దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/సత్యాగ్రహం-పాసివ్‌రెసిస్టెన్స్

వికీసోర్స్ నుండి

జరిగింది. ఈ చరిత్రను పొడిగించుటకు ముందు పాసివ్‌రెసిస్టెన్స్ మరియు సత్యాగ్రహం అను రెండు శబ్దాలకు మధ్యగల భేదాన్ని తెలుసుకోవడం అవసరం తరువాత ప్రకరణంలో యీ భేదాన్ని తెలుసుకుందాం




13

సత్యాగ్రహం-పాసివ్‌రెసిస్టెన్స్

బారతీయుల జాతీయ ఉద్యమం తీవ్రరూపం దాల్చే కొద్దీ ఆంగ్లేయులకూడా ఆకర్షితులయ్యారు. ట్రాన్స్‌వాల్ యందలి ఇంగ్లీషు పత్రికల వాళ్లంతా ఖూనీ చట్టాన్ని సమర్థిస్తూ, ఇంగ్లీషువాళ్ళంతా దాన్ని సమర్దిస్తూ వుండేవారు. అయినా భారతీయులు ఏమైనా వ్రాసిపంపితే తమ పత్రికల్లో తప్పక ప్రకటిస్తూవుండేవారు ప్రభుత్వానికి భారతీయులు పంపే ఆర్జీలను పూర్తిగా ప్రచురిస్తూ వుండేవారు పూర్తిగా ప్రకటించని వాళ్లు సారాంశమైనా తప్పకప్రకటిస్తూ వుండేవారు భారతీయులు జరిపే మీటింగులకు తమ విలేకర్లను పంపుతూ వుండేవారు విలేకర్లను సంపనివాళ్లు మనం సభావిశేషాలు వ్రాసి పంపితే ప్రకటించేవాళ్లు

