Jump to content

దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుక్కుడందై

వికీసోర్స్ నుండి

14. తిరుక్కుడందై 14

కుంభకోణము

శ్లో. శ్రీ హేమాంబుజినీ తటీ తు నగరే శ్రీ కుంభఘోణాభిదే
   ప్రాప్త:కోమల వల్లికాఖ్య మహిషీం శ్రీవైదికా గారగ:|
   హేమాఖ్యాన మునీక్షితో విజయతే శ్రీ శార్జ్గా పాణి ప్రభు:
   ప్రాగాస్యో భుజగేంధ్ర భోగశయనోతృప్తామృతాఖ్యాయుత:||


శ్లో. శ్రీ భూత మహదాఖ్యాన భక్తి సార శఠారిభి:|
   విష్ణుచిత్త కలిఘ్నాఖ్యాం గోదాస్తుతి పరిష్కృత:||


వివ: శార్జ్గ పాణి పెరుమాళ్-ఆరావముదు పెరుమాళ్-కోమలవల్లి తాయార్-హేమపుష్కరిణి-వైదిక విమానము-తూర్పు ముఖము-భుజంగ శయనమున ఉత్థాన శయనము పూదత్తాళ్వార్;పేయాళ్వార్; తిరుమழிశై ఆళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్-తిరుమంగై యాళ్వార్ కీర్తించినది. హేమమహర్షికి ప్రత్యక్షము.


విశే: ఈ దివ్యదేశమున ఈ సన్నిధి కాక చక్రపాణి పెరుమాళ్ సన్నిధి; రామర్, వరాహనాయనార్ సన్నిధులు గలవు. బ్రహ్మాలయము, సూర్యాలయము కలవు. తిరుమழிశై ఆళ్వార్ తిరునాడు అలంకరించిన (పరమ పదించిన) స్థలము. శార్జ్గ పాణి పెరుమాళ్ సన్నిధికి పడమట వీరికి సన్నిధి గలదు. మకరం-మేషమాసములలో బ్రహ్మోత్సవము జరుగును.


ఈ క్షేత్రమునకు కుడమూక్కు (కుంభ ఘోణం) అను విలక్షణమైన తిరునామము కలదు. నమ్మాళ్వారు తిరువాయిమొழிలో "ఆరావము"తే యను దశకమున (5-8) ఆరావముతే (ఆతృప్తామృతమా! అనగా ఎంత సేవించినను అనుభవించినను తనివి తీరక ఇంకను అనుభవింపవలెనను కోరిక కలుగునట్లు వేంచేసియున్నవాడా!) అని కీర్తించియున్నారు. అంతియేకాక "శూழ்విశుమ్" అను తిరువాయిమొழிలో (10-9) తమ పరమ పదానుభవమును ప్రకటించుచు భూలోకస్మరణ ప్రసక్తియే లేని సందర్భమున కూడ "కుడన్దై యెజ్గోవలన్" అని కుంభఘోణక్షేత్రమును కీర్తించిరి. అట్లే తిరుమజ్గై యాళ్వారును తమ ప్రబంధములలో మొదటిదగు పెరియ తిరుమొழி ప్రారంభములో "ఆవియే యముదే" అనుపాశురమున (పె.తి.1-1-2) శూழ்పునల్ కుడన్దైయే తొழுదు" (జలాశయ పరివృతమైన కుంభఘోణక్షేత్రమునే సేవించి) యని మొట్ట మొదట కుంభఘోణక్షేత్రమునే ప్రస్తుతించిరి. అంతియే కాక తమ ప్రబంధములలో చివరిదగు "తిరునెడున్దాణ్డగ"మున "తణ్కుడన్దక్కిడన్దమాలై" యని ఈ క్షేత్రమునే ప్రస్తుతించి ముగించిరి. మఱియు ఈ క్షేత్ర స్వామి విషయముగా "తిరువెழுక్కూత్తిరుక్కై యను ప్రబంధమును అనుగ్రహించిరి. నాధమునులకు ముందుగా లభ్యమైనది "ఆరావముదే" యను దశకము(5-7)మాత్రమే. దానినాధారముగా చేసికొని వారు ఆళ్వార్ తిరునగరి చేరి కణ్ణిమణ్ చిఱుత్తాంబు ప్రబంధమును పన్నెండు వేల పర్యాయములు జపించి నమ్మాళ్వర్ల అనుగ్రహమును పొంది తిరువాయిమొழிని తక్కిన ప్రబంధములను పొందగల్గిరి.

తిరుమழிశై ఆళ్వార్ "నడన్దకాల్‌గళ్‌నొన్దవో" యను పాశురమున స్వామీ! కావేరి తీరమున పవళించి యుంటివే! ముల్లోకములను కొలచి నందు వలన నీ శ్రీపాదములు నొచ్చుట చేతనా? లేక వరాహావతారమున భూదేవిని పైకి ఎత్తుట వలన కలిగిన శ్రమ చేతనా? లేచి కూర్చొని చెప్పుము" అని పలుకగా భక్తపరాధీనుడగు శార్జ్గ పాణి లేచుటకు సిద్ధపడగా ఆళ్వార్లు సేవించి అర్చావతార సమాది చెడకూడదని తలచి "వాழி" యని శయన తిరుక్కోలమునకు మంగళము పాడిరి. కావుననే ఇచట స్వామి "ఉత్ధానశాయి" గా సేవ సాయించుచున్నారు.

మార్గము: తమిళనాడులోని అన్ని ప్రసిద్ధ పట్టణముల నుండి బస్ సౌకర్యం గలదు.

