తెనాలి రామకృష్ణకవి చరిత్రము/రామకృష్ణుడు-గూనిచాకలి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జాతక తాళ యుగ్మలయసంగతిచుంచు విపంచి కామృదం
గాతతతేహితత్తహితహా ధితదంధనుధానుదింధిమి
వ్రాతనయానుకూలపద నారికుహూద్వహహారికింకిణి
సూతనఘల్ఘ లాచరణనూపుర ఝాళఝళీమరంద సం
ఘాత వియద్దునీ చక చక ద్విక చోత్పల సారసంగ్రహా
యతకునూర గంధవహహారిసుగంధ విలాసయుక్తమై
చేతముచల్లఁ జేయవలె జల్లన జల్లవలెన్ మనోహర
ద్యోతకగోస్తనీ ఫలమధుద్రవగోమృత పాయస ప్రసా
రాతిరసప్ర సారరుచిర ప్రదంబుగ సారెసారెకున్.

రాయలంతట నానందభరితాత్ముడై కవిగండ పెండేరము నిచ్చి బహూకరించెనట. ఆగండపెడేరియిముం ధరియించి, పెద్దన కవి గర్వమును ప్రకటించుచు నొకనాఁడు సభలో నందఱును వినునట్లు శిష్యుల నుద్దేశించి యిట్లు పద్యములో సగము భాగమును జదివెను-

“చ. వదలక మ్రోయు నాంధ్రకవి వామపదంబున హేమసూపురం
      బుదితమరాళకంఠనినదోద్ధతి నేమనిపల్కు పల్కె రా”

రామకృష్ణుఁడు మిగతభాగము నిట్లు పూరించెను—

చ. 'సడలక మ్రోయు నాంధ్రకవివామపదంబున హేమనూపురం
     బుదితమరాళకంఠనినదోద్ధతి నేమనిపల్కు పల్కె రా
     గుదియల కాలినుండదగు కోమలకంధర భాగ్యరేఖ నీ
     నుదుటను లేదులేదనుచు నూఱు తెఱంగుల నొక్కిపల్కెరా?'
     పెద్దనకవి సిగ్గునొంది యానాటినుండి యట్లనుట మానివై చెను.

18 రామకృష్ణుఁడు-గూనిచాకలి.

కృష్ణరాయలొకప్పు డతిజరుగురగా శత్రురాజులపై దండెత్తుటను గూర్చి మంత్రివర్గముతో సహస్యాలోచనం బొనరించు చున్నతరి రామకృష్ణుఁడేగి రాయలతో నేదియో పరిహాసమాడెను. రాయలుకోపపరీతచిత్తుఁడై భటులబిలిచి 'సమయాసమయములెరుగక పరియాచకములాడు రామకృష్ణకవిని కఠములోతు గోయిత్రవ్వించి, యందు కంఠమువఱకుఁ బాతిపెట్టించి, కుంజరములచే, ద్రొక్కింపు డనెను. రాయలట్లు కఠినముగా నాజ్ఞాపించుటచే భటులు చేయునది లేక , రామకృష్ణకవి నూరివెలుపలకుఁ గొనిపోయి, గోయిత్రవ్వి పాతిపెట్టి ఏనుగును దెచ్చుటకై యంతఃపురము కడకేగిరి.

ఆసమయమున కొక గనిచాకలి యామార్గమునఁ బోవుట తటస్థించెను. బట్టలను రేవునుండి యింటికి: గొంపోవుచు నతఁడు రామకృష్ణునిఁ జూచి 'బాబూ ! ఇది యేమి? త మ్మెవరిట్లు కంఠము వఱకుఁ బూడ్చినారు?' అని యడుగ, నాతఁడు 'ఓరీ చాకలీ! నాకుఁ జిరకాలమునుండి గూనియున్నది ఆ గూనిపోవుటకిట్లు చేసితినని' అనెను.

'ఆహా! ఎంత యదృష్టమండీ! బాబూ ! తమ గూని బోయినదా?'

నన్ను 'బైకిదీసినచో దెలియునుగాని, గోతిలోనుండి నేనెట్లు చెప్పగలను? నన్ను బైకిదీసినచో దెలియునుగదా!'

బాబూ ! మిమ్ము పైకిఁ దీసెదను గాని మీకుఁ బోయినచో నాగూని కూడ పోవుటకు తమరు సాయము చేయవలయును' అని యాచాకలి గోతిలోని మట్టినిఁ దీసి, రామకృష్ణుఁ డీవలికి రాగానే 'బలే ! బలే! మీగూనిపోయినది' అని తానాగోతిలో దిగెను. రామకృష్ణుఁడు మఱల మన్నుఁబూడ్చి వెడలిపోయెను. కొంతసేపైనపిదప రాజభటులు ఏనుగును గొనివచ్చిరి. చాకలి జరుగనున్నది గ్రహించి 'బాబూ! నేను రాజుగారి చాకలి' నని గట్టిగా ఏడ్వసాగెను. రామకృష్ణుఁడు చేసిన మోసమును గ్రహించి భటులు చాకలిని విడిచిరి. రాయలు రామకృష్ణుని జూచి 'నిన్ను జంపుమని గదా నేను భటుల కానతిచ్చితిని. నీ వెట్లు బ్రతికివచ్చితివి?' అని ప్రశ్నింపగా, రామకృష్ణుడు జరిగినదంతయు జెప్పెను. ఆతని యుక్తికి రాయ లపరిమితాహ్లాదము నొందెను.


19 విష్ణుచిత్తీయ విమర్శన

రాయలు సకల సామంత మంత్రి పురోహిత బంధుమిత్రపరివార సమాకీర్ణంబై న కొలువుకూటమున గూర్చుండి కవుల నుద్దేశించి యిట్లనెను.

'కవీంద్రులారా ! మద్విరచితమైన విష్ణుచిత్తీయమును మీ రందఱును జదివియుంటిరిగదా ! ఆగ్రంథమునందలి గుణావగుణముల దెలిపిన వారికి మంచి బహుమానమిత్తు' న నెను. ఏమాటయన్న నేమి కీడుమూడునో యను సందేహించి, యెవ్వరును నేమియుజెప్పక యూరకుండగా, రామకృష్ణుడు లేచి, 'మహారాజా! 'పెక్కు నసందర్భపువాక్యములతో గూడియున్న యాగ్రంథము విమర్శించుట కే మున్నది? ఇచ్చట నేమియునులేదు- భోజనముజేసి పొమ్ము' అనుటలో నర్ధమున్న దా!' యనెను.

రామకృష్ణకవీ ! నాగ్రంథ మసందర్భముగా నున్నదా? నీ మాటలసందర్భముగా నున్న వా! ఎప్పుడును బరియాచకమేనా'యని రాయలడుగ, రామకృష్ణుడు 'మహారాజా ! పరియాచకమాడుట కే నెంతవాడను, ఉన్నదున్నట్లుగనే చెప్పితిని, వలయునేని యొకపద్యమును నిదర్శన పూర్వకముగ జదివి చూపింతును.

శా. 'ఆనిష్టానిధిగేహసీమ నడు రేయాలించినన్ మోవియున్
     తేనాగేంద్ర శయాను పుణ్యకథలుం దివ్యప్రబంధాను సం
     ధానధ్వానమునాస్తి శాకబహు తా, నాస్త్యుష్ణతా, నాస్త్యపూ
     పో, నాస్త్యోదన సౌష్టవంచ కృపయాభోక్తవ్యమన్నల్కులున్ •