తెలుగు సమస్యలు/80-89 సమస్యలు
- మరుఁడు దొనఁ జూపె యముఁడు కింకరులఁ జూ పె.
తే.భరతకులవీరుఁ డయినట్టి పాండురాజు
మాద్రిపై దృష్టి నిలిపిన మగువ యంత
వలదు వల దని వారింప వాంఛగరిమ, మరుఁడు. . . 77
- ధారము లేనిహారము నితంబిని నీ కెవ రిచ్పెఁ జెప్పవే.
ఉ.భూరివివేకులౌవిటులఁ బూఁబొదరిండ్లను గూడివారిచే, గో
రినభూషణంబుఁ గొని కోమలి ధారుణి వైతివందులో, హీర
ము లుల్లసిల్లఁగ మహీప్రవరుల్ వినుతింపఁబచ్చలా, ధార . . .
- కుంచములో పోతునక్క కూనలు పెట్టెన్,
మంచివి కుంచెడు సెనగలు
మంచముపై నెండఁబోసి మఱచితి నిపుడే
పెంచినది తల్లి యొక్కటి, కుంచ. . . 79
- గుజ్ఞానికి రెండు కాళ్లు కోడికిని వలెన్,
క.మఱ్ఱికడ రెండు కాళ్లకు
కుఱ్ఱడు చో టడుగఁ గోడి కొనియిచ్చితినో
సఱ్ఱా జ అట్లు కా దిఁక, గుఱ్ఱాని
- అనిరుద్దుఁడు నెమలి నెక్కి యంబుధి దాటెన్
మనసిజ నందనుఁ డెవ్వఁడు
అని షణ్ముఖు డెద్ది నెక్కి_యరుల జయించెన్"
హనుమంతుఁ డేమి సేనెను, అని, . . 81:
- ఉత్తరమున భానుబింబ ముదయం బయ్యెన్,
క.ముత్తాళి నిదురఁ బ్రోవఁగఁ
దత్తరపడి నిదుర లేచి తమ్ముడ లేలే
చిత్తరువు వ్రాయఁబోవలె, ఉత్తర . . . 82
- యేనుఁగుకొమ్ముమీదఁ బదియేనుఁగులున్నవి క్రీడ సల్పుచున్
ఉ. మానవనాథ! నీ వనుప వుత్తగజంబుల వేటఁ బోవఁగా, నే
నొకపర్వతంబుఁగనియొక్కఁ దొడంగినఁగుంజరంబుదా, బాను
కులేశమమ్ముగని పాఱ దొడంగినఁబట్టి తెస్తిమీ , యే. . . 83
- కుందేటికిఁ గొమ్ములైదు కుక్కకుఁబో లెన్,
క.ముందిస్తి కుక్కపిల్లను
నందము గాఁ బసుపుకొమ్ము లయిదింటికిన్
పొందుఁగఁ గొను విూవిధమున, కుందేటికి. . . 84
- వేకటి లేక బిత్తరియు బిడ్డ గనెన్ గగనస్థలంబునన్,
ఉ. మూకలు గూడి క్రౌంచములు ముందఱబోవుచు నుండ నొ
క్కటిం, జోకగ గుడ్లుఁబెట్ట నొకసూర్వకరం బిది దాఁకి పిల్ల
యై యీకలువచ్చితల్లి కడకేఁగ వడింజనెనైదునాల్నెలల్... 85
- గుండప్పడు వడిగ నడిచెఁ గొమ్మలమీదన్.
క.మెండుగ శకపికశారిక
తండంబులు బలసికొలువ దళ వాయియువం
తుం డెదుట నడవన ననం, గుండప్పడు. . . 86
- రాధేయుఁడు నందినెక్కి రావణుఁగూల్సెన్,
క.యోధ యొవఁడు కురు నేనకు
మాధవసఖుఁ డెద్ది నెక్కి మఱివిహరించున్
సాధించె నెవని రాముఁడు, రాధేయుఁడు. . . 87.
- కుంజర యూధంబు దోమకుత్తుక చొచ్పెన్.
రంజన చెడి పాండవు లరి
భంజనులై విరటుఁ గొల్వ పాల్పడి రకటా !
సంజయ ! విధి నేవుందును, కుంజర యూధంబు. . . 88
- అక్కా ! రమ్మనుచు మగఁడు నాలిం బలిచెన్,
● క. ఱక్కసివలె యిప్పొద్దున
మెక్కుచుఁ దిరి గెదవు కాలి మెట్టున నిన్నున్
గుక్కక మానను దసి నీ, అక్కా. - • 89
క.వక్కాకు మడిచి వేసుక
చక్కెరవిలు కానికేళిసలుపుద మనుచున్
చక్కనిముద్దులమఱఁద లి, యక్కా. . . 90
- భార్యలిద్దఱు శ్రీరామభ ద్రునకును,
తే, రావణుని సంహరించియు రాజ్యమునకు
నంగనయుఁ దాను నభిషిక్తుడై వెలుంగ
హారతిచ్చిరి ప్రేమతో హరునిముద్దు, భార్య. 91
- కోతికిని కొమ్ములారు గుఱ్ఱముకు వలెన్. ,
క, రాతిరొకహయము నమ్మితి
నాతురపడి హస్తికొమ్ములాఱింటికినిన్
ఈతఱిగొనుగో లిచ్చెద, కోతికినిం. . . 92.
- నూఱున్ముప్పదియాఱుకన్నులమరెన్ రుద్రాణివక్షంబునన్.
శా. రారమ్మంచు గుమారునంకముపయిన్ రంజిల్లగానుంచి వి
స్తారోద్యద్ఘ నవక్త్రపంచకముతో శంభుడు దత్కాంతయు
న్నారూఢిన్ ఘనపంచరత్నపతకం బాలోకనం బేయగా . . . 93’
- రుక్మిణిచనుమొనల విూద రోఁకలి నిలిచెన్
క. రుక్మిణిదేవిని నెత్తుక
రక్ష్మిణిపతి పోవుచున్నరూఢిగ నపుడే
రక్ష్మి యనువాఁడు తాఁకిన, రుక్మిణిచను. 94.