తెలుగు శాసనాలు/వేల్పుచెర్ల శాసనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
వేల్పుచెర్ల శాసనము

35

నూరులో కొలుచు రాజమానమో నల్పది మఱుతుర్ల భూమి యిచ్చిరని ఈ వాక్యమున కర్థము.

6.నేలనిల్పిన వారికి అశ్వమేధంబున ఫలంబు- ఫలశృతి.

7.వక్రంబు వచువాన్డు(డ=θ) వేగవిలళు, వేగంగియలు భరనాసి యుఱచి నవారు - అవి చెఱచువారికి పాపఫలము.భరవాసియు అనగా వారణాసి యందు అని అర్థము.ప్రథమాంతమునకు 'ఉ'ప్రత్యయం చేర్చి యడాగమము చేయబడింది. కట్టింఛిన గుడియు, చేసిన పనియు, ఇచ్చిన స్తితియు మున్నగు ప్రయోగములు ప్రథమైక వచనంలో శాసనాలలో వచ్చుచుండును.

8.సిద్ధాయంబు రెణ్డు[- -]—ఆభూమిపై విధించు పన్ను.సాధారణముగ 'పన్నస' గనిచ్చు భూములపై పన్ను విధించరు.కనుక 'పాజళ్కిమి'అని మొదటి వాక్యములోని సందిగ్ధపదమేదో దానభేదమను తెలుపునది గా వచ్చును. దీనికి పన్ను కూడ విధించబడెను.

మొదటి వాక్యములో 'క్రాడ్ల(డ్=θ)వ్ర్యేంగు కొడుకు అయితాణ్ణ అరిభాల వ్ర్యేంగు' అనుదానిలో తండ్రికొడుకు లిద్దరు పేర్కొనబడినట్లు తెలియుచున్నది. వ్ర్యేంగు పదము ఇద్దరి పేర్లకు తుదియందున్నది గనుక దానిని వారి అధికార వాచక మన వచ్చును.గోకర్ణచోడుని కొడుకు ఉదయచోడుడు అనునపుడు చోడ శబ్దమువలె వ్ర్యేంగు అనునది వారి వంశనామమైనను కావచ్చును.కాని ప్రసిద్ధ వంశములలో నట్టి పేరు లేదు.కనుక 'రట్టడి'వలె'వ్ర్యేంగు'కూడ నొక గ్రామాధికారి వంటిఉద్యోగిగా గ్రహించిన బాగుండును.తండ్రి,కొడుకుల కా యధికారము వంశ క్రమమున సంక్రమించినది కావచ్చును.'వేఁగు'అనుపదము అరసున్న గలిగి తపించు అను అర్థమును కలిగి యున్నది.అరసున్న లేని పదము చారుడు, దూత అను నర్థమును కలిగియున్నది. కాని పాక్షికంగా దీనికి కూడ అరసున్న కలదని శబ్దరత్నాకరములో చెప్పబడినది.కనుక'వ్ర్యేంగు'అనగా 'దూత ' అను నొక రాజకీయాధికారి.తలారివంటి ఉద్యోగి కావచ్చును.ఇప్పుడిక తండ్రిపేరు కాడ్ల (డ=θ)వ్ర్యేంగు అనియు, కొడుకు అయితాణ్ణ వ్ర్యేంగు అనియు చెప్ప వలెను.వీటిలో కొడుకు పేరు విలక్షణముగా కనిపించును.అయితాణ్ణ అనేది మాత్రమే పేరు కావచ్చును. 36