ఇంగ్లీషు పత్రికల సౌహర్ధ్రతతో కూడిన యీవ్యవస్థ భారతజాతీయ ఉద్యమానికి ఎంతో సహయం చేసింది. ఉద్యమం ప్రారంభించిన తరువాత ఆంగ్లేయులు కూడా అందుపాల్గొనసాగారు అట్టి అగ్రగణ్యుల్లో జోహన్స్‌బర్గుకు చెందిన ఆంగ్లలక్షాధికారి శ్రీ హాస్కిన్ ఒకరు వారిహృదయంలో రాగద్వేషాలు లేవు ఉద్యమం ఆరంభించిన తరువాత వారు నా దగ్గరకు రాసాగారు జోహన్స్‌బర్గ్‌లో జమిస్టన్ ఒక ఉపనగరం అక్కడి ఆంగ్లేయులు నా ఉపన్యాసం వింటామని వార్త పంపారు. ఒక సభ జరిగింది. శ్రీ హాస్కిస్ ఆ సభకు అధ్యక్షత వహించారు. నేను ఉపన్యాసం యిచ్చాను సభలో శ్రీ హాస్కిన్ భారతీయుల ఉద్యమాన్ని గురించి మాట్లాడుతూ నన్ను పరిచయం చేస్తూ ట్రాన్స్‌వాల్ భారతీయులు న్యాయంకోసం ప్రయత్నించి విఫలురైపాసివ్ రెసిస్టెన్స్‌ను ఆశ్రయించారు. వాళ్లకి ఓటింగు అధికారంలేద వారి సంఖ్య స్వల్పం (వాళ్లు బలహీనులు) వాళ్ల దగ్గర ఆయధాలులేవు. అందువల్ల బలహీనుల ఆయుధమైన పాసివ్‌రెసిస్టెన్సును చేతబట్టారు' అని అన్నారు వారిమాటలు విని నేను నివ్వెరబోయాను దానితో నా ఉపన్యాస విఛానమే మారిపోయింది. నేను శ్రీ హాస్కిన్ చెప్పిన వాదనను ఖండించాను. పాసివ్‌రెసిస్టెన్స్ అంటే సోల్‌ఫోర్స్ అనగా ఆత్మబలం అని చెప్పాను పాసిప్‌రెసిస్టెన్స్ అను శబ్దంవల్ల భయంకరమైన అపోహలు తలఎత్తే ప్రమాదం వున్నదని గ్రహించాను. నావాదనలను విస్తారింగా వివరించి పాసెవ్ రెసిస్టెన్స్‌కు మరియు ఆత్మబలానికి మధ్యగల తేడాను సవివరంగా తెలియజేస్తానని చెప్పి అందుకు ప్రయత్నించాను పాసివ్‌రెసిస్టెన్స్ అను యీ రెండు శబ్దాల్ని ఇంగ్లీషులో ఎవరు ప్రారంభించారో నాకు తెలియరు (అధికసంఖ్యాకులు చట్టం చేస్తే అది అల్ప సంఖ్యాకులకు యిష్టంకాకపోతే, వాళ్లు ఆ చట్టానికి వ్యతిరేకంగా విప్లవం రెచ్చకొట్టకుండా దానిముందు తలవంచకుండా పాసివ్ అనగా మెతక వైఖరి అవలంబిస్తారు. అందుకు విధించబడే శిక్షను అనుభవించుటకు సిద్ధపడతారు. కొద్ది ఏండ్లక్రితం బ్రిటిష్ పార్లమెంటులో విద్యకు సంబంధించిన చట్టం ప్యాసుచేశారు. అప్పుడు ఇంగ్లాండునందలి నాన్‌కానఫేమిష్ట అను పేరు గల క్రైస్తవ సంప్రదాయానికి చెందినవారు డా|| క్లిఫర్డ్ నాయకత్వాన పాసిప్ రెసిస్టెన్స్‌ను ఆశ్రయించారు. ఆంగ్లమహిళలు ఓటింగు హక్కుకోసం చేసిన ఉద్యమం కూడా పాసివ్‌రెసిస్టెన్స్ ఆ రెండు ఉద్యమాల్ని దృష్టియందుంచుకొనే శ్రీ హాస్కీన్ ఇంగ్లీషువాళ్ల సభలో "పాసివ్ రెసిస్టెన్స్" ఓటింగు హక్కు లేని బలహీనుల ఆయుధం అని అన్నారు ఊ|| క్లిఫర్డ్ పక్షం ఓటింగు హక్కుగల వారిది కాని బ్రిటిష్ పార్లమెంటులో వారి సంఖ్య తక్కువగా వున్నది అందువల్ల వారి శక్తి బిల్లును ప్యాసు చేయకుండా ఆపలేకపాయింది అంటే సంఖ్యా బలంలో బలహీనమని తేలింది. అయితే నాన్‌కన్ఫామిస్ట్ పక్షం తమ లక్ష్యసాధనకు ఆయుధాల ప్రయోగాన్ని వ్యతిరేకించలేదు. కాని యిటువంటి వ్యవహారంలో ఆయుధాల్ని ఉపయోగించితే జయం లభిస్తుందనే ఆశ దానికి లేదు. యింతేగాక హఠాత్తుగా ఆయుధ ప్రయోగంచేసి అధికారం పొందే పద్దతి పరిపాలనా వ్యవస్థయందు సరియైనది కాదు. క్లిఫర్డ్‌పక్షంవారిలో కొందరు ఆయుధాలు ఉపయోగించుటకు వ్యతిరేకులు, ఇంగ్లాండులో జరిగిన మహిళా ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు ఓ.టింగ్ హక్కులేదు. సంఖ్యలోనే గాక శారీరక శక్తిలో సైతం వాళ్లు బలహీనులే అందువల్ల యీ రెండవ ఉదాహరణ కూడా హాస్కిన వాదనా సమర్ధనకు ఉపయోగపడింది. స్త్రీలు సాగించిన ఉద్యమంలో ఆయుధ ప్రయోగాన్ని త్యజించలేదు. స్త్రీల దళాలు కొన్ని యిళ్లు తగల బెట్టడమేగాక పురుషుల మీద దాడులకు కూడా చేశాయి. అయితే వాళ్లు ఎవరినీ చంపుటకు ప్రయత్నించినట్లు నాకు కనబడలేదు. సమయం చిక్కినప్పుడు జనాన్ని కొట్టడానికి, హింసించడానికి వాళ్లు సిద్ధపడిన మాట వాస్తవం

