తెలుగుతల్లి/సంపుటము 1/నవంబరు 1937/ఆశీస్సు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆశీస్సు.

బాలకవి అష్టావధాని అల్లమరాజు నారాయణరావు, బొబ్బిలి

           -: గీ త మా లి క :-

శ్రీకరంబుగ జిరమునర్ధిల్లుమమ్మ !
ఆంధ్రదేశంబునం గీర్తినలరుమమ్మ !
యిరుగుపొరుగులతో వాదులెంచకమ్మ !
తోడివారల స్నేహంబు వీడకమ్మ !
కవుల యాశీస్సులంబొంది క్రాలుమమ్మ !
దేశభక్తినినీటుగా దెలుపుమమ్మ !
సర్వదేశసంచారంబు సలుపుమమ్మ !
తీరుగానీతులెపుడు బోధింపుమమ్మ !
సతులచారిత్రముల జక్కజాటుమమ్మ !
వివిధవర్తాలవారితోడ వెలయుమమ్మ !
ప్రేమపధమున నెపుడు దీవింపుమమ్మ్న !
సొంపునడకలతో విహరింపుమమ్మ !
పత్త్రికలయందు మణివివై వరలుమమ్మ !
పలుకుపలుకునందేనియల్ జిలుకుమమ్మ !
శ్రావ్యతరపద్యరచనల సాగుమమ్మ !
విధులదప్పక నెలనెల వెడలుమమ్మ !
మంచిగాధలతోడ రాణించుమమ్మ !
యెల్లవారికిముద్దుగా నెసగుమమ్మ !
ధీరగుణకల్పవల్లి ! శ్రీ తెనుగుతల్లి !