తెలుగు శాసనాలు


'అరి' పదమును 'శర్మారికి'ఇత్యాదులయందువలె 'అర్య' శబ్దభవముగ గ్రహించి 'గారు' అని అర్థము చెప్పుకొని 'అయితాణ్ణగారు'అనే బాల లేక చిన్నవేఁగు అని సర్దుబాటు చేయవలెను.' అయితాణ్ణారి' అనివ్రాయుటకు 'అయితాణ్ణ అరి'అని 'ణ 'కు ఉండవలసిన దీర్ఘమును 'త'కువ్రాసి 'అరి'అనివిడిగా వ్రాసెనేమో,ఎదో విధంగా సరిపెట్టవలెను.లేకపోయిన కొడుకు పేరు విలక్షణంగా ఆనాటి పేర్లకు దూరంగా ఉంటుంది. తండ్రి పేరు'కార్ల(ర=θ)అనిచెప్పుటలో కూడ కొంత తప్పు ఉన్నదని తోచును. 'కార్ల(ర=θ)అనేది మనిషి పేరగునా కాదా?'వ్ర్యేంగు' వలె అదికూడ నొక చిన్న అధికారిని తెలుపు పేరగునా?అట్టి అధికారుల అనగా 'కార్ల (ర=θ) పై అధికారి 'వ్ర్యేంగు'కాదగునా? అపుడు 'కొడుకు' అనుపదానికి తండ్రి పేరు దొరక దు.పోనీ అధికారి కొడుకేననవచ్చు లేదా కొడుకు పేరులో 'అయితాణ్ణ'అనేది తండ్రి పేరే కావచ్చు కూడ.'అరిపాల' అనేదే కొడుకు పేరు అగును.ఈ విధంగా కూడ చెప్పుట కవకాశము కలదు.


మనకు రేవణకాలు,వుద్దణకాలు వంటి పేర్లుగల అధికారులు కొందరు శాసనాల్లో అచ్చటచ్చట కనిపించెదరు.అట్టికాలులనే ఉద్యోగులమీద దూతయైన వానిని 'కాద్లి వ్ర్యేంగు' అనిచెప్పవచ్చునుకదా!ఇట్లనుకొనుటలో కూడ కొంత ఆధార మీ శాసనం లోనే కలదు.నాలుగవ వాక్యంలో 'సాక్షులుగ జెప్పబడిన వారందరు కాలురే.చేమ+కాలు= చేంగాలు అనురూపమగునని తోచును. ఎన్ముళకాలు (=ఎనుములమీద అధికారి),ఏడ్లకాలు(=ఏడలనగా గొఱ్ఱెలు కనుక గొఱ్ఱెలమీద అధికారి). మేషికాణ్ణ్డు (=మేకలమీద అధికారులు)తాఱడ్లకాలు(దీని కర్థము తెలియదు)అంటే చేల మీద ,బఱ్ఱెలమీద,గొఱ్ఱెల మీద,మేకల మీద, తాఱడ్లమీద పన్నులు వసూలు చేయు అధికారులని అర్థము.ఈ కాలుర మీద పైయధికారి అనగా వీరు వసూలు చేసిన పన్నులను రాజుగారికిచ్చు వేఁగు 'కాండ్ల (డ=θ)వ్ర్యేంగు' అనబడును. 'అరిపాల'అనే పదం పన్నులను వసూలు చేయునను నర్థమునే సూచించు నేమో .కొండవర్తి శాసనంలో 'ఫలధారు'అనే సుంకరి యొకడు కనిపించును. 'అరిపాల' వేల్పుచెర్ల శాసనము

37


'వ్ర్యేంగు' 'కాలు'అనే పదాలన్నీ స్వల్పభేదములతో సుంకరులను తెలుపునని తోస్తుం ది.ఆహనమల్ల,తైలోక్యమల్ల,త్రిభువనమల్ల అనే బిరుదులు ఈ షద్భేదముతో నొకే యర్థమును చెప్పుట లేదా.అట్లే


కాండ్ల(డ=θ)వ్ర్యేంగు'అనే పద్ద అధికారి కొడుకు అయితణ్ణ అనే అరిపాల వ్ర్యేంగు అనిచెప్పుకొన్నా తప్పులేదు.ఇప్పుడు 'కాలు' పదము యొక్క షష్ఠి కాళ్ల (ళ=θ) అనికావలెను. కాళ్ళు,కాణ్డ్లు, కాద్లు అని ప్రథమా బహువచన రూప ములగునేమో కాద్లు యొక్క షష్ఠి 'కాద్లి 'అగును. అనగాకాలుర యొక్క అనిచెప్ప వలెను.ఊఱు(ఊరు)కి షష్ఠి 'ఊθలఅని' 'వంగనూడ్ల (ద=θ) అను పదములో పై జెప్పిన అరకట వేములశాసనమందు కలదు.


