Jump to content

తెలుగు శాసనాలు/అరకటవేముల శాసనము

వికీసోర్స్ నుండి

6. అరకట వేముల శాసనము

(8 వ శతాబ్దముది కావచ్చును.)

ప్రొద్దుటూరు తాలూక.

  1. స్వస్తిశ్రీ వల్లభమహారాజాధి రాజపరమేశ్వర భట్టరళ పృథివిరాజ్య
  2. ఞయన్ పెబా೯ణ వంశ భుజంగది భూపాదిత్యుల కదాన్ వంగనూర్లి చరువశమ్మ೯పుత్ర
  3. విన్నళమ్మ೯ళాకు నుడుగడంబున పన్నశ ఇచ్చిరి. వేంగుఖూదు, పెన్డ్రు(డ్=θ)కాలు, నారకొళూ కంచద్లు
  4. ఇన్నల్వురు సాక్షి
  1. దేనికి వక్రంబువచ్చు వాన్డు(డ్=θ)పఞచ్ మహాపాతక సంయ్యుక్తున్డు(డ్=θ) గున్
  2. అబ్భిద్ధ೯త్తన్త్రిభి భు೯క్తం సద్భిశ్చపరిపాలితం ఏతానినని వత్త೯న్తే పూవ్వ೯రాజకృ
  1. తానిచ ||స్వరత్తా[0]పరదత్తా[0]వాయోహరేతి(త) వసుందరా(0)షష్టిం వష೯సహప్రాణి విష్టా
  2. యాం జాయతే కృమి(ః)

శాసనము చాలా స్పష్టముగ చదువుటకు వీలుగనున్నది.శాసనపాఠము పూర్తిగనే యున్నది.చెప్పదగిన లోపములు కానరావు.సంస్కృతశ్లోకములలో తప్పులు చెప్పదగినవి అంతగా లేవు.కనుక లేఖకుని దోషమని చెప్పి వదలివేయ వలసిన భాగమంతగా లేదు.కాని మనకీశాసనములో అనేక సందేహాలు కనుపించును.

  1. 'పృథివీరాజ్యఞచెయన్ 'అను క్రియకు కర్త కనుపించదు.శ్రీ వల్లభ మహారాజు అనిచెప్పుచో ముందుండవలసిన'మహారాజాధిరాజ... ఇత్యాది బిరుదు పరమందున్నట్లు భావించవలెను.అట్లాకూడ కొన్ని గలవు."స్వస్తిశ్రీ విక్రమాదిత్య ప్రిథివీవల్లభ మహారాజాధిరాజ పరమేశ్వర భటరళ్" అని అరకట వేముల శాసనము

31

రామాపురం లోని చాళుక్య విక్రమాదిత్యుని శాసనము ఇదే కాలమునకు చెందిన దొకటి కలదు.అయినను 'శ్రీ'ని స్వస్తిశ్రీలో దానినిగ చెపితే వల్లభ మహారాజగును.శ్రీ వల్లభుడుగాని వల్లభుడుగాని ప్రసిద్ధ రాజెవడు ఆనాడున్నట్లు తెలియదు.

2.పెబా೯ణవంశ భుజంగది భూపాదిత్యుల కదాన్-ఇది దానము చేసిన దాతను తెలుపును.భూపాదిత్యుడనే సామంతుడనుకొనవలెను.ఆయన మహాబాణ వంశమునకు చెందినవాడు.'కదాన్' అనే పదనికి అర్థము తెలియదు.పెర్ అనగ కన్నదములో గొప్ప అని అర్థము.

3.'చరువశర్మ పుత్ర విన్నశర్మళాకు'అని ప్రతిగ్రహీత పేరు,తండ్రి పేరుతో కలిపి సమాసము చెయబదినది.నిడగడంబున-అనేది స్థలనామము కావచ్చు ను.అచ్చట పన్నశ అంటే భూమి దానము ఇచ్చిరి.

