Jump to content

తెలుగు సమస్యలు/90-99 సమస్యలు

వికీసోర్స్ నుండి

  • అక్కా ! రమ్మనుచు మగఁడు నాలిం బలిచెన్,


● క. ఱక్కసివలె యిప్పొద్దున
మెక్కుచుఁ దిరి గెదవు కాలి మెట్టున నిన్నున్
గుక్కక మానను దసి నీ, అక్కా. - • 89

క.వక్కాకు మడిచి వేసుక
చక్కెరవిలు కానికేళిసలుపుద మనుచున్
చక్కనిముద్దులమఱఁద లి, యక్కా. . . 90

  • భార్యలిద్దఱు శ్రీరామభ ద్రునకును,


తే, రావణుని సంహరించియు రాజ్యమునకు
నంగనయుఁ దాను నభిషిక్తుడై వెలుంగ
హారతిచ్చిరి ప్రేమతో హరునిముద్దు, భార్య. 91

  • కోతికిని కొమ్ములారు గుఱ్ఱముకు వలెన్. ,


క, రాతిరొకహయము నమ్మితి
నాతురపడి హస్తికొమ్ములాఱింటికినిన్
ఈతఱిగొనుగో లిచ్చెద, కోతికినిం. . . 92.

  • నూఱున్ముప్పదియాఱుకన్నులమరెన్ రుద్రాణివక్షంబునన్.


శా. రారమ్మంచు గుమారునంకముపయిన్ రంజిల్లగానుంచి వి
స్తారోద్యద్ఘ నవక్త్రపంచకముతో శంభుడు దత్కాంతయు
న్నారూఢిన్ ఘనపంచరత్నపతకం బాలోకనం బేయగా . . . 93’

  • రుక్మిణిచనుమొనల విూద రోఁకలి నిలిచెన్


క. రుక్మిణిదేవిని నెత్తుక
రక్ష్మిణిపతి పోవుచున్నరూఢిగ నపుడే
రక్ష్మి యనువాఁడు తాఁకిన, రుక్మిణిచను. 94.


  • రారా తమ్ముడ రారయన్న యనిభర్తం బిల్పెఁ బ్రాణార్థియై,


శా.లే రామామణి రాజసూయమునదండ్రిన్ జేయగా ముద్దుశృం
గారిం బన్నడిగద్దె పీఠమున వేడ్కన్నిల్పిరాస్వామికిన్, వీరం
డై హరునెత్తి మొుత్తిన ధనుర్విద్యాగురుస్వామికిన్, రా ... 95

  • తలలొ క్కేబదినాల్గు కానబడియెన్ దద్గౌరివక్షంబునన్,


మ. లలితాకారుఁ గుమారు షన్ముఖునినిన్ లాలించి చన్నిచ్చుచో
గళలగ్న గ్ర హరత్నదీప్తకలికా గాంభీర్య హేమాంచితో, జ్వల
రత్న ప్రతిబింబితాననములన్ శంభుండు వీక్షించినం, దల. . . 96


  • పలుకులు గూబలకు మిగులపండుగ నేసెన్,


క. లలితాంగిపంజరమ్మునఁ
గలచిలుకల హెచ్చరింపఁ గడుమధురముగా
జిలుకలు కలకలపలికెడు, పలుకులు. . . 97.

  • వజ్రము పచ్చయ్యె పచ్చ వజ్రం బాయెన్.


క. వజ్ర మయా ! నీహృదయము
ఈజ్రాప్రాసంబు కవుల కియ్యం దగునా
వజ్రసభ గరుడియాదఁగ, వజ్రము. . . 98

  • పడమటికొండమీద నొకపద్మదళాక్షికి మొల్చె శష్పముల్,


చ. వడిగలదండిరక్కసుల వాదన భాస్కరుఁ డెందుఁగ్రుంకు నీ
పుడమిని సర్వలకణసమున్నతి గల్లు నెలంత లెందఱో, పడ
తికి మన్మథాలయముపైనను నేమది యంకురించె నాపడ... 99

  • రాతికిఁ గోతిపుట్టె రఘురామునికైవడి సీతకైవడిన్,


ఉ. వాతసుతాఖ్యచే బరగి వాసవ వైరులు భీతిఁ జెందఁగా, "ధా
త్రిసుశానురాగమున ధైర్యము శక్తియు విక్రమంబువిఖ్యా
తి చెలంగ రావణుని పెంపడఁగింపను ధీరుడై పురా, రా... 100