తెలుగు సమస్యలు/60-69 సమస్యలు
- కొడవటిపిడి యర్థ రాత్రి కోడై కూసెన్
క, తొడమిూఁద నాఱకుఱుపై
బుడమిజనుం డొకఁడు నిదురఁ బోవుచు నుండం
బడే దానిమీద నొక్క_టి, కొడ. . 59
- భక్షించెను జోడు మెట్లు పాపంబోట్లూ !
క. దక్షణ లిచ్పేవేళల
రక్షలు నే విడిచి రాజవద్దికి జనగా
తక్షణమున శునకము మఱి, భక్షిం. . . 60
- గర్భములో నుండి వెడలె గమలాప్తు డొగిన్
"క.దుర్బర వేదన సలుపక
యర్ళకుఁ డుదయించు ననుచు నతి వెూదముతో
నిర్భర్థత నుండె బ్రాక్సతి గర్బ 61
- దోగ్ధ్రీథేనువుగర్భమందు బులికందు ల్పుట్టె నుగ్రాకృతిన్
శా.దోగ్థ్రీశాంతతపోదయాగుణనిధీ తేజస్విపాపాటవీ, దగ్థ్రక్ష్మా
నలుడైనకశ్యపునకు ద్యద్గర్వుడైయాగ భుగ్దగ్థ్రీశుల్ సుతు
లుద్భవించిరి బిడౌజావల్గివీక్షించితే, దో ..... . . . 62
- కుటిలాలక యొడమకన్ను కుడిక న్నాయెన్,
క. నిటలమున నీవు దాల్సిన
పటుతర కస్తూరి రేఖ బహురతి చేత
న్నటునిటు జాఱిన చెమటకు, కుటి. . . 63.
- ఏతపు గొమ్మమీద నొక యేనుఁగుసింగము వేట లాడఁగన్".
ఉ. నూతి జలంబులో న నొక నూరుశిరంబులయెద్దు మేయగా
నాతిపయోధరమ్మునను నల్లనిచంద్రుడు గాయుచుండఁగాఁ
గోతికి బిల్లి కూనకునఘాఘోరపువైరము గల్లుచుండగా, ....
- వంకాయను జెఱకుసరసము వడియుచునుండెన్.
క. పంకజముఖ గురుకుచములఁ
బొంకముగా గురియొనర్చి పూవిలు కాడున్
ఉంకించి శరము దొడిగిన, వంకాయను. . . 65,
- తల కాయలపులుసు తాగి తనిసిరి బౌపల్.
క, పలుకూరి దేవళంబున
సలలితముగ మొన్నఁ జేయు సంతర్పణకుం
దొలుతను విూరంపిన చిం,
తలకాయలపులుసు. . . 66.
- వెన్నెలయెండయుం గలసి యేకముఖంబుననుండె నత్తఱిన్,
ఉ. పన్నుగ విష్ణులు బ్రాహ్మలును పర్వత రాట్ఖగ త్రచ్చు నప్పుడున్
వెన్నుడు మోహనాకృతిని వేల్పులకున్ సుధ బోయునప్పుడున్
పన్నగ భూషుడాత్రిపుర మందిరులంబరిమార్చి నప్పుడున్ .... 67
ఉ. ముస్ను సురాసురుల్ జలధిమూకలు గట్టుకత్రచ్చునప్పడున్
వెన్నుఁడు వేూహనాకృతిని వేల్పులకున్ సుధఁబోయనప్పడున్
బన్నగభూషుఁ డాత్రిపురమందిరులంబరిమార్పినప్పడున్... 68
- పంచాంగము చూచి లంజ పక్కున నవ్వెన్.
క, పంచమినాఁ డొకవిప్రుడు
కంచముc దా కుదువబెట్టి కామాతురుఁడై
మంఛముపై రతినేయఁగ, పం. . . 69
క, పంచశమినాఁ డొకవిప్రుఁడు
అంచితముగఁ జెట్టునెక్కి యాకులుకోయన్
కించిత్తు పంచ దొలఁగిన, పం. . . 70