4.సాక్షులు నల్వురు.ఉన్నపదాలు నాలుగు.(1)వేంగుళూదు,(2)పెన్డు(డ్=θ)కాలు(3)నారకోళు(4)కంచద్లు.ఈ నాలుగు మను ష్యుల పేర్లగునా కాదా అని సందేహము.వేంగుళూద్లు అనునది ఊరి పేరగుచో పెన్డ్రుకాలు ఆ యూరివాడగు.ఇదియే ఉచితమని తోచును.కాని 'వేంగుళూద్ల అని షష్ఠ్యంతముగా లేదు.పైన 'వంగనూద్ల'షష్ఠ్యంతము కలదు.'నారకోళు 'అనునది స్థలనామమో మనిషిపేరో తెలియదు.కాబట్టి నయిష్టం మీద ఆధార పడియున్నది.'నమ్మిపోళు 'అని మనిషిపేరొకటి బాణ వంశపు ధవళెయ రాజు యొక్క బలపనూరు శాసనములోకలదు.అట్లే యిది యు మనిషి పేరగునేమో.కంచద్లు(కంచరివాండ్రు)అనియెందరో తెలియదు. ఈ నాల్గిటి లోను ఒక్కటికూడ మనిషి పేరుగా కనిపించదు. వేంగుళూద్లు, వేల్పుచెర్ల, శాసన మందున్న వ్ర్యేంగులవంటి వారి సంఘమునకు చెందిన నివాసమని తోచును.వారికి సంబంధించిన 'పెద్దకాలు'అనగ ఆసామి లేక ఉద్యోగి యని అర్థమగును. 'కణ్ణనూద్లు' అని మనిషి పేరుగా వైదుంబ గండ త్రిణేత్రుని శాసనము లో నున్నది.అట్లే వేంగుళూద్లు మనిషిపేరగునేమో చెప్పజాలము.ఇట్టి యూహ 32

తెలుగు శాసనాలు

లెన్నియైనను చేయుటకు వీలుగ నున్నది.సాక్షులనిర్దేశము అంటే అక్కడ ఎదురుగనున్న వారిని మనసులో పెట్టుకొని వారిపేర్లు కూడ వ్రాయకయే వీరు సాక్షులని చెప్పబడెను.కంచర్లు ఎందరో తెలియదు.మొత్తము నలుగురని మాత్రము చెప్పబడెను.ఇచ్చిన పన్నస యొక్క పరిమితి యెల్లలు గాని చెప్పబడలేదు.

దీనిని బట్టి ఆనాటి మంచిభాషలో వ్రాయబడిన శాసనాలైనను మనకీనాడు సులభముగ నర్థము కావని చెప్పవలెను.దానికి ఆనాటి భాష సరిగా రూపొందక పోవుటయే కారణము.భాషను తయా రు చేసుకొనే కాలమది.ఇప్పుడు మనకట్టి కాలమొకటి తెలుగుభాషకుండెనా యనిపించును. ఉన్నద నుటకు ఈ అసంబద్ధ వాక్యములే ప్రమాణము.మాట్లాడునప్పుడువారు ద్రావిడ,కన్నడ, ప్రాకృతము లతో కూడిన తెలుగుభాషను మాట్లాడువారు.కన్నడులు తాము కన్నడములోనే వ్రాయటం మొదలిడి నప్పటినుండి వీరికికూడ భాషాభిమానము పుట్టి వ్రాయడం ప్రారంభించిరి.ఆనాటి శ్రమయే నేడు మనము తెలుగువారము అని చెప్పుకొనుటకు మూలము. తెలుగు వారికి ఆఱు-ఏడు శతాబ్దము లలోని వారే మూలపురుషులు.నన్నయాదులకంటె మున్ముందు వారికే మనజాతి అర్పించవలసిన అగ్రతాంబులము.గాసట-బీసట భాషనైనా మనకు నేర్పఱచి యిచ్చిరికదా! నేటి విశాలాంధ్ర నిర్మాణ మునకు ఆనాటి వారి తెలుగు భాషా నిర్మాణమే మూలము.