'కాలు' అనుదానిని గూర్చి లోగడ అనేకులు చర్చించిరి. 'గురుపాదాః ' 'పితృపాదాః భగవత్పాదాః'ఇత్యాది సంస్కృ త పదములందు గౌరవార్థముగా వాడబడు 'పాద'శబ్దము న కు తెలుగులో 'కాలు'అనిచెప్పుకొని అదే గౌరవార్థము వాడ బడి యుండునని కొందరు తలంచిరి.కాని యీ శాసనంలో చేంగాలు, మేషికాలు,ఏడ్లకాలు,ఎమ్మళకాలు అనునవి ఆ గౌరవార్థమును సూచించుట లేదు. మనుష్య వాచకములు గాక'చేను'మున్నగువాటికి కూడ 'కాలు'వాడబడు చున్నది. 38

తెలుగు శాసనాలు


అచట యితర పనివాండ్రను సాక్షులుగను సంరక్షకులుగను పెట్టునట్లే యిక్కడ కూడ తనవృత్తికి సంబంధించిన వారినే సాక్షులుగ పెట్టుకొనెను.


ఈ కాడ్ల(డ=θ)వ్ర్యేంగులు రేనాటి చోళుల సుంకాధికారులని తెలియనగును.


'వాకిలి'కి బహువచనము 'వాకిద్లు(అరకటవేములశాసనము)


అట్లే 'కాలు'కి బహువచనము 'కాద్లు'కావచ్చును.


θ అను అక్షరము వాడుకనుండి "పోవునపుడు' 'వాకిఁడ్లు-వాకిళ్ళు' గా మారినట్లు 'కాణ్డు-కార్లు 'అను రూపములనొందియుండ వచ్చును. ఇట్టి వికల్ప రూప ములుండుట కట్టి 'θ'అక్షరమును తొలగించుటయే కార ణము.దాని ఉచ్చారణముతో సన్నిహితోచ్చారణము గల రెండు మూడు రూపము లు వికల్పముగ చెప్పు కొనవలసివచ్చెను. 'కాలు'పదము పశువనెడు అర్థము లో ఇంకను కొన్ని ప్రాంత ములలో వాడుకయందున్నది.కనుక దీనిని నిఘం టు వులో చేర్చుట మంచిది. ఈ విధముగ వాడుకలో నుండియు నిఘంటువుల దృష్టికి రాని పదములను సేకరించుట నేటి పరిశోధకుల బాధ్యత.దానితో పాటు ప్రాంతీయముగ రూఢమైయున్న విశేషార్థ ములు గల పదములను,నుడికారము లను సేకరించ వలసిన అవసరము కూడ కలదు. ప్రాంతీయ పలుకుబడులను అనగా వాక్యోచ్చా రణలోగల భేదములను నవీన పద్ధతిలో తేపురికార్డుచేయుట కూడ భాషాపరిశోధన కు అవసరము.ఇట్టినవీన సాధనములు లేకున్నను శిలల పై వ్రాసియుంచిరి గనుక వాటిలో కొన్నియైనను మనకు లభించుటచే అప్పటి భాష ను కొంతయైనను తెలిసికొనగలుగుచుంటిమి.తెలుగు పదము లనేకము సంస్కృత పదములతో భాషనుండి తొలగింపబడినవి.'తొఱ్ఱు'అను పదము పశువను అర్థములో నిఘంటువులోను,శాసనములందునుకనవచ్చును. తొఱ్ఱూరు అనుగ్రామములు కూడ కలవు.అంటే పూర్వము పశువుల సంతలు జరుగు ప్రదేశములని అర్థము.కాని నేడు అదివాడుకలోలేదు.దానిస్థానములో పశువులు లేక గొడ్లు అనే వాడుచున్నాము.నేడు ఆంగ్లమునుండి,హిందీనుండి, ఉర్దూనుండి అనేక పదములు తెలుగుపదముల స్థానములో వచ్చి చేరుచున్నవి. ఈ దశలు జీవభాషకు తప్పవని భాషా శాస్త్రజ్ఞలు చెప్పుదురు.


అట్లే మఱి కొన్ని పదములు కన్నడపదములని చెప్పి తెలుగునుండి వేల్పుచెర్ల శాసనము

39

నన్నయాదులు తొలగించిరి.కాని శాసనాలలో నన్నయకు తర్వాతకూడ కనుపించును.


పన్నసి=దానము చేయబడిన భూమి.

ఇదికాకతీయుల నాటివఱకు శాసనములందు కానవచ్చును.

మఱ్తురు=భూపరిమితిని తెలుపు కొలత.


ఇదికాకతీయులకు తర్వాత కూడ శాసనము లందున్నది.ఇట్టిని ఉభయభాషలకు సామాన్యమనుకొనుటలో తప్పులేదు.

*