తెలుగు సమస్యలు/70-79 సమస్యలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search



 

  • వంకాయను జెఱకుసరసము వడియుచునుండెన్.


క. పంకజముఖ గురుకుచములఁ
బొంకముగా గురియొనర్చి పూవిలు కాడున్
ఉంకించి శరము దొడిగిన, వంకాయను. . . 65,

  • తల కాయలపులుసు తాగి తనిసిరి బౌపల్.


క, పలుకూరి దేవళంబున
సలలితముగ మొన్నఁ జేయు సంతర్పణకుం
దొలుతను విూరంపిన చిం,
తలకాయలపులుసు. . . 66.

  • వెన్నెలయెండయుం గలసి యేకముఖంబుననుండె నత్తఱిన్,


ఉ. పన్నుగ విష్ణులు బ్రాహ్మలును పర్వత రాట్ఖగ త్రచ్చు నప్పుడున్
వెన్నుడు మోహనాకృతిని వేల్పులకున్ సుధ బోయునప్పుడున్
పన్నగ భూషుడాత్రిపుర మందిరులంబరిమార్చి నప్పుడున్ .... 67

ఉ. ముస్ను సురాసురుల్ జలధిమూకలు గట్టుకత్రచ్చునప్పడున్
వెన్నుఁడు వేూహనాకృతిని వేల్పులకున్ సుధఁబోయనప్పడున్
బన్నగభూషుఁ డాత్రిపురమందిరులంబరిమార్పినప్పడున్... 68

  • పంచాంగము చూచి లంజ పక్కున నవ్వెన్.


క, పంచమినాఁ డొకవిప్రుడు
కంచముc దా కుదువబెట్టి కామాతురుఁడై
మంఛముపై రతినేయఁగ, పం. . . 69

క, పంచశమినాఁ డొకవిప్రుఁడు
అంచితముగఁ జెట్టునెక్కి యాకులుకోయన్
కించిత్తు పంచ దొలఁగిన, పం. . . 70


  • బడబానలపంక్తిమిూద పచ్చిక మొలచెన్,


క. పడఁతిరో నవ మేఘంబులు
విడిఁబడి జడికసరుపట్టి విలయపు వానల్
జడిఁబట్టి కురియ గోడలు, బడబానల. . . 71

  • ఇంకంగస్తరిబొట్టు పెట్టకుము తన్వీ ! ఫాలభాగంబునన్.


శా. పంకేజానన ! నేటి రేయి విను మి పంతంబుతో రాహువున్
శం కాతంకము లేక షోడళ కళాసంపూర్ణునేణాంకునిం , బొంకం
బార్చెదనంచుఁబల్కినఁ దగన్ బొంచుండి నేవింటి నీ, విం. . . 72

  • కన్నకుమారునికా మగనిగాఁ గనె సజ్జను లెల్ల మెచ్పఁగన్,


ఉ. పున్నమనాఁటి రేవెలుఁగుఁబోలు మొగంబు మెఱుంగుసిబ్బెపుం
జన్నులు వాలుఁగన్నులును జవ్వనముం గల బాణుపుత్రి, నీ
రున్నగ రాజధీరుననిరుద్ధకుమారునిస్వప్నమందుcదా, కన్న • • • 73

  • శంఖంబుల్ దివినుండివచ్చే నిదిగో జంబూఫల ప్రక్రియన్"


శా. ప్రేంఖత్ప్రేమనుసత్య భామకొఱకై కృష్ణుండునీ రేజరా, ట్కం
ఖాణంబు వదల్చికల్పకము వేగం దేఁగఁదద్వాసనా, రింఖాయు
క్తములై మిళిందనులు పేర్మిం బద్మసంఖ్యల్ మహా, శం... 74

  • పండే నాకిష్టమనుచు బాఁపడు వలికెన్.


క. పొందూర నొక్క విప్రుని
విందుకు రాఁబిలిచి నీకు వేడుకతోడన్
ఇందెందు నిష్ట మన బ, ప్పందే... 75

  • పరకాళాకుట్టుఱవికె ఫక్కునపగిలెన్,


క. పొరుగూరు పోయి వచ్చిన
యరుదగుతనమగనిఁజూచి యతిమోదముతో
గరి పొడిచి గుబ్బ లుబ్బిన, పర . . . 76

  • మరుఁడు దొనఁ జూపె యముఁడు కింకరులఁ జూ పె.


తే.భరతకులవీరుఁ డయినట్టి పాండురాజు
మాద్రిపై దృష్టి నిలిపిన మగువ యంత
వలదు వల దని వారింప వాంఛగరిమ, మరుఁడు. . . 77

  • ధారము లేనిహారము నితంబిని నీ కెవ రిచ్పెఁ జెప్పవే.


ఉ.భూరివివేకులౌవిటులఁ బూఁబొదరిండ్లను గూడివారిచే, గో
రినభూషణంబుఁ గొని కోమలి ధారుణి వైతివందులో, హీర
ము లుల్లసిల్లఁగ మహీప్రవరుల్ వినుతింపఁబచ్చలా, ధార . . .

  • కుంచములో పోతునక్క కూనలు పెట్టెన్,


మంచివి కుంచెడు సెనగలు
మంచముపై నెండఁబోసి మఱచితి నిపుడే
పెంచినది తల్లి యొక్కటి, కుంచ. . . 79

  • గుజ్ఞానికి రెండు కాళ్లు కోడికిని వలెన్,


క.మఱ్ఱికడ రెండు కాళ్లకు
కుఱ్ఱడు చో టడుగఁ గోడి కొనియిచ్చితినో
సఱ్ఱా జ అట్లు కా దిఁక, గుఱ్ఱాని

  • అనిరుద్దుఁడు నెమలి నెక్కి యంబుధి దాటెన్


మనసిజ నందనుఁ డెవ్వఁడు
అని షణ్ముఖు డెద్ది నెక్కి_యరుల జయించెన్"
హనుమంతుఁ డేమి సేనెను, అని, . . 81:

  • ఉత్తరమున భానుబింబ ముదయం బయ్యెన్,


క.ముత్తాళి నిదురఁ బ్రోవఁగఁ
దత్తరపడి నిదుర లేచి తమ్ముడ లేలే
చిత్తరువు వ్రాయఁబోవలె, ఉత్తర . . . 82

  • యేనుఁగుకొమ్ముమీదఁ బదియేనుఁగులున్నవి క్రీడ సల్పుచున్