7. వేల్పుచెర్ల శాసనము.

ఇది జమ్మలమడుగు తాలూకాలోనిది.శాసనము సమగ్రముగను స్పష్టముగను ఉన్నది.చివరి కొద్ది అక్షరములు తప్ప మిగిలిన భాగము భాగున్నది.కాని మనకు అర్థమగుటలో అనేక సందేహములు కలుగుచున్నవి. మూలము

  1. స్వస్తి శ్రీ కొడ్ల(డ=θ)వ్ర్యేంగు
  2. ళ కొడుకు అయితా
  3. ణ్ణ ఆరిభాల వ్ర్యేంగు
  4. వేళ్పు చెఱువున
  5. పా(జ)ళ్కిమి ప్రశాదె
  6. ఞచెశె[||*]వ రా స మిభో
  7. ళశివ కొమరెయ్యక్కు
  8. చన్ద్రదిత్య కాల్లఁబు నాకుని
  9. ల్పిరి[||*]సశనంబు(బి)చిరి[||*]దీ
  10. నికిశక్షి చేంగాలు ఎమ్మళ కా
  11. లు ఏడ్లకాలు మేషికొణ్డు తాఱ
  12. డ్లకలు[||*]కొదపునూఱ[వెట్టు]
  13. రాజమానంబు నల్పదిమఱు
  14. తుడ్లు ఇచిరి[||*]నేలనిల్పి
  15. న వారికి అస్వమేదంబున
  16. పలంబు వక్రంబు వచ్చువాన్డు(డ=θ)
  17. వేగవిలళు వేగంగియళు
  18. భరనాసియుఱచిన

[3] 34

తెలుగు శాసనాలు

19.[వరు]]

20.సిదయంబు రెణ్ణు[దెళా]

ఈ శాసనములో 'కాడ్ల(డ=θ)'లో 'θ'అక్షరము నకు తలకట్టు కలదు.చెఱువు,తాఱడ్లకలు అనుపదములలో శకటరేఫ ము కలదు.'ఱ'చనవరు'లో 'ఱ'అక్షరము కలదు.

'అరిభాలవ్ర్యేంగు'లోను 'భరనాసియు'లోను 'భ' వర్ణము కలదు.వేరే మహాప్రాణములు లేవు.'ఏడ్లకాలు'లో 'ఏ'అను అక్షరము పై దీర్ఘము ను కూడ కలిగియున్నది.ఎ,ఏ,ల భేదము అప్పటి వ్రాతలో కనుపించ దు.ఱాతిలో నేదైన పగులుండుటచే నట్లున్నదేమో.

దీనిలోని విషయమును ఈ క్రింది వాక్యములుగ విభజింపవచ్చును.

  1. కాండ్ల(Da=θ)వ్ర్యేంగులకొడుకు అయుతాణ్ణ అరిభాల వ్ర్యేంగు వేళ్పు చెఱువున పాఱళ్కిమి ప్రశాదఞచ్సె.ఇచట 'పా[జ]ళ్కిమి ' అను పద ము క్రొత్తది.'పన్నస' కు వలె భూమిదానమని అర్థమిచట సరిపోవును.'జ 'అక్షరము స్పష్టముగ లేదు గణుక ఈ పదము సందేహముతో గూడి యున్నది.
  1. వరాసమి భోళ శివకొమరెయకు చన్ద్రాదిత్య కాలంబునకు నిల్పిరి.ప్రతిగ్రహీత పేరు ఆ వాశ్క్యములో చెప్పబడెను.'వరాసమి' ఆయన ఊదిపేరగునేమో.'భోళశివ'అనునది తండ్రి పేరుకావచ్చును.'కొమరెయ'ఆయనపేరు.
  2. సళనంబిచిరి-శాసనమిచ్చిరి
  3. దీనికి

సాక్షులు:చేంగాలు,ఎన్ముళకాలు,ఏడ్లకాలు,మేషికొణ్డు,తాఱడ్లకాలు అని ఐదుగురు.

