరయాళ్ ప్రియోర్జున జలేశైకా దశేశేక్షితః ||
ప్రాప్తస్తామర నాయకీం విజయతే శార్జ్గాంశ యోగిస్తుతః ||
వివ: తామరయాళ్ కేళ్వన్ - తామరై నాయకి - శంఖ పుష్కరిణి - నారాయణ విమానము - పశ్చిమ ముఖము - నిలుచున్న సేవ - అర్జునునకు, వరుణునకు, ఏకాదశ రుద్రులకును ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
విశే: ఇచ్చత పెరుమాళ్లు శ్రీదేవి, భుదేవి, నీళాదేవులతో కలసి వేంచేసియుందురు. ఇచ్చట శంఖ చక్ర గదలతో వేంచేసియున్న కోలవిల్లి రామన్ కలరు. వీరి హస్తములో శార్జ్గమును (విల్లు) సమర్పించియున్నారు. ఇచట అర్జునునకు వేరు సన్నిధి కలదు.
చరమ శ్లోకార్ధము ప్రకాశించిన స్థలము - మకరం పుష్యమీ నక్షత్రం తీర్ధోత్సవం. అర్చకులు సన్నిధికి సమీపముననే కలరు.
మార్గము: తిరునాంగూర్ కు దక్షిణం 3 కి.మీ. చిన్న గ్రామం. వసతులు లేవు.
పా|| కవళయానై కొమ్బుశిత్త కణ్ణనెన్ఱుమ్; కామరుశీర్
క్కువళమేగ మన్నమేని కొణ్డ కోనెన్నానై యెన్ఱుమ్
తవళమాడునీడు నాజ్గై త్తమరైయాళ్ కేళ్వనెన్ఱుమ్
పవళవాయాళెన్ మడన్దై పార్తన్బళ్ళి పొడువాళే.
తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొழி 4-8-1
శ్లో|| చోళదేశే ప్రసిద్ధానాం దేశానాం కమలాపతేః |
ఏవం చత్వా రింశ తస్తు వైభవో వర్ణితోమయా ||
వివ: ఇంతవరకు చోళదేశపు దివ్య తిరుపతులు నలుబది క్షేత్రములు వర్ణింపబడినవి.
పాండ్యదేశీయ దివ్యదేశములు
శ్లో. ఇదానీం పాండ్యదేశీయ దివ్యదేశ సువైభవమ్|
యతీంద్ర కరుణా భూమ్నా వర్ణ్యతే విదుషాంముదే||
వివ: భగవద్రామానుజుల వారి కృపాకటాక్షమున పండితుల సంతోషము కొఱకు ఇకపై పాండ్యదేశమున గల దివ్యదేశముల వైభవము వర్ణింపబడును.
50 38. గోపాలకృష్ణన్-తిరుక్కావళంబాడి.
Gopalakrishna - Tirukkavalambadi
39. నారాయణన్-తిరువెళ్లక్కుళమ్.
Narayanan - Tiruvellakkulam 40. తామరైయాళ్ కేళ్వన్-పార్తన్‌పళ్లి
Tamarayal Kelvan - Partan Palli