తెలుగుతల్లి/సంపుటము 1/నవంబరు 1937/కన్ఫూషియస్ ఋషి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కన్ఫూషియస్ ఋషి.

  జీ వి త ము - ఉ ప దే శ ము లు.
 క్రీ|| పూ|| 561 సంవత్సమున వర్తమానమందలి శాంతఢాయను ప్రదేశము నకు పశ్చిమభాగమందున్న 'చూ ' అను పేరుగల యొక గ్రామమునందు కన్ఫూషియస్ జన్మించెను. ఆయన తల్లిదండ్రు లొసంగిననామము 'కుంచిఉ ' ఉపాధి 'టుంనీ ', కాని యాయన శిష్యగణము 'కుంపుజు ' నామమున నాయన ను పిలుచుచుండిరి. కుంపుజు శబ్దార్ధము దార్శనికుడు లేక జ్ఞాని యని గ్రహింప నగును. ఈ పేరు క్రైస్తవ మిషనరీల యుచ్చారణయందు 'కన్ఫూషియస్ ' గా మారిపోయెను.
   

క్రీ|| పూ|| రెండువేల అయిదువందల వత్సరములకు పూర్వము చైనా సామ్రాజ్యమును ఇయానో, ఓశాన్, అను నిర్వురు చక్రవర్తులు ప్రతిష్ఠించిరను ప్రచారము కలదు. కాలక్రమమున నావిశాల సామ్రాజ్యము ఖండఖండములుగ విభక్తమాయెను. ఆసమయమందు 'చావో ' రాజవంశమువారి యధీనమున 'కన్ఫూషియాన్ ' నివసించుచుండెను. రోముసామ్రాజ్యమందలి జర్మనీదుర వస్థను బోలి అప్పుడు చీనా దురవస్థ దుర్భరముగ నుండెను. చావో, పరుల యధీన మందుండెను. రాజు బలహీనుడై మెలగజొచ్చెను. అప్పుడు తండ్రి సామాన్య మిలటరీ యాఫీసరై యుండినను కన్ఫుషియాన్ ఇన్-మహారాజ వంశమునుండి స్వీయవంశోత్పత్తికి గడంగియుండెడివాడు. 19 వ వత్సరమున నీయనకు వివాహమాయెను. ఒక పుత్రుడు, పుత్రికయు కలిగిరి. వివాహామైన కొలదిదినములకు రాజ్యసస్యాగారమున కధిపతిగ నియమింపబడెను. ఒక వత్సరము గడచిన పిమ్మట భూముల పరిపాలనా కార్యమునకు మార్చుటవలన నీతని పదవి యున్నతమాయెను. క్రీ|| పూ|| 527 సం|| ఈయన తల్లి మరణించెను. తదనంతర మీయన చైనాదేశీయులపద్దతి నను సరించి యుద్యోగమును వీడెను. అటుపిమ్మట యేవిధమగు ఉద్యోగమునకు గడంగక అధ్యయన, అధ్యాసనములయందు మనోనివేశమొనర్చెను. ఇందు వలన నీతని యశస్సు పలుదిక్కుల ప్రసరింపజొచ్చెను. అనేకు లీయన శిష్యత్వమును నంగీకరించిరి. 'చూ ' గ్రామమందు విద్రోహ మేర్పడెను. అందువలన నీయన సమీపగ్రామమగు 'చీ ' యందు నివసింప దొడంగెను. అచ్చటి రాజుల ననేకమారు లీయన సందర్శించెను. కాని వారీయన కేవిధమగు సహాయమును చేయకుండిరి. తత్కారణమున తిరిగి స్వగ్రామమున కరుదేంచి యందే నివసింప జొచ్చెను., దాదాపు 50 వత్సరములచటనే యధ్య యన అధ్యాపకము లొనర్చుచుండెను.

