Jump to content

తెలుగువారి జానపద కళారూపాలు/పగటి వేషధారులు - కూచిపూడివారు

వికీసోర్స్ నుండి

పగటి వేషధారులు - కూచిపూడివారు


మొదటి తరం:

పసుమర్తి శేషయ్య, పసుమర్తి చలపతి - వేదాంతం పెద రామయ్య - వేదాంతం నీలకంఠయ్య - వేదాంతం పేరయ్య - భాగవతుల కుమార స్వామి - భాగవతుల పిచ్చయ్య - భాగవతుల యల్లయ్య - భాగవతుల కామయ్య - భాగవతుల నాగలింగయ్య - భాగవతుల రామ లింగం,భాగవతుల రామదాసు.

ఏలేశ్వరపు వెంకట నారాయణ, ఏలేశ్వరపు కృష్ణయ్య - తాడేపల్లి సూరయ్య - దర్భా లింగయ్య - మహంకాళి లక్ష్మయ్య - వేము ఆదినారాయణ - హరిలక్ష్మీనారాయణ.

రెండవ తరం:

పసుమర్తి రామయ్య _ పసుమర్తి ఆంజనేయులు _ పసుమర్తి సత్యనారాయణ _ వేదాంతం సాంబయ్య _ వేదాంతం వేంకత రత్నయ్య _ వేదాంతం సత్యనారాయణ _ వేదాంతం లక్ష్మీ నరసింహం _ వేదాంతం ఘంటయ్య _ వేదాంతం వెంకటేశ్వర్లు _ భాగవతుల జగ్గయ్య _భాగవతుల అనంతయ్య _ భాగవతుల ఆదినారాయణ _ ఏలేశ్వరపు వేంకటేశ్వర్లు _ ఏలేశ్వరపు పున్నయ్య _ ఏలేశ్వరపు ఆంజనేయులు _ ఏలేశ్వరపు నారాయణ మూర్తి _ హేమాద్రి వెంకటేశ్వర్లు _ హేమాద్రి శివయ్య _ దర్భా దుర్గయ్య _ దర్భా కృష్ణయ్య _ మహంకాళి పెదసత్యనారాయణ _ మహంకాళి సుబ్బరామయ్య _ చింతా శివరామయ్య.

మూడవ తరం:

పసుమర్తి విశ్వనాథం_ పసుమర్తి శ్రీరామమూర్తి _ పశుమర్తి సూర్య నారాయణ _ వేదాంతం పార్థసారథి _ వేదాంతం శ్రీమన్నారాయణ _ వేదాంతం మల్లిఖార్జునుడు _ భాగవతుల నాగలింగయ్య _ భాగవతుల వెంకట రాజయ్య _ ఏలేశ్వరపు ప్రకాశ రావు _ శివరామయ్య రాఘవయ్య _ శ్రీరామమూర్తి _ తాడేపల్లి సుబ్బయ్య _ తాడేపల్లి చంద్రయ్య _ హేమాద్రి శివరామకృష్ణ శర్మ _ మహంకాళి కృష్ణమూర్తి _ చింతా సూర్య ప్రకాశం _ బాలకృష్ణయ్య _ జోశ్యుల దుర్గయ్య.

కూచిపూడి వారి పగటి వేషాలు:

1. బైరాగి
2. ఫకీరు
3. బుడబుడబుక్కల
4. జంగం
5. వైష్ణవులు
6. కోయ

7. లింగబల్జీ
8. లంబాడీ
9. సోమయాజులు - మధ్వాచార్యులు
10. దాష్టీకం పంతులు,
11. పరాను - గులాము
12. గొల్లబోయడు

13. జాండ్ర వేషం
14.సూరత్ కంచెనీ
15. గారడీ
16. ఈడిగ
17. శారదగాని
18. మాదిగ వేషం
19. అర్థనారీశ్వరుడు
20. మందుల వేషం

21. పాములవాని వేషం
22. దేవర పెట్టి
23. పిట్టలదొర
24. రంగురింగుల రామిరెడ్డి
25. గంగిరెద్దు
26 బాలరండా కుక్మాబాయి
27. హెచ్చరిక వేషాలు


కూచిపూడి పగటి వేషాలు భాగవత సంబంధమైనవి:

పారిజాతాపహరణం
ఎరుకల వేషం
చోడిగాడి వేషం
బాలింత వేషం
దాదినమ్మ వేషం
భిల్లిని వేషం
గోపికా గీతలు
శారదగాని వేషం
అర్థనారీశ్వరుడు

త్రిపురాసుర సంహారం
రాధ వేషం
కొండాయ వేషం
ప్రహ్లద చరితం
నారద వేషం
బ్రాహ్మణ వేషం
తత్వాలు
గొల్ల కలాపం

మరెన్నో పగటివేషాలు:

ఉదహరించిన పగటి వేషాలు కాక, ఈ క్రింద వుదహరించిన మరెన్నో పగటి వేషాలు కొన్ని వందల సంవత్సరాలు, ఆంధ్ర ప్రజలను అలరించాయి. అలాంటి వాటిలో కొన్ని.

ఎరుకల వేషం
భిల్లీనీ వేషం
రాధ వేషం
బ్రాహ్మణ వేషం
కోయ వేషం

లంబాడీ వేషం
జాండ్ర వేషం
సూరత్ కంచెనీ వేషం
ఫకీరు వేషం
పాముల వాని వేషం

బాలింత వేషం
ప్రహ్లద చరితం
త్రిపురాసుర సంహారం
కొండాయ వేషం.
షేకు సాహెబ్
గొల్ల బోయెడువేషం.

మధ్వాచార్యుల వేషం
జాండ్ర వేషం.
బైరాగి
గారడివాని వేషం
గోపికా గీతల

వివిధ పగటి వేషధారులు:

పగటి వేషాలను బహుముఖాలుగా ప్రదర్శించిన వారిలో, గోదావరి మండలంలో పాలంకి నారప్స, రావూరు సూరయ్య, వేముల బాపయ్య, భాగవతుల కోనయ్య, కాలనాథ బట్ట వెంకయ్య, అనకాపల్లి గంగాధరం, విభూతి భవాని లింగం. వీరి ట్రూపు అనేక పగటి వేషాలను ధరించి, ఆంధ్రదేశంలో ముఖ్య కేంద్రాలలో ప్రదర్శనాల నిచ్చారు. క్రిష్టపాడు జంగాలు నెల్లూరు మూల పేట జంగాలు, కాకినాడ రెడ్లు, నరసరావు పేట ఎర్ర గొల్లలు మొదలైన వారు ఆరాధించారు. ఈ నాటికీ పగటి వేషాల సాహిత్యం కూచిపూడిలో కొల్లలుగా వుంది.

ప్రజానాట్య మండలి:

ఇటీవల ఆంధ్ర దేశంలో అంధ్రప్రజానాట్య మందలికి సంబంధించిన అనేక దళాలు, ఫకీర్లు, చెంచులు, కోయలు, సుద్దులు, జంతరు పెట్టె, పిట్తలదొర , సోదె మొదలైన వేషాలు ధరించి, తద్వారా రాజకీయ ప్రబోధాన్ని కలిగించారు. సంఘ విద్రోహుల్ని చీల్చి చెండాడే సాహిత్యం ద్వారా, ప్రజా ప్రబోధాన్ని కలిగించారు. ఇలా పగటి వేషాలను ధరించిన వారిలో కోగంటి గోపాల కృష్ణయ్య _కోసూరి మాచినేని డా॥ మిక్కిలి నేని, డా॥ రాజారామ _ నాజరు, రామ కోటి మొదలైనవారు ముఖ్యులు.