దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుచ్చేరై

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

12. తిరుచ్చేరై (కుంభకోణం 12 కి.మీ)

(సార క్షేత్రము)

శ్లో. శ్రీ సారాఖ్య సరోజనీ కృతరుచౌ సారాభిధానే పురే
   సారాఖ్యాయుత నాయకీ ప్రియ వపు స్సారాఖ్య వైమానగ:|
   ప్రాగ్వక్త్రాంబుజ సంస్థితి ర్విజయతే శ్రీ సారనాథో విభు:
   కావేరి నయనా తిథి: కలిరిపు స్తుత్య శ్శ్రితాభీష్టద||

వివరణ: సారనాథ పెరుమాళ్-సారనాయకి-సార పుష్కరణి-సార విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-కావేరికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశేషములు: పుష్కరిణి తీరమున కావేరి అమ్మన్ సన్నిధి కలదు. మకరమాసములో జరుగు రధోత్సవమున పెరుమాళ్లు శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, సారనాయకి మహాలక్ష్మి వీరితో కలసి వేంచేయుదురు.

మార్గము: కుంభఘోణము నుండి కూడవాశల్ పోవు టౌన్‌బస్‌లో 12 కి.మీ. దూరమున గలదు. సత్రములు హోటళ్లు గలవు. ఉప్పిలియప్పన్(తిరువిణ్ణగర్) సన్నిధి నుండి ,నాచ్చియార్ కోయిల్ నుండియు కూడ పోవచ్చును. ఈ క్షేత్రమునకు 5 కి.మీ నాచ్చియార్ కోయిల్.

   కణ్‌శోర వెజ్గురుది వన్దిழிయ వెన్దழల్‌పోల్ క్కున్దలాళై
   మణ్‌శేర ములై యుణ్డ మామదలాయ్ వానవర్ తజ్కోవే యెన్ఱు
   విణ్ శేరు మిళన్దిజ్గళగడురిఇజ మణిమాడమల్‌గు; శెల్వ
   త్తణ్ శేఱైయెమ్బెరుమాన్ తాళ్ తొழுవార్ కాణ్మినెన్ఱలై మేలారే !
           తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 7-4-1


అష్టవిధ పుష్పములు

భగవంతుని ప్రాకృత పుష్పములతో పాటు ఈ పుష్పముల తోడను పూజింపవలెను.

1. అహింసా. 2. ఇంద్రియ నిగ్రహము. 3. సర్వ భూత దయ. 4. క్షమా. 5. జ్ఞానము. 6. తపస్సు. 7. ధ్యానము. 8. సత్యము.

ఈ ఎనిమిది విష్ణువునకు ప్రీతికరమైన పుష్పములు.

శ్లో. అహింసా ప్రధమం పుష్పమ్‌-పుష్ప మింద్రియ నిగ్రహ:
   సర్వభూతదయా పుష్పం-క్షమా పుష్పం-విశేషత:
   జ్ఞానం పుష్పం-తప: పుష్పం-ధ్యానం పుష్పం తదైవ చ
   సత్య మష్ట విధం పుష్పం విష్ణో:ప్రీతి కరం భవేత్||

13. తలైచ్చంగనాణ్మదియమ్‌ 13

(తలైచ్చగాండ్రు)

శ్లో. శ్రీ చంద్రాహ్వయ పద్మినీ తటతలే శ్రీ మత్తలచ్చజ్గమి
   త్యాఖ్యే దివ్య పురేతు చంద్ర పదకే వైమాన వర్యే స్థిత:|
   దేవో నాణ్మతియ ప్రభుర్విజయతే దేవ్యా పురాఖ్యాయుజా
   ప్రాగాస్య శ్శశి దేవ సేవిత తను శ్శార్జ్గాంశ మౌని స్తుత:||

వివ: నాణ్మదియప్పెరుమాళ్-వెణ్ శుడర్ పెరుమాళ్-తలైచ్చంగ నాచ్చియార్-శెంగమలవల్లి తాయార్-చంద్ర పుష్కరిణి-చంద్ర విమానము-తూర్పు ముఖము-నిలుచున్న సేవ-చంద్రునకు దేవతలకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ క్షేత్రమునకు అరుణ వనమని పేరు కలదు.

మార్గము: మాయవరం నుండి అక్కూర్ చేరి అట నుండి శీర్గాళిపోవు మార్గములో 3 కి.మీ దూరమున సన్నిధి కలదు తలచ్చంగాడనియే చెప్పాలి. తలచ్చంగాడు నుండి మణ్‌శాలై పోవు మార్గంలో 1/4 కి.మీ దూరమున సన్నిధి కలదు. వసతులు మితముగా నున్నవి.

   కణ్ణార్ కణ్ణపుర జ్కడిగై కడి కమழுమ్;
   తణ్ణార్ తామరై శూழு తలైచ్చజ్గమే త్తిశైయుళ్;
   విణ్ణోర్ నాణ్మదియై విరిగిన్ఱి వెంజుడరై
   కణ్ణార కణ్డు కొణ్డు కళికిన్ఱ దిజ్గెన్ఱు కొలో.
         తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 8-9


అష్టవిధ భక్తి

1. మద్బక్తజన వాత్సల్యమ్_____________భగవద్బక్తుల యందు ప్రేమ
2. పూజాయాంచ అనుమోదనం__________భగవదారాధన యందు కోరిక
3. స్వయం అభ్యర్దనమ్_______________స్వయముగా ఆరాదించుట
4. మదర్దే డంబవర్జనమ్_______________భగవద్విషయమున ఆడంబరములను విడుచుట
5. మత్కధాశ్రవణే భక్తి________________భగవంతుని కథలను వినుటయందు భక్తి
6. సర్వ నేత్రాంగ విక్రియా_____________భగవత్కథలను వినునపుడు శరీరముపులకించుట
7. మమానుస్మరణం నిత్యం____________ఎల్లపుడు భగవంతుని తలచుట
8. యచ్చమాం నోవజీవతి_____________ప్రయోజనాంతరముల యందు ఆశలేకుండుట