తెనుగు తోట/గీతాసఖి

వికీసోర్స్ నుండి

తెనుగుతోట


గీతాసఖి

వ్రాలు స్వచ్ఛంద గగనతోరణము క్రింద
కాంతి రేణుపుంజములు జగాన గురియ
లసదభిజ్ఞాన తరువులు పసరు వోయ
సహృదయానంద కళ్యాణ విహృతికొఱకు
పాడవమ్మ గీతాసఖీ ! భావపదము !

లేఖనీ సర్వతోముఖ శాఖ లంది
ప్రేమపల్లవ స్ఫురదభిరామ వగుచు
పాడవమ్మ గీతాసఖీ ! భావపదము.

ఇసుకపొరలు చీల్చుచు పొంగు లెసగ బొరలు
పొడుపుటేళ్ళు త్రుళ్ళింత లాడెడు విధాన
పాడవమ్మ గీతాసఖీ ! భావపదము.

పైటజాఱ సి గ్గెఱుగని పల్లెపడుచు
కోయిలకు మాఱు కూసెడి గొల్లపిల్ల
అణగి తులసికి మ్రొక్కు బ్రాహ్మణ కుమారి
బ్రమసి వల పెత్తి యాలింప పచ్చి ఫణితి
పాడవమ్మ గీతాసఖీ ! భావపదము.


తెనుగుతోట

రుధిరకణ పూత మైన వీరుని కరంబు
ప్రణయ గంధ రంజిత మైన రసికు పాణి
స్మృతి హితాంజలు లిచ్చెడి సీమలందు
పాడవమ్మ గీతాసఖీ ! భావపదము.

ద్రోహమున నల్లబడిన యస్థులభరంబు
ప్రేమచే ధౌత మయిన సాధ్వీనఖాళి
రత్నగర్భ దాచిన గుప్తరంగములను
పాడవమ్మ గీతాసఖీ ! భావపదము.

తెగిన తంతుల మఱల బంధింప నేల
నిలిచియున్న యేకశ్రుతిని సవరించి
వేడుకయు వేదనయు రసవిదులు మురియ
పాడవమ్మ గీతాసఖీ ! భావపదము.

గాఢ నిద్రోపవాస శుష్కమ్ము లయిన
కాళరాత్రుల దుఃఖసాగరము దాట
జుక్క లై సను నా త్రోవ జూపనపుడు
దాన మెవ డిచ్చె చుక్కాని లేని నావ
పాడవమ్మ గీతాసఖీ ! భావపదము.


తెనుగు తోట


వగపు లను రావిమొలక లెదిగిన కొలది
చిత్తభిత్తిక లెటువలె జిటిలి విచ్చె
బాల్యదశలె యెడారులవలెను మఱుగ
వెత గళాసించి కుతుక మేగతి గృశించె
పాడవమ్మ గీతాసఖీ ! భావపదము.