'చీ ' రాజ్యము మిక్కిలి శోచనీయావస్థకు గాంచెను. మంత్రి ఇయాం హు సింహాసనము నధిష్ఠించుటకు బ్రయత్నించెను. 'లవో ' మోజే ' అను ఇర్వురు ఋషులును, కంఫ్యూషియాన్ కు సమకాలికులు. లావో అత్యుత్తమమగు నివృత్తి మార్గమ్ను ప్రచార మొనర్చుచుండెను. ఆయన మతానుసారము కర్మ యొనర్చ కుండుట వలనే సుస్థిరశాంతి లభ్యమగును. 'మోజే ' విశ్వప్రేమికుడు; మైత్రి ప్రచారకుడైయుండెను. కన్ఫూషియాన్ కర్మయోగి.

దేశదురవస్ను గాంచి, సహింపజాలక కన్ఫూషియాన్ దేశసేవాతత్పరు డాయెను. ఆయన దేశమందలి పురాతనవిషయముల నధ్యయన మొనర్చి ఇరు గ్రంధముల రచించెను. అతీతులు కీర్తిప్రతిష్ఠలను ఎల్లడించు గ్రంధములను జనసంఘమున నొసంగిన యెడల జనులు సన్మార్గవర్తనను లగుటవలన దేశమందు శాంతి నెలకొనునని యాయన మనోనిశ్చయము.

చివరకు విద్రోహలు క్రీ|| పూ|| 501 సం|| ఇయంహూ రాజ్యమునుండి పలాయనులైరి. తదనంతరము కన్ఫూషియాన్, యొక పట్టణమునకు గవర్నరా యెను. ఒక్క వత్సరకాలములోనే యాయన స్వకార్యములయందు సాఫల్య పండితు డగుటవలన, మరుసటి వత్సరమున రాజ్యమందలి ప్రధానవిచారక పదమందు నియుక్తుడాయెను. దేశదు:ఖము దూరీకృత మగుటకు రాజునకు మిక్కిలి సహాయమొనర్చెను. అందువల రాజున కీతనియెడల మిక్కిలి భక్తి శ్రద్ధ లేర్పడెను. పర శ్రీ కాతరులగు చుట్టుప్రక్కల రాజులు, కన్ఫూషియాన్ కును, రాజు-మంత్రికిని పరస్పర విరోధమును కల్పింపవలయునను నుద్దేశముతో నృత్య మొనర్చు వేశ్యలను రాజుకడకు బంపించిరి. రాజువేశ్యలతోగూడి మూడు దినములు దర్భారునకు రాకుండెను. అందువలన కన్ఫూషియాన్ నిరక్తచిత్తుడై క్రీ|| పూ|| 497 సం|| రాజ్యమును వీడి పరదేశముల కరగెను. శిష్యులతోడ నీయన పదమూడు వత్సరములు పర్యటనంబొనర్చెను. క్రీ|| పూ|| 484 సం||రమున నొకానొక ప్రియశిష్యుని యాహ్వానము వలన తిరిగి జన్మదేశమునకు వచ్చెను. అచ్చట 478 సం|| వరకుండి మరణించెను. ఆయన జీవితమును వీడునప్పటికి వయసు 72 వత్సరములు. శేషవయసున మిక్కిలి శోకసంతప్తుడాయెను. ఆయన ప్రియపుత్రుడు గచించెను. తదనంతరము ప్రియశిష్యుడు మరణించెను. మృత్యువునకు పూర్వము, కన్ఫూషియాన్ యొకపురాతన గ్రంధమును సంపాదించి దానిని ప్రచురించెను. ఆయన స్వతంత్రముగ నొక గ్రంధమును రచించెను. ఆయన యుపదేశములను శిష్యులు గ్రంధరూపనుమున బ్రచురించిరి. ఆ గ్రంధమునకు ఇంగ్లీషు అనువాదము కలదు. కన్ఫూషియాని శిష్యులు ఆయన యుపదేశ ములను ఆయన మరణీంచిన రెండు మూడువందల వత్సరముల తర్వాత ప్రచురించిరని నుడువుదురు. జ్ఞానగంభీరతయందు కన్ఫూషియస్ గ్రీసు దేశమునకు పవిత్రవంతముగ నొనర్చిన ప్లేటోతోడను, భారత వర్షమందలి మనువు, కౌటిల్యులతోడను పోల్చదగును. ఆయన యుపదేశములు సమస్త మానవుల కాదర్శప్రాయములు. ఒకచోట నీ క్రిందివిధమున నుడివెను.

