తెలుగువారి జానపద కళారూపాలు/బాల సంతు వారు
స్వరూపం
బాల సంతు వారు
సర్కారాంధ్ర దేశంలో బాల సంతు వారు ఎక్కడా కనిపించకపోయినా, రాయలసీమ తెలంగాణా జిల్లాలలో వీరు ఎక్కువగా కనిపిస్తారు. వీరు వీరగాథల్ని గానం చేస్తారు. వీరిని బాల సంతోషం వారనీ, బాల సంతు వాళ్ళనీ పిలుస్తారు. కర్నూలు ప్రాంతంలో వీరు బొబ్బిలి కథనూ, నవాబుల కథలనూ గానం చేస్తారు.
ప్రారంభంలో వీరు గంగా గౌరి సంవాదం వంటి శైవ కథల గానం చేసే వారు. తెల్లవారు జామున గంట వాయిద్యంతో గ్రామీణులను మేల్కొలుపుతూ ప్రతి ఇంటికీ వెళ్ళి జోస్యం చెప్పి వెళ్ళి పోవటం కూడ వీరి కార్య క్రమం. తరువాత వారిచ్చిన పారితోషికాన్ని పుచ్చుకుంటారు. ఈ కార్యక్రమమంతా గ్రామస్తులను వినోదపర్చేది.