Jump to content

తెలుగు శాసనాలు/సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనము

వికీసోర్స్ నుండి

5. సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనము.

(సుమారు క్రీ.శ. 725 నాటిది.)

ఎపి.ఇండికా.XI పుట.345

మొదటి వైపు

  1. అ స్వస్తిశ్రీ చోఱమ
  2. హా రాజాధిరాజ ప
  3. త్యశక్తి కొమర వి
  4. క్రమాదితుల కొడుకు
  5. [ళ్ళ్]కాశ్యపగోత్ర
  6. [న్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి]శతదిన్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి)శిద్ది
  7. [వే]యురేనాణ్డు ఏఱు[వే]
  8. [ళు] ఏళుచు[న్డి](ఇక్కడ డవత్తును θగా చదవాలి)కొను
  9. [ఱి]పాఱ రేవళ
  10. మ్మ೯కాశ్యపగో
  11. త్రి(త్రు)నికి ఇచ్చిన
  12. [- -]చిఱుంబూరి ఉత్త
  13. [- -]శ తూపు೯నదిశ
  14. [- -]డు జుగ్గి పొలగ[రు]
  15. సుసక్షిణదిశ[ర]
  16. [-]గ్గాపాఱ[-]

రెండవ వైపు

18. ఏనుమఱుత్రుగా 26

తెలుగు శాసనాలు

19.ను తాగిరి[||*]దేని
20.సల్పిన వానికి
21.వేగుద్లుము వేసె
22.ఱువుళు వేవాన్డు(ఇచట డవత్తునుθగా చదవాలి)
23.ద్లు నిలిపిన పుణ్య
24.ంబు దీనికి వక్రంబు
25.వచ్చు వన్డు(ఇచట డవత్తునుθగా చదవాలి)పుత్రన
26.ద్య స్త్రీ వద్య గోవ
27.ద్య వ ఞాచమహా
28.పాతక ఞాచెసిన
29.వానిలోక[ంజ]
30.న్వాన్డుల(ఇచట డవత్తునుθగా చదవాలి)

ఇప్పటికి భాష కొంచెం మెఱుగైంది.రాజు కొద్దిపాటి ప్రశస్తి,తన కుల గోత్ర ములు, తండ్రి తాతల పేర్లు వ్రాయించుకొనెను.తమ చోఱ మహారాజా ధిరాజ పరమేశ్వ రుడనియు,విక్రమాదిత్యుని పుత్రుడగు శక్తి కొమరుని కొడుకైన (రెండవ) విక్ర మాదిత్యుని కొడుకుననియు కాశ్యప గోత్రమునకు చెందిన వాడననియు చెప్పు కొనెను.సిద్ధవటము-వేయి గ్రామాల సీమ, రేనాణ్డు -ఏడువేల గ్రామాల సీమ రెండింటిని కలిపి రాజ్యము చేయు చున్నట్లు చెప్పు కొనెను.అట్టి సత్యాదిత్య మహారాజు కాశ్యపగోత్రుడగు రేవశర్మ అను బ్రాహ్మణునికి ఇచ్చిన[ది]అని వాక్యము ముగియును. భూమి అని పూరించు కొనవలెను.కొమఱి అనునది 'పాఱ'కు విశేషణ ముగ నున్నది గనుక నొక గ్రామమని అర్థమగుచున్నది.తర్వాత వాక్య ములో చిఱంబూరు మున్నగు సీమలు చెప్పుతూ ఇచ్చిన భూపరి మితి చెప్పబడెను.వాక్యం చివర 'తాగిరి' అని సమాపక క్రియ కలదు. ఆ సరి హద్దులు తాకునట్లు అయిదు మఱతుర్లు భూమిని ఇచ్చిరి అని అర్థము. ఇంతవరకు రెండు వాక్యములు సరిగానే యున్నవి.'తాగిరి'అను క్రియ మనకిప్పుడు ఈ యర్థములో కానరాదు. సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనము

27

తర్వాత ఈ ధర్మమును కాపాడు వానికి పుణ్యఫలము,చెఱచువానికి పాప ఫలము చెప్పబడినవి.ఇందలి పదములు కొన్ని పరిశీలింపదగియున్నవి.

