Jump to content

తెనుగు తోట/మంగళాచరణము

వికీసోర్స్ నుండి

తెనుగు తోట

మంగళాచరణము

ప్రొద్దుపొడుపు నోములు నోమ బూనినావొ?
చిట్టిబొట్టు కుంకుమ బెట్టు చిన్న దాన !
ధవళకీర్తిదుకూల సుందరము లయిన
యాసలు పిఱుందు లంటు సోయగ మ దేమొ?
కడల నెల్ల నాకర్షించి కనులు గుట్టు
తెనుగు మీఱీన గరువంపు దీరు లేల?

క్రాలు గనుల కాటుక నిగారంపు బసల
మోహపెట్టుచు నున్నావు ముగ్ధజనుల,
పడుచుదనపు సింగారంపు బెడగుసిరుల
వలచి వలపించు చున్నావు వయసుకాండ్ర,

పరమవాత్సల్య దృష్టులు మరులు కొలువ
బ్రేమకలితాంధులై రెల్ల వృద్ధజనులు.
ఏమిటికి నీయుదయకేళి యిగురుబోణి!
గిలుకు టొడ్డాణ మింత బిగించి తేల?


తెనుగుతోట


ఆఱి యాఱని యార్ద్రనీలాలకములు
మెడల బొరలాడ పాయలు ముడువ వేల?
నగవుపూదండ లెట్టి కాన్కలు! కుమారి !
ఎచటి కేగెదు? నోముపే రేమి? తల్లి !
ఎవ రధిష్ఠానదైవము? వృత్త మెద్ది?
తీయని తెనుంగుమాటల దెలుప వమ్మ?
కన్నె వయిన తెనుగునాటి చిన్నదాన !

అనుచు నను బల్కరించె శుభాంగు డొకడు
ముగ్ధుడయ్యును సోదరమోహ వశత
మధురసల్లాప కౌతుక గ్రధితుడగుచు,
మాటలాడంగ నెంతయో మనసుపడిన
సోదరుని జూచి చూడని చూడ్కి జూచి
విని వినని యట్లు తొలిసందె చనితి నవల;

ధరణిని ద్వితీయవిఘ్నముల్ తగ వటంచు
నోము బట్టించిన జనయిత్రీమతల్లి
శిరసు మూర్కొని మొదల వచించె; నట్లె
శుక్రవారోదయముల నుపక్రమించి


తెనుగుతోట

శన్యుషస్సుల దిలకలాంఛనము లీయ
బోయితిని జన్మపూ రుపభూములందు;

అడిగె గ్రమ్మఱ మఱునాడు నట్లె యతడు;
నాడు గూడ నించుక పూతనవ్వు నవ్వి
కన్నె కక్షత లిచ్చుచు గదలిపోతి;
అల తృతీయదినారంభ మందు మఱల
వ్రతహితాచార సరణి తప్పకయ యుండ
బయలుదేఱితి నానందనియతితోడ,
తోడిచెలియ యొక ర్తె కౌతుకము పొరల
పాటబాడెను ననుజూచి ప్రమదమునను,

నవనవానందవర్ష తాండవవిలాస
మధుర మధురంబ యగుట నా మంజుగీతి
నాలకించితి నించుక యాలసించి;

చూడవచ్చిన ప్రాయంపుజేడె లెల్ల ,
పిలువబోయిన తొలికారు చెలువ లెల్ల
స్వాగత నయాభిముఖ మైన పాటబాడి


తెనుగుతోట


నను పిలిచి యుత్సవించి రానాడు చెలిమి;
వ్రతకుమారిక నను శుభ ప్రణయముననొ?

ఆ ప్రసన్న మతిమతల్లు, లర్థి నిచ్చు
ఆదరింపుల కై సేత లంది, నేను
పసపు బూసి, కుంకుమరేఖ నొసల బెట్టి,
నోము నుద్యాపనమునకు నామతించి.
వెను మఱలితిని; ఇంతలో ననుజుడతడు
నను పిలిచి పల్కరించె వెన్కటి వితాన;

సందియమ్మున నాందోళచకితు డయిన
సోదరుని గాంచి యి ట్లంటి సూనసూక్తి,
మృదుమృదు శిరీషసుభగసంపదలు వొదల;
హృదయసు ప్త సౌహృదములు నిదుర వదల;

నాయనుంగు సోదరమణీ ! నవ్యభాగ!
ఆలకింపుము బాలరసాలశాఖ
నుయ్యెలల నూగుచు మరంద లియ్యఫణితి
బాడుచున్నది కోయిలపాటకత్తె
పావనం బైనమాతృసేవాపదంబొ