"15 వర్షముల ప్రాయమందు సుశిక్షణ బొందవలయునను ప్రబలేచ్చ యుండును. ముప్పది వత్సరముల వయసున తనంతటతాను నిలువ గలుగును- 40 వత్సరముల ప్రాయమున మనస్సు సందేహమువిముక్తమగు 50 వర్షమందు స్వర్గీయ నియమముల పాలింపుచు, భగత్స్వరూప మవగత మగును. 60 వర్షములప్పుడు మన కర్ణములు మనం ననుసరింపుచుండును. 70 సం|| ప్రాయమున వివేకానుసారము కర్మయొనర్చుచుందుము. అంతర్బహెర్విషయములయందు సత్యమునుండి విచలితులము గాకుందుము."

"జీవితకాలమంతయు తలిదండ్రుల సేవయందుండుటయే, పుత్రుల కర్తవ్యము మృతులైన తలిదండ్రుల కొరకు పుత్రుడు శోకసంతప్త హృదయమున అంత్యక్రియల నాచరించి బ్రతికియున్నంతకాలము వారిని ఉపాసింపు చుండ వలయును.

"సజ్జనుడగువాడు స్వీయవాక్యములను కార్యరూపమున బరిణమింప జేయును. తదనంతరం దానిని వాక్యముల ద్వారమున సిద్ధాంతీకరించును"

"చింతాశీలతలేని వ్యక్తియధ్యయనము వ్యర్ధము. అధ్యయన వ్యతీతమగు చింతాశీలత మిక్కిలి విసజ్జనకము." "అజ్ఞాతమగు దాని దెలిసికొనుటయే జ్ఞానము"

"బడికి కట్టుటకు కొయ్యబద్దెలును, లగాములుండినగాని, గుఱ్ఱము బండినిలాగజాలదు. అటులనే మానవుడు విశ్వాసస్వతీతముగ బ్రతుకజాలడు. సత్యమని యెఱింగినదానిని ఆచరణయందు బెట్టజాలనివాడు సత్సాహస భీరుడు."

"శ్రధాస్యతీతముగ ప్రేమసంభవము కాదు. సహజసౌందర్యమున నలరారు ప్రాకృతిక శోభకును, అలంకారముల కృత్రిమసౌందర్యమున కుండు భేదమే శ్రద్ధాన్విత ప్రేమ శ్రద్ధావిహీన ప్రేమలయందు బొడగట్తు చుందును."

"గతించిన విషయములను గూర్చి నేను మాటలాడను. దేనినైనను స్థిరీకృత మొనర్చుటకు నేనెవ్వరిని దూఱను. జగిరిన కార్యమును గూర్చి నె నెవ్వరిపైనను నిందమోపను."

"దానహీనమగు ధనము. శ్రద్ధావిహీనమగు నేన దు:ఖవిహీనమగు శోకము- అర్ధవిహీనములు."

"ప్రీమయే సకలవిషయముల కంటె సుందరమును-సుశ్రీయని గ్రహింపనగును. ప్రేమ విహీనుడగు మానవుడు ఆభావనములను సహింపజాలదు. వాని సౌభాగ్యముగూడ చాలదినములుండదు. ప్రేమిక హృదయమందలి ప్రేమయే శాంతిని కలిగించును. కాని జ్ఞానము లభించును. మానవుని ప్రేమించునది యసహ్యించుకొనునది ప్రేమయెగదా! ప్రేమపూరిత హృదయుడెప్పుడును, అన్యాయ-అసాధుకార్యము లొనర్పడు."

"సత్యాన్వేషి యగువాడు సామాన్యవ్యసనములతోడ సంబంధములేదు. సత్యము-న్యాయమే వారి యాదర్శము. అదియేవారికి ఫసందు."