'విక్రమాదిత్య శక్తి కొమర విక్రమాధితుల కొడు'కను చోట మూడు పురుషాం తరముల వారొకే సమాసములో జేర్చి చెప్పబడుట యొక విశేషము. 'ఏళచున్డి(ఇచట డ వత్తును θ గా చదవాలి) అని 'ఏలుచుణ్డి ' అను నర్థమున వాడబడెను.కాశ్యపగోత్ర రేవశర్మకు అనుతకు బదులు 'రేవ శర్మకాశ్యపగోత్రునికి'అనే ప్రయోగం విలక్షణంగా వున్నది.షష్ఠి ప్రత్యయము 'రేవశర్మ'పదానికి కాకుండగ గోత్రపదానికి చేర్చబడింది.21వ పంక్తి నుండి వేదుద్లు,మువెసెఱువులు,వేవాన్డు,ద్లునిల్పిన పుణ్యము అనుదానిలో ము యొక్క ప్రయోజనము తెలియదు. ప్రథమా విభక్తి ప్రత్యయము కాదు.ఆనాటి కింకా'ంబు 'అనేదే వాడబడుచుండెను.లేఖక ప్రమాదము కావచ్చు ను.'వేగుద్లువు' అని దానిని ప్రకటించిన వరు చదివిరి.అప్పుడు కూడ 'వు'కి ప్రయోజనము కానరదు.ఇచట 'గుడికి' బహువచనము 'గుద్లు' అనియున్నది.అదినేడు గుడ్లు,గుళ్లు అని ద్వివిధ రూపములైనది. అట్లే మఱికొన్ని పదములు గలవు.θ వర్ణము భాషనుండి పోవునప్పుడు దానికి సరిపోవు ఉచ్చారణమును ఉన్న అక్షరములతో సరిపెట్టుటకై చేసిన ప్రయత్నమే యిట్టి వికల్పరూపములయ్యెనని స్పష్టమగుచున్నది.

గుడి& rarr;గుద్లు(=గుడ్లు,గుళ్ళు)(ప్రస్తుత మాలెపాడు శాసనము)

వాకిలి→వకిద్లు(=వాకిండ్లు(=వాకిండ్లు,వాకుళ్ళు)అరకట వేముల శాసనము)

ఊరు→ఊడ్లు(=ఊఁడ్లు,ఊళ్ళు)(ఇదేశాసనము)

కంచరి→కంచద్లు(కంచడ్లు,కంచర్లు)అరకట వేములశాసనము)

వేవాన్డు(ఇచట డ= θ గా చదవాలి)ద్లు అని యీ శాసనమందు చూడనగును.

'వేవాన్డుద్లు(ఇచట డవత్తును θగా చదవాలి) అనుపదము 'వేయి ఊళ్ళు'అను నర్థమున వాడబడినట్లు తోచును.'పుదలి ఏదువాన్డు(θ),'సాక్షి వచ్చువాన్డు (θ)'వక్రంబు వచ్చువాన్డు(డ్=θ) మున్నగు క్రియాయుక్త విశేషము లందు వలె 'వేయి'అనుసంఖ్యావాచకము తరువాత కూడ వాన్డు(డ్=θ) వాడబడెను. వేవాన్డు(డ్=θ) వేయువాడు అని కీ.శే.మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు చెప్పిన యర్థమిచ్చట బాగులేదనిపించును.పుత్రవధ 28

తెలుగు శాసనాలు

స్త్రీవధ,గోవధ అనుటకు పుత్రవద్యంస్త్రీవద్య,గోవద్య అనియున్నది. పుత్రవధయు, స్త్రీవధయు, గోవధయు అని సముచ్చయార్థక 'ఉ 'ను చేర్చదలచనేమో.