భారతీయుల జాతీయ ఉద్యమంలో ఎప్పుడు ఎక్కడా ఆయుధాలకు తావులేదు. ఉద్యమం తీవ్రమైన కొద్దీ కష్టాలు సహించడమే గాని భారతీయ సత్యాగ్రహులు ఎప్పుడు ఎక్కడా హింసకు దిగలేదు. శారీరిక బలాన్ని బాగా ఉపయోగించగల స్థితిలో వుండి కూడా వాళ్లు అందుకు పూనుకోలేదు అయితే భారతీయులకు ఓటింగు హక్కు లేకపోవడం వాళ్లు బలహీనులు కావడం రెండూ నిజమే అనలు సత్యాగ్రహ ఉద్యమానికి యీ రెండు విషయాలకు ఏమీ సంబంధలేదు. భారతీయులకు ఓటింగ్ హక్కు వున్నప్పటికీ, ఆయుధశక్తి వున్నప్పటికీ వారు సత్యాగ్రహమే చేసి యుండేవారు ఓటింగ్‌హక్కు వుంటే అసలు సత్యాగ్రహం చేయవలసిన అవసరమే వుండేదికాదు. భారతీయుల దగ్గర ఆయుధ శక్తియే వుండి వుంటే ప్రతిపక్షంవారు కడు జాగ్రత్తగా వ్యవహరించివుండే వారు. ఆయుధ శక్తికలిగియున్నవారు సత్యాగ్రహప్రయోగానికి సామాన్యంగా పూనుకోరు దాన్ని గమనించడం అవసరం జాతీయ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఆయుధాల ప్రయోగం సంభవమా, అసంభవమా అని నేను యోచించలేదు. సత్యాగ్రహం కేవలం అత్మబలమే ఆయుధాల బలానికి అనగా శారీరిక బలానికి లేక పశుబలప్రయోగానికి తావు వున్నచోట అనగా దాని ఉనికికి అవకాశం వున్నచోటు యిక ఆత్మ బలానికి తావు వుండదు. నా దృష్టిలో యీ రెండు పరస్పరం విరోధించే శక్తులు ఈ భావం సత్యాగ్రహ ఉద్యమ ఆరంభంనుంచే నా హృదయంలో పూర్తిగా నాటుకున్నది ఈ భావాలు సరియైనవా కాదా అని మనం యిక్కడ యోచించినవసరం లేదు. మనం పాసివ్ రెసిస్టెన్స్ మరియు సత్యాగ్రహానికి మధ్యనగలతేడాను తెలుసుకోవాలి. ఈ రెండు శక్తులు ఒకదానికొకటి వ్యతిరేకమైనవి ఆ తేడా తెలుసుకోకపోతే పాసివ్‌రెసిస్టెన్స్‌ను ఉపయోగించేవాళ్లు మరియు సత్యగ్రహాన్ని అంగీకరించేవాళ్లు యిద్దరూ ఒకటే అనుకుంటే అన్యాయం జరుగుతుంది హానికరమైన పరిణామాలు ఏర్పడతాయి మేము స్వయంగా దక్షిణాఫ్రికాలో పాసివ్‌రెసిస్టెన్స్ శబ్దాన్ని వాడాము ఓటింగ్ హక్కు కోసం పోరాటం జరిపినా బ్రిటిష్ స్త్రీల పరాక్రచూన్ని మరియు ఆత్మత్యాగాన్ని మాపై ఆరోపించి మమ్మల్ని --శంసించకూడదు. చాలామంది అబ్రిటిష్ స్త్రీల మాదిరిగా మేము కూడా ప్రజల అస్థిపాస్తులకు నష్టంకలిగించే వాళ్లమేనని భావించారు. శ్రీ హాస్కిన్ వంటివారు