"ఉన్నతపదవుల గూర్చి యెప్పుడును చింతింపకుము. కాని వాని కొఱ కెప్పుడును సంసిద్ధుడ వైయుండును. సుయోగము ప్రాప్తించునప్పుడవి లభించును. జీవితమం దసరిచితము- అజ్ఞాతవిషయము లున్నవని దు:ఖింపకుము, జీవితమూల్యమునువృద్ధిపఱచుకొనుటకు బ్రయత్నింపుము." "సాధుత్వము, మానవప్రీతియే నా యుపదేశముల సారము"

"సత్యమును గాంచిన దానిని పొందుటకు ప్రయత్నింపుము. అసత్యము ను గాంచినప్పుడు అది నీహృదయమందు దాగియున్నదా యని పరిశీలించుకొని యున్నచో వెంటనే దానిని పరిత్యజించుము."

"సాధుజనములు విళంబముగ మాటలాడుదురు. ఆవిళంబమగ కార్యము లొనర్చుదురు."

"పురాతన పాపవిషయముల మఱచిపోయిన కొలది నీకు శత్రువులు స్వల్పమగు చుందురు."

"స్వీయదోషముల గాంచియు, వానిని తొలగించుకొనుటకు ప్రయ త్నించువానిని నే నింతవఱకు చూడలేదు. ఒక తప్పును జీవితమందు రెండు మార్లు చేయకుము. గాలి సేవనము కొరకు విహరించునప్పుడు, సరియగు మార్గమున నడువ వలదు. ఏలయన, ఏదయిన కార్యనిర్వహణకు బోవు బండ్లు ఆమార్గమున వచ్చును బోవుచుండును."

"సాధుజీవితమందు స్వభావము, శిల్పము, సమన్వయమును సృష్టించును. ఉభయులకు సామ్యముండని యెడల అహంకార ముండదు. కాని కృత్రి మత్వము ప్రకాశించుచుండును. ఉన్నత స్తరమందుండు మానవులతోడ నున్నత తత్వసంబంధమున బ్రసంగించుము. కాని యెప్పుడును నిమ్నస్తర మందుండు వ్యక్తులకడ నా విషయములను ప్రసంగించజనదు."

"సిద్ధిని బొందవలయునని వాంచించుట కంటెను, సాధనంగందుండ వలయునని తలంచుటనె ప్రేమయందురు. జ్ఞానము సముద్రతుల్యమగు గం భీరము. ప్రేమ మహాపర్వతమును బోలి శాంతము, జ్ఞానజీవితము నుప భోగించుము. ప్రేమవలన పూర్ణత, ప్రాచీనత, లభ్యమగును. సజ్జనుని దబా యించగలవు. కాని వానిని మూగవానిగ చేయజాలవు సుమా! ప్రేమ స్వీయ కళ్యాణముకంటె, పరుల కళ్యాణవిషయమును గూర్చి మిక్కుటముగ నన్వేషణం బొనర్చును."

"కడుపున కింత ముతకభోజనము, ధరించుట కొకింత వస్త్రము లభించి కొయ్యమీద చేతిలో తలబెట్టుకొని నిద్రించునప్పుడుండు శాంతి మఱి యేవిధమ ముగను లభ్యముకాదు. ఆసాధుభావమున లభింపుచుండు ధనము, సన్మానము మొదలగునవి మేఘములబోలి యస్థిరములు." "కన్ఫూషియాస్ నీతియుతమగు కవితను, ఇతిహాసములను, మిక్కిలి యానందముగ చదువుచుండును. కాని యాయనకు ప్రియతమమగు విషయము సత్ శిక్ష, సదుపదేశములు. ఆయన ఇట్లు నుడివియుండెను. "నేనెప్పుడును ద్వివిషయముల గూర్చి బోధింపుచుందును. అందొకటి సత్సాధన, రెండవది అసత్యనర్జనము."

"జీవితమందు నాలుగు విషయముల నభ్యసించుము. (1) సత్యము (2) సద్బావము (3) విద్య, (4) సాధుత్వము."