'లోకం జన్వాన్డు(ఇచట డ వత్తును θగా చదవాలి)=లోకము చనువాడు

'ఊరు'పదమును గురించి కీ.శే.మల్లంపల్లి సోమశేఖరశర్మగారు కొంత చర్చించిరి(రాజరాజ నరేంద్ర సంచిక).అందువారు 'ఊరు'యొక్క ప్రథమైక వచనము 'వాన్డు(ఇచట డవత్తునుθగా చదవాలి)లో వలె ' ఊను 'కాదగుననియు.అది క్రమముగ ఊణ్డు,ఊడు అయినందువలన ఊడ్లు ప్రథమా బహువచనరూప మేర్పడియుండుననిరి.కాని ప్రాచీన శాసనములగు కొపినేపల్లి శాసనమందొ క దానిలో 'ఊరుపెన్ కాలు ' అనియు,చిలమకూరు శాసనమందు 'చిఱుంబురు పళన్ 'అనే ప్రయోగము ఉన్నది.కనుక 'ఊరు 'యేకవచనరూపము.అట్లాగే వారు చెప్పిన రీతిగ నల్లచెఱువు పల్లె శాసనములో' కజ్గళూన్డు(డ్=θ)ఏళ'అనే ప్రయోహములో 'ఊన్డు(డ్=θ) అనురూపము కనుపించుచున్నది.కనుక ప్రథమైక వచనరూపములోనే సందేహము కలుగు చున్నది..'θ'అను అక్షరముతో కూడిన పదమని చెప్ప వీలగుచున్నది.అది 'ఊన్డు (డ్=θ)అనుటకంటె 'ఊదు 'అనుట యుక్తమని తోచును.అది క్రమముగ 'ఊరు'గ మారియుండును.సాధురేపమే ప్రాచీనకాలమునుండియందు తఱచు కానవచ్చును.కాని వేల్పుచెర్ల శాసనములో 'కొదవునూఱ 'అనిశకటరేఫ కలదు.కనుక అప్పటికే దీనిలోని θ వర్ణము ర,ఱ,లుగ మార్పు నొందుచుండెనని తెలియుచున్నది. బహువచనములో మాత్రము 'ఊద్లు'అను రూపము క్రమముగ ఊడ్లు,ఊళ్ళు అనిమార్పునొంది వికల్పరూపము లేర్పడియుండును. ఏకవచన ములో వారు చెప్పిన ఊణు,ఊడు అనురూపములు చిన్త్యము.'వంగనూర్లి'అని వంగనూరికి సంబం ధించిన లేక వంగనూరులో అను ప్రయోగము అరకట వేముల శాసనమందు కలదు.8,9 శతాబ్ద ము లలో తెలుగుభాషనుండి తొలగిపోయిన 'θ'అను మనకు తెలియని అక్షరము యొక్క వికారము లీ రూపములన్నియు.'ఱ'అను నక్షరముకంటె ఈ 'θ'యొక్క వాడుక ప్రాచీనశాసనములందధికము.ప్రథమైక ప్రత్యయమునందేకాక,బహువచన ప్రత్యమమందు, ప్రాతిపదికలయందు ఇది ఉన్నట్లు తెలియుచున్నది.ఈ క్రిందివి కొన్ని యుదాహరణలు మాత్రమే.

పుణ్యకుమారున్డు(డ్=θ)-ప్ర.ఏ.ప్ర సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనము

28

            ధనంజయుదు —ప్ర.ఏ.ప్ర
            వాకిద్లు —ప్ర.ఏ.ప్ర.
            వాన్డు(డ్=θ)—ప్ర.ల.ప్ర.
            చదు —ప్రాతిపదిక
            ఊడు —ప్రాతిపదిక

ఈ వర్ణము యొక్క సరియగు ఉచ్చారణగాని,దాని విశేష ప్రయోగములుగాని తెలుసుకొనుటకు తగినన్ని పదములు ప్రస్తుతము లేవు.ఈ విలక్షణోచ్చారణము గల యక్షరమును ప్రాచీనులే తొలగించి దాని స్థానములో రూపాంతరముల నేర్పాటు చేసిరి.నన్నయగారికి కూడ దీని సంగతి తెలియక పోయియుండును.

*