  1. కొదపునూఱవెట్టు రాజమానంబున నల్పది మఱుతుడ్లు ఇచ్చిరి."ఊరు' గ్రామమనే పదములో సాధురేఫమే కలదు.కాని యిచట శకట రేఫమున్నది. ఊదు(దు పైన చకారమున్నది) అనునది ఊదు,ఊఱు,అనిరెండు విధములుగను మారుటకూθ'యొక్క విలక్షణోచ్చారణమే కారణము. కొదవు వేల్పుచెర్ల శాసనము

35

నూరులో కొలుచు రాజమానమో నల్పది మఱుతుర్ల భూమి యిచ్చిరని ఈ వాక్యమున కర్థము.

6.నేలనిల్పిన వారికి అశ్వమేధంబున ఫలంబు- ఫలశృతి.

7.వక్రంబు వచువాన్డు(డ=θ) వేగవిలళు, వేగంగియలు భరనాసి యుఱచి నవారు - అవి చెఱచువారికి పాపఫలము.భరవాసియు అనగా వారణాసి యందు అని అర్థము.ప్రథమాంతమునకు 'ఉ'ప్రత్యయం చేర్చి యడాగమము చేయబడింది. కట్టింఛిన గుడియు, చేసిన పనియు, ఇచ్చిన స్తితియు మున్నగు ప్రయోగములు ప్రథమైక వచనంలో శాసనాలలో వచ్చుచుండును.

8.సిద్ధాయంబు రెణ్డు[- -]—ఆభూమిపై విధించు పన్ను.సాధారణముగ 'పన్నస' గనిచ్చు భూములపై పన్ను విధించరు.కనుక 'పాజళ్కిమి'అని మొదటి వాక్యములోని సందిగ్ధపదమేదో దానభేదమను తెలుపునది గా వచ్చును. దీనికి పన్ను కూడ విధించబడెను.

మొదటి వాక్యములో 'క్రాడ్ల(డ్=θ)వ్ర్యేంగు కొడుకు అయితాణ్ణ అరిభాల వ్ర్యేంగు' అనుదానిలో తండ్రికొడుకు లిద్దరు పేర్కొనబడినట్లు తెలియుచున్నది. వ్ర్యేంగు పదము ఇద్దరి పేర్లకు తుదియందున్నది గనుక దానిని వారి అధికార వాచక మన వచ్చును.గోకర్ణచోడుని కొడుకు ఉదయచోడుడు అనునపుడు చోడ శబ్దమువలె వ్ర్యేంగు అనునది వారి వంశనామమైనను కావచ్చును.కాని ప్రసిద్ధ వంశములలో నట్టి పేరు లేదు.కనుక 'రట్టడి'వలె'వ్ర్యేంగు'కూడ నొక గ్రామాధికారి వంటిఉద్యోగిగా గ్రహించిన బాగుండును.తండ్రి,కొడుకుల కా యధికారము వంశ క్రమమున సంక్రమించినది కావచ్చును.'వేఁగు'అనుపదము అరసున్న గలిగి తపించు అను అర్థమును కలిగి యున్నది.అరసున్న లేని పదము చారుడు, దూత అను నర్థమును కలిగియున్నది. కాని పాక్షికంగా దీనికి కూడ అరసున్న కలదని శబ్దరత్నాకరములో చెప్పబడినది.కనుక'వ్ర్యేంగు'అనగా 'దూత ' అను నొక రాజకీయాధికారి.తలారివంటి ఉద్యోగి కావచ్చును.ఇప్పుడిక తండ్రిపేరు కాడ్ల (డ=θ)వ్ర్యేంగు అనియు, కొడుకు అయితాణ్ణ వ్ర్యేంగు అనియు చెప్ప వలెను.వీటిలో కొడుకు పేరు విలక్షణముగా కనిపించును.అయితాణ్ణ అనేది మాత్రమే పేరు కావచ్చును.