"మహాపూరుషులను జీవితావస్థయందు దర్శించుట దటస్థింపకున్నను, ఒక మహావ్యక్తిని, లేక యుత్తమ మానవుని దర్శించిన చాలును. సత్సంగప్రాప్తి దుర్లభము. కావున సద్విషయముల గూర్చి ప్రసంగించువారు దొరకినను తృప్తిపడుము." "ఆహా మనమెట్టి సౌభఆఘ్యావంతులయు! ఏవిధమగు అన్యాయకార్య మొనర్చినను లోకులు వెంటనే తెలిసి కొందురు గదా."

కన్ఫుషియస్, మిక్కిలి గాన ప్రియుడు. ఒక్కొక్క కీర్తనను పలుమారు పాడించి విని సంతసింపుచుండును. ఒక సందర్భము నిట్లునుడివియున్నాడు.

"నేను జ్ఞానినని సాహసించి యెవరితోడను నుడువజాలను. కాని నేను పెద్దమనుష్యుడ నని మాత్రము చెప్పగలను. జ్ఞానప్రేమలు నాయందెచ్చట నున్నవి? నాకు జ్ఞానతృష్ణకలదు. ఉపదేశము లొనర్చు చుండుటను నిచ్చగింపుచుందును"

"పెద్ద మనుష్యులు, ధీరులును, ప్రేమికులునై యుందురు. సాధారణు లెల్ల ప్పుడు వాక్యవ్యయ మొనర్చుచుందురు."

"నేను మిక్కిలి గంభీరుడను. కాని కోమల హృదయుడను. నేను కఠోరుడను. కాని కఠినుడనుకాను. నేను శ్రద్దాయుతుడను కాని చపలుడనుకాను."

"సాధనచేయవలయునను తలంపు నీకు గల్గినప్పుడు నీయధీనమందుండు కాల మత్యల్పమని యెఱుంగుము."

"నేనెప్పుడును జ్ఞానవిషయమును, ప్రేమ విషయమునుగూర్చి మాటలాడను. ఏలయన, అవి నాబుద్దికి అతీతవిషయములు." "నాకు, అవశ్యకము, ఉచితమనితొచినప్పుడు మాట్లాడుదును."

కన్ఫూషియాన్, ఒక దినమున నదీతీరమందు నిలుచుండి యిట్లనియె. "ఈనది నిరంతర మిటులనే ప్రవహించుచున్నది. మానవజీవన మెంత చంచలము! అయినను మానవుడు నిశ్చింతగా నుండును."

"అయ్యో? మానవుని బయట నెంతగా ప్రేమింపుచుందురో, వాని యంతర మును గూడ నంతగ ప్రేమింపగలుగుదునా"

"జీవితమం దెప్పుడును దృష్టిని సమ్ముఖమందు నిగిడింపుచుండుము. ఎప్పుడును వెనుతిరిగి చూడవలదు."

"సత్యము సాధుత్వ మనునవి నీకు ప్రభువులకు గాక. నీవు నీకే ప్రియ బంధువవు, స్వీయదోషములు పొడగట్టినప్పుడు వానిని విసర్జించుటకు సిగ్గుపడ కుము." "సైన్యమునకు సైన్యాధిపతి లోపించిన దానికంటెను, ధృఢసంకల్ప హీనులగు సైనికులవలన అపారనష్టం కలుగును."

"జ్ఞానమందు సందేహముండదు. ప్రేమయందు దుఖముండదు. సాహసికునకు భయముండదు."

స్వగ్రామవాసులు, బంధుబాంధవులయందు కన్ఫూషియాన అమాయకు నివలె బ్రవర్తిల్లుచుండెను. విస్తారముగ నెవ్వరితోడను మాటలాడ కుండెను. మందిరమునందు మిక్కిలి మితమగసంభాషించుచుడెను. మఱియు స్వల్పా హారము, ఉపవాసపరాయణుడై మెలంగ జొచ్చెను. ఆహారసమయమున గాని, శయనముమీద గూర్చుండికాని మాటలాడి యెఱుంగడు. ఆయన నిదురించు నప్పుడు శరీరమునుక్రతను జెందదు. అట్లన మృత శరీరతుల్యము కాదు. మిక్కిలి స్వల్పకాలముమాత్రమే నిదురింపుచుండెను. ఆయన ఇట్లు నుడివి యున్నాడు. 'మనము మృతవ్యక్తులయందు చూపు శ్రద్ధా భక్తులెక్కువగుటవలన జీవితవ్యక్తుల విషయమున మన కర్తవ్యములను మఱచుచుందుము."

"మృత్యువును తెలిసికొనగలిగినచో జీవితము అసత్యమని తెలియును."

"తన్నుదాను జయించుటనే ప్రేమయందురు. పరులను ఆత్మతుల్యముగ చూచుటను, స్నేహమందురు. మనము జీవితమందొక దినమైనను పరులను ఆత్మతుల్యముగ గాంచగలిగినచో, సంఘము ఉన్నతస్థితిని కాంచును. ప్రేమ హృదయమందు మేల్కొనినప్పుడు దాని స్పర్శవలన పరులు గూడ ప్రేమికులగుదురు. అసీమ ధైర్యయుతమగునది ప్రేమ." "సత్యవాది యితరులందుండు సత్యమును గాంచగలుగును. మఱియు దానిని గ్రహించును. అసత్యవాదికి ఇతరులయందసత్యముమాత్రమే గోచరించును." "ఖ్యాతిగలవారన, ఇంటను రచ్చను విఖ్యాతులగుటయని గ్రహింపనగును. ఇతరులతప్పులను దిద్దుటకు వ్యర్ధప్రయత్న మొనర్చుటకంటెను తాను విశుద్దుడగుటకు బయ త్నింపవలయును. అందువలన మనస్సు ఉన్నతినిగాంచును; తన స్వభివృద్ది జెందిన కొలదిని మహానుభావుడగును."

"మానవజాతిని సమానభావమున చూచుచుండుటను ప్రేమించుటయని యెఱుంగునది. తనను, మానవజాతిని, సమానభావమున తెలిసికొనుటకు జ్ఞానమందురు."

"మార్గమును చూపించుటతోడ నాయకుల కర్తవ్యము పూర్తిగాదు. అతడు ముందుగా చెప్పనటుల చేసిచూపింపవలయును. నాయకుడు మృత్యుముఖ మందుకూడ విచలితుడుకాడు; వెనుక కడుగిడడం."

"ఉన్నత జీవికుడు జీవించువాని యాదేశములను వెంటనే మానవులు మన్నింతురు. ఉన్నతజీవితము గడుపనివానియాజ్ఞల నెవ్వరును గమనింపరు. మాఱుమాట్లు చెప్పినను చెవిజొరనీయరు." "ప్రేమకు డెప్పుడును విషయముగ నుండును. కర్మిష్టుడై యలరారును. ఉత్సాహము విశ్వాసముల గూడి యుందును. ప్రేమ కపరనామములు సాహసము, శక్తి, సరశత్వము."

"ప్రేమికుడు ఉన్నతభావపూరితుడు. కాని యహంకారికాడు" మహాఉరుషులకు సేవయనర్చవచ్చును. కాని వారిని సంతుష్టిపఱచుట మిక్కిలి కఠినము."

"విశ్రాంతినిగోరువాడును, ఆయాసమును జెందువాడును పండితుడు గాడు."

"హృదయము కలిగినవానికి మాత్రమే శిక్ష నొసంగుము. ఎల్లరను హృదయహీనులనితలంపకు."

"ప్రేమికుడు మిక్కిలి సాహసుడుగ నుండును. అందువలన సాహసుల నందరిని ప్రేమికులని తలంపకుము." "నీస్నేహితులెల్లరు నీ క్షేమమును గోరుచున్నారని తలఫకుము నీయందలి దోషములను సవరించుటకు ప్రయత్నించువానినే మిత్రుడని యెఱుంగుము."

"ధనవంతు డహంకారి కాకుండవచ్చును. కాని దరిద్రునకు సంతసము కలుగుట అతికఠినము." "సమయముననుసరించి ప్రసంగమునకు గడంగినచో లోకులు విరక్తి జెందరు.

"సాధుపుంగవుల హృదయము, జీవనము సర్వదా నున్నతగామియై యుండును. కాని యసాధుల హృదయము జీవితము తద్విపరీతము"

"ప్రాచీనులు తమకొఱకు శిక్షను బొందుచుండిరి. నవీనులు ఇతరుల కొఱకు శిక్షను బడయుచున్నారు. మనకు వాక్యములకంటె కర్మశక్తి వృద్ధియగుట ముఖ్యము."

"బ్రతిష్ఠకలుగకుండెనే యని దు:ఖింపకుము. నీయందలి లోపముల కొఱకు పరితపించుము. మిధ్యను, అవిశ్వాసమును ఇతరులకడనుండి యభ్య సింపవలయునను తలంపు లేనివాడే శ్రేష్ఠమానవుడు."

"ఉత్తమశిక్షను నీచులకడనుండి యైనను బడయుట పరులదోషములను గమనింపకుండుట స్వీయావస్థకు సంతసముగనుండుట అనునవి యుత్తమ పురుష లక్షణములు."

"సంసారత్యాగము సర్వశ్రేష్ఠమగు త్యాగము. దేశత్యాగము నిమ్న తరగతికి జెందును.

"ఎంతమంది మానవులు మనస్సును తెలిసికొన గలుగుచున్నారు? విశ్వాసిని సత్యవాదివిగమ్ము. వ్యహారమందు సర్వదా వినయాచరణుడవుగమ్ము"

"దేహముకంటెను మనస్సును మిక్కిలి ప్రేమించుము. ఇతరుల గూర్చి మిక్కుటముగ యోచించకుము. నీలోపల నీవు నిరంతరము చూచు కొనుచుండుము. అదియే శాంతి."

"దూరదృష్టి లేకుండుటవలన అనేకులు మిక్కిలి కష్టముల బొందు చుందురు."

"సాధుపుంగవుడు యశముకంటె సద్గుణము లెక్కుడు కావలయునని కోరుచుండును. సాధుపుంగవుడు అంతర్ముఖుడు. ఆసాధుమానవుడు బహిర్మఖుడు." "లోకవ్యవహారములయం దంతదృష్టి మిక్కుటమైన కొలదిని యాత డున్నతిని బొందుచుందును. మనవులకు శ్రేష్ఠతమకర్తవ్యము మైత్రి."

"ప్రేమన్యతీతముగ జ్ఞాన మసంభవము. వ్యర్ధముగ దినములకొలది యుపవసింపుచు, రాత్రులకొలది మేల్కొని ధ్యానమునందు కాలమును గడుపుచుండుటకంటెను శాస్త్రపాఠము, సాధుసంగమ మత్యుత్తమము. అంతకంటె ప్రేమయే సర్వోత్తమమము, సత్ స్నేహితులసంఘము సాధుపుంగవుల ప్రశంస సంగీతశ్రవణము అను మూడింటివలన నేను మిక్కిలి శాంతమును బొందుచు న్నాను. యౌవనమందు కామము కైశోరమందు ద్వంద్వము వృద్ధవయసున లోభమును అణచి పెట్టును."

"ఆజన్మజ్ఞాననులగువారే స్సర్వ శ్రేష్ఠులు." "నీరసత, నిర్జనతలకొఱకు నేను మిక్కుటముగ నన్వేషణం బొనర్చుచున్నాను."

"గంభీరనీరనతనయందే మనమున్నతి బొందును. జ్ఞానము లభ్యమగును."

"దు:ఖమే మానవుని ప్రకృతస్వరూప మని తెలుపుచున్నది".

Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf

అనుభూతి.

    నాగ నరసింహులు నాయనింవారు.

  పడతి పంపిన యానంది - వర్ధనంబు
  మ్లానమయిపోయె నెన్నడో - కాని, దాని
  నవ్యసురభిళ మార్ధవ -నైగనిగ్య
  ములు మదీయ హృదంతర -ముద్రితమగు
  నందివర్ధన కుసుమంబు - నందునిలిచి
  హృదయ పధముల సుధల వ -ర్షించుచుండు.
 

Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf