తెలుగు సమస్యలు/50-59 సమస్యలు

వికీసోర్స్ నుండి

  • పంచాస్త్రుని గేహమందు భానుఁడు వొడ మెన్


క.చంచలలోచన రాతిరి
సంచారముఁజేసినట్టిసందడిపడకో
పంచైన మూసికొనవే, పంచా. . . 47

  • ఆణిముత్యంబు విూసమందమరియుండె,


క.చంద్రశేఖరుఁ డొక నాఁడు శైలపుత్రి
యధరబింబము చుంబించునవసరమున
గిరిజనాసాగమందున మెఱయుచున్న, ఆణి. . . 48

"కాంతామణి చంటిమీదఁ గాకర మెలచెన్

క.చింతామణి యను బాపఁడు
పంతంబున గోడ విూఁదఁ బ్రతిమను వ్రాసెన్
అంతట వర్షము గురిసెను, "కాంతా. 49

  • కన్నులలోఁ జన్నులమరెఁ గాంతామణికిన్


క.చిన్నవి ఝషకంబులు గొని
చెన్నలరగ బెస్తవారి చిన్నది రాగా
పన్నుగ ఱొమ్మునఁ గలవల, కన్నుల. 50

  • కన్నెరికము చెడకమును పె గర్బంబాయెన్


క.చిన్నది పండ్రైండేండ్లది
యెన్నఁడు రతికేళిసుఖము నెఱుఁగక
వెన్నున తామర పుట్టెను, కన్నె. . . 51

  • కుందేలును కోడిపిల్ల గుటుకున మ్రింగెన్


క.చందనగంధులు ముగ్గురు
మందారపుఁదోఁటలోన మాపటి వేళ
న్నందంది పూలుగోయా, కుం. . . 52


  • పులు లావులు గూడి యొక్క_పొలమున మెలఁగెన్.


క. చెలువుగ విశ్వామిత్రుని
యలఘుతపోమహినతని నతనియాశ్రమమందున్
బలుసింగము లేనుంగులు, పులు. . 53

  • కామినికుచమధ్యమందు గరుడుండాడెన్


క. చేమంతిచెట్టక్రిందను
భామామణి నిదురపోవఁ బయ్యెదజాఱన్
రోమావళి పామో యని, కామిని. . . 54

  • కప్పం గని శేషుఁ డంత గడగడ వణఁ కెన్,


క. తప్పక చూఛి ఖగేంద్రుడు
నొప్పగ నామింటికెగిరి యొయ్యన చనుటన్
అప్పడు రెక్కలనీడం, గప్పం. . . 55

  • ఉత్తరమున సూర్య దేవుఁ డుదయంబాయెన్


క, తత్తరపాటున రావణు
మత్తుండై సీతఁ గొనుచు మహిలో కపులున్
ఎత్తెడెఱఁగు తిరిగి లంకకు, నుత్తర . . . 56

  • అమవసనాఁటి రాత్రినొకయంగన సూ పెను జంధమామనున్


చ. తమసముమించు టేయొడలదానవహోమగృహంబు వానర, ప్ర
ముఖులెఱుంగుటట్టులలవే (?)శ్యశిఖామణి కెద్దిసొమ్ముయే, కమ
లసుగంధిమన్మథుని గన్నదొబెబ్బులియేడనుండునో, యుమ . . . 57

  • కోవులి కుచగిరులమీద గోవులు మేసెన్.


క. తామరస నేత్ర మేల్కొ_నఁ
దామరసాప్తుండు వొడిచెఁ దగ దీరవ్వల్
ప్రేమాలింగితరాథా, కోమలి...... 58


  • కొడవటిపిడి యర్థ రాత్రి కోడై కూసెన్


క, తొడమిూఁద నాఱకుఱుపై
బుడమిజనుం డొకఁడు నిదురఁ బోవుచు నుండం
బడే దానిమీద నొక్క_టి, కొడ. . 59

  • భక్షించెను జోడు మెట్లు పాపంబోట్లూ !


క. దక్షణ లిచ్పేవేళల
రక్షలు నే విడిచి రాజవద్దికి జనగా
తక్షణమున శునకము మఱి, భక్షిం. . . 60

  • గర్భములో నుండి వెడలె గమలాప్తు డొగిన్


"క.దుర్బర వేదన సలుపక
యర్ళకుఁ డుదయించు ననుచు నతి వెూదముతో
నిర్భర్థత నుండె బ్రాక్సతి గర్బ 61

  • దోగ్ధ్రీథేనువుగర్భమందు బులికందు ల్పుట్టె నుగ్రాకృతిన్


శా.దోగ్థ్రీశాంతతపోదయాగుణనిధీ తేజస్విపాపాటవీ, దగ్థ్రక్ష్మా
నలుడైనకశ్యపునకు ద్యద్గర్వుడైయాగ భుగ్దగ్థ్రీశుల్ సుతు
లుద్భవించిరి బిడౌజావల్గివీక్షించితే, దో ..... . . . 62

  • కుటిలాలక యొడమకన్ను కుడిక న్నాయెన్,


క. నిటలమున నీవు దాల్సిన
పటుతర కస్తూరి రేఖ బహురతి చేత
న్నటునిటు జాఱిన చెమటకు, కుటి. . . 63.

  • ఏతపు గొమ్మమీద నొక యేనుఁగుసింగము వేట లాడఁగన్".


ఉ. నూతి జలంబులో న నొక నూరుశిరంబులయెద్దు మేయగా
నాతిపయోధరమ్మునను నల్లనిచంద్రుడు గాయుచుండఁగాఁ
గోతికి బిల్లి కూనకునఘాఘోరపువైరము గల్లుచుండగా, ....