   నడన్దకాల్‌గళ్ నొన్దవో నడుజ్గ ఈలమేనమాయ్
   ఇడన్ద మెయ్ కులుజ్గవో విలజ్గుమాల్ వరై చ్చురమ్‌
   కడన్ద కాల్ పరన్ద కావిరిక్కరై క్కుడన్దైయుళ్‌
   కిడన్ద వారెళున్దిరున్దు పేశువాழி కేశనే! ||
             తిరుమழிశై ఆళ్వార్ తిరుచ్చన్ద విరుత్తం 61

   ఆరావముదే! అడియేనుడలం నిన్బాల్ అన్బాయే
   నీరాయలైన్దు కరైయ ఉఱుక్కుగిన్ఱ నెడుమాలే!
   శీరార్ శెన్నెల్‌కవరి వీశుం శెழுనీర్ తిరుక్కుడన్‌దై
   ఏరార్ కోలమ్‌ తిగழగక్కిడన్దాయ్! కణ్డేన్ ఎమ్మానే.

   కళవాయ్ తున్బమ్‌ కళై యాదొழிవాయ్ కళైగణ్ మற்றிలేన్
   వళైవాయ్ నేమిప్పడై యాయ్‌కుడన్‌దై కిడన్ద మామాయా!
   తళరావుడలమ్‌ ఎనదావి శరిన్దు పోమ్పోదు
   ఇళయాదు నదాళ్ ఒరుజ్గప్పిడిత్తు ప్పోద విశైనీయే.
           నమ్మాళ్వార్-తిరువాయిమొழி 5-8-1,8

   ఆవియే! యముదే! యెననినై న్దురుగి అవరవర్ పణై ములై తుణయా
   పావియే నుణరాదెత్తనై పగలుమ్‌ పొழுదుపో యొழிన్దన నాళ్‌గళ్‌
   తూవిశేరన్నమ్‌ తుణైయొడుమ్‌ పుణరుమ్‌ శూழ் పునల్ కుడన్దైయే తొழுదు ఎన్‌
   నావినాలుయ్య నాన్ కణ్డు కొణ్డేన్ నారాయణా వెన్నుమ్‌ నామమ్‌!
            తిరుమంగై ఆళ్వార్లు-పెరియతిరుమొழி 1-1-2

14.B. చక్రపాణి-తిరుక్కుడందై

Chakrapani - Kumbghakonam

15. హరశాపహరన్-తిరుక్కండియూర్.

Harasapaharan - Tirukandiyur

16. ఉప్పిలియప్పన్-తిరువిణ్ణగర్.

Uppiliyappan - Tiruvinnagar

17. వయలాలి మణవాళన్-తిరువాలి తిరునగరి.

Vayalali Mannavalan - Tiruvali Tirunagari

15. తిరుక్కండియూర్

శ్లో. నిత్యం భాతి కపాల తీర్థ రుచిరే శ్రీకండియూర్ పట్టణే
   వైమానే కమలాకృతా స్థితియుత: ప్రాచీముఖాలంకృత:|
   నాయక్యా హర శాప నాశక విభు శ్శ్రీపద్మ వల్ల్యా శ్రిత:
   ప్రత్యక్షో వర కుంభ సంభవ మునే: కీర్త్య: కలిద్వేషిణ: ||

వివ: హర శాపం తీర్త పెరుమాళ్(హర శాపనాశకర్)-కమలవల్లి తాయార్-కపాల తీర్థాము-కమలాకృతి విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-అగస్త్యునకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: రుద్రుని చేతియందు గల కపాలమును నేలపడునట్లు అనుగ్రహించిన స్థలము. సన్నిధికి 1 కి.మీ దూరములో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సన్నిధులు కలవు. ఈ క్షేత్ర సమీపములో కల్యాణపురమున శ్రీనివాస పెరుమాళ్ సన్నిధి కలదు.

మార్గము: తంజావూరు నుండి తిరువయ్యారు పోవుటౌను బస్‌లో పోవలెను. వసతులు లేవు. తంజావూరులోనే బసచేయవలెను.

పా. పిణ్డియార్ మణ్‌డై యేన్ది ప్పిఱర్ మనై తిరి తన్దుణ్డుమ్‌
    ముణ్డియాన్; శాపయ్ దీర్త ఒరువనూర్; ఉలగమేత్తుమ్‌
    కణ్డియూర్; అరజ్గమ్ మెయ్యమ్ కచ్చిపేర్‌మల్లై యెన్ఱు
    మణ్డినార్; ఉయ్యలల్లాల్ మట్రనయార్కు ఉయ్యలామే?
            తిరుమంగై ఆళ్వార్-తిరుక్కుఱున్దాణ్డగమ్‌ 19


భగవత్కృపా పాత్రులు

వివిధ జాతులలో జన్మించియు భగవంతుని కృపకు పాత్రులైన వారు:-1. గుహప్పెరుమాళ్. 2. శబరి. 3. జటాయు మహారాజు. 4. సుగ్రీవాది వానరులు. 5. అయోధ్యా వాసులైన చరాచరము. 6. చిన్తయన్తియను గోపిక. 7. దధిభాణ్డు అను గొల్లవాడు. 8. వాని పెరుగు బాన. 9. కుబ్జ. 10. సుదాముడను మాలా కారుడు. 11. ఘంటా కర్ణుడు. 12. శ్రీకృష్ణునకు భోజనమిడిన ఋషి పత్నులు. 13. ప్రహ్లాదాళ్వార్. 14. విభీషణుడు. 15. గజేంద్రళ్వాన్. 16. గరుడునకు భయపడి భగవంతుని శరణు వేడిన సుముఖ మను సర్పము. 17. శ్రీకృష్ణుని ఆశ్రయించిన గోవిందస్వామి. 18. మార్కండేయుడు.