సైతం మమ్మల్ని బలహీసులుగా భావించారు. మనిషి యోచనలకు అమిత శక్తి వుంటుంది తను అనుకున్న ఆలోచనకు అనుగుణ్యంగా మనిషి అయిపోతాడు. మమ్మల్ని గురించి ఆలా అనుకునే వారిని అనుకోనిస్తే చివరక ఆ ఆయుధాన్ని సైతం వదలివేయడానికి మణము సిద్ధపడిపోవచ్చు. అలాంటి పాసివ్‌రెసిస్టెన్స్‌ను ఉపయోగిస్తూమేము జన్మలో బలవంతులం కాలేము మేము సత్యాగ్రహులమైయుండి, మమ్ము మేము బలవంతులమని భావించి సత్యాగ్రహశక్తిని ఉపయోగించిన రెండు పరిణామాలు కలుగుతాయి. బలమనే భావాన్ని పోషిస్తూ రోజు రోజుకు మేము బలవంతులమవుతాము మా బలం పెరిగిన కొద్దీ మా సత్యాగ్రహ తేజస్సు పెరుగుతుంది. పాసివ్‌రెసిస్టెన్స్‌లో ప్రేమకు తావు వుండదు. కాని సత్యాగ్రహంలో వైరభావానికి తావు వుండడు అసలు సత్యాగ్రహికి వైరి అంటూ ఎవ్వడూ వుండడు. పాసివ్‌రెసిస్టెన్స్‌లో అవకాశం చిక్కితే ఆయుధ బలానికి తావు వుంటుంది కాని సత్యాగ్రహ సమరంలో అత్యుత్తమైన అనుకూల పరిస్థితులు ఏర్చడినా ఆయుధ ప్రయోగానికి తావు. వుండదు పాసివ్‌రెసిస్టెన్సు నందు ఆయుధశక్తికి అవకాశం వుంటుంది కాని సత్యాగ్రహంలో అట్టి యోచనకు సైతం తావు వుండదు ఆయుధశక్తితో పాటు పాసివ్‌రెసిస్టెన్సు నడుస్తుంది. కాని సత్యాగ్రహంలో అలా నడవడానికి అవకాశమే వుండదు అందువల్ల రెండింటికీ సంబంధం కుదరదు, కలవదు అంటే సత్యాగ్రహం, ఆయుధబలం రెండూ కలపడానికి వీలు లేదు. సత్యాగ్రహాన్ని మన ప్రీతిపాత్రుల విషయంలో కూడా ఉపయోగించవచ్చు. కాని పాసివ్‌రెసిస్టెన్సును ప్రీతిపాత్రులపట్ల ప్రయోగించడానికి వీలులేదు. పాసివ్‌రెసిస్టెస్సులో శతృ పక్షంవారికి దుఃఖం కలిగించుటకు, కష్టం కలిగించుటకు అవకాశం వుంటుంది కాని సత్యాగ్రహంలో శతృపక్షంవారికి దు:ఖం కష్టం కలిగించాలనే భావమే వుందదు. తాను కష్టపడి, తాను దు:ఖాలు సహించి శతృ పక్షంవారి హృదయాలను జయించాలనే సాత్విక గుణం సత్యాగ్రహంలో పనిచేస్తుంది ఈ రెండింటికీ గల ప్రధాన భేదం వివరించాను. అయితే పాసివ్‌రెసిస్టెన్సు గుణగణాలను గురించి నేను వర్ణించి చెప్పినట్లు ప్రతి పాసివ్ రెసిస్టెన్సులోను జరుగుతుందని చెప్పలేము అయితే పాసివ్ రెసిస్టెన్సుకు యిచ్చే పలు ఉదాహరణాల్లో దోషాలు ఎక్కువగా కనబడతాయి

చాలా మంది క్రైస్తవులు ఏసుక్రీస్తు పాసివ్ రెసిస్టెన్సుకు ఆధినేతని అంటారు. కాని అది సరికాదు. వారిది సత్యాగ్రహం అని భావించాలి యిటువంటి ఉదాహరణలు చరిత్రలో పాసివ్‌రెసిస్టెన్సుకు లభించవు టాల్‌స్టాయి రష్యాకు చెందిన మఖోబోర్ ప్రజల ఉదాహరణ యిచ్చారు అది యిటువంటి పాసివ్‌రెసిస్టెన్స్ అనగా సత్యాగ్రహానికి ఉదాహరణయే ఏసుక్రీస్తు తరువాత వేలాది మంది క్రైస్తవులు ఎన్నో అత్యాచారాల్ని సహించారు. పాసిప్ రెసిస్టెన్స్ అనుశబ్దం వారికి ఎవ్వరూ వాడలేదు. అట్టి ఉత్తమ ఉదాహరణలన్నింటికి నేను సత్యాగ్రహమనే పేరు పెడతాను ఇదే పాసివ్ రెసిస్టెన్స్ అని అంటే, సత్యాగ్రహానికి, దానికి తేడాయే యుండదు

పాసివ్ రెసిస్టెన్స్ యొక్క లక్షణాలను గురించి పైన తెలిపిన హెచ్చరిక ఆశక్తిని ఉపయోగించేవారికి అన్యాయం జరుగకూడదనే భావంతోనే చేయవలసి వచ్చిందనిమనవి చేస్తున్నాను. అయితే నేను సత్యాగ్రహియొక్క లక్షణాలని పేర్కొన్నవన్నీ ప్రతి సత్యాగ్రహియందూ వున్నాయని చెప్పలేను. అయితే నేను తెలిపిన గుణాలు చాలామంది సత్యాగ్రహులకు, తెలియవని కూడా చెప్పుటకు సందేహించను సత్యాగ్రహం బలహీనుల ఆయుధమని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. అసలు సత్యాగ్రహం ఆయుధాల బలప్రయోగానికి ముందుయిచ్చే శిక్షణ అనికూడా కొందరు అంటున్నారని విన్నాను. యిది సరికాదు. మరోసారి స్పష్టంగా చెబుతున్నాను ఎటువంటి గుణాలు గల సత్యాగ్రహులు కనబడ్డారో నేను వివరించలేదు. అసలు సత్యాగ్రహం అను భావంయొక్క గూఢార్థం ఏమిటో వివరించాను ఆవిధంగా సత్యాగ్రహి అంటే ఎలా వుండాలో స్పష్టంగా వివరించాను. ఈ ప్రకరణం వ్రాయడానికి గల ఉద్దేశ్యం క్లుప్తంగా మరో మారు వివరిస్తాను ట్రాన్స్‌వాల్ యందలి భారతీయులు ఏశక్తిని ప్రదర్శించడానికి పూనుకున్నారో, ఆశక్తిని గురించి ప్రజలకు స్పష్టంగా బోధపరుచుటకు ప్రయత్నించాను. ఆశక్తిని పాసివ్‌రెసిస్టెన్స్ అని పిలిచే శక్తితో అపోహపడి కలిపి చేయకూడదనీ, అందువల్లనే జాగ్రత్తగా యీ శక్తిని ప్రకటించగల శబ్దం కోసం వెతకవలసి వచ్చిందనీ చెప్పాను దానితోబాటు సత్యాగ్రహంలో అప్పుడు ఏఏ సిద్ధాంతాల్ని చేర్చామో కూడా వివరించాను




14

ఇంగ్లాండులో ప్రతినిధిబృందం

ట్రాన్స్‌వాల్‌లో ఖూనీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎవరెవరకి అర్జీలు దాఖలు చేయాలో వారందరికీ దాఖలు చేశాము ట్రాన్స్‌వాల్ అసెంబ్లీ మాత్రం స్త్రీలకు సంబంధించిన నిబంధనను తొలగించింది. కాని మిగతా బిల్లు గెజెట్‌లో ప్రకటించబడినట్లుగా అంగీకరించబడింది. అయినా అప్పుడు భారతజాతిలో గట్టిదనం, ఉత్సాహం, ఆవేశం, శక్తి సామర్థ్యాలు వుండటం వల్ల దాన్ని ఎవ్వరూ లేక్కచేయలేదు. దానితో ప్రభుత్వం అందుకు సంబంధించిన చర్యలన్నీ చట్టరీత్యా గైకొనాలని నిర్ణయించింది. అప్పటివరకు ట్రాన్స్‌వాల్ రాజ్యం "క్రౌన్‌కాలనీ"గా వున్నది. క్రౌన్‌కాలనీ అంటే సామ్రాజ్యంలో వున్న అధినివేశ రాజ్యం అన్నమాట అంటే బ్రిటిష్ సామ్రాజ